బుడ్డోడే 'వీరాభిమన్యు'..? | ntr to play abhimanyu in gunashekars virabhimanyu | Sakshi
Sakshi News home page

బుడ్డోడే 'వీరాభిమన్యు'..?

Published Wed, Nov 4 2015 12:33 PM | Last Updated on Sun, Sep 3 2017 12:00 PM

బుడ్డోడే 'వీరాభిమన్యు'..?

బుడ్డోడే 'వీరాభిమన్యు'..?

రుద్రమదేవి సినిమాతో మంచి జోష్లో ఉన్న దర్శకుడు గుణశేఖర్ ఈ సారి ఓ పౌరాణిక చిత్రానికి రెడీ అవుతున్నాడు. భారీ బడ్జెట్తో తెరకెక్కిన రుద్రమదేవి మంచి విజయం సాధించటంతో  మరింత ప్రతిష్టాత్మకంగా పౌరాణిక పాత్ర వీరాభిమన్యుడిని వెండితెర మీద ఆవిష్కరించడానికి ప్లాన్ చేస్తున్నాడు. ఇప్పటికే వీరాభిమన్యు అనే టైటిల్ను కూడా రిజిస్టర్ చేసిన గుణశేఖర్ త్వరలోనే ప్రీ ప్రొడక్షన్ పనులను ప్రారంభించనున్నాడు.

అయితే ఈ సినిమాలో అభిమన్యుడి పాత్రలో నటించే నటుడు ఎవరంటూ టాలీవుడ్లో రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. రుద్రమదేవి సినిమాలో గోన గన్నారెడ్డిగా అదరగొట్టిన అల్లు అర్జున్ అభిమన్యుడిగా నటించే ఛాన్స్ ఉందన్న టాక్ వినిపించింది. అయితే పౌరాణిక పాత్రలో నటించిన అనుభవం ఉన్న నటుడైతే బాగుంటుందని భావించిన గుణశేఖర్ జూనియర్ ఎన్టీఆర్ను వీరాభిమన్యుడిగా చూపించాలని భావిస్తున్నాడట.

రుద్రమదేవి సినిమాలో గోనగన్నారెడ్డి పాత్రకు కూడా ముందుగా ఎన్టీఆర్నే సంప్రదించాడు గుణశేఖర్. అప్పట్లో ఆ కాంబినేషన్ కుదరకపోవటంతో మరోసారి అదే ప్రయత్నాలో ఉన్నాడట. ఎన్టీఆర్ కుటుంబ నేపధ్యం కూడా ఈ తరహా సినిమాలకు ప్లస్ అవుతుందని భావిస్తున్నారట. అయితే ఇప్పటి వరకు  అధికారికంగా ప్రకటన చేయకపోయినా ఈ వార్తలతో నందమూరి అభిమానులు మాత్రం పండగ చేసుకుంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement