
డార్లింగ్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న భారీ బడ్జెట్ సినిమా 'ప్రాజెక్ట్ K'. 'మహానటి' ఫేమ్ నాగ్ అశ్విన్ డైరెక్టర్ కావడం, గత కొన్నేళ్లుగా ఈ చిత్రం సెట్స్ మీద ఉండటంతో అంచనాలు గట్టిగానే ఉన్నాయి. కానీ బుధవారం రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్‌తో అవన్నీ కాస్త తారుమారు అయ్యాయి అనిపించింది. ఎందుకంటే ప్రభాస్ లుక్‌పై ఘోరంగా ట్రోల్స్ వస్తూనే ఉన్నాయి.
ఈ ఫస్ట్ లుక్‌లో ప్రభాస్ ఐరన్ మ‍్యాన్ పోజులో కనిపించాడు. అది ఓకే గానీ ఆ తల వేరే ఎవరో బాడీకో అతికించినట్లు ఉందని స్వయానా అభిమానులే నిరుత్సాహపడ్డారు. సోషల్ మీడియాలో 'ప్రాజెక్ట్ K' టైప్ చేసి సెర్చ్ చేయండి మీకే విషయం అర్థమైపోతుంది. ఇవన్నీ మేకర్స్ దృష్టిలో పడినట్లున్నాయి. దీంతో అధికారికంగా రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్‌ని సోషల్ మీడియా ఖాతాల నుంచి డిలీట్ చేశారు.
(ఇదీ చదవండి: ఇదేం ఫస్ట్ లుక్! 'ప్రాజెక్ట్ K'పై ఘోరమైన ట్రోల్స్)
అయితే ఇలా డిలీట్ చేసిన ఫస్ట్ లుక్ బదులు ఎలాంటి గ్రాఫిక్స్, పేర్లు లేకుండా ఉన్న అదే పోస్టర్‌ని పోస్ట్ చేశారు. గ్లింప్స్ వీడియో కోసం రెడీ అయిపోండి అని ట్వీట్ పెట్టారు. ఈ విషయం నిజమా కాదా అని ఆలోచిస్తున్నారా? అయితే ఈ స్టోరీ చదివిన తర్వాత 'ప్రాజెక్ట్ K' నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ ట్విట్టర్‌లోకి వెళ్లి చూడండి. మీకే క్లారిటీ వస్తుంది.
ప్రస్తుతం జరుగుతున్న ట్రోలింగ్ ఎక్కువ కాకుడదనే ఉద్దేశంతోనే ఇలా డిలీట్ చేసినట్లు తెలుస్తోంది. మేకర్స్ తీసేసినా సరే ఆ ఫొటో ఇప్పటికీ ఎప్పటికీ అందుబాటులోనే ఉంటుంది. ఈ జాగ్రత్త ఏదో ముందు ఉంటే బాగుండేదని పలువురు నెటిజన్స్ అభిప్రాయపడుతున్నారు. ఇక 'ప్రాజెక్ట్ K'లో ప్రభాస్ తోపాటు దీపికా పదుకొణె, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు.
Our Raiders are ready to conquer @Comic_Con today! 💥#ProjectK #WhatisProjectK #Prabhas @SrBachchan @ikamalhaasan @deepikapadukone @nagashwin7 @VyjayanthiFilms pic.twitter.com/t8TKs2GbVf
— Vyjayanthi Movies (@VyjayanthiFilms) July 20, 2023
(ఇదీ చదవండి: Hidimba Review: ‘హిడింబ’ మూవీ రివ్యూ)