
మహాశివరాత్రి వేళ ప్రభాస్ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్ చెప్పించి ‘ప్రాజెక్ట్ కె’ మూవీ యూనిట్. ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం విడుదల తేదిని ప్రకటించారు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నట్లు వెల్లడిస్తూ పోస్టర్‌ని విడుదల చేశారు. ఆ పోస్టర్ సినిమాపై మరింత ఆస్తకిని పెంచేసింది. అందులో ఓ ఎడారిలో ఓ భారీ చేతిని స్నిపర్స్ జాగ్రత్తగా చూస్తున్నారు.
దీపికా పదుకోన్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, దిశా పటానీ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఇంతవరకు ఎవరు టచ్ చేయని పాయింట్‌తో.. అత్యాధునిక సాంకేతిక హంగులతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. వైజయంతీ మూవీస్ పతాకంపై అశ్వినీదత్ నిర్మిస్తున్న ఈ చిత్రం రెండు పార్ట్‌లుగా రాబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
𝟏𝟐-𝟏-𝟐𝟒 𝐢𝐭 𝐢𝐬! #𝐏𝐫𝐨𝐣𝐞𝐜𝐭𝐊
— Vyjayanthi Movies (@VyjayanthiFilms) February 18, 2023
Happy Mahashivratri.#Prabhas @SrBachchan @deepikapadukone @nagashwin7 @VyjayanthiFilms pic.twitter.com/MtPIjW2cbw
Comments
Please login to add a commentAdd a comment