Project K Movie
-
పుష్ప 2 దెబ్బకు కొట్టుకుపోయిన ప్రాజెక్ట్ K ఫస్ట్ లుక్
-
అంతం ఆరంభమవుతుంది!
వెండితెరపై ప్రభాస్ కల్కి అవతారం ఎత్తారు. ప్రభాస్, కమల్‌హాసన్, అమితాబ్ బచ్చన్, దీపికా పదుకోన్, దిశా పటానీ ముఖ్య తారలుగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ‘ప్రాజెక్ట్ కె’ వర్కింగ్ టైటిల్‌తో ఓ సైన్స్ ఫిక్షన్ ఫిల్మ్ రూపొందుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం అమెరికాలో జరుగుతున్న ‘శాన్ డియాగో కామిక్ కాన్ – 2023’ వేడుకలో ఈ సినిమాకు ‘కల్కి 2898 ఏడీ’ టైటిల్‌ను ఖరారు చేసినట్లు శుక్రవారం వెల్లడించి, గ్లింప్స్ వీడియోను రిలీజ్ చేశారు. ‘ప్రపంచాన్ని చీకటి కమ్మేసినప్పుడు ఒక శక్తి ఉద్భవిస్తుంది. అప్పుడు అంతం ఆరంభం అవుతుంది’ అన్నట్లుగా ఈ వీడియోలో ఉంది. ఈ వేడుకలో కమల్‌హాసన్ మాట్లాడుతూ– ‘‘మేం స్టోరీలు చేస్తుంటే వారు (ఆడియన్స్) మమ్మల్ని స్టార్స్ చేస్తున్నారు. ‘కల్కి 2898 ఏడీ’లో పెద్ద విజన్ ఉంది. ఈ సినిమాలో భాగం కావడం గౌరవంగా ఉంది’’ అన్నారు. ‘‘ఈ సినిమాలో నాగ్ అశ్విన్ నా క్యారెక్టర్‌ను డిజైన్ చేసిన తీరు బాగా నచ్చింది. సినిమాలో స్ట్రాంగ్ ఎమోషన్స్ ఉన్నాయి’’ అన్నారు ప్రభాస్. ‘‘ఈ సినిమా నాకో అద్భుతమైన అనుభవం. దీని వెనక గొప్ప పరిశోధన ఉంది’’ అని వర్చ్యువల్‌గా అమితాబ్ బచ్చన్ మాట్లాడారు. ‘‘నేను సైన్స్ ఫిక్షన్, పురాణాలను ఇష్టపడతాను. మహాభారతం, స్టార్ వార్స్... రెండింటినీ చూస్తూ, వింటూ పెరిగాను. ఈ రెండు ప్రపంచాలను కలిపే ఒక గొప్ప సినిమా చేయాలనుకున్నప్పుడు ‘కల్కి 2898 ఏడీ’ పుట్టింది’’ అన్నారు నాగ్ అశ్విన్. ‘‘ఈ సినిమా మాకు గర్వకారణం’’ అన్నారు నిర్మాత అశ్వనీదత్. ఈ వేడుకలో రానా, ప్రియాంకా దత్, స్వప్నా దత్ పాల్గొన్నారు. ‘కల్కి 2898 ఏడీ’ను 2024 జనవరి 12న రిలీజ్ చేయాలనుకుంటున్నారు. రామ్‌చరణ్‌తో కలిసి నటిస్తా: ప్రభాస్ రామ్‌చరణ్‌తో కలిసి నటిస్తానని ప్రభాస్ ‘కామిక్ కాన్–2023’ వేడుకల్లో చెప్పారు. ఈ వేడుకల్లో ‘ఆర్ఆర్ఆర్’ సినిమా ప్రస్తావన రాగా... ‘‘భారతదేశంలో ఉన్న అద్భుతమైన దర్శకుల్లో రాజమౌళిగారు ఒకరు. ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలోని పాటకు ఆస్కార్ రావడం నాకు చాలా సంతోషంగా అనిపించింది. అది దేశ ప్రజలందరికీ దక్కిన గౌరవంగా భావించాం. అలాగే రామ్‌చరణ్ నాకు మంచి మిత్రుడు. ఏదో ఒక రోజు మేం కచ్చితంగా కలిసి సినిమా చేస్తాం’’ అని చెప్పుకొచ్చారు ప్రభాస్. -
'అదొక్కటే మిగిలి ఉంది'.. కల్కిపై రాజమౌళి ఆసక్తికర ట్వీట్!
యంగ్ రెబల్ స్టార్, డార్లింగ్ ప్రభాస్, బాలీవుడ్ దీపికా పదుకొణె నటించిన 'కల్కి 2898 AD'. ఈ మూవీకి సంబంధించి ఇవాళ క్రేజీ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. శాన్ డియాగోలో జరుగుతున్న కామికాన్ ఈవెంట్‌కి హాజరైన చిత్రబృందం.. ఈ మూవీ టైటిల్‌ను 'కల్కి 2898 AD' గా ఖరారు చేసింది. టైటిల్‌తో పాటు హాలీవుడ్‌ను తలపించేలా గ్లింప్స్ వీడియోను గ్రాండ్‌గా రిలీజ్ చేసింది. ఇది చూసి ప్రేక్షకులు ఇప్పటికే ఫిదా అయిపోతున్నారు. తాజాగా ప్రాజెక్ట్-కె గ్లింప్స్‌పై దర్శకధీరుడు రాజమౌళి ఆసక్తికర ట్వీట్ చేశారు. (ఇది చదవండి: సినీ ఇండస్ట్రీని కుదిపేసిన ఘటన.. హీరోయిన్‌పై అత్యాచారయత్నం!) రాజమౌళి తన ట్వీట్లో రాస్తూ.. ' గ్రేట్ జాబ్ నాగి అండ్ వైజయంతి మూవీస్. భవిష్యత్‌పై సినిమాలు తెరకెక్కించడం చాలా కష్టమైన పని. కానీ మీరు ఆ సాహసం చేశారు. అంతే కాదు సాధ్యం చేసి చూపించారు. ఇందులో డార్లింగ్ లుక్ అదిరిపోయింది. ఇక ఒక్క ప్రశ్న మాత్రమే మిగిలి ఉంది. అదే రిలీజ్ డేట్.' అంటూ ట్వీట్ చేశారు. కాగా.. 'కల్కి' చిత్రంలో కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్, దిశా పటానీ లాంటి స్టార్స్ నటిస్తున్నారు. (ఇది చదవండి: ప్రభాస్ 'కల్కి'.. ఆ సీక్రెట్ బయటపెట్టిన కమల్) Great job Nagi and Vyjayanthi movies. Creating an authentic futuristic movie is such a difficult task and you guys made it possible..👏🏻👏🏻 Darling looks smashing.. Only one question remains... Release date...🥰 #Kalki2898AD https://t.co/kKefpCvovr — rajamouli ss (@ssrajamouli) July 21, 2023 -
పుష్ప 2 దెబ్బకు కొట్టుకుపోయిన ప్రాజెక్ట్ K ఫస్ట్ లుక్
-
ప్రాజెక్ట్- కె.. తన క్యారెక్టర్‌పై ప్రభాస్ ఆసక్తికర కామెంట్స్!
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ‘ప్రాజెక్ట్ కె’. ఈ చిత్రంలో దీపికా పదుకోణె హీరోయిన్గా నటిస్తోంది. అంతే కాకుండా ఈ క్రేజీ ప్రాజెక్ట్‌లో అమితాబ్ బచ్చన్, దిశా పటానీ, కమల్ హాసన్ కూడా ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఇటీవలే ఈ చిత్రానికి సంబంధించి వరుస అప్డేట్స్ సినిమాపై అంచనాలు పెంచేస్తున్నారు మేకర్స్. ఇటీవలే ప్రభాస్ ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా రిలీజైన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ మూవీ టైటిల్,గ్లింప్స్‌ను మేకర్స్ విడుదల చేశారు. (ఇది చదవండి: బిగ్ బాస్ హౌస్‌లోకి బేబీ హీరోయిన్.. సోషల్ మీడియాలో వైరల్!) ఈ భారీ బడ్జెట్ టైమ్‌ట్రావెల్ సైన్స్ ఫిక్షన్ ఫిల్మ్ ‘ప్రాజెక్ట్ కె’ గ్లింప్స్‌ను ‘కామిక్ కాన్ –2023’ వేడుకల్లో మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ గ్లింప్స్ హాలీవుడ్ సినిమాను తలపిస్తున్నాయంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఈ సినిమాకు 'కల్కి 2898 ఏడీ' (Kalki 2898 AD) అనే టైటిల్ ఖరారు చేశారు. పురాణాల ప్రకారం కలియుగం చివర్లో విష్ణువు పదో అవతారమే కల్కి. ప్రపంచాన్ని చీకటి కమ్మేసినప్పుడు ఒక శక్తిలా కల్కి ఉద్భవిస్తుందని మన పురాణాల్లో ఉంది. కలియుగం అంతంలో జరిగే కథా నేపథ్యంలో ఈ చిత్రం ఉండనున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ ప్రతిష్ఠాత్మక ఈవెంట్‌కు హాజరైన హీరో ప్రభాస్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అక్కడి స్థానికి మీడియాతో మాట్లాడుతూ డైరెక్టర్‌పై ఫన్నీ కామెంట్స్ చేశారు. ప్రభాస్ మాట్లాడుతూ.. 'ఇది ఒక సూపర్ హీరో సినిమా. ఇందులో అతి ముఖ్యమైన అంశం కామెడీ. నాగ్ అశ్విన్ ఈ స్టోరీని డిజైన్ చేసిన విధానం నాకు నచ్చింది. నా క్యారెక్టర్‌ను అలా తీర్చిదిద్దారు. ఈ ప్రాజెక్ట్‌లో ఫన్నీ క్యారెక్టర్ నాదే అనుకుంటా. ఈ చిత్రంలో స్ట్రాంగ్ ఎమోషన్స్ కూడా నాగ్ చూపించాడు. ఐ యామ్ ది కమెడియన్ ఇన్ దిస్ మూవీ. అంటూ' నవ్వుతూ మాట్లాడారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ఈ చిత్రం కోసం ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. (ఇది చదవండి: ఆ టాలీవుడ్ హీరోతో కలిసి కచ్చితంగా సినిమా చేస్తాను: ప్రభాస్) Prabhas on his character bringing the humor in #Kalki2898 AD #SDCC 2023 pic.twitter.com/tAqpF1iOT6 — Deadline Hollywood (@DEADLINE) July 21, 2023 -
ప్రభాస్ ప్రాజెక్ట్ K ( కల్కి 2898 AD) ఫస్ట్ గ్లింప్స్ విజువల్స్ ట్రీట్ (ఫొటోలు)
-
ప్రభాస్ 'ప్రాజెక్ట్ కె' టైటిల్, గ్లింప్స్ విడుదల.. హాలీవుడ్ రేంజ్లో సీన్స్
ప్రభాస్ హీరోగా నటిస్తున్న టైమ్‌ట్రావెల్ సైన్స్ ఫిక్షన్ ఫిల్మ్ ‘ప్రాజెక్ట్ కె’ టైటిల్,గ్లింప్స్‌ను ‘కామిక్ కాన్ –2023’ వేడుకల్లో మేకర్స్ విడుదల చేశారు. ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని నాగ్ అశ్విన్ దర్శకత్వంలో అశ్వనీదత్ నిర్మిస్తున్నారు. దీపికా పదుకోన్ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంలో కమల్‌హాసన్ , అమితాబ్ బచ్చన్ , దిశా పటానీ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రభాస్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న 'ప్రాజెక్ట్ కె' రివీల్ అయింది. ఈ సినిమాకు 'కల్కి 2898 ఏడీ' (Kalki 2898 AD) అనే టైటిల్‌ను ఫైనల్ చేశారు. పురాణాల ప్రకారం కలియుగం చివర్లో విష్ణువు పదో అవతారమే కల్కి. ప్రపంచాన్ని చీకటి కమ్మేసినప్పుడు ఒక శక్తిలా కల్కి ఉద్భవిస్తుందని మన పురాణాల్లో ఉంది. కలియుగం అంతంలో జరిగే కథా నేపథ్యంలో ఈ చిత్రం ఉండనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా భవిష్యత్‌లోకి తీసుకెళ్తుంది. అందుకే దీనిని టైమ్‌ట్రావెల్ సైన్స్ ఫిక్షన్లో తీస్తున్నారు. ప్రభాస్ 'కల్కి 2898 AD' గ్లింప్స్ ట్రీట్ (ఫొటోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి) బాహుబలి సినిమాతో పాన్ ఇండియా హీరోగా గుర్తింపు పొందిన తొలి హీరో ప్రభాస్‌నే.. ఇప్పుడు హాలీవుడ్ రేంజ్లో కల్కి గ్లింప్స్ ఉంది. ఈ సినిమా మంచి విజయం సాధిస్తే హలీవుడ్లో ప్రభాస్ ఆగమనం ఖాయంగానే ఉంది. ప్రభాస్ పోస్టర్‌ను విడుదల చేసిన వైజయంతి మూవీస్‌పై ఫ్యాన్స్ కూడా ఫైర్ అయ్యారు. వాస్తవంగా అది అంతగా ఆకట్టుకోలేదు. తాజాగా విడుదల చేసిన గ్లింప్స్ మాత్రం అదిరిపోతుంది. ఫ్యాన్స్‌ను నాగ్ అశ్విన్ ఏమాత్రం నిరాశపరచలేదు. అదొక వండర్లా కల్కిని క్రియేట్ చేశాడని చెప్పవచ్చు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌లో కూడా సంతోష్ నారాయణ్ రచ్చలేపాడని చెప్పవచ్చు. ఇందులో విజువల్స్ అందరినీ కట్టిపడేశాయి. ఇక ప్రభాస్ లుక్ అదిరిపోయింది. అమెరికాలో జరుగుతోన్న ప్రతిష్ఠాత్మక ‘శాన్ డియాగో కామిక్ కాన్’ వేడుకలో ప్రచార చిత్రాన్ని ఆవిష్కరించుకున్న తొలి భారతీయ సినిమాగా ఇది రికార్డుకెక్కింది. -
కామిక్ కాన్ –2023 వేడుకల్లో ప్రాజెక్ట్ కె
ప్రభాస్ హీరోగా నటిస్తున్న టైమ్‌ట్రావెల్ సైన్స్ ఫిక్షన్ ఫిల్మ్ ‘ప్రాజెక్ట్ కె’. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో అశ్వనీదత్ నిర్మిస్తున్నారు. దీపికా పదుకోన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో కమల్‌హాసన్ , అమితాబ్ బచ్చన్ , దిశా పటానీ కీలక పాత్రలు పోషిస్తున్నారు. కాగా అమెరికాలో జరుగుతున్న ‘కామిక్ కాన్ –2023’ వేడుకల్లో ‘ప్రాజెక్ట్ కె’ గ్లింప్స్, టైటిల్‌ను జూలై 21న (భారతీయ కాలమానం ప్రకారం) రివీల్ చేయడానికి ప్లాన్ చేశారు. ఈ సందర్భంగా ప్రభాస్, కమల్‌హాసన్ , నాగ్ అశ్విన్ లతో పాటు ‘ప్రాజెక్ట్ కె’ టీమ్ అమెరికాలో సందడి చేసింది. -
ప్రభాస్ ఫస్ట్‌లుక్ డిలీట్.. దానికి భయపడ్డారా?
డార్లింగ్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న భారీ బడ్జెట్ సినిమా 'ప్రాజెక్ట్ K'. 'మహానటి' ఫేమ్ నాగ్ అశ్విన్ డైరెక్టర్ కావడం, గత కొన్నేళ్లుగా ఈ చిత్రం సెట్స్ మీద ఉండటంతో అంచనాలు గట్టిగానే ఉన్నాయి. కానీ బుధవారం రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్‌తో అవన్నీ కాస్త తారుమారు అయ్యాయి అనిపించింది. ఎందుకంటే ప్రభాస్ లుక్‌పై ఘోరంగా ట్రోల్స్ వస్తూనే ఉన్నాయి. ఈ ఫస్ట్ లుక్‌లో ప్రభాస్ ఐరన్ మ్యాన్ పోజులో కనిపించాడు. అది ఓకే గానీ ఆ తల వేరే ఎవరో బాడీకో అతికించినట్లు ఉందని స్వయానా అభిమానులే నిరుత్సాహపడ్డారు. సోషల్ మీడియాలో 'ప్రాజెక్ట్ K' టైప్ చేసి సెర్చ్ చేయండి మీకే విషయం అర్థమైపోతుంది. ఇవన్నీ మేకర్స్ దృష్టిలో పడినట్లున్నాయి. దీంతో అధికారికంగా రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్‌ని సోషల్ మీడియా ఖాతాల నుంచి డిలీట్ చేశారు. (ఇదీ చదవండి: ఇదేం ఫస్ట్ లుక్! 'ప్రాజెక్ట్ K'పై ఘోరమైన ట్రోల్స్) అయితే ఇలా డిలీట్ చేసిన ఫస్ట్ లుక్ బదులు ఎలాంటి గ్రాఫిక్స్, పేర్లు లేకుండా ఉన్న అదే పోస్టర్ని పోస్ట్ చేశారు. గ్లింప్స్ వీడియో కోసం రెడీ అయిపోండి అని ట్వీట్ పెట్టారు. ఈ విషయం నిజమా కాదా అని ఆలోచిస్తున్నారా? అయితే ఈ స్టోరీ చదివిన తర్వాత 'ప్రాజెక్ట్ K' నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ ట్విట్టర్లోకి వెళ్లి చూడండి. మీకే క్లారిటీ వస్తుంది. ప్రస్తుతం జరుగుతున్న ట్రోలింగ్ ఎక్కువ కాకుడదనే ఉద్దేశంతోనే ఇలా డిలీట్ చేసినట్లు తెలుస్తోంది. మేకర్స్ తీసేసినా సరే ఆ ఫొటో ఇప్పటికీ ఎప్పటికీ అందుబాటులోనే ఉంటుంది. ఈ జాగ్రత్త ఏదో ముందు ఉంటే బాగుండేదని పలువురు నెటిజన్స్ అభిప్రాయపడుతున్నారు. ఇక 'ప్రాజెక్ట్ K'లో ప్రభాస్ తోపాటు దీపికా పదుకొణె, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. Our Raiders are ready to conquer @Comic_Con today! 💥#ProjectK #WhatisProjectK #Prabhas @SrBachchan @ikamalhaasan @deepikapadukone @nagashwin7 @VyjayanthiFilms pic.twitter.com/t8TKs2GbVf — Vyjayanthi Movies (@VyjayanthiFilms) July 20, 2023 (ఇదీ చదవండి: Hidimba Review: ‘హిడింబ’ మూవీ రివ్యూ) -
ఘోరంగా హర్ట్ అయిన ప్రభాస్ ఫ్యాన్స్
-
Project K: శాన్ డీగోలో ల్యాండైన ప్రభాస్, రానా, కమల్ హాసన్
-
ప్రాజెక్ట్ K ప్రభాస్ వచ్చేసాడు
-
ఇదేం ఫస్ట్ లుక్! 'ప్రాజెక్ట్ K'పై ఘోరమైన ట్రోల్స్
Prabhas Project K First Look Trolls: డార్లింగ్ ప్రభాస్ గ్లోబల్ వైడ్ గుర్తింపు తెచ్చుకున్న హీరో. దీంతో ప్రస్తుతం అలాంటి భారీ బడ్జెట్ సినిమాలే చేస్తున్నాడు. అయితే ప్రభాస్ కొత్త చిత్రాల అప్డేట్స్ అంటే ఎలా ఉండాలి. చూసే ప్రతిఒక్కరి మైండ్ బ్లాంక్ అయిపోవాలి. కట్ చూస్తే.. నిజంగానే అందరి బుర్ర తిరిగిపోతోంది. అయితే అది రివర్స్‌లో. ఇలా చెప్పడానికి 'ప్రాజెక్ట్ K' ఫస్ట్ లుక్‌తోపాటు చాలానే కారణాలున్నాయి. వాటి గురించి ఇప్పుడు డిస్కస్ చేద్దాం. టాలీవుడ్ గురించి ప్రపంచం మొత్తం మాట్లాడుకుంటోంది. దానికి కారణం ప్రభాస్, రాజమౌళి అనడంలో ఏ మాత్రం సందేహం లేదు. 'బాహుబలి' సినిమాతో నటుడిగా ప్రభాస్, డైరెక్టర్‌గా రాజమౌళి బోలెడంత క్రేజ్ అందుకున్నారు. రాజమౌళి ఆస్కార్ రేంజుని అందుకున్నాడు. ప్రభాస్ కెరీర్ మాత్రం అంతంత మాత్రంగానే సాగుతోంది. కరెక్ట్ గా చెప్పాలంటే డైరెక్టర్స్ అతడితో ఆడేసుకుంటున్నారా అనే డౌట్ వస్తోంది. (ఇదీ చదవండి: సితార ఫస్ట్ యాక్టింగ్ వీడియో.. తండ్రినే మించిపోయేలా!) ఎందుకంటే 'బాహుబలి' తర్వాత 'సాహో' చేశాడు. యాక్షన్ ఎంటర్టైనర్గా వచ్చిన ఆ సినిమా పర్వాలేదనిపించింది. కాకపోతే ప్రభాస్ రేంజ్‌కి తగ్గ మూవీ కాదని అప్పట్లో అభిమానులు మాట్లాడుకున్నారు. కాస్త కేర్ తీసుకుని ఉండాల్సిందని అన్నారు. దీని తర్వాత 'రాధేశ్యామ్' వచ్చింది. ఈ సినిమా ఫస్ట్ లుక్ ఓకే అనిపించినా.. ఆ తర్వాత ప్రభాస్ లుక్స్ విషయంలో విమర్శలు వచ్చాయి. ఈ చిత్రానికి బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్స్ వచ్చాయి గానీ ప్రేక్షకుల్ని ఎందుకో అలరించలేకపోయింది. ఈ మధ్య వచ్చిన 'ఆదిపురుష్' గురించి మీకు కొత్తగా చెప్పనక్కర్లేదు అనుకుంటా. ఈ మూవీకి అయితే ఫస్ట్ లుక్ నుంచి థియేటర్లలోకి సినిమా వచ్చిన తర్వాత కూడా ఘోరమైన ట్రోలింగ్ జరిగింది. 'సలార్' టీజర్‌తో అభిమానుల కాస్త తేరుకున్నప్పటికీ... ఇప్పుడు 'ప్రాజెక్ట్ K' ఫస్ట్ లుక్ వాళ్లని మరోసారి డిసప్పాయింట్ అయ్యేలా చేసింది. ఐరన్ మ్యాన్ పోజులో ఉన్న ఈ లుక్‌లో ప్రభాస్ తల వేరే ఎవరి శరీరానికో అతికించినట్లు ఉందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అయితే 'మహానటి' లాంటి టిపికల్ స్క్రిప్ట్‌ని తీసిన నాగ్ అశ్విన్ ఈ సినిమాకి డైరెక్టర్ కావడం, ఒక్క లుక్‌తో మూవీ స్టేటస్ ఎలా డిసైడ్ చేస్తారు అనేది సినిమా లవర్స్ వాదన. ఇంకా 'ప్రాజెక్ట్ K' టైటిల్ కూడా రివీల్ చెయ్యలేదు. ప్రస్తుతం చిత్రబృందం అమెరికాలో ఉంది. గురువారం జరిగే కామికాన్ ఈవెంట్లో టైటిల్ ఏంటనేది బయట పెట్టబోతున్నారు. అలాగే ఈ సినిమా నుంచి గ్లింప్స్ వీడియో వస్తుంది. అవి ఈ సినిమా గురించి పూర్తి డీటైలింగ్ ఇస్తాయి. ఏది ఏమైనా ఈ మధ్య ప్రభాస్ ప్రతి సినిమా ప్రమోషనల్ మెటీరియల్, ఫస్ట్ లుక్ లాంటివి ఫ్యాన్స్‌ని నిరాశపరుస్తుండటం కాస్త వింతగా అనిపిస్తుంది. The Hero rises. From now, the Game changes 🔥 This is Rebel Star #Prabhas from #ProjectK. First Glimpse on July 20 (USA) & July 21 (INDIA). To know #WhatisProjectK stay tuned and subscribe: https://t.co/AEDNZ3ni5Q@SrBachchan @ikamalhaasan @deepikapadukone @nagashwin7… pic.twitter.com/oRxVhWq4Yn — Vyjayanthi Movies (@VyjayanthiFilms) July 19, 2023 (ఇదీ చదవండి: Project K: దీపికా పదుకోన్ ఫస్ట్ లుక్ వచ్చేసింది) -
'ప్రాజెక్ట్ K' నుంచి ప్రభాస్ ఫస్ట్ లుక్ రిలీజ్
డార్లింగ్ ప్రభాస్ చేస్తున్న సినిమాల్లో 'ప్రాజెక్ట్ K' ఒకటి. ఈ చిత్రంపై ఓ మాదిరిగా అంచనాలున్నప్పటికీ.. సినిమా లవర్స్ మాత్రం గట్టిగానే ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే డైరెక్టర్ నాగ్ అశ్విన్ కాబట్టి. ప్రభాస్ లాంటి కటౌట్‌ని పెట్టుకుని సాదాసీదా కథ అయితే తీయడుగా! తాజాగా బుధవారం రిలీజ్ చేసిన ప్రభాస్ ఫస్ట్‌లుక్ చూస్తే అదే అనిపించింది. (ఇదీ చదవండి: డ్రగ్స్ కేసులో హీరోయిన్‌కు బిగ్ రిలీఫ్) గత సినిమాలతో పోలిస్తే 'ప్రాజెక్ట్ K' ప్రభాస్ సరికొత్తగా కనిపించాడు. ఒళ్లంతా రోబో లాంటి సూట్ ఉన్నప్పటికీ.. పొడవైన జుట్టుతో కనిపించాడు. తన చేతితో భూమిని గుద్దితే, అది బద్దలైనట్లు ఈ ఫొటోలో చూపించారు. దీనిపై అభిమానులు మాత్రం భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం చిత్రబృందం అమెరికాలో ఉంది. గురువారం జరిగే కామికాన్ ఈవెంట్ లో టైటిల్ ఏంటనేది రివీల్ చేయనున్నారు. మన దేశంలో అత్యంత భారీ బడ్జెట్ తో తీస్తున్న ఈ సినిమాలో ప్రభాస్ తోపాటు దీపికా పదుకొణె, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. వైజయంతీ మూవీస్ ఏ మాత్రం ఖర్చుకు వెనకాడకుండా తీస్తోంది. వచ్చే ఏడాది సంక్రాంతికి థియేటర్లలోకి తీసుకొస్తున్నట్లు కొన్నిరోజుల ముందు ప్రకటించారు కానీ రిలీజ్ డేట్ మారే అవకాశాలు గట్టిగానే ఉన్నాయి. The Hero rises. From now, the Game changes 🔥 This is Rebel Star #Prabhas from #ProjectK. First Glimpse on July 20 (USA) & July 21 (INDIA). To know #WhatisProjectK stay tuned and subscribe: https://t.co/AEDNZ3ni5Q@SrBachchan @ikamalhaasan @deepikapadukone @nagashwin7… pic.twitter.com/oRxVhWq4Yn — Vyjayanthi Movies (@VyjayanthiFilms) July 19, 2023 (ఇదీ చదవండి: Project K: దీపికా పదుకోన్ ఫస్ట్ లుక్ వచ్చేసింది) -
Project K: దీపికా పదుకోన్ ఫస్ట్ లుక్ వచ్చేసింది
ఆమె కళ్లు ఎటో తీక్షణంగా చూస్తున్నాయి. దీర్ఘాలోచనలో ఉన్నట్లు కనబడుతోందామె. ‘ప్రాజెక్ట్ కె’లో దీపికా పదుకోన్ చేస్తున్న పాత్ర లుక్ ఇది. ‘‘ఆమె కళ్లల్లో కొత్త ప్రపంచంపై నమ్మకం కనిపిస్తోంది’’ అంటూ దీపికా లుక్‌ని విడుదల చేసింది చిత్ర యూనిట్. ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘ప్రాజెక్ట్ కె’. ఈ చిత్రం ద్వారా బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకోన్ తెలుగు చిత్ర పరిశ్రమకు కథానాయికగా పరిచయమవుతున్నారు. సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో సి. అశ్వనీదత్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, కమల్‌హాసన్, దిశా పటానీ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ‘ప్రాజెక్ట్ కె’ టైటిల్, ట్రైలర్, సినిమా విడుదల తేదీని ఈ నెల 20న అమెరికాలోని ‘శాన్ డియాగో కామిక్– కాన్ 2023’ వేడుకలో లాంచ్ చేస్తారు. ఈ వేడుకకు ప్రభాస్, కమల్‌హాసన్, దీపికా పదుకోన్, నాగ్ అశ్విన్, అశ్వనీదత్ హాజరు కానున్నారు. In her eyes she carries the hope of a new world 🌍 @deepikapadukone from #ProjectK pic.twitter.com/RUt9T1MAyZ — Vyjayanthi Movies (@VyjayanthiFilms) July 18, 2023 -
మరికొన్ని రోజులు అక్కడే ఉండనున్న ప్రభాస్
దాదాపు ముప్పై రోజులుగా ఫారిన్ ట్రిప్‌లో ఉన్నారు ప్రభాస్. ఈ ట్రిప్ ఇప్పటికే పూర్తి కావాల్సిందట.. కానీ మరికొన్ని రోజులు ఆయన అక్కడే ఉండనున్నారు. ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘ప్రాజెక్ట్ కె’. అమితాబ్ బచ్చన్, కమల్‌హాసన్, దీపికా పదుకొనె, దిశాపటానీ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. సి.అశ్వనీదత్ నిర్మిస్తున్న సైన్స్ ఫిక్షన్ ఫిల్మ్ ఇది. ఈ సినిమా టైటిల్, ట్రైలర్, సినిమా విడుదల తేదీని ‘శాన్ డియాగో కామిక్ కాన్ 2023’ వేడుకలో లాంచ్ చేస్తారు. ఈ నెల 20న (భారతీయ కాలమానం ప్రకారం ఈ నెల 21) జరగనున్న ఈ వేడుక కోసం ప్రభాస్ మరికొన్ని రోజులు అమెరికాలోనే ఉండి, ఆ తర్వాత ఇండియాకి తిరిగొస్తారట. అనంతరం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నటించిన ‘సలార్: సీజ్ఫైర్’ ప్రమోషన్స్‌లో పాల్గొంటారని తెలుస్తోంది. ఈ చిత్రం సెప్టెంబరు 28న విడుదల కానుంది. కాగా మారుతి దర్శకత్వంలో ‘రాజా డీలక్స్’(ప్రచారంలో ఉన్న టైటిల్) అనే సినిమా చేస్తున్నారు ప్రభాస్. అలాగే ‘అర్జున్‌రెడ్డి’ ఫేమ్ సందీప్‌రెడ్డి వంగా దర్శకత్వంలో ‘స్పిరిట్’ అనే సినిమాకి ప్రభాస్ పచ్చజెండా ఊపిన సంగతి తెలిసిందే. -
ప్రాజెక్ట్ K లాంటి పెద్ద సినిమాకి ఇలాంటి చీప్ పబ్లిసిటీ ట్రిక్స్
-
ప్రాజెక్ట్- కే యూనిట్‌పై ఫైర్ అవుతున్న ప్రభాస్ ఫ్యాన్స్
ప్రభాస్ హీరోగా తెరకెక్కుతోన్న పాన్ ఇండియా చిత్రం 'ప్రాజెక్ట్- కే'పై ఫ్యాన్స్‌కు భారీ అంచనాలు ఉన్నాయి. అశ్వీనీదత్ వైజయంతి మూవీస్‌లో నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో దీపికా పదుకోన్ హీరోయిన్. అమితాబ్ బచ్చన్, కమల్‌హాసన్, దిశా పటానీ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. జులై 20న ‘శాన్ డియాగో కామిక్–కాన్ 2023’ వేడుకలో 'ప్రాజెక్ట్ కే' టైటిల్‌ను రివీల్ చేస్తామని కూడా ప్రకటించారు. (ఇదీ చదవండి: ఎన్ని పెళ్లిళ్లు అయినా చేసుకోండి కానీ...: ఎంఎస్ ధోని) మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా 'ప్రాజెక్ట్ కే' అంటే ఏమిటి? అంటూ మేకర్స్ ప్రకటన జారీ చేశారు. అందులో భాగంగా ఫ్రీగా టీ షర్ట్స్ ఇస్తున్నామంటూ ప్రచారం కూడా చేశారు. టీ షర్ట్స్ కోసం వైజయంతీ మూవీస్ అధికారిక ట్విట్టర్ అకౌంట్లో లింక్‌ను కూడా ఉంచారు. కానీ ఈ విషయంపై అశ్వీనీదత్ వైజయంతి మూవీస్ చేస్తుంది పెద్ద చీటింగ్ అని సోషల్ మీడియా వేదికగా ప్రభాస్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. అందుకు సంబంధించి నెట్టింట కామెంట్లు కూడా చేస్తున్నారు. టీ షర్ట్స్ అందుబాటులో ఉంచుతున్నామని ఇప్పటికే మూడు సార్లు లింక్ ఓపెన్ చేసినా ఎలాంటి ఉపయోగం లేదని వారు తెలుపుతున్నారు. జులై 10న కూడా సాయంత్రం 7:11 నిమిషాలకు లింక్ ఓపెన్ చేశారు. సెకన్ల వ్యవధిలోనే లింక్ ఓపెన్ చేస్తే సర్వర్ ఎర్రర్ అని చూపిస్తుందని ట్వీట్లు చేస్తున్నారు. ఎన్నో గంటల పాటు వేచి ఉన్నటువంటి ఫ్యాన్స్‌కు మూడోసారి కూడా నిరాశే ఎదురైందని తెలుపుతున్నారు. జస్ట్ 4 నిమిషాల తర్వాత స్టాక్ అయిపోయిందని ప్రకటించారు. లింకే ఓపెన్ కాలేదు, స్టాక్ అయిపొవడం ఏంటని ప్రభాస్ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. సినిమా ప్రచారం కోసం ఫ్యాన్స్‌తో గేమ్స్ ఆడుతున్నారా..? ఇది పెద్ద స్కామ్, చీటింగ్ అంటూ సోషల్ మీడియా వేదికగా వారు సీరియస్ అవుతున్నారు. (ఇదీ చదవండి: రెండోపెళ్లి చేసుకోనున్న ఐశ్వర్య రజనీకాంత్..?) అంతేకాకుండా ఇప్పటి వరకు టీ షర్ట్స్ అందినట్లు ఎవరూ కూడా సోషల్ మీడియాలో పోస్ట్‌లు కూడా చేయలేదు. దీంతో వీళ్లు నిజంగానే టీ షర్ట్స్ ఇస్తున్నారా? అనే సందేహాలు కూడా వస్తున్నాయని చెబుతున్నారు. మెజారిటీ ఫ్యాన్స్‌కే దక్కలేదు... ఇక సాధారణమైన వాళ్లకు ఏం దక్కింటాయని వారు అంటున్నారు. ఇది కేవలం ప్రమోషనల్ ట్రిక్ అంటూ.. కనీసం వందల్లో కూడా టీ షర్ట్స్ ఇచ్చి ఉండరని ఫ్యాన్స్ వాపోతున్నారు. Thank you for the BLASTing response for 'The Rise' 💥💥💥 After multiple Krashes all stock claimed in 4 minutes.#ProjectK #WhatisProjectK pic.twitter.com/QBPg4JpE6v — Vyjayanthi Movies (@VyjayanthiFilms) July 10, 2023 -
ప్రాజెక్ట్-K అంటే అర్థం అదే..
-
Prabhas Project-K: 'ప్రాజెక్ట్ కే' టైటిల్ ఇదేనా..?
ప్రభాస్ హీరోగా తెరకెక్కుతోన్న పాన్ ఇండియా చిత్రం 'ప్రాజెక్ట్- కే'. జులై 20న కాలిఫోర్నియాలోని శాన్ డియాగోలో నిర్వహించనున్న ‘శాన్ డియాగో కామిక్–కాన్ 2023’ వేడుకలో 'ప్రాజెక్ట్ కే' ప్రచార చిత్రాన్ని ఆవిష్కరించనున్నారు. ఈ ఘనత దక్కిన తొలి భారతీయ చిత్రంగా ఇది చరిత్ర సృష్టించనుంది. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో దీపికా పదుకోన్ హీరోయిన్. అమితాబ్ బచ్చన్, కమల్‌హాసన్, దిశా పటానీ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. శాన్ డియాగో కామిక్ వేదికపై ఈ సినిమాకు సంబందించిన టైటిల్‌ను రివీల్ చేయనున్నారు. అనంతరం సినిమాకు చెందిన పలు విషయాలను పంచుకోనున్నారు. (ఇదీ చదవండి: 61 ఏళ్ల వ్యక్తితో శృంగారం.. రియాక్ట్ అయిన హీరోయిన్) ఇప్పుడు ప్రాజెక్ట్-కే అంటే ఏమిటి? అనే ఆసక్తి అందరిలో పెరిగింది. అంతేకాకుండా మేకర్స్ కూడా ప్రాజెక్ట్-కే అంటే ఏమిటో తెలుసుకోవాలని ఉందా? అంటూ ట్వీటర్లో తెగ ఊరిస్తున్నారు. దీంతో ఈ మూవీ టైటిల్ ఇదే అంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. మొదట ప్రాజెక్ట్-కే అంటే 'కర్ణ, కల్కీ' అనే పేర్లు వైరల్ అయ్యాయి. కానీ తాజాగా ప్రాజెక్ట్ 'కాలచక్ర' అనే టైటిల్ ఖారారు చేసినట్లు తెలుస్తోంది. సైన్స్ ఫిక్షన్ - టైమ్ ట్రావెల్ బ్యాక్ డ్రాప్‌గా బేస్ చేసుకుని ఈ సినిమా వస్తుండటంతో 'కాలచక్ర' టైటిల్‌ను ఓకే చేశారని టాక్ నడుస్తుంది. ఈ సస్పెన్స్ వీడాలంటే జులై 20 వరకు ఆగాల్సిందే. శాన్ డియాగో కామిక్ కాన్ వేదికపైన ప్రభాస్, దీపికా పదుకోన్, అమితాబ్ బచ్చన్, కమల్‌హాసన్, నాగ్ అశ్విన్ సందడి చేయనున్నారు. ఇకపోతే ఈ సినిమాను 2024 సంక్రాంతికి విడుదల చేస్తామని మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. (ఇదీ చదవండి: బర్త్‌డే కానుకగా భర్తకు 6 అడుగుల గిఫ్ట్ ఇచ్చిన నటి.. వైరల్ వీడియో!) -
ప్రభాస్ 'ప్రాజెక్ట్ కే' టీషర్ట్ కావాలంటే ఉచితంగా ఇలా బుక్ చేసుకోండి
ప్రభాస్ హీరోగా తెరకెక్కుతోన్న పాన్ ఇండియా చిత్రం 'ప్రాజెక్ట్ కే' ప్రమోషన్స్ జోష్ పెంచింది. ఇప్పటికే జులై 20న కాలిఫోర్నియాలోని శాన్ డియాగోలో నిర్వహించనున్న ‘శాన్ డియాగో కామిక్–కాన్ 2023’ వేడుకలో ‘ప్రాజెక్ట్ కె’ సినిమా టైటిల్, ట్రైలర్, సినిమా విడుదల తేదీని లాంచ్ చేయనున్నామని మేకర్స్ ప్రకటించారు. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో దీపికా పదుకోన్ హీరోయిన్. అమితాబ్ బచ్చన్, కమల్‌హాసన్, దిశా పటానీ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. (ఇదీ చదవండి: నయనతార ఆస్తుల వివరాలపై మళ్లీ చర్చ) తాజాగా 'ప్రాజెక్ట్ కే' అంటే ఏమిటి..? అని రాసి ఉన్న ఓ టీషర్ట్‌ని అందుబాటులో ఉంచారు. అయితే.. దీన్ని సొంతం చేసుకోవాలంటే మాత్రం అంత సులువు కాదు. డార్లింగ్ ఫ్యాన్స్ డిమాండ్ అలా ఉంటుంది. కాబట్టి టీ షర్ట్ కావాలనుకునే వారు చాలా వేగంగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. కానీ ఇందుకు పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. వైజయంతి ట్విటర్ అకౌంట్ నుంచి లింక్‌ను షేర్ చేశారు. దీనిని ఇప్పటికే ప్రాజెక్ట్ -కే టీమ్ కూడా ప్రమోట్ చేస్తుంది. (ఇదీ చదవండి: గుండుతో ఢీ కొట్టేందుకు రెడీ అయిన స్టార్స్) ఇలా బుక్ చేసుకోండి వారు షేర్ చేసిన లింక్‌ని క్లిక్ చేసి.. ఆపై ఓపెన్ అయిన విండో 'పసుపు రంగులో' ఉంటే కంటిన్యూ బటన్ని కానీ వైజయంతి మూవీస్ లోగోనైనా నొక్కాలి. దాన్ని నొక్కగానే.. మీ పేరుతో పాటు ఈమెయిల్ని పొందుపరచాలి. అంతే సింపుల్ మీకు కావాల్సిన సైజ్‌లో టీషర్ట్‌ని సెలెక్ట్ చేసుకునే ఆప్షన్ కూడా వస్తుంది. ఈ విధంగా ప్రాజెక్ట్ కే టీషర్ట్‌ని ఏవరైనా సొంతం చేసుకోవచ్చు. ఇప్పటికే మొదటి డ్రాప్ పేరుతో లింక్ విడుదల చేశారు. మరోసారి నేడు కూడా విడుదల చేయనున్నట్లు ట్విటర్లో సినిమా యూనిట్ తెలిపింది. Brace yourselves, First Drop 'The Force' is getting ready for dispatch. Get ready for the next drop. Stay Tuned🔗 https://t.co/0rC0ez8o2N#ProjectK #WhatisProjectK pic.twitter.com/4Ni9hT0YVJ — Vyjayanthi Movies (@VyjayanthiFilms) July 8, 2023 -
కామిక్–కాన్ 2023లో ప్రాజెక్ట్ కె
ప్రభాస్ హీరోగా తెరకెక్కుతోన్న పాన్ ఇండియా చిత్రం ‘ప్రాజెక్ట్ కె’ అరుదైన ఘనత సాధించింది. కాలిఫోర్నియాలోని శాన్ డియాగోలో నిర్వహించనున్న ‘శాన్ డియాగో కామిక్–కాన్ 2023’ వేడుకలో ‘ప్రాజెక్ట్ కె’ సినిమా టైటిల్, ట్రైలర్, సినిమా విడుదల తేదీని లాంచ్ చేయనున్నారు. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో దీపికా పదుకోన్ హీరోయిన్. అమితాబ్ బచ్చన్, కమల్‌హాసన్, దిశా పటానీ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అశ్వనీదత్ ఈ సినిమా నిర్మిస్తున్నారు. నాగ్ అశ్విన్ మాట్లాడుతూ– ‘‘ఇండియా గొప్ప కథలకు, సూపర్ హీరోలకు నిలయం. మా ‘ప్రాజెక్ట్ కె’ సినిమా, కథ గురించి ప్రపంచ ప్రేక్షకులకు పరిచయం చేయడానికి ‘శాన్ డియాగో కామిక్–కాన్ 2023’ సరైన వేదిక అని భావిస్తున్నాం’’ అన్నారు. ‘‘శాన్ డియాగో కామిక్–కాన్ 2023’లో లాంచ్ అవుతున్న తొలి భారతీయ చిత్రంగా ‘ప్రాజెక్ట్ కె’ చరిత్ర సృష్టించనుంది. ప్రపంచపటంలో భారతీయ సినిమాను చూడాలని కోరుకునే భారతీయ ప్రేక్షకులందరికీ ఇది గర్వకారణం’’ అన్నారు అశ్వనీదత్. ఈ నెల 20న ప్రారంభమయ్యే ‘శాన్ డియాగో కామిక్–కాన్ 2023’లో కమల్‌హాసన్, ప్రభాస్, దీపికా పదుకోన్, నాగ్ అశ్విన్ తదితరులు పాల్గొంటారు. -
ప్రభాస్ 'ప్రాజెక్ట్-కె' నుంచి బిగ్ అనౌన్స్మెంట్..!
ప్రభాస్ అభిమానులు సలార్ టీజర్‌తో ఫుల్ జోష్‌లో ఉండగానే 'ప్రాజెక్ట్-కె' మేకర్స్ కడా బిగ్ సర్ప్రైజ్ ఇచ్చారు. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ కథానాయకుడిగా తెరకెక్కుతున్న సోషియో ఫాంటసీ ఫిల్మ్ ఇది. దీపికా పదుకొణె కథానాయిక. అమితాబ్,కమల్ హాసన్ కీలక పాత్రలో పోషిస్తున్నారు. ఇప్పటికే 'ప్రాజెక్ట్-కె' పోస్టర్స్ అదిరిపోయే విదంగా ఉన్నాయి. సినిమాకు సంబంధించి టైటిల్ రివీల్‌తో పాటు గ్లింప్స్‌ను జులై 20న విడుదల చేయనున్నారనే ప్రచారం జరుగుతున్న సమయంలో చిత్ర యూనిట్ నుంచి ఇదే విషయాన్ని అదికారికంగా ప్రకటించారు. (ఇదీ చదవండి: టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్‌తో వచ్చిన 7:11 పీఎమ్ మూవీ రివ్యూ) అమెరికాలో జరిగే శాన్ డియాగో కామిక్-కాన్ (SDCC) వేడుకలో 'ప్రాజెక్ట్-కె' ఫస్ట్ గ్లింప్స్‌తో పాటు టైటిల్‌ను రివీల్ చేయడమే కాకుండా రిలీజ్ డేట్‌ను కూడా ప్రకటించనున్నారు. అమెరికాలో జూలై 19 నుంచి కామిక్- కాన్ వేడుకలు ప్రారంభం కానున్నాయి. కాగా, జులై 20న ఈ వేడుకలకు ప్రభాస్, కమల్,అమితాబ్, దీపికా, నాగ్ అశ్విన్ తదితరులు పాల్గొననున్నారు. ఆపై చిత్రానికి సంబంధించిన టైటిల్‌ను ఆ వేదిక మీద రివీల్ చేస్తారు. ఇప్పటివరకు ఏ తెలుగు సినిమాకు ఇలాంటి గౌరవం దక్కలేదు. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ రచ్చ మాములుగా లేదు. టాలీవుడ్ నుంచి హాలీవుడ్ వరకు మా డార్లింగ్ క్రేజ్ వెళ్తోంది అంటూ సంబరాలు చేసుకుంటున్నారు. (ఇదీ చదవండి: Rangabali Review In Telugu: 'రంగబలి' రివ్యూ) 𝐏𝐑𝐎𝐔𝐃 𝐌𝐎𝐌𝐄𝐍𝐓! San Diego @Comic_Con, here we come.#ProjectK #Prabhas @SrBachchan @ikamalhaasan @deepikapadukone @nagashwin7 @Music_Santhosh @AshwiniDuttCh @VyjayanthiFilms pic.twitter.com/uodkNyPmSk — Vyjayanthi Movies (@VyjayanthiFilms) July 6, 2023 -
ప్రాజెక్ట్ K సెకండ్ పార్ట్ లో కమల్ హాసన్... ఫస్ట్ పార్ట్ కథ ఇదే...
-
ప్రాజెక్ట్ K కోసం కమల్ హాసన్ భారీ రెమ్యూనరేషన్ డిమాండ్
-
ఆ సినిమా లేకపోతే ప్రాజెక్ట్ K లేదు
-
ప్రభాస్ 'ప్రాజెక్ట్- కె'.. ఆ విషయంలో ఆదిపురుష్‌ను దాటేయనుందా?
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఇటీవలే ఆదిపురుష్ చిత్రంతో ప్రేక్షకులను అలరించాడు. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ తెరకెక్కించిన ఈ చిత్రం మిక్స్డ్ టాక్‌ను సొంతం చేసుకున్నప్పటికీ విమర్శల పాలైంది. రామాయణం ఆధారంగా తెరకెక్కించిన ఈ చిత్రాన్ని పలు వివాదాలు చుట్టుముట్టాయి. డైలాగ్స్, పాత్రలతో పాటు సీత ఇండియాలో జన్మించినట్లు చూపించడం వివాదాలకు కేరాఫ్‌గా నిలిచాయి. తొలి మూడు రోజులు వసూళ్లు సాధించినా ఆ తర్వాత పూర్తిగా తగ్గిపోయాయి. ఈ చిత్రం కోసం దాదాపుగా రూ.600 కోట్లు వెచ్చించినట్లు సమాచారం. ప్రభాస్ కెరీర్లోనే అత్యంత భారీ బడ్జెట్ చిత్రంగా ఆదిపురుష్ నిలిచింది. (ఇది చదవండి: టాలీవుడ్ సినిమాతో ఎంట్రీ.. ఈ ఫోటోలోని హీరోయిన్ ఎవరో తెలుసా?) ఇక ప్రభాస్ తదుపరి చిత్రం కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం ఆయన నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తోన్న భారీ బడ్జెట్ యాక్షన్ థ్రిల్లర్ ప్రాజెక్ట్-కెలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో తమిళ సూపర్ స్టార్ కమల్ హాసన్, దీపికా పదుకొణె, అమితాబ్ బచ్చన్, దిశా పటాని లాంటి అగ్రతారలు నటిస్తున్నారు. అంతేకాకుండా సీతారామం స్టార్ దుల్కర్ సల్మాన్ కూడా నటించనున్నట్లు వార్తలొస్తున్నాయి. అయితే ఇంతటి భారీ తారగణంతో రూపొందుతున్న ఈ చిత్రం బడ్జెట్‌పైనే ఇప్పుడు చర్చ మొదలైంది. ఈ చిత్రంలోని నటీనటులు రెమ్యునరేషన్ ఏ స్థాయిలో ఉంటుందో అర్థమవుతోంది. భారీస్థాయిలో గ్రాఫిక్స్ ఉండనుండడంతో ఈ మూవీ బడ్జెట్ రూ. 600 కోట్లకు పైగానే ఉండనుందని టాక్ వినిపిస్తోంది. అదే గనుక నిజమైతే ఇండియాలోనే అత్యంత భారీ బడ్జెట్ చిత్రంగా ప్రాజెక్ట్-కె నిలవనుంది. ప్రాజెక్ట్-కె రెమ్యూనరేషన్స్ ప్రాజెక్ట్- కె కోసం ప్రభాస్, దీపికా పదుకొనే, కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్, దిశా పటానీ ఎంత తీసుకుంటున్నారనే దానిపై అభిమానుల్లో చర్చ నడుస్తోంది. ప్రభాస్ ఈ చిత్రం కోసం రూ.150 కోట్ల రూపాయలు వసూలు చేస్తున్నట్లు సమాచారం. కమల్ హాసన్ ఈ చిత్రంలో కేవలం అతిథి పాత్రకే రూ.20 కోట్లు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. దీపికా పదుకొణె ఈ చిత్రానికి రూ. 10 కోట్లు వసూలు చేస్తుండగా.. అమితాబ్ బచ్చన్, దిశా పటానీతో కలిపి ఇతరులకు మరో రూ.20 కోట్లు రెమ్యునరేషన్ ఇవ్వనున్నారు. దీంతో కేవలం ప్రాజెక్-కె రెమ్యూనరేషన్ కోసమే దాదాపు రూ.200 కోట్లు వెచ్చించనున్నట్లు సమాచారం.వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై తెరకెక్కుతోన్న ఈ చిత్రం సంక్రాంతి సందర్భంగా జనవరి 12, 2024న విడుదల కానుంది. తెలుగు, హిందీతో పాటు దక్షిణాది భాషల్లోనూ ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. (ఇది చదవండి: ఆదిపురుష్.. సెన్సార్ బోర్డుపై హైకోర్టు ఫైర్) -
ప్రాజెక్ట్ కె విషయంలో ఆసక్తిగా ఉన్నాను
‘‘యాభై ఏళ్ల క్రితం నేను డ్యాన్స్ అసిస్టెంట్‌గా, అసిస్టెంట్ డైరెక్టర్‌గా చేస్తున్నప్పుడు నిర్మాణ రంగంలో అశ్వినీదత్ పేరు బాగా వినిపించేది. యాభై ఏళ్ల తర్వాత ఇప్పుడు మేం కలిసి పని చేయబోతున్నాం’’ అన్నారు కమల్‌హాసన్. ప్రభాస్, దీపికా పదుకోన్ జంటగా అమితాబ్ బచ్చన్ కీలక పాత్రలో వైజయంతీ మూవీస్ నిర్మిస్తున్న చిత్రం ‘ప్రాజెక్ట్ కె’. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో ఓ కీలక పాత్రను కమల్‌హాసన్ చేయనున్నారనే వార్త కొన్ని రోజులుగా ప్రచారంలో ఉంది. ఈ చిత్రంలో కమల్ నటించనున్న విషయాన్ని ఆదివారం చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఈ సందర్భంగా కమల్‌హాసన్ మాట్లాడుతూ – ‘‘మా తర్వాతి తరానికి చెందిన దర్శకుడి నేతృత్వంలో అదే తరానికి చెందిన కో–స్టార్స్ ప్రభాస్, దీపికాతో కలిసి నటించబోతున్నాను. అమిత్ జీ (అమితాబ్)తో కలిసి నటించినప్పటికీ ఆయనతో ఎప్పుడు సినిమా చేసినా మొదటిసారిలానే అనిపిస్తుంటుంది. అమిత్ జీ ఎప్పటికప్పుడు తనను తాను కొత్తగా ఆవిష్కరించుకుంటారు. నేను కూడా ఆ ప్రక్రియను అనుసరిస్తుంటాను. ‘ప్రాజెక్ట్ కె’ విషయంలో నేను చాలా ఆసక్తిగా ఉన్నాను. నేను సినిమా అభిమానిని. అందుకే నా పరిశ్రమలో ఏ కొత్త ప్రయత్నం జరిగినా మెచ్చుకుంటాను. అలా ‘ప్రాజెక్ట్ కె’ని ప్రశంసించే తొలి వ్యక్తిని నేనే కావాలనుకుంటున్నాను. మా దర్శకుడు నాగ్ అశ్విన్ విజన్ మన దేశం, ప్రపంచం మొత్తం మారుమోగుతుందని కచ్చితంగా చెబుతున్నాను’’ అన్నారు. ‘‘నా కెరీర్లో 50వ సంవత్సరంలో దిగ్గజ నటులు కమల్‌హాసన్, అమితాబ్ బచ్చన్‌లతో కలిసి పని చేసే అవకాశం రావడం అనేది నాకో వరం’’ అన్నారు అశ్వినీదత్. ‘‘లెజండ్ కమల్‌హాసన్ సార్‌తో కలిసి పని చేయడం గౌరవంగా భావిస్తున్నాను. ఆయన్నుంచి నేర్చుకునే అవకాశం రావడం అనేది ఓ కల నెరవేరిన క్షణంలా భావిస్తున్నాను’’ అన్నారు ప్రభాస్. ‘‘ఎన్నో విలక్షణ పాత్రలు చేసిన కమల్ సార్‌తో కలిసి పని చేయడం గౌరవంగా భావిస్తున్నాను. ఆయన మా చిత్రంలోకి వచ్చి ‘ప్రాజెక్ట్ కె’ని సంపూర్ణం చేశారు’’ అన్నారు నాగ్ అశ్విన్. -
ప్రభాస్‌దే అసలైన సక్సెస్.. కమల్‌తో పాత వీడియో వైరల్
డార్లింగ్ ప్రభాస్.. ఈ మధ్య కాలంలో పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. కానీ ఇలాంటి ట్రెండ్ ఏం లేనప్పుడే అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ లాంటి వాళ్లు దేశవ్యాప్తంగా ప్రేక్షకుల్ని ఎంటర్ టైన్ చేశారు. తమ సినిమాలతో ఆకట్టుకున్నారు. అలాంటిది ఇప్పుడు వీళ్ల ముగ్గురు కలిసి 'ప్రాజెక్ట్ K' అనే చిత్రం చేస్తున్నారు. ఇదంతా పక్కనబెడితే ప్రభాస్-కమల్ హాసన్ తో మాట్లాడిన పదేళ్ల క్రితం నాటి వీడియో ఇప్పుడు వైరల్ గా మారిపోయింది. (ఇదీ చదవండి: 'ప్రాజెక్ట్ K'లో కమల్ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?) సక్సెస్‌కి కేరాఫ్ ప్రభాస్! 'బాహుబలి' ముందు ప్రభాస్ గురించి తెలుగులో మాత్రమే తెలుసు. అలా 2013లో కమల్ హాసన్ 'విశ్వరూపం' సినిమా సక్సెస్ మీట్ కు హాజరయ్యాడు. విలక్షణ నటుడు కమల్ కు తనని తాను ప్రభాస్ అని పరిచయం చేసుకున్నాడు. కట్ చేస్తే.. పదేళ్లలో ఏకంగా ఆయనతోనే 'ప్రాజెక్ట్ K'లో స్క్రీన్ షేర్ చేసుకునే ఛాన్స్ కొట్టేశాడు. ఆ వీడియోని చూస్తున్న డార్లింగ్ ఫ్యాన్స్.. ఇది కదా అసలైన సక్సెస్ అంటే అని తెగ పొగిడేస్తున్నారు. ప్రభాస్ మాట్లాడింది ఇదే 'ఆయన(కమల్ హాసన్) సినిమాలు చూస్తూ పెరిగాను. ఆయన పక్కన కూర్చోవడమే నా అదృష్టం. ఆయనకు నేనెవరో తెలియదేమో. ఐ యామ్ ప్రభాస్ సర్. మా జనరేషనే కాదు ఇంకో 10 జనరేషన్లకు కమల్ హాసన్ అవసరం. కమల్ హాసన్ గారికి సినిమాలు ఎంతో అవసరమో తెలియదు గానీ ఇండియాకు ఆయన సినిమాలు చాలా అవసరం' అని ప్రభాస్ మాట్లాడిన పాత వీడియో ఇప్పుడు మరోసారి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. aayana cinema lu chusthune periganu, aayana pakkana kurchovadame na adrustam.. aayanaki nen ewaro telidemo "I'm Prabhas Sir". 🙏 pic.twitter.com/4c2PN09XFq — ︎︎︎︎︎︎︎︎ ︎︎︎︎︎︎︎Telugu Tonic (@TeluguTonic) April 30, 2020 View this post on Instagram A post shared by Prabhas (@actorprabhas) (ఇదీ చదవండి: ఓటీటీలోకి మన సూపర్‌హీరో మూవీ.. తెలుగులోనూ!) -
'ప్రాజెక్ట్ K'లో కమల్ హాసన్ ఫిక్స్.. రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?
ప్రభాస్ 'ఆదిపురుష్'ని ఫ్యాన్స్ నెమ్మదిగా మరిచిపోతున్నారు. 'సలార్' కోసం తెగ ఎదురుచూస్తున్నారు. దీని తర్వాత 'ప్రాజెక్ట్ K' అనే మరో క్రేజీ సినిమా లైన్ లో ఉంది. ఇందులో కమల్ హాసన్ నటిస్తున్నారని నిర్మాతలు అధికారికంగా ప్రకటించి, ఓ వీడియోని రిలీజ్ చేశారు. కీలక పాత్రలో కనిపిస్తారని చెప్పుకొచ్చారు. అలానే ఆ రోల్ కోసం ఆయన తీసుకుంటున్న రెమ్యునరేషన్ ఇప్పుడు ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. అలాంటి రోల్లో? 'విశ్వరూపం'తో ప్రేక్షకుల్ని అలరించిన కమల్ హాసన్.. ఆ తర్వాత పలు సినిమాలు చేసినప్పటికీ చెప్పుకోదగ్గ స్థాయిలో హిట్ కొట్టలేకపోయారు. 'విక్రమ్'తో మాత్రం కెరీర్ లో అద్భుతమైన విజయాన్ని అందుకున్నారు. ప్రస్తుతం 'ఇండియన్ 2' (భారతీయుడు 2) సినిమాతో బిజీగా ఉన్న కమల్.. ప్రభాస్ 'ప్రాజెక్ట్ K'లోనూ నటిస్తున్నట్లు ఖరారైంది. ఇందులో ప్రభాస్ కి విలన్ గా ఈయన చేయబోతున్నారని సమాచారం. (ఇదీ చదవండి: ఓటీటీలోకి మన సూపర్‌హీరో మూవీ.. తెలుగులోనూ!) అన్ని కోట్లు రెమ్యునరేషన్? 'ప్రాజెక్ట్ K' కోసం హీరో ప్రభాస్ కి రూ.150 కోట్ల వరకు ఇస్తున్నారని టాక్. ఇప్పుడు ఇదే సినిమాలో కీలకపాత్రలో నటిస్తున్న కమల్ కి రూ.100 కోట్లకు పైనే రెమ్యునరేషన్ ఇస్తున్నారని తెలుస్తోంది. ఒకవేళ ఇదే నిజమైతే మాత్రం కెరీర్ లోనే కమల్ తీసుకోబోయే అత్యధిక పారితోషికం ఇదవుతుంది. ఇందులో నిజమెంతనేది స్పష్టత రావాల్సి ఉంది. 'ప్రాజెక్ట్ K' రిలీజ్ వాయిదా ప్రభాస్ 'ప్రాజెక్ట్ K'ని సంక్రాంతి కానుకగా జనవరి 13న రిలీజ్ చేయబోతున్నట్లు కొన్నాళ్ల ముందు ప్రకటించారు. ఇప్పుడు కమల్ ని కన్ఫర్మ్ చేస్తూ రిలీజ్ చేసిన వీడియోలో మాత్రం ఆ తేదీ లేదు. దీంతో విడుదల వాయిదా పడినట్లే అని తెలుస్తోంది. వైజయంతీ మూవీస్ కి అచ్చొచ్చిన మే 9న.. ఈ చిత్రం థియేటర్లలోకి వచ్చే అవకాశాలు గట్టిగా కనిపిస్తున్నాయి. (ఇదీ చదవండి: పెద్ద కూతురి కోసం చిరంజీవి సంచలన నిర్ణయం!) -
ప్రభాస్ ప్రాజెక్ట్ కే లో విశ్వనటుడు కమల్ హాసన్
-
'ప్రాజెక్ట్ K'లో కమల్ హాసన్.. వీడియోతో క్లారిటీ
డార్లింగ్ ప్రభాస్ నటిస్తున్న సినిమాలో 'ప్రాజెక్ట్ k' ఒకటి. దీనికి మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ కావడంతో అంచనాలు గట్టిగానే ఉన్నాయి. ఎందుకంటే ఇందులో ప్రభాస్ తోపాటు అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొణె లాంటి స్టార్స్ ఉన్నారు. ఇదంతా కాదన్నట్లు భారీ బడ్జెట్ తో పాన్ వరల్డ్ స్థాయిలో తీస్తున్నారు. ఇప్పుడీ ప్రాజెక్ట్ లోకి విలక్షణ నటుడు వచ్చాడు. (ఇదీ చదవండి: ప్రెగ్నెంట్ అని తెలిసినా ఆ పనిచేశా: అలియా) గత కొన్నిరోజుల నుంచి సోషల్ మీడియాలో వినిపించినట్లే 'ప్రాజెక్ట్ K'లో కమల్ హాసన్ ఉన్నారని నిర్మాతలు ప్రకటించారు. ఓ కీలకపాత్రలో ఆయన నటిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. అయితే ప్రభాస్ హీరోగా నటిస్తుండగా, కమల్ విలన్ గా చేయబోతున్నారని తెలుస్తోంది. అసలు డైరెక్టర్ నాగ్ అశ్విన్.. కమల్ ని ఏం చెప్పి ఒప్పించారనేది సినిమా రిలీజ్ అయితే గానీ తెలియదు. ఏదేమైనా రోజురోజుకీ 'ప్రాజెక్ట్ K'లో భాగమవుతున్న యాక్టర్స్ ని చూస్తుంటే హైప్ ఎక్కడికో వెళ్లిపోతోంది. మరోవైపు వచ్చే సంక్రాంతికి అంటే జనవరి 13న ఈ సినిమాని థియేటర్లలోకి తీసుకొస్తున్నట్లు ప్రకటించారు. కానీ అది జరగడం కాస్త కష్టమే అనిపిస్తుంది. దీంతో నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ కి అచ్చొచ్చిన మే 9న 'ప్రాజెక్ట్ K' థియేటర్లలోకి వచ్చే అవకాశముందని అంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో? (ఇదీ చదవండి: ఫ్లైట్‌లో పోగొట్టుకున్నా.. ప్లీజ్ తెచ్చి ఇవ్వండి: ఊర్వశి రౌతేలా) -
పదునైన కళ్లు
హీరో ప్రభాస్ నటిస్తున్న తాజా పాన్ ఇండియా ఫిల్మ్ ‘్రపాజెక్ట్ కె’. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ప్రభాస్‌కి జోడీగా దీపికా పదుకోన్ నటిస్తున్నారు. వైజయంతీ మూవీస్‌పై అశ్వినీ దత్ నిర్మిస్తున్న ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, దిశా పటాని కీలక పాత్రలు చేస్తున్నారు. కాగా మంగళవారం (జూన్ 13) దిశా పటాని పుట్టినరోజు. ఈ సందర్భంగా పదునైన కళ్లతో ఆమె ప్రీ లుక్ ΄ోస్టర్‌ని మేకర్స్ విడుదల చేశారు. ‘‘ఫ్యూచరిస్టిక్ సైన్స్ ఫిక్షన్‌గా ‘్రపాజెక్ట్ కె’ రూ΄÷ందుతోంది. వైజయంతీ మూవీస్ ఈ గోల్డెన్ జూబ్లీ ్రపాజెక్ట్ను ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. 2024న సంక్రాంతి కానుకగా జనవరి 12న ఈ సినిమాని విడుదల చేస్తున్నాం’’ అని యూనిట్ పేర్కొంది. -
భక్తి, దేవాలయాల చుట్టూ తిరిగే కేరాఫ్ టెంపుల్ సినిమాలివే!
భక్తి రసాత్మక చిత్రాలు అరుదుగా వస్తుంటాయి. అలాగే కొన్ని కమర్షియల్ చిత్రాల్లో దేవుడి ప్రస్తావన ఉంటుంది. ప్రస్తుతం భక్తి నేపథ్యంలో, దేవాలయాలు ప్రధానాంశంగా కొన్ని చిత్రాలు రానున్నాయి. ‘కేరాఫ్ టెంపుల్’ అంటూ రానున్న ఆ చిత్రాల్లో కొన్ని ‘పాన్ ఇండియా’ స్థాయిలో విడుదల కానున్నాయి. మరి.. దేవుడు అంటేనే యూనివర్శల్. అన్ని భాషలవారికీ నప్పే కథాంశాలతో రానున్న ఈ చిత్రాల గురించి తెలుసుకుందాం. ఇటు రామాయణం.. అటు విష్ణుతత్వం ప్రభాస్ అంటే రెబల్ స్టార్. మాస్ పాత్రల్లోనే దాదాపు చూశాం. అందుకు భిన్నంగా సౌమ్యుడిగా కనిపించనున్నారు ప్రభాస్. ‘ఆదిపురుష్’లో రాముడిగా వెండితెరపై కరుణ కూడా కురిపించబోతున్నారు. ఈ పాత్రను ప్రభాస్ ఎగ్జయిటింగ్‌గా చేశారు. ప్రభాస్‌ని రాముడిగా చూడటానికి అభిమానులు, ప్రేక్షకులు అంతే ఎగ్జయిటింగ్‌గా ఉన్నారు. ఓమ్ రౌత్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సీతగా కృతీ సనన్ నటించారు. రామాయణ ఇతిహాసం నేపథ్యంలో గుల్షన్ కుమార్, టీ సిరీస్ సమర్పణలో భూషణ్ కుమార్, క్రిషన్ కుమార్, ఓమ్ రౌత్, ప్రసాద్ సుతారియా, రెట్రోఫిల్స్ రాజేష్ నాయర్, యూవీ క్రియేషన్స్ వంశీ, ప్రమోద్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 16న తెలుగు, హిందీ, తమిళ, మలయాళం, కన్నడ భాషల్లో విడుదల కానుంది. ఇక ‘ఆదిపురుష్’తో ఓవైపు శ్రీరాముడి గాథని ప్రేక్షకులకు చెబుతున్న ప్రభాస్.. మరోవైపు విష్ణు తత్వాన్ని కూడా బోధించనున్నారు. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఆయన హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘ప్రాజెక్ట్ కె’. బిగ్ బి అమితాబ్ బచ్చన్ ముఖ్య పాత్ర పోషిస్తున్న ఈ చిత్రంలో దీపికా పదుకోన్ కథానాయికగా నటిస్తున్నారు. తెలుగులో ఆమెకు ఇదే మొదటి చిత్రం. సైన్స్ ఫిక్షన్‌గా రూపొందుతున్న ఈ చిత్రం విష్ణు తత్వం, విష్ణు ఆధునిక అవతారం నేపథ్యంలో సాగుతుందని నిర్మాత అశ్వినీదత్ ఓ సందర్భంలో పేర్కొన్నారు. భారీ బడ్జెట్‌తో అశ్వినీదత్ నిర్మిస్తున్న ఈ పాన్ ఇండియా చిత్రం వచ్చే ఏడాది జనవరి 12న విడుదల కానుంది. గుడి కోసం రుద్రకాళేశ్వర్ రెడ్డి రుద్రకాళేశ్వర్ రెడ్డి ఓ గుడి కోసం పెద్ద మైనింగ్ మాఫి యాకి ఎదురు తిరుగుతాడు. ఒక సామాన్య కుర్రాడు మాఫియాని ఢీ కొనడం అంటే చిన్న విషయం కాదు. మరి గుడిని కాపాడటానికి రుద్రకాళేశ్వర్ ఏం చేశాడు? అనేది ‘ఆదికేశవ’లో చూడాలి. రుద్రకాళేశ్వర్ రెడ్డిగా వైష్ణవ్ తేజ్ నటిస్తున్నారు. మైనింగ్ బ్యాక్‌డ్రాప్‌లో ఒక ఊర్లో శివుడి గుడి చుట్టూ ఈ చిత్రకథ సాగుతుందని టీజర్ చూస్తే అర్థమవుతుంది. ‘ఇంత తవ్వేశారు.. ఆ గుడి జోలికి మాత్రం రాకండయ్యా.. శివుడికి కోపం వస్తే ఊరికి మంచిది కాదు’ అంటూ ఆలయ పూజారి చెప్పే డైలాగ్‌ని బట్టి చూస్తే శివుడు, గుడి చుట్టూ ఈ కథ సాగుతుందని స్పష్టమవుతోంది. శ్రీలీల హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ, ఎస్. సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. ఈ సినిమా జూలైలో ప్రేక్షకుల ముందుకు రానుంది. భైరవకోనలో ఏం జరిగింది? సందీప్ కిషన్ నటించిన తాజా చిత్రం ‘ఊరు పేరు భైరవకోన’. వీఐ ఆనంద్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో వర్షా బొల్లమ్మ, కావ్యా థాపర్ హీరోయిన్లు. సూపర్ నేచురల్ ఫ్యాంటసీ, సస్పెన్స్ థ్రిల్లర్, అడ్వెంచరస్ మూవీగా ‘ఊరు పేరు భైరవకోన’ రూపొందింది. భైరవకోనలోని ఓ గుడి నేపథ్యంలో ఈ చిత్రం సాగుతుందని తెలుస్తోంది. ‘శ్రీ కృష్ణ దేవరాయల కాలంలో చెలా మణిలో ఉన్న గరుడ పురాణానికి, ఇప్పటి గరుడ పురాణానికి నాలుగు పేజీలు తగ్గాయి’, ‘గరుడ పురాణంలో మాయమైపోయిన ఆ నాలుగు పేజీలే ఈ భైరవ కోన’ అనే డైలాగ్స్‌తో ఇటీవల ఈ మూవీ టీజర్ విడుదలైంది. అనిల్ సుంకర సమర్పణలో రాజేష్ దండా నిర్మించిన ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్ కానుంది. అంజనాద్రి కోసం.. ‘జాంబిరెడ్డి’ వంటి హిట్ మూవీ తర్వాత హీరో తేజా సజ్జ– డైరెక్టర్ ప్రశాంత్ వర్మ కాంబినేషన్లో రూపొందిన పాన్ ఇండియా చిత్రం ‘హను–మాన్’. హనుమంతుని శక్తులను పొందిన హీరో హనుమంతుని జన్మస్థలంగా పేర్కొంటున్న అంజనాద్రి కోసం ఎలా పోరాటం చేశాడు? అనే కథాంశంతో రూపొందిన చిత్రం ‘హను–మాన్’. ‘‘ఇండియన్ రియల్ సూపర్ హీరో హనుమంతుడి స్ఫూర్తితో అంజనాద్రి అనే ఊహాత్మక ప్రపంచం నేపథ్యంలో ఈ సినిమా రూపొందింది’’ అని చిత్ర యూనిట్ పేర్కొంది. అమృతా అయ్యర్ కథానాయికగా నటించిన ఈ చిత్రంలో వరలక్ష్మీ శరత్ కుమార్ కీలక పాత్ర చేశారు. చైతన్య సమర్పణలో కె. నిరంజన్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం తెలుగు, హిందీ, మరాఠీ, తమిళం, కన్నడ, మలయాళం, ఇంగ్లిష్, స్పానిష్, కొరియన్, చైనీస్, జపనీస్తో సహా పలు భారతీయ భాషల్లో విడుదల కానుంది. ఇవే కాదు.. మరికొన్ని సినిమాలు కూడా పురాణాలు, దేవాలయాలు, ఇతిహాసాల కథలతో రూపొందుతున్నాయి. -
మహేష్, రాజమౌళి సినిమా పై రానా సంచలన కామెంట్స్
-
ఇండియన్ స్క్రీన్ పై నయా ట్రెండ్
-
ఆర్ఆర్ఆర్, బాహుబలి సినిమాల రికార్డులు బ్రేక్: రానా కామెంట్స్ వైరల్
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, దీపికా పదుకొణే జంటగా తెరకెక్కుతోన్న చిత్రం ప్రాజెక్ట్ -కె. ఈ చిత్రానికి నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో రూపొందుతోన్న ఈ యాక్షన్ థ్రిల్లర్‌లో ఇప్పటికే అమితాబ్ బచ్చన్ కూడా నటిస్తున్నారు. తాజాగా ఈ చిత్రంలో మల్టీటాలెంటెడ్ నటుడు కమల్ హాసన్ కూడా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో హీరో రానా ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఓ ఇంటర్వ్యూలో రానా చేసిన వ్యాఖ్యలు ప్రభాస్ అభిమానుల్లో జోష్ నింపాయి. ఇంతకీ ఆయన ఏమన్నారో ఓ లుక్కేద్దాం. (ఇది చదవండి: ఇలియానాకు ప్రెగ్నెన్సీ.. రైడ్‌కు వెళ్లిన ముద్దుగుమ్మ!) రానా మాట్లాడుతూ.. 'మరికొన్ని రోజుల్లో ప్రాజెక్ట్-కె ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ మూవీ తప్పకుండా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది. బాహుబలి, ఆర్ఆర్ఆర్ రికార్డులను బ్రేక్ చేస్తుంది. ఈ సినిమా ఎప్పుడెప్పుడొస్తుందా అని ఎంతో ఆతృతగా ఉన్నా. ఈ టాలీవుడ్ మూవీ గ్లోబల్ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంటుందని ఆశిస్తున్నా. టాలీవుడ్లో ఒక హీరో సినిమాను మరొక హీరో సపోర్ట్ చేయడం చాలా గొప్ప విషయం. ఇండియా సినిమాలు విదేశాల్లోనూ సత్తా చాటుతున్నాయి. ప్రపంచ దేశాలన్నీ భారతీయ సంస్కృతిని ఎంతో గౌరవిస్తున్నాయి. అలాగే మంచి కథతో వచ్చిన సినిమాకు ఎక్కడైనా ఆదరిస్తారు.' అని అన్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. (ఇది చదవండి: పెళ్లయిన నాలుగు నెలలకేనా?.. నటిపై దారుణ ట్రోల్స్..!) -
ప్రభాస్ ప్రాజెక్ట్ కే లో విల్లన్ గా లోకనాయకుడు..!
-
‘ప్రాజెక్ట్ కే’లో కమల్ హాసన్.. ప్రభాస్‌తో ఢీ!
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కెరీర్లోనే అత్యధిక బడ్జెట్‌తో తెరకెక్కుతున్న మూవీ ‘ప్రాజెక్ట్ కే’. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో బాలీవుడ్ బిగ్‌బీ అమితాబ్ బచ్చన్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన వార్త ఒకటి సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఈ భారీ ప్రాజెక్ట్‌లో లోక నాయకుడు కమల్ హాసన్ భాగం కానున్నారనేది ఆ వార్త సారాంశం. (చదవండి: ఆడ పిల్లనని ముఖమే చూడలేదు..అన్నయ్య చాలా ఇబ్బంది పెట్టాడు: స్నేహ) అధికారికంగా ఎలాంటి ప్రకటన లేకపోయినా ఒక కీలకమైన పాత్ర కోసం దర్శకుడు నాగ్ అశ్విన్, కమల్ని సంప్రదించారట. అయితే కమల్ వెంటనే ఓకే చెప్పకపోయినా.. సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. కేవలం 20 రోజులు కాల్ షీట్స్ ఇస్తే ఆ భాగం పూర్తి చేస్తానని నాగ్ అశ్విన్ చెప్పాడట. అయితే కమల్ పోషించేది విలన్ పాత్రేనని కొంతమంది నెటిజన్స్ అంటున్నారు. మరి ఇందులో వాస్తవమెంత అనేది అధికారిక ప్రకటన వచ్చేవరకు తెలియదు. ప్రస్తుతం కమల్ ఇండియన్ 2 షూటింగ్లో బిజీగా ఉన్నారు. సెప్టెంబర్ వరకు కమల్ డేట్స్ ఖాలీగా లేవు. ఒకవేళ కమల్ ఒప్పుకుంటే.. సెప్టెంబర్ తర్వాతే ప్రాజెక్ట్ కే సెట్లో అడుగుపెడతాడు. మరోవైపు వచ్చే ఏడాది సంక్రాంతికి ప్రాజెక్ట్ కేని విడుదల చేయాలని వైజయంతి మూవీస్ టార్గెట్‌గా పెట్టుకుంది. టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ప్రభాస్ సరసన దీపికా పదుకొణె హీరోయిన్గా నటించింది. -
Prabhas: ప్రభాస్ పేరుతో రూ.4 వేల కోట్ల దందా!
`బాహుబలి` తర్వాత ప్రభాస్ రేంజ్ మారిపోయింది. పాన్ ఇండియా స్టార్‌గా మారాడు. ప్రస్తుతం ఇండియాలోనే మోస్ట్ బిజియెస్ట్ హీరో ప్రభాస్. సినిమా ఫలితంతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో దూసుకెళ్తున్నాడు. ప్రస్తుతం ఆయన చేతిలో నాలుగు భారీ సినిమాలు ఉన్నాయి. వాటిలో ఆదిపురుష్, సలార్ చిత్రాలు షూటింగ్ పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ప్రాజెక్ట్ కే, సూపర్ డీలక్స్(ప్రచారంలో ఉన్న టైటిల్) చిత్రాలు సెట్స్‌పై ఉన్నాయి. ఈ నాలుగు చిత్రాలతో ప్రభాస్ దాదాపు రూ.4 వేట కోట్ల బిజినెస్ జరిగే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. (చదవండి: కస్టడీ’కి ఊహించని కలెక్షన్స్, ఎంతంటే.. ) ఓ రౌత్ తెరకెక్కిస్తున్న ఆదిపురుష్ సినిమా బడ్జెట్ రూ.450 కోట్లు. రామాయణం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమా ట్రైలర్ ఇటీవల విడుదలై.. మంచి టాక్ని సంపాదించుకుంది. సినిమాకు హిట్ టాక్ లభిస్తే ఈజీగా రూ. 8 వందల నుంచి రూ.1000 కోట్ల వరకు బిజినెస్ చేస్తుందని సినీ విశ్లేషకులు చెబుతున్నారు. ‘కేజీయఫ్’ ఫేం ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న ‘సలార్’పై కూడా భారీ అంచనాలు ఉన్నాయి. దాదాపు రూ. 350 కోట్ల బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ చిత్రం రూ. 800-1000 కోట్ల వరకు బిజినెస్ చేసే అవకాశం ఉంది. ఇక ప్రభాస్ కెరీర్లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న పాన్ వరల్డ్ మూవీ ప్రాజెక్ట్ కే. నాగ్ అశ్విన్ ఈ చిత్రాన్ని భారీ యాక్షన్ సైన్స్ ఫిక్షన్‌గా రూపొందిస్తున్నారు. ఈ చిత్రం బడ్జెట్ రూ.500 కోట్లు. ప్రపంచ వ్యాప్తంగా అన్ని భాషల్లో ఈ చిత్రాన్ని విడుదల చేసే అవకాశం ఉంది.రూ.2000 కోట్లను కలెక్షన్ల టార్గెట్‌తో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇక వీటితో పాటు ఓ చిన్న సినిమాలోనూ ప్రభాస్ నటిస్తున్నాడు. మారుతి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి సూపర్ డీలక్స్ అనే టైటిల్ ప్రచారంలో ఉంది. ఈ మూవీ బడ్జెట్ రూ.200-300 కోట్లు. రూ. 500 కోట్ల కలెక్షన్ల టార్గెట్‌తో ఈ చిత్రం రాబోతుంది. ఇలా మొత్తంగా ప్రభాస్ పేరుతో చిత్ర పరిశ్రమలో రూ. 4000 కోట్ల బిజినెస్ జరుతుందట. ప్రస్తుతం టాలీవుడ్లో జరుగుతున్న వ్యాపారంలో దాదాపు సగం వరకు ప్రభాస్ పేరుతోనే జరగడం గమనార్హం. (చదవండి: రాజకీయాల్లోకి రీఎంట్రీ? కన్ఫర్మ్ చేసిన బండ్ల గణేశ్ ) -
'ప్రాజెక్ట్-k' ఆ హాలీవుడ్ మూవీకి రిమేకా! షాక్ లో ప్రభాస్ ఫ్యాన్స్
-
9 మంది హీరోలు.. 8000 కోట్ల దందా
టాలీవుడ్ సినిమా ఇండియన్ సినిమాకి దిక్సూచిగా మారింది. `బాహుబలి`, `ఆర్ఆర్ఆర్` చిత్రాలు తెలుగు సినిమా సత్తాని చాటాయి. ఈ చిత్రాలు బాగా ఆడటంతో తెలుగు సినిమా రేంజ్ పెరిగింది. భారీ బడ్జెట్ చిత్రాలు ఊపందుకున్నాయి. స్టార్ హీరోలపై వందల కోట్లు ఇన్వెస్ట్ చేయడానికి నిర్మాతలు వెనకాడటం లేదు. దీంతో ఇప్పుడు మెయిన్ స్టార్ హీరోలపై వేల కోట్ల బిజినెస్ జరుగుతుంది. ముఖ్యంగా మన తెలుగు హీరోల్లో.. ప్రభాస్, పవన్, బన్నీ, చరణ్, ఎన్టీఆర్, మహేష్, చిరు, బాలయ్య, రవితేజ వంటి తొమ్మిది మంది స్టార్స్ పై ఏకంగా ఎనిమిది వేల కోట్ల దందా జరుగుతుండటం విశేషం. టాలీవుడ్లో జరుగుతున్న మొత్తం బిజినెస్‌లో సగం కేవలం ప్రభాస్ పైనే కావడం విశేషం. ఆయన పేరుతో ఇప్పుడు నాలుగువేల కోట్ల దందా నడుస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఆ వివరాలు చూస్తే.. ప్రస్తుతం ప్రభాస్ `ఆదిపురుష్`, `సలార్`, `ప్రాజెక్ట్ కే`తోపాటు `సూపర్ డీలక్స్`(వినిపించే పేరు) చిత్రాల్లో నటిస్తున్నారు ప్రభాస్. ఇందులో ఓ రౌత్ రూపొందిస్తున్న `ఆదిపురుష్` బడ్జెట్ ఐదువందల కోట్లు. రామాయణం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఇప్పుడు 7 నుంచి 8 వందల కోట్ల వ్యాపారం జరుగుతుంది. కలెక్షన్ల టార్గెట్ కూడా సుమారు అంతే ఉంటుందని టాక్. (చదవండి: నాన్న చనిపోతే వాళ్లు తప్ప చూసేందుకు ఎవరూ రాలేదు: కమెడియన్ కొడుకు) దీంతోపాటు`కేజీఎఫ్` ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో చేస్తున్న భారీ యాక్షన్ మూవీ `సలార్` బడ్జెట్ సుమారు రూ.350కోట్లు, దీనిపై జరుగుతున్న బిజినెస్ ఎనిమిది వందల కోట్లు, కలెక్షన్ల టార్గెట్ 1200-1500కోట్లు కావడం విశేషం. ఇక ప్రభాస్ కెరీర్లోనే అత్యధిక బడ్జెట్‌తో రూపొందుతున్న చిత్రం `ప్రాజెక్ట్ కే`. దర్శకుడు నాగ్ అశ్విన్ దీన్ని భారీ యాక్షన్ సైన్స్ ఫిక్షన్‌గా రూపొందిస్తున్నారు. సూపర్ హీరో అంశాలను జోడించి టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్ తో తెరకెక్కిస్తున్నారని టాక్. ఆఈ సినిమా బడ్జెట్ రూ.500-600కోట్లు. ఈ సినిమాపై వ్యాపారం వెయ్యి కోట్లకుపైగానే జరుగుతుంది. కలెక్షన్ల టార్గెట్ మాత్రం రూ.2వేల కోట్లు. (చదవండి: నా కూతురి విషయంలో రణ్‌బీర్ భయం అదే : అలియా భట్) దీన్ని ఇంటర్నేషనల్ రేంజ్లో రిలీజ్‌కి ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. దీంతోపాటు ఓ చిన్న సినిమా చేస్తున్నారు ప్రభాస్. మారుతి దర్శకత్వంలో `సూపర్ డీలక్స్` పేరుతో ఓ ఎంటర్టైనింగ్ మూవీ చేస్తున్నారు. సుమారు రెండువందల యాభై కోట్ల బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ సినిమా బిజినెస్, కలెక్షన్ల టార్గెట్ ఐదు వందల కోట్ల వరకు ఉంటుందని సమాచారం. ఇలా ప్రభాస్ పేరుతోనే ఆల్మోస్ట్ 4వేల కోట్లకుపైగా వ్యాపారం జరుగుతుందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఓ రకంగా డార్లింగ్ ఇప్పుడు ఇండియన్ సినిమాని శాసిస్తున్నారని చెప్పొచ్చు. ప్రభాస్ తర్వాత ఇప్పుడు అత్యధికంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పేరుతో నడుస్తుంది. నిజానికి ఆయన సినిమాలు కలెక్షన్లు, బిజినెస్ లెక్కల్లో ఉండవు. కానీ ఈ సారి మాత్రం ఆయన సినిమాలపై వేల కోట్ల వ్యాపారం జరుగుతుండటం విశేషం. పవన్ ప్రస్తుతం నాలుగు సినిమాలు చేస్తున్నారు. అందులో `హరిహరవీరమల్లు`, `వినోదయ సీతం` రీమేక్, `ఉస్తాద్ భగత్ సింగ్`, `ఓజీ` సినిమాలున్నాయి. ఈ పవన్ నాలుగు సినిమాలపై ఏకంగా 1200-1500-కోట్ల వ్యాపారం జరగబోతుందని ట్రేడ్ వర్గాల అంచనా. ఆ తర్వాత ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నిలుస్తారు. ప్రస్తుతం ఆయన సుకుమార్ దర్శకత్వంలో `పుష్ప2` చిత్రం చేస్తున్నారు. ఈ సినిమా బడ్జెట్ మూడు వందల కోట్ల వరకు ఉంటుందని సమాచారం. బిజినెస్ టార్గెట్ మాత్రం 600-700కోట్ల వరకు ఉంటుంది. కలెక్షన్ల టార్గెట్ వెయ్యి కోట్ల వరకు అంచనా వేస్తున్నారు. మొదటి భాగం భారీ బ్లాక్ బస్టర్ కావడంతో రెండో పార్ట్ పై ఆసక్తి ఏర్పడింది. ఇటీవల విడుదలైన మూడు నిమిషాల టీజర్ గూస్‌బంమ్స్ తెప్పించింది. సినిమాపై అంచనాలను మరింతగా పెంచేసింది. దీంతో వ్యాపారం కూడా భారీగానే జరగబోతుందన్నట్టు సమాచారం. `ఆర్ఆర్ఆర్` స్టార్ రామ్‌చరణ్ సైతం ఈ రేస్‌లో నిలిచారు. `ఆర్ఆర్ఆర్`తో పాన్ ఇండియా స్టార్ నుంచి గ్లోబల్ స్టార్ ట్యాగ్‌ని తగిలించుకున్న చెర్రీ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో `గేమ్ ఛేంజర్` చిత్రంలో నటిస్తున్నారు. పొలిటికల్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ సినిమా సుమారు రూ.350-400కోట్ల బడ్జెట్‌తో నిర్మాణం జరుపుకుంటోంది. దీనిపై ఐదు వందల కోట్ల వ్యాపారం జరగబోతుంది. ఈ సినిమా నుంచి 600-700కోట్ల కలెక్షన్లని ఆశిస్తున్నారు నిర్మాత దిల్‌రాజు. ఆయన బిజినెస్ చేయడంలో దిట్ట. అంతకు మించి బిజినెస్ చేసినా ఆశ్చర్యం లేదు. . మరో `ఆర్ఆర్ఆర్` స్టార్ ఎన్టీఆర్ సైతం ఈ లీగ్‌లోనే ఉన్నారు. ఆయన ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో పీరియాడికల్ యాక్షన్ నేపథ్యంలో `ఎన్టీఆర్ 30`మూవీ చేస్తున్నారు. కోస్టల్ ఏరియాలో గుర్తింపుకి, ఆదరణకు నోచుకోని, దూరంగా నెట్టివేయబడ్డ ప్రాంతం కథతో రా అండ్ రస్టింగ్ గా ఈ మూవీ సాగుతుందట. ఈ సినిమా బడ్జెట్ రూ250-300కోట్ల వరకు ఉంటుందని సమాచారం. ఈ లెక్కన ఈ సినిమాపై 400-500కోట్ల బిజినెస్‌ని ఐదారు వందల కోట్ల కలెక్షన్లని ఆశిస్తున్నారు. పాన్ ఇండియాని మించి ఈ సినిమాని ప్లాన్ చేస్తున్నారు కొరటాల. దీనికి హాలీవుడ్ టెక్నీషియన్లు పనిచేస్తున్న విషయం తెలిసిందే. రిలీజ్ టైమ్ కి ఈ లెక్కలు మారిపోయే అవకాశం ఉంది. సూపర్ స్టార్ మహేశ్ బాబు కూడా ఐదు వందల కోట్లని టార్గెట్ చేశారు. ఆయన ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో `ఎస్ఎస్ఎంబీ28` చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమా సుమారు రూ.200కోట్ల బడ్జెట్‌తో రూపొందుతుంది. ఈ సినిమాపై ఈజీగా మూడు వందల కోట్ల బిజినెస్ జరుగుతుంది. 350-400 కోట్ల వరకు కలెక్షన్లని ఆశిస్తున్నారు. పాన్ ఇండియా రేంజ్లో ప్లాన్ చేస్తే ఐదు వందల కోట్ల వరకు టార్గెట్ చేసే అవకాశం ఉంది. ఇలా ప్రధానంగా ఈ ఆరుగురు హీరోలపైనే ఏడువేల కోట్ల వ్యాపారం జరుగుతుందని చెప్పొచ్చు. వీరితోపాటు రెండువందలకోట్లకుపైగా బిజినెస్ టార్గెట్‌తో చిరంజీవి, బాలకృష్ణ, రవితేజ వంటి వారు వస్తున్నారు. చిరంజీవి ప్రస్తుతం `భోళాశంకర్` చిత్రంలో నటిస్తున్నారు. 150కోట్లకుపైగా బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ సినిమా నుంచి సుమారు రెండు వందల కోట్ల వరకు ఆశిస్తున్నారు. అలాగే సుమారు రూ.70-80కోట్ల బడ్జెట్‌తో రూపొందుతున్న బాలయ్య, అనిల్ రావిపూడి మూవీ `ఎన్బీకే108` కలెక్షన్ల టార్గెట్ కూడా రెండు వందల కోట్లు ఉంటుంది. అలాగే రవితేజ ప్రస్తుతం `టైగర్ నాగేశ్వరరావు` అనే పాన్ ఇండియా సినిమా చేస్తున్నారు. భారీ స్థాయిలో తెరకెక్కుతున్న ఈ చిత్రం నుంచి 200-250కోట్ల వరకు కలెక్షన్లని ఆశిస్తున్నారు. ఇలా ఈ తొమ్మిది మంది హీరోలపైనే ఎనిమిది వేల కోట్ల వరకు సినిమా దందా నడుస్తుందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. వీరితోపాటు మిగిలిన యంగ్ హీరోల సినిమాలపై వ్యాపారం ఈజీగా మరో 1500కోట్లకుగానే ఉంటుంది. మొత్తంగా చూస్తే ప్రస్తుతం టాలీవుడ్ హీరోలపై పదివేల కోట్ల వ్యాపారం జరుగుతుందని చెప్పొచ్చు. ఇలా అత్యధిక సినిమా వ్యాపారంతో టాలీవుడ్ ఇండియాలోనే టాప్‌లో నిలిచిందని ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. -
ప్రభాస్ మాస్టర్ ప్లాన్.. ప్లాప్ లు వచ్చిన తగ్గని ఇమేజ్!
హీరోలకు సినిమాలు ప్లాప్ అయితే మార్కెట్ తో పాటు...ఇమేజ్ తగ్గుతుంది. కానీ ప్రభాస్ విషయంలో అలా జరగటం లేదు. రివర్స్ లో జరుగుతోంది. బాహుబలి 2 తర్వాత ప్రభాస్ ఇమేజ్ పాన్ ఇండియా దాటి...గ్లోబల్ రేంజ్ కి పెరిగిపోయింది. ఈ సినిమా తర్వాత ప్రభాస్ పాన్ ఇండియా మూవీస్ పైనే పోకస్ పెట్టాడు. బాహుబలి తర్వాత విడుదలైన రెండు సినిమాలు ప్రభాస్ ఇమేజ్ ను టచ్ చేయలేకపోయాయి.అయినా ప్రస్తుతం ప్రభాస్ చేతిలో ఏ పాన్ ఇండియా హీరో చేతిలో లేనన్ని సినిమాలు ఉన్నాయి. ఈ సినిమాలతో పాన్ వరల్డ్ రేంజ్ లో సత్తా చాటేందుకు రెడీ గా ఉన్నాడు ప్రభాస్.. బాహుబలి తర్వాత భారీ బడ్జెట్ సినిమాలకు ప్రభాస్ కేరాఫ్ అడ్రస్ గా మారిపోయాడు. బాహుబలి ది కన్ క్లూజన్ తర్వాత ప్రభాస్... సుజిత్ దర్శకత్వంలో సాహో సినిమాలో నటించాడు. బాహుబలి తర్వాత మూవీ కావటంతో పాన్ ఇండియా రేంజ్ లో మంచి హైప్ క్రియేట్ అయింది. అయితే ఈ సినిమా అనుకున్నంత స్థాయిలో సౌతిండియా ప్రేక్షకులను ఆకట్టుకోలేదు. బాలీవుడ్ లో మాత్రం మంచి వసూళ్లు రాబట్టింది. ఇక సాహో తర్వాత ప్రభాస్ నటించిన పిరియాడికల్ లవ్ స్టోరీ రాధేశ్యామ్. హై బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాపీస్ దగ్గర బోల్తా పడింది. బ్యాక్ టూ బ్యాక్ ప్రభాస్ రెండు పాన్ ఇండియా సినిమాలు ప్లాప్ అయ్యాయి. ఇక ప్రభాస్ ఫ్యాన్స్ విపరీతంగా డిస్పాయింట్ అయ్యారు. అప్పుడు ప్రభాస్ తన రూట్ మార్చాడు. తన మూవీ సెలక్షన్ దగ్గర నుంచే హైప్ క్రియేట్ ప్లాన్ చేసుకున్నాడు. అదే తనకి ఇప్పుడు ప్లస్ గా మారింది. రాదేశ్యామ్ తర్వాత ...బాలీవుడ్ లో డెబ్యూ ఇచ్చేందుకు రెడీ అయ్యాడు. ఓంరౌత్ దర్శకత్వంలో మైధిలాజికల్ మూవీ ఆదిపురుష్ ప్రాజెక్ట్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈ మూవీలో ప్రభాస్ రాముడిగా కనిపించనున్నాడు. ప్రభాస్ బాలీవుడ్ మూవీలో నటిస్తున్నాడనే మాట...రాముడిగా కనిపించనున్నాడనే విషయం తెలియటంతో ఫ్యాన్స్ లో జోష్ వచ్చింది. ఆ తర్వాత ఫుల్ మాస్ అండ్ యాక్షన్ మూవీ చేయాలని డిసైడ్ అయ్యాడు. ఇందుకోసం కేజీయఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో సలార్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేశాడు. కేజీఎఫ్ తర్వాత ప్రశాంత్ నీల్ చేస్తున్న సినిమా సలార్..దీంతో సినిమా పై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. బొగ్గు గనుల నేపథ్యంలో తెరకెక్కుతున్న సలార్ ఫస్ట్ లుక్ పోస్టర్ లో ప్రభాస్ అదిరిపోయింది. దీంతో బ్యాక్ టూ బ్యాక్ రెండు ప్లాప్ ఇచ్చిన ప్రభాస్ ఈ సారి ఖచ్చితంగా హిట్ కొడతాడనే నమ్మకం ఫ్యాన్స్ లో కలిగింది. ప్రభాస్ తన పక్కా ప్లానింగ్ తోనే తనకి వచ్చిన గ్లోబల్ స్టార్ కి ఇమేజ్ డ్యామేజ్ జరగకుండా చూసుకున్నాడు. ఇక రెండు సినిమాల తర్వాత డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో హాలీవుడ్ రేంజ్ లో ఓ సైన్స్ ఫిక్షన్ మూవీలో నటిస్తున్నాడు. దాదాపు 500 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కనున్న ఈ సినిమాలో అమితాబ్, దీపికా పదుకునే నటిస్తున్నారు.ఇక ఈ సినిమా ఇంగ్లీష్ లో డబ్ చేసి హాలీవుడ్ లో కూడా రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు మేకర్స్.. అయితే ఇప్పుడు ఆర్ఆర్ఆర్ ఆస్కార్ సాధించటంతో...హాలీవుడ్ లో తెలుగు సినిమాలపై ఇంట్రెస్ట్ పెరిగింది. దీంతో ఆదిపురుష్ మాత్రమే కాదు...సలార్ సినిమా కూడా ఇంగ్లీష్ లో డబ్ చేసి హాలీవుడ్ లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్...ఇక సలార్ సినిమా అయితే పాటలు..కామెడీ ట్రాక్ లేకుండా హాలీవుడ్ లో రిలీజ్ చేస్తారనే మాట వినిపిస్తోంది. సెట్స్ పై ఈ మూడు సినిమాలు మాత్రమే కాదు మరో సినిమా కూడా వుంది. డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్నాడు ప్రభాస్..ఈసినిమాకి సంబంధించి అఫిషియల్ అనౌన్స్మెంట్ చేయకుండానే...షూటింగ్ స్టార్ట్ చేశారు. ఈ ఏడాది లో ప్రభాస్ ఆదిపురుష్. సలార్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకి రానున్నాడు. జూన్ 16న ఆదిపురుష్, సెప్టెంబర్ 28 సలార్ విడుదలకి సిద్దంగా వున్నాయి. తన ప్లానింగ్ తో కెరీర్ కు డ్యామేజ్ కాకుండా చూసుకున్నాడు ప్రభాస్. తన చేతిలో ఉన్న సినిమాలు హిట్ అయితే ప్రభాస్ ఇమేజ్ నెక్ట్స్ లెవల్‌కి వెళ్లడం ఖాయమని ఫ్యాన్స్అంటున్నారు. -
చికిత్స కోసం విదేశాలకు ప్రభాస్.. అసలు ఏమైంది?
రాధేశ్యామ్ తర్వాత ప్రభాస్ స్పీడ్ పెంచాడు. ఇప్పటికే ఆదిపురుష్ షూటింగ్ కంప్లీట్ చేసుకొని.. మరో మూడు సినిమాలను సెట్స్‌పైకి తీసుకొచ్చాడు. ప్రస్తుతం సలార్, ప్రాజెక్ట్ కె, మారుతి సినిమాల షూటింగ్స్ తో ఫుల్ బిజీగా ఉన్నాడు. వరుస షూటింగ్స్ కారణంగా ప్రభాస్ ఈ మధ్య తరుచూ అనారోగ్యం పాలవుతున్నాడు. జర్వంతో బాధపడుతూ షూటింగ్స్‌కి రాలేకపోతున్నాడు. దీంతో ఆ సినిమా షూటింగ్స్ క్యాన్సిల్ అవుతున్నాయి. ఆదిపురుష్ టీజర్ లాంచింగ్ సమయంలో ప్రభాస్ మోకాళ్ల ఆపరేషన్ చేయించుకున్నాడు. ఆ తర్వాత నుంచి ప్రభాస్ తరుచూ జ్వరంతో బాధపడుతున్నాడు. రీసెంట్ ఫిబ్రవరిలో కూడా జ్వరం కారణంగా మారుతి సినిమా షూటింగ్ కొన్ని రోజులు క్యాన్సిల్ చేశారు. ఇక డాక్టర్స్ అయితే ప్రభాస్ కొన్నాళ్లపాటు షూటింగ్స్ కి బ్రేక్ ఇవ్వాలని సూచించారట. అయితే ప్రభాస్ తన చేతిలో ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేసిన తర్వాత బ్రేక్ తీసుకోవాలని ప్లాన్ చేసుకున్నాడు. కానీ ప్రభాస్ తన ఆరోగ్య సమస్య కారణంగా తీవ్ర ఇబ్బంది పడటంతో ...ట్రీట్ మెంట్ కోసం విదేశాలకు వెళ్లినట్లు తెలుస్తుంది. అయితే అభిమానులు కంగారు పడాల్సిన అవసరం లేదని...జస్ట్ క్యాజువల్ హెల్త్ చెకప్ కోసం వెళ్లినట్లు ప్రభాస్ టీమ్ చెబుతున్న మాట. అయితే ఈ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ ఆఫ్ టాలీవుడ్‌కి సంబంధించి నెట్టింట ఓ వార్త తెగ చక్కర్లు కొడుతోంది. కొన్నాళ్ళ పాటు ప్రభాస్ షూటింగ్స్ కి బ్రేక్ ఇచ్చే అవకాశం ఉందని టాలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. తన హెల్త్ కోసం ప్రభాస్ ఈ నిర్ణయం తీసుకున్నాడట. బాహుబలి కోసం బరువు పెరగడం, ఆ తర్వాత తగ్గడం, మధ్యలో సాహో లాంటి భారీ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ చేశాడు ప్రభాస్... ఈ కారణంగా ప్రభాస్ హెల్త్ విషయంలో కొన్ని సమస్యలు ఎదుర్కొంటున్నాడనేది టాలీవుడ్ టాక్. ప్రభాస్ హెల్త్ ఇష్యూ ప్రభావం సలార్ తో పాటు, ప్రాజెక్ట్ కె పై పడే అవకాశాలు ఉన్నాయి. ప్రాజెక్ట్ కె షూటింగ్ లో అమితాబ్ కూడా గాయపడ్డాడు. ఇక ప్రభాస్ తో పాటు అమితాబ్ కోలుకున్న తర్వాతే ప్రాజెక్ట్ కె షూటింగ్ స్టార్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇక సలార్ రిలీజ్ కూడా దాదాపు వాయిదా పడే ఛాన్స్ ఉందనే మాట ఫిల్మ్ సర్కిల్ లో వినబడుతోంది. దీంతో తమ అభిమాన హీరో ప్రభాస్ కి ఏమైందనే ఆందోళన ప్రభాస్ ఫ్యాన్స్ లో మొదలైంది. అసలు ప్రభాస్ కి ఏమైంది.? ప్రబాస్ జనరల్ హెల్త్ చెకప్ కోసమే విదేశాలకు వెళ్లాడా? లేదా ట్రీట్ మెంట్ తీసుకునేందుకు వెళ్లాడా? అనే విషయాలు తెలియాలంటే ప్రభాస్ ఫారిన్ కంట్రీ నుంచి తిరిగి వచ్చే వరకు ఆగాల్సిందే. -
ప్రాజెక్ట్ కెలో దీపికా పదుకొణె.. భారీ రెమ్యూనరేషన్..!
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘ప్రాజెక్ట్ కె’. ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొణే హీరోయిన్గా నటిస్తోంది. ఆమెతో పాటు బిగ్ బీ అమితాబ్ బచ్చన్, దిశా పటానీ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఓ వార్త నెట్టింట్లో వైరలవుతోంది. బాలీవుడ్ భామ దీపికా పదుకొణే భారీ రెమ్యూనరేషన్పై చర్చ నడుస్తోంది. ఈ చిత్రంలో నటించేందుకు ఆమె రూ.10 కోట్ల పారితోషికం తీసుకుంటున్నట్లు సమాచారం. ప్రభాస్ నటిస్తున్న పాన్ ఇండియా చిత్రాన్ని రూ.500 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. నాగ్ అశ్విన్ డైరెక్షన్లో వైజయంతి మూవీస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఇప్పటికే దాదాపు 70 శాతం షూటింగ్ పూర్తయిన ఈ సైన్స్ ఫిక్షన్ చిత్రంలో భారీగా ఎఫెక్ట్స్ ఉండడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ సినిమా సంక్రాంతి కానుకగా వచ్చే ఏడాది జనవరి 12, 2024న థియేటర్లలో విడుదల చేయనున్నారు. ఈ పాన్ ఇండియా చిత్రాన్ని హిందీ, తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ, ఇంగ్లీష్ భాషల్లో రిలీజ్ చేయనున్నారు. (ఇది చదవండి: ప్రభాస్ ‘ప్రాజెక్ట్ కె’ లో కీలక మార్పులు.. మిక్కీ ఔట్!) కాగా.. ప్రస్తుతం దీపికా నటించిన పఠాన్ బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. తాజాగా ఆమె ఆస్కార్ ప్రతిష్టాత్మక అవార్డు కార్యక్రమంలో ప్రెజెంటర్‌గా అరుదైన అవకాశం దక్కించుకుంది. ఈనెల 12న లాస్ఎంజిల్స్లో జరగనున్న కార్యక్రమంలో దీపికా పాల్గొననున్నారు. -
ప్రాజెక్ట్ కె షూటింగ్లో ప్రమాదం.. అమితాబ్ బచ్చన్‌కు గాయాలు
బాలీవుడ్ దిగ్గజ నటుడు అమితాబ్ బచ్చన్‌కు గాయాలయ్యాయి. ప్రాజెక్ట్ కె షూటింగ్లో జరిగిన ప్రమాదంలో ఆయన గాయపడ్డారు. రామోజీ ఫిలింసిటీలో జరుగుతున్న ఈ సినిమా షూటింగ్లో యాక్షన్ సీన్స్ చిత్రీకరిస్తుండగా అనుకోకుండా ప్రమాదం జరిగింది. వెంటనే స్పందించిన మూవీ టీం ఆయన్ను గచ్చిబౌలి ఏఐజీలో ఆసుపత్రిలో చేర్పించారు. ప్రమాదంలో అమితాబ్ పక్కటెముకలకు గాయాలయ్యాయని, రెండు వారాలు బెడ్ రెస్ట్ తీసుకోవాల్సిందిగా వైద్యులు సూచించారు.ఏఐజీలో చికిత్స అనంతరం బిగ్‌బి ముంబైకి వెళ్లారు.అయితే తన ఆరోగ్యం విషయంలో అభిమానులు ఎవరూ ఆందోళన చెందవద్దని అమితాబ్ తెలపారు. తాను ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నానని, త్వరలోనే కోలుకుంటానని పేర్కొన్నారు. ఈ మేరకు తన ఆరోగ్యానికి సంబంధించిన అప్డేట్ను బ్లాగ్‌లో రాసుకొచ్చారు.ప్రభాస్, దీపికా పదుకొణె జంటగా ప్రాజెక్ట్ కె సినిమా తెరకెక్కతున్న సంగతి తెలిసిందే. నాగ్ అశ్విన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ సినిమాలో బిగ్ బి అమితాబ్ బచ్చన్ కీలక పాత్రలో కనిపించనున్నారు. -
ప్రభాస్ ‘ప్రాజెక్ట్ కె’ లో కీలక మార్పులు.. మిక్కీ ఔట్!
ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘ప్రాజెక్ట్ కె’. దీపికా పదుకోన్ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, దిశా పటానీ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రంలో కీలక మార్పులు చేశారు మేకర్స్. ఈ సినిమా సంగీత దర్శకుడిని మార్చేశారు. తొలుత ‘ప్రాజెక్ట్ కె’ అనౌన్స్ చేసినప్పుడు మిక్కీ జె మేయర్‌ని మ్యూజిక్ డైరెక్టర్‌గా ప్రకటించారు. కానీ ఇప్పుడు ఆయన స్థానంలో సంతోష్ నారాయణన్ వచ్చి చేరారు. ఈ విషయాన్ని ప్రొడ్యూసర్ అశ్వనీదత్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. అయితే ఈ మార్పుకు గల కారణాన్ని మాత్రం తెలియజేయలేదు. అంతేకాకుండా ఈ మూవీకి సంబంధించిన పలు ఆసక్తకిర విషయాలను కూడా పంచుకున్నారు. ఈ మూవీ సైన్స్ ఫిక్షన్ జానర్ అయినా.. ఎమోషన్స్, సెంటిమెంట్ అన్ని ఉంటాయని అన్నారు. దాదాపు 70 శాతం షూటింగ్ పూర్తయినట్ల ఆయన వెల్లడించారు. ప్రభాస్‌తో పాటు దీపికా పదుకొణె, అమితాబ్‌లకు స్క్రీన్ స్పెస్ ఎక్కువగా ఉంటుందని చెప్పారు. ఈ సినిమాకు సంబంధించిన ఈ సినిమాకు సంబంధించిన గ్రాఫిక్స్ వర్క్ ఐదారు కంపెనీలు చేస్తున్నాయని.. వాటిని తెరపై చూసినప్పుడు అద్భుతంగా ఉంటుందని అన్నారు. ఇక సంగీత దర్శకుడు సంతోష్ నారాయణన్ విషయానికొస్తే.. తమిళంలో పలు చిత్రాలకు సంగీతం అందించారు. ఆయన పని చేసే చిత్రాలలో నేపథ్య సంగీతం అద్భుతంగా ఉంటుంది. తెలుగు ప్రస్తుతం నాని ‘దసరా’, వెంకటేశ్ ‘సైంధవ్’ చిత్రాలకు సంగీతం అందిస్తున్నారు. -
‘ప్రాజెక్ట్ కె’ రిలీజ్ డేట్ వచ్చేసింది.. ఆసక్తిని పెంచేసిన కొత్త పోస్టర్
మహాశివరాత్రి వేళ ప్రభాస్ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్ చెప్పించి ‘ప్రాజెక్ట్ కె’ మూవీ యూనిట్. ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం విడుదల తేదిని ప్రకటించారు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నట్లు వెల్లడిస్తూ పోస్టర్ని విడుదల చేశారు. ఆ పోస్టర్ సినిమాపై మరింత ఆస్తకిని పెంచేసింది. అందులో ఓ ఎడారిలో ఓ భారీ చేతిని స్నిపర్స్ జాగ్రత్తగా చూస్తున్నారు. దీపికా పదుకోన్ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, దిశా పటానీ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఇంతవరకు ఎవరు టచ్ చేయని పాయింట్‌తో.. అత్యాధునిక సాంకేతిక హంగులతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. వైజయంతీ మూవీస్ పతాకంపై అశ్వినీదత్ నిర్మిస్తున్న ఈ చిత్రం రెండు పార్ట్‌లుగా రాబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. 𝟏𝟐-𝟏-𝟐𝟒 𝐢𝐭 𝐢𝐬! #𝐏𝐫𝐨𝐣𝐞𝐜𝐭𝐊 Happy Mahashivratri.#Prabhas @SrBachchan @deepikapadukone @nagashwin7 @VyjayanthiFilms pic.twitter.com/MtPIjW2cbw — Vyjayanthi Movies (@VyjayanthiFilms) February 18, 2023 -
ఓ పెద్ద కథ ..రెండు సినిమాలు
అన్ని సినిమాలకూ కథ ఉంటుంది. కొన్ని సినిమాలకు పెద్ద కథ ఉంటుంది. అయితే ఆ పెద్ద కథని రెండున్నర గంటల్లో చూపించలేరు. అందుకే రెండు మూడు భాగాలుగా చూపిస్తారు. అలా ఈ ఏడాది ఇటు సౌత్ అటు నార్త్‌లో ‘పార్ట్ 2’ సినిమాలు చాలానే రానున్నాయి. తొలి భాగం విడుదలై, ఘనవిజయం సాధించిన నేపథ్యంలో మలి భాగంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక కొన్ని చిత్రాలైతే తొలి, మలి భాగం రెండూ ఆన్సెట్స్లో ఉన్నాయి. ఈ చిత్రాల గురించి తెలుసుకుందాం. హీరో అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రం ‘పుష్ప’. ఈ చిత్రం తొలి భాగం ‘పుష్ప: ది రైజ్’ 2021 డిసెంబరులో రిలీజై సూపర్‌హిట్ అయింది. దీంతో మలి భాగం ‘పుష్ప: ది రైజ్’పై మరింత ఫోకస్ పెట్టింది ఈ టీమ్. ఈ సినిమా షూటింగ్ వైజాగ్‌లో జరుగుతోంది. ‘పుష్ప: ది రూల్’ను ఈ ఏడాదే రిలీజ్ చేయా లనుకుంటున్నారు. మరోవైపు మణిరత్నం దర్శకత్వంలో రూపొందిన హిస్టారికల్ ఫిల్మ్ ‘పొన్నియిన్ సెల్వన్’. విక్రమ్, ‘జయం’ రవి, కార్తీ, ఐశ్వర్యా రాయ్, త్రిష ఈ చిత్రంలో ప్రధాన పాత్రధారులు. ఈ చిత్రం తొలి భాగం గత ఏడాది సెప్టెంబరులో విడుదలై ఘనవిజయం సాధించింది. ఆల్రెడీ షూటింగ్ కూడా పూర్తి చేసుకున్న రెండో భాగం ఈ ఏడాది ఏప్రిల్ 28న విడుదల కానుంది. అలాగే తమిళంలో ‘వడ చెన్నై’, ‘అసురన్’ వంటి సూపర్ హిట్స్‌ను అందించిన దర్శకుడు వెట్రిమారన్ ప్రస్తుతం ‘విడుదలై’ అనే సినిమాను తీస్తున్నారు. విజయ్ సేతుపతి, సూరి హీరోలుగా నటిస్తున్న ఈ చిత్రం రెండు భాగాలుగా విడుదల కానుంది. రెండు భాగాలకు సంబంధించిన మేజర్ షూటింగ్ పూర్తయింది. మొదటి భాగాన్ని ఈ ఏడాది వేసవిలో, రెండో బాగాన్ని ఈ ఏడాది చివర్లో విడుదల చేయాలనుకుంటున్నారు. అదే విధంగా మరో తమిళ దర్శకుడు గౌతమ్ మీనన్ తెరకెక్కించిన తమిళ చిత్రం ‘వెందు తనిందదు కాడు’ (తెలుగులో ‘ది లైఫ్ ఆఫ్ ముత్తు) చిత్రం రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానుంది. తొలి భాగం గత ఏడాది సెప్టెంబరులో విడుదలైంది. మలి భాగం రిలీజ్‌పై త్వరలో ఓ స్పష్టత రానుంది. అదే విధంగా గౌతమ్ మీనన్ దర్శకత్వంలోనే విక్రమ్ హీరోగా ‘ధృవనక్షత్రం’ అనే సినిమా తెరకెక్కింది. ఈ చిత్రం రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందకు రానుందని కోలీవుడ్‌లో వార్తలు వినిపిస్తున్నాయి. తొలి భాగాన్ని ఈ ఏడాదిలో రిలీజ్ చేయాలనే ఆలోచనలో ఉన్నారట. అటు మలయాళంలో ‘రామ్’ రెండు భాగాలుగా రూపొందుతోంది. మోహన్‌లాల్‌కు ‘దృశ్యం’, ‘దృశ్యం 2’ వంటి హిట్స్‌ను అందించిన జీతూ జోసెఫ్ ఈ సినిమాకు దర్శకుడు. సౌత్‌లోనే కాదు నార్త్‌లోనూ ఈ ట్రెండ్ కనిపిస్తోంది. రణ్‌బీర్ కపూర్ హీరోగా అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘బ్రహ్మాస్త్ర’. ట్రయాలజీగా ఈ సినిమాను తీస్తున్నారు. తొలి భాగం విడుదలైన విషయం తెలిసిందే. మలి భాగం త్వరలోనే సెట్స్‌కి వెళ్లనుంది. అలాగే జాన్ అబ్రహాం హీరోగా రూపొందిన ‘ఎటాక్’ తొలి భాగం గత ఏడాది ఏప్రిల్‌లో రిలీజైంది. మలి భాగం రెడీ అవుతోంది. ఇవే కాదు.. రెండు భాగాల చిత్రాలు కొన్ని సెట్స్‌లో, ఇంకొన్ని చర్చల దశల్లో ఉన్నాయి. ప్రస్తుతం నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ‘ప్రాజెక్ట్ కె’, ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో ‘సలార్’ చిత్రాలు చేస్తున్నారు ప్రభాస్. ఈ చిత్రాలు రెండు భాగాలుగా విడుదల కానున్నాయని టాక్. అలాగే హీరో ఎన్టీఆర్, దర్శకుడు వెట్రిమారన్ కాంబినేషన్లో ఓ సినిమా ఉందనే టాక్ తెరపైకి వచ్చిన సంగతి తెలిసిందే. కాగా ఈ చిత్రం రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానుందని, తొలి భాగంలో ఎన్టీఆర్ హీరోగా, రెండో భాగంలో ధనుష్ హీరోగా కనిపిస్తారనే ప్రచారం జరుగుతోంది. ఇక సూర్య హీరోగా శివ డైరెక్షన్లో రూపొందుతున్న చిత్రం కూడా రెండు భాగాలుగా వస్తుందని టాక్. ఇంకా బాలీవుడ్ నిర్మాతలతో కలిసి ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్, రామాయణం ఆధారంగా ఓ భారీ చిత్రాన్ని ప్లాన్ చేసిన సంగతి గుర్తుండే ఉంటుంది. ఈ సినిమా రెండు భాగాలు రానుందని టాక్. -
‘ప్రాజెక్ట్ కే’ పై ప్రభాస్ షాకింగ్ నిర్ణయం!
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఇప్పుడు వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు.ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ చేస్తున్నాడు. అలాగే నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రాజెక్ట్ కే మూవీ కూడా షూటింగ్ జరుపుకుంటుంది. ఓం రౌత్ దర్శకత్వంలో ఆదిపురుష్ కూడా పూర్తి చేశాడు. ఈ సినిమా సంక్రాంతికి విడుదల కావాల్సింది. కానీ టీజర్‌పై ట్రోల్స్, విమర్శలు రావడంతో విడుదలను వాయిదా వేశారు. సమ్మర్లో ఈ చిత్రాన్ని విడుదల చేస్తామని ప్రకటించారు కానీ.. దానికంటే ముందే సలార్‌ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ప్రభాస్ ప్లాన్ చేస్తున్నాడు. ఇదిలా ఉంటే ‘ప్రాజెక్ట్ కే’ విషయంలో ప్రభాస్ షాకింగ్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా విడుదల చేయబోతున్నారట. కథ పరిధి చాలా పెద్దగా ఉండడంతో ఒకే సినిమాలో అదంతా ఇమడ్చడం కష్టంగా ఉందని, రెండు భాగాలుగా విడుదల చేస్తే బాగుంటుందని దర్శకుడు నాగ్ అశ్విన్ భావిస్తున్నాడట. ఈ విషయం ప్రభాస్‌తో చర్చించగా.. ఆయన కూడా ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. ఈ విషయంపై చిత్రం బృందం నుంచి ఎలాంటి అధికారిక సమాచారం లేదు కానీ.. సోషల్ మీడియాలో మాత్రం చక్కర్లు కొడుతోంది. పార్ట్ 1ని వచ్చే ఏడాది ఏప్రిల్‌లో విడుదల చేయాలని భావిస్తున్నారట. దీనికి సంబంధించిన షూటింగ్ కూడా పూర్తయినట్లు తెలుస్తోంది. ఇంతవరకు ఎవరు టచ్ చేయని పాయింట్‌తో.. అత్యాధునిక సాంకేతిక హంగులతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. వైజయంతీ మూవీస్ పతాకంపై అశ్వినీదత్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో దీపికా పదుకొణె హీరోయిన్గా నటిస్తుండగా, అమితాబ్ బచ్చన్ కీలక పాత్ర పోషిస్తున్నారు. -
నైజాంలో రికార్డు దరకు ప్రభాస్ ప్రాజెక్ట్ - కే రైట్స్
-
ప్రభాస్ మూవీ ప్రాజెక్ట్ కె.. భారీ ధరకు అమ్ముడైన రైట్స్..!
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ మోస్ట్ అవేయిటెడ్ మూవీ 'ప్రాజెక్ట్ కె'. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో పాన్ వరల్డ్ చిత్రంగా రూపొందుతున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అందుకు తగ్గట్టే ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ క్వీన్ దీపికా పదుకొనె హీరోయిన్గా నటిస్తోంది. బాలీవుడ్ బిగ్‌బి అమితాబ్ బచ్చన్ ఓ కీలక పాత్ర పోషిస్తున్నాడు.ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్‌ను జరుపుకుంటోంది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన నిజా రైట్స్ భారీ ధరకు అమ్ముడైనట్లు తెలుస్తోంది. ప్రస్తుతం దీనిపై నెట్టింట్లో చర్చ మొదలైంది. రెండు రోజుల క్రితమే ఈ మూవీ నుంచి ఓ మేకింగ్ వీడియో వచ్చిన సంగతి తెలిసిందే. ఈ మూవీపై మరింత హైప్ క్రియేట్ చేస్తూ చిత్రం మేకింగ్ వీడియోను రిలీజ్ చేసింది. అయితే ప్రాజెక్ట్ కె నిజాం హక్కులను ఏషియన్ సునీల్ సిండికేట్ రికార్డు ధర రూ.70 కోట్లకు దక్కించుకున్నట్లు తెలుస్తోంది. -
ప్రభాస్ ‘ప్రాజెక్ట్ కె’ నుంచి తొలి అప్డేట్... మేకింగ్ వీడియో చూశారా?
పాన్ ఇండియ స్టార్ ప్రభాస్ చేతిలో ప్రస్తుతం పలు భారీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. అందులో మోస్ట్ అవేయిటెడ్ మూవీ ప్రాజెక్ట్ కె(Prokect K). మహనటి ఫేం నాగ్ అశ్విన్ దర్శకత్వంలో పాన్ వరల్డ్ చిత్రంగా రూపొందుతున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అందుకు తగ్గట్టే ఈ సినిమాలో భారీ తారాగాణం భాగం కానుంది. బాలీవుడ్ బ్యూటీ క్వీన్ దీపికా పదుకొనె హీరోయిన్గా నటిస్తుండగా.. బాలీవుడ్ బిగ్‌బి అమితాబ్ బచ్చన్ ఓ కీలక పాత్ర పోషిస్తున్నాడు. అంతేకాదు మరో హీరోయిన్ దిశా పటానీ ప్రధాన పాత్రలో కనిపించనుంది. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్‌ను జరపుకుంటోంది. చదవండి: తారక్ పెద్ద స్టార్.. తను అలా చేయాల్సిన అవసరం లేదు, కానీ..!: సీనియర్ నటి సుధ ఈ నేపథ్యంలో మూవీపై మరింత హైప్ క్రియేట్ చేస్తూ చిత్రం తాజాగా మేకింగ్ వీడియోను రిలీజ్ చేసింది. స్క్రాచ్ ఎపిసోడ్ 1: రీఇన్వెంటింగ్ ది వీల్ అంటూ ఈ వీడియోని వదిలారు. ఇందులో నాగ్ అశ్విన్ అండ్ టీం టైరు తయారు చేస్తూ కనిపిచింది. ఈ టైరు తయారికి టీం అంతా ఎంత కష్టపడిందో ఇందులో ఆసక్తిగా చూపించారు. అంతేకాదు మరో ఒక్క టైరు కోసం ఇంత ఓవరాక్షన్? అంటూ తమకు తామే సైటర్లు వేసుకోవడం ఆకట్టుకుంది. ఇంతకీ ఈ టైరు కథేంటి? సినిమాలో దాని ప్రాముఖ్యత ఏంటి? అనేది ఆసక్తిని సంతరించుకుంది. ప్రస్తుతం ఈ వీడియో ఫ్యాన్స్‌ని ఆకట్టుకుంటోంది. చదవండి: రష్మికకు రిషబ్ శెట్టి గట్టి కౌంటర్, ట్వీట్ వైరల్ -
హైదరాబాద్ శివార్లలో ‘ప్రాజెక్ట్ కె’ షూటింగ్.. పాల్గొననున్న ప్రభాస్, అమితాబ్
ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘ప్రాజెక్ట్ కె’. దీపికా పదుకోన్ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, దిశా పటానీ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. కొన్ని రోజులుగా హైదరాబాద్ శివార్లలో ఈ చిత్రం షూటింగ్ జరుగుతోంది. అయితే ప్రభాస్ లేని సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారని తెలిసింది. డిసెంబరు 2 నుంచి ప్రభాస్ ఈ సినిమా షూటింగ్‌తో బిజీ అవుతారని సమాచారం. ఈ షెడ్యూల్లో అమితాబ్ బచ్చన్ కూడా పాల్గొంటారట. ప్రభాస్, అమితాబ్ కాంబినేషన్ సీన్స్‌ను ప్లాన్ చేశారట నాగ్ అశ్విన్. వైజయంతీ మూవీస్ పతాకంపై అశ్వినీదత్ నిర్మిస్తున్న ఈ చిత్రం 2024లో రిలీజ్ కానుంది. -
ప్రభాస్ చిత్రంలో రామ్ గోపాల్ వర్మ! ఈ పాత్ర ఎలా ఉంటుందో?
సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తరచూ ఏదోక అంశంపై తనదైన శైలిలో కాంట్రవర్సల్ కామెంట్స్ చేసి వార్తల్లో నిలుస్తుంటాడు. ఇక డైరెక్టర్‌గా హిట్, ప్లాప్స్తో సంబంధం లేకుండా సినిమాలు చేస్తు వస్తున్నాడు. యథార్థ సంఘటల నేపథ్యంలో సినిమాలు తెరకెక్కిస్తూ వస్తున్న ఆర్జీవీకి సంబంధించిన ఓ ఆసక్తికర అప్డేట్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఆయన ఓ పాన్ ఇండియా సినిమాలో నటించనున్నట్లు తెలుస్తోంది. అది కూడా అంత్యంత క్రేజ్ ఉన్న పాన్ ఇండియా హీరో చిత్రంలో... ఆయన ఎవరో కాదు డార్లింగ్ ప్రభాస్. చదవండి: నా గ్లామర్ ఫొటోలు చూసి ఎంజాయ్ చేస్తున్నారు: హీరోయిన్ షాకింగ్ కామెంట్స్ ప్రభాస్ ప్రస్తుతం వరుస పాన్ ఇండియా చిత్రాలు చేస్తోన్న సంగతి తెలిసిందే. అందులో సలార్, ప్రాజెక్ట్-kలు సెట్‌పై ఉండగా.. ఆది పురుష్ నిర్మాణాంతర కార్యక్రమాలను జరుపుకుంటోంది. మారుతితో మరో ప్రాజెక్ట్‌ను లైన్లో పెట్టాడు. ప్రస్తుతం నాగ్ అశ్విన్ డైరెక్షన్లో చేస్తున్న ప్రాజెక్ట్-k ప్రస్తుతం శరవేగంగా షూటింగ్‌ను జరుపుకుంటోంది. ఈ సినిమాలోనే ఆర్జీవీ ఓ ముఖ్య పాత్ర పోషించబోతున్నాడట. ఇటీవలే నాగ్ అశ్విన్ ఈ మూవీలో ఓ పాత్ర కోసం ఆర్జీవీని సంప్రదించగా.. ఆయనకు కథ నచ్చడంతో వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. త్వరలోనే ఆయనకు సంబంధించిన సన్నివేశాలను చిత్రీకరించనున్నట్లు తెలుస్తుంది. చదవండి: భారీగా రెమ్యునరేషన్ పెంచేసిన శ్రీలీల? షాకవుతున్న నిర్మాతలు! దీంతో ఆర్జీవీ రోల్‌పై ఆసక్తి నెలకొంది. ఎప్పుడు భిన్నంగా ఆలోచించే ఆర్జీవీ నచ్చిన ఆ రోల్ ఏంటనేది నెటిజన్లు ఆరా తీస్తున్నారు. అంతేకాదు ఆయన పాత్ర ఎలా ఉంటుందో? అంటూ ఆసక్తిని కనబరుస్తున్నారు. అయితే ఈ వార్తల్లో నిజమెంతుందో తెలియదు. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. కాగా సై-ఫై థ్రిల్లర్ జానర్లో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై అశ్వినీ దత్ అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నాడు. ప్రభాస్‌కు జోడీగా దీపికా పదుకొనే హీరోయిన్గా నటిస్తోన్న సంగతి తెలిసిందే. 2024 సమ్మర్లో ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు మూవీ టీం సన్నాహాలు చేస్తుంది. -
నాలుగు సినిమాలు.. అక్షరాలా రూ.1000 కోట్లకు పైగా బడ్జెట్
పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ జన్మదినం సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో ఫ్యాన్స్ సందడి చేస్తున్నారు. ప్రభాస్ బర్త్‌డేను పురస్కరించుకుని బిల్లా సినిమాను రి-రిలీజ్ చేయగా థియేటర్లలో రచ్చ చేస్తున్నారు. ప్రస్తుతం 43వ పుట్టినరోజు జరుపుకుంటున్న రెబల్ స్టార్ చేతిలో పలు కీలకమైన ప్రాజెక్టులు ఉన్నాయి. ప్రభాస్ నటిస్తున్నచిత్రాలన్నీ భారీ బడ్జెట్లోనే నిర్మిస్తున్నారు. అయితే ఆ సినిమాల బడ్జెట్ విలువ దాదాపు రూ.1000 కోట్లకు పైనే ఉన్నట్లు తెలుస్తోంది. ఆదిపురుష్: భారీ అంచనాలతో తెరకెక్కుతున్న త్రీడీ యాక్షన్ చిత్రం ఆదిపురుష్. ఈ సినిమాలో రాఘవ పాత్రలో ప్రభాస్ నటిస్తున్నారు. దర్శకుడు ఓం రౌత్ తెరకెక్కిస్తున్న ఈ చిత్ర బడ్జెట్ రూ.400 కోట్లు. ఈ మెగా బడ్జెట్ సినిమా రామాయణం ఆధారంగా రూపొందిస్తున్నారు. బాలీవుడ్ సీనియర్ నటుడు సైఫ్ అలీఖాన్ ఈ చిత్రంలో రావణుడి పాత్రలో ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. ఆదిపురుష్‌లో ప్రభాస్ సరసన కృతి సనన్ జానకి పాత్రలో సీతగా కనిపించనుంది. ఈ చిత్రంలో సన్నీ సింగ్ లక్ష్మణుడి పాత్ర పోషిస్తున్నారు. 2023 జనవరిలో థియేటర్లలోకి రాబోతున్న ఆదిపురుష్ అద్వితీయమైన అనుభూతిని కలిగిస్తుందని ఇటీవల విడుదలైన టీజర్‌ను బట్టి అర్థమవుతోంది. (చదవండి: అరాచకం.. థియేటర్‌ను తగలబెట్టిన ప్రభాస్ ఫ్యాన్స్) ప్రాజెక్ట్ కె: నాగ్ అశ్విన్ దర్శకత్వంతో తెరకెక్కిస్తున్న మరో భారీ చిత్రం 'ప్రాజెక్ట్ కె'. ఇది ఒక సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్‌గా రూపొందిస్తున్నారు. ప్రభాస్ కెరీర్లో ఇప్పటివరకు చేసిన అత్యంత ఖరీదైన ప్రాజెక్టుల్లో ఇది ఒకటి. ఈ చిత్రంలో ప్రభాస్ సరసన బాలీవుడ్ భామ దీపికా పదుకొణె నటిస్తోంది. ఈ మూవీ బడ్జెట్ దాదాపు రూ. 500 కోట్లుగా అంచనా వేస్తున్నారు. వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై నిర్మిస్తున్న ఈ చిత్రంలో లెజెండరీ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ప్రభాస్ నటిస్తున్న ఈ చిత్రం 2023 చివరి నాటికి లేదా 2024 ప్రారంభంలో ప్రేక్షకుల ముందుకు రానుంది. సలార్: కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్ ప్రతిష్ఠాత్మక చిత్రం 'సలార్'. ప్రభాస్ టైటిల్ రోల్ పోషిస్తున్న ఈ చిత్రం రూ.200 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నారు. ప్రముఖ మలయాళీ నటుడు-చిత్రనిర్మాత పృథ్వీరాజ్ సుకుమారన్ సలార్‌లో కీలక పాత్ర పోషిస్తున్నారు. ప్రభాస్‌కు జోడీగా శ్రుతి హాసన్ కథానాయికగా నటిస్తోంది. కేజీఎఫ్ ఫ్రాంచైజీలోని కొన్ని ప్రధాన ముఖాలు సాలార్‌లో కనిపించాలని భావిస్తున్నారు. ప్రభాస్ నటించిన ఈ చిత్రం సెప్టెంబర్ 2023లో థియేటర్లలో కనువిందు చేయనుంది. రాజా డీలక్స్: దర్శకుడు మారుతీతో ప్రభాస్ ఒక ఫాంటసీ చిత్రంలో నటిస్తున్నట్లు సమాచారం. ఈ సినిమాకు తాత్కాలికంగా రాజా డీలక్స్ అని పేరు పెట్టారు. ప్రభాస్ ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ భారీ ప్రాజెక్ట్ కూడా రూ.100 కోట్లతో తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. పాన్-ఇండియన్ స్టార్ ఈ చిత్రంలో తాత, మనవడి పాత్రలను పోషిస్తున్నట్లు రూమర్లు వస్తున్నాయి. హారర్, కామెడీ చిత్రంగా నిర్మిస్తున్న రాజా డీలక్స్ అతి త్వరలో అధికారికంగా ప్రకటించే అవకాశముంది. (చదవండి: Prabhas: ఆదిపురుష్ స్పెషల్ పోస్టర్ రిలీజ్.. యుద్ధ వీరుడిలా ప్రభాస్ లుక్) బాహుబలి తర్వాత ప్రభాస్ కెరీర్ ప్రభాస్ నటించిన బాహుబలి భారీ విజయం తర్వాత పాన్-ఇండియన్ సూపర్ స్టార్ కాస్త కఠినమైన పరీక్ష ఎదుర్కొన్నారు. రెబల్ స్టార్ నటించిన రెండు చిత్రాలు సాహో, రాధే శ్యామ్ కమర్షియల్ ఫెయిల్యూర్స్‌గా నిలిచి సినీ ప్రేక్షకులను చాలా నిరాశపరిచాయి. ఆగస్టు 2019లో థియేటర్లలోకి వచ్చిన సాహో రూ. 350కోట్ల బడ్జెట్‌తో రూపొందించారు. మరోవైపు రాధే శ్యామ్ మార్చి 2022లో విడుదల కాగా.. రూ. 300 కోట్ల బడ్జెట్‌తో నిర్మించారు. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న మెగా-బడ్జెట్ చిత్రాలతో బాక్సాఫీస్ వద్ద తెలుగు సినీ ప్రేమికులను ప్రభాస్ అలరించనున్నారు. -
అమితాబ్‌కు బర్త్ డే సర్ప్రైజ్.. 'ప్రాజెక్ట్ కె' క్రేజీ అప్డేట్
బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్ పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా ఆయనకు బర్త్‌డే కానుకగా ప్రాజెక్ట్-కె బృందం నుంచి క్రేజీ అప్డేట్ వచ్చింది. ప్రభాస్ నటిస్తున్నఈ చిత్రంలో బిగ్ బీ లుక్‌ను రివీల్ చేస్తూ ఆయనకు పుట్టిన రోజు సర్ప్రైజ్ ఇచ్చింది చిత్రబృందం. ఈ విషయాన్ని వైజయంతి మూవీస్ సంస్థ ట్వీట్ చేసింది. బిగ్ బీ పిడికిలి బిగించి ఉన్న పోస్టర్‌ను సోషల్ మీడియాలో షేర్ చేసింది. అమితాబ్ ఇవాళ 80వ జన్మదినం జరుపుకుంటున్నారు. (చదవండి: బిగ్‌బీ అమితాబ్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పిన మోదీ) ఐదు దశాబ్దాలుగా సినీ ఇండస్ట్రీలో దూసుకెళ్తున్న అమితాబ్‌కు శుభాకాంక్షలు చెబుతూ ట్వీట్ చేసింది. లెజెండ్స్ ఎప్పటికీ అమరులుగానే ఉండిపోతారని పోస్టర్‌పై రాసుకొచ్చింది. ఈ పోస్టర్ కొద్దిసేపటికే సోషల్ మీడియాలో వైరలవడంతో అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్న పాన్ ఇండియా మూవీలో ప్రభాస్ సరసన దీపికా పదుకొణె హీరోయిన్గా నటిస్తోంది. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రం కి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి. A powerhouse that has entertained for more than 5 decades! Can't wait to show the world the new avatar you've unleashed this time. Here's to the 80th & many more! May the force be with you always & you're the force behind us @SrBachchan sir - Team #ProjectK pic.twitter.com/Q3xLPqP2wN — Vyjayanthi Movies (@VyjayanthiFilms) October 11, 2022 -
భారీ యాక్షన్ ప్లాన్‌తో ‘ప్రాజెక్ట్ కె’!
ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ‘ప్రాజెక్ట్ కె’ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ సైన్స్ ఫిక్షన్ చిత్రానికి సంబంధించి ఓ వార్త ప్రచారంలోకొచ్చింది. అదేంటంటే.. ఈ సినిమాలో ఐదు భారీ యాక్షన్ సీక్వెన్సెస్ ఉంటాయట. మూడో ప్రపంచం యుద్ధం నేపథ్యంలో ఈ సుదీర్ఘ యాక్షన్ సీక్వెన్సెస్ ఉంటాయని సమాచారం. ఇందుకోసం హాలీవుడ్‌కి చెందిన ఐదుగురు ఫైట్ మాస్టర్స్‌ని నియమించారట. ఒక్కో యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరణ ఒక్కో ఫైట్ మాస్టర్ ఆధ్వర్యంలో జరుగుతుందని టాక్. అలాగే ‘అవెంజర్స్’, ‘గాడ్జిల్లా’, ‘కింగ్ కాంగ్’ వంటి హాలీవుడ్ చిత్రాలకు ఉపయోగించిన కెమెరాలను ఈ చిత్రానికి వాడుతున్నారట. ఇక ఈ చిత్రంలో ప్రభాస్ సరసన దీపికా పదుకోన్ కథానాయికగా నటిస్తుండగా అమితాబ్ బచ్చన్ కీలక పాత్ర పోషిస్తున్నారు. వైజయంతి మూవీస్ పతాకంపై అశ్వనీదత్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. -
బరువు తగ్గిన ప్రభాస్.. ట్రిమ్డ్ గడ్డంతో స్టైలీష్‌గా ‘డార్లింగ్’.. పిక్స్ వైరల్
‘బాహుబలి’చిత్రంతో పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగాడు ‘డార్లింగ్’ ప్రభాస్. ఆ చిత్రం తర్వాత వరుసగా పాన్ ఇండియా చిత్రాలనే చేసూకుంటూ దేశవ్యాప్తంగా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్‌ని సంపాదించుకున్నాడు. బాహుబలి 2 తర్వాత పాన్ ఇండియా మార్కెట్లో వదిలిన సాహో, రాధేశ్యామ్ ఆశించిన స్థాయిలో కలెక్షన్స్‌ని రాబట్టలేకపోయినా.. ప్రభాస్ ఇమేజ్ మాత్రం కొంచెం కూడా తగ్గలేదు. ప్రస్తుతం ఆయన ఆదిపురష్, సలార్, ప్రాజెక్ట్ కె చిత్రాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. అయితే గత కొద్ది కాలంగా తన కాలి నొప్పితో బాధపడుతున్న ప్రభాస్.. వ్యాయామం మీద ఎక్కువగా దృష్టిపెట్టలేక పోయాడు. దీంతో ప్రభాస్ కాస్త బరువు పెరిగి బొద్దుగా కనిపించాడు. తమ అభిమాన హీరో శరీరాకృతిలో వచ్చిన మార్పును చూసి అభిమానులు కాస్త కలవరపడ్డారు. కానీ తాజాగా ప్రభాస్ లుక్ చూసి అదే ఫ్యాన్స్ ఆనందంతో చిందులేస్తున్నారు. చాలా రోజుల తర్వాత ప్రభాస్ మళ్లీ మీడియా ముందుకు వచ్చాడు. బుధవారం జరిగిన ‘సీతారామం’ప్రీరిలీజ్ ఈవెంట్‌కు ‘డార్లింగ్’ ముఖ్య అతిథిగా వచ్చాడు. ప్రస్తుతం ప్రభాస్ లుక్ ఎలా ఉంటుందోనని చాలా మంది ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న తరుణంలో ట్రిమ్డ్ గడ్డం,మీసాలతో ప్రభాస్ దర్శనమిచ్చాడు. బ్లాక్ టీ షర్ట్, డెనిమ్ జీన్స్‌లో స్టైలీష్‌గా కనిపించాడు ప్రభాస్. అంతేకాదు బరువు తగ్గి చాలా స్లిమ్‌గా అయ్యాడు. మొన్నటి వరకు బోద్దుగా ఉన్న ప్రభాస్ ఒక్కసారిగా స్టైలిష్‌గా కనిపించి అందరిని ఆశ్చర్యపరిచాడు. ప్రస్తుతం ప్రభాస్ లుక్‌ని ఫ్యాన్స్ పంగడ చేసుకుంటున్నారు. సోషల్ మీడియా వేదికగా ఆ ఫోటోలను షేర్ చేస్తూ.. ‘లుక్ అదిరింది బాస్’, ‘డార్లింగ్ బ్యాక్’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ప్రభాస్ న్యూలుక్ ఫోటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
సర్జరీ కోసం విదేశాలకు వెళ్లిన ప్రభాస్
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సర్జరీ కోసం విదేశాలకు వెళ్లాడట. ఈ విషయాన్ని ప్రముఖ నిర్మాత అశ్వినీదత్ వెల్లడించాడు. ప్రాజెక్ట్ కె సినిమా గురించి గురువారం మీడియాతో మాట్లాడిన ఆయన సీతారామం ప్రీరిలీజ్ ఈవెంట్‌కు ప్రభాస్ ముఖ్య అతిథిగా రావాల్సి ఉంది. కానీ కాలి సర్జరీ కోసం విదేశంలో ఉండటంతో రాలేకపోయాడు అని చెప్పుకొచ్చాడు. కాగా ప్రభాస్‌కు గతంలోనూ సర్జరీ జరిగినట్లు వార్తలు విచ్చిన విషయం తెలిసిందే! ఇక ప్రాజెక్ట్ కెను వచ్చే ఏడాది అక్టోబర్ 18న ప్లాన్ చేయాలని భావిస్తున్నట్లు అశ్వినీదత్ పేర్కొన్నాడు. ఒకవేళ అప్పటికి కుదరకపోతే 2024 జనవరిలో రిలీజ్ చేస్తామని వెల్లడించాడు. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో ప్రభాస్‌కు జోడీగా బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకోణ్ నటిస్తుండగా బిగ్‌బీ అమితాబ్ బచ్చన్ ముఖ్యపాత్ర పోషిస్తున్నాడు. చదవండి: చైతూతో కలిసి ఉన్న ఇంటినే సమంత ఎక్కువ రేటుకు కొనుక్కుంది