సూపర్‌స్టార్ కొత్త సినిమా షురూ.. 32 ఏళ్ల తర్వాత మళ్లీ అలా! | Rajinikanth New Movie Thalaivar 170 Shooting Starts From October 4, Deets Inside - Sakshi
Sakshi News home page

Thalaivar170 Movie Update: 'జైలర్' తర్వాత రజనీ కొత్త మూవీ.. లాంఛనంగా ప్రారంభం

Published Wed, Oct 4 2023 6:24 PM | Last Updated on Wed, Oct 4 2023 6:54 PM

Rajinikanth New Movie Thalaivar 170 Shooting Start - Sakshi

కొన్నేళ్లుగా హిట్ లేక సూపర్‌స్టార్ రజనీకాంత్ క్రేజ్ చాలావరకు పడిపయింది. వయసు కూడా 70ల్లోకి వచ్చేసరికి ఇక రిటైర్మెంట్ తీసుకుంటే బెటర్ అనే కామెంట్స్ వినిపించాయి. ఇలాంటి సమయంలో 'జైలర్' మూవీతో అదిరిపోయే కమ్‌బ్యాక్ ఇచ్చారు. ఈ జోష్ లోనే ఇప్పుడు మరో కొత్త చిత్రాన్ని ప్రారంభించారు. తాజాగా షూటింగ్ మొదలైంది. అయితే ఈ సినిమాకి చాలా ప్రత్యేకతలు ఉన్నాయండోయ్.

(ఇదీ చదవండి: 'దేవర' నుంచి సర్‌ప్రైజ్.. బాహుబలి, పుష్ప రూట్‌లోనే)

'జైలర్'తో బ్లాక్‌బస్టర్ సక్సెస్ అందుకున్న రజనీకాంత్.. ఇప్పుడు 'జై భీమ్' ఫేమ్ జ్ఞానవేల్ దర్శకత్వంలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి ప్రస్తుతం 'తలైవర్ 170' అనే వర్కింగ్ టైటిల్ పెట్టారు. త్రివేండ్రంలో బుధవారం ఈ చిత్ర షూటింగ్ లాంఛనంగా ప్రారంభమైంది. అందుకు సంబంధించిన ఫొటోల్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. 'జైలర్'తో పోలిస్తే రజనీ లుక్ మొత్తం మారిపోయింది.

ఇకపోతే ఈ సినిమాలో రజనీతో పాటు అమితాబ్ బచ్చన్, ఫహాగ్ ఫాజిల్, మంజు వారియర్, రానా, రితికా సింగ్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. అనిరుధ్ సంగీతమందిస్తున్నాడు. లైకా ప్రొడక్షన్స్ భారీ బడ్జెట్‌తో దీన్ని నిర్మిస్తోంది. అయితే రజనీ-అమితాబ్.. దాదాపు 32 ఏళ్ల తర్వాత కలిసి నటించబోతుండటం విశేషం. అలానే ఈ సినిమా నిజ జీవిత సంఘటన ఆధారంగా తీస్తున్నట్లు సమాచారం.

(ఇదీ చదవండి: హీరోయిన్ పూజాహెగ్డేకి గాయం.. ఆ ఫొటో వైరల్!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement