![Amitabh Bachchan to make his Tamil debut in SJ Suryah's Uyarntha Manithan - Sakshi](/styles/webp/s3/article_images/2019/04/2/amithab-bachan.jpg.webp?itok=O8v02T4i)
బాలీవుడ్ సూపర్‌స్టార్ అమితాబ్ బచ్చన్ పంచె, ధోతి ధరించి అచ్చమైన సౌతిండియన్‌లా మారిపోయారు. ‘నాన్ తమిళన్’ (నేను తమిళీయుడిని) అంటూ కొత్త లుక్‌తో పోజులిచ్చారు కూడా. ఇదంతా తమిళ చిత్రం ‘ఉయంర్ద మణిదన్’ కోసం. అమి తాబ్ బచ్చన్ నటిస్తున్న తొలి తమిళ చిత్రం ఇదే కావడం విశేషం. ఎస్.జె. సూర్య, అమితాబ్ బచ్చన్ ముఖ్యపాత్రల్లో కృష్ణన్ తెరకెక్కిస్తున్న ద్విభాషా (హిందీ, తమిళ) చిత్రమిది. ఈ సినిమా షూటింగ్‌లో ఆదివారం నుంచి పాల్గొంటున్నారు అమితాబ్ బచ్చన్. అమితాబ్‌తో కలసి పని చేయడం గురించి సూర్య తన ఆనందాన్ని వ్యక్తపరుస్తూ– ‘‘నా జీవితంలో మరువలేని క్షణాలివి. అమితాబ్‌గారితో యాక్ట్ చేయాలనే నా కల నెరవేరుతోంది. దేవుడికి, మా అమ్మానాన్నలకు థ్యాంక్స్’’ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment