గేమ్‌ ఛేంజర్‌కు 'రామ్‌ చరణ్‌' ప్యాకప్‌.. ఎన్నిరోజులు కష్టపడ్డాడంటే | Ram Charan Shooting Part Complete Game Changer Movie | Sakshi
Sakshi News home page

గేమ్‌ ఛేంజర్‌కు 'రామ్‌ చరణ్‌' ప్యాకప్‌.. ఎన్నిరోజులు కష్టపడ్డాడంటే

Published Sat, Jul 6 2024 8:51 PM | Last Updated on Sat, Jul 6 2024 8:57 PM

Ram Charan Shooting Part Complete Game Changer Movie

రామ్‌ చరణ్‌- శంకర్‌ కాంబినేషన్‌లో వస్తున్న సినిమా 'గేమ్‌ ఛేంజర్‌'. దిల్‌రాజు, శిరీష్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన సాంగ్‌కు మంచి రెస్పాన్స్‌ వస్తుంది. అయితే, ఈ సినిమా విడుదల ప్రకటన కోసం చరణ్‌ ఫ్యాన్స్‌ చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే,  గేమ్‌ ఛేంజర్‌ చిత్రానికి సంబంధించి రామ్‌చరణ్‌ షూటింగ్‌ పూర్తి అయినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో #GameChanger పేరుతో హ్యాష్‌ట్యాగ్‌ ట్రెండ్‌ అవుతుంది.

గేమ్‌ ఛేంజర్‌ నుంచి ఇప్పటి వరకు కనీసం ఒక టీజర్‌, గ్లింప్స్‌ కూడా విడుదల కాలేదు. కానీ, సినిమాపై ప్రేక్షకులలో భారీ అంచనాలు ఉన్నాయి. మూడేళ్లుగా గేమ్‌ ఛేంజర్‌ షూటింగ్‌లో రామ్‌చరణ్‌ బిజీగా ఉన్నారు. ఎట్టకేలకు ఆయనకు సంబంధించిన షూటింగ్‌ పార్ట్‌ పూర్తియినట్లు సోషల్‌ మీడియాలో ట్రెండ్‌ అవుతుంది. వాస్తవంగా అదే నిజమని కూడా చెప్పవచ్చు.. కొద్దిరోజుల క్రితమే డైరెక్టర్‌ శంకర్‌ కూడా కేవలం 10 రోజుల షూట్‌ మాత్రమే ఉందని చెప్పిన విషయం తెలిసిందే.

గేమ్‌ ఛేంజర్‌ సెట్స్‌లో 2021 సెప్టెంబర్‌ 8న రామ్‌ చరణ్‌ అడుగుపెట్టాడు. అలా సుమారు మూడేళ్ల పాటు ఈ సినిమాకు ఆయన సమయం కేటాయించాడు. ఇంకా ఖచ్చితంగా చెప్పాలంటే నేటితో (2024 జులై 6) 1,032 రోజులు కష్టపడ్డాడు. దీంతో డైరెక్టర్‌ శంకర్‌పై చరణ్‌ అభిమానులు తమ అసంతృప్తిని తెలుపుతున్నారు. పొలిటికల్‌, యాక్షన్‌ నేపథ్యంలో సాగే పవర్‌ఫుల్‌ కథాంశంతో ఈ సినిమా రానుంది.  

రామ్ చరణ్ డబుల్‌ రోల్‌లో కనిపిస్తారని టాక్‌ ఉంది. కియారా అద్వాణీ హీరోయిన్‌గా నటిస్తుండగా అంజలి, శ్రీకాంత్‌, సునీల్‌, ఎస్‌.జె.సూర్య, సముద్రఖని, నవీన్‌ చంద్ర తదితరులు కీలకపాత్రలలో నటించారు. 2025లోనే ఈ సినిమా విడుదల కానుందని జోరుగా ప్రచారం జరుగుతుంది. హైదరాబాద్‌లో జులై 7న జరిగే భారతీయుడు ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో గేమ్‌ ఛేంజర్‌ గురించి కీలకమైన అప్డేట్‌ ఇస్తారని సమాచారం ఉంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement