SJ surya
-
Game Changer: కాఫీ కప్పులోనే ఊరి సెట్.. ఆ పాటకే 30 కోట్లు
గేమ్ ఛేంజర్ నుంచి ‘జరగండి’ లిరికల్ వీడియో వచ్చినప్పుడు చూసి నేను కాస్త నిరుత్సాహపడ్డాను. శంకర్ గారి మ్యాజిక్ మిస్ అయిందేంటి? అని డల్ అయ్యాను. కానీ రీసెంట్గా పూర్తి పాటను చూసి షాకయ్యాను. దాదాపు రూ.25-30 కోట్లు ఖర్చు పెట్టి ఈ పాటను తెరకెక్కించారు. కాఫీ కప్పులోనే ఊరి సెట్ వచ్చేలా శంకర్ ప్లాన్ చేశారు. థియేటర్లో ఆ పాట బ్లాస్ట్ అవ్వడం ఖాయం. ఆ ఒక్క పాటకే మనం పెట్టే టికెట్ డబ్బులు సరిపోయాయనిపిస్తుంది. అంతలా శంకర్ గారు మ్యాజిక్ చేశారు’ అన్నారు ప్రముఖ నటుడు ఎస్జే సూర్య. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రూపొందిన భారీ బడ్జెట్ చిత్రం ‘గేమ్ చేంజర్’. ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన కియారా అద్వాణీ హీరోయిన్గా నటించగా, ఎస్ జే సూర్య కీలక పాత్ర పోషించాడు. డిసెంబర్ 10న ఈ చిత్రం విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఎస్ జే సూర్య మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు..→ శంకర్ గారు నన్ను గేమ్ చేంజర్(Game Changer) కోసం పిలిచారు. గేమ్ చేంజర్ సెట్లో ఆయన చెప్పింది చెప్పినట్టుగా చేసుకుంటూ వెళ్లాను. నా పర్ఫామెన్స్ చూసి శంకర్ గారు ఇంప్రెస్ అయ్యారు. ఈ సినిమాలో నటనను చూసే నాకు ఇండియన్ 2లో అవకాశం ఇచ్చారు. శంకర్ గారితో పని చేయాలని ప్రతీ ఒక్క ఆర్టిస్ట్‌కీ ఉంటుంది. ఆయన ప్రతీ ఒక్క కారెక్టర్‌ను నటించి చూపిస్తారు. ఆయన చెప్పింది చెప్పినట్టుగా చేస్తే స్క్రీన్ మీద మ్యాజిక్‌లా కనిపిస్తుంది.→ ఈ చిత్రంలో రామ్ చరణ్(Ram Charan) డిఫరెంట్ షేడ్స్‌లో కనిపిస్తారు. ఐఏఎస్ ఆఫీసర్‌గా ఎంతో హుందాగా కనిపిస్తారు. అప్పన్న పాత్ర అయితే లైఫ్ టైం గుర్తుండిపోయేలా ఉంటుంది. ఆ అప్పన్న పాత్రలో రామ్ చరణ్ గారు అద్భుతంగా నటించారు.→ నటుడిగా ఓ సినిమా చేస్తున్నప్పుడు నేను దర్శకత్వ విభాగంలో వేలు పెట్టను. నటుడిగా ఉన్నప్పుడు కేవలం నటుడిగానే ఆలోచించాలి. శంకర్(Shankar) గారికి సలహాలు, సూచనలు ఇచ్చే స్థాయి నాకు లేదు. ఆయన చాలా విజనరీ డైరెక్టర్. రాజమౌళి వంటి వారే శంకర్ గారి గురించి గొప్పగా చెప్పారు. ఓ కథను నమ్మి డబ్బులు పెడితే ఇంత బాగా తిరిగి వస్తుందని నమ్మకం కలిగించిందే శంకర్ గారు అని రాజమౌళి సర్ చాలా గొప్ప విషయాన్ని చెప్పారు.→ ఓ నిజాయితీగా ఐఏఎస్ ఆఫీసర్‌కి, అవినీత పరుడైన రాజకీయ నాయకుడికి మధ్య జరిగే వార్‌ను గేమ్ చేంజర్‌లో చూపిస్తారు. ఈ రెండు పాత్రల మధ్య సీన్లను ఎలా చిత్రీకరించారు.. ఎంత బాగా కథనాన్ని శంకర్ గారు రాశారు అన్నది మీరు థియేటర్లోనే చూడాల్సింది. ఈ చిత్రం అద్భుతంగా ఉండబోతోంది. అన్ని అంశాలు ఈ చిత్రంలో ఉంటాయి. అందరినీ అలరించేలా ఈ మూవీ ఉంటుంది.→ గేమ్ చేంజర్ సెట్‌కు వచ్చే ముందు నేను చాలా ప్రిపేర్ అయ్యేవాడిని. దర్శకుడికి ఏం కావాలి?.. సీన్ ఎలా ఉండాలి?.. డైలాగ్ ఎలా చెప్పాలి? అనే విషయంలో చాలా ప్రిపేర్ అయ్యేవాడిని. కానీ డబ్బింగ్ చెప్పే టప్పుడు చాలా కష్టంగా అనిపించింది. నాకు శంకర్ గారు అద్భుతమైన పాత్రను ఇచ్చారు. ఈ కారెక్టర్‌ను నేను చాలా ఎంజాయ్ చేశాను. అందుకే తెలుగు, తమిళం, హిందీ ఇలా అన్ని భాషల్లో డబ్బింగ్ చెప్పాను. నాకు హిందీ అంతగా రాదు. కానీ డబ్బింగ్ మాత్రం అద్భుతంగా చెప్పాను. నా హిందీ డబ్బింగ్ కోసమైనా మీరంతా రెండో సారి హిందీలో సినిమా చూడాలి (నవ్వుతూ).→ గేమ్ చేంజర్‌లో శంకర్ గారు క్రియేట్ చేసిన ప్రతీ పాత్ర అద్భుతంగా ఉంటుంది. ఇంత వరకు నేను పూర్తి సినిమాను చూడలేదు. కానీ కొన్ని రషెస్ చూశాను. రామ్ చరణ్ గారి సీన్లు, నా సీన్లు అద్భుతంగా వచ్చాయి. మా ఇద్దరి మధ్య ఉండే సీన్లు ఆడియెన్స్‌కు మంచి కిక్ ఇస్తాయి.→ నాకు నటుడిగా చాలా కంఫర్ట్ ఉంది. ఇప్పట్లో దర్శకత్వం గురించి ఏమీ ఆలోచించడం లేదు. రాజమండ్రికి వెళ్లినప్పుడు అకిరా నందన్‌ను ఫ్లైట్‌లో చూశాను. అద్భుతంగా అనిపించాడు. ఒక వేళ ఆ దేవుడు ఛాన్స్ ఇస్తే.. టైం కలిసి వస్తే..ఖషి2 తెరకెక్కిస్తాను. -
'దీనమ్మ దిమ్మదిరిగి బొమ్మ కనపడింది'.. గేమ్ ఛేంజర్‌పై ఎస్జే సూర్య
మెగాహీరో, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన తాజా చిత్రం గేమ్ ఛేంజర్. కోలీవుడ్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం సంక్రాంతి బరిలో నిలిచింది. పొలిటికల్ యాక్షన్ డ్రామాగా వస్తోన్న ఈ మూవీపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆర్ఆర్ఆర్ తర్వాత వస్తోన్న ఈ సినిమాపై మెగా ఫ్యాన్స్‌లోనూ ఆసక్తి నెలకొంది. ఈ చిత్రంలో బాలీవుడ్ భామ కియారా అద్వానీ హీరోయిన్గా కనిపించనుంది.అయితే తెలుగు ప్రేక్షకుల్లో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న కోలీవుడ్ స్టార్ ఎస్జే సూర్య. ఇటీవలే సరిపోదా శనివారం మూవీతో అలరించిన ఆయన.. గేమ్ ఛేంజర్‌లో కీ రోల్ ప్లే చేస్తున్నారు. తాజాగా ఈ చిత్రంలో తాను రెండు ముఖ్యమైన సీన్లకు డబ్బింగ్ పార్ట్ పూర్తి చేసుకున్నానని ట్విటర్ ద్వారా పంచుకున్నారు. ఒకటి రామ్ చరణ్‌తో.. మరొకటి శ్రీకాంత్‌తో సీన్స్ కాగా.. వీటికి ఏకంగా మూడు రోజుల సమయం పట్టిందని తెలిపారు. అయితే అవుట్‌పుట్ మాత్రం 'దీనమ్మ దిమ్మదిరిగి బొమ్మ కనపడిందని'.. థియేటర్లలో పిచ్చేక్కిస్తాయని సూర్య పోస్ట్ చేశారు. 'పోతారు మొత్తం పోతారు' అంటూ తనతు ఈ అవకాశమిచ్చిన డైరెక్టర్ శంకర్‌కు, నిర్మాత దిల్‌రాజుకు ధన్యవాదాలు తెలిపారు. సంక్రాంతికి థియేటర్లలో కలుసుకుందాం అంటూ ఎస్జే సూర్య చేసిన ట్వీట్ నెట్టింట వైరలవుతోంది.ఇటీవల విడుదల చేసిన గేమ్ ఛేంజర్ టీజర్‌కు మంచి రెస్పాన్స్ వస్తోంది. కాగా.. ఇప్పటికే మేకర్స్ మూవీ ప్రమోషన్స్ మొదలెట్టారు. ఈ నెలలోనే ఫ్యాన్స్‌కు మరో అప్డేట్ ఇవ్వనున్నారు. గేమ్ ఛేంజర్ నుంచి ఇప్పటికే రెండు సాంగ్స్ రిలీజవ్వగా.. ఆడియన్స్ నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. మరో సింగిల్‌ను కూడా త్వరలోనే రిలీజ్ చేస్తామని హింట్ ఇచ్చారు. ఈ మూవీ సంక్రాంతి సందర్భంగా వచ్చే ఏడాది జనవరి 10న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ చిత్రంలో శ్రీకాంత్, అంజలి, ప్రకాశ్‌రాజ్, నాజర్, సముద్రఖని, జయరామ్, నవీన్ చంద్ర, సునీల్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ మూవీని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు నిర్మిస్తున్నారు.Hi friends , I just finished dubbing of two vital scenes in #GAMECHANGER (one with our Global star @AlwaysRamCharan garu & another with Srikant garu … it took 3 whole days to finish these 2 scenes dubbing …. The out put came out like “ dheenamma dhimma thirigi bomma…— S J Suryah (@iam_SJSuryah) November 21, 2024 -
సంక్రాంతి బరిలో..?
‘గేమ్ చేంజర్’ సినిమా సంక్రాంతికి విడుదల కానుందనే టాక్ ప్రచారంలోకి వచ్చింది. తండ్రీకొడుకులుగా రామ్‌చరణ్ ద్విపాత్రాభినయం చేసిన పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ ‘గేమ్ చేంజర్’. శంకర్ దర్శకత్వంలో అనిత సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్, ‘దిల్’ రాజు ప్రొడక్షన్స్ పతాకాలపై ‘దిల్’ రాజు, శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మించారు. కియారా అద్వానీ హీరోయిన్గా నటించిన ఈ సినిమాలో అంజలి, ఎస్జే సూర్య, సునీల్, జయరాం, ప్రియదర్శి, నవీన్ చంద్ర ఇతర ముఖ్య పాత్రలు పోషించారు. కాగా ‘గేమ్ చేంజర్’ సినిమాను క్రిస్మస్ సందర్భంగా ఈ డిసెంబరులో విడుదల చేయనున్నట్లుగా ఇటీవల ‘దిల్’ రాజు పలు సందర్భాల్లో వెల్లడించారు. అయితే ఈ సినిమాను సంక్రాంతికి రిలీజ్ చేయాలనుకుంటున్నారనే వార్త ప్రచారంలోకి వచ్చింది. మరి... ‘గేమ్ చేంజర్’ వాయిదా పడిందా? ఒకవేళ పడితే వచ్చే సంక్రాంతి బరిలో నిలుస్తుందా? అనే విషయాలు తెలియాల్సి ఉంది. -
రామ్ చరణ్ సాంగ్‌కు స్టెప్పులేసిన స్టార్ హీరో.. వీడియో వైరల్!
కోలీవుడ్ స్టార్ ఎస్జే సూర్య ఇటీవలే సరిపోదా శనివారం అంటూ తెలుగు ప్రేక్షకులను పలకరించాడు. నాని హీరోగా నటించిన ఈ చిత్రంలో కీలక పాత్రలో మెప్పించారు. ప్రస్తుతం ఆయన రామ్ చరణ్ గేమ్ ఛేంజర్‌లో నటిస్తున్నారు. శంకర్ డైరెక్షన్లో వస్తోన్న ఈ చిత్రంలో కీ రోల్ ప్లే చేస్తున్నారు. తాజాగా ఆ మూవీ నుంచి రా మచ్చా మచ్చా అనే లిరికల్ సాంగ్‌ను రిలీజ్ చేశారు మేకర్స్.(ఇది చదవండి: రామ్ చరణ్ 'గేమ్ ఛేంజర్'.. ఆ క్రేజీ సాంగ్ వచ్చేసింది!)ఈ పాటకు తన స్టెప్పులతో అలరించారు ఎస్జే సూర్య. డ్యాన్స్ చేస్తూ వేదికపై సందడి చేశారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఇది చూసిన ఫ్యాన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. కాగా.. పొలిటికల్ డ్రామాగా తెరకెక్కిస్తోన్న ఈ చిత్రంలో చెర్రీ సరసన బాలీవుడ్ భామ కియారా అద్వానీ హీరోయిన్గా కనిపించనుంది. ఈ సినిమాకు ఎస్ఎస్ తమన్ సంగీతం అందిస్తున్నారు. Poduu Thalaaa @iam_SJSuryah 💥💥#RaaMachaMacha #DamTuDikhaja #GameChanger pic.twitter.com/YTBD5ktGns— Raees🚁 (@RaeesHere_) September 30, 2024 #RaaMachaMacha sj surya on fire🔥🔥🔥🔥🔥🔥🔥 pic.twitter.com/aCkFweUpyJ— GCR🚁🚁🚁 (@GaniCharan1) September 30, 2024 -
సరితూగే సమరమే...
నాని హీరోగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘సరిపోదా శనివారం’. ఇందులో ప్రియాంకా అరుళ్ మోహన్ హీరోయిన్గా నటిస్తుండగా, ఎస్జే సూర్య, సాయికుమార్ లీడ్ రోల్స్‌లో నటించారు.శనివారం (జూలై 20) ఎస్జే సూర్య బర్త్ డే సందర్భంగా ‘సరిపోదా శనివారం’ నుంచి కొత్త వీడియోను రిలీజ్ చేశారు. ‘సరితూగే సమరమే... సంహారం తథ్యమే’ అంటూ ఈ వీడియోను షేర్ చేశారు నాని. డీవీవీ దానయ్య, దాసరి కల్యాణ్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఆగస్టు 29న రిలీజ్ కానుంది. -
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం నా స్నేహితుడు...
-
రాఘవ లారెన్స్ బాటలో మరో స్టార్ హీరో.. వీడియో వైరల్!
కోలీవుడ్ స్టార్ రాఘవ లారెన్స్ సినిమాలతో పాటు సమాజ సేవలోనూ ముందున్నారు. మాత్రమ్ ఫౌండేషన్ ద్వారా రైతులు, రైతు కూలీలను ఆదుకుంటున్నారు. ఇప్పటికే చాలామంది దివ్యాంగులకు త్రీవీలర్ వాహనాలు అందజేసిన ఆయన.. ఇటీవల పది మంది పేద రైతు కుటుంబాలకు ఇచ్చిన మాట ప్రకారం ట్రాక్టర్స్ అందించారు.రాఘవ లారెన్స్ సేవలు చూసిన మరో హీరో సాయం చేసేందుకు ముందుకొచ్చారు. జిగర్తాండ డబుల్ ఎక్స్ చిత్రంలో కలిసి నటించిన ఎస్జే సూర్య తన వంతు సాయం చేశారు. తన సొంత డబ్బులతో ట్రాక్టర్‌ను కొనుగోలు చేసి కాంచీపురం జిల్లాకు చెందిన బద్రీకి 11వ ట్రాక్టర్‌ను అందజేశారు. ఈ విషయాన్ని రాఘవ లారెన్స్ తన ట్విటర్ ద్వారా పంచుకున్నారు. ఈ సందర్భంగా ఎస్జే సూర్యకు ధన్యవాదాలు తెలిపారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. Hi Friends and fans, You are all aware that I handed over 10 Tractors to Farmers through the Maatram Foundation with my own money. Today @iam_SJSuryah Brother gave me a pleasant surprise by adding another Tractor with his own money. Together, We handed over the 11th Tractor to… pic.twitter.com/Bwe6sjyET5— Raghava Lawrence (@offl_Lawrence) June 18, 2024 -
కోలీవుడ్‌లో కొత్త కాంబో.. కలిసి నటించబోతున్న ఇద్దరు నటధీరులు!
కోలీవుడ్‌లో ఓ కొత్త కాంబోకు శ్రీకారం జరిగింది. ఇందులో ఇద్దరు నటధీరులు కలిసి నటించబోతున్నారు. అందులో ఒకరు విక్రమ్. ప్రత్యేకంగా చెప్సాల్సిన అవసరం ఉండదు. పాత్రలకు ప్రాణం పోయడానికి ఎంతవరకై నా వెళ్లే అతి కొద్దిమంది నటుల్లో విక్రమ్ ఒకరు. నిరంతర శ్రమజీవి. స్వశక్తితో ఎదిగిన నటుడు. తంగలాన్ చిత్రంతో ఈయన తన విశ్వ రూపాన్ని ప్రదర్శించారు. ఈ చిత్రం త్వరలో వెండితెరపై ఆవిష్కృతం కాబోతుంది. దీంతో విక్రమ్ తాజాగా తన 62వ చిత్రానికి సిద్ధం అవుతున్నారు. ఈ చిత్రానికి ఎస్‌యూ అరుణ్‌కుమార్ దర్శకత్వం వహించనున్నారు. ఇంతకుముందు పన్నైయారుమ్ పద్మినియుమ్, సేతుపతి, సింధు బాద్, సిత్త వంటి సక్సెస్ఫుల్ చిత్రాలను తెరకెక్కించారన్నది గమనార్హం. ఈ చిత్రాన్ని హెచ్ఆర్ పిక్చర్స్ నిర్మాత శిబూ తమీన్స్ వారసురాలు రిషి శిబూ నిర్మించనున్నారు. జీవీ ప్రకాష్‌కుమార్ సంగీతాన్ని అందించనున్న ఈ చిత్రానికి సంబంధించిన అప్డేట్ నిర్మాత శుక్రవారం వెల్లడించారు. ఇందులో మరో నట రాక్షసుడు ఎస్జే సూర్య ముఖ్యపాత్రను పోషించనున్నారన్నదే ఆ అప్డేట్. ఇటీవల ఈయన విశాల్‌తో కలిసి నటించిన మార్క్ ఆంటోని, రాఘవ లారెన్స్‌తో కలిసి నటించిన జిగర్తండ–2 వంటి చిత్రాలు సంచలన విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. దీంతో విక్రమ్‌తో కలిసి ఈయన నటించబోతున్న చిత్రంపై భారీ అంచనాలు నెలకొనడం సహజమే. త్వరలో సెట్స్‌పైకి రావడానికి సిద్ధమవుతున్న ఈ క్రేజీ కాంబో చిత్రం గురించి మరిన్ని వివరాలు త్వరలో వెల్లడయ్యే అవకాశం ఉంది. -
హైదరాబాద్‌లో సరిపోదా...
‘అంటే సుందరానికీ!’ చిత్రం తర్వాత హీరో నాని, డైరెక్టర్ వివేక్ ఆత్రేయ కాంబినేషన్లో తెరకెక్కుతోన్న చిత్రం ‘సరిపోదా శనివారం’. ప్రియాంకా అరుళ్ మోహన్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాలో ఎస్జే సూర్య కీలక పాత్ర చేస్తున్నారు. డీవీవీ ఎంటర్టైన్మెంట్స్పై డీవీవీ దానయ్య, కల్యాణ్ దాసరి నిర్మిస్తున్న ఈ సినిమా తాజా షెడ్యూల్ హైదరాబాద్‌లో ్రపారంభమైంది. ‘‘సరిపోదా శనివారం’ చిత్రంలో నాని పూర్తిగా యాక్షన్–΄్యాక్డ్ అవతార్‌లో కనిపిస్తారు. హై బడ్జెట్, భారీ కాన్వాస్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాం. నవంబరులో ఒక షెడ్యూల్ పూర్తి చేశాం. రెండో షెడ్యూల్‌ని హైదరాబాద్‌లో ్రపారంభించాం. ఈ షెడ్యూల్లో ఇంటెన్స్ యాక్షన్ బ్లాక్‌తో పాటు నాని, ఇతర ప్రధాన తారాగణంపై కొంత టాకీ పార్ట్‌ని చిత్రీకరించనున్నాం. పాన్ ఇండియా చిత్రంగా రూ΄÷ందుతున్న ఈ సినిమా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో రిలీజ్ కానుంది’’ అన్నారు మేకర్స్. ఈ చిత్రా నికి సంగీతం: జేక్స్ బిజోయ్, కెమెరా: మురళి జి. -
ఫైట్‌తో ప్రారంభం
‘అంటే..సుందరానికీ!’ చిత్రం తర్వాత హీరో నాని, దర్శకుడు వివేక్ ఆత్రేయ కాంబినేషన్లో రూపొందుతున్న తాజా సినిమా ‘సరిపోదా శనివారం’. ప్రియాంకా అరుళ్ మోహనన్ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంలో ఎస్జే సూర్య ఓ కీలక పాత్రధారి. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఓ యాక్షన్ సీక్వెన్స్‌తో మంగళవారం హైదరాబాద్‌లోప్రారంభమైంది. ఫైట్ మాస్టర్ రామ్–లక్ష్మణ్ ఈ ఫైట్ ఎపిసోడ్‌ను పర్యవేక్షిస్తున్నారు. ఈ షెడ్యూల్లో కొన్ని యాక్షన్ సన్నివేశాలతో పాటు నాని, ఇతర ప్రధాన తారాగణం పాల్గొనగా కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై డీవీవీ దానయ్య, కల్యాణ్ దాసరి నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: జేక్స్ బిజోయ్. -
'జిగర్ తండ డబుల్ ఎక్స్' మూవీ రివ్యూ.. ఎలా ఉందంటే?
టైటిల్: జిగర్ తండ(డబుల్ ఎక్స్) నటీనటులు: రాఘవ లారెన్స్, ఎస్జే సూర్య, నిమిషా, నవీన్ చంద్ర తదితరులు నిర్మాణ సంస్థ: స్టోన్ బెంచ్ ఫిలిమ్స్ నిర్మాతలు: కార్తికేయన్ సంతానం, కతిరేశన్ దర్శకత్వం: కార్తీక్ సుబ్బరాజు సంగీత దర్శకుడు: సంతోష్ నారాయణన్ సినిమాటోగ్రఫీ: తిరు ఎడిటింగ్: షఫీక్ మహమ్మద్ అలీ విడుదల తేది: నవంబర్ 10, 2023 రాఘవ లారెన్స్, ఎస్జే సూర్య ప్రధాన పాత్రల్లో తెరెకెక్కించిన చిత్రం జిగర్ తండ డబుల్ ఎక్స్. ఈ చిత్రాన్ని స్టోన్ బెంచ్ ఫిలిమ్స్ బ్యానర్‌పై కార్తికేయన్ సంతానం, ఎస్. కథిరేసన్ నిర్మించగా.. కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వం వహించాడు. ఇది తమిళంలో బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన జిగర్ తండ(ఈ మూవీ తెలుగులో గద్దలకొండ గణేశ్‌గా రీమేక్ అయింది) సినిమాకు సీక్వెల్‌గా తెరకెక్కించారు. నవంబర్ 10న ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం. కథేంటంటే.. సీజర్(రాఘవ లారెన్స్) రాయలసీమలోని కర్నూలులో గ్యాంగ్‌స్టార్. ఆ ప్రాంతంలోని మరో గ్యాంగ్ స్టార్ లారెన్స్‌తో గొడవ పడుతుంటారు. అప్పుడే తన గురువు లాంటి అతన్ని సీజర్ చంపేస్తాడు. కానీ సీజర్కు స్థానిక రాజకీయ నాయకుడైన కారుమంచి(ఇళవరసు) సపోర్ట్ ఉంటుంది. మరో రాజకీయ నాయకుడైన టామ్ చాకో(జయకృష్ణ) మనిషిని సీజర్ చంపడంతో అతనిపై పగ పెంచుకుంటాడు. దీంతో ఎలాగైనా సరే సీజర్‌ను చంపేయాలని జయకృష్ణ.. ఫారెస్ట్ ఆఫీసర్ అయిన నవీన్ చంద్రకు చెప్తాడు. అయితే సీజర్‌ను చంపే ప్రయత్నంలో ఎస్సై కావాల్సిన ఎస్జే సూర్య(రే దాసన్) మధ్యలో ఎందుకు ఎంటరయ్యాడు? అసలు జయకృష్ణకు సీజర్‌ను చంపాల్సిన అవసరమేంటి? చివరికీ జయకృష్ణ సీజర్‌ను చంపాడా? లేదా? అసలు సీజర్(లారెన్స్)ను, రే దాసన్(ఎస్జే) ఎందుకు చంపాలనుకున్నాడు? వీరిద్దరి మధ్య గల వైరానికి కారణమేంటి? అన్న విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే. మరోవైపు అడవిలో ఉండే ఆదివాసీలకు, అసలు సీజర్కు మధ్య ఉన్న సంబంధం ఏంటి? ఫారెస్ట్ అధికారుల వేధింపుల నుంచి ఆదివాసీలను సీజర్ ఎందుకు రక్షించాలనుకుంటాడు? చివరికీ వారికి అండగా నిలిచాడా? లేదా? ప్రభుత్వం, అటవీ అధికారులకు దొరకకుండా.. అడవిలో ఏనుగులను అంతమొందిస్తున్న స్మగ్లర్లను సీజర్ ఎందుకు పట్టుకున్నాడు? వాళ్లను పట్టుకున్నాక సీజర్ ఎలాంటి పరిణామాలు ఎదుర్కొవాల్సి వచ్చింది? చివరికీ తాను అనుకున్న లక్ష్యం నేరవేరిందా? అనే విషయాలు తెలియాలంటే థియేటర్లకు వెళ్లి చూడాల్సిందే. ఎలా సాగిందంటే.. రాయలసీమ బ్యాక్‌డ్రాప్‌లోనే కథను పరిచయం చేశాడు డైరెక్టర్. దాదాపు పదేళ్ల తర్వాత సీక్వెల్ ముందుకొచ్చిన కార్తీక్ సుబ్బరాజు సీక్వెల్‌పై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. 1970 ప్రాంతంలో రాయలసీమలోని నల్లమల అటవీ ప్రాంతంలో జరిగే ఏనుగుల దంతాల స్మగ్లింగ్ నేపథ్యంలో కథను తీసుకొచ్చారు. ఫస్టాఫ్‌లో రాయలసీమ జిల్లాల్లోని స్మగ్లర్లు, రాజకీయ నాయకులు, అడవిలో నివసించే ఆదివాసీల చుట్టే తిరుగుతుంది. అయితే ఎస్సైగా జాబ్‌లో చేరాల్సిన ఎస్జే సూర్య(రే దాసన్), మరో వైపు హీరో కావాలనుకున్నా రాఘవ(సీజర్) మధ్య వచ్చే సీన్స్ ఆకట్టుకుంటాయి. ఫస్టాప్‌లో మరీ ముఖ్యంగా సీరియస్‌గా సాగుతున్న స్టోరీలో సత్యన్, ఎస్జే సూర్యతో కామెడీని తీసుకొచ్చే ప్రయత్నం చేశారు సుబ్బరాజు. ఇంటర్వెల్‌కు ముందు చిన్న ట్విస్ట్ ఇచ్చి సింపుల్‌గా ముగించారు. సెకండాఫ్ మొదలవగానే కథలో కాస్తా వేగం పెరిగింది. అడవితల్లితో వారికున్న బంధాన్ని చాలా చక్కగా చూపించారు. అటవీ ప్రాంతంలో నివసించే ఆదివాసీల జీవన విధానాన్ని సైతం ప్రేక్షకులకు పరిచయం చేశారు కార్తీక్. ముఖ్యంగా అడవిలో ఏనుగులను అంతమొందిస్తున్నషెటానీ ముఠా.. రాఘవ లారెన్స్ మధ్య జరిగే ఫైట్ సీన్స్ ప్రేక్షకుల్లో ఆసక్తితో పాటు కాస్తా ఉత్కంఠకు గురి చేస్తాయి. ఒకవైపు రాజకీయ నాయకులు, అధికారుల కుట్రలను ప్రేక్షకులకు చూపిస్తూనే.. మరోవైపు ఆదివాసీ బిడ్డల అమాయకత్వాన్ని కళ్లకు కట్టినట్లు చూపించారు. అడవి బిడ్డలైన ఆదివాసీలకు, జంతువులకు మధ్య ఉండే ప్రేమానురాగాలను కాస్తా కొత్తగా చూపించే ప్రయత్నం చేశాడు. ఏనుగులను చంపే షెటానీ ముఠా, సీజర్(రాఘవ లారెన్స్) మధ్య జరిగే ఫైట్ సీన్స్ సెకండాఫ్‌లో హైలెట్. ఒకవైపు రాజకీయ నాయకుల కుట్రలు, మరోవైపు అడవిలో స్మగ్లింగ్, వీరి మధ్యన నలిగిపోతున్న ఆదివాసీ బిడ్డలతో కథను ముందుకు తీసుకెళ్లారు. అక్కడక్కడ వచ్చే ప్రేకకుల ఊహకందే ట్విస్టులతో థియేటర్లో కూర్చోబెట్టేందుకు విశ్వ ప్రయత్నం చేశారు. క్లైమాక్స్ వచ్చేసరికి ఎమోషనల్ టచ్ ఇచ్చి ఆడియన్స్‌ను కంటతడి పెట్టించారు డైరెక్టర్. సినిమా చివరి 20 నిమిషాలు ఫుల్ ఎమోషనల్‌గా సాగింది. సన్నివేశాలు కాస్త సినిమాటిక్‌గా ఉన్నా ఆడియన్స్‌లో మాత్రం ఉత్కంఠ పెంచుతాయి. దాదాపు పదేళ్ల తర్వాత సీక్వెల్ తెరకెక్కించడంలో ప్రేక్షకుల అంచనాలు అందుకోవడంలో మాత్రం డైరెక్టర్ సక్సెస్ కాలేకపోయాడనిపిస్తోంది. జగర్ తండకు సీక్వెల్ అయినా రెండు కథలు పూర్తి భిన్నంగా ఉంటాయి. అయితే రెండింటిలోనూ సెటప్ అంతా దాదాపుగా ఒకే తరహాలో సాగుతుంది. అయితే మరో సీక్వెల్‌గా త్రిబుల్ ఎక్స్ తీసుకురానున్నట్లు చివర్లో హింట్ మాత్రం ఇచ్చేశారు. ఎవరెలా చేశారంటే... రాఘవ లారెన్స్ ఎప్పటిలాగే తన నటనతో అదరగొట్టేశారు. తనలోని ఫుల్ మాస్ యాక్షన్‌తో మరోసారి తనదైన నటనతో మెప్పించారు. ఎస్జే సూర్య సైతం తన పాత్రకు పూర్తిగా న్యాయం చేశారు. నవీన్ చంద్ర అటవీశాఖ అధికారి పాత్రలో ఒదిగిపోయారు. నిమిశా, ఇళవరసు, టామ్ చాకో, సత్యన్, బావ చెల్లాదురై, అరవింద్ ఆకాష్ తమ పాత్రలకు న్యాయం చేశారు. సాంకేతికత విషయానికొస్తే.. సంతోష్ నారాయణన్ సంగీతం పర్వాలేదు. ఈ చిత్రంలో పాటలు అంతగా ఆకట్టుకోలేకపోయినా సందర్భాన్ని తగినట్లుగానే ఉన్నాయి. బీజీఎం ఫరవాలేదనిపించింది. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటర్ తన కత్తెరకు కాస్తా పని చెప్పి ఉంటే బాగుండేది. నిర్మాణ విలువలు సంస్థ స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి. - మధుసూదన్, సాక్షి వెబ్ డెస్క్ -
నన్ను కొత్తగా చూస్తారు
రాఘవా లారెన్స్, ఎస్జే సూర్య ప్రధాన ΄ాత్రల్లో నటించిన పీరియాడికల్ యాక్షన్ డ్రామా ‘జిగర్ తండ డబుల్ ఎక్స్’. కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో కార్తికేయన్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 10న తెలుగు, తమిళం, హిందీ భాషల్లో విడుదల కానుంది. ఈ సందర్భంగా రాఘవా లారెన్స్, ఎస్జే సూర్య హైదరాబాద్‌లో జరిగిన విలేకర్ల సమావేశంలో చెప్పిన విశేషాలు. లారెన్స్ మాట్లాడుతూ – ‘‘జిగర్ తండ’ సినిమాలోని గ్యాంగ్‌స్టర్ ΄ాత్రలో నటించే తొలి అవకాశం నాకే వచ్చింది. కానీ అప్పుడు ఇతర ్ర΄ాజెక్ట్స్తో బిజీగా ఉండటం వల్ల చేయడం కుదర్లేదు. ఆ తర్వాత ‘జిగర్ తండ’కు రెండు జాతీయ అవార్డులు వచ్చాయి. దీంతో ‘జిగర్ తండ’ కు సీక్వెల్ ఉన్నట్లయితే అందులో నేను నటిస్తానని కార్తీక్ సుబ్బరాజుకి చె΄్పాను. ఈ సీక్వెల్ ‘జిగర్ తండ: డబుల్ ఎక్స్’ కథ సిద్ధమైన ఏడాది తర్వాత కార్తీక్ సుబ్బరాజు ఫోన్ చేసి చె΄్పారు. కథ నచ్చడంతో ఈ సినిమాలో నటించాను. ∙ఈ సినిమా విషయంలో దర్శకుడు కార్తీక్ చెప్పినట్లు చేశాను. ప్రేక్షకులు కొత్త రాఘవా లారెన్స్‌ని చూస్తారు. సినిమా ఫస్టాప్‌లో యాక్షన్, సెకండాఫ్‌లో భావోద్వేగాల సన్నివేశాలు ఉంటాయి. ముఖ్యంగా చివరి 20 నిమిషాలు ప్రేక్షకుల హృదయాలను హత్తుకునేలా ఉంటుంది. సినిమా చూసిన తర్వాత ప్రేక్షకుల హృదయం కూడా బరువెక్కుతుంది. ∙త్వరలో ‘కాంచన 4’ స్టార్ట్ చేస్తాను. ఇక సూపర్ స్టార్ రజనీకాంత్‌గారి కోసమే కాదు.. సూపర్‌స్టార్, మెగాస్టార్ (చిరంజీవిని ఉద్దేశిస్తూ..) కలిసి యాక్ట్ చేసే ఓ మల్టీస్టారర్ స్క్రిప్ట్ నా దగ్గర ఉంది. కానీ వారు యాక్ట్ చేయాలి కదా’’ అన్నారు. నటుడు– దర్శకుడు ఎస్జే సూర్య మాట్లాడుతూ– ‘‘దర్శకత్వం–నటన..ఈ రెండింటిలో నాకు నటన అంటేనే ఇష్టం. అయితే నా కెరీర్ ్ర΄ారంభంలో యాక్టింగ్ అవకాశాల కోసం డైరెక్షన్‌ని వారధిగా వినియోగించుకున్నాను. ఇక ‘జిగర్ తండ: డబుల్ఎక్స్’లో లారెన్స్గారిది గ్యాంగ్‌స్టర్ రోల్. నాదేమో దర్శకుడు కావాలనుకునే ΄ాత్ర. నా ΄ాత్రలో సత్యజిత్ రేగారి సినిమాల రిఫరెన్స్ ఉండటంతో ఇదొక బహుమతిగా భావించి ఈ మూవీ చేశాను. మంచి మాస్ కమర్షియల్ అంశాలు ఉన్న సందేశాత్మక చిత్రం ఇది. ఈ సినిమా షూటింగ్ కోసం ఓ విలేజ్ సెట్ వేయాల్సి వచ్చింది. ఇందులో భాగంగా ఓ రోడ్, బ్రిడ్జ్ వేశాం. అప్పటికే రోడ్, బ్రిడ్జ్ సౌకర్యాలు లేక ఇబ్బందిపడుతున్న ఆ గ్రామస్తులకు ఇవి ఇప్పుడు ఉపయోగపడుతున్నాయి. నేను నటిస్తూ, నా దర్శకత్వంలో ఓ సినిమా రానుంది’’ అని చెప్పుకొచ్చారు. -
ట్రైలర్ అదిరిపోయింది
‘‘జిగర్ తండ డబుల్ ఎక్స్’ సినిమా ట్రైలర్ అదిరిపోయింది. కార్తీక్ సుబ్బరాజ్ టేకింగ్ ఎలా ఉంటుందో మరోసారి ఈ ట్రైలర్‌తో చూపించాడు. సినిమా తప్పకుండా బ్లాక్ బస్టర్ అవుతుందనే గట్టి నమ్మకం ఉంది’’ అని హీరో వెంకటేశ్ అన్నారు. రాఘవ లారెన్స్, ఎస్జే సూర్య ప్రధాన పాత్రల్లో కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వం వహించిన చిత్రం ‘జిగర్ తండ డబుల్ ఎక్స్’. కార్తికేయన్ సంతానం నిర్మించిన ఈ సినిమా తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో ఈ నెల 10న విడుదలఅవుతోంది. హైదరాబాద్‌లో జరిగిన ఈ మూవీ ప్రీ రిలీజ్ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరైన వెంకటేశ్ మాట్లాడుతూ–‘‘లారెన్స్, ఎస్జే సూర్య వంటి ప్రతిభ ఉన్న నటులు ఈ సినిమాలో నటించారు. కార్తీక్ సుబ్బరాజ్ కల్ట్ డైరెక్టర్. నాకోసం తను త్వరలోనే ఓ స్క్రిప్ట్ తయారు చేస్తాడనుకుంటున్నాను’’ అన్నారు. రాఘవ లారెన్స్ మాట్లాడుతూ–‘‘తమిళనాడులో నేను ట్రస్ట్ పెట్టి సేవలు చేస్తున్నాను. ఇకపై తెలుగు రాష్ట్రాల్లో కూడా ఆ ట్రస్ట్ సేవలు అందించబోతున్నాను’’ అన్నారు. ‘‘అందరూ మా సినిమాను చూసి ఎంజాయ్ చే స్తారు’’ అన్నారు ఎస్జే సూర్య. ‘‘మా చిత్రం తప్పకుండా ప్రేక్షకుల్ని అలరిస్తుంది’’ అని కార్తికేయన్ సంతానం అన్నారు. ‘‘జిగర్ తండ డబుల్ ఎక్స్’ నాకు ఎంతో ప్రత్యేకం. నాలుగున్నరేళ్ల తర్వాత థియేటర్స్‌లోకి విడుదలవుతున్న నా సినిమా ఇది’’ అన్నారు కార్తీక్ సుబ్బరాజ్. ఈ వేడుకలో సంగీత దర్శకుడు సంతోష్ నారాయణన్, డైరెక్టర్ శైలేష్ కొలను, నటుడు నవీన్ చంద్ర మాట్లాడారు. -
అమెజాన్ ప్రైమ్‌లో దూసుకుపోతున్న సూపర్ హిట్ తెలుగు సినిమా
కోలీవుడ్ స్టార్ హీరో విశాల్ కథానాయకుడిగా అదిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో తెరకెక్కిన సైన్స్ ఫిక్షన్ యాక్షన్ కామెడీ ఫిల్మ్ 'మార్క్ ఆంటోని'. సెప్టెంబర్ 15న విడుదల అయిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. తమిళంలో ఏకంగా రూ.100కోట్ల వసూళ్లను రాబట్టింది. హీరో విశాల్, ఎస్జే సూర్య యాక్టింగ్ ఈ సినిమాకు హైలైట్‌గా నిలిచింది. డైరెక్టర్ అధిక్ రవిచంద్రన్ విభిన్న కథాంశం తో ‘మార్క్ ఆంటోనీ’ని తెరకెక్కించిన తీరు ఎంతగానో ఆకట్టుకుంది. మరీ ముఖ్యంగా జాకీ మార్తాండ పాత్రలో ఎస్జే సూర్య జీవించారు. తాజాగా ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. (ఇదీ చదవండి: పెళ్లి, విడాకులే కాదు ఆ బాధ ఇప్పటికీ ఉండిపోయింది: రేణు దేశాయ్) అక్టోబరు 13వ తేదీ నుంచి ఈ సినిమా అందుబాటులో ఉంది. తమిళ, తెలుగు భాషల్లో ఈ సినిమాను అమెజాన్ ప్రైమ్ అందుబాటులోకి తీసుకొచ్చింది. అయితే, అమెజాన్ ప్రైమ్ వీడియోలో మార్క్ ఆంటోనీ సినిమాకు సూపర్ రెస్పాన్స్ వస్తోంది. దీంతో ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ సినిమా ఇండియాలో టాప్ ట్రెండింగ్‌లో ఉంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ హీరో విశాల్ సంతోషం వ్యక్తం చేశారు. ఈమేరకు తాజాగా ఆయన ఓ ట్వీట్ చేశాడు. ' నా ఫేవరెట్ సిల్క్ స్మితను మీ ఇంట్లో నుంచే చూసి ఎంజాయ్ చేయండి' అని విశాల్ తెలిపాడు. మార్క్ ఆంటోనీ చిత్రంలో సిల్క్ స్మిత పాత్రను విష్ణు ప్రియ గాంధీ పరపెక్ట్గా సెట్ అయ్యారు. ఈ సినిమాలో ఆమె చూసేందుకు అచ్చం సిల్క్ స్మితలాగే ఉన్నట్లు కనిపిస్తుంది. ఈ సినిమా ఇంకా చూడని వారు ఉంటే అమెజాన్ ప్రైమ్‌లో ఈ ఆదివారం చూసి ఎంజాయ్ చేయండి. Happy to see #MarkAntony killing it in Ott platform too. Trending no 1 in Amazon Prime. Enjoy the unlimited entertainment, especially my favourite Silk Smitha scene in your own homes now. God Bless pic.twitter.com/RXTCaQJNQY — Vishal (@VishalKOfficial) October 14, 2023 -
నాపై నాకు నమ్మకం వచ్చింది
‘‘జిగర్తాండ డబుల్ ఎక్స్’లో నాకు మేకప్ వాడలేదు. మేకప్ లేకుంటే బాగుండనేమో? అనుకున్నాను. కానీ, స్క్రీన్‌పై చూసుకున్నాక నా మీద నాకు నమ్మకం ఏర్పడింది’’ అన్నారు రాఘవా లారెన్స్. కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో రాఘవా లారెన్స్, ఎస్జే సూర్య ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘జిగర్తాండ డబుల్ ఎక్స్’. కార్తికేయన్ నిర్మించిన ఈ చిత్రం దీపావళికి తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో రిలీజ్ కానుంది. హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో ఈ సినిమాలోని ‘కోరమీసం..’ పాటను రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా లారెన్స్ మాట్లాడుతూ– ‘‘జిగర్తాండ’లో నేను చేయాల్సింది.. కానీ, కుదర్లేదు. ఆ చిత్రానికి కార్తీక్ సుబ్బరాజ్‌కు జాతీయ అవార్డు వచ్చింది. ‘జిగర్తాండ డబుల్ ఎక్స్’ కోసం ఓ ఊర్లో రోడ్డు, బ్రిడ్జి నిర్మించారు మా నిర్మాత. ఆయన మంచి మనసు కోసమైనా ఈ చిత్రం బాగా ఆడాలి’’ అన్నారు. ‘‘ఈ సినిమా పండగలా ఉంటుంది’’ అన్నారు కార్తికేయన్. ‘‘జిగర్తాండ’ కంటే డబుల్ ఎక్స్ రేంజ్లో ఈ చిత్రం ఉంటుంది’’ అన్నారు కార్తీక్ సుబ్బరాజ్. ‘‘ఈ సినిమా నాకు ప్రత్యేకం’’ అన్నారు ఎస్జే సూర్య. -
ఆ మూవీ రిలీజ్ తర్వాత చాలా బాధపడ్డా: రాఘవ లారెన్స్
నటుడు రాఘవ లారెన్స్ హీరోగా, ఎస్జే సూర్య విలన్‌గా నటించిన తాజా చిత్రం 'జిగర్తండ డబుల్ ఎక్స్'. నటి నిమిషా సజయన్ నాయకిగా నటించిన ఈ చిత్రానికి కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వం వహించారు. స్టోన్ బెంచ్ ఫిలిమ్స్ కార్తికేయన్ సంతానం, ఎస్.కదిరేశన్ నిర్మించారు. సంతోష్ నారాయణన్ సంగీతాన్ని, తిరునావుక్కరుసు చాయాగ్రహణం అందించిన ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని దీపావళికి తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది. ఈ సందర్భంగా చిత్ర టీజర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని సోమవారం ఉదయం చైన్నెలోని సత్యం థియేటర్లో నిర్వహించారు. ఇందులో రాఘవ లారెనన్స్ మాట్లాడుతూ జగర్తండా చిత్రంలో తానే నటించాల్సి ఉందని.. ఆ సమయంలో తాను తెలుగులో చిత్రం చేయడంతో ఆ అవకాశాన్ని వదులుకున్నానని తెలిపారు. అయితే చిత్రం విడుదలైన తరువాత చూసి ఇంటికి వచ్చి చాలా బాధపడ్డానని ఒక రోజంతా నిద్ర కూడా పోలేదని చెప్పారు. అయితే ఇప్పుడు ఆ చిత్రాన్ని చేయకపోవడమే మంచిదిగా భావిస్తున్నానని అన్నారు. కారణం అప్పుడు రూ. 20 కోట్ల బడ్జెట్లో రూపొందిన జిగర్తండా చిత్రాన్ని వదులుకోవడం వల్లే ఇప్పుడు రూ. 100 కోట్ల బడ్జెట్లో రూపొందిస్తున్న ఈ జిగర్తండా డబుల్ ఎక్స్ చిత్రంలో నటించే అవకాశం వచ్చిందని సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఎస్జే సూర్యతో కలిసి నటించడం మంచి అనుభవంగా పేర్కొన్నారు. తాను సూర్య నటించే ముందు అలా చేద్దాం.. ఇలా చేద్దాం అని డిస్కస్ చేసుకునే వాళ్లమని, అయితే స్పాట్‌లోకి వచ్చిన తర్వాత దర్శకుడు కార్తీక్ సుబ్బరాజు చెప్పినట్లే చేయాల్సి వచ్చేదని అన్నారు. ఆయనకు అంత కమాండ్ ఉందని పేర్కొన్నారు. ఇది తనకు చాలా ముఖ్యమైన చిత్రమని దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ పేర్కొన్నారు. జిగర్తండ చిత్రానికి రెండు జాతీయ అవార్డులు వచ్చాయని.. ఈ చిత్రానికి కూడా రెండు, మూడు జాతీయ అవార్డులు వస్తాయనే నమ్మకాన్ని నిర్మాత కార్తికేయన్ అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇది తమ సంస్థలో రూ. 100 కోట్ల బడ్జెట్లో నిర్మించిన తొలి చిత్రం అని చెప్పారు. -
విశాల్ 'మార్క్ ఆంటోనీ' సినిమాపై బ్యాన్ విధించిన కోర్టు
నటుడు విశాల్‌కు ఒక హిట్ అవసరం ఎంతైనా ఉంది. ఆయన సమీపకాలంలోని చిత్రాలు ఆశించిన విజయం సాధించలేదు. కాగా తాజాగా 'మార్క్ ఆంటోనీ' చిత్రంతో రావడానికి సిద్ధమయ్యారు. ఇందులో ఎస్ జే.సూర్య ప్రతినాయకుడిగా నటించారు. విశాల్, ఎస్జే.సూర్య ఇద్దరు ద్విపాత్రాభినయం చేయడం విశేషం. మార్క్‌ఆంటోనీ చిత్రం నిర్మాణ కార్యక్రమాలు పూర్తిచేసుకుని ఈనెల 15న పాన్ ఇండియా స్థాయిలో తమిళం, తెలుగు హిందీ భాషల్లో విడుదలకు ముస్తాబవుతోంది. ఇలాంటి సమయంలో సినిమా విడుదలను ఆపేయాలని మద్రాసు కోర్టు తీర్పు వెల్లడించింది. ఏం జరిగిందంటే నటుడు విశాల్ చిత్ర నిర్మాణ సంస్థ అయిన విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ పేరుతో అన్బుచెజియన్‌కు చెందిన గోపురం ఫిల్మ్స్ నుంచి రూ. 21.29 కోట్ల రూపాయల రుణాన్ని తీసుకున్నాడు. తిరిగి చెల్లించడంలో ఆయన విఫలం కావడంతో విశాల్‌ను నమ్మి ఆ రుణాన్ని లైకా ప్రొడక్షన్ చెల్లించింది. ఈ విషయంలో, విశాల్, లైకా మధ్య ఒప్పందం ప్రకారం, మొత్తం రుణం తిరిగి చెల్లించే వరకు విశాల్ ఫిల్మ్ కంపెనీకి చెందిన అన్ని చిత్రాల హక్కులను లైకాకు ఇస్తామని హామీ ఇచ్చారు. (ఇదీ చదవండి: శివాజీతో చేతులు కలిపిన షకీలా, అర్ధరాత్రి డ్రామాలు.. ఆగమైన కంటెస్టెంట్లు) ఈ స్థితిలో రుణం చెల్లించకుండా గ్యారెంటీని ఉల్లంఘించి ‘వీరమే వాగై చూడుమ్’ (సామాన్యుడు) సినిమా విడుదలపై నిషేధం విధించాలని లైకా సంస్థ మద్రాసు హైకోర్టులో గతంలో కేసు వేసింది. ఈ వ్యాజ్యాన్ని విచారించిన మద్రాస్ హైకోర్టు విశాల్‌కు పలు సూచనలు ఇచ్చింది. హైకోర్టు రిజిస్ట్రార్ పేరిట 15 కోట్ల రూపాయలను శాశ్వత డిపాజిట్‌గా బ్యాంకులో డిపాజిట్ చేసి ఆస్తుల వివరాలను సమర్పించాలని నటుడు విశాల్‌ను ఆదేశించింది. దీంతో సింగిల్ జడ్జి ఆదేశాలపై ద్విసభ్య ధర్మాసనంలో విశాల్ అప్పీల్ దాఖలు చేశారు. చీఫ్ జస్టిస్ రాజా, జస్టిస్ భరత చక్రవర్తితో కూడిన ధర్మాసనం ఈ అప్పీల్‌ను విచారించి, విశాల్ కోర్టుకు రూ.15 కోట్లు చెల్లించాలన్న ఆదేశాలను సమర్థించింది. చెల్లించని పక్షంలో, సింగిల్ జడ్జి ముందు ఈ కేసులో తీర్పు వెలువడే వరకు విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ నిర్మించిన చిత్రాలను థియేటర్లలో లేదా OTT సైట్లలో విడుదల చేయడంపై నిషేధం విధించి అప్పీల్ కేసును ముగించారు. (ఇదీ చదవండి: అట్లీ, షారుఖ్‌పై నయనతార అసంతృప్తి.. నిజమెంత?) ఇదిలా ఉంటే, విశాల్ చిత్రం 'మార్క్ ఆంటోని' సెప్టెంబర్ 15 న ప్రేక్షకుల ముందుకు రానుంది, ఈ కేసు ఈరోజు మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తి ఆశా ముందు విచారణకు వచ్చింది. అప్పట్లో కేసును విచారించిన న్యాయమూర్తి హైకోర్టు ఆదేశాల మేరకు రూ.15 కోట్లు డిపాజిట్ కాకపోవడంతో విశాల్ కొత్త సినిమాపై నిషేధం విధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఇటీవలే 'మార్క్ ఆంటోనీ' సినిమా ట్రైలర్ ఇంటర్నెట్లో విడుదలై మిలియన్ వ్యూస్‌ను దాటడం గమనార్హం. రెండు గంటల 30 నిమిషాలు నిడివి కలిగిన ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు యూఏ సర్టిఫికెట్ ఇచ్చింది. -
బంగారం.. ఏమని చెప్పను.. ఐ లవ్ యూనే..
విశాల్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘మార్క్ ఆంటోని’. అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రీతూ వర్మ హీరోయిన్. ఎస్జే సూర్య, సునీల్, సెల్వ రాఘవన్ ముఖ్య పాత్రలు పోషించారు. ఎస్. వినోద్ కుమార్ నిర్మించిన ఈ సినిమా వినాయక చవితి కానుకగా సెప్టెంబర్ 15న పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందించిన ఈ చిత్రంలోని ‘ఐ లవ్ యూ నే..’ అంటూ సాగే లిరికల్ సాంగ్‌ని రిలీజ్ చేశారు. శ్రీమణి సాహిత్యం అందించిన ఈ పాటను రామ్ మిరియాల పాడారు. ‘‘హై ఓల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందిన చిత్రం ‘మార్క్ ఆంటోని’. ఈ చిత్రంలో విశాల్ లుక్ సరికొత్తగా ఉంటుంది. ‘ఐ లవ్ యూ నే..’ పాటలో హీరోహీరోయిన్ల మాస్ స్టెప్స్, అందుకు తగ్గట్టుగా వస్తున్న ఫాస్ట్ బీట్ ఆకట్టుకుంటాయి’’ అని చిత్రబృందం పేర్కొంది. -
గుసగుస.. 'ఇండియన్-2'లో విలన్‌గా ఎస్.జె. సూర్య!
ఎస్.జె. సూర్యలో దర్శకుడు (తెలుగులో ‘ఖుషి నాని, పులి’), హీరో (తమిళంలో పలు చిత్రాలు), విలన్ (తెలుగు ‘స్పైడర్’) ఉన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం రెండు మూడు చిత్రాల్లో విలన్‌గా నటిస్తున్నారు సూర్య. వాటిలో శంకర్ దర్శకత్వంలో రామ్‌చరణ్ హీరోగా రూపొందుతున్న ‘గేమ్ చేంజర్’ ఒకటి. మరొకటి ‘ఇండియన్ 2’ అని సమాచారం. అయితే ‘ఇండియన్ 2’ గురించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. హీరో కమల్‌హాసన్, దర్శకుడు శంకర్ కాంబినేషన్లో రూపొందుతున్న చిత్రం ‘ఇండియన్ 2’. 1996లో వీరి కాంబినేషన్లో వచ్చిన ‘ఇండియన్’ సినిమాకు ఇది సీక్వెల్. కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంలో సిద్ధార్థ్, రకుల్‌ప్రీత్ సింగ్, బాబీ సింహా, ప్రియా భవానీ శంకర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమాకి సంబంధించిన ఓ షెడ్యూల్ చెన్నైలో ముగిసింది. కాగా నెక్ట్స్ షెడ్యూల్‌ను అమెరికాలో ప్లాన్ చేసింది చిత్రయూనిట్. దాదాపు పది రోజుల పాటు ఈ షెడ్యూల్ జరగనుంది. -
ధనుష్ స్వీయ దర్శకత్వంలో క్రేజీ మూవీ, నలుగురు హీరోలతో..
తమిళసినిమా: ధనుష్ ఈ పేరు ఒక్క తమిళ్ చిత్రం కాదు టాలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్ పరిశ్రమలకు సుపరిచితమే. ఇటీవల ఈయన కథానాయకుడిగా నటించిన నానే వరువేన్ చిత్రం నిరాశపరిచినా, తగ్గేదేలే అన్నట్టుగా ధనుష్ వరుసగా చిత్రాలను చేసుకుంటూ పోతున్నారు. ప్రస్తుతం చేతినిండా చిత్రాలతో బిజీగా ఉన్న నటుల్లో ఈయన ఒకరు. ప్రస్తుతం ఈయన తమిళం, తెలుగు భాషల్లో నటిస్తున్న వాత్తి (తెలుగులో సార్) చిత్రం. నిర్మాణ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా ఫిబ్రవరి 17న విడుదలకు ముస్తాబవుతోంది. కాగా దీంతో పాటు సత్యజ్యోతి ఫిలిమ్స్ సంస్థ నిర్మిస్తున్న కెప్టెన్ మిల్లర్ చిత్రంలో నటిస్తున్నారు. అరుణ్ మాదేశ్వరన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం స్వాతంత్య్రానికి ముందు జరిగిన సంఘటనతో కూడిన కథా చిత్రంగా ఉంటుందని చిత్ర వర్గాలు వెల్లడించారు. వీరితోపాటు తెలుగులో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ధనుష్ ఒక చిత్రంలో నటించనున్నారు. దీనికి సంబంధించిన పూజా కార్యక్రమాలు ఇప్పటికే జరిగాయి. నటుడు ధనుష్ ఇప్పుడు మరో క్రేజీ చిత్రానికి సిద్ధమవుతున్నారనేది తాజా సమాచారం. ఇందులో నలుగురు హీరోలతో కలిసి నటించి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించడానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఇందులో నటుడు ధనుష్‌తో పాటు విష్ణు, ఎస్.జే.సూర్య, కాళిదాస్ జయరాం నలుగురు హీరోలు నటించనున్నట్లు సమాచారం. ఈ క్రేజీ చిత్రాన్ని సన్ పిక్చర్స్ సంస్థ నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. దీనికి రాయన్ అనే టైటిల్‌ను నిర్ణయించినట్లు టాక్. ఇది చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు ఇప్పటికే మొదలైనట్లు, త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉన్నట్లు సమాచారం. -
మహేశ్ బాబు ఆ మాట అనగానే చాలా బాధ పడ్డా: ఎస్జే సూర్య
కమర్షియల్ సినిమాలు చేస్తూనే.. మధ్య మధ్యలో ప్రయోగాలు చేస్తుంటాడు సూపర్ స్టార్ మహేశ్ బాబు. ఆయన చేసిన ప్రయోగాల్లో కొన్ని వర్కౌట్ అయ్యాయి.. మరికొన్ని బెడిసి కొట్టాయి. ముఖ్యంగా భారీ అంచనాల మధ్య విడుదలైన ‘నాని’ చిత్రం బాక్సాఫీస్ వద్ద దారుణంగా బోల్తా పడింది. ఈ సినిమాలో మహేశ్ నటనకు మంచి మార్కులు పడినా.. నిర్మాతలకు మాత్రం నష్టాన్ని మిగిల్చింది. చాలా ఏళ్ల తర్వాత ఈ సినిమా ఫలితంపై దర్శకుడు ఎస్జే సూర్య స్పందించాడు. సినిమా పరాజయం తర్వాత మహేశ్ అన్న ఒక్కమాట తననెంతో బాధ పెట్టిందని అన్నాడు. ‘నాని సినిమా విషయంలో నాకు ఎప్పటి నుంచో ఓ బాధ మిగిలిపోయింది. పెద్ద హీరో కావాలని ఇండస్ట్రీకి వచ్చాను. కానీ దర్శకుడిని అయ్యాను. ప్రతీ సినిమాను ప్రేమతోనే చేస్తాం.. మన శక్తినంతా ధారపోస్తాం. కానీ ఈ చిత్రంలో తప్పు జరిగింది. సినిమా విడుదలయ్యాక ఓ సారి మహేశ్ ‘మీరు ఎంతో ఇష్టపడి ఈ సినిమా చేశారు. ఆ విషయం నాకు బాగా తెలుసు. ఫలితాన్ని పక్కన పెడితే.. మిమ్మల్ని, మీ పనితనాన్ని ఇష్టపడుతున్నా’అని అన్నారు. ఆయన అలా అనడం నాకింకా బాధను కలిగించింది. పవన్ కళ్యాణ్ గారికి హిట్ ఇచ్చాను.. కానీ మహేష్ బాబు గారికి హిట్ ఇవ్వలేదు. దేవుడు నాకు భవిష్యత్తులో అవకాశం ఇస్తారు.. ఇప్పుడు నేను యాక్టింగ్‌లో బిజీగా ఉన్నాను.. నటించే పిచ్చి తగ్గిన తరువాత.. నేను సినిమాలు తీస్తాను. అప్పుడు నేను మహేష్ బాబు గారితోనే సినిమా చేస్తాను.. ఆయన్ను ఒప్పిస్తాను' అని ఎస్ జే సూర్య అన్నాడు. ఎస్జే సూర్య నటించిన ‘వదంతి’ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఆయన ‘నాని’ ఫలితంపై స్పందించాడు. -
అప్పటికే నాకు గ్లామర్ డాల్ అనే ముద్ర ఉంది: హీరోయిన్
Yashika Anand About Working With SJ Surya In Kadamaiyai Sei: నాగర్ ఫిలిమ్స్ పతాకంపై టి.ఆర్ రమేష్, ఎస్ జహీర్ హుస్సేన్ కలిసి నిర్మింన చిత్రం 'కడమై సెయ్'. ఎస్జే సర్య, యాషిక ఆనంద్ జంటగా నటించిన ఈ త్రానికి వెంకట్ రాఘవన్ దర్శకత్వం వహించారు. నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈనెల 12న తెరపైకి రావడానికి సిద్ధమవుతోంది ఈ చిత్రం. ఈ సందర్భంగా ఆదివారం (ఆగస్టు 07) సాయంత్రం స్థానిక వడపళనిలోని కమలా థియేటర్లో చిత్ర యూత్ మీడియా సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సమావేశంలో నటి యాషిక ఆనంద్ మాట్లాడుతూ.. ''దర్శకుడు కథ చెప్పినప్పుడు అందులోని హీరోయిన్ పాత్రకు నేను న్యాయం చేయగలనా..? అని సందేహం కలిగింది. ఎందుకంటే ఈ చిత్రంలో నటిస్తున్నప్పుడు నా వయస్సు 21. అలాంటిది ఇందులో ఓ బిడ్డకు తల్లిగా నటించే పాత్ర నాది. అప్పటికే నాకు గ్లామర్ డాల్ అనే ముద్ర ఉంది. దాన్ని నేను ఎంజాయ్ చేస్తున్నాను. ఇక ఈ చిత్రంలో నటనకు అవకాశం ఉన్న పాత్ర దక్కడం సంతోషంగా ఉంది. ఎస్జే సూర్యతో కలిసి నటించడం మంచి అనుభవం'' అని పేర్కొంది. నటుడు ఎస్ జే సూర్య మాట్లాడుతూ చిత్ర నిర్మాత రమేష్ చాలా ప్రతిభ కలిగిన వ్యక్తి అని కొనియాడారు. ఇది ఆయన శ్రమతోనే రూపొందిన చిత్రమని పేర్కొన్నారు. మరో నిర్మాత జాకీర్ హుస్సేన్ ఆయనకు పక్క బలంగా నిలిచారన్నారు. దర్శకుడు వెంకట్ రాఘవన్ చిత్ర కథను తనకు చెప్పినప్పుడు అందులో కంటెంట్ చాలా ముఖ్యంగా అనిపించిందన్నారు. ఈ చిత్రకథ ప్రత్యేకంగా అనిపించడంతో కచ్చితంగా నటించాలని భావించానన్నారు. 'కడమై సెయ్' చిత్రం మం విజయం సాధిస్తుందని, కచ్చితంగా ఇది హిందీలోను రీమేక్ అవుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. -
శంకర్, రామ్ చరణ్ చిత్రంలో విలన్‌గా స్టార్ డైరెక్టర్!
RC 15 Movie: శంకర్, రామ్ చరణ్ కాంబోలో తెరకెక్కుతున్న చిత్రం ఇప్పుడు టాలీవుడ్‌ని షేక్ చేస్తుంది. ఈ సినిమాలో నటించే ప్రతినాయకుడి గురించే ఇప్పుడు అందరూ మాట్లాడుకుంటున్నారు. ఒకప్పటి స్టార్ డైరెక్టర్ ఎస్ జే సూర్య.. రామ్ చరణ్ మూవీలో విలన్ రోల్ చేస్తున్నాడట. స్పైడర్, అదిరింది,మనాడు చిత్రాల్లో హీరోయిజంతో పాటు విలనిజం కూడా బాగా ఎలివేట్ అయింది. ప్రతినాయకుడి పాత్రలో ఒకప్పటి స్టార్ డైరెక్టర్ ఎస్ జే సూర్య నటించిన తీరు ప్రేక్షకుల్ని అబ్బురపరిచింది. తాజాగా చెర్రీ సినిమాలో విజల్ పాత్ర పోషించేందుకు సూర్య ఒప్పుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. శంకర్ మేకింగ్ లో రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న భారీ ప్రతిష్టాత్మక చిత్రంలో ఎస్ జే సూర్య విలన్ రోల్ చేయడం ఆసక్తికరంగా మారింది. చాలా కాలం శంకర్ పవర్ ఫుల్ పొలిటికల్ థ్రిల్లర్ నరేట్ చేయబోతున్నాడని,ఈ సినిమాలో ఎస్ జే సూర్య ముఖ్యమంత్రి పాత్రలో నటిస్తున్నాడని కోలీవుడ్ టాక్. -
పాతికేళ్ల కల నెరవేరింది
చెన్నై : నటుడిగా జయించాలన్న తన పాతికేళ్ల కల నెరవేరిందని నటుడు, దర్శకుడు ఎస్జే.సూర్య అన్నారు. అజిత్ కథానాయకుడిగా నటించిన వాలి చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అయిన ఈయన ఆ తరువాత విజయ్ కథానాయకుడిగా ఖుషీ చిత్రం చేశారు. ఈ రెండు విజయాలతో సినీ పరిశ్రమలో సంచలనం సృష్టించారు. అంతే కాదు తెలుగులోనూ పవన్‌కల్యాణ్ హీరోగా ఖుషీ చిత్రం చేసి సక్సెస్ అయిన ఎస్జే సూర్య ఆ తరువాత హీరోగా అవతారమెత్తారు. అలా నటుడుగా, దర్శకుడిగా రెండు పడవలపైన పయనిస్తూ ఇటీవల సరైన సక్సెస్‌ను అందుకోలేకపోయారు. అయితే తాజాగా ఎస్జే సూర్య కథానాయకుడిగా నటించిన మాన్స్టర్ చిత్రం ఇటీవల తెరపైకి వచ్చి విజయవంతంగా ప్రదర్శింపబడుతోంది. ఈ సందర్భంగా థ్యాంక్స్ చెప్పడానికి ఎస్జే సూర్య సోమవారం మధ్యాహ్నం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వాలితో ఆరంభం అయిన తన సినీ పయనం మాన్‌స్టర్‌లో ఆగదన్నారు. తాను మంచి చేసినప్పుడు ప్రశంసించిన పాత్రికేయులు, తప్పు చేసినప్పుడు దాన్ని ఎత్తి చూపించి తాను ఈ స్థాయికి రావడానికి కారణంగా నిలిచారని, అలాంటి వారితో చిత్ర విజయాన్ని పంచుకోవడం సంతోషంగా ఉందన్నారు. సహాయ దర్శకుడిగా పని చేసిన కాలంలో రూ.50 ఇచ్చి స్టూడియోలోపలికి వెళ్లి షూటింగ్ చూసిన సందర్భాలు ఉన్నాయని గుర్తు చేసుకున్నారు. ఆదివారం మాన్స్టర్ చిత్రాన్ని ప్రేక్షకుల మధ్య ధియేటర్లో చూశానన్నారు. అప్పుడు ఇరైవి చిత్ర బృందం, నటుడు బాబీసింహా కుటుంబంతో సహా వచ్చి చిత్రాన్ని చూశారని తెలిపారు. ఆయన పిల్లలు చిత్రంలోని ఎలుక సన్నివేశాలను చూసి ఆనందంతో చప్పట్లు కొడుతుంటే తనకు చాలా సంతోషం కలిగిందన్నారు. హీరోగా విజయం సాధించాలన్న తన పాతికేళ్ల కల ఇప్పటికి నెరవేరిందన్నారు. పాటలు, రొమాన్స్ సన్నివేశాలు లేకపోవడమే చిత్ర విజయానికి కారణమన్నారు. ఇకపై ఈ పయనాన్ని కొనసాగిస్తూ మంచి చిత్రాలు చేస్తానని చెప్పారు. నటుడిగా శ్రమించడమే తన పని అన్నారు. అవకాశాలు రాకపోతే తానే కథలను తయారు చేసుకుని నటిస్తానని చెప్పారు. జీవితంలో అపజయాలు అన్నీ నేర్పిస్తాయని అన్నారు. నటుడు అమితాబ్ బచ్చన్‌తో కలిసి నటించడం చాలా మంచి అనుభవంగా పేర్కొన్నారు. ఆయన ఏ సన్నివేశాన్నైనా సింగిల్ టేక్‌లో పూర్తి చేస్తారని, ప్రతి చిత్రాన్ని మొదటి చిత్రంగా భావించడమే అందుకు కారణం అనీ పేర్కొన్నారు. తాను సెల్వరాఘవన్ దర్శకత్వంలో నటించిన నెంజమ్ మరప్పదిలై, మాయ చిత్రం ఫేమ్ దర్శకుడుతో చేసిన ఇరవా కాలం చిత్రం బాగా వచ్చాయనీ, త్వరలోనే విడుదల కానున్నాయనీ తెలిపారు. తమిళం, తెలుగు, హిందీ చిత్రాల్లో నటించి సక్సెస్ అయిన తరువాతనే పెళ్లి గురించి ఆలోచిస్తానని ఎస్జే సూర్య అన్నారు. -
21 ఏళ్ల తర్వాత...
50 ఏళ్ల సినీ కెరీర్లో తొలిసారి ఓ తమిళ చిత్రంలో అమితాబ్ బచ్చన్ నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాలో మరో విశేషం ఏంటంటే.. 21 ఏళ్ల తర్వాత రమ్యకృష్ణతో కలసి నటించనున్నారు. అమితాబ్ బచ్చన్, యస్.జె.సూర్య ముఖ్య పాత్రల్లో తమిళవానన్ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘ఉయంర్ద మణిదన్’. తమిళ, హిందీ భాషల్లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో అమితాబ్‌కు జోడీగా రమ్యకృష్ణ కనిపిస్తారు. 1998లో రిలీజైన ‘బడే మియా చోటే మియా’ సినిమాలో అమితాబ్– రమ్యకృష్ణ జోడీగా కనిపించారు. 21 సంవత్సరాల తర్వాత వీరిద్దరూ స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు. ఈ చిత్రం వచ్చే ఏడాది రిలీజ్ కానుంది. -
నాన్ తమిళన్
బాలీవుడ్ సూపర్‌స్టార్ అమితాబ్ బచ్చన్ పంచె, ధోతి ధరించి అచ్చమైన సౌతిండియన్లా మారిపోయారు. ‘నాన్ తమిళన్’ (నేను తమిళీయుడిని) అంటూ కొత్త లుక్‌తో పోజులిచ్చారు కూడా. ఇదంతా తమిళ చిత్రం ‘ఉయంర్ద మణిదన్’ కోసం. అమి తాబ్ బచ్చన్ నటిస్తున్న తొలి తమిళ చిత్రం ఇదే కావడం విశేషం. ఎస్.జె. సూర్య, అమితాబ్ బచ్చన్ ముఖ్యపాత్రల్లో కృష్ణన్ తెరకెక్కిస్తున్న ద్విభాషా (హిందీ, తమిళ) చిత్రమిది. ఈ సినిమా షూటింగ్లో ఆదివారం నుంచి పాల్గొంటున్నారు అమితాబ్ బచ్చన్. అమితాబ్‌తో కలసి పని చేయడం గురించి సూర్య తన ఆనందాన్ని వ్యక్తపరుస్తూ– ‘‘నా జీవితంలో మరువలేని క్షణాలివి. అమితాబ్‌గారితో యాక్ట్ చేయాలనే నా కల నెరవేరుతోంది. దేవుడికి, మా అమ్మానాన్నలకు థ్యాంక్స్’’ అన్నారు. -
ఇంటి సంఘటన తెరకు!
దర్శకుడు, నటుడు యస్.జె. సూర్య, ప్రియా భవాని శంకర్ జంటగా నటిస్తున్న చిత్రం ‘మాన్స్టర్’. ‘ఒరు నాళ్ కూత్తు’ ఫేమ్ నెల్సన్ వెంకటేశన్ దర్శకత్వంలో తెరకెక్కనుంది. ‘మాయా– మా నగరం’ అనే చిత్రాన్ని నిర్మించిన పొటెన్షియల్ స్టూడియోస్ పతాకంపై నిర్మాణ సంస్థ తమ మూడవ ప్రయత్నంగా ఈ చిత్రాన్ని రూపొందించనుంది. దర్శకుడు నెల్సన్ మాట్లాడుతూ– ‘‘అనుకోకుండా ఓ రోజు మా ఇంట్లో ఓ సంఘటన జరిగింది. ఆ సంఘటనకు నేను చాలా ఇన్స్పైర్ అయ్యి స్క్రిప్ట్‌గా రాసుకున్నాను. బాలల నేపథ్యంలో ఈ కథ ఉంటుంది. ఇప్పుడు ఇంతకంటే కథ గురించి వేరే విషయాలు ఏమీ చెప్పలేను. యస్. జె సూర్య నటన గురించి నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నా గత చిత్రం ‘ఒరు నాళ్ కూత్తు’లో సీరియస్ పాత్ర పోషించిన కరుణాకరన్ ఈ చిత్రంలో తన నటనతో కామెడీ కితకితలు పెడతాడు’’ అన్నారు. -
డబుల్ ఖుషీ!
సింగిల్ షాట్లో డబుల్ వర్క్ అంటే ఇదేనేమో. ఒక్క సినిమాతో ఇటు బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ కోలీవుడ్ ఎంట్రీ ఇస్తుంటే...అటు కోలీవుడ్ స్టార్ ఎస్.జె. సూర్య ఫస్ట్ టైమ్ నటుడిగా బాలీవుడ్‌కి వెళ్తున్నారు. అయితే తెలుగులో తాను తెరకెక్కించిన హిట్ మూవీ ‘ఖుషి’ హిందీ రీమేక్ ద్వారా ఆల్రెడీ బాలీవుడ్‌కి దర్శకుడిగా పరిచయమయ్యారు. ఇక తాజాగా కమిట్ అయిన తమిళ, హిందీ సినిమా విషయానికొస్తే.. తమిళ్‌వానన్ దర్శకత్వంలో అమితాబ్, ఎస్.జె. సూర్య ముఖ్య తారలుగా రూపొందనుంది. తమిళంలో ‘ఉయంర్ద మణిదన్’ అనే టైటిల్ ఖరారు చేశారు. చెన్నైలో జరిగిన ఓ ప్రెస్మీట్లో ఈ విషయాన్ని ఎస్.జె. సూర్య తెలిపారు. ఈ సినిమాకు దాదాపు రెండేళ్ల పాటు గ్రౌండ్ వర్క్ చేశారట టీమ్. ఈ చిత్రం టీజర్ పోస్టర్‌ను రజనీకాంత్ విడుదల చేసిన వీడియోను ఎస్.జె. సూర్య సోషల్ మీడియాలో షేర్ చేశారు. ‘‘నా ఫ్రెండ్ అమితాబ్ బచ్చన్ తమిళ సినిమా చేయడానికి అంగీకరించారు. ఇది ఇండస్ట్రీ గర్వించే సమయం. అలాగే హిందీ ఇండస్ట్రీకి ఈ సినిమాతో ఎస్.జె. సూర్య ఎంట్రీ ఇస్తుండటం సంతోషంగా ఉంది. టీమ్‌కి ఆల్ ది బెస్ట్’’ అని ఆ వీడియోలో రజనీ పేర్కొన్నారు. ‘‘ఇండియన్ సూపర్‌స్టార్ అమితాబ్‌తో కలిసి హిందీ పరిశ్రమకు వెళ్తున్నందుకు హ్యాపీగా ఉంది’’ అన్నారు సూర్య. అంటే సూర్యకు ఇప్పుడు డబుల్ ఖుషీ అన్నమాట. -
నటుడిగానే కొనసాగుతా : స్టార్ డైరెక్టర్
దక్షిణాదిలో సంచలన చిత్రాలను తెరకెక్కించిన దర్శకుడు ఎస్ జె సూర్య. వాలి, ఖుషి, న్యూ (తెలుగులో నాని) లాంటి సినిమాలకు దర్శకత్వం వహించిన ఎస్ జె సూర్య, తన దర్శకత్వంలో తెరకెక్కిన సినిమాల్లో హీరోగానూ నటించి మెప్పించారు. అయితే న్యూ తరువాత దర్శకుడిగా తన స్థాయికి తగ్గ విజయాలు సాధించటంలో విఫలమవుతున్న ఈ స్టార్ డైరెక్టర్ ఇతర దర్శకుల సినిమాల్లోనూ నటిస్తున్నారు. త్వరలో విడుదలకు సిద్ధంగా ఉన్న మహేష్ బాబు స్పైడర్ తో పాటు విజయ్ మెర్సల్ సినిమాల్లోనూ సూర్య విలన్ గా నటిస్తున్నాడు. ఒకప్పుడు స్టార్ డైరెక్టర్ గా ఘన విజయాలు అందించిన ఈ దర్శకుడు ఇక దర్శకత్వం వహించేది లేదని చెప్పేశారు. ఇప్పటికే డైరెక్టర్ గా చాలా సాధించానని, ఇక పై నటుడిగానే కొనసాగుతానని తెలిపారు. తాను సినీ రంగానికి నటుడు కావాలన్న కోరికతోనే వచ్చానని, అనుకోకుండా దర్శకుడిగా మారానని తెలిపారు. -
తెలుగులో మరోలా..!
సాక్షి, చెన్నై: ఒక భాషలో హిట్ అయిన చిత్రాలు ఇతర భాషల్లో రీమేక్ కావడం సహజమే. ఆ మధ్య తమిళ చిత్రం తనీఒరువన్ తెలుగులో రీమేక్ అయ్యింది. రామ్‌చరణ్ హీరోగా నటించిన ఈ చిత్రంలో తమిళంలో విలన్ గా నటించిన అరవిందస్వామినే తెలుగులోనూ నటించారు. అలా తెలుగులో రీమేక్ అవుతున్న మరో తమిళ చిత్రం బోగన్. తమిళంలో జయంరవి, అరవిందస్వామి కలిసి నటించిన ఇందులో హన్సిక నాయకి. లక్ష్మణ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం తెలుగులో పునర్నిర్మాణం కానుంది. లక్ష్మణ్‌నే దర్శకత్వం వహించనున్న ఈ చిత్రంలో జయంరవి పాత్రలో రవితేజ నటించనున్నారట. కాగా అరవిందస్వామి పాత్రను తెలుగులోనూ ఆయననే నటించాలని కోరగా అందుకు నిరాకరించినట్లు ప్రచారం జరుగుతోంది. దీని గురించి దర్శకుడిని అడగ్గా అసలు బోగన్ చిత్రం తెలుగు రీమేక్‌లో నటించమని తాము అరవిందస్వామిని సంప్రదించలేదన్నారు. నిజం చెప్పాలంటే, తమిళంలో అరవిందస్వామి ఆ పాత్రను చాలా బాగా నటించారని, అందువల్ల నిర్మాత తెలుగులోనూ ఆయనే నటిస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డ మాట వాస్తమేనన్నారు. అయితే ఈ పాత్ర తెలుగులో మరో విధంగా ఉంటుందని చెప్పారు. అందువల్ల తాను ఆ పాత్రకు అరవిందస్వామిని నటింపచేయాలని అనుకోలేదన్నారు. ఆ పాత్రకు తెలుగులో ఎస్జే.సూర్యను నటింపజేయాలని భావిస్తున్నానని అన్నారు. అయితే కొంత గ్యాప్ తరువాత విలన్ గా రీఎంట్రీ అయిన అరవిందస్వామి ఇప్పుడు మళ్లీ హీరోగా నటిస్తున్నారు. ప్రస్తుతం చతురంగవేట్టై 2, భాస్కర్ ఒరు రాస్కెల్ చిత్రాల్లో హీరోగా నటిస్తున్నారు. అందుకే ఆయన మళ్లీ విలన్ గా నటిండానికి అంగీకరించడం లేదన్నది కోలీవుడ్ వర్గాల సమాచారం. -
కొన్నేళ్లు ఒంటరిగానే జీవిస్తా!
తమిళసినిమా: నేనొకరిని ప్రేమించాను ఆ కారణంగానే.. ఒంటరిగా ఉన్నా నంటోంది రెజీనా. కోలీవుడ్, టాలీవుడ్‌ల్లో చాలా క్రేజీ హీరోయిన్. ముఖ్యంగా కోలీవుడ్‌లో మానగరం, రాజతందిరం, సరవణన్ ఇరుక్క భయమేన్, జెమినీగణేశనుమ్ సురళీరాజవుమ్ వంటి చిత్రాలు మంచి పేరును తెచ్చి పెట్టాయి. తాజాగా సెల్వరాఘవన్ దర్శకత్వంలో ఎస్జే.సూర్యతో నటించిన నెంజమ్ మరప్పదిల్లై చిత్రం త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా రెజీనాను పలకిరిస్తే తన అనుభవాలను ఇలా చెప్పుకొచ్చింది. జీవితంలో ఒక్కొక్కరికి ఒక్కోసారి టైమ్ వస్తుంది. ఇన్నేళ్ల నా సినీ అనుభవంలో నేను గ్రహించింది ఇది. అందుకే ఇప్పుడు ఏ విషయంలోనూ నేను తొందర పడడం లేదు. అదే విధంగా నేను ప్రస్తుతానికి ఒంటరిగానే ఉండడానికి ఇష్టపడుతున్నాను. ప్రస్తుత జీవితమే నాకు బాగుందని నా అనుభవం చెబుతోంది. నేనిలా మాట్లాడడానికి కారణం ఏమిటి, ఏమిటా అనుభవం అని ప్రశ్నిస్తున్నారు. జీవితం నాకు చాలా పాఠాలు నేర్పింది. ఇంతకు ముందు నేనొకరిని ప్రేమించాను. నేనిప్పుడిలా మాట్లాడడానికి అదే కారణం. అయినా ఆ విషయాల్లోకి వెళ్లదలుచుకోలేదు. ప్రస్తుతం నేను చాలా తెలివిగా ఉన్నాను. నటిగా చిన్న గ్యాప్ తీసుకోవడానికి ఇదే కారణం. ఏదేమనా ఇప్పుడు ఎవరితోనూ రిలేషన్షిప్ పెట్టుకోవడం లేదు. నిజం చెప్పాలంటే నన్ను నేను అర్థం చేసుకోవలసింది ఇంకా చాలా ఉంది.అందుకే ఇంకా కొన్నేళ్లు నేను ఒంటరిగానే జీవించాలని మనస్ఫూర్తిగా నిర్ణయించుకున్నా. -
గతంలో నేనొకరిని ప్రేమించా : హీరోయిన్
చెన్నై: గతంలో నేనొకరిని ప్రేమించా. ఆ కారణంగానే ఇలా మాట్లాడుతున్నా.. అంటోంది హీరోయిన్ రెజీనా కసంద్రా. కోలీవుడ్, టాలీవుడ్‌ల్లో చాలా క్రేజీ హీరోయిన్. తెలుగు, తమిళ చిత్రాలు ఆమెకు చాలా మంచి పేరు తెచ్చి పెట్టాయి. తాజాగా సెల్వరాఘవన్ దర్శకత్ంలో ఎస్జే. సూర్యతో నటించిన నెంజమ్ మరప్పదిల్లై చిత్రం త్వరలో విడుదలకు సిద్ధం అవుతోంది. ఈ సందర్భంగా రెజీనాను పలకరిస్తే తన అనుభవాలను ఇలా చెప్పుకొచ్చారు. ‘జీవితంలో ఒక్కొక్కరికి ఒక్కోసారి టైమ్ వస్తుంది. ఇన్నేళ్ల నా సినీ అనుభవంలో నేను గ్రహించినది ఇది. అందుకే ఇప్పుడు ఏ విషయంలోనూ తొందర పడటం లేదు. అదే విధంగా నేను ప్రస్తుతానికి ఒంటరిగానే ఉండటానికి ఇష్టపడుతున్నాను. ప్రస్తుత జీవితమే నాకు బాగుందని నా అనుభవం చెబుతోంది. నేనిలా మాట్లాడటానికి కారణం ఏమిటీ, ఏమిటా అనుభవం అని ప్రశ్నిస్తున్నారు. జీవితం నాకు చాలా పాఠాలు నేర్పింది. ఇంతకు ముందు నేనొకరిని ప్రేమించాను. నేనిప్పుడిలా మాట్లాడటానికి అదే కారణం. అయినా ఆ విషయోల్లోకి వెళ్లదలచుకోలేదు. ప్రస్తుతం నేను చాలా జాగ్రత్తగా ఉన్నాను. హీరోయిన్గా చిన్న గ్యాప్ తీసుకోవడానికి ఇదే కారణం. ఏదేమైనా ఇప్పుడు ఎవరితోనూ రిలేషన్షిప్ పెట్టుకోవడం లేదు. నిజం చెప్పాలంటే నన్ను నేను అర్థం చేసుకోవలసింది ఇంకా చాలా ఉంది. అందుకే కొన్నేళ్లు నేను ఒంటరిగానే జీవించాలని మనసుపూర్తిగా నిర్ణయించుకున్నాను’ అని తన విషయాలను పంచుకుంది. -
ఆయన ఫోన్ కాల్ రాగానే ఒప్పుకున్నా..
