రానా హీరోగా ‘హిరణ్య కశ్యప’ అనే చిత్రం రూపొందనున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం అమెరికాలో జరుగుతున్న ‘కామిక్ కాన్ – 2023’ వేడుకల్లో భాగంగా రానా ‘హిరణ్య కశ్యప’ను ప్రకటించారు. దర్శకుడు త్రివిక్రమ్ ఈ సినిమాకు కథ అందిస్తున్నారు. అలాగే ఈ సినిమాకు రానా ఓ నిర్మాతగా కూడా వ్యవహరించనున్నట్లు తెలుస్తోంది. అమర్ చిత్రకథల ఆధారంగా ఈ చిత్రం రూపొందనుంది. ఇక గతంలో రానాతో ‘హిరణ్య కశ్యప’ తెరకెక్కిస్తానని గుణశేఖర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. రాక్షస రాజు హిరణ్యకశిపుడుగా రానా నటిస్తుండగా. కథ త్రివిక్రమ్ అందిస్తుండగా డైరెక్టర్ ఎవరనేది క్లారిటీ రాలేదు. అయితే ఈ విషయం మీద పరోక్షంగా గుణశేఖర్ తన సోషల్ మీడియా ఖాతా నుంచి కౌంటర్ ఇచ్చాడు.
(ఇదీ చదవండి: డింపుల్ హయాతి అసహనం.. ఆయనెక్కడ అంటూ మంత్రి కేటీఆర్‌కే ట్వీట్)
ఏపీలోని ఆళ్లగడ్డకు దగ్గరలో ఉన్న 'అహోబిలం లక్ష్మీ నరసింహ స్వామి' దేవాలయానికి సంబంధించిన ఒక ఫోటోను ఆయన షేర్ చేస్తూ ఇలా చెప్పుకొచ్చాడు. 'దేవుడిని మీ కథకు కేంద్ర ఇతివృత్తంగా చేస్తున్నప్పుడు, దేవుడు మీ చిత్తశుద్ధిని గమనిస్తుంటాడని కూడా మీరు గుర్తుంచుకోవాలి. అనైతిక చర్యలకు నైతిక మార్గాల ద్వారా సమాధానం ఇవ్వబడుతుంది. అని ఆయన కామెంట్ చేశాడు. 'హిరణ్యకశిప' ప్రాజెక్టు అధికారిక ప్రకటన వచ్చిన తర్వాతే గుణశేఖర్ చేయడంతో ఈ కామెంట్ 'రానా' మూవీ గురించే అని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది.
గతంలో గుణశేఖర్ ఏమన్నారంటే
సమంత-గుణశేఖర్ కాంబోలో వచ్చిన 'శాకుంతలం' ప్రమోషన్స్ కార్యక్రమంలో హిరణ్యకశిప ప్రాజెక్టుపై గుణశేఖర్ పలు వ్యాఖ్యలు ఇలా చేశారు. 'నేను హిరణ్యకశిప ప్రాజెక్టు మీ దగ్గరికి తీసుకు వచ్చినప్పుడు చేస్తే మీరు చేయాలి లేదంటే తప్పుకోవాలి కానీ అదే ప్రాజెక్టును వేరే వాళ్లతో సెట్స్‌పైకి తీసుకెళ్లే ప్రయత్నం చేయకండి. ఈ విషయంలో నాకు అన్యాయం జరిగితే ఎవరినీ వదలను, అలాంటి వారిపై ఎంతవరకైనా వెళ్తాను. ఆ ప్లేస్‌లో ఎవరున్నా సరే నేను వెనక్కు తగ్గను.' అంటూ గతంలో ఆయన కామెంట్లు చేశారు. అవి ఇప్పుడు మళ్లీ వైరల్ అవుతున్నాయి. దీనిని బట్టి చూస్తే హిరణ్యకశిప మూవీకి డైరెక్టర్ ఎవరనేది ఇప్పటికే డిసైడ్ అయినట్లు సమాచారం. ఈ ప్రాజెక్ట్‌లో గుణశేఖర్ లేకపోవడంతో ఇలా ముందే హెచ్చరిస్తున్నాడని తెలుస్తోంది.
(ఇదీ చదవండి: నేడు సితార పుట్టినరోజు.. ఫోటోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
Comments
Please login to add a commentAdd a comment