కొంతకాలంగా అమితాబ్ బచ్చన్ ఇంట్లో అద్దెకు ఉంటున్నారు ఆయుష్మాన్ ఖురానా. తాజాగా ఆ ఇల్లు ఖాళీ చేశారట. ఇంతకీ అమితాబ్ ఇంట్లో ఆయుష్మాన్ అద్దెకు ఉండటం ఏంటీ అనుకుంటున్నారా? ‘గులాబో సితాబో’ సినిమా కోసమే. అమితాబ్ బచ్చన్, ఆయుష్మాన్ ఖురానా ముఖ్యపాత్రల్లో సుజిత్ సర్కార్ దర్శకత్వం వహించిన చిత్రం ‘గులాబో సితాబో’. అమితాబ్ బచ్చన్ ఇంటి ఓనర్ పాత్రలో, ఆయుష్మాన్ ఆ ఇంట్లో అద్దెకు ఉండే పాత్రలో నటించారు. ఈ చిత్రం షూటింగ్ ఇటీవలే పూర్తయింది. వచ్చే ఏడాది ఏప్రిల్‌లో ఈ చిత్రం రిలీజ్. ‘అమితాబ్‌గారితో యాక్ట్ చేయడం ఆనందంగాను, కొంచెం కంగారుగానూ అనిపించింది’ అని పేర్కొన్నారు ఆయుష్మాన్.
Comments
Please login to add a commentAdd a comment