Hiranya Kashyapa
-
హిరణ్య కశ్యప సినిమా గురించి రానా దగ్గుబాటి
-
దేవుడు ఉన్నాడు.. దీని వెనుక ఎవరున్నా వదలను: గుణశేఖర్
రానా హీరోగా ‘హిరణ్య కశ్యప’ అనే చిత్రం రూపొందనున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం అమెరికాలో జరుగుతున్న ‘కామిక్ కాన్ – 2023’ వేడుకల్లో భాగంగా రానా ‘హిరణ్య కశ్యప’ను ప్రకటించారు. దర్శకుడు త్రివిక్రమ్ ఈ సినిమాకు కథ అందిస్తున్నారు. అలాగే ఈ సినిమాకు రానా ఓ నిర్మాతగా కూడా వ్యవహరించనున్నట్లు తెలుస్తోంది. అమర్ చిత్రకథల ఆధారంగా ఈ చిత్రం రూపొందనుంది. ఇక గతంలో రానాతో ‘హిరణ్య కశ్యప’ తెరకెక్కిస్తానని గుణశేఖర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. రాక్షస రాజు హిరణ్యకశిపుడుగా రానా నటిస్తుండగా. కథ త్రివిక్రమ్ అందిస్తుండగా డైరెక్టర్ ఎవరనేది క్లారిటీ రాలేదు. అయితే ఈ విషయం మీద పరోక్షంగా గుణశేఖర్ తన సోషల్ మీడియా ఖాతా నుంచి కౌంటర్ ఇచ్చాడు. (ఇదీ చదవండి: డింపుల్ హయాతి అసహనం.. ఆయనెక్కడ అంటూ మంత్రి కేటీఆర్‌కే ట్వీట్) ఏపీలోని ఆళ్లగడ్డకు దగ్గరలో ఉన్న 'అహోబిలం లక్ష్మీ నరసింహ స్వామి' దేవాలయానికి సంబంధించిన ఒక ఫోటోను ఆయన షేర్ చేస్తూ ఇలా చెప్పుకొచ్చాడు. 'దేవుడిని మీ కథకు కేంద్ర ఇతివృత్తంగా చేస్తున్నప్పుడు, దేవుడు మీ చిత్తశుద్ధిని గమనిస్తుంటాడని కూడా మీరు గుర్తుంచుకోవాలి. అనైతిక చర్యలకు నైతిక మార్గాల ద్వారా సమాధానం ఇవ్వబడుతుంది. అని ఆయన కామెంట్ చేశాడు. 'హిరణ్యకశిప' ప్రాజెక్టు అధికారిక ప్రకటన వచ్చిన తర్వాతే గుణశేఖర్ చేయడంతో ఈ కామెంట్ 'రానా' మూవీ గురించే అని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. గతంలో గుణశేఖర్ ఏమన్నారంటే సమంత-గుణశేఖర్ కాంబోలో వచ్చిన 'శాకుంతలం' ప్రమోషన్స్ కార్యక్రమంలో హిరణ్యకశిప ప్రాజెక్టుపై గుణశేఖర్ పలు వ్యాఖ్యలు ఇలా చేశారు. 'నేను హిరణ్యకశిప ప్రాజెక్టు మీ దగ్గరికి తీసుకు వచ్చినప్పుడు చేస్తే మీరు చేయాలి లేదంటే తప్పుకోవాలి కానీ అదే ప్రాజెక్టును వేరే వాళ్లతో సెట్స్‌పైకి తీసుకెళ్లే ప్రయత్నం చేయకండి. ఈ విషయంలో నాకు అన్యాయం జరిగితే ఎవరినీ వదలను, అలాంటి వారిపై ఎంతవరకైనా వెళ్తాను. ఆ ప్లేస్‌లో ఎవరున్నా సరే నేను వెనక్కు తగ్గను.' అంటూ గతంలో ఆయన కామెంట్లు చేశారు. అవి ఇప్పుడు మళ్లీ వైరల్ అవుతున్నాయి. దీనిని బట్టి చూస్తే హిరణ్యకశిప మూవీకి డైరెక్టర్ ఎవరనేది ఇప్పటికే డిసైడ్ అయినట్లు సమాచారం. ఈ ప్రాజెక్ట్‌లో గుణశేఖర్ లేకపోవడంతో ఇలా ముందే హెచ్చరిస్తున్నాడని తెలుస్తోంది. View this post on Instagram A post shared by Gunasekhar (@gunasekhar1) (ఇదీ చదవండి: నేడు సితార పుట్టినరోజు.. ఫోటోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
'హిరణ్య కశ్యప'గా రానా.. కథ రెడీ చేసిన త్రివిక్రమ్
రానా హీరోగా ‘హిరణ్య కశ్యప’ అనే చిత్రం రూపొందనున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం అమెరికాలో జరుగుతున్న ‘కామిక్ కాన్ – 2023’ వేడుకల్లో భాగంగా రానా ‘హిరణ్య కశ్యప’ను ప్రకటించారు. దర్శకుడు త్రివిక్రమ్ ఈ సినిమాకు కథ అందిస్తున్నారు. అలాగే ఈ సినిమాకు రానా ఓ నిర్మాతగా కూడా వ్యవహరించనున్నట్లు తెలుస్తోంది. అమర్ చిత్రకథల ఆధారంగా ఈ చిత్రం రూపొందనుంది. ఇక గతంలో రానాతో ‘హిరణ్య కశ్యప’ తెరకెక్కిస్తానని గుణశేఖర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. మరి.. ఆయన దర్శకత్వం లోనే ఈ ‘హిరణ్య కశ్యప’ ఉంటుందా? అనేది తెలియాల్సి ఉంది. -
పురాణ పురుషులు
హీరోలు ఎలాంటి పాత్ర చేయాలన్నా కుదురుతుంది. యాక్షన్, ఫ్యాక్షన్, కామెడీ, ట్రాజడీ. కానీ పౌరాణిక పాత్ర చేయాలంటే మాత్రం కలసి రావాలి. కథ కుదరాలి. బడ్జెట్ కుదరాలి. ఫిజిక్ కుదరాలి. ప్రస్తుతం కొందరు హీరోలకు అవన్నీ కుదిరాయి. పౌరాణిక సినిమాలతో సిద్ధమవుతున్నారు. పురాణ పురుషులుగా మారబోతున్నారు. ఆ పురుషుల వివరాలు. ఆది పురుష్ ప్రభాస్ హీరోగా తెరకెక్కనున్న ప్యాన్ ఇండియా చిత్రం ‘ఆది పురుష్’. ఓం రౌత్ దర్శకుడు. ఈ సినిమాలో ప్రభాస్ శ్రీ రాముడి పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమా కోసం విలు విద్య నేర్చుకుంటున్నారు ప్రభాస్. అలానే తన శరీరాకృతిని కూడా మార్చేస్తున్నారు. వచ్చే ఏడాది ప్రారంభంలో ఈ సినిమా చిత్రీకరణ మొదలవుతుంది. హిరణ్య కశ్యప గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కనున్న పౌరాణిక చిత్రం ‘హిరణ్య కశ్యప’. సుమారు 200 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కనున్న ఈ సినిమాలో రానా టైటిల్ రోల్ పోషించనున్నారు. సురేశ్ ప్రొడక్షన్స్ నిర్మించనుంది. ఏడాదిన్నరగా ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు చేస్తున్నారు గుణశేఖర్. త్వరలోనే ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభం అవుతుంది. మహావీర్ కర్ణణ్ విక్రమ్ హీరోగా తమిళ–హిందీ భాషల్లో ‘మహావీర్ కర్ణణ్’ అనే ప్రాజెక్ట్‌ను గత ఏడాది ప్రకటించారు. ఈ సినిమాలో కర్ణుడి పాత్రలో విక్రమ్ నటించనున్నారు. ఆర్.ఎస్ విమల్ దర్శకత్వం వహించనున్న ఈ సినిమాను 300 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కించనున్నారు. రండామూళం... మహాభారతాన్ని తెరకెక్కించే ప్లాన్‌లో ఉన్నారు మలయాళ దర్శకుడు వాసుదేవ్ నాయర్. భీముడి పాత్ర కోణం నుంచి భారతాన్ని చెప్పబోతున్నట్టు ‘రండామూళం’ అనే చిత్రాన్ని ప్రకటించారు. ఇందులో భీముడి పాత్రలో మోహన్‌లాల్ నటించనున్నారు. వెయ్యి కోట్ల బడ్జెట్‌తో ఈ సినిమాను తెరకెక్కించే ప్లాన్‌లో ఉన్నారు. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కనుందని టాక్. అల్లు అరవింద్ నిర్మాణంలో బాలీవుడ్లో రామాయణం నేపథ్యంలో ఓ సినిమా రూపొందనుంది. మూడు భాగాలుగా తెరకెక్కనున్న ఈ సినిమా 1500 కోట్లతో తెరకెక్కనుంది. నితేష్ తివారీ, రవి ఉడయార్ ఈ చిత్రాలను డైరెక్ట్ చేయనున్నారు. నటీనటులను ఇంకా ప్రకటించలేదు. అలానే మహాభారతాన్ని సినిమాగా తీయాలనుందని ఆమీర్ ఖాన్ చాలాసార్లు ప్రకటించారు. అందులో ఆయన శ్రీకృష్ణుడి పాత్ర చేయాలనుకుంటున్నారని టాక్. -
‘హిరణ్యకశ్యప’ లేటెస్ట్ అప్డేట్
కమర్షియల్, పౌరాణిక, చారిత్రక నేపథ్యం గల చిత్రాలను తెరకెక్కిస్తూ సినీ ఇండస్ట్రీలో తన కంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్న దర్శకుడు గుణశేఖర్. భారీ సెట్లు, భారీ బడ్జెట్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే ఈ డైరెక్టర్ ప్రస్తుతం ‘హిరణ్యకశ్యప’ టైటిల్‌తో పౌరాణిక సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే. గత మూడేళ్లుగా ఈ సినిమాకు సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోందని గుణశేఖర్ స్వయంగా ప్రకటించారు. తాజాగా ‘హిర్యణ్యకశ్యప’ ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తయినట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. పాన్ ఇండియా లెవల్లో రూపుదిద్దుకోనున్న ఈ చిత్రానికి సంబంధించి మరింత సమాచారం త్వరలోనే వెల్లడిస్తామని కూడా తెలిపింది. (ఆగస్టులోనే రానా పెళ్లి) సురేశ్ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ‘హిరణ్యకశ్యప’ చిత్రంలో రానా ప్రధాన పాత్రలో కనిపించనున్నారు. అనుష్క ‘రుద్రమదేవి’ చిత్రం తర్వాత కాస్త గ్యాప్ ఇచ్చిన డైనమిక్ డైరెక్టర్ గుణశేఖర్ ఆ తర్వాత ‘బాహుబలి’ని మించిన రేంజ్లో ఓ చిత్రం చేయబోతున్నట్లు తెలిపారు. అనంతరం ‘హిరణ్యకశ్యప’ చిత్రాన్ని అనౌన్స్ చేశారు. అయితే ప్రస్తుత కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఈ చిత్రం అటకెక్కిందని ప్రచారం జోరుగా జరిగింది. అయితే తాజాగా ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తి అయ్యాయని ప్రకటించడంతో ఈ సినిమాకు సంబంధించి ప్రచారం అవుతున్న అసత్య వార్తలకు చిత్ర బృందం పుల్‌స్టాప్ పెట్టింది. ఇక ఇది భక్త ప్రహ్లాద కథే అయినప్పటికీ ఈ సినిమాను హిరణ్యకశ్యపుడి కోణంలో గుణశేఖర్ తెరకెక్కించబోతున్నారు. -
బాహుబలి కంటే గొప్పగా...
రానా హీరోగా గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కనున్న మైథాలజీ మూవీ ‘హిరణ్యకశ్యప’. దాదాపు 180 కోట్ల బడ్జెట్‌తో ఈ చిత్రం తెరకెక్కనుందని సమాచారం. అయితే ఈ సినిమా ప్రకటన వచ్చి దాదాపు రెండేళ్లు అవుతోంది. కానీ ఈ చిత్రం ఎప్పుడు సెట్స్‌పైకి వెళ్తుందనే విషయంపై సరైన స్పష్టత రావడం లేదు. ఈ విషయంపై రానా ఓ ఆంగ్ల పత్రికతో మాట్లాడారు. ‘‘ఈ సినిమా ప్రీ–ప్రొడక్షన్ వర్క్స్‌ని పక్కాగా ప్లాన్ చేస్తున్నాం. ఇలాంటి సినిమాల్లో విజువల్స్ బాగుండాలని ఓ యాక్టర్‌గా నేను కోరుకుంటున్నాను. అందుకే సాంకేతికపై మరింత బాగా దృష్టి పెట్టాం. ఈ సినిమా కోసం ప్రత్యేకంగా వర్చువల్ రియాలిటీ సెట్స్‌ని క్రియేట్ చేయాలనుకుంటున్నాం. ఇలా చేయడం వల్ల సినిమా మొదలు కాకముందే విజువల్స్ ఎలా ఉంటాయో ఓ అవగాహనకు రావొచ్చు. బహుశా.. ఇండియాలో ఇలా చేస్తున్నది మా టీమే అనుకుంటాను. ఇందుకోసం ఓ త్రీడీ స్కానింగ్ కంపెనీతో అసోసియేట్ కాబోతున్నాం. ఇంకా గ్రౌండ్ వర్క్ జరుగుతోంది. మేం అనుకున్న ప్రణాళిక ప్రకారం ముందు ప్రీ–ప్రొడక్షన్ పనులు పూర్తి చేస్తాం. అంతా సమకూర్చుకున్న తర్వాత వచ్చే ఏడాది చివర్లో ఈ సినిమాను సెట్స్‌పైకి తీసుకెళ్లాలనుకుంటున్నాం. ‘హిరణ్య కశ్యప’ చిత్రాన్ని ‘బాహుబలి’ కంటే గొప్పగా తెరకెక్కించాలని ప్రయత్నిస్తున్నాం’’ అని పేర్కొన్నారు రానా. -
రానా రిటర్న్స్
కొంతకాలంగా అమెరికాలో ఉంటున్నారు రానా. ఆరోగ్య సమస్యల రీత్యా అనేది వార్త. గుణశేఖర్ దర్శకత్వంలో చేయబోతున్న ‘హిరణ్య కశ్యప’ సినిమా ప్రీ విజువలైజేషన్‌కు సంబంధించిన పని అనేది ఒక వార్త. ఈ రెండింట్లో ఏ విషయమై రానా అమెరికాలో ఉన్నారో క్లారిటీ లేదు. ప్రస్తుతం అయితే ‘అమెరికా ట్రిప్ ముగిసింది, ఇండియా వచ్చేస్తున్నాను’ అని అప్డేట్ ఇచ్చారు రానా. -
నాలుగేళ్ల తర్వాత...
అదిగో ఇదిగో అంటూ సినీప్రేక్షకులను ఊరిస్తూ వస్తున్న రానా ‘హిరణ్యకశ్యప’ సినిమా అధికారిక ప్రకటన రానే వచ్చింది. దర్శకుడు గుణశేఖర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. ‘‘మైథలాజికల్ ఫిల్మ్ ‘హిరణ్యకశ్యప’పై నేను వర్క్ చేస్తున్నాను. నటుడు రానా దగ్గుబాటి టైటిల్ రోల్ చేయనున్నారు. విస్తృత స్థాయిలో మూడేళ్లుగా ఈ సినిమా ప్రీ–ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. అవును.. మూడేళ్లుగా చేస్తూనే ఉన్నాం. చాలా ఉత్తేజంగా ఉన్నాం. త్వరలో మరిన్ని వివరాలు వెల్లడిస్తాం. రానాతో ఇది ఎగై్జటింగ్ జర్నీగా ఉండబోతోంది’’ అని దర్శకుడు గుణశేఖర్ వెల్లడించారు. ఈ సినిమాను సురేశ్ ప్రొడక్షన్స్ సంస్థ నిర్మించనున్నట్లు తెలుస్తోంది. అలాగే మైథలాజికల్ సినిమా కాబట్టి గ్రాఫిక్స్ వర్క్ కూడా బాగానే ఉంటాయని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇక ఈ సంగతి ఇలా ఉంచితే ... 2015లో వచ్చిన పీరియాడికల్ మూవీ ‘రుద్రమదేవి’ తర్వాత గుణశేఖర్ తెరకెక్కిస్తున్న సినిమా ఇదే కావడం విశేషం. ప్రస్తుతం ‘అరణ్య’ సినిమాతో రానా బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. -
200 కోట్లతో రానా సినిమా!
రుద్రమదేవి సినిమాతో భారీ చారిత్రక చిత్రాన్ని వెండితెర మీద ఆవిష్కరించిన దర్శకుడు గుణశేఖర్ లాంగ్ గ్యాప్ తరువాత ఇప్పుడు మరో సాహసానికి రెడీ అవుతున్నాడు. ప్రహ్లాదుడి కథతో హిరణ్యకశ్యప అనే సినిమాను తెరకెక్కించనున్నట్టుగా గుణశేఖర్ చాలా రోజుల కిందటే ప్రకటించాడు. ఈ పౌరాణిక గాథను భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించాలని ప్లాన్ చేశారు. అంతేకాదు యంగ్ హీరో రానా ఈ సినిమాలో టైటిల్ రోల్ లో నటించటమే కాదు తానే స్వయంగా నిర్మిస్తున్నాడు కూడా. తాజాగా మరో ఆసక్తికరమైన వార్త టాలీవుడ్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. హిరణ్యకశ్యప సినిమాను దర్శకుడు గుణశేఖర్ దాదాపు 200 కోట్ల బడ్జెట్‌తో రూపొందించే ఆలోచనలో ఉన్నాడట. అయితే మార్కెట్ పరంగా గుణశేఖర్‌గాని, రానా గాని సోలోగా ఇంతవరకు వంద కోట్లమార్క్‌ను అందుకోలేదు. అందుకే అంత బడ్జెట్‌తో హిరణ్యకశ్యపను తెరకెక్కించటం సాహసమే అని భావిస్తున్నారు విశ్లేషకులు. ఈ భారీ ప్రయోగంలో గుణ మరోసారి విజయం సాధింస్తాడేమో చూడాలి. -
పౌరాణిక పాత్రలో రానా..
విలక్షణ పాత్రలతో ఆకట్టుకుంటున్న యంగ్ హీరో రానా, మరో ఆసక్తికరమైన చిత్రానికి రెడీ అవుతున్నాడు. ప్రస్తుతం పీరియాడిక్ జానర్ లో తెరకెక్కుతున్న 1945, హథీ మేరీ సాథీతో పాటు చారిత్రక చిత్రంగా రూపొందుతున్న మార్తాండ వర్మ సినిమాల్లో సినిమా నటిస్తున్నాడు. ఈ రెండు సినిమాల తరువాత ఓ పౌరాణిక చిత్రం చేసేందుకు రెడీ అవుతున్నాడు. రుద్రమదేవి సినిమాతో ఆకట్టుకున్న దర్శకుడు గుణశేఖర్, త్వరలో హిరణ్య కశ్యప సినిమాను తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. మరోసారి గుణ టీం వర్క్స్ బ్యానర్‌పై భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో భక్త ప్రహ్లాదుడి కథను హిరణ్యకశ్యపుడి కోణంలో చూపించనున్నారట. ఈ సినిమాలో హిరణ్య కశ్యపుడిగా రానా నటించనున్నాడు. 150 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కించనున్న ఈ సినిమా ఆగస్టులో ప్రారంభం కానుంది. బహు భాషా చిత్రంగా తెరకెక్కుతున్న ఈసినిమాలో తెలుగు, తమిళ, హిందీ భాషలకు చెందిన ప్రముఖ నటులు నటించనున్నారు. -
పౌరాణిక పాత్రలో సీనియర్ హీరో..?
రుద్రమదేవి సినిమాతో మంచి విజయం అందుకున్న క్రియేటివ్ డైరెక్టర్ గుణశేఖర్.. ఇప్పుడు మరో భారీ చిత్రానికి రెడీ అవుతున్నాడు. రుద్రమదేవి తరువాత లాంగ్ గ్యాప్ తీసుకున్న గుణ టీం, ఈ సారి ఓ పౌరాణిక గాథను తెరపై ఆవిష్కరించనున్నారు. భక్త ప్రహ్లాద కథను హిరణ్య కశ్యపుడి కోణంలో తెరకెక్కించనున్నట్టుగా ప్రకటించాడు గుణ శేఖర్. అయితే ప్రస్తుతం ఉన్న నటుల్లో హిరణ్య కశ్యపుడి పాత్రకు ఎవరు సూట్ అవుతారన్న చర్చ మొదలైంది. ముందుగా యంగ్ హీరోలే ఈ పాత్రలో నటిస్తారన్న ప్రచారం జరిగినా.. తాజాగా ఓ సీనియర్ ను ఫైనల్ చేశారన్న టాక్ వినిపిస్తోంది. ఇంత వరకు తన కెరీర్ లో పౌరాణిక పాత్రలో కనిపించని సీనియర్ హీరో వెంకటేష్, హిరణ్య కశ్యప సినిమాలో లీడ్ రోల్ లో నటించనున్నాడు. ఇటీవల ప్రయోగాత్మక చిత్రాలు చేసేందుకు ఇంట్రస్ట్ చూపిస్తున్న వెంకటేష్, నెగెటివ్ టచ్ ఉన్న హిరణ్య కశ్యపుడి పాత్రలో నటించేందుకు ఇంట్రస్ట్ చూపిస్తున్నాడట. త్వరలోనే ఈ భారీ చిత్రానికి సంబంధించి మరిన్ని విషయాలు వెల్లడించనున్నారు. -
త్వరలో సెట్స్ మీదకు భక్త ప్రహ్లాద
రుద్రమదేవి సినిమాతో ఘన విజయం సాధించిన సీనియర్ దర్శకుడు గుణశేఖర్... మరో ప్రయోగానికి రెడీ అవుతున్నాడు. రుద్రమదేవితో భారీ చారిత్రక కథకు తెర రూపం ఇచ్చిన గుణ, ఇప్పుడు ఓ పౌరాణిక కథాంశాన్ని తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నాడు. ఇప్పటికే పలుమార్లు సినిమాగా రూపొందిన భక్త ప్రహాద కథతో సినిమా చేస్తున్నట్టుగా ప్రకటించాడు. గతంలో హిరణ్యకశ్యప పేరుతో గుణశేఖర్ ఓ భారీ చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నాడన్న టాక్ వినిపించింది. అయితే తాజాగా సినిమా టైటిల్ ఎనౌన్స్ చేయకపోయినా.. ప్రహ్లాదుడి కథతోనే సినిమా చేస్తున్నట్టుగా తెలిపాడు గుణ. ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలు పెట్టే ముందు కుటుంబ సమేతంగా శ్రీవారిని దర్శించుకున్న గుణశేఖర్ అక్కడే సినిమా చేయబోతున్నట్టుగా వెల్లడించారు. రుద్రమదేవి సినిమా తరువాత ప్రతాపరుద్రుడు అనే చారిత్రక చిత్రాన్ని రూపొందించనున్నట్టుగా ప్రకటించాడు. అయితే ప్రతాపరుద్రుడు కథకు మరింత రిసెర్చ్ చేయాల్సి ఉండటంతో ఆ సినిమాను వాయిదా వేసి హిరణ్యకశ్యపను తెర మీదకు తీసుకువచ్చాడు.రుద్రమదేవి కన్నా భారీగా ఈ సినిమాను రూపొందిచనున్నాడు. -
పౌరాణిక పాత్రలో ఎన్టీఆర్..?
తెలుగు తెర మీద పౌరణిక పాత్రలతో అలరించిన మహానటుడు సీనియర్ ఎన్టీఆర్ కృష్ణుడిగా రాముడిగానే కాదు. నెగెటివ్ రోల్స్ అయిన రావణాబ్రహ్మ, దుర్యోధనుడి పాత్రల్లోనూ ఎన్టీఆర్ నటన అద్భుతం. అందుకే ఆ తరువాత అలాంటి ప్రాతలు చేయడానికి ఎవరూ సాహసించలేదు. అయితే ఆయన వారుసుడిగా పరిచయం అయిన నందమూరి బాలకృష్ణ కృష్ణుడిగా, రాముడిగా అర్జునుడిగా నటించి మెప్పించాడు. ఇప్పుడు మరోసారి అదే వంశం నుంచి ఓ పౌరాణిక చిత్రం తెరకెక్కనుందన్న టాక్ వినిపిస్తోంది. నందమూరి యువ నటుడు ఎన్టీఆర్ హీరోగా ఓ పౌరాణిక గాథకు దృశ్యరూపం ఇచ్చేందుకు ప్లాన్ చేస్తున్నాడు దర్శకుడు గుణశేఖర్. ఇటీవల రుద్రమదేవితో చారిత్రక గాథను తెరకెక్కించి గుణ టీం ఇప్పుడు హిరణ్యకశ్యప పేరుతో సినిమాను రూపొందించేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాలో టైటిల్ రోల్లో హిరణ్యకశ్యపుడిగా ఎన్టీఆర్‌ను నటింప చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే యమదొంగ సినిమాలో యముడి గెటప్‌లో ఆకట్టుకున్న ఎన్టీఆర్, పూర్తి స్థాయి పౌరాణిక పాత్ర చేయాలని చాలా రోజులుగా ప్రయత్నిస్తున్నాడు. మరి గుణశేఖర్ ఇచ్చిన ఆఫర్ కు జూనియర్ ఎలా స్పందిస్తాడో చూడాలి.