Rana announces his next pan India film with Trivikram - Sakshi
Sakshi News home page

'హిరణ్య కశ్యప'గా రానా.. కథ రెడీ చేసిన త్రివిక్రమ్‌

Published Thu, Jul 20 2023 12:30 AM | Last Updated on Thu, Jul 20 2023 2:47 PM

Rana announces his next pan India film with Trivikram - Sakshi

రానా హీరోగా ‘హిరణ్య కశ్యప’ అనే చిత్రం రూపొందనున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం అమెరికాలో జరుగుతున్న ‘కామిక్‌ కాన్‌ – 2023’ వేడుకల్లో భాగంగా రానా ‘హిరణ్య కశ్యప’ను ప్రకటించారు. దర్శకుడు త్రివిక్రమ్‌ ఈ సినిమాకు కథ అందిస్తున్నారు.

అలాగే ఈ సినిమాకు రానా ఓ నిర్మాతగా కూడా వ్యవహరించనున్నట్లు తెలుస్తోంది. అమర్‌ చిత్రకథల ఆధారంగా ఈ చిత్రం రూపొందనుంది. ఇక గతంలో రానాతో ‘హిరణ్య కశ్యప’ తెరకెక్కిస్తానని గుణశేఖర్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే. మరి.. ఆయన దర్శకత్వం లోనే ఈ ‘హిరణ్య కశ్యప’ ఉంటుందా? అనేది తెలియాల్సి ఉంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement