అమితాబ్ బచ్చన్
‘సింగిల్ టేక్ ఆర్టిస్ట్ ఇక్కడ’ అనే డైలాగులు సినిమాల్లో సరదా సందర్భాల్లో చాలానే వింటుంటాం. కానీ మన ఇండియన్ ఇండస్ట్రీల్లో అలాంటి యాక్టర్స్ చాలా మందే ఉన్నారు. అందులో అమితాబ్ బచ్చన్ కూడా ఒకరు. అమితాబ్ తాజాగా తన నటనతో ‘చెహర్’ చిత్రబృందాన్ని ఆశ్చర్యానికి గురి చేశారట. ఇమ్రాన్ హష్మీ, అమితాబ్ బచ్చన్, కృతీ కర్బందా, రియా చక్రవర్తి ముఖ్య పాత్రల్లో రుమీ జాఫ్రీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘చె హర్’. మిస్టరీ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో అమితాబ్ లుక్ డిఫరెంట్‌గా ఉండబోతోంది.
ఈ సినిమాలో 14 నిమిషాల సన్నివేశాన్ని సింగిల్ టేక్‌లో చేశారట అమితాబ్. అంత లెంగ్తీ సీన్‌ని ఒకే ఒక్క టేక్‌లో చేయడం అంటే చిన్న విషయం కాదు. అందుకే టీమ్ అంతా నిలబడి అమితాబ్‌కు చప్పట్లు కొట్టారట. ఈ విషయాన్ని ఆ చిత్ర సౌండ్ డిజైనర్ రసూల్ పూకుట్టి తెలిపారు. ‘‘అమితాబ్‌గారు ఇవాళ ఇండియన్ సినిమా చరిత్రలో మరో అద్భుతం సృష్టించారు. 14 నిమిషాలు ఏకధాటిగా నటించి, అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తారు. సార్, ఏమాత్రం డౌన్ లేదు. ప్రపంచంలో మీరు నిజంగా బెస్ట్’’ అని ట్వీట్ చేశారు రసూల్.
Comments
Please login to add a commentAdd a comment