Gunashekhar
-
దేవుడు ఉన్నాడు.. దీని వెనుక ఎవరున్నా వదలను: గుణశేఖర్
రానా హీరోగా ‘హిరణ్య కశ్యప’ అనే చిత్రం రూపొందనున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం అమెరికాలో జరుగుతున్న ‘కామిక్ కాన్ – 2023’ వేడుకల్లో భాగంగా రానా ‘హిరణ్య కశ్యప’ను ప్రకటించారు. దర్శకుడు త్రివిక్రమ్ ఈ సినిమాకు కథ అందిస్తున్నారు. అలాగే ఈ సినిమాకు రానా ఓ నిర్మాతగా కూడా వ్యవహరించనున్నట్లు తెలుస్తోంది. అమర్ చిత్రకథల ఆధారంగా ఈ చిత్రం రూపొందనుంది. ఇక గతంలో రానాతో ‘హిరణ్య కశ్యప’ తెరకెక్కిస్తానని గుణశేఖర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. రాక్షస రాజు హిరణ్యకశిపుడుగా రానా నటిస్తుండగా. కథ త్రివిక్రమ్ అందిస్తుండగా డైరెక్టర్ ఎవరనేది క్లారిటీ రాలేదు. అయితే ఈ విషయం మీద పరోక్షంగా గుణశేఖర్ తన సోషల్ మీడియా ఖాతా నుంచి కౌంటర్ ఇచ్చాడు. (ఇదీ చదవండి: డింపుల్ హయాతి అసహనం.. ఆయనెక్కడ అంటూ మంత్రి కేటీఆర్‌కే ట్వీట్) ఏపీలోని ఆళ్లగడ్డకు దగ్గరలో ఉన్న 'అహోబిలం లక్ష్మీ నరసింహ స్వామి' దేవాలయానికి సంబంధించిన ఒక ఫోటోను ఆయన షేర్ చేస్తూ ఇలా చెప్పుకొచ్చాడు. 'దేవుడిని మీ కథకు కేంద్ర ఇతివృత్తంగా చేస్తున్నప్పుడు, దేవుడు మీ చిత్తశుద్ధిని గమనిస్తుంటాడని కూడా మీరు గుర్తుంచుకోవాలి. అనైతిక చర్యలకు నైతిక మార్గాల ద్వారా సమాధానం ఇవ్వబడుతుంది. అని ఆయన కామెంట్ చేశాడు. 'హిరణ్యకశిప' ప్రాజెక్టు అధికారిక ప్రకటన వచ్చిన తర్వాతే గుణశేఖర్ చేయడంతో ఈ కామెంట్ 'రానా' మూవీ గురించే అని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. గతంలో గుణశేఖర్ ఏమన్నారంటే సమంత-గుణశేఖర్ కాంబోలో వచ్చిన 'శాకుంతలం' ప్రమోషన్స్ కార్యక్రమంలో హిరణ్యకశిప ప్రాజెక్టుపై గుణశేఖర్ పలు వ్యాఖ్యలు ఇలా చేశారు. 'నేను హిరణ్యకశిప ప్రాజెక్టు మీ దగ్గరికి తీసుకు వచ్చినప్పుడు చేస్తే మీరు చేయాలి లేదంటే తప్పుకోవాలి కానీ అదే ప్రాజెక్టును వేరే వాళ్లతో సెట్స్‌పైకి తీసుకెళ్లే ప్రయత్నం చేయకండి. ఈ విషయంలో నాకు అన్యాయం జరిగితే ఎవరినీ వదలను, అలాంటి వారిపై ఎంతవరకైనా వెళ్తాను. ఆ ప్లేస్‌లో ఎవరున్నా సరే నేను వెనక్కు తగ్గను.' అంటూ గతంలో ఆయన కామెంట్లు చేశారు. అవి ఇప్పుడు మళ్లీ వైరల్ అవుతున్నాయి. దీనిని బట్టి చూస్తే హిరణ్యకశిప మూవీకి డైరెక్టర్ ఎవరనేది ఇప్పటికే డిసైడ్ అయినట్లు సమాచారం. ఈ ప్రాజెక్ట్‌లో గుణశేఖర్ లేకపోవడంతో ఇలా ముందే హెచ్చరిస్తున్నాడని తెలుస్తోంది. View this post on Instagram A post shared by Gunasekhar (@gunasekhar1) (ఇదీ చదవండి: నేడు సితార పుట్టినరోజు.. ఫోటోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
శాకుంతలం మూవీ ప్రెస్ మీట్..
-
శాకుంతలం టీమ్ మాటలకు ఫ్లాట్ అయిన ఉదయభాను..సినిమా చూసి తీరాలంతే...
-
శాకుంతలం సినిమాలో మహేష్ బాబు కూతురిని కాకుండా అల్లు అర్జున్ కూతురిని ఎందుకు తీసుకున్నామంటే..
-
సుమ స్పాంటేనిటీ పీక్స్.. సమంత నవ్వలేక ఏడ్చేసింది
-
కౌశిక్‌పై జీవితా రాజశేఖర్ ఫిర్యాదు
-
కౌశిక్ దాడి చేశారు : జీవితా రాజశేఖర్
సాక్షి, హైదరాబాద్ : అక్రమంగా కారును షోరూమ్ ముందు పార్కింగ్ చేయడమే కాకుండా ఇదేమని ప్రశ్నించినందుకు సినీనటుడు రాజశేఖర్ సోదరుడు గుణశేఖర్ వరదరాజన్‌పై గత ఎన్నికల్లో హుజురాబాద్ నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యే పోటీ చేసిన కౌశిక్ రెడ్డి దాడి చేశాడంటూ దర్శకురాలు, సీనీనటి జీవితారాజశేఖర్‌లు బంజారాహిల్స్ ఏసీపీ కేఎస్ రావుకు ఫిర్యాదు చేశారు. కౌశిక్‌పై చర్యలు తీసుకోవాలని ఏసీపీని కోరారు. జూబ్లీహిల్స్‌లోని రోడ్ నంబరు 45లో ఉన్న గుణ డైమండ్స్ ముందు కౌశిక్‌రెడ్డి తన కారును నిలిపి వేరే ప్రాంతానికి వెళ్లాడని, ఇదేమని గుణశేఖర్ ప్రశ్నించినందుకు ప్రాంతం పేరుతో దూషిస్తూ ఆయనను తీవ్రంగా కొట్టాడని ఫిర్యాదులొ పేర్కొన్నారు. అనంతరం జీవితా రాజశేఖర్ మీడియాతో మాట్లాడుతూ..‘కౌశిక్ దాడి వల్ల గుణశేఖర్‌కు తీవ్రగాయాలయ్యాయి. శనివారం నుంచి ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. పర్మిషన్ లేకుండా కారు ఎలా పార్క్ చేశారని అడిగితే..రెచ్చిపోయిన కౌశిక్ అసభ్య పదజాలంతో దూషిస్తూ గుణశేఖర్‌పై దాడి చేశారు. డైమాండ్ షోరూమ్‌ను లేపేస్తానంటూ బెదిరించారు. దాడికి సంబంధించి సీసీ ఫుటేజీలు కూడా ఉన్నాయి. వాటిని పరిశీలించాలని ఏసీపీని కోరాం. పరిశీలించిన ఏసీపీ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని సూచించారు. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడానికి వెళ్తున్నాం’ అని చెప్పారు. కాగా దాడి ఆరోపణలు ఎదుర్కొంటున్న కౌశిక్ రెడ్డి టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డికి దగ్గరి బంధువు కావడం గమనార్హం. -
పెరిగిన టాలీవుడ్ స్థాయి
తెలుగు సినిమా రంగం (టాలీవుడ్) స్థాయి పెరిగిపోయింది. ఇది అన్ని అంశాలకు వర్తిస్తుంది. అద్భుతమైన సాంకేతిక పరిజ్ఞానమే కాకుండా భారీ బడ్జెట్‌తో కూడా చిత్రాలు నిర్మించడానికి నిర్మాతలు పోటీ పడుతున్నారు. దర్శకులు అత్యంత ఆధునిక పద్దతులు అనుసరించడమే కాకుండా, కధనంలో కూడా తమ సత్తా చాటుతున్నారు. దర్శకులు, నిర్మాతలతోపాటు హీరోలు, హీరోయిన్లు కూడా అందుకు తగిన విధంగా కష్టపడుతున్నారు. కావలసినంత సమయం కేటాయిస్తున్నారు. కథ, కథనంలో కొత్తదనం కోసం అన్నివిధాల శ్రమిస్తున్నారు. ఇటీవల జరుగుతున్న తెలుగు సినిమా నిర్మాణాలే ఇందుకు నిదర్శనం. టాలీవుడ్లో ఇప్పుడు భారీ బడ్జెట్ సినిమాల గురించే చర్చ ఎక్కువగా జరుగుతోంది. ఒక్క పక్క దర్శకుడు రాజమౌళి భారతీయ సినిమా చరిత్రనే తిరగరాసే విధంగా అత్యంత అద్భుతమైన సాంకేతిక పరిజ్ఞానంతో 'బాహూబలి'ని చెక్కుతుంటే, మరోపక్క మరో ప్రముఖ దర్శకుడు గుణశేఖర్ ‘రుద్రమదేవి’ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించనున్నారు. ఈ రెండు చిత్రాలు దర్శకత్వమే ప్రధానంగా భారీబడ్జెట్తో రూపొందిస్తున్నారు. దర్శకులు ఇద్దరూ ఈ సినిమాల కోసం కొత్తకొత్త ప్రయోగాలు చేస్తున్నారు. నూతన ఆవిష్కరణలతో ఈ చిత్రాలను మన ముందుకు తీసుకురానున్నారు. తమ ప్రతిభచాటే యత్నంలో వీరిద్దరూ నిమగ్నమై ఉన్నారు. ఈ రెండూ మల్టీస్టారర్ చిత్రాలే. ఈ రెంటిలో అగ్ర కథానాయిక అనుష్క, హీరో రాణా ప్రధాన పాత్రలలో నటించడం విశేషం. హీరోలకు ధీటుగా అనుష్క నటిస్తున్నట్లు సమాచారం. ఇలా ఈ రెండు చిత్రయూనిట్ సభ్యులు బిజి బిజిగా ఉంటే, మరో మెగా హీరో కూడా ఓ చారిత్రక చిత్రంలో నటించడానికి సిద్ధమయ్యారు. కాకతీయ సామ్రాజ్యాన్ని పరిపాలించిన రాణి రుద్రమదేవి సాహసాల ఆధారంగా గుణా టీమ్ వర్స్క్ పతాకంపై రాగిణీ గుణ సమర్పణలో దీనిని నిర్మిస్తున్నారు. దేశంలోనే తొలి హిస్టారికల్ స్టీరియోస్కోపిక్ 3డి చిత్రంగా డైనమిక్ దర్శకుడు గుణశేఖర్ ‘రుద్రమదేవి’ రూపొందిస్తున్నారు. గుణశేఖర్ అంటే సెట్టింగ్స్ గురించి చెప్పేపనేముంది. ఈ విషయంలో ఆయన ప్రతిభ అందరికీ తెలిసిందే. తెలుగు చిత్రసీమ గర్వించదగిన తోట తరణి దీనికి కళా దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా కోసం యుద్ధ సన్నివేశాలను గుణశేఖర్ అద్బుతంగా చిత్రీకరించినట్లు తెలుస్తోంది. ఈ చారిత్రక చిత్రంలో గోన్నగన్నారెడ్డి అనే కీలక పాత్రను స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్నాడు. బన్నీకి ఈ పాత్ర ఎంతగానో నచ్చడంతో ఓకె చెప్పాడట. ప్రముఖ హీరోలు అతిధి పాత్రైనా ఇటువంటి కీలక పాత్రలలో నటించడం శుభపరిణామమే. గోన్నగన్నారెడ్డి పాత్ర ఎవరు చేసినా గొప్పగా ఉంటుందని భావిస్తున్నారు. రాబిన్ హూడ్ తరహా పాత్ర అని గుణశేఖర్ బల్లగుద్ది మరీ చెబుతున్నారు. ఈ పాత్ర ప్రాధాన్యత రీత్యా ప్రముఖ హీరోల కోసమే గుణశేఖర్ ప్రయత్నించినట్లు తెలిసింది. అయితే చివరకు ఇది బన్నీని వరించింది. ఈ చిత్రంలో మరో ముఖ్య విశేషం ఉన్నట్లు తెలుస్తోంది. వయ్యారి భామ అనుష్కను హరివీరభయంకర యుద్ధవిద్యలలో ఆరితేరిన వీరనారిగా చూపుతూనే మరో పక్క ఆమె అందాలను గుణశేఖర్ అద్భుతంగా చూపించనున్నారు. s.nagarjuna@sakshi.com