Actor Prabhas New Look Stills In Sita Ramam Pre Release Goes Viral - Sakshi
Sakshi News home page

Prabhas New Look Photos: బరువు తగ్గిన ప్రభాస్‌.. ట్రిమ్‌డ్ గడ్డంతో స్టైలీష్‌గా ‘డార్లింగ్‌’.. పిక్స్‌ వైరల్‌

Published Thu, Aug 4 2022 1:15 PM | Last Updated on Thu, Aug 4 2022 2:09 PM

Prabhas New Look Photos Goes Viral - Sakshi

‘బాహుబలి’చిత్రంతో పాన్‌ ఇండియా స్టార్‌గా ఎదిగాడు ‘డార్లింగ్‌’ ప్రభాస్‌. ఆ చిత్రం తర్వాత వరుసగా పాన్‌ ఇండియా చిత్రాలనే చేసూకుంటూ దేశవ్యాప్తంగా విపరీతమైన ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ని సంపాదించుకున్నాడు. బాహుబలి 2 తర్వాత పాన్‌ ఇండియా మార్కెట్‌లో వదిలిన సాహో, రాధేశ్యామ్‌ ఆశించిన స్థాయిలో కలెక్షన్స్‌ని రాబట్టలేకపోయినా..  ప్రభాస్‌ ఇమేజ్‌ మాత్రం కొంచెం కూడా తగ్గలేదు. ప్రస్తుతం ఆయన ఆదిపురష్‌, సలార్‌, ప్రాజెక్ట్‌ కె చిత్రాలతో ఫుల్‌ బిజీగా ఉన్నాడు.

అయితే  గత కొద్ది కాలంగా తన కాలి నొప్పితో బాధపడుతున్న ప్రభాస్‌.. వ్యాయామం మీద ఎక్కువగా దృష్టిపెట్టలేక పోయాడు. దీంతో ప్రభాస్‌ కాస్త బరువు పెరిగి బొద్దుగా కనిపించాడు. తమ అభిమాన హీరో శరీరాకృతిలో వచ్చిన మార్పును చూసి అభిమానులు కాస్త కలవరపడ్డారు. కానీ తాజాగా ప్రభాస్‌ లుక్‌ చూసి అదే ఫ్యాన్స్‌ ఆనందంతో చిందులేస్తున్నారు. 

చాలా రోజుల తర్వాత ప్రభాస్‌ మళ్లీ మీడియా ముందుకు వచ్చాడు. బుధవారం జరిగిన ‘సీతారామం’ప్రీరిలీజ్‌ ఈవెంట్‌కు ‘డార్లింగ్‌’ ముఖ్య అతిథిగా వచ్చాడు. ప్రస్తుతం ప్రభాస్‌ లుక్‌ ఎలా ఉంటుందోనని చాలా మంది ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న తరుణంలో ట్రిమ్‌డ్ గడ్డం,మీసాలతో ప్రభాస్‌ దర్శనమిచ్చాడు.

బ్లాక్ టీ షర్ట్, డెనిమ్ జీన్స్‌లో స్టైలీష్‌గా కనిపించాడు ప్రభాస్‌. అంతేకాదు బరువు తగ్గి చాలా స్లిమ్‌గా అయ్యాడు. మొన్నటి వరకు బోద్దుగా ఉన్న ప్రభాస్‌ ఒక్కసారిగా స్టైలిష్‌గా కనిపించి అందరిని ఆశ్చర్యపరిచాడు. ప్రస్తుతం ప్రభాస్‌ లుక్‌ని ఫ్యాన్స్‌ పంగడ చేసుకుంటున్నారు. సోషల్‌ మీడియా వేదికగా ఆ ఫోటోలను షేర్‌ చేస్తూ.. ‘లుక్ అదిరింది బాస్’, ‘డార్లింగ్‌ బ్యాక్‌’ అంటూ కామెంట్స్‌ చేస్తున్నారు. ప్రస్తుతం ప్రభాస్‌ న్యూలుక్‌ ఫోటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. 

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement