పౌరాణిక పాత్రలో ఎన్టీఆర్..? | Ntr in Gunashekar Hiranya Kashyapa | Sakshi
Sakshi News home page

పౌరాణిక పాత్రలో ఎన్టీఆర్..?

Published Sat, Feb 4 2017 10:25 AM | Last Updated on Tue, Sep 5 2017 2:54 AM

పౌరాణిక పాత్రలో ఎన్టీఆర్..?

పౌరాణిక పాత్రలో ఎన్టీఆర్..?

తెలుగు తెర మీద పౌరణిక పాత్రలతో అలరించిన మహానటుడు సీనియర్ ఎన్టీఆర్ కృష్ణుడిగా రాముడిగానే కాదు. నెగెటివ్ రోల్స్ అయిన రావణాబ్రహ్మ, దుర్యోధనుడి పాత్రల్లోనూ ఎన్టీఆర్ నటన అద్భుతం. అందుకే ఆ తరువాత అలాంటి ప్రాతలు చేయడానికి ఎవరూ సాహసించలేదు. అయితే ఆయన వారుసుడిగా పరిచయం అయిన నందమూరి బాలకృష్ణ కృష్ణుడిగా, రాముడిగా అర్జునుడిగా నటించి మెప్పించాడు.

ఇప్పుడు మరోసారి అదే వంశం నుంచి ఓ పౌరాణిక చిత్రం తెరకెక్కనుందన్న టాక్ వినిపిస్తోంది. నందమూరి యువ నటుడు ఎన్టీఆర్ హీరోగా ఓ పౌరాణిక గాథకు దృశ్యరూపం ఇచ్చేందుకు ప్లాన్ చేస్తున్నాడు దర్శకుడు గుణశేఖర్. ఇటీవల రుద్రమదేవితో చారిత్రక గాథను తెరకెక్కించి గుణ టీం ఇప్పుడు హిరణ్యకశ్యప పేరుతో సినిమాను రూపొందించేందుకు ప్లాన్ చేస్తున్నారు.

ఈ సినిమాలో టైటిల్ రోల్లో హిరణ్యకశ్యపుడిగా ఎన్టీఆర్ను నటింప చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే యమదొంగ సినిమాలో యముడి గెటప్లో ఆకట్టుకున్న ఎన్టీఆర్, పూర్తి స్థాయి పౌరాణిక పాత్ర చేయాలని చాలా రోజులుగా ప్రయత్నిస్తున్నాడు. మరి గుణశేఖర్ ఇచ్చిన ఆఫర్ కు జూనియర్ ఎలా స్పందిస్తాడో చూడాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement