comic con
-
హైటెక్స్ ఎగ్జిబిషన్లో కలర్‌ఫుల్ ‘హైదరాబాద్ కామిక్ కాన్’ ఈవెంట్ (ఫొటోలు)
-
కాస్ ప్లే వేదికగా కామిక్ కాన్ 2024
అంతర్జాతీయ వేదికపై గుర్తింపు పొందిన ప్రతి కళనూ, సృజనాత్మకతను, అధునాతన హంగులను అందిపుచ్చుకోవడంలో హైదరాబాద్ నగరం ఎల్లప్పుడూ ముందుంటుంది. ఇందులో భాగంగానే గ్లోబల్ వేదికగా ప్రసిద్ధి చెందిన కాస్ ప్లేను నగరానికి పరిచయం చేయడంలో భాగంగా ప్రతిష్టాత్మక ‘కామిక్ కాన్ 2024’ ఈవెంట్‌ను నిర్వహిస్తున్నారు. సిటీలోని హైటెక్స్ వేదికగా ఈ నెల 15, 16, 17 తేదీల్లో కామిక్ కాన్ కాస్ ప్లే వేడుకలను ఘనంగా నిర్వహించనున్నారు. ఈ ఫెస్ట్‌లో కామిక్ కాన్ ఫేం సౌరభ్ సింగ్ రావత్‌తో పాటు దేశంలోని వివిధ నగరాల నుంచి కాస్ ప్లే సెలబ్రిటీలు సందడి చేయనున్నారు. గత కొంత కాలంగా నగరంలో కూడా కాస్ ప్లే ప్రత్యేక ఆదరణ పొందడమే కాకుండా దీని కోసం ఫ్యాన్ బేస్ కూడా పెరుగుతోంది. సిటీలో కూడా జోహైర్ ఖాన్ వంటి పలువురు కామిక్ కాన్ సెలబ్రిటీలుగా గుర్తింపు పొందారు. ది హైదరాబాద్ కాస్ ప్లేయర్స్ క్లబ్ నిర్వాహకులలో ఒకరు స్థానికంగా జరగనున్న కామిక్ కాన్ ఫెస్ట్‌కు నేతృత్వం వహిస్తున్నారు. ఫ్యూచర్ ఫేం కాస్ ప్లే.. నగరంలో కామిక్ ఫెస్ట్ జరగనున్న నేపథ్యంలో కాస్ ప్లేలో భాగస్వామ్యం పంచుకునే వారికి స్పైడర్ మ్యాన్, బ్యాట్ మ్యాన్ వంటి విభిన్న డిజైన్ మేకింగ్, క్రియేటివ్ ఆర్ట్ వర్క్స్ రూపొందించడం ప్రధానాంశం. ఈ క్రియేటివిటీ పైన అవగాహన కలి్పంచడం కోసం కొన్ని రోజుల క్రితమే కామిక్ కాన్ ఫేం సౌరభ్ సింగ్ రావత్ నగరంలో కాస్ ప్లే వర్క్‌షాప్ నిర్వహించారు. ఉర్పీ జావేద్ వంటి ప్రముఖుల కోసం ఐకానిక్ కాస్ట్యూమ్‌లను రూపొందిస్తూ, టాప్ గ్లోబల్ బ్రాండ్లతో సౌరభ్ పని చేస్తుండటం విశేషం. ఈ వర్క్‌షాప్‌లో నగరంలోని ఔత్సాహికులు పాల్గొని ఆకర్షణీయ కాస్ ప్లే కళపై పట్టు సాధించారు. సాధారణ వస్తువులు వినియోగించి.. సాధారణ వస్తువులు వినియోగిస్తూ కాస్ ప్లే డిజైనింగ్, ఆర్ట్ వర్క్ పై అవగాహన పెంచుకున్నారు. అయితే నగరంలో స్పోర్ట్స్, సినిమాలు, ఫ్యాషన్, గేమింగ్ తరహాలో కాస్ ప్లే కూడా తన భవిష్యత్ ప్రణాళికలను సిద్ధం చేసుకుంటుందనడానికి ‘కామిక్ కాన్ 2024’ వంటి ఈవెంట్స్ నిదర్శనంగా నిలుస్తున్నాయని ఈ రంగంలోని నిపుణులు చెబుతున్నారు. -
హైదరాబాద్‌లో 'కామిక్ కాన్' ఈవెంట్.. ఎప్పటి నుంచో తెలుసా?
గేమింగ్, సినీ ప్రేమికుల కోసం 'కామిక్ కాన్' ఈవెంట్ సిద్ధమైపోయింది. హైదరాబాద్‌లో వచ్చే వారాంతం అంటే జనవరి 27, 28వ తేదీల్లో ఈ వేడుక జరగనుంది. ఇందులో భాగంగా యానిమే, గేమింగ్, పాప్-కల్చర్ ప్రియులకు మునుపెన్నడూ లేని అనుభూతిని ఇది అందివ్వబోతుంది. ఈ వేడుకకు హాజరైన ప్రతిఒక్కరూ పరిమిత ఎడిషన్ డీసీ కామిక్స్ బ్యాట్‌మాన్ పోస్టర్‌తో పాటు స్మారక కామిక్ కాన్ ఇండియా బ్యాగ్, మార్వెల్ ఇన్ఫినిటీ గాంట్లెట్ నం.1 కామిక్ పుస్తకం యొక్క ప్రత్యేక కాపీని అందుకుంటారు. (ఇదీ చదవండి: రష్మికతో ఎంగేజ్మెంట్పై క్లారిటీ ఇచ్చేసిన విజయ్ దేవరకొండ) కామిక్ కాన్ ఇండియా వ్యవస్థాపకుడు జతిన్ వర్మ మాట్లాడుతూ.. 'కామిక్ కాన్ ఎట్టకేలకు మూడు సంవత్సరాల విరామం తర్వాత హైదరాబాద్‌కు తిరిగి రాబోతుంది. అభిమానులందరికీ మళ్లీ హోస్ట్ చేయడానికి మేము ఎదురుచూస్తున్నాం. ఇది ఇప్పటికీ నగరంలో మా అతిపెద్ద ప్రదర్శన, అత్యుత్తమ భారతీయ కామిక్స్, అభిమానుల అనుభవాలు, కాస్ ప్లే, గేమింగ్, గీకీ షాపింగ్‌తోపాటు మరిన్నింటిని ప్రదర్శించబోతున్నాం' అని చెప్పుకొచ్చారు. వీకెండ్లో రెండు రోజుల పాటు జరిగే ఈవెంట్ ఉదయం 11 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు జరుగుతుంది. (ఇదీ చదవండి: అయోధ్య కోసం ప్రభాస్ రూ.50 కోట్ల విరాళం.. క్లారిటీ ఇచ్చిన టీమ్) -
హాలీవుడ్ లో తెలుగోడి సత్తా చూపించిన ప్రభాస్
-
ప్రాజెక్ట్- కె.. తన క్యారెక్టర్‌పై ప్రభాస్ ఆసక్తికర కామెంట్స్!
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ‘ప్రాజెక్ట్ కె’. ఈ చిత్రంలో దీపికా పదుకోణె హీరోయిన్గా నటిస్తోంది. అంతే కాకుండా ఈ క్రేజీ ప్రాజెక్ట్‌లో అమితాబ్ బచ్చన్, దిశా పటానీ, కమల్ హాసన్ కూడా ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఇటీవలే ఈ చిత్రానికి సంబంధించి వరుస అప్డేట్స్ సినిమాపై అంచనాలు పెంచేస్తున్నారు మేకర్స్. ఇటీవలే ప్రభాస్ ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా రిలీజైన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ మూవీ టైటిల్,గ్లింప్స్‌ను మేకర్స్ విడుదల చేశారు. (ఇది చదవండి: బిగ్ బాస్ హౌస్‌లోకి బేబీ హీరోయిన్.. సోషల్ మీడియాలో వైరల్!) ఈ భారీ బడ్జెట్ టైమ్‌ట్రావెల్ సైన్స్ ఫిక్షన్ ఫిల్మ్ ‘ప్రాజెక్ట్ కె’ గ్లింప్స్‌ను ‘కామిక్ కాన్ –2023’ వేడుకల్లో మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ గ్లింప్స్ హాలీవుడ్ సినిమాను తలపిస్తున్నాయంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఈ సినిమాకు 'కల్కి 2898 ఏడీ' (Kalki 2898 AD) అనే టైటిల్ ఖరారు చేశారు. పురాణాల ప్రకారం కలియుగం చివర్లో విష్ణువు పదో అవతారమే కల్కి. ప్రపంచాన్ని చీకటి కమ్మేసినప్పుడు ఒక శక్తిలా కల్కి ఉద్భవిస్తుందని మన పురాణాల్లో ఉంది. కలియుగం అంతంలో జరిగే కథా నేపథ్యంలో ఈ చిత్రం ఉండనున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ ప్రతిష్ఠాత్మక ఈవెంట్‌కు హాజరైన హీరో ప్రభాస్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అక్కడి స్థానికి మీడియాతో మాట్లాడుతూ డైరెక్టర్‌పై ఫన్నీ కామెంట్స్ చేశారు. ప్రభాస్ మాట్లాడుతూ.. 'ఇది ఒక సూపర్ హీరో సినిమా. ఇందులో అతి ముఖ్యమైన అంశం కామెడీ. నాగ్ అశ్విన్ ఈ స్టోరీని డిజైన్ చేసిన విధానం నాకు నచ్చింది. నా క్యారెక్టర్‌ను అలా తీర్చిదిద్దారు. ఈ ప్రాజెక్ట్‌లో ఫన్నీ క్యారెక్టర్ నాదే అనుకుంటా. ఈ చిత్రంలో స్ట్రాంగ్ ఎమోషన్స్ కూడా నాగ్ చూపించాడు. ఐ యామ్ ది కమెడియన్ ఇన్ దిస్ మూవీ. అంటూ' నవ్వుతూ మాట్లాడారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ఈ చిత్రం కోసం ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. (ఇది చదవండి: ఆ టాలీవుడ్ హీరోతో కలిసి కచ్చితంగా సినిమా చేస్తాను: ప్రభాస్) Prabhas on his character bringing the humor in #Kalki2898 AD #SDCC 2023 pic.twitter.com/tAqpF1iOT6 — Deadline Hollywood (@DEADLINE) July 21, 2023 -
చెన్నెలో ‘పాప్’ సాంస్కృతిక వేడుక
సాక్షి, చైన్నె : విదేశాలలోని పాప్ కల్చర్‌ను చైన్నెలో పరిచయం చేసే విధంగా సాంస్కృతిక వేడుకకు సన్నాహాలు చేపట్టామని కామిక్ కాన్ఇండియా వ్యవస్థాపకుడు జతిన్ వర్మ తెలిపారు. పాప్ కల్చర్ ఔత్సాహికులతో చైన్నెలో మొదటి ఎడిషన్‌కు ఆహ్వానం పలికే విధంగా కార్యక్రమాన్ని నిర్వహించారు. #ProjectK India first comic con 🔥#kirti_somya #DeepikaPadukone #hukum #Rajnikanth #Prabhas #chennai #tamil #hindi #Prabhas #trending2023 #TrendingNow pic.twitter.com/V6zAdhXLE1 — aayush09 (@TitoriaAyush) July 17, 2023 ఇందులో జతిన్ వర్మ మాట్లాడుతూ, పాప్ కల్చర్ మ్యాజిక్‌ను ఈ సారి చైన్నె నగరానికి తీసుకొచ్చేందుకు సిద్ధమయ్యామని వివరించారు. భారతీయ కామిక్ సృష్టికర్తలు, ప్రఖ్యాత కళాకారులు ఈ వేడుకకు తరలి రాబోతున్నారన్నారు. కళలు, వినోదం, స్మజనాత్మకత, మరుపురాని అనుభవాన్ని చైన్నె వాసులకు కలిగించే విధంగా ఈ వేడుక 2024 ఫిబ్రవరి 17,18 తేదీలలో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. #Chennai! Get ready to experience the #BestWeekendOfTheYear 😁 Save the date! 17th - 18th February 2024 at Chennai Trade Centre Be the first to receive the latest updates of Chennai Comic Con 2024 by signing up here - https://t.co/5VbgjJSt6g pic.twitter.com/OHev4bGevG — Comic Con India (@ComicConIndia) July 17, 2023 -
'హిరణ్య కశ్యప'గా రానా.. కథ రెడీ చేసిన త్రివిక్రమ్
రానా హీరోగా ‘హిరణ్య కశ్యప’ అనే చిత్రం రూపొందనున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం అమెరికాలో జరుగుతున్న ‘కామిక్ కాన్ – 2023’ వేడుకల్లో భాగంగా రానా ‘హిరణ్య కశ్యప’ను ప్రకటించారు. దర్శకుడు త్రివిక్రమ్ ఈ సినిమాకు కథ అందిస్తున్నారు. అలాగే ఈ సినిమాకు రానా ఓ నిర్మాతగా కూడా వ్యవహరించనున్నట్లు తెలుస్తోంది. అమర్ చిత్రకథల ఆధారంగా ఈ చిత్రం రూపొందనుంది. ఇక గతంలో రానాతో ‘హిరణ్య కశ్యప’ తెరకెక్కిస్తానని గుణశేఖర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. మరి.. ఆయన దర్శకత్వం లోనే ఈ ‘హిరణ్య కశ్యప’ ఉంటుందా? అనేది తెలియాల్సి ఉంది. -
కామి(కి)క్
-
కామిక్ కాన్‌దాన్..
-
కామిక్ కాన్‌దాన్..
అక్కడకు చేరిన వాళ్లందరి ఖాన్దాన్ ఒకటే.. అదే ‘కామిక్ కాన్’దాన్. కామిక్స్ అభిమానులంతా తమ అభిమాన కామిక్ పాత్రల వేషధారణలో వచ్చి సందడి చేశారు. ప్రపంచంలోని కామిక్ పాత్రలన్నీ ఒకేచోటికి రావడంతో సందర్శకులు ఆనంద పరవశులయ్యారు. హైటెక్స్‌లో శుక్రవారం ప్రారంభమైన ‘కామిక్ కాన్’కి నగర వాసుల నుంచి స్పందన లభించింది. మూడు రోజులు జరగనున్న ఈ కార్యక్రవుంలో రోజూ ఐదు విభాగాల్లో పోటీలు నిర్వహిస్తారు. కామిక్ బుక్/గ్రాఫిక్ నావెల్, ఏనిమేటెడ్ సిరీస్/మూవీ, మాంగా/ఏనిమీ, స్కై-ఫై/ఫాంటసీ, గేమింగ్ విభాగాల్లో నిర్వహించే పోటీల్లో ఒక్కో విభాగం నుంచి ఒక్కో విజేతను రోజూ ఎంపిక చేస్తారు. ఈ విజేతల నుంచి లక్కీ డ్రాలో ఎంపికైన లక్కీ విజేతకు వచ్చే ఏడాది షికాగోలో జరిగే కామిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ఎక్స్‌పోలో పాల్గొనే అవకాశమిస్తారు. అంతర్జాతీయ కామిక్స్ ప్రత్యేకం.. కామిక్ కాన్‌లో అంతర్జాతీయ కామిక్ సంస్థలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. జపాన్‌కు చెందిన ఐఐఎన్ఈ టాయ్స్ సంస్థ ఏనిమీ అండ్ మాంగా మెర్చ్ ప్రదర్శన ఏర్పాటు చేసింది. అంతర్జాతీయ ప్రచురణ సంస్థలు ఐడీడబ్ల్యూ, ఓని ప్రెస్, ఇమేజ్ కామిక్స్ వంటివి ప్రపంచం నలు మూలలకు చెందిన కామిక్ పుస్తకాలను తీసుకొచ్చాయి. టాంకీ టాయ్స్, ఐఐఎన్ఈ టాయ్స్ వం టి సంస్థలు కామిక్ బొమ్మలు, టీషర్టులు, గ్లాసులు, కప్పులతో ప్రదర్శనలు పెట్టాయి. తొలిరోజు..స్యెనగరి స్టూడియోస్ ప్రదర్శించిన ‘ది రోబోస్ ఆఫ్ ధర్మ’, రాహుల్ ఫిలిప్ ప్రదర్శించిన ‘లైవ్ కాన్సెప్ట్ ఆర్ట్’ డెవూన్స్ట్రేషన్ ఆకట్టుకున్నాయి. రాన్ వూర్జ్, నాథన్ ఎడ్మండ్సన్, జేక్ ఎల్లిస్, వివేక్ తివారీ వంటి అంతర్జాతీయు కామిక్ రచయితలు, చిత్రకారులు పాల్గొన్నారు. అద్భుతమైన స్పందన.. హైదరాబాద్ కామిక్ కాన్ తొలి ఎడిషన్ కార్యక్రమం కోసం నిజాంల నగరానికి రావడం ఆనందంగా ఉంది. హైదరాబాదీల ప్రేవూభిమానాలు, వారి నుంచి మాకు లభిస్తున్న ఆదరణ అపూర్వం. -జతిన్ వర్మ, వ్యవస్థాపకుడు, కామిక్ కాన్ ఇండియా - సిద్ధాంతి -
బాహుబలి వచ్చేస్తున్నాడు!
అవును.. బాహుబలి మరో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. మూడు రోజుల పాటు హైదరాబాద్‌లో పిల్లలను, పెద్దలను అలరిస్తాడు. ఎప్పుడో 2015లో రావాల్సిన బాహుబలి అప్పుడే ఎలా విడుదలవుతోందని ఆశ్చర్యపోతున్నారా? ఇది నిజం బాహుబలి కాదు.. అచ్చం బాహుబలిలాగే ఉండే కామిక్ కాన్. ఇక్కడ పలురకాల గేమ్స్, ఈవెంట్స్ ఉంటాయి. సాధారణంగా ఏడాదికోసారి భారతదేశంలో ఈ కామిక్ కాన్ జరుగుతుంది. ఈసారి దీని కాన్సెప్ట్.. బాహుబలి. అంటే, ఇందులో పాల్గొనాలి అనుకునేవాళ్లు బాహుబలిలా వేషం వేసుకుని రావాలన్న మాట. తన సినిమా విడుదల బాగా ఆలస్యం అవుతుండటంతో 'బాహుబలి' జనం నోళ్లలో నానేలా ఉండేందుకు దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి అన్నిరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. అందులోనూ తనకు నచ్చిన అంశాన్ని జనంలోకి తీసుకెళ్లడంలో రాజమౌళిది అందెవేసిన చేయి. తన సినిమాయే కాదు.. ఎవరి సినిమా అయినా కూడా అందులో తనకు నచ్చిన అంశం ఏదైనా ఉందంటే వెంటనే సోషల్ మీడియా ద్వారా లేదా ప్రత్యక్షంగా కూడా దాని గురించి ప్రజలకు వివరిస్తారు. అందరూ తప్పనిసరిగా దాన్ని చూసేలా చేస్తారు. అలాగే ఈసారి కూడా బాహుబలిని కామిక్ కాన్‌లో ప్రత్యేకంగా ప్రదర్శించబోతున్నారు. ఈనెల 10, 11, 12 తేదీలలో హైదరాబాద్‌లోని హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్లో ఈ ఉత్సవం జరగనుంది. దీని గురించి మరిన్ని అప్డేట్స్ తమ బాహుబలి ఫేస్బుక్ పేజీలో ఉంటాయని రాజమౌళి తన ఫేస్బుక్ పేజీ ద్వారా చెప్పారు. ఇక కార్యక్రమం గురించి, అందులో ఉండే రకరకాల పోటీల గురించి కావాలంటే #Baahubaliatcomiccon చూడాలన్నారు.