కన్నడ నటి నందితా శ్వేత ఇప్పుడు కోలీవుడ్‌లోనూ వరుస అవకాశాలతో దూసుకు పోతోంది. తొలి చిత్రం అట్టకత్తితోనే సక్సెస్‌ను అందుకున్న లక్కీ నటి ఆమె. ఆ తరువాత వరుసగా ఎదిర్‌నీశ్చల్, తిరుడన్ పోలీస్ చిత్రాల్లో నటించి కథానాయకిగా నందిత మంచి గుర్తింపు పొందింది. శివకార్తికేయన్, విజయ్ సేతుపతి వంటి యువ నటులతో రొమాన్స్ చేసిన తామె ఎందుకనో స్టార్ హీరోయిన్ ఇమేజ్ను ఇంకా అందుకోలేకపోయింది. అయితే గత ఏడాది ‘ఎక్కడికి పోతావు చిన్నదానా’ చిత్రంతో టాలీవుడ్‌కు పరిచయమైన ఈ కన్నడ బ్యూటీ ప్రస్తుతం ఈ రెండు భాషల్లోనూ మంచి అవకాశాలు వస్తున్నాయి అంటోంది. సెల్వరాఘవన్ దర్శత్వంలో నెంజం మరప్పదిలై చిత్రంలో ఎస్జే.సూర్యకు జంటగా నటిస్తున్నారు. నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది. నందితా శ్వేతా మాట్లాడుతూ సెల్వరాఘవన్ తన అభిమాన దర్శకుడని పేర్కొంది. ఆయన నుంచి ఫోన్ కాల్ రాగానే మరో మాట లేకుండా ఈ నెంజం మరప్పదిల్లై చిత్రంలో నటించడానికి అంగీకరించానని పేర్కొంది. ఆ తరువాతే ఇందులో ఎస్జే.సూర్య కథానాయకుడన్న విషయం తెలిసిందని చెప్పింది. ఈ చిత్రంలో తనకు ఎస్జే.సూర్యతో రొమాన్స్‌ను మించి నటనకు అవకాశం పాత్ర లభించిందని అంది. యాక్షన్ సన్నివేశాలు కూడా ఉంటాయని చెప్పింది. ప్రస్తుతం మూడు చిత్రాలతో బిజీగా ఉన్నట్లు తెలిపింది. అందులో అరవిందస్వామికి జంటగా నటిస్తున్న వనంగముడి చిత్రం ఒకటని,. ఇందులో పోలీస్ పాత్రలో నటించడం మంచి అనుభవంగా పేర్కొంది. అదే విధంగా చతురంగవేట్టై తెలుగు రీమేక్‌లో నటిస్తున్నానని తెలిపింది. ఎలాంటి పాత్రలు పోషించాలని ఆశిస్తున్నారని అడుగుతున్నారని, తాను తమిళంలో అభినయానికి అవకాశం ఉన్న పాత్రలను, తెలుగులో గ్లామర్ పాత్రలను కోరుకుంటున్నానని చెప్పింది. -
మాయ దర్శకుడితో ఎస్జే.సూర్య
నేటి టాప్ మోస్ట్ హీరోయిన్ నయనతారకు తొలి విజయాన్ని అందించిన లేడీ ఓరియెంటెడ్ కథా చిత్రం మాయ. హారర్ నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రం 2015లో విడుదలై భారీ వసూళ్లను సాధించింది.ఈ చిత్రం ద్వారా పరిచయమైన దర్శకుడు అశ్విన్ శరవణన్. ఈయన తదుపరి చిత్రం గురించి చాలా రకాల వార్తలు ప్రచారం అయ్యాయి. అయితే అవేవి నిజం కాలేదు. తాజాగా ఎస్జే.సూర్యను తన తాజా చిత్రానికి కథానాయకుడిగా ఎన్నుకున్నారు. ఆయనకు జంటగా నటి శివద నటించనున్నారు. మాయ చిత్రానికి హారర్ నేపథ్యాన్ని ఎంచుకుని సక్సెస్ అయిన దర్శకుడు అశ్విన్ శరవణన్ తన తాజా చిత్రానికి ప్రేమ కథను తయారు చేసుకున్నారట. అందులోనూ తనదైన స్టైల్లో థ్రిల్లర్ అంశాలను జోడించి థ్రిల్లర్ ప్రేమ కథా చిత్రంగా దీన్ని తీర్చిదిద్దనున్నారని సమాచారం. మాయ చిత్రానికి సంగీతాన్ని అందించిన యోహన్నే ఈ చిత్రానికి బాణీలు అందించనున్నారు. ఈ చిత్ర పూర్తి వివరాలను దర్శకుడు ఏప్రిల్ 14వ తేదీన వెల్లడించనున్నట్లు తెలిసింది. ఎస్జే.సూర్య ప్రస్తుతం సెల్వరాఘవన్ దర్శకత్వంలో నెంజం మరప్పదిల్లై చిత్రాన్ని పూర్తి చేసే పనిలో ఉన్నారు. -
పవన్ హీరోయిన్ సంచలన వ్యాఖ్యలు
నటిని కదా అని నోటికొచ్చినట్లు మాట్లాడకూడదు. అందులోనూ సెలబ్రిటీ హోదాలో ఉన్నవారు ఏ విషయమైనా ఒకటికి రెండు సార్లు ఆలోచించి మాట్లాడాలి. అలాంటి వారి ప్రతిచర్యను సాధారణ ప్రజలు గమనిస్తుంటారన్నది గుర్తెరగాలి. నటి నికిషాపటేల్ ఇలాంటి విషయాలేవీ పట్టించుకున్నట్లు లేదు. ఏదో ఒక వివాదాంశంతో వార్తల్లోకెక్కి ప్రచారం పొందాలన్న తాపత్రయంతో, స్వప్రయోజనం కోసం తహతహలాడుతున్నట్లుంది ఆమె వాలకం చూస్తుంటే. ఇంతకీ నికిషాపటేల్ ఏమందనేగా మీ ఆసక్తి. అదేమిటో చూద్దాం.ఇంగ్లాండ్‌లో పుట్టి పెరిగిన గుజరాతీ అమ్మాయి నికిషాపటేల్. బాలీవుడ్లో నాయకి కావాలన్న ఆశతో వచ్చి టాలీవుడ్లో కొమరం పులి చిత్రం ద్వారా కథానాయకిగా రంగప్రవేశం చేసింది. అక్కడ ఎవరూ పట్టించుకోకపోవడంతో కోలీవుడ్‌కు మకాం మార్చింది. ఇక్కడ కొన్ని చిత్రాలలో నటించినా తగిన గుర్తింపు కోసం ఇంకా పోరాడుతూనే ఉంది. ప్రస్తుతం నటుడు శక్తికి జంటగా 7 నాట్కళ్ అనే చిత్రంలో నటిస్తోంది. ఇటీవల ఈ అమ్మడు ఒక ఇంటర్వూలో మాట్లాడుతూ బాలీవుడ్లో హీరోయిన్ కావాలని ఆశించిన తనను దర్శకుడు ఎస్జే.సూర్య ఒత్తిడి చేసి మరీ టాలీవుడ్లో పవన్‌కల్యాణ్‌కు జంటగా కొమరం పులి చిత్రంతో పరిచయం చేశారని చెప్పింది. ఆ చిత్రం ఆశించిన విజయం సాధించక పోవడంతో తనకు కొత్తగా అవకాశాలు రాలేదంది. అలా చాలా ఏళ్లే ఎదురు చూసిన తరువాత ఇప్పుడు అవకాశాలు వస్తున్నాయని పేర్కొంది. చాలా మంది పెళ్లి గురించి అడుగుతున్నారనీ, ఆడమగ కలిసి జీవించడానికి పెళ్లి చేసుకోవాల్సిన అవసరం లేదని అంది. నా వరకూ వివాహ బంధంపై నమ్మకం లేదని చెప్పింది. నేనెవరినైనా ఇష్టపడితే అతనితో పెళ్లి చేసుకోకుండానే కలిసి సహజీవనం చేస్తానంది. ఇంకా చెప్పాలంటే 2030 తరువాత దేశంలోనే ఈ వివాహ సంప్రదాయమే ఉండదని అంది. ఆడామగా కలిసి జీవించే సంస్కృతే ఉంటుందని, అది మనం చూడబోతున్నాం అని పేర్కొంది. అయినా పెళ్లి చేసుకున్న వారందరూ కలిసే జీవిస్తున్నారా? అంటూ ప్రశ్నించింది. తాను ఒక సారి ప్రేమలో ఓడి పోయానని, అప్పట్లో అందమైన అబ్బాయిలకు ప్రాధాన్యం ఇచ్చానని చెప్పింది. ఇప్పుడు అందాన్ని మించి విషయాన్ని చూసే పరిపక్వత పొందానని చెప్పుకొచ్చింది. -
విలన్‌గా...మరో హీరో
మహేశ్‌బాబు హీరోగా ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో రూపొందుతోన్న సినిమాలో దర్శకుడు కమ్ హీరో అయిన ఎస్.జె. సూర్య విలన్‌గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడీ సినిమాలో విలన్‌గా నటిస్తున్నట్లు మరో హీరో కూడా ప్రకటించారు. అతను ఎవరో కాదు... ‘ప్రేమిస్తే’ చిత్ర ఫేమ్ భరత్. ఇప్పటివరకూ భరత్ నెగిటివ్ రోల్ చేయలేదు. మహేశ్ సినిమాతో విలన్‌గా ఎంట్రీ ఇస్తున్నారు. అహ్మదాబాద్‌లో జరుగుతోన్న సినిమా షూటింగ్లో భరత్ కొన్ని రోజులు పాల్గొన్నారు. ఈ షెడ్యూల్ తర్వాత బ్యాంకాక్, హైదరాబాద్, పుణేలలో జరగబోయే షెడ్యూల్స్‌లోనూ పాల్గొననున్నారు. ‘‘మహేశ్ ఫ్రెండ్లీ కో–స్టార్. ఈ సినిమాలో ఛాన్స్ రావడం సంతోషంగా ఉంది. దర్శకుడు నా పాత్రను ఆసక్తికరంగా రాశారు’’ అని భరత్ తెలిపారు. ‘ఠాగూర్’ మధు, ఎన్వీ ప్రసాద్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి ‘సంభవామి’ అనే టైటిల్ ఖరారు చేసినట్టు సమాచారం. -
తెలుగు తెరపై మరో వందకోట్ల సినిమా..?
తెలుగు సినిమా బడ్జెట్ పరిధులు చెరిగిపోతున్నాయి. రీజినల్ సినిమా కూడా వందకోట్ల వసూళ్లు సాధించగలదని తేలిపోవటంతో ఇప్పుడు భారీ బడ్జెట్ సినిమాలను నిర్మించడానికి నిర్మాతలు సన్నద్దమవుతున్నారు. ఇప్పటికే బాహుబలి, పులి లాంటి సినిమాలు వెండితెర మీద సందడి చేయగా.., మరిన్ని చిత్రాలు అదే కోవలో రూపొందనున్నాయి. తాజాగా పవన్ కళ్యాణ్ కొత్త సినిమాపై ఇలాంటి వార్తే బయటకు వచ్చింది. ముందుగా ఈ సినిమాకు దర్శకుడిగా ఎస్ జె సూర్యను ప్రకటించారు. అయితే చివరి నిమిషంలో గోపాల గోపాల దర్శకుడు డాలీని తీసుకొని షూటింగ్ కార్యక్రమాలు మొదలుపెట్టడానికి రెడీ అవుతున్నారు. చిత్రయూనిట్ నుంచి బయటకు రాకముందే సినిమా విశేషాలను తెలియజేస్తూ ఓ ఇంటర్వ్యూ ఇచ్చారు సూర్య. ఈ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విశేషాలను వెల్లడించారు. పవన్ హీరోగా తెరకెక్కుతున్న కొత్త సినిమాకు వందకోట్ల బడ్జెట్‌ను కేటాయించినట్టు తెలిపారు. సినిమాలో పవన్ రాయలసీమ ఫ్యాక్షనిస్టుగా నటిస్తున్నారని, సినిమా అంతా పంచెకట్టులోనే ఉంటారని తెలిపారు. అయితే తనకు రాయలసీమ ప్రాంతంపై అవగాహన లేని కారణంగా కథాకథనంలో ఆకుల శివ సహాయం తీసుకున్నట్టు తెలిపారు. ఈ ఇంటర్వ్యూ ఇచ్చిన కొద్ది రోజులకే సూర్య ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారు. మరి ప్రస్తుత దర్శకుడు డాలీ, సూర్య ప్లాన్ చేసినట్టుగానే తెరకెక్కిస్తాడో లేదో చూడాలి. -
పవన్ మాట నిలబెట్టుకున్నాడా?
సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాతో నిరాశపరిచిన పవన్ ప్రస్తుతం తన నెక్ట్స్ సినిమా మీద దృష్టిపెట్టాడు. ఇప్పటికే కథ కూడా రెడీ అయిపోయినా సాంకేతిక నిపుణులు, నటీనటుల ఎంపిక జరుగుతోంది. ముందుగా ఈ సినిమాను తమిళ దర్శకుడు ఎస్ జె సూర్య దర్శకత్వంలో చేయాలని భావించిన పవన్, ఆ తర్వాత మరో దర్శకుడితో చేసేందుకు రెడీ అవుతున్నాడు. గోపాల గోపాల సినిమా ఆడియో ఫంక్షన్ లో ఆ చిత్ర దర్శకుడు డాలీకి, సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్ కు మరో అవకాశం ఇస్తానంటూ సభాముఖంగా పవన్ చెప్పాడు. ఇప్పుడు తన తాజా చిత్రానికి ఆ ఇద్దరి తీసుకున్నాడు. సంగీత దర్శకుడిగా అనూప్ ను ఎప్పుడో కన్ఫామ్ చేసిన పవన్, ఇటీవలే డాలీని దర్శకుడిగా ఎనౌన్స్ చేశాడు. దాంతో... అప్పుడు ఇచ్చిన మాట ప్రకారమే పవన్ వాళ్లకు చాన్స్ ఇచ్చాడని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. -
'కడప కింగ్'గా పవన్ కళ్యాణ్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొత్త సినిమా పై రోజుకో వార్త హల్ చల్ చేస్తోంది. ఇప్పటికే లాంఛనంగా ప్రారంభమైన ఈ సినిమా త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ కు వెళ్లనుంది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబందించిన ప్రీ ప్రొడక్షన్ పనులను పూర్తి చేసే పనిలో ఉన్నాడు దర్శకుడు ఎస్ జే సూర్య. నటీనటులు సాంకేతిక నిపుణుల ఎంపిక కూడా పూర్తి కావచ్చింది. అయితే ఈసినిమా ప్రారంభం అయిన సమయంలో హుషారు అనే వర్కింగ్ టైటిల్ తో సినిమాను చేస్తున్నట్టుగా తెలిపారు. అది ఫైనల్ టైటిల్ కాదని త్వరలోనే టైటిల్ వెల్లడిస్తామన్నారు. తాజాగా ఈ సినిమాకు టైటిల్ ఫిక్స్ చేశారన్న టాక్ వినిపిస్తోంది. చిత్ర నిర్మాత శరత్ మరార్ ఫిలిం ఛాంబర్ లో కడప కింగ్ అనే టైటిల్ ను రిజిస్టర్ చేశారు. అయితే ఇదే పవన్ సినిమా టైటిల్ అన్న టాక్ వినిపిస్తోంది. సినిమా ఓపెనింగ్ సమయంలో పవన్ ఫ్యాక్షనిస్ట్ లా తెల్ల బట్టల్లో కనిపించటం కూడా ఈ వార్తలకు బలం చేకూరుస్తోంది. నిజంగానే పవన్ సినిమా టైటిల్ కడప కింగా కాదా తెలియాలంటే మాత్రం అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ వరకు వెయిట్ చేయాల్సిందే. -
పవన్‌కి విలన్‌గా సూర్య ఫ్రెండ్
చత్రపతి, విక్రమార్కుడు సినిమాలతో నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న అజయ్, ఆ తరువాత ఆకట్టుకునే పాత్రల్లో కనిపించలేదు. ముఖ్యంగా టాలీవుడ్లో అజయ్ తరహా పాత్రలు చేసే నటీనటులు చాలా మంది ఉండటంతో పెద్దగా వెండితెర మీద కనిపించలేదు. అయితే ఇటీవల ఓ గోల్డెన్ ఛాన్స్‌తో వెండితెర మీద సత్తా చాటిన ఈ యువ నటుడు ఇప్పుడు భారీ ఆఫర్స్‌తో దూసుకుపోతున్నాడు. సూర్య హీరోగా తెరకెక్కిన 24 సినిమాలో విలన్ పాత్రకు నమ్మకస్తుడైన అనుచరుడు మిత్రాగా నటించాడు అజయ్. సినిమా అంతా కనిపించే కీలక పాత్రలో నటించిన అజయ్ తెలుగుతో పాటు తమిళ ఆడియన్స్‌నూ మెప్పించాడు. అదే జోరులో ఇప్పుడు టాలీవుడ్లో కూడా ఓ స్టార్ హీరో సినిమాలో నెగెటివ్ రోల్లో కనిపించబోతున్నాడు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ఎస్‌జె సూర్య దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా కోసం అజయ్‌ను విలన్‌గా ఎంపిక చేశారు. ఈ సినిమా రిలీజ్ తరువాత తనకు మరిన్ని అవకాశాలు వస్తాయన్న నమ్మకంతో ఉన్నాడు అజయ్. -
మహేశ్‌కి విలన్‌గా సూర్య!
మహేశ్‌బాబు హీరోగా ఎ.ఆర్. మురుగదాస్ దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషల్లో ఓ చిత్రం రూపొందనున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో విలన్‌గా దర్శకుడు ఎస్.జె. సూర్య నటిస్తారనే వార్త ఇప్పటికే ప్రచారంలో ఉంది. మరోవైపు రజనీకాంత్ ‘2.0’లో విలన్‌గా నటిస్తున్న హిందీ నటుడు అక్షయ్‌కుమార్ పేరు కూడా వినిపించింది. ఫైనల్లీ యస్.జె. సూర్య ఖరారయ్యారు. ఈ విషయాన్ని చిత్రదర్శకుడు మురుగదాస్ స్వయంగా ప్రకటించారు. దర్శకుడిగా తమిళంలో ‘వాలి’, తెలుగులో ‘ఖుషి’ చిత్రాలు సూర్యకు మంచి పేరు తెచ్చాయి. ఇంకా ఆయన పలు చిత్రాలకు దర్శకత్వం వహించడంతో పాటు హీరోగానూ నటించారు. ఇప్పుడు మహేశ్‌బాబు సినిమాలో విలన్‌గా కనిపించనున్నారు. వచ్చే నెల 15న ఈ చిత్రం షూటింగ్ ఆరంభమయ్యే అవకాశం ఉంది. ఒకవైపు ఈ చిత్రంలో నటిస్తూనే మరోవైపు పవన్ కల్యాణ్ హీరోగా తాను దర్శకత్వం వహించనున్న చిత్రంతో ఎస్.జె. సూర్య బిజీ కానున్నారు. -
మహేష్, పవన్ లతో ఒకేసారి
ఇద్దరు టాప్ హీరోలతో ఒకేసారి కలిసి పనిచేయటం ఎవరికైనా అరుదైన అవకాశమే. అలాంటి అరుదైన అవకాశాన్ని సొంతం చేసుకున్నాడు కోలీవుడు నటుడు, దర్శకుడు ఎస్ జె సూర్య. దర్శకుడిగా టాలీవుడ్, కోలీవుడ్‌లలో విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించాడు సూర్య. తరువాత తమిళ ఇండస్ట్రీలో హీరోగా మారి మంచి విజయాలు సాధించాడు. కేవలం హీరోగానే కాక క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే కొంతకాలంగా తమిళనాట సక్సెస్ లేక ఇబ్బంది పడుతున్న ఎస్‌జె సూర్య ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీ మీద దృష్టి పెట్టాడు. గతంలో ఖుషీ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ అందించిన పవన్ కళ్యాణ్ హీరోగా మరో సినిమాను తెరకెక్కించే పనిలో ఉన్నాడు. ఈ సినిమాను డైరెక్ట్ చేస్తూనే మరో తెలుగు స్టార్ హీరో మహేష్ సినిమాలో విలన్‌గా నటించే ఛాన్స్ కొట్టేశాడు. తమిళ స్టార్ డైరెక్టర్ మురుగదాస్ దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ చిత్రంలో ఎస్ జె సూర్య విలన్‌గా నటిస్తున్నాడు. ఒకేసారి ఇలా ఇద్దరు టాప్ స్టార్స్‌తో కలిసి పనిచేసే అవకాశం రావటంపై సూర్య ఆనందంగా ఉన్నాడు. త్వరలోనే ఈ రెండు సినిమాలు సెట్స్ మీదకు వెళ్లనున్నాయి. -
అబ్బాయ్‌తో ఢీ అంటున్న బాబాయ్
మెగా ఫ్యామిలీలో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరికీ అర్థం కావటంలేదు. అంతలోనే కలిసిపోయినట్టుగా కనిపిస్తారు. వెంటనే ఢీ అంటారు. ఇటీవల పలు సందర్భాల్లో మెగా ఫ్యామిలీ అంతా ఒక్కటే అంటూ ప్రకటించే ప్రయత్నం చేసిన హీరోలు.., ఇప్పుడు మరోసారి వెండితెర మీద ఢీ కొడుతున్నారు. దీంతో మరోసారి మెగా ఫ్యామిలీలో ఏం జరుగుతోంది అన్న చర్చ తెర మీదకు వచ్చింది. ప్రస్తుతం తనీఒరువన్ రీమేక్‌గా తెరకెక్కుతున్న ధృవ సినిమాలో నటిస్తున్నాడు రామ్ చరణ్. ఈ సినిమా ప్రారంభానికి ముందే దసరాకే సినిమా రిలీజ్ అంటూ ప్రకటించారు. అనుకున్నట్టుగా షూటింగ్ కార్యక్రమాలు కూడా ఊపందుకున్నాయి. బ్రూస్ లీ రిజల్ట్‌తో నిరాశ పరిచిన చరణ్, వీలైనంత త్వరగా అభిమానులను సక్సెస్‌తో పలకరించాలనుకుంటున్నాడు. అయితే అదే సమయంలో బరిలో దిగడానికి రెడీ అవుతున్నాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఇప్పటికే ఎస్‌జె సూర్య దర్శకత్వంలో సినిమా ప్రారంభించిన పవన్, త్వరలోనే రెగ్యులర్ షూటింగ్‌కు వెళ్తున్నాడు. ఈ సినిమాను ఎలాగైనా మూడు నెలల్లో పూర్తి చేసి విజయదశమికి విడుదల చేయాలని భావిస్తున్నాడు. ఈ విషయాన్ని దర్శకుడు స్వయంగా ప్రకటించటంతో మరోసారి మెగా వార్ అన్న వార్తలు తెర మీదకు వచ్చాయి. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఈ రెండు సినిమాలు అనుకున్న సమయానికి రిలీజ్ కావటం కష్టం అన్న టాక్ వినిపిస్తోంది. చరణ్ తన సినిమాతో పాటు, చిరు సినిమా నిర్మాణం కూడా చేస్తున్నాడు. దీంతో ధృవ ఆలస్యం అయ్యే అవకాశం ఉందన్న టాక్ వినిపిస్తోంది. ఇక పవన్ సినిమా ఇంకా మొదలే కాలేదు కాబట్టి మూడు నెలల్లో ప్రేక్షకుల ముందుకు తీసుకురావటం అసాధ్యం అంటున్నారు. మరి ఇవే కారణాలతో వెనక్కుతగ్గుతారా..? లేక బాబాయ్, అబ్బాయిలు ఢీ అంటారా..? చూడాలి. -
అదిరేటి ఆఫర్?
తెలుగులో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్‌లో రకుల్ ప్రీత్‌సింగ్ ఒకరు. ఆమె కెరీర్ దూకుడు మీద ఉంది. స్టార్ హీరోల సరసన జతకడుతూ, బిజీ బిజీగా సినిమాలు చేసేస్తున్నారు రకుల్. ప్రస్తుతం ఫిలింనగర్లో ఆమె గురించి ఓ వార్త హల్చల్ చేస్తోంది. పవన్ కల్యాణ్ సరసన రకుల్ అవకాశం దక్కించుకున్నారన్నది ఆ వార్త సారాంశం. ఎస్.జె. సూర్య దర్శకత్వంలో పవన్ కల్యాణ్ హీరోగా ఓ చిత్రం రూపొందనున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో రకుల్‌ని కథానాయికగా తీసుకోవాలనుకుంటున్నారట. అదే కనుక జరిగితే.. వరుసగా మెగా హీరోల సరసన రకుల్ జతకడుతున్నట్లు అవుతుంది. రామ్‌చరణ్ సరసన ‘బ్రూస్లీ’, అల్లు అర్జున్‌తో ‘సరైనోడు’లో జతకట్టారు రకుల్. మళ్లీ రామ్‌చరణ్‌తో ‘ధ్రువ’ చేస్తున్నారు. ఒకవైపు అబ్బాయ్‌తో జతకట్టిన రకుల్ మరోవైపు బాబాయ్ పవన్ కల్యాణ్ చిత్రం కూడా అంగీకరించారట. మరి.. ఈ వార్తలో ఎంతవరకూ నిజం ఉందో నిలకడ మీద తెలుస్తుంది. -
పవర్ స్టార్ క్లారిటీ ఇచ్చేశాడు
సర్ధార్ గబ్బర్‌సింగ్ సినిమాతో నిరాశపరిచిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ప్రస్తుతం వరుస సినిమాలకు రెడీ అవుతున్నాడు. త్వరలోనే సినిమాల నుంచి రిటైర్ కావాలని నిర్ణయించుకున్న పవన్, ఈలోగా వీలైనన్ని ఎక్కువ సినిమాలు చేసే ఆలోచనలో ఉన్నాడు. అందుకే ఒక సినిమా సెట్స్ మీద ఉండగానే మరో రెండు సినిమాలను లైన్లో పెట్టేశాడు. ఈ సినిమాలతో తన సన్నిహితులకు మేలు జరిగేలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ప్రస్తుతం శరత్ మరార్ నిర్మాత ఎస్ జె సూర్య దర్శకత్వంలో సినిమా చేయబోతున్నాడు పవన్. ఈ సినిమాతో నిర్మాతగా నష్టాలను ఎదుర్కొన్న శరత్ మరార్తో పాటు, కెరీర్ పరంగా ఇబ్బందుల్లో ఉన్న ఎస్ జె సూర్యకు బ్రేక్ ఇవ్వాలనుకుంటున్నాడు. మరోసారి ఖుషి లాంటి భారీ హిట్‌తో అభిమానులన అలరించడానికి ప్లాన్ చేసుకుంటున్నాడు. ఆ తరువాత, దాసరి నారాయణరావుకు ఇచ్చిన మాట ప్రకారం ఆయన నిర్మాణంలో త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమాకు అంగీకరించాడు. ఈ రెండు సినిమాలతో పాటు తనకు గబ్బర్‌సింగ్ లాంటి సూపర్ హిట్ ఇచ్చి, తరువాత పెద్దగా ఆకట్టుకోలేకపోయిన హరీష్ శంకర్‌తోనూ సినిమా చేసే ఆలోచనలో ఉన్నాడు. ఈ సినిమాను ఎఎమ్ రత్నం బ్యానర్లో చేయాలని నిర్ణయించుకున్నాడు. ఇలా గతంలో తనకు సాయం చేసిన వారందరికీ తిరిగి సాయం చేస్తున్నాడు పవర్ స్టార్. -
గబ్బర్‌సింగ్ డైరెక్టర్‌కి మరో ఛాన్స్
దాదాపు పుష్కర కాలం పాటు ఒక్క హిట్ కూడా లేని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ను తిరిగి ఫాంలోకి తీసుకు వచ్చిన సినిమా గబ్బర్‌సింగ్. పవన్ మార్కెట్ స్టామినా ఏంటో ప్రూవ్ చేసిన ఈ సినిమాతో దర్శకుడు హరీష్ శంకర్ కూడా స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్నాడు. కానీ తరువాత చేసిన రామయ్య వస్తారవయ్య డిజాస్టర్ కావటంతో సీన్ రివర్స్ అయ్యింది. హరీష్‌కి అవకాశాల కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. రామయ్య వస్తావయ్య ఫ్లాప్ తరువాత కాస్త గ్యాప్ తీసుకున్న హరీష్, సాయి ధరమ్ తేజ్ హీరోగా తెరకెక్కిన సుబ్రమణ్యం ఫర్ సేల్ సినిమాతో సక్సెస్ సాధించాడు. అదే జోరులో ఇప్పుడు పవన్ కళ్యాణ్‌తో మరో సినిమాకు రెడీ అవుతున్నాడు. ప్రస్తుతం ఎస్ జె సూర్య దర్శకత్వంలో హుషారు(వర్కింగ్ టైటిల్) లో నటిస్తున్న పవన్, ఆ తరువాత దాసరి నిర్మాతగా త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా అంగీకరించాడు. ఈ సినిమాతో పాటు తనకు ఖుషి లాంటి సూపర్ హిట్ సినిమా అందించిన ఏఎం రత్నం బ్యానర్లో సినిమా చేయడానికి అంగీకరించాడు. ఈ సినిమాను హరీష్ శంకర్ డైరెక్షన్లో తెరకెక్కించాలని ప్లాన్ చేస్తున్నాడు రత్నం. ఇప్పటికే పవర్ స్టార్ కోసం ఓ లైన్ వినిపించిన హరీష్, ప్రస్తుతం ఫుల్ స్క్రిప్ట్ రెడీ చేసే పనిలో ఉన్నాడు. -
పవన్ రెమ్యూనరేషన్ అంతా..?
సర్దార్ గబ్బర్‌సింగ్ సినిమాతో నిరాశపరిచిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ప్రస్తుతం తన నెక్ట్స్ సినిమా మీద దృష్టిపెట్టాడు. మరోసారి తన ఫ్రెండ్ శరత్ మరార్ నిర్మాణంలో తెరకెక్కనున్న సినిమాలో నటించడానికి రెడీ అవుతున్నాడు. తన కెరీర్‌ను ములుపు తిప్పిన, ఖుషీ లాంటి బ్లాక్ బస్టర్ సినిమా అందించిన ఎస్ జె సూర్య దర్శకత్వంలో ఈ సినిమా చేయనున్నాడు పవన్. ఇప్పటికే లాంఛనంగా ప్రారంభమైన ఈ సినిమా త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది. అయితే తాజాగా ఈ సినిమాకు సంబందించిన ఓ వార్త టాలీవుడ్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది. పవన్ తన నెక్ట్స్ సినిమాకు భారీ రెమ్యూనరేషన్ అందుకోనున్నాడన్న టాక్ వినిపిస్తోంది. సర్దార్ గబ్బర్‌సింగ్ లాంటి భారీ డిజాస్టర్ తరువాత కూడా పవన్ కళ్యాణ్ క్రేజ్ ఏ మాత్రం తగ్గకపోవటంతో ఎంత రెమ్యూనరేషన్ అడిగినా ఇవ్వడానికి నిర్మాతలు రెడీ అవుతున్నారు. ముఖ్యంగా మాస్ ఆడియన్స్‌లో పవర్ స్టార్‌కు భారీ ఫాలోయింగ్ ఉంది. అందుకే సినిమాకు యావరేజ్ టాక్ వచ్చినా, పాత రికార్డులన్ని తుడిచిపెట్టుకుపోతాయన్న నమ్మకంతో ఉన్నారు మేకర్స్. దీంతో ఏకంగా 25 కోట్ల భారీ రెమ్యూనరేషన్ ఇవ్వడానికి కూడా రెడీ అవుతున్నారట. -
పవన్‌కు జోడిగా మలయాళీ బ్యూటీ
భారీ అంచనాల మధ్య విడుదలైన సర్దార్ గబ్బర్‌సింగ్ నిరాశపరచటంతో తన నెక్ట్స్ సినిమా మీద దృష్టి పెట్టాడు పవన్ కళ్యాణ్. గతంలోలా.., లాంగ్ గ్యాప్ తీసుకోకుండా వెంటనే ఎస్ జె సూర్య డైరెక్షన్ లో ఓ సినిమాను ప్రారంభించాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న ఈ సినిమా త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది. గతంలో సర్దార్ గబ్బర్‌సింగ్ హీరోయిన్ ఎంపిక విషయంలో అభిమానులకు షాక్ ఇచ్చిన పవర్ స్టార్, మరోసారి అలాంటి నిర్ణయమే తీసుకోబోతున్నాడట. సర్దార్ గబ్బర్ సింగ్ షూటింగ్ మొదలు కాకముందు అనీషా ఆంబ్రోస్‌ను, ఆ సినిమాకు హీరోయిన్గా సెలెక్ట్ చేసినట్టు ప్రకటించాడు పవన్. అయితే అభిమానులు, ఇండస్ట్రీ వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత రావటంతో ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్న పవన్, కాజల్ అగర్వాల్‌ను హీరోయిన్గా ఫైనల్ చేశాడు. అయితే తన నెక్ట్స్ సినిమా విషయంలో కూడా ఇలాంటి నిర్ణయాన్నే పవన్ తీసుకున్నాడన్న టాక్ వినిపిస్తోంది. బెంగళూర్ డేస్ సక్సెస్‌తో ఆకట్టుకున్న మలయాళీ భామ పార్వతీ మీనన్‌ను హీరోయిన్గా తీసుకునే ఆలోచనలో ఉన్నాడు. మాలీవుడ్ లో పలు చిత్రాల్లో మెప్పించిన పార్వతి స్టార్ హీరోయిన్గా మాత్రం గుర్తింపు తెచ్చుకోలేదు. అలాంటి హీరోయిన్, పవన్ ఇమేజ్‌కు ఎలా సూట్ అవుతుందన్న డైలామాలో ఉన్నారు పవర్ స్టార్ ఫ్యాన్స్. మరి పవన్ ఈ సారి రిస్క్ చేస్తాడా.? లేక అభిమానుల కోరిక మేరకు స్టార్ హీరోయిన్ వైపు మొగ్గుచూపుతాడా..? చూడాలి. -
సేనాపతి హల్ చల్!
అభిమాన హీరో సినిమా మొదలైందంటే చాలు అభిమానులు పండగ చేసుకుంటారు. ఆ ఆనందంలో ఆ సినిమాకి ఏవేవో టైటిల్స్ పెట్టేస్తారు. పాత ఫొటోలతో ఫస్ట్ లుక్ కూడా విడుదల చేసేస్తారు. ఇప్పుడు పవన్ కల్యాణ్ అభిమానులు అదే చేశారు. ఆయన హీరోగా ఎస్.జె. సూర్య దర్శకత్వంలో శరత్ మరార్ నిర్మిస్తున్న చిత్రం ఇటీవల ఆరంభమైన విషయం తెలిసిందే. ఇది తమిళ ‘వీరమ్’కి రీమేక్ అనే వార్త ఆ తర్వాత ప్రచారంలోకొచ్చింది. కానీ, చిత్రబృందం మాత్రం ఈ విషయాన్ని ధ్రువీకరించలేదు. తాజాగా.. ఈ చిత్రానికి ‘సేనాపతి’ అనే టైటిల్ అనుకుంటున్నారనే మరో వార్త ప్రచారంలోకొచ్చింది. ఈ టైటిల్‌తో ఓ పోస్టర్ డిజైన్ చేసి, ఎవరో సామాజిక మాధ్యమంలోకి వదిలారు. అంతే.. కాసేపటికే ఆ పోస్టర్ ఇంటర్నెట్లో హల్చల్ చేయడం మొదలుపెట్టింది. చిత్రబృందం విడుదల చేసిన పోస్టర్ కాదు కాబట్టి, ఈ టైటిల్ నిజం కాదని అర్థమవుతోంది. మరి.. అసలు టైటిల్ ఏంటి? ఒకవేళ ఆ నోటా ఈ నోటా ఈ టైటిల్ పెట్టాలని దర్శక-నిర్మాతలు అనుకుంటున్నారని తెలిసే అభిమానులు పోస్టర్ డిజైన్ చేశారా? అన్నది తెలియడానికి ఎంతో కాలం పట్టదు. -
పవన్ కళ్యాణ్ కొత్త సినిమా ప్రారంభం
హైదరాబాద్: 'సర్దార్ గబ్బర్ సింగ్' ధియేటర్లలో ఉండగానే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొత్త సినిమాకు కొబ్బరికాయ కొట్టేశారు. ఎస్ జె సూర్య దర్శకత్వంలో నార్త్ స్టార్ ఎంటర్ టైన్ మెంట్ పతాకంపై పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కబోతున్న సినిమా షూటింగ్ ప్రారంభోత్సవ కార్యక్రమం బుధవారం హైదరాబాద్ లో నిరాడంబరంగా జరిగింది. దేవుడి చిత్రపటాలపై ముహూర్తపు షాట్ తీశారు. (మరిన్ని చిత్రాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి) : ముహూర్తపు షాట్ కు నిర్మాత సుధాకర్ రెడ్డి క్లాప్ కొట్టగా, ఎడిటర్ గౌతంరాజు కెమెరా స్విచ్ఛాన్ చేశారు. ఎస్ జె సూర్య మొదటి సన్నివేశాన్ని డైరెక్ట్ చేశారు. పవన్ కళ్యాణ్ వైట్ షర్ట్, పంచె కట్టుతో ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. 'సర్దార్ గబ్బర్ సింగ్' నిర్మాత శరత్ మారార్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఫ్యాక్షన్ లీడర్ లవ్ స్టోరీ నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ సినిమాకు ఇంకా టైటిల్ ఖరారు చేయలేదు. ఈ సినిమాకు అనూప్ రూబెన్స్ మ్యూజిక్ అందించనున్నాడు. కాగా, ఈ సినిమాను 29న ప్రారంభిస్తారని వార్తలు వచ్చాయి. పవన్ కళ్యాణ్-ఎస్ జె సూర్య కాంబినేషన్ లో వచ్చిన 'ఖుషి' సినిమా విడుదలై నేటికి 15 ఏళ్లు పూర్తి కావడం, ముహూర్తం కూడా కుదరడంతో ఈరోజే సినిమా ప్రారంభించారు. వీరిద్దరి కాంబినేషన్ లో ఇంతకుముందు రెండు సినిమాలు వచ్చాయి. -
పవన్ బిజీ అవుతున్నాడు
సర్దార్ గబ్బర్‌సింగ్ రిజల్ట్‌తో షాక్ తిన్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ఇప్పుడు వరుస సినిమాలకు కమిట్ అవుతున్నాడు. అతి త్వరలో సినిమాలకు స్వస్తి పలకాలనుకుంటున్న తరుణంలో వీలైనంత త్వరగా సినిమాలను పూర్తి చేసే పనిలో బిజీగా ఉన్నాడు. ఇప్పటికే నాలుగు సినిమాలకు ఓకే చెప్పేసిన పవన్, ఆ సినిమాలకు కథలు ఫైనల్ చేయనున్నాడు. మైత్రీ మూవీస్, 14 రీల్స్, పీవీపీ లాంటి భారీ సంస్థలు క్యూలో ఉన్నా వారిని కాదని తన స్నేహితులకే సినిమాలు చేయనున్నాడు. ముందుగా ఎస్ జె సూర్య డైరెక్షన్లో సినిమాను పట్టాలెక్కించడానికి రెడీ అవుతున్నారు. ఈ సినిమాను మరోసారి తన మిత్రుడు శరత్ మరార్ నిర్మాణంలోనే తెరకెక్కించనున్నారు. ఈ సినిమా తరువాత త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా పట్టాలెక్కనుంది, ఈ సినిమాను మైత్రీ మూవీస్ మేకర్స్ కోసం చేయాల్సి ఉన్నా ఇప్పుడు వారినీ కాదని త్రివిక్రమ్, శరత్ మరార్, హారికా అండ్ హాసిని క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ రెండు సినిమాలు పూర్తయిన తరువాత ముందుగా మాట ఇచ్చిన ప్రకారం దాసరి నారాయణరావు నిర్మాణంలో ఓ సినిమాకు అంగీకరించాడు. తనకు ఖుషి లాంటి బ్లాక్ బస్టర్ అందించిన ఏఎమ్ రత్నం బ్యానర్లో కూడా సినిమాకు ఓకే చెప్పాడు పవన్. ఈ నాలుగు సినిమాలతో తను ఆర్థికంగా సెటిల్ అయితే ఇక సినిమాలకు గుడ్ బై చెప్పాలని భావిస్తున్నాడు. -
మహేష్‌కు విలన్‌గా సూర్య..?
ప్రస్తుతం శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో బ్రహ్మోత్సవం సినిమాలో నటిస్తున్న మహేష్ బాబు.. తన నెక్ట్స్ సినిమాను భారీగా ప్లాన్ చేస్తున్నాడు. ఇప్పటికే తమిళ స్టార్ డైరెక్టర్ మురుగదాస్ దర్శకత్వంలో భారీ బడ్జెట్ యాక్షన్ ఎంటర్టైనర్లో నటిస్తున్నట్టుగా ప్రకటించాడు మహేష్. ఇప్పుడు ఆ సినిమా కోసం ఇంట్రస్టింగ్ కాంబినేషన్లను సెట్ చేసే పనిలో ఉన్నాడు. ఇప్పటికే కథా కథనాలు రెడీ అయిన ఈ సినిమా ఏప్రిల్ నెలాఖరుకల్లా సెట్స్ మీదకు వెళ్లనుంది. తెలుగు, తమిళ్‌తో పాటు హిందీలో కూడా ఒకేసారి తెరకెక్కుతున్న ఈ సినిమాలో విలన్ పాత్రకు తమిళ నటుడు, దర్శకుడు ఎస్ జె సూర్యను తీసుకోవాలని భావిస్తున్నారట. ఇప్పటికే పలుచిత్రాల్లో హీరోగా నటించిన సూర్య, ప్రస్తుతం విజయ్ సేతుపతి హీరోగా తెరకెక్కుతున్న ఇరైవిలో విలన్‌గా చేస్తున్నాడు. అదేబాటలో మహేష్ సినిమాకు సూర్యను తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాలో మహేష్‌కు జోడీ కోసం కూడా భారీ కసరత్తు చేస్తున్నారు. తమిళనటి సాయి పల్లవి, కీర్తి సురేష్‌లతో పాటు, బాలీవుడ్ బ్యూటీ పరిణీతి చోప్రా పేరు కూడా పరిశీలిస్తున్నారు. -
రిస్క్ చేస్తున్న పవర్‌స్టార్
ప్రస్తుతం టాలీవుడ్లో టాప్ క్రేజ్ ఉన్న స్టార్ హీరో ఎవరు అంటే వెంటనే గుర్తొచ్చే పేరు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. సినిమా సక్సెస్ ఫెయిల్యూర్‌తో సంబందం లేకుండా భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్న పవన్ ఇప్పుడో భారీ రిస్క్ చేస్తున్నాడు. తన కెరీర్‌ను మలుపు తిప్పిన హిట్‌తో పాటు అదే స్ధాయిలో భారీ ప్లాప్ కూడా ఇచ్చిన ఓ దర్శకుడితో మరోసారి కలిసి పని చేయాలని భావిస్తున్నాడు. పవన్ కళ్యాణ్‌ను యూత్ ఆడియన్స్‌కు దగ్గర చేసిన సక్సెస్ఫుల్ సినిమా ఖుషి. ఈ సినిమాతో ఒక్కసారిగా టాప్ స్టార్స్ లిస్ట్‌లో చేరిపోయిన పవన్, ఆ తరువాత వెనుదిరిగి చూసుకోలేదు. ఈ ఒక్క సక్సెస్, ఆ తరువాత పవన్ పదేళ్ల పాటు హిట్ ఇవ్వలేకపోయినా అతడి స్టార్ ఇమేజ్ను కాపాడింది. ఈ సినిమాకు దర్శకుడు ఎస్ జె సూర్య. ఖుషి లాంటి సినిమా ఇచ్చాడన్న నమ్మకంతో సూర్యతో కలిసి కొమరం పులి సినిమా చేశాడు పవన్. అయితే ఆ సినిమా పవన్ కెరీర్లోనే బిగెస్ట్ ఫ్లాప్‌గా నిలిచింది. అంతేకాదు అలాంటి కథ ఎంచుకున్నందుకు ఎన్నో విమర్శలు కూడా ఎదుర్కోన్నాడు. ఇప్పుడు మరోసారి అదే రిస్క్ చేయడానికి రెడీ అవుతున్నాడు పవర్ స్టార్. ప్రస్తుతం గబ్బర్‌సింగ్‌కు సీక్వల్గా తెరకెక్కుతున్న సర్థార్ గబ్బర్‌సింగ్ సినిమాలోనటిస్తున్న పవన్ కళ్యాణ్, ఆ సినిమా తరువాత ఎస్ జె సూర్య దర్శకత్వంలో మరో సినిమాకు రెడీ అవుతున్నాడు. ఈ సినిమాను రేణుదేశాయ్ నిర్మించే అవకాశం ఉందన్న టాక్ వినిపించినా ఫైనల్‌గా పవన్ స్నేహితుడు శరత్ మరార్ చేతికే వెళ్లింది. త్వరలోనే ఈ సినిమాకు సంబందించిన అఫీషియల్ ఎనౌన్స్మెంట్ రానుంది. -
సూర్య సార్‌తో రేణు దేశాయ్ లంచ్..
రేణు దేశాయ్ తన ట్విట్టర్ అకౌంట్లో పోస్ట్ చేసిన ఓ ఫోటో ఇప్పడు హల్చల్ చేస్తోంది. తమిళ దర్శకుడు, హీరో ఎస్‌జె సూర్యతో కలిసి లంచ్ చేస్తున్న ఫోటోను ఆమె తన ట్విట్టర్లో పోస్టు చేసి అభిమానులతో పంచుకున్నారు. 'న్యూ ఇయర్ లంచ్ విత్ సూర్య సార్' అంటూ రేణు దేశాయ్ ట్విట్ చేసింది. కొడుకు అఖీరా, కూతురు ఆద్య ...ఈ ఫోటో తీసారంటూ ఆమె పేర్కొంది. అంతకు ముందు రేణు దేశాయ్ నూతన సంవత్సరం సందర్భంగా అందరికీ హృదయ పూర్వక నూతన వత్సర శుభాకాంక్షలు అని ట్విట్టర్లో తెలిపింది. New year lunch with Surya sir...:) pic clicked by Akira &Aadya hiding behind me :D pic.twitter.com/Af5hSPSoPx — renu (@renuudesai) January 1, 2016 కాగా పవన్ కళ్యాణ్ కెరీర్‌ను మలుపు తిప్పిన సూపర్ హిట్ సినిమా ఖుషి. తమిళ దర్శకుడు ఎస్‌జె సూర్య దర్శకత్వంలో తెరకెక్కిన ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ అప్పట్లో సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే ఆ తర్వాత వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన 'కొమరం పులి' అనుకున్నంత విజయం సాధించలేదు. ఈ సినిమా పవన్ కెరీర్లోనే బిగెస్ట్ డిజాస్టర్ అనిపించుకోవటంతో ఎస్ జె సూర్య పూర్తిగా తెలుగు సినిమాలకు దూరమయ్యాడు. ఈ సినిమా తరువాత సూర్య తమిళ్లో చేసిన సినిమాలు కూడా పెద్దగా వర్క్ అవుట్ కాలేదు. వరుస ఫ్లాప్‌లతో కష్టాల్లో పడ్డ ఎస్‌జె సూర్యకు మరో ఛాన్స్ ఇచ్చే ఆలోచనలో ఉన్నాడట పవర్ స్టార్. దీంతో ఈ ఇద్దరి కాంబినేషన్లో ఖుషి సినిమాకు సీక్వెల్ తెరకెక్కనుందన్న టాక్ వినిపిస్తోంది. -
ఖుషి కాంబినేషన్ రిపీట్ అవుతుందా..?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్‌ను మలుపు తిప్పిన సూపర్ హిట్ సినిమా ఖుషి. తమిళ దర్శకుడు ఎస్‌జె సూర్య దర్శకత్వంలో తెరకెక్కిన ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ అప్పట్లో సంచలన విజయం సాధించింది. ఈ ఒక్క హిట్‌తో పవన్ కళ్యాణ్ యూత్ ఐకాన్‌గా టాప్ క్రేజ్ సొంతం చేసుకున్నాడు. ఈ సినిమా సక్సెస్ పవన్ కెరీర్‌కే కాదు.. డైరెక్టర్ సూర్య కెరీర్‌కు కూడా చాలా ప్లస్ అయ్యింది. ఖుషి సినిమా తరువాత కొమరం పులి సినిమా కోసం మరోసారి కలిసి పని చేసిన పవన్, ఎస్ జె సూర్యలు ఆకట్టుకోలేకపోయారు. ఈ సినిమా పవన్ కెరీర్లోనే బిగెస్ట్ డిజాస్టర్ అనిపించుకోవటంతో ఎస్ జె సూర్య పూర్తిగా తెలుగు సినిమాలకు దూరమయ్యాడు. ఈ సినిమా తరువాత సూర్య తమిళ్లో చేసిన సినిమాలు కూడా పెద్దగా వర్క్ అవుట్ కాలేదు. వరుస ఫ్లాప్‌లతో కష్టాల్లో పడ్డ దర్శకుడికి మరో ఛాన్స్ ఇచ్చే ఆలోచనలో ఉన్నాడట పవర్ స్టార్. బ్లాక్ బస్టర్ హిట్‌తో తన కెరీర్‌ను మలుపు తిప్పిన ఎస్ జె సూర్య దర్శకత్వంలో మరో సినిమా చేసే ఆలోచనలో ఉన్నాడు పవర్ స్టార్. ఈ ఇద్దరి కాంబినేషన్లో ఖుషి సినిమాకు సీక్వల్ తెరకెక్కనుందన్న టాక్ వినిపిస్తోంది. అయితే ఇప్పటి వరకు కథా కథనాల విషయంలో క్లారిటీ లేకపోయినా ఖుషి కాంబినేషన్ రిపీట్ అవ్వటం మాత్రం ఖాయం అంటున్నారు ఇండస్ట్రీ వర్గాలు. -
రేణూ దేశాయ్ 'ఇష్క్ వాలా లవ్' వర్కింగ్ స్టిల్స్
-
మరాఠీలో రేణూ డెరైక్షన్
‘మంగళాష్టక్ వన్స్ మోర్’ అనే మరాఠీ చిత్రం ద్వారా నిర్మాతగా మారిన రేణూ దేశాయ్ ఇప్పుడు దర్శకురాలిగా తన ప్రతిభ చాటుకోవడానికి రెడీ అయ్యారు. తొలి ప్రయత్నంగా ‘ఇష్క్ వాలా లవ్’ అనే సినిమాని స్వీయదర్శకత్వంలో రూపొందించనున్నారు రేణు. ఈ చిత్రానికి దర్శకుడు, నటుడు ఎస్.జె. సూర్య పాటలు స్వరపరచడం విశేషం. రెండు పాటలకు స్వరాలందించారాయన. వైశాలీ సమంత్ ఓ పాట పాడగా రికార్డ్ చేశారు. ఆదినాథ్ కొతారే కథానాయకునిగా నటించనున్న ఈ చిత్రానికి ముందుగా అమృతా కన్విల్కర్ని కథానాయికగా తీసుకున్నారు. అయితే ఇప్పుడామె స్థానంలో సులగ్నా పాణిగ్రాహిణిని హీరోయిన్గా ఎంపిక చేశారు రేణూ దేశాయ్. హిందీలో పలు టీవీ సీరియల్స్ చేసి, ‘మర్డర్ 2’లో నటించిన సులగ్నాకి మరాఠీలో ఇది మొదటి సినిమా. నిర్మాతగా ‘మంగళాష్టక్ వన్స్ మోర్’ రేణూకి మంచి అనుభూతినే మిగిల్చింది. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ కాకపోయినా ‘భేష్’ అనిపించుకుంది. మరి... దర్శకురాలిగా ఆమెకు ఎలాంటి అనుభూతి ఎదురవుతుందో కాలమే చెప్పాలి.