యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ‘ప్రాజెక్ట్ కె’. ఈ చిత్రంలో దీపికా పదుకోణె హీరోయిన్‌గా నటిస్తోంది. అంతే కాకుండా ఈ క్రేజీ ప్రాజెక్ట్‌లో అమితాబ్ బచ్చన్, దిశా పటానీ, కమల్ హాసన్ కూడా ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఇటీవలే ఈ చిత్రానికి సంబంధించి వరుస అప్‌డేట్స్ సినిమాపై అంచనాలు పెంచేస్తున్నారు మేకర్స్. ఇటీవలే ప్రభాస్ ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా రిలీజైన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ మూవీ టైటిల్,గ్లింప్స్‌ను మేకర్స్ విడుదల చేశారు.
(ఇది చదవండి: బిగ్ బాస్ హౌస్‌లోకి బేబీ హీరోయిన్.. సోషల్ మీడియాలో వైరల్!)
ఈ భారీ బడ్జెట్ టైమ్‌ట్రావెల్ సైన్స్ ఫిక్షన్ ఫిల్మ్ ‘ప్రాజెక్ట్ కె’ గ్లింప్స్‌ను ‘కామిక్ కాన్ –2023’ వేడుకల్లో మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ గ్లింప్స్ హాలీవుడ్ సినిమాను తలపిస్తున్నాయంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఈ సినిమాకు 'కల్కి 2898 ఏడీ' (Kalki 2898 AD) అనే టైటిల్ ఖరారు చేశారు. పురాణాల ప్రకారం కలియుగం చివర్లో విష్ణువు పదో అవతారమే కల్కి. ప్రపంచాన్ని చీకటి కమ్మేసినప్పుడు ఒక శక్తిలా కల్కి ఉద్భవిస్తుందని మన పురాణాల్లో ఉంది. కలియుగం అంతంలో జరిగే కథా నేపథ్యంలో ఈ చిత్రం ఉండనున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ ప్రతిష్ఠాత్మక ఈవెంట్‌కు హాజరైన హీరో ప్రభాస్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అక్కడి స్థానికి మీడియాతో మాట్లాడుతూ డైరెక్టర్‌పై ఫన్నీ కామెంట్స్ చేశారు.
ప్రభాస్ మాట్లాడుతూ.. 'ఇది ఒక సూపర్ హీరో సినిమా. ఇందులో అతి ముఖ్యమైన అంశం కామెడీ. నాగ్ అశ్విన్ ఈ స్టోరీని డిజైన్ చేసిన విధానం నాకు నచ్చింది. నా క్యారెక్టర్‌ను అలా తీర్చిదిద్దారు. ఈ ప్రాజెక్ట్‌లో ఫన్నీ క్యారెక్టర్ నాదే అనుకుంటా. ఈ చిత్రంలో స్ట్రాంగ్ ఎమోషన్స్ కూడా నాగ్ చూపించాడు. ఐ యామ్ ది కమెడియన్ ఇన్ దిస్ మూవీ. అంటూ' నవ్వుతూ మాట్లాడారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ఈ చిత్రం కోసం ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
(ఇది చదవండి: ఆ టాలీవుడ్ హీరోతో కలిసి కచ్చితంగా సినిమా చేస్తాను: ప్రభాస్)
Prabhas on his character bringing the humor in #Kalki2898 AD #SDCC 2023 pic.twitter.com/tAqpF1iOT6
— Deadline Hollywood (@DEADLINE) July 21, 2023
Comments
Please login to add a commentAdd a comment