
బాలీవుడ్ దిగ్గజ నటుడు అమితాబ్ బచ్చన్‌కు గాయాలయ్యాయి. ప్రాజెక్ట్ కె షూటింగ్‌లో జరిగిన ప్రమాదంలో ఆయన గాయపడ్డారు. రామోజీ ఫిలింసిటీలో జరుగుతున్న ఈ సినిమా షూటింగ్‌లో యాక్షన్ సీన్స్ చిత్రీకరిస్తుండగా అనుకోకుండా ప్రమాదం జరిగింది. వెంటనే స్పందించిన మూవీ టీం ఆయన్ను గచ్చిబౌలి ఏఐజీలో ఆసుపత్రిలో చేర్పించారు.
ప్రమాదంలో అమితాబ్ పక్కటెముకలకు గాయాలయ్యాయని, రెండు వారాలు బెడ్ రెస్ట్ తీసుకోవాల్సిందిగా వైద్యులు సూచించారు.ఏఐజీలో చికిత్స అనంతరం బిగ్‌బి ముంబైకి వెళ్లారు.అయితే తన ఆరోగ్యం విషయంలో అభిమానులు ఎవరూ ఆందోళన చెందవద్దని అమితాబ్ తెలపారు. తాను ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నానని, త్వరలోనే కోలుకుంటానని పేర్కొన్నారు.
ఈ మేరకు తన ఆరోగ్యానికి సంబంధించిన అప్‌డేట్‌ను బ్లాగ్‌లో రాసుకొచ్చారు.ప్రభాస్, దీపికా పదుకొణె జంటగా ప్రాజెక్ట్ కె సినిమా తెరకెక్కతున్న సంగతి తెలిసిందే. నాగ్ అశ్విన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ సినిమాలో బిగ్ బి అమితాబ్ బచ్చన్ కీలక పాత్రలో కనిపించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment