Rudhramadevi
-
అవార్డుల ఎంపికలో అన్యాయం జరిగింది
-
జీవిత విశ్వసనీయత కోల్పోయారు : గుణశేఖర్
నంది అవార్డుల వివాదం ప్రధానంగా నాలుగు సినిమాల చుట్టూనే తిరుగుతున్న విషయం తెలిసిందే. లెజెండ్, మనం, రేసుగుర్రం, రుద్రమదేవి సినిమాల పేర్లే ఈ వివాదంలో ప్రధానంగా వినిపిస్తున్నాయి. రుద్రమదేవి సినిమాకు అవార్డుల ఎంపికలో అన్యాయం జరిగిందని దర్శకుడు గుణశేఖర్ ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ఈ విషయంపై స్పదించిన జ్యూరీ సభ్యులు, తెలుగుదేశం పార్టీ నాయకులు రకరకాలుగా మాట్లాడటంపై గుణశేఖర్ మరోసారి స్పందించారు. మీడియాతో వివాదం గురించి మాట్లాడారు. ముఖ్యంగా రుద్రమదేవి సినిమాకు పన్ను రాయితీ రాకపోవడానికి గుణశేఖర్ సక్రమంగా ప్రయత్నించకపోవటమే కారణమన్న వాదనపై ఆయన వివరణ ఇచ్చారు. తాను నిబంధనల ప్రకారం సెన్సార్ కార్యక్రమాలు పూర్తి అయిన వెంటనే అక్టోబర్ 8న తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వాలకు పన్ను మినహాయింపు కోసం అప్లై చేశానన్నరు. అయితే తెలంగాణ ప్రభుత్వం వెంటనే స్పందించినా.. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం మాత్రం మూడు నెలల పాటు కాలయాపన చేసి, తరువాత తన ఫైల్ క్లోజ్ చేశారని తెలిపారు. ఈ విషయంపై మంత్రి అయ్యన్న పాత్రుడ్ని కలిస్తే ఆయన నేను అమరావతి వెళ్లాక మీ విషయం మాట్లాడతానని చెప్పి తరువాత ఫోన్ ఎత్తటం మానేశారన్నారు. మెసేజ్ లకు కూడా స్పందించకపోవటంతో, మరో మంత్రి గంటా శ్రీనివాసరావును సంప్రదించానని తెలిపారు. ఆయన గౌతమిపుత్ర శాతకర్ణి సినిమాకు పన్ను మినహాయింపు విషయమై ప్రత్యేక క్యాబినెట్ మీటింగ్ జరుగుతుంది, అక్కడ మీ విషయం ప్రస్తావిస్తానన్నారని కానీ తరువాత గంటా కూడా స్పందించలేదని.. ఇక ప్రయత్నించటం వృథా అని భావించి వదిలేశానని తెలిపారు. అదే సమయంలో అవార్డు కమిటీ నిర్ణయాలను ప్రశ్నిస్తే మూడేళ్ల పాటు వారిని అవార్డుల ఎంపిక నుంచి బహిష్కరిస్తామనే నిబంధన సరైంది కాదన్నారు. ప్రశ్నించే హక్కు అందరికీ ఉంటుందన్న గుణశేఖర్, ఈ నిబంధన కారణంగా చిన్న చిన్న సాంకేతిక నిపుణులు, నటీనటులు తమ ఆవేదనను బయటకు చెప్పుకోలేకపోతున్నారన్నారు. రుద్రమదేవి సినిమా విషయంలో 2015 నంది అవార్డుల జ్యూరీ చైర్మన్ జీవిత రాజశేఖర్ స్పందించిన తీరును కూడా ఆయన తప్పుబట్టారు. ముందు బాహుబలితో పోటి పడ్డప్పుడు రుద్రమదేవి వెనకపడిందన్న కమిటీ కనీసం రెండో సినిమాగా అయిన అవార్డు ఇవ్వాలి కదా అని భావించాను.. కానీ అవార్డులు సాధించిన ఏ సినిమాతోనూ రుద్రమదేవి పోటి పడలేకపోయిందని చెప్పటం బాధకలిగించిందన్నారు. అవార్డులు ప్రకటించిన తరువాత జీవిత రాజశేఖర్ చంద్రబాబు పాలన రాకింగ్ అంటూ కామెంట్ చేయటంతో ఆమె విశ్వసనీయతను కోల్పోయారన్నారు. జ్యూరీలో అంతా సినిమా వాల్లే ఉండటం కరెక్ట్ కాదని, అదే సమయంలో రాజకీయ లబ్ధి ఆశించే వారికి జ్యూరీలో స్థానం కల్పించటం వల్ల నష్టం జరుగుతుందన్నారు. కొంత మంది జాతీయ అవార్డులతో నంది అవార్డులను పోలుస్తున్నారని అది సరికాదని తెలిపారు. జాతీయ అవార్డుల గైడ్ లైన్స్ కు.. నంది అవార్డుల గైడ్ లైన్స్ కు చాలా తేడా ఉంటుందని మన అవార్డులను మన ప్రాంతీయత, సంస్కృతి ఆధారంగా నిర్ణయిస్తారని తెలిపారు. జాతీయ అవార్డుల్లో రుద్రమదేవికి ఉత్తమ ప్రాంతీయ చిత్రం అవార్డు రానందుకు బాధలేదని.. రుద్రమదేవి కన్నా కంచె సినిమాకు అవార్డు సాధించేందుకు అన్ని రకాలుగా అర్హత ఉందని అందుకే ఆ సినిమాను అవార్డు వరించిందని తెలిపారు. -
గుణశేఖర్ దర్శకత్వంలో 'హిరణ్యకశ్యప'
రుద్రమదేవి సినిమాతో ఘన విజయం సాధించిన సీనియర్ దర్శకుడు గుణశేఖర్... మరో ప్రయోగానికి రెడీ అవుతున్నాడు. రుద్రమదేవితో భారీ చారిత్రక కథకు తెర రూపం ఇచ్చిన గుణ, ఇప్పుడు ఓ పౌరాణిక కథాంశాన్ని తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నాడు. హిరణ్యకశ్యప పేరుతో ఓ భారీ చిత్రాన్ని రూపొందించే పనిలో ఉన్నాడు. ఈ సినిమాలో అందరికి తెలిసిన భక్త ప్రహ్లాదుడి కథనే హిరణ్య కశ్యపుడి యాంగిల్లో ప్రెజెంట్ చేయనున్నాడట. అందుకే ఈ సినిమాకు 'ద స్టోరి ఆఫ్ భక్త ప్రహ్లాద' అనే ట్యాగ్ లైన్‌ను యాడ్ చేశాడు. రుద్రమదేవి సినిమా తరువాత ప్రతాపరుద్రుడు అనే చారిత్రక చిత్రాన్ని రూపొందించనున్నట్టుగా ప్రకటించాడు. అయితే ప్రతాపరుద్రుడు కథకు మరింత రిసెర్చ్ చేయాల్సి ఉండటంతో ఆ సినిమాను వాయిదా వేసి హిరణ్యకశ్యపను తెర మీదకు తీసుకువచ్చాడు. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు ఊపందుకోగా.. మరో ప్రముఖ నిర్మాణ సంస్థతో కలిసి ఈ సినిమాను స్వయంగా నిర్మించనున్నట్టుగా ప్రకటించాడు గుణశేఖర్. అంతేకాదు ఈ సినిమాలో హిరణ్యకశ్యపుడి పాత్రలో తెలుగు, తమిళ భాషల్లో మంచి ఫాలోయింగ్ ఉన్న హీరో కనిపించనున్నాడట. త్వరలోనే నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను వెల్లడించనున్నట్లుగా తెలిపారు. -
ఆస్కార్ బరిలో రుద్రమదేవి
-
ఆస్కార్ బరిలో రుద్రమదేవి
గుణశేఖర్ దర్శకత్వంలో అనుష్క ప్రధాన పాత్రలో నటించిన భారీ చారిత్రక చిత్రం రుద్రమదేవి. ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ఈ సినిమా ఘనవిజయం సాధించటంతో పాటు తెలుగు సినిమా స్థాయిని పెంచింది. ఎన్నో రికార్డ్‌లతో పాటు అవార్డులు రివార్డులు సొంతం చేసుకున్న ఈ సినిమా ఇప్పుడు మరో అరుదైన ఘనత సాధించింది. రుద్రమదేవి సినిమాను బెస్ట్ ఫారిన్ లాంగ్వేజ్ ఫిలిం క్యాటగిరీలో ఆస్కార్‌కు పంపేందుకు ఫిలిం ఫెడరేషన్ ఆఫ్ ఇండియా రికమండ్ చేసింది. ఈ విషయాన్ని తన ట్విట్టర్ ద్వారా అభిమానులతో పంచుకున్నాడు దర్శకుడు గుణశేఖర్. బాహుబలి లాంటి భారీ చిత్రాన్ని పక్కన పెట్టి ఆస్కార్ బరిలో నిలవటంతో రుద్రమదేవి యూనిట్ ఎంతో సంతోషంగా ఉన్నారు. -
'ప్రతాప రుద్రుడు'గా ప్రభాస్..?
బాహుబలి సినిమా తరువాత ప్రభాస్ రేంజ్ భారీగా పెరిగిపోయింది. ముఖ్యంగా మార్కెట్ పరంగా ప్రభాస్ ఇప్పుడు టాలీవుడ్లోనే టాప్ హీరోగా ఎదిగాడు. అందుకే పెద్ద బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించే సినిమాలకు ప్రభాస్‌నే హీరోగా సెలెక్ట్ చేసుకుంటున్నారు దర్శకనిర్మాతలు. అదే బాటలో తన నెక్ట్స్ సినిమా కోసం ప్రభాస్‌ను సంప్రదిస్తున్నాడు దర్శకుడు గుణశేఖర్. రుద్రమదేవి సినిమాతో మంచి విజయం సాధించిన గుణశేఖర్, ఆ చిత్రానికి సీక్వల్గా చివరి కాకతీయ రాజు ప్రతాపరుద్రుడి జీవిత చరిత్రను తెరకెక్కించే ప్రయత్నం చేస్తున్నాడు. రుద్రమదేవి సినిమాతో రూ.50 కోట్లకు పైగా వసూళ్లు సాధించటంతో సీక్వెల్‌ను మరింత భారీగా తెరకెక్కించడానికి ప్లాన్ చేస్తున్నాడు. అందుకు తగ్గట్టుగానే భారీ క్రేజ్ ఉన్న స్టార్ అయితే సినిమాకు ప్లస్ అవుతుందని భావించి ప్రభాస్‌ను సంప్రదిస్తున్నాడట. ప్రస్తుతం బాహుబలి 2 షూటింగ్లో బిజీగా ఉన్న ప్రభాస్ ఈ ఏడాది చివరకు ఫ్రీ అవుతాడు. ఈ సినిమా తరువాత మిర్చి నిర్మాతలతో సుజిత్ దర్శకత్వంలో ఓ సినిమాను అంగీకరించాడు. ఈ రెండు సినిమాలు పూర్తయితే గాని ప్రభాస్ డేట్స్ దొరికే పరిస్థితి లేదు. మరి గుణశేఖర్ ప్రభాస్‌ను ప్రతాపరుద్రుడి పాత్రకు ఒప్పిస్తాడా..? లేక మరో హీరోతో మొదలెట్టేస్తాడా చూడాలి. -
గుణశేఖర్‌కు సహాయకులు కావాలట..!
రుద్రమదేవి సినిమాతో ఆకట్టుకున్న గుణశేఖర్, ఆ సినిమా రిలీజ్ తరువాత కనిపించడం మానేశాడు. ఈ చారిత్రక చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్‌తో రూపొందించిన గుణ, సినిమా రిలీజ్ తరువాత మీడియాకు దూరంగా ఉంటున్నారు. ముఖ్యంగా సినిమా ఎంత కలెక్ట్ చేసింది, ఆ తరువాత చేయబోయే ప్రాజెక్ట్స్ ఏంటి లాంటి విషయాలను కూడా ప్రకటించలేదు. గుణ ప్రకటించకపోయినా.. రుద్రమదేవి సినిమా చివర్లో ప్రకటించినట్టుగా ప్రతాపరుద్రుడు సినిమాను తెరకెక్కిస్తారన్న టాక్ వినిపించింది. ఆ తరువాత రుద్రమదేవి సక్సెస్‌కు కారణమైన గోన గన్నారెడ్డి పాత్రను పూర్తి స్థాయిలో తెరకెక్కిస్తాడన్న మరో వార్త టాలీవుడ్లో హల్చల్ చేసింది. అయితే గుణశేఖర్ మాత్రం ఏ విషయాన్ని ప్రకటించలేదు. ఇప్పుడు కూడా సినిమాకు సంబందించి ఎలాంటి ప్రకటన చేయని గుణ, అప్రెంటీస్‌లు, అసిస్టెంట్లు కావాలంటూ ప్రకటించాడు. తన తదుపరి చిత్రాల కోసం డైరెక్షన్ డిపార్ట్ మెంట్లో పని చేయడానికి అసిస్టెంట్లు కావాలంటూ తన ట్విట్టర్లో పోస్ట్ చేశాడు గుణ. త్వరలోనే గుణ తన కొత్త సినిమాకు సంబంధించిన పని మొదలెట్టే అవకాశం కనిపిస్తోంది. మరి ఆ సినిమా ఎలా ఉండబోతుందో తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే. gteamworks.contact@gmail.com pic.twitter.com/WlxhnwJvi8 — Gunasekhar (@Gunasekhar1) February 3, 2016 -
బుడ్డోడే 'వీరాభిమన్యు'..?
రుద్రమదేవి సినిమాతో మంచి జోష్‌లో ఉన్న దర్శకుడు గుణశేఖర్ ఈ సారి ఓ పౌరాణిక చిత్రానికి రెడీ అవుతున్నాడు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన రుద్రమదేవి మంచి విజయం సాధించటంతో మరింత ప్రతిష్టాత్మకంగా పౌరాణిక పాత్ర వీరాభిమన్యుడిని వెండితెర మీద ఆవిష్కరించడానికి ప్లాన్ చేస్తున్నాడు. ఇప్పటికే వీరాభిమన్యు అనే టైటిల్‌ను కూడా రిజిస్టర్ చేసిన గుణశేఖర్ త్వరలోనే ప్రీ ప్రొడక్షన్ పనులను ప్రారంభించనున్నాడు. అయితే ఈ సినిమాలో అభిమన్యుడి పాత్రలో నటించే నటుడు ఎవరంటూ టాలీవుడ్లో రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. రుద్రమదేవి సినిమాలో గోన గన్నారెడ్డిగా అదరగొట్టిన అల్లు అర్జున్ అభిమన్యుడిగా నటించే ఛాన్స్ ఉందన్న టాక్ వినిపించింది. అయితే పౌరాణిక పాత్రలో నటించిన అనుభవం ఉన్న నటుడైతే బాగుంటుందని భావించిన గుణశేఖర్ జూనియర్ ఎన్టీఆర్‌ను వీరాభిమన్యుడిగా చూపించాలని భావిస్తున్నాడట. రుద్రమదేవి సినిమాలో గోనగన్నారెడ్డి పాత్రకు కూడా ముందుగా ఎన్టీఆర్‌నే సంప్రదించాడు గుణశేఖర్. అప్పట్లో ఆ కాంబినేషన్ కుదరకపోవటంతో మరోసారి అదే ప్రయత్నాలో ఉన్నాడట. ఎన్టీఆర్ కుటుంబ నేపధ్యం కూడా ఈ తరహా సినిమాలకు ప్లస్ అవుతుందని భావిస్తున్నారట. అయితే ఇప్పటి వరకు అధికారికంగా ప్రకటన చేయకపోయినా ఈ వార్తలతో నందమూరి అభిమానులు మాత్రం పండగ చేసుకుంటున్నారు. -
బన్నీ జోడి మళ్లీ మారిపోయింది
సన్నాఫ్ సత్యామూర్తి సినిమా తరువాత కాస్త గ్యాప్ తీసుకున్న అల్లు అర్జున్ ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో 'సరైనోడు' పేరుతో యాక్షన్ ఎంటర్టైనర్లో నటిస్తున్నాడు. బోయపాటి కూడా లాంగ్ గ్యాప్ తరువాత చేస్తున్న సినిమా కావటంతో ఈ సినిమా సక్సెస్ ఇద్దరి కెరీర్లో కీలకం కానుంది. అందుకే ప్రతీ విషయంలోనూ చాలా జాగ్రత్తగా ఒకటికి రెండు సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా సినిమాలో వచ్చే ఓ స్పెషల్ సాంగ్ కోసం భారీ వేట కొనసాగిస్తున్నారు ఈ స్టార్స్. ముందుగా ఈ పాటను ఇలియానాతో చేయించాలని భావించారు. చాలా రోజులుగా టాలీవుడ్లో రీ ఎంట్రీ కోసం ఎదురుచూస్తున్న ఇలియానా బన్నీతో ఆడిపాడటానికి సై అంది. అయితే చివరి నిమిషంలో ఏం జరిగిందో ఏమోగాని ఇలియానాను పక్కన పెట్టేశారు. బన్నీతో ఉన్న స్నేహం కారణంగా ఈ సాంగ్ ఛాన్స్ నాదే అని భావించిన గోవా బ్యూటికి నిరాశే మిగిలింది. ఇలియానా తరువాత ఈ సాంగ్ కోసం సక్సెస్ఫుల్ హీరోయిన్ అనుష్కను సంప్రదించారు. అనుష్క లీడ్రోల్లో నటించిన రుద్రమదేవి సినిమాలో అల్లు అర్జున్ స్పెషల్ క్యారెక్టర్ చేయటంతో అందుకు కృతజ్ఞతగా అనుష్క కూడా స్పెషల్ సాంగ్ చేస్తుందని భావించారు. అయితే తాజ సమాచారం ప్రకారం సీన్ నుంచి అనుష్క కూడా పక్కకు వెళ్లినట్టుగా తెలుస్తోంది. సైజ్ జీరో సినిమా కోసం భారీగా బరువు పెరిగిన అనుష్క, బాహుబలి 2 కోసం బరువు తగ్గే పనిలో బిజీగా ఉంది. దీంతో సరైనోడు సాంగ్‌కు డేట్స్ అడ్జస్ట్ చేయలేక ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంది. ఫైనల్‌గా హోమ్లీ బ్యూటి అంజలిని ఈ సాంగ్ కోసం ఫైనల్ చేశారట. గతంలో సింగం 2 సినిమా కోసం ఐటమ్ సాంగ్‌లో ఆడిపాడిన అంజలి మరోసారి అదే పనికి రెడీ అవుతోంది. ఇటీవల రిలీజ్ అయిన శంకరాభరణం ట్రైలర్లో నెగెటివ్ లుక్‌లో అలరించిన అంజలి ఐటమ్ నంబర్‌తో కూడా ఆకట్టుకోవాలని చూస్తోంది. -
'రుద్రమదేవి' తరువాత 'వీరాభిమన్యు'
రుద్రమదేవి సినిమాతో భారీ రిస్క్ చేసిన దర్శకుడు గుణశేఖర్, అదే స్థాయిలో మంచి విజయాన్ని సాధించాడు. ఎన్నో కష్టనష్టాలను దాటి ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చిన దర్శకుడు వసూళ్ల పరంగాను మంచి రికార్డులనే నమోదు చేశాడు. ఇప్పుడు ఇదే జోష్ లో మరో సినిమాకు రెడీ అవుతున్నాడు. త్వరలోనే ఈసినిమాకు సంబందించిన అధికారిక ప్రకటన వచ్చే ఛాన్స్ కనిపిస్తోంది. రుద్రమదేవి సినిమా సమయంలోనే ఆ సినిమాకు సీక్వల్ తీసే ఆలోచన ఉందంటూ ప్రకటించాడు గుణశేఖర్. కాకతీయ సామ్రాజ్యాన్ని పరిపాలించిన ఆఖరి రాజు ప్రతాపరుద్రుడి జీవితాన్ని వెండితెర మీద ఆవిష్కరించాలని భావించాడు. అయితే ఇప్పుడు ఆ నిర్ణయాన్ని విమరమించుకొని మరో ప్రాజెక్ట్ కు రెడీ అవుతున్నాడన్న టాక్ వినిపిస్తోంది. చారిత్రక చిత్రంతో ఘనవిజయం సాధించిన గుణా టీం ఈ సారి పౌరాణిక గాథ మీద దృష్టిపెట్టింది. వీరాభిమన్యు పేరుతో మహాభారతంలోనే ఓ ఘట్టాన్ని సినిమాగా తెరకెక్కించే ఆలోచనలో ఉన్నాడట గుణశేఖర్. ఇప్పటికే అందుకు సంబందించి వీరాభిమన్యు అనే టైటిల్ ను ఫిలిం ఛాంబర్ లో రిజిస్టర్ చేయించాడు. ఇదే పేరుతో శోభన్ బాబు కథనాయకుడిగా 1965లో ఓ సినిమా రిలీజ్ అయ్యింది. అయితే ప్రస్థుతం సాంకేతిక ఎన్నో మార్పులు వచ్చాయి కాబట్టి భారీగా ఈసినిమాను తెరకెక్కించే అవకాశం ఉంది. మరి ఈ పౌరాణిక కథతో వీరాభిమన్యుడిగా ఎవరు నటిస్తారో చూడాలి. -
బ్రూస్ లీకి బన్నీ సపోర్ట్
కొద్ది రోజులుగా 'బ్రూస్ లీ' సినిమా విడుదల వాయిదా వేయాలంటూ వస్తున్న కథనాలపై అల్లు అర్జున్ స్పందించాడు. 'బ్రూస్ లీ' చిత్ర యూనిట్ తన రిలీజ్ డేట్ వాయిదా వేసుకోకపోవటంపై వారిని నిందించడం సరికాదన్నాడు బన్నీ. 'బ్రూస్ లీ టీం సినిమా మొదలైన సమయంలోనే విడుదల తేదీని ప్రకటించారు. ఆ సమయంలో రుద్రమదేవి సినిమా సెప్టెంబర్ 4న విడుదల అవుతుందని భావించారు. అనేక కారణాలతో రుద్రమదేవి వాయిదా పడుతూ అక్టోబర్ 9న విడుదలైంది. బ్రూస్ లీ 16న విడుదల అవుతుందన్న విషయం తెలిసే రుద్రమదేవి యూనిట్ తమ సినిమాను 9న రిలీజ్ చేశారు. పండగ సీజన్ కావటంతో రెండు సినిమాలకు స్కోప్ ఉంటుందన్న భావనతో ఈ నిర్ణయం తీసుకున్నారు' అని క్లారిటీ ఇచ్చాడు అల్లు అర్జున్. రుద్రమదేవి సినిమా తరువాత పెద్ద సినిమాలు విడుదల కావటం మంచి కాదని సోమవారం జరిగిన సక్సెస్ మీట్ లో సీనియర్ దర్శక నిర్మాత దాసరి నారాయణరావు కామెంట్ చేయగా, అదే రోజు అల్లు అర్జున్ ట్విట్టర్లో ఈ విషయంపై అభిమానులకు క్లారిటీ ఇచ్చాడు. My view about BRUCELEE release clash with RUDHRAMADEVI pic.twitter.com/qK2yjek3i2 — Allu Arjun (@alluarjun) October 12, 2015 -
రుద్రమదేవికి తప్పని దొంగ దెబ్బ
హైదరాబాద్: తెలుగు చిత్ర పరిశ్రమను పట్టి పీడిస్తున్న పైరసీ భూతం రుద్రమ దేవిని కూడా పట్టుకుంది. అహోరాత్రిళ్లు దర్శక నిర్మాతలు ఎంతో కష్టపడి, కోట్లకు కోట్టు ఖర్చు పెట్టి సినిమాలను రూపొందిస్తుంటే అక్రమార్కులు మాత్రం వారికి తీరని నష్టాలను మిగులుస్తున్నారు. తాజాగా గుణశేఖర్ దర్శకత్వంలో వచ్చిన 'రుద్రమదేవి' చిత్రం కూడా పైరసీ బారిన పడింది . ఈ కేసులో సీసీఎస్ పోలీసులు ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. వారి నుండి ఒక ల్యాప్ టాప్, కొంత నగదు, హార్డ్ డిస్క్ లు స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం. తెలుగులో విడుదలైన దాదాపు ప్రతి సినిమానూ ఈ పైరసీ పీడ చుట్టుకుంటోంది. చివరకు కోట్ల రూపాయల బిజినెస్ సాధించిన రాజమౌళి భారీ బడ్జెట్ సినిమా 'బాహుబలి'కి కూడా ఈ నష్టాలు తప్పలేదు. ఈ క్రమంలో సినిమా విడుదలైన రెండు రోజుల్లోనే రుద్రమదేవి సినిమా పైరసీ సీడీలు భారీగా మార్కెట్లోకి వచ్చినట్లు తెలుస్తోంది. ఇప్పటికే తెలుగు, హిందీలో విడుదలై మంచి టాక్ తెచ్చుకున్న ఈ త్రీడి సెన్సేషనల్ మూవీ రుద్రమదేవీ తమిళంలో శుక్రవారం విడుదల కానుంది. -
మూడురోజుల్లో రూ. 32 కోట్ల వసూళ్లు
చెన్నై: 'రుద్రమదేవి' సినిమా ప్రపంచ వ్యాప్తంగా మంచి వసూళ్లు రాబడుతోంది. విడుదలైన మూడు రోజుల్లోనే సుమారు రూ. 32 కోట్లు వసూలు చేసిందని సినీ ట్రేడ్ పండితుడు త్రినాధ్ వెల్లడించారు. ఇప్పటికే హిందీలోకి కూడా డబ్ అయిన ఈ హిస్టారికల్ మూవీ ఓవర్ సీస్లో మంచి ఓపెనింగ్స్ సాధించింది. మున్ముందు కలెక్షన్లు పెరుగుతాయని ట్రేడ్ పండితులు చెబుతున్నారు. ఓపెనింగ్ వీకెండ్లో తెలుగులో మంచి లాభాలను ఆర్జిస్తున్న 'రుద్రమదేవి'కి విదేశాల్లోకూడా ఆదరణ లభిస్తోందంటున్నారు. 3డిలో తెరకెక్కిన తొలి తెలుగు చారిత్రాత్మక చిత్రం కావడంతో అన్ని చోట్లా ముందుగానే టికెట్లు బుక్ కావడంతో తెలుగులో భారీ ఓపెనింగ్స్ సాధించిన చిత్రాల్లో ఒకటిగా 'రుద్రమదేవి' నిలిచింది. కాకతీయ సామ్రాజ్యం చరిత్ర ఆధారంగా రూపొందిన సినిమా 'రుద్రమదేవి'. ఈ చిత్రంలో రాణి రుద్రమగా అనుష్క లీడ్ రోల్లో నటించింది. గోన గన్నారెడ్డి పాత్రలో అల్లు అర్జున్, చాళుక్య వీరభద్రునిగా దగ్గుబాటి రానా, గణపతిదేవునిగా కృష్ణంరాజు, శివదేవయ్యగా ప్రకాష్‌రాజ్, హరిహరదేవునిగా సుమన్, మురారిదేవునిగా ఆదిత్య మీనన్ తదితరులు నటించారు. మ్యూజిక్ మాస్ట్రో ఇళయా రాజా సంగీతం అందించిన ఈ చిత్రం అక్టోబర్ 9న తెలుగు, హిందీ భాషల్లో ఒకేసారి భారీ ఎత్తున విడుదలైన సంగతి తెలిసిందే. ఈ త్రీడి సెన్సేషనల్ మూవీ తమిళంలో శుక్రవారం విడుదల కానుంది. -
తెర మీదే కాదు.. వెనకా హీరోనే!
రుద్రమదేవి సినిమా మీద, అందులో ప్రధాన పాత్రలు పోషించిన అల్లు అర్జున్, అనుష్కల మీద దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి ప్రశంసల వర్షం కురిపించారు. తెరమీద, తెర వెనక కూడా బన్నీ అసలైన హీరో అనిపించుకున్నాడంటూ మెచ్చుకున్నారు. ఈ విషయాలను ట్విట్టర్ ద్వారా అభిమానులందరికీ జక్కన్న షేర్ చేశారు. ఆయన ఏమన్నారంటే... ''ఎక్కడ చూసినా గోన గన్నారెడ్డే. సినిమా దాదాపు ఆగిపోతోంది అనిపించినప్పుడు బన్నీ ప్రవేశం ఒక్కసారిగా దాన్ని పునరుద్ధరించింది. తెలంగాణ ప్రభుత్వం ఈ సినిమాకు వినోదపన్ను మినహాయింపు ఇవ్వడానికి ప్రధాన కారణం బన్నీయేనని తెలిసింది. తెరమీద కూడా అద్భుతంగా చేశాడు. తెరమీద, తెర వెనక కూడా తానే హీరో అనిపించుకున్నాడు. అందుకు గోన గన్నారెడ్డిని గౌరవించి తీరాల్సిందే. ఇక స్వీటీ.. నీ నిబద్ధత, నిజాయితీలు చూస్తే.. సినీ పరిశ్రమకు నువ్వో వరం అనిపిస్తుంది. రుద్రమదేవి పాత్రను వేరే ఎవ్వరూ పోషించలేరు. వీరభద్ర, రుద్రమదేవి మధ్య మరింత స్క్రీన్ టైమ్ ఉంటే మరింత బాగుండేదేమో అనిపించింది. కానీ రానా తన ప్రెజెన్స్ సినిమాలో బాగా చూపించుకున్నాడు. చారిత్రక సినిమాలు తీయాలనుకునే దర్శకులకు అతడు అద్భుతంగా ఉపయోగపడతాడు. శివదేవయ్య మరిన్ని రాజకీయ క్రీడలు ఆడి ఉంటే బాగుండేది. అయితే, ప్రకాష్ రాజ్ తానేంటో చూపించుకోడానికి అది చాలు. గుణశేఖర్, ఆయన బృందం మొత్తానికి అభినందనలు. ఇంత పెద్ద సినిమాను ప్రయత్నించి, రూపొందించి, విడుదల చేసి, బ్రహ్మాండమైన విజయాన్ని అందుకున్నందుకు అభినందనలు.'' Gona Gannareddy all the way. When the film was almost stalled, bunny's entry into the cast revived it.Heard that it was again Bunny who was — rajamouli ss (@ssrajamouli) October 10, 2015 Instrumental in gettin the tax exemption.And he excelled on screen.A hero on screen and also off it.Respect Gannareddy.err..Gona Gannareddy — rajamouli ss (@ssrajamouli) October 10, 2015 Sweets, with your screen presence,dedication,commitment,sincerity u are a boon to the film industry.No one else could be rudramadevi..period — rajamouli ss (@ssrajamouli) October 10, 2015 Would Have loved more screen time for veerabhadra and rudramadevi. But Rana made his presence felt even with that. For any film maker who — rajamouli ss (@ssrajamouli) October 10, 2015 Wants to make a period film he is indispensable. Again would have loved more political game from sivadevayya, but guess that is enough for — rajamouli ss (@ssrajamouli) October 10, 2015 Prakashraj garu to excel. Congratulations to Gunasekhar garu and his team for attempting making releasing and garnering a huge success.. — rajamouli ss (@ssrajamouli) October 10, 2015 -
'రుద్రమదేవి'కి ప్రముఖుల అభినందనలు
రుద్రమదేవి సినిమాకు ప్రముఖుల నుంచి సపోర్ట్ అందుతోంది. గుణశేఖర్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తూ దర్శకత్వం వహించిన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా శుక్రవారం భారీగా రిలీజ్ అయింది. ఈ సందర్భంగా పలువురు టాలీవుడ్ ప్రముఖులు, చిత్రయూనిట్‌కు శుభాకాంక్షలు తెలియజేశారు. అనుష్కతో బాహుబలి సినిమాలో కలిసి నటిస్తున్న ప్రభాస్, గుణశేఖర్ తో పాటు రుద్రమదేవి టీం మొత్తానికి శుభాకాంక్షలు తెలియజేశాడు. ఈ సినిమాలో గోనగన్నారెడ్డిగా కీలక పాత్రలోనటించిన అల్లు అర్జున్ రుద్రమదేవి రిలీజ్‌పై తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు. ఈ సినిమాకు వినోదపన్ను మినహాయింపు ఇచ్చినందుకు గాను తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్‌కు కృతజ్ఞతలు తెలియజేశాడు. బాహుబలి లాంటి భారీ సినిమాను అందించిన దర్శకధీరుడు రాజమౌళి కూడా రుద్రమదేవి టీంను అభినందించాడు. ఎన్నో కష్టనష్టాలకోర్చి రుద్రమదేవి సినిమాను రిలీజ్ చేసిన గుణశేఖర్ మంచి విజయం సాధించాలని ఆకాంక్షించారు. తెలంగాణతో పాటు ఆంద్రప్రదేశ్‌లోనూ ఈ సినిమాకు వినోదపన్ను రాయితీ కల్పించాలని కోరారు. Gunasekhar's #Rudhramadevi releases tomorrow. Best wishes to the entire team!!! pic.twitter.com/cEzO533jdM — Baahubali (@BaahubaliMovie) October 8, 2015 I Thank the Hon.CM of Telangana State KCR garu for being Generous by exempting the Entertainment Tax for Rudramadevi Movie — Allu Arjun (@alluarjun) October 8, 2015 #Rudhramadevi Released ! After all the hardships the project went through I am personally happy the movie is Out ! — Allu Arjun (@alluarjun) October 9, 2015 Just heard that #Rudhramadevi has been made tax free in Telangana. Fantastic news for Gunasekhar garu who has been swimming against the — rajamouli ss (@ssrajamouli) October 8, 2015 current for such a long time to bring this epic to film. Rudramadevi is a queen for all Telugu land.I think even the govt of AP should and — rajamouli ss (@ssrajamouli) October 8, 2015 will exempt this film from tax. All the best to everyone involved in Rudramadevi.. — rajamouli ss (@ssrajamouli) October 8, 2015 -
'రుద్రమదేవి' మూవీ రివ్యూ
టైటిల్ : రుద్రమదేవి జానర్ ; హిస్టారికల్ యాక్షన్ డ్రామా తారాగణం ; అనుష్క, అల్లు అర్జున్, రానా, ప్రకాష్ రాజ్, కృష్ణంరాజు దర్శకత్వం ; గుణశేఖర్ సంగీతం ; ఇళయరాజా నిర్మాత ; గుణశేఖర్ ఎన్నో అవాంతరాల తరువాత దర్శకుడు గుణశేఖర్ డ్రీమ్ ప్రాజెక్ట్ రుద్రమదేవి ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కాకతీయ వీరనారి రుద్రమదేవి జీవితకథ ఆధారంగా భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన చిత్రం రుద్రమదేవి. దర్శకుడు గుణశేఖర్ 12 ఏళ్ల పాటు రిసెర్చ్ చేసి రూపొందించిన కథతో రూ. 80 కోట్లకు పైగా బడ్జెట్ తో తొలి భారతీయ స్టీరియో స్కోపిక్ త్రీడి చిత్రంగా తెరకెక్కిన రుద్రమదేవి ఆడియన్స్ ను ఏ మేరకు ఆకట్టుకుందో రివ్యూలో చూద్దాం. కథ ; చరిత్ర పరంగా రుద్రమదేవి కథలో ఎన్నో ఊహాగానాలు, కల్పిత కథలు ప్రచారంలో ఉన్నాయి. అయితే ఈ అపోహలన్నింటికీ రుద్రమదేవి సినిమాతో సమాధానం చెప్పే ప్రయత్నం చేశాడు గుణశేఖర్. 13 శతాబ్దంలో కాకతీయ సామ్రాజ్యాన్ని పరిపాలిస్తున్న రాజు గణపతిదేవుడు( కృష్ణంరాజు). ఆయనకు కుమార్తె మాత్రమే ఏకైక సంతానం కావటంతో, తన తరువాత సింహాసనాన్ని అధీష్టించడానికి వారసులు లేరన్న భావనతో కుమార్తె రుద్రమదేవినే... కుమారుడు రుద్రదేవగా కాకతీయ ప్రజలకు పరిచయం చేస్తాడు. అందుకు తగ్గట్టుగానే మహామంత్రి శివదేవయ్య( ప్రకాష్‌రాజ్) రుద్రమదేవికి అన్ని విద్యలలోనూ శిక్షణ ఇస్తాడు. గణపతిదేవుని మరణం తరువాత కొంత కాలనికి కాకతీయ సామ్రాజ్యపు వారసుడు రాజు కాదు రాణి, రుద్రదేవ కాదు, రుద్రమదేవి (అనుష్క) అని ప్రకటిస్తాడు మంత్రి శివదేవయ్య. ఈ విషయాన్ని సామంతులు జీర్ణించుకోలేకపోతారు. ఓ మహిళ దగ్గర సామంతులుగా ఉండటానికి అంగీకరించరు. దీంతో రుద్రమదేవి రాజ్యం విడిచి వెళ్లాల్సి వస్తుంది. అదే సమయంలో మహదేవ ( విక్రమ్‌జిత్) కాకతీయ సామ్రాజ్యాన్ని చేజిక్కించుకోవాలని కుట్రలు పన్నుతాడు. పాలన సరిగా లేకపోవటంతో ప్రజా హక్కుల కోసం పోరాడే గోన గన్నారెడ్డి (అల్లుఅర్జున్) కాకతీయ సామ్రాజ్యంపై ఎదురుతిరుగుతాడు. రాజ్యంలో అనిశ్చితి నెలకొనటంతో ఎలాగైన రాజ్య పరిస్థితి చక్కదిద్దాలని, తిరిగి సింహాసనాన్ని అధిష్టించాలని రుద్రమదేవి ప్రయత్నాలు ప్రారంభిస్తుంది. అందుకు సాయం చేయాల్సిందిగా తనకు అత్యంత సన్నిహితుడైన నిడదవోలు రాజు చాళుక్య వీరభద్రుడి(రానా) సాయం కోరుతుంది. రాజ్య పరిస్థితి చూసిన గోన గన్నారెడ్డి కూడా వీరికి సాయం చేయడానికి అంగీకరిస్తాడు. ఈ ఇద్దరి సాయంతో రుద్రమదేవి కాకతీయ సామ్రాజ్యాన్ని కాపాడుకునేందుకు ఎలాంటి ప్రయత్నాలు చేసింది.? ఆ క్రమంలో ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నది అన్నదే సినిమా కథ. విశ్లేషణ : మెగాస్టార్ చిరంజీవి వాయిస్ ఓవర్‌తో కాకతీయ సామ్రాజ్యపు గొప్పతనాన్ని వివరిస్తూ సినిమా ప్రారంభమవుతుంది. సినిమాలో ప్రతీ పాత్రను అద్భుతంగా ప్రజెంట్ చేయటంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు. ముఖ్యంగా రుద్రదేవగా, రుద్రమదేవిగా రెండు షేడ్స్ చాలా బాగా బ్యాలెన్స్ చేశారు. ఇక అల్లు అర్జున్ ఇంట్రడక్షన్ నుంచి గెటప్, డైలాగ్స్ ఇలా అన్నింటిలోనూ చాలా కేర్ తీసుకున్న విషయం స్పష్టంగా అర్థమవుతుంది. సినిమాకు మెయిన్ ఎసెట్ గా భావిస్తున్న గోన గన్నారెడ్డి పాత్రను ఆశించిన స్ధాయిలో ప్రజెంట్ చేశారు. రుద్రమకు సాయం చేసే పాత్రలో చాళుక్య వీరభద్రుడిగా రానా మరోసారి మెప్పించాడు. భళ్ళాలదేవ తరువాత మరో చారిత్రక పాత్రలో కనిపించిన రానా ... తాను ఎలాంటి పాత్రనైన పోషించగలనని మరోసారి ప్రూవ్ చేశాడు. అయితే చాలా పెద్ద కథ కావటంతో అన్ని పాత్రలకు సరైన క్లారిటీ ఇవ్వటంతో మాత్రం దర్శకుడు విఫలమైనట్టుగా అనిపిస్తుంది. ఆడియో పరంగా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది రుద్రమదేవి, కథలో ఎక్కడ పాటలకు అవకాశం లేకపోయినా కమర్షియల్ ఎలిమెంట్స్ కోసం అన్నట్టుగా పాటలు రావటం స్టోరి నారేషన్కు కాస్త ఇబ్బంది కలిగిస్తుంది. ఇంటర్వెల్ వరకు కథ మీద మంచి పట్టు చూపించిన దర్శకుడు తరువాత మాత్రం అనుకున్న స్థాయిలో నడిపించలేకపోయాడు. చాలా సన్నివేశాలు లెంగ్తీగా అనిపిస్తాయి. నటీనటులు : రుద్రమదేవిగా చారిత్రక పాత్రలో అనుష్క చక్కగా ఒదిగిపోయింది. ముఖ్యంగా రుద్రదేవ, రుద్రమదేవిగా రెండు షేడ్స్‌ను ఆమె తన నటనతో మెప్పించింది. ఇక పోరాట సన్నివేశాల్లో యాక్షన్ స్టార్స్‌కు ఏ మాత్రం తీసిపోని విధంగా అలరించింది. అనుష్క లుక్ విషయంలో కూడా చాలా కేర్ తీసుకున్నారు. బాడీ లాంగ్వేజ్‌తో పాటు దుస్తులు, నగలు కూడా చాలా బాగా సెట్ అయ్యాయి. గోన గన్నారెడ్డి పాత్రలో అల్లు అర్జున్ ఆకట్టుకున్నాడు. గంభీరమైన లుక్ తో, డిఫరెంట్ డైలాగ్ డెలివరీతో అలరించాడు. మాస్లో మంచి ఫాలోయింగ్ ఉన్న బన్నీకి ఈ క్యారెక్టర్ మంచి ప్లస్ అవుతుందనే చెప్పాలి. రానా పాత్రకు పెద్దగా ఇంపార్టెన్స్ లేకపోయినా ఉన్నంతలో బాగానే మెప్పించాడు. సినిమా అంత రుద్రమకు సపోర్ట్ చేసే పాత్రలో ఆకట్టుకున్నాడు. ఇక కృష్ణంరాజు, ప్రకాష్రాజులు తమ పరిథి మేరకు అలరించారు. విలన్‌గా విక్రమ్‌జిత్ పరవాలేదనిపించాడు. సాంకేతిక నిపుణులు : ఓ భారీ చారిత్రక కథాంశాన్ని వెండితెర మీద చూపించాలన్న గుణశేఖర్ కల నెరవేరిందనే చెప్పాలి. సెట్, గ్రాఫిక్స్ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా తెరకెక్కించిన రుద్రమదేవి ప్రేక్షకులను 13వ శతాబ్దంలోకి తీసుకెళుతుంది. పాటలు పెద్దగా ఆకట్టుకోలేకపోయినా నేపథ్య సంగీతంతో సినిమాకు ప్రాణం పోశారు మ్యాస్ట్రో ఇళయరాజా. శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ విషయంలో ఇంకాస్త జాగ్రత్తగా ఉండి ఉంటే బాగుండేది. ముఖ్యంగా సెకండాఫ్‌లో వచ్చే చాలా సన్నివేశాలు లెంగ్తీగా ఉన్నాయి. ఈ సినిమా కోసం టెక్నికల్ టీమ్ పడిన కష్టం ప్రతీ ఫ్రేములోనూ కనిపిస్తుంది. తోట తరణి ఆర్ట్ వర్క్, జయనన్ విన్సెంట్ సినిమాటోగ్రఫి అద్భుతంగా వచ్చాయి. నీతాలుల్లా కాస్ట్యూమ్స్ కాకతీయ సామ్రాజ్యపు పరిస్థితులను కళ్లకు కట్టినట్టుగా చూపించాయి. రుద్రమదేవి సినిమా విషయంలో దర్శకుడి గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి. దాదాపు 12 ఏళ్ల పాటు శ్రమించి తయారు చేసుకున్న కథతో ఎన్నో వ్యయ ప్రయాసలకు ఓర్చి ఈ సినిమాను తెరకెక్కించాడు గుణశేఖర్. అయితే అందరికి తెలిసిన కథను మరింత ఇంట్రస్టింగ్‌గా చెప్పడంలో కాస్త తడబడ్డాడు. అయితే క్లైమాక్స్‌లో వచ్చే వార్ ఎపిసోడ్స్‌తో అన్ని మరచిపోయేలా చేయగలిగాడు గుణ. యుద్ధ సన్నివేశాలు ఇంకాసేపు ఉంటే బాగుండనిపించింది. ప్లస్ పాయింట్స్ : అనుష్క, అల్లు అర్జున్ నటన విజువల్ ఎఫెక్ట్స్ సెట్టింగ్స్ స్టోరీ మైనస్ పాయింట్స్ : లెంగ్తీ సీన్స్ ఎడిటింగ్ పాటలు ఓవరాల్‌గా రుద్రమదేవి కాకతీయ చరిత్రను నేటి తరానికి పరిచయం చేసే మంచి ప్రయత్నం. -
'రుద్రమదేవి'కి పన్ను మినహాయింపు
-
'రుద్రమదేవి'కి పన్ను మినహాయింపు
ఎన్నో వాయిదాల తరువాత అక్టోబర్ 9న రిలీజ్‌కు రెడీ అవుతన్న ప్రతిష్టాత్మక చిత్రం 'రుద్రమదేవి'కి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా సాయం అందుతోంది. ఓరుగల్లు వీరనారి రుద్రమదేవి కథగా తెరకెక్కిన ఈ సినిమాకు పన్ను మినహాయింపు ఇస్తున్నట్లుగా తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రకటించారు. చిత్ర దర్శకనిర్మాత గుణశేఖర్ తో పాటు, నిర్మాత దిల్ రాజు గురువారం కేసీఆర్ ను కలిసిన నేపథ్యంలో ఈ మేరకు హామి ఇచ్చారు. గుణశేఖర్, రుద్రమదేవి సినిమా చూడాల్సిందిగా కేసీఆర్ ను ఆహ్వానించారు. కేసీఆర్ కూడా సానుకూలంగా స్పందిస్తూ తెలంగాణ చరిత్ర, సంస్కృతిని ప్రతిబింబించే చిత్రాలకు రాష్ట్ర ప్రభుత్వ ప్రోత్సాహం ఎప్పుడూ ఉంటుందన్నారు. రుద్రమదేవిగా అనుష్క నటిస్తున్న ఈ సినిమాలో అల్లు అర్జున్, రానా, ప్రకాష్ రాజ్‌లు ఇతర కీలక పాత్రల్లో నటించారు. తన సొంత నిర్మాణ సంస్థ గుణ టీం వర్క్స్ బ్యానర్ పై గుణశేఖర్ స్వయంగా ఈ సినిమాను నిర్మిస్తూ దర్శకత్వం వహించారు. -
తమిళంలో 16న రుద్రమదేవి రిలీజ్..?
గుణశేఖర్ కష్టాలు ఇప్పట్లో తీరేలా కనిపించటం లేదు. పెద్ద సినిమాలు పోటిలో ఉన్నా బరిలో దిగేందుకు సిద్దమంటూ రిలీజ్‌కు రెడీ అవుతున్న రుద్రమదేవికి టాలీవుడ్లో లైన్ క్లియర్ అయినా కోలీవుడ్‌లో మాత్రం ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ సినిమా తమిళ వర్షన్ ను ఒక వారం ఆలస్యంగా రిలీజ్ చేయాలని భావిస్తున్నారట కోలీవుడ్ నిర్మాతలు. పులి సినిమా టాక్ పరంగా ఆకట్టుకోలేకపోయినా, కలెక్షన్ల పరంగా మాత్రం మంచి ఫాంలో ఉంది. దీంతో వెంటనే రుద్రమదేవి రిలీజ్ అయితే రెండు సినిమాల వసూళ్ల మీద ప్రభావం పడుతుందన్న ఆలోచనతో ఈ సినిమా రిలీజ్ ను ఒక వారం వాయిదా వేయాలని భావిస్తున్నారట. పులి సినిమాను తమిళనాట రిలీజ్ చేసిన తెనండల్ ఫిలింస్ రుద్రమదేవి సినిమాను కూడా రిలీజ్ చేస్తోంది. దీంతో అక్టోబర్ 16న రుద్రమదేవి తమిళ వర్షన్ రిలీజ్ అయ్యేలా ప్లాన్ చేస్తున్నారు. అనుష్క ప్రధాన పాత్రలో గుణశేఖర్ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఈ హిస్టారికల్ త్రీడి స్టీరియో స్కోపిక్ సినిమా అక్టోబర్ 9న తెలుగు, హిందీ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతోంది. అయితే తమిళ వర్షన్‌ను కూడా అదే రోజు రిలీజ్ చేయాలని భావించినా ఆ అవకాశం కనిపించటం లేదు. -
నాకు నేను... ‘సో క్యూట్’ అనుకున్నా!
అనుష్క... తెర మీద సూపర్‌స్టార్. తెర వెనుక ముద్దుగా... ‘స్వీటీ’. మాట తీరులో, మనిషి నడతలో ఎక్కడా సగటు సినిమా స్టార్ల తాలూకు హిపోక్రసీ లేని అసలు సిసలు స్వీటీ. అక్టోబర్ 9 నుంచి ప్రపంచ వ్యాప్తంగా తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో 3డీలో అలరించనున్న అభినవ ‘రుద్రమదేవి’. ఆ చిత్ర ప్రమోషన్‌కి చెన్నై, బొంబాయిల మధ్య టూర్స్‌తో ఆమె బిజీ బిజీ. ఆ క్రమంలో హఠాత్తుగా జూబ్లీహిల్స్ ‘యునెటైడ్ కిచెన్స ఆఫ్ ఇండియా’లో తారసపడ్డారు. అందమంటే, మానసిక - శారీరక ఆరోగ్యాలు రెండూ అనే ఈ మాజీ యోగా టీచర్ అచ్చమైన గోలీ సోడాను ఆస్వాదిస్తూ మామూలు మధ్యతరగతి అమ్మాయిలా కనిపించారు. ‘సైజ్ జీరో’ కోసం పెరిగిన బరువును ఇప్పుడు తగ్గించుకొనే పనిలో ఉన్నా, చిన్నప్పటి గోలీ సోడా ఆనందాన్ని వదులుకోవడానికి ఇష్టం లేక, ఆరెంజ్ రంగు గోలీసోడా రెండోది లాగిస్తూ, రీల్ లైఫ్ ‘రుద్రమదేవి’ నుంచి తన రియల్ లైఫ్ ఫిలాసఫీ దాకా అనేక విషయాలు మనసు విప్పి పంచుకున్న ఈ బెంగళూరు భామతో ‘సాక్షి’ ప్రత్యేక భేటీ... ‘బాహుబలి, రుద్రమదేవి, సైజ్ జీరో’ - వరుసగా మూడు విలక్షణప్రాజెక్ట్లు చేస్తున్న హీరోయిన్ మీరే! (నవ్వుతూ...) థ్యాంక్స్. ఒకేసారి ఇలాంటి మంచి స్క్రిప్ట్స్ రావడం నా అదృష్టం. మేకర్స్ గుణశేఖర్, రాజమౌళితో ఒకేసారి వర్క చేయడం...? ఇద్దరూ ఇద్దరే! ఇద్దరివీ వేర్వేరు స్కూల్స్. కానీ, ఇద్దరికీ పని మీదే ఏకాగ్రదృష్టి. సక్సెస్ రేట్‌తో సంబంధం లేకుండా ఇద్దరూ చాలా మంచి టెక్నీషియన్స్. ఒకేసారి ఇద్దరితో కలసి పనిచేయడం బాగుంది. ముందుగా ఏ సినిమా ఆఫర్ వచ్చింది? సరిగ్గా గుర్తులేదు. ‘రుద్రమదేవి’ అనుకుంటా. దాదాపు అప్పుడే ‘బాహుబలి’ ఆఫర్. రెండూ ఒప్పుకున్నా. ఒక పాత్రలో నుంచి మరో పాత్రలోకి మారడం కష్టమనిపించలేదా? బేసిక్‌గా అయామ్ ఎ డెరైక్టర్స్ యాక్టర్. వాళ్ళు చెప్పింది అర్థం చేసుకొని చేస్తుంటాను. సెట్స్‌కు వెళ్ళగానే ఐ విల్ స్విచ్చాన్ విత్ డెరైక్టర్. స్విచ్చాఫ్ విత్ డెరైక్టర్. నిజానికి, ఇప్పటికీ నేను నటన నేర్చుకొంటున్నా. నిజంగానే అంటున్నారా? పదేళ్ళు అయిపోయిందిగా? నిజమే. నాగార్జున ‘సూపర్’తో నటిగా నా జర్నీ మొదలుపెట్టి, ఇప్పటికి పదేళ్ళయింది. ‘సూపర్’ నాటికి అసలు నటనంటే ఏమిటని కూడా తెలీదు. నాగ్, పూరీ జగన్నాథ్ చాలా ప్రోత్సహించారు. మేకప్, డ్యాన్స్, యాక్టింగ్ - ఇలా అన్నీ పూరీ దగ్గరుండి చూసుకున్నారు. అప్పటి నుంచి ఒక్కో సినిమాకు, ఒక్కో డెరైక్టర్ దగ్గర నుంచి నేర్చుకుంటూనే ఉన్నా. తొలి రోజుల్లో ఈ రంగం వదిలిపోదామనుకొని, చివరకింత స్టారయ్యారే! (ఆలోచనలోకెళుతూ...) మొదట ఏడాదిన్నర పాటు అయితే, వెళ్ళిపోవాలనే అనుకున్నా. తరువాత కుదురుకున్నా. ఇప్పటికీ నాకు స్టిల్ కెమేరాలంటే కూడా అయామ్ వెరీ షై. ఇప్పుడిప్పుడే ఆ సిగ్గు వదిలించుకోగలుగుతున్నా. ఈ పదేళ్ళ సినీ అనుభవంతో నటిగానే కాదు, వ్యక్తిగానూ ఎదిగా. ఈ రంగాన్ని వదిలేసి, పారిపోయి ఉంటే చాలా బాధపడి ఉండేదాన్ని. ఈ ప్రయాణంలో వ్యక్తిగా మీలో వచ్చిన మార్పు, పరిణతి ఏమిటి? చుట్టూ ఉన్న మనుషులు ఎలాంటి వారో అర్థమవుతుంటుంది. ఎంత ఎదిగినా, కాళ్ళు నేల మీదే ఉండాలనే భావన మరీ దృఢమైంది. నాతో నేను దగ్గరగా ఉంటున్నా. నా స్నేహితులు, నా యోగా గురువు భరత్ ఠాకూర్ లాంటి నా వాళ్ళకు దగ్గరయ్యా. ఇక్కడకు వచ్చాక మీరు మార్చుకున్న గుణం? నాకో చెడ్డ అలవాటుండేది. ఫోన్ సెలైంట్ మోడ్‌లో ఉంచేదాన్ని. ఫోన్‌కాల్స్ వచ్చినా, తీసి మాట్లాడేదాన్ని కాదు. ఏదో పని చూసుకొంటూ ఉండేదాన్ని. దాని వల్ల నాకు ఏమైందో, ఏమిటోనని అవతలివాళ్ళు కంగారుపడేవాళ్ళు. ఆ అలవాటు మార్చుకున్నా. ఫోన్లు కూడా తీయనంటున్నారు. ఎమోషనల్‌గా మీరు ఎవరి మీదా ఆధారపడరేమో? అదేమీ లేదు. ఎమోషనల్‌గా ఇతరుల మీద చాలా ఆధారపడుతుంటా. చెన్నైలో నా మేకప్ ఉమన్ భాను, అక్కడి ఫ్రెండ్స్, నా యోగా ఫ్రెండ్స్ - ఇలా పెద్ద లిస్టే ఉంది. మీకు మీరు నచ్చని సందర్భాలు ఉంటాయా? అయామ్ నాట్ వెరీగుడ్ ఎట్ స్ట్రెస్ మేనేజ్మెంట్ అనిపిస్తుంటుంది. మా కుటుంబ సభ్యులు, ఫ్రెండ్స్‌కు నా గురించి అన్నీ తెలుసు. వాళ్ళతో అన్నీ పంచుకుంటా. వాళ్ళందరూ తమ కష్టాలు నాతో చెప్పుకుంటారు. వాళ్ళ ఒత్తిడి నాకూ ఉంటుంది. ఒకప్పుడు యోగా టీచరైన మీకు మానసిక ఒత్తిడా? నేనూ మనిషినేగా! ఒత్తిడి ఉంటుంది. అయితే, విందులు, వినోదాలు, పార్టీలకు వెళ్ళను. ఇంట్లోనే ఉంటా. నా యోగా ఫ్రెండ్స్ దుబాయ్, మలేసియా - ఇలా రకరకాల చోట్ల ఉన్నారు. టైమ్ దొరికితే, వాళ్ళను కలుస్తా. ‘రుద్రమదేవి’ లాంటి పాత్రలకు చాలా శారీరక శ్రమ చేస్తారు. షూటింగ్ నుంచి ఇంటికొచ్చాక ఎలా ఉంటుంది? శారీరక శ్రమ వల్ల ఒంటి నిండా నొప్పులు, గాయాలే. షూటింగై ఇంటికి వచ్చాక, అలసటతో పాటు, వెర్రెత్తిపోయుంటాం. అలాంటప్పుడు నా సహాయకులతో ‘మీరు నన్ను సరిగ్గా చూసుకోవడం లేద’ని కాస్తంత మారాం చేస్తా. అలుగుతా. అలాంటప్పుడు వాళ్ళు గారం చేసి, బుజ్జగించాలనుకుంటా. ఇంట్లో ప్రతి ఒక్కరి అటెన్షన్ నా మీదే ఉండాలని పిచ్చిగా కోరుకుంటా. ఇప్పటికీ బెంగళూరులో మా ఇంటికి వెళితే, అన్నయ్య రూమ్‌లో హాయిగా పడుకుంటా. కొన్నిసార్లు ఎవరితోనూ పెద్దగా మాట్లాడను కూడా మాట్లాడను. అయితే, నా చుట్టూ మనుషులుండాలి. వాళ్ళు మాట్లాడుకుంటూ ఉండాలి. అలా ఉంటే నా కిష్టం. చాలామందిలా మీ అమ్మ, నాన్న మీ వెంట కనిపించరే! వాళ్ళ జీవితం వదిలేసి, రాత్రింబగళ్ళు నా వెంటే సెట్స్‌లో ఉండి టైమ్ వేస్ట్ చేసుకోవడమెందుకు? పైగా, వాళ్ళుంటే వాళ్ళ బాగోగుల మీదే నా ఫోకస్ ఉంటుందని సినిమా ఫంక్షన్లకు కూడా రానివ్వను. చూడాలనిపిస్తే వాళ్ళు రావడమో, నేను వెళ్ళడమో చేస్తాం. వరంగల్‌లో వేలమంది మధ్య ‘రుద్రమ..’ ఆడియోకు తొలిసారి వచ్చినట్లున్నారు! అది ఏదో అనుకొని కావాలని చేసింది కాదు. గుణశేఖర్ భార్య రాగిణి గారితో సాన్నిహిత్యంతో అలా కుదిరింది. గుణశేఖర్ గారు ఎంతో ఎమోషనల్‌గా మాట్లాడిన ఆ ఆడియో ఫంక్షన్లో వేలాది జనం మధ్య మా అమ్మా నాన్న గురించి నేను కొంచెం ఆందోళన పడ్డాను. కానీ, వాళ్ళు మాత్రం ‘రుద్రమదేవి’ పాత్ర నేను పోషించినందుకు చాలా సంతోషించారు. వాళ్ళు కూడా ఈ సినిమా చూడాలని ఎదురుచూస్తున్నారు. తొలిసారిగా రుద్రమదేవి గెటప్‌లో అద్దంలో చూసుకున్నప్పుడూ, ట్రైలర్ ఆవిష్కరణలో ‘ఐమ్యాక్స్’ తెరపై చూసుకున్నప్పుడూ మీ మనసులో కలిగిన భావం? షూటింగ్లో 3 - 4 కేజీల బంగారు నగలు వేసుకున్నా. బరువైన కాస్ట్యూమ్స్ కూడా ధరించా. అద్దంలో చూసుకున్నప్పుడు నాకు నేను ‘సో క్యూట్’ అనుకున్నా. ఇక, అంత మంది ముందు, ఐమ్యాక్స్ తెరపై చూసుకొనే ముందు కొద్దిగా టెన్షన్ ఫీలయ్యా. అలాంటి చోట్ల ఎలా రియాక్ట్ కావాలో నాకు తెలీదు. అందుకే, నా పక్కనే కూర్చొన్న నా సన్నిహితుల బుర్ర తినేస్తుంటా. అందరూ బాగుందనడంతో టెన్షన్ తీరింది. మీరు దేవుణ్ణి నమ్ముతారా? కచ్చితంగా. బేసిక్‌గా నేను గాడ్ లవింగ్ తప్ప గాడ్ ఫియరింగ్ కాదు. గుడి, దర్గా, చర్చి - అన్నిటికీ వెళతా. దేవుళ్ళందరిలోకీ నాకు శివుడంటే ఇష్టం. అలాగే, షిర్డీ సాయి, దుర్గాదేవి అంటే కూడా ఇష్టం. అయితే, పూజలు, వ్రతాలు లాంటివి అలవాటు లేదు. అవి చేయను, తెలియదు కూడా! నాకు అనిపించినట్లు చేస్తానే తప్ప, ఫలానాగా చేయాలని ఎవరైనా చెప్పడం నాకు ఇష్టం ఉండదు. ఎవరైనా ఫలానా లాగా చేయాలని బలవంతపెడితే, నాలో ప్రతిఘటన మొదలైపోతుంది. కానీ, నేను బేసిక్‌గా ప్రకృతిని ఆరాధిస్తా. ఉదయం, సాయంత్రం తప్పకుండా ఇంట్లో దీపారాధన చేస్తా. అలాగే, నీళ్ళు, పువ్వులు పెడతా. ఇలా గాలి, నీరు, నిప్పు లాంటి పంచభూతాలు మనసుకు ఆహ్లాదమిస్తాయి. డిఫరెంట్, సీరియస్ పాత్రల్లో ఇమిడిపోయారు. మళ్ళీ గ్లామర్ హీరోయిన్గా ఎప్పుడు? (నవ్వేస్తూ) నాకూ ఇప్పుడలాంటి పాత్ర చేయాలని ఉంది. సీరియస్, గ్లామర్ పాత్రలు - రెండింటి మధ్య బ్యాలెన్స్ చేసుకోవడం నాకిష్టం. వేర్వేరు తరహా చిత్రాలు, పాత్రలు చేయాల నుంది. కానీ ముందుగా ప్లాన్ చేసుకోను. ఎందుకంటే, అది నాకు సూట్ కాదు. దానంతట అది జరగాలంతే! అంటే, మీరు విధి మీద వదిలేస్తారన్న మాట! విధిని నమ్ముతాను, కానీ డెస్టినీకి వదిలేయకూడదు. మన బెస్ట్ ఇవ్వాలి. చివరకేం జరిగితే అది డెస్టినీ. ‘సైజ్‌జీరో’ను కూడా పోటీగా ఈ 9వ తేదీనే రిలీజ్ చేయాలని ఆ మధ్య కొందరు ఆలోచన చేసినట్లున్నారే? లేదు. ఎప్పుడూ రెండూ ఒకేరోజు రిలీజ్ అనుకో లేదు. ఒకవేళ ఒక సినిమా రిలీజ్ కాకపోతే, రెండోదనే అనుకున్నారు. ‘సైజ్‌జీరో’ను లేట్‌గా రిలీజ్ చేస్తారు. మరి సినిమాల రిలీజ్ ముందురోజు ఎలా ఉంటారు? నేను నటించిన ఏ సినిమాకూ ఎవరికీ నష్టం రాకూడదనుకుంటా. రిలీజ్ ముందు రోజు చాలా నెర్వస్‌గా ఉంటుంది. ఎలా రియాక్టవాలో తెలీదు. స్ట్రెస్ భరించలేక అమ్మానాన్న, ఫ్రెండ్స్‌తో కూర్చొని రాత్రి మాట్లాడుతూంటా. రిలీజయ్యాక జనం మధ్య సినిమా చూస్తా. లేడీ ఓరియంటెడ్ ‘రుద్రమదేవి’కి రూ. 70 కోట్ల బడ్జెటని మన హీరోలు ఉడుక్కోరూ? అలా ఏమీ లేదు. రానా, ప్రభాస్, అల్లు అర్జున్ అంతా ఎంకరేజ్ చేశారు. రుద్రమదేవి, దేవసేన లాంటి పాత్రల్లో మీరు కాకుంటే, మరెవరిని మీరు ఊహిస్తారు? నన్ను ఇలాంటి సినిమాల్లో, పాత్రల్లో ఊహించుకొని, ‘అరుంధతి’ ఛాన్స్ ఇచ్చిన నిర్మాత శ్యామ్‌ప్రసాద్‌రెడ్డి గారికి థ్యాంక్స్. ఆయన లేకపోతే ఇవాళ నాకీ పాత్రలు లేవు. ఇప్పటి హీరోయిన్స్‌లో ఇలాంటి రాజసిక పాత్రలకు నయనతార ఫేస్ సూట్ అవుతుంది. ‘రుద్రమదేవి’ సినిమా, పాత్ర... ఒక నటిగా సరే, ఒక వ్యక్తిగా మీకు ఇచ్చిందేమిటి? ఇది నాకు మోస్ట్ ఎమోషనల్ జర్నీ. నేను చూస్తుండగానే, గుణశేఖర్ గారి పిల్లలిద్దరూ పెద్దవాళ్ళయ్యారు. పెద్దమ్మాయి నీలిమ నాకు అన్న, చిన్నమ్మాయి యుక్త నా తమ్ముడు. ‘రుద్రమదేవి’ లాంటి ఛాన్స మీకు మళ్ళీ వస్తే? తప్పకుండా చేస్తా! గుణశేఖర్ లాంటి క్రియేటర్స్ దగ్గర ఛాన్సొస్తే కాదంటామా! ‘రుద్రమదేవి’కి సీక్వెల్ ‘ప్రతాపరుద్రుడు’ తీస్తారని టాక్ అది నాకు తెలీదు కానీ, నేను చేసిన ఏ ప్రాజెక్ట్‌కైనా సీక్వెల్ చేయమంటే, ఆలోచించకుండా అంగీకరిస్తా. ఇలాంటి అవకాశాలు ‘రుద్రమదేవి’పై ఇప్పుడు మీ మనసులోని ఆలోచన? ‘రుద్రమదేవి’ కథే తప్ప, వేషభాషల లాంటి రిఫరెన్స్లేమీ హిస్టరీలో లేవు. పాత్రల ‘లుక్’ నుంచి అన్నీ దర్శక - నిర్మాత గుణశేఖర్ చాలా కష్టపడి రీ-క్రియేట్ చేశారు. చరిత్రను డాక్యుమెంటరీలా కాక, మంచి ఎమోషనల్ స్టోరీగా, విజువల్ ఎక్స్‌పీరియన్స్‌గా తీశారు. చాలా ఏళ్ళుగా ఆయన కంటున్న కల ఇది. దాన్ని నిజం చేసుకోవడానికి కోట్లు ఖర్చు పెట్టి, మూడేళ్ళు శ్రమపడ్డారు. ఆయన భార్య, పిల్లలిద్దరూ కష్టపడ్డారు. ఇది నాకు మోస్ట్ ఎమోషనల్ జర్నీ. వాళ్ళ సపోర్ట్, చూపిన దీక్ష మర్చిపోలేను. టెక్నీషియన్లు ప్రాణం పెట్టి, నిజాయతీగా పనిచేస్తే, మరెన్నో కుటుంబాలు ఆధారపడ్డ ఈ చిత్రం ఘనవిజయం సాధించాలి. తెలుగువారి చరిత్రను ప్రపంచానికి చాటిన వెండితెర కృషిగా చరిత్ర సృష్టించాలి. సినీచరిత్రలో ప్రత్యేకంగా నిలవాలి. అందరికీ రావు కదా! - రెంటాల జయదేవ -
మెగా మూవీ వాయిదా
ముకుంద సినిమాతో వెండితెరకు పరిచయం అయిన మెగా వారసుడు వరుణ్ తేజ్. తొలి ప్రయత్నంలోనే తన ప్రత్యేకత చూపించిన వరుణ్, రెండో సినిమాతో కూడా అదే ఫార్ములాను కంటిన్యూ చేస్తున్నాడు. గమ్యం ఫేం క్రిష్ దర్శకత్వంలో కంచె సినిమా చేశాడు వరుణ్. రెండో ప్రపంచ యుద్ధకాలంలో జరిగే ప్రేమకథగా తెరకెక్కిన ఈ పీరియాడిక్ డ్రామాలో వరుణ్ డిఫరెంట్ లుక్‌లో కనిపిస్తున్నాడు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఆడియో, ఇటీవల సినీ ప్రముఖుల సమక్షంలో గ్రాండ్‌గా రిలీజ్ అయింది. రెండో ప్రపంచ యుద్ధ నేపధ్యంలో తెరకెక్కిన ఈ సినిమాను గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2న రిలీజ్ చేయాలని భావించారు. అయితే ఈ సినిమాను నవంబర్ 6వ తేదీన రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించాడు హీరో వరుణ్. వాయిదాకు కారణాలను త్వరలోనే వెల్లడిస్తామని తెలిపాడు. ముఖ్యంగా అక్టోబర్ 2న రామ్ హీరోగా తెరకెక్కిన శివం రిలీజ్ అవుతుండటంతో పాటు వరుసగా రుద్రమదేవి, బ్రూస్లీ, అఖిల్ సినిమాలు రిలీజ్ కానున్నాయి. దీంతో కంచెను నవంబర్‌కు వాయిదా వేశారన్న టాక్ వినిపిస్తుంది. టాలీవుడ్లో ఆలస్యంగా రిలీజ్ అయిన సినిమాలు ఆకట్టుకున్న సందర్భాలు చాలా తక్కువ కావటంతో కంచె యూనిట్‌తో పాటు అభిమానులు కూడా టెన్షన్ పడుతున్నారు. Hey guys...there has been a change in the release date of our movie #kanche to November 6th.. The reason behind this will be answered soon.. — Varun Tej Konidela (@IAmVarunTej) September 22, 2015 -
వరుణ్ వెనుకడుగు వేస్తున్నాడా..?
ముకుంద సినిమాతో వెండితెరకు పరిచయం అయిన మెగా వారసుడు వరుణ్ తేజ్. తొలి ప్రయత్నంలోనే తన ప్రత్యేకత చూపించిన వరుణ్, రెండో సినిమాతో కూడా అదే ఫార్ములాను కంటిన్యూ చేస్తున్నాడు. గమ్యం ఫేం క్రిష్ దర్శకత్వంలో కంచె సినిమా చేశాడు వరుణ్. రెండో ప్రపంచ యుద్ధకాలంలో జరిగే ప్రేమకథగా తెరకెక్కిన ఈ పీరియాడిక్ డ్రామాలో వరుణ్ డిఫరెంట్ లుక్‌లో కనిపిస్తున్నాడు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఆడియో, ఇటీవల సినీ ప్రముఖుల సమక్షంలో గ్రాండ్‌గా రిలీజ్ అయింది. రెండో ప్రపంచ యుద్ధ నేపధ్యంలో తెరకెక్కిన ఈ సినిమాను గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2న రిలీజ్ చేయాలని భావించారు. అయితే అదే సమయంలో మరిన్ని సినిమాల రిలీజ్ ఉండటంతో కంచె రిలీజ్‌ను వాయిదా వేసే ఆలోచనలో ఉన్నారు చిత్రయూనిట్. ముఖ్యంగా అక్టోబర్ 2న రామ్ హీరోగా తెరకెక్కిన శివం రిలీజ్ అవుతుండటంతో పాటు వరుసగా రుద్రమదేవి, బ్రూస్లీ, అఖిల్ సినిమాలు రిలీజ్ కానున్నాయి. దీంతో కంచెను నవంబర్‌కు వాయిదా వేయాలని భావిస్తున్నారు. ఇప్పటివరకు అఫీషియల్ ఎనౌన్స్మెంట్ లేకపోయినా వరుణ్, క్రిష్‌ల కంచె వాయిదా పడటం దాదాపుగా కన్ఫామ్ అన్న టాక్ వినిపిస్తోంది. -
మళ్లీ వాయిదా పడిన 'రుద్రమదేవి' ..?
గుణశేఖర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన రుద్రమదేవి మరోసారి వాయిదా పడినట్లు సమాచారం. తొలి ఇండియన్ స్టీరియో స్కోపిక్ త్రీడి చిత్రంగా భారీ వ్యయంతో అత్యున్నత సాంకేతిక విలువలతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. అయితే ఆర్ధిక సమస్యలతో పాటు ఇతర కారణాల వల్ల ఇప్పటికే ఈ సినిమా చాలా సార్లు వాయిదా పడుతూ వచ్చింది. ఎట్టి పరిస్థితుల్లోనూ అక్టోబర్ 9న సినిమా రిలీజ్ చేయాలని ప్లాన్ చేసినా, ఆ రోజు కూడా రుద్రమదేవి ప్రేక్షకుల మందుకు వచ్చే అవకాశాలు కనిపించటం లేదు. ఇంకా ఆర్థిక సమస్యల నుంచి తేరుకోకపోవటంతో, పాటు గ్రాఫిక్స్ వర్క్ కూడా పూర్తి కాకపోవటంతో సినిమా రిలీజ్ ను మరోసారి వాయిదా వేయాలని భావిస్తున్నారట. చారిత్రక కథాంశం కావటంతో సినిమాలో చాలా భాగం గ్రాఫిక్స్ మీదే ఆధారపడి ఉంది. దీనికి తోడు తొలి స్టీరియెస్కోపిక్ త్రీడి చిత్రం కావటం, ఆ టెక్నాలజీ మన దగ్గర పూర్తి స్థాయిలో అందుబాటులో లేకపోవటం లాంటి సమస్యల కారణంగా సినిమా ఆలస్యం అవుతూ వస్తోంది. అక్టోబర్ 9న రిలీజ్ కష్టమే అని తేలిపోవటంతో మళ్లీ ఎప్పుడు రిలీజ్ అవుతుందో అని అభిమానులతో పాటు ఇండస్ట్రీ వర్గాలు కూడా ఎదురుచూస్తున్నారు. రుద్రమదేవి పాత్రలో అనుష్క, రానా, అల్లు అర్జున్ లు ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు. కృష్ణంరాజు, ప్రకాష్ రాజ్, బాబాసెహగల్ లాంటి భారీ తారాగణం ఈ సినిమాలో కనిపించనున్నారు. ఇళయరాజ సంగీతం అందిస్తుండగా, గుణటీం వర్క్స్ బ్యానర్ పై గుణశేఖర్ ఈ సినిమాను స్వయంగా నిర్మిస్తూ దర్శకత్వం వహించాడు. -
'రుద్రమదేవి' మీదే ఆధారపడ్డారు!
టాలీవుడ్ చిత్ర పరిశ్రమకు దసరా సీజన్ చాలా ఇంపార్టెంట్. అందుకే స్టార్ హీరోలు కూడా ఈ సీజన్ లో తమ సత్తా చాటలని ప్రయత్నిస్తుంటారు. అయితే ఈ ఏడాది దసరా దగ్గర పడుతున్నా ఇంతవరకు సినిమాల రిలీజ్ లు మాత్రం ఫైనల్ కాలేదు. రుద్రమదేవి, అఖిల్, బ్రూస్లీ లాంటి సినిమాలు రిలీజ్‌కు సిద్ధంగా ఉన్న పండుగ బరిలో ఏ ఏ సినిమాలు నిలుస్తాయనేది ఇంకా స్పష్టత లేదు. ఇక దసరాకు తప్పక విడుదల కావాల్సిన పరిస్థితిలో ఉన్న సినిమా రుద్రమదేవి. అనుష్క ప్రదాన పాత్రలో గుణశేఖర్ ప్రతిష్టాత్మకంగా నిర్మించి, దర్శకత్వం వహించిన ఈ సినిమా ఇప్పటికే చాలా సార్లు వాయిదా పడుతూ ఫైనల్ గా అక్టోబర్ 9న రిలీజ్ అవుతుంది. అల్లు అర్జున్, రానాలు కూడా నటించడంతో ఈ సినిమా మీద భారీ అంచనాలే ఉన్నాయి. రుద్రమదేవి రిలీజ్ దాదాపుగా ఫైనల్ కావటంతో దసరా బరిలోనే దిగాలనుకున్న ఇతర హీరోలు ఆలోచనలో పడ్డారు. అదే సమయంలో విడుదల కు రెడీ అవుతున్న మరో సినిమా బ్రూస్లీ. రామ్ చరణ్.. శ్రీనువైట్ల కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఈ యాక్షన్ డ్రామాను అక్టోబర్ 15 న ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారు. అయితే రుద్రమదేవి 9కే రిలీజ్ అయితే ఆ సినిమా కలెక్షన్లతో పోటీ పడకుండా బ్రూస్లీని కాస్త ఆలస్యంగా ఆడియన్స్ ముందుకు తీసుకురావడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇక అక్కినేని వారసుడు అఖిల్ హీరోగా తెరకెక్కుతున్న సినిమాను కూడా దసరాకే రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. కానీ బ్రూస్లీ వాయిదా పడితే అఖిల్ సినిమాకు పోటీ అవుతుందన్న ఆలోచనతో మరోసారి రిలీజ్ డేట్ విషయంలో ఆలోచనలో పడ్డారట చిత్రయూనిట్.. దీంతో రుద్రమదేవి అనుకున్న సమయానికి రిలీజ్ అవుతుందా లేదా అన్నదాన్నిబట్టే చరణ్, అఖిల్ సినిమాల రిలీజ్ లు ఆధారపడి ఉన్నాయి. -
నాకు నేనే పోటి అంటున్న స్వీటి
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క ఓ విచిత్రమైన పరిస్థితి ఎదుర్కొంటుంది. అక్టోబర్ నెలలో ఈ అమ్మడు హీరోయిన్ గా నటించిన రెండు సినిమాలు ఒకేసారి రిలీజ్ కు రెడీ అవుతున్నాయి. రెండూ ఎక్స్పరిమెంటల్ సినిమాలు కావటంతో ఏ సినిమాకు ఎలాంటి రిజల్ట్ వస్తుందో అని అనుష్కతో పాటు యూనిట్ సభ్యులు కూడా టెన్షన్ పడిపోతున్నారు. గుణశేఖర్ దర్శకత్వంలో అనుష్క లీడ్ రోల్ లో తెరకెక్కిన హిస్టారికల్ స్టీరియోస్కోపిక్ త్రీడి సినిమా రుద్రమదేవి. కాకతీయ వీరనారి రుద్రమదేవి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా ఇప్పటికే చాలా సార్లు వాయిదా పడి ఫైనల్ గా అక్టోబర్ 9న రిలీజ్ అవుతోంది. భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ఈ సినిమాను ఎలాగైనా సక్సెస్ చేయాలన్న కసితో ఉన్నారు చిత్రయూనిట్. ఇక అదే సమయంలో రిలీజ్ కు రెడీ అవుతున్న స్వీటీ మరో సినిమా సైజ్ జీరో. ఎక్స్పరిమెంటల్ జానర్ లో తెరకెక్కిన ఈ సినిమా కోసం భారీగా బరువు పెరిగి, రిస్క్ చేసింది అనుష్క.. ప్రకాష్ కోవెలమూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ కామెడీ మూవీని కూడా అక్టోబర్ రెండో వారంలో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. అయితే అనుష్క లీడ్ రోల్ లో నటించిన రెండు భారీ సినిమాలు ఒకేసారి రిలీజ్ అయితే బిజినెస్ పరంగా ఇబ్బందులు ఎదురౌతాయంటున్నారు విశ్లేషకులు. -
అక్టోబర్ లో బన్నీ వర్సెస్ చెర్రీ
ఈ అక్టోబర్ లో టాలీవుడ్ స్క్రీన్ మీద బిగ్ ఫైట్ జరగనుంది. ముఖ్యంగా గతంలో ఎన్నడూ లేని విధంగా ఇద్దరు మెగా హీరోలు వెండితెర మీద తలపడటానికి రెడీ అవుతుండటంతో అక్టోబర్ రిలీజ్ ల పై అందరి దృష్టి పడింది. అల్లు అర్జున్ కీ రోల్ లో నటిస్తున్న రుద్రమదేవి, చాలా వాయిదాల తరువాత అక్టోబర్ లో రిలీజ్ అవుతుండగా రామ్ చరణ్ హీరోగా నటించిన బ్రూస్ లీ మూవీ కూడా దాదాపు అదే సమయంలో రిలీజ్ కానుంది. గుణశేఖర్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తూ దర్శకత్వం వహిస్తున్న హిస్టారికల్ స్టీరియోస్కోపిక్ త్రీడి ఫిలిం రుద్రమదేవి. అనుష్క ప్రదాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో అల్లు అర్జున్ గోన గన్నారెడ్డిగా ఓ ఇంపార్టెంట్ రోల్ లో కనిపిస్తున్నాడు. రుద్రమదేవి యూనిట్ మొత్తంలో భారీ మార్కెట్ ఉంది బన్నీ కే కావటంతో యూనిట్ సభ్యులు కూడా ప్రమోషన్ విషయంలో ఎక్కువగా బన్నీ పేరును వాడుతున్నారు. ఈ సినిమాను అక్టోబర్ 9 న రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు చిత్రయూనిట్. ఇక గత ఏడాది రెండు బిగ్ హిట్స్ తో అలరించిన చెర్రీ లాంగ్ గ్యాప్ తరువాత బ్రూస్ లీగా ఆడియన్స్ ముందుకు రానున్నాడు. ఆగడు లాంటి భారీ డిజాస్టర్ తరువాత శ్రీనువైట్ల డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సినిమా కావటంతో ఈ సక్సెస్ తన కెరీర్ కు చాలా కీలకం కానుంది. దీంతో ఎంతో జాగ్రత్తగా చరణ్ మార్క్ యాక్షన్ డ్రామాగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. అంతేకాదు అక్టోబర్ 16 న రిలీజ్ అవుతున్న ఈ సినిమాతో మరోసారి ఇండస్ట్రీ రికార్డ్ సెట్ చేయాలని భావిస్తున్నాడు చెర్రీ. ఇలా ఇద్దరు మెగా హీరోల సినిమాలు వారం గ్యాప్ లో రిలీజ్ అవుతుండటంతో థియేటర్ల సమస్య తలెత్తే అవకాశం ఉందంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు.. మరి అనుకున్నట్టుగా ఇద్దరు ఒకేసారి బరిలో దిగుతారా లేక ఎవరో ఒకరు వెనుకడుగు వేస్తారా చూడాలి. -
ఈ సినిమాకు ముందు ఆమెను అనుకోలేదు
హైదరాబాద్: రాణీ రుద్రమదేవి అంటే తనకు చిన్నప్పటి నుంచి చాలా ఇష్టమని దర్శకుడు గుణశేఖర్ అన్నారు. చదువుకొనేటపుడే కాకతీయుల రాణి రుద్రమదేవి శౌర్య, పరాక్రమాల గురించి విన్నప్పుడు చాలా గొప్పగా అనిపించిందని, ఆ కథ అలా తనను వెన్నాడుతూనే ఉందని చెప్పుకొచ్చారు. అందుకే ఎంత కష్టమైనా రుద్రమదేవి కథను సినిమాగా తీయాలని నిర్ణయించుకున్నాని ఆయన తెలిపారు. ఈ ప్రాజెక్టు కోసం తొమ్మిదేళ్లు పరిశోధనలు చేశానన్నారు. ఇది కాకతీయుల పరిపాలన, చరిత్రకు సంబంధించిన సినిమా కాబట్టి ప్రతి అంశంలోనూ చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి వస్తుందన్నారు. అందుకే పలువురు సినీపెద్దలు, చరిత్రకారులతో చర్చించానన్నారు. వారి సూచనలు, సలహాలు పాటిస్తూ చాలా ప్రతిష్ఠాత్మకంగా రుద్రమదేవి కథను తెరకెక్కిస్తున్నామని గుణశేఖర్ ప్రకటించారు. వాస్తవాలను ప్రతిబింబిస్తూ చాలా సమగ్రంగా, పరిపూర్ణంగా సినిమాను చిత్రీకరించామన్నారు. అలాగే ఈ సినిమా కోసం అసలు ముందు అనుష్క గురించి ఆలోచించలేదని తెలిపారు. స్నేహితులు, ఇండస్ట్రీ పెద్దల సలహాతో అనుష్కను రుద్రమదేవి పాత్ర కోసం ఎంచుకున్నామని తెలిపారు. ఆమె రుద్రమదేవి పాత్రకు న్యాయం చేకూర్చారన్నారు. నిజంగా అనుష్క సహకారం లేకపోతే రుద్రమదేవి ఇంత బాగా తీయలేకపోయేవాడినని అనుష్కపై ప్రశంసలు కురిపించారు. కాగా ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కించిన 'రుద్రమదేవి' సినిమాను సెప్టెంబర్ 4న విడుదల చేయనున్నట్టు దర్శకుడు గుణశేఖర్ ప్రకటించారు. దీన్ని ముందు తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో విడుదల చేస్తున్నామని చెప్పారు. 3డీ సీజీ టెక్నాలజీలో తెరకెక్కించామని అజయ్ విన్సెంట్ కెమెరా పనితనం, ఇళయరాజా రీరికార్డింగ్ సినిమాకు ప్లస్ పాయింట్లు అవుతాయని అభిప్రాయపడ్డారు. కథను ఇళయరాజా అద్భుతంగా ఎలివేట్ చేశారన్నారు. ఈ సందర్భంగా 'రుద్రమదేవి' ఆండ్రాయిడ్ యాప్ విడుదల చేశారు. రానా, అల్లు అర్జున్, నిత్యామీనన్, ప్రకాష్ రాజ్, కేథరీన్ త్రెసా తదితరులు ఇందులో ముఖ్యపాత్రలు పోషిస్తున్న సంగతి తెలిసిందే. -
ఇద్దరం ఆధ్యాత్మికంగా కనెక్ట్ అయ్యాం!
‘‘అనుష్కతో కలిసి డాన్స్ చేయడానికి చాలా కష్టపడ్డాను. ఆమెకూ నాకూ చాలా హైట్ డిఫరెన్స్ ఉంది. దాంతో ఆ టైమ్‌లో చాలా ఇబ్బంది పడ్డాను కూడా. నా కష్టం చూసి ఆమె కూడా నాకు సహకరించింది. ‘రుద్రమదేవి’ సినిమాలో నాకూ, అనుష్కకూ ఓ పాట ఉంది. ఆ పాటను మాత్రం నా జీవితంలో మర్చిపోలేను. అనుష్కకు సమానంగా ఉండటానికి నాతో బలవంతంగా హై హీల్స్ వేయించారు. దాంతో నా పాదాలకు గాయాలయ్యాయి. నా పాట్లు చూసి అనుష్క డాన్స్ చేసేటప్పుడు తన మోకాళ్లను వంచి నృత్యం చేసింది. నిజంగా ఆమె చాలా స్వీట్ పర్సన్. నేను చూసిన వాళ్లలో చాలా మంచి వ్యక్తి. ఈ సినిమా నుంచి ఆమెతో నాకు మంచి అనుబంధం ఏర్పడింది. ఇద్దరం చాలా ఆధ్యాత్మికంగా కనెక్ట్ అయ్యాం. నాకు యోగా అంటే చాలా ఇష్టం. యోగా టీచర్ అవ్వాలని అనుకునేదాన్ని. అనుష్క ఎలాగూ యోగా శిక్షకురాలిగా పనిచేశారు. దాంతో మేమిద్దరం కలిస్తే ఆధ్యాత్మిక విషయాలు, యోగా గురించి కూడా బాగా మాట్లాడుకుంటాం.’’ - నిత్యామీనన్ -
ఆమె నా కంటే ఏడు అంగుళాల పొడుగు
హీరోయిన్ అనుష్క నా కంటే ఏడు అంగుళాల పొడుగు ఉంటుందని కేరళ కుట్టీ నిత్యమీనన్ తెలిపారు. గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన రుద్రమదేవి చిత్రంలో అనుష్క, నిత్యమీనన్ తల్లీకూతుళ్లుగా నటించారు. ఈ చిత్రంలో ఓ పాటను వీరిద్దరిపై చిత్రీకరించారు. ఈ సందర్భంలోనే తాను అనుష్క కంటే ఏడు అంగుళాలు పొట్టిగా ఉన్నానని గుర్తించినట్లు నిత్యమీనన్ తెలిపింది. చిత్ర షూటింగ్లో తనకు ఎదురైన అనుభవాలను ఈ సందర్భంగా నిత్యమీనన్ శుక్రవారం వెల్లడించింది. అనుష్క కంటే పొట్టిగా ఉండటంతో తాను హైహీల్స్ చెప్పులు వేసుకుని మరీ ఆమెతో డాన్స్ చేయాల్సి వచ్చిందని తెలిపింది. తన జీవితంలో అంత ఎత్తు ఉన్న హైహీల్స్ వేసుకోవడం అదే తొలిసారి అని చెప్పింది. అన్నట్లు మరిచాను అనుష్కతో డ్యాన్స్ చేస్తున్న సమయంలో నా కాలు బెణికిందని చెప్పింది. డ్యాన్స్ షూటింగ్ సమయంలో అనుష్క తనకు ఎంతలా సహకరించిందో గుర్తు చేసుకుని మరీ నిత్య మురిసిపోయింది. తామిద్దరి మధ్య చాలా పోలికలున్నాయంది. అవి ఆధ్యాత్మికం, యోగా... ఇలా అంటూ నవ్వుకుంది. జీవితంలో ఎప్పటికైనా యోగా టీచర్ కావాలని తన లక్ష్యమని నిత్య మీనన్ ఈ సందర్భంగా స్పష్టం చేసింది. అయితే అనుష్క యోగా టీచర్ అయి.. ఆ తర్వాత హీరోయిన్ అయిందని... కానీ తాను మాత్రం హీరోయిన్ నుంచి యోగా టీచర్‌గా మారనున్నట్లు నిత్య మీనన్ చమత్కరించింది. ఇళయరాజా సంగీతాన్ని అందించిన రుద్రమదేవి చిత్రంలో అల్లు అర్జున్, కృష్ణం రాజు, కేథరిన్, హంసా నందిని, ప్రకాష్ రాజ్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటించిన సంగతి తెలిసిందే. -
వారియర్ లుక్స్‌తో బన్నీ వీడియో..
వారియర్ లుక్స్‌తో బన్నీ అభిమానులకు కనువిందు చేస్తున్నాడు. పండుగ కానుకగా అల్లు అర్జున్ వారియర్ లుక్స్‌తో ఉన్న మేకింగ్ వీడియో గురువారం ఉదయం రిలీజైంది. తెలుగుజాతి వైభవానికి ప్రతీకగా నిలిచిన కాకతీయ చరిత్ర ఆధారంగా గుణశేఖర్ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రం 'రుద్రమదేవి'. దేశంలోనే తొలి హిస్టారికల్ స్టీరియో స్కోపిక్ త్రీడీగా తెరకెక్కుతోన్న ఈ చిత్రం చిత్రీకరణ పూర్తి చేసుకుంది ఈ సందర్భంగా గుణశేఖర్ చిత్ర విశేషాలు వివరించారు. అన్యాయాన్ని సహించని ధీరుడిగా, పేదల పక్షపాతిగా గోన గన్నారెడ్డి పాత్ర ఉంటుందన్నారు. కాకతీయ సామ్రాజ్య పరిరక్షణ కోసం సమర నినాదం చేసే ధీరోదాత్తుడి పాత్ర అల్లు అర్జు అందరినీ ఆకట్టుకుంటుదని గుణశేఖర్ తెలిపారు. హాలీవుడ్ సాంకేతిక నిపుణులతో రూపొందిన ఈ సినిమా ప్రేక్షకులకు అంతర్జాతీయ విజువల్ థ్రిల్‌కి గురిచేస్తుందన్నారు. అనుష్క టైటిల్ రోల్ చేసిన ఈ చిత్రంలో రానా, కృష్ణంరాజు, సుమన్, నిత్యామీనన్, కేథరిన్ ఇతర ముఖ్య భూమికలు పోషించారు. ఈ చిత్రం వేసవిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. -
టాలీవుడ్ ప్రేక్షకులకు న్యూ ఇయర్ గిఫ్ట్
హైదరాబాద్: కళాత్మక దర్శకుడు గుణశేఖర్ ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్న 'రుద్రమదేవి' సినిమా కొత్త పోస్టర్ విడుదలైంది. కొత్త సంవత్సరం కానుకగా దర్శకుడు గుణశేఖర్ దీన్ని రుద్రమదేవి అఫీషియల్ ఫేస్బుక్ పేజీలో విడుదల చేశారు. ఇందులో హీరోయిన్ అనుష్క కాకతీయుల ప్రాభవానికి చిహ్నంగా కనిపించే ఓరుగల్లు కోట గుమ్మం ఎదురుగా నిలబడి కనిపిస్తుంది. ఒకేసమయంలో రూపొందుతున్న రెండు భారీ చిత్రాలు బాహుబలి, రుద్రమదేవి. ఈ రెండూ కూడా చరిత్ర ఆధారంగా తయారవుతున్నవే. రుద్రమదేవి సినిమాను గుణశేఖర్ చాలా శ్రద్ధగా, అపురూపంగా తెరకెక్కిస్తున్నారని బాహుబలి దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి గతంలో ట్విట్టర్ ద్వారా అభినందించారు. -
రుద్రమదేవి మేకింగ్ వీడియో
-
అనుష్కకు గుణశేఖర్ స్పెషల్ గిఫ్ట్!
చెన్నై: దక్షిణాది నటి అనుష్క శెట్టికి 'రుద్రమదేవి' చిత్ర నిర్మాతలు ఓ ప్రత్యేక వీడియోను పుట్టిన రోజు కానుకగా ఇవ్వాలని నిర్ణయించినట్టు తెలిసింది. ప్రత్యేక వీడియోలో ఏముంటుందనే విషయాన్ని దర్శకుడు గుణశేఖర్ సీక్రెట్ గా ఉంచారు. నవంబర్ 7 తేదిన అనుష్క 33వ జన్మదినం జరుపుకోనున్నారు. అనుష్క పుట్టిన రోజున ఓ ప్రత్యేక గిఫ్ట్ ను ప్లాన్ చేశారు. ఓ స్పెషల్ వీడియో లేదా సినిమా టీజర్ కావోచ్చు. పుట్టిన రోజున అనుష్కకు సర్ ప్రైజ్ చేయాలని గుణశేఖర్ ప్లాన్ చేశారు.. కానుక ఏమిటనే విషయాన్ని గుణశేఖర్ చాలా సీక్రెట్ గా ఉంచారు అని చిత్ర నిర్వహకులు వెల్లడించారు. కాకతీయుల వంశానికి చెందిన కథానేపథ్యంతో రుద్రమదేవి చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. Follow @sakshinews -
డిసెంబర్లోనే రుద్రమదేవి
తెలుగుజాతి వైభవానికి ప్రతీకగా నిలిచిన కాకతీయ చరిత్ర ఆధారంగా గుణశేఖర్ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రం ‘రుద్రమదేవి’. అనుష్క టైటిల్‌రోల్ చేసిన ఈ చిత్రంలో రానా, కృష్ణంరాజు, సుమన్, నిత్యామీనన్, కేథరిన్ ఇతర ముఖ్యభూమికలు పోషించగా, గోన గన్నారెడ్డిగా అల్లు అర్జున్ ప్రత్యేక పాత్రలో నటించారు. దేశంలోనే తొలి హిస్టారికల్ స్టీరియో స్కోపిక్ త్రీడీగా తెరకెక్కుతోన్న ఈ చిత్రం చిత్రీకరణ పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా గుణశేఖర్ మాట్లాడుతూ -‘‘తెలుగుజాతి చరిత్ర, తెలుగుజాతి సాహసం కళ్లకు కట్టే సినిమా ఇది. హాలీవుడ్ సాంకేతిక నిపుణులతో రూపొందిన ఈ సినిమా ప్రేక్షకులకు అంతర్జాతీయ విజువల్ థ్రిల్‌కి గురిచేస్తుంది. అందుకే... రాష్ట్రంలోని పలు ఎగ్జిబిటర్లు ఈ సినిమా ప్రదర్శనకు అనుగుణంగా థియేటర్లను సిద్ధం చేసుకోవడం విశేషం. త్రీడీతో పాటు 2డీలో కూడా ఈ సినిమా విడుదల అవుతుంది. ఈ చిత్ర నిర్మాణంలో సహకరించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. డిసెంబర్లో సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం’’ అని తెలిపారు. ప్రకాశ్‌రాజ్, ప్రభ, ఆదిత్యమీనన్, జయప్రకాశ్‌రెడ్డి తదితరులు నటించిన ఈ చిత్రానికి మాటలు: పరుచూరి బ్రదర్స్, పాటలు: సిరివెన్నెల, కెమెరా: అజయ్ విన్సెంట్, సంగీతం: ఇళయరాజా, కళ: తోట తరణి, కూర్పు: శ్రీకరప్రసాద్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: కె.రామ్‌గోపాల్, సమర్పణ: రాగిణి గుణ. -
వరుడి వేటలో అనుష్క
నటి అనుష్క పెళ్లి పీటలెక్కనుందా? ప్రస్తుతం తమిళం, తెలుగు చిత్ర పరిశ్రమల్లో చర్చనీయాంశంగా మారిన విషయం ఇదే. మూడు పదుల వయసు దాటిన హీరోయిన్లలో అనుష్క ఒకరు. ఈ బ్యూటీ వయసు 32 ఏళ్లు. హీరోయిన్గా తమిళం, తెలుగు భాషల్లో టాప్ లెవల్లో దూసుకుపోతున్న ఈ ముద్దు గుమ్మ ప్రస్తుతం చేస్తున్న చిత్రాలన్నీ భారీ బడ్జెట్ చిత్రాలే. అరుంధతి చిత్రం తరువాత అనుష్క స్థాయి అనూహ్యంగా పెరిగిపోయింది. ఈ బహుభాషా నటి ప్రస్తుతం తెలుగులో చారిత్రాత్మక కథా చిత్రాలు రుద్రమదేవి, బాహుబలి చేస్తున్నారు. ఈ రెండు చిత్రాల్లోను కత్తిపట్టి శత్రువులను వెంటాడే పాత్రలే పోషిస్తున్నారు. అలాగే తమిళంలో సూపర్ స్టార్‌తో తొలిసారిగా లింగా చిత్రంలో జోడీ కడుతున్నారు. అజిత్ సరసన మరో భారీ చిత్రంలో నటిస్తూ బిజీగా ఉన్నారు. ఇప్పటికిప్పుడు ఈ బ్యూటీ ఊ అంటే మరెందరో దర్శక నిర్మాతలు ఆమె ఇంటి ముందు క్యూకట్టేందుకు రెడీగా ఉన్నారు. ఇలాంటి పరిస్థితిలో అనుష్క తల్లిదండ్రులు ఆమెకు పెళ్లి చేయూలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. అనుష్కకు వరుడి వేటలో ఉన్న వాళ్లు ఇప్పటికే ముగ్గురిని ఎంపిక చేసినట్లు సమాచారం. వారిలో ఒకరు వ్యాపారవేత్త మరొకరు సినీ దర్శకుడు, ఇంకొకరు ఇంజనీర్ అని తెలిసింది. తగిన వరుడు లభిస్తే వచ్చే ఏడాది అనుష్క పెళ్లి ఖాయమని సమాచారం. అనుష్క కూడా ప్రస్తుతం అంగీకరించిన చిత్రాలను పూర్తి చేసే పనిలో పడ్డారట. -
రుద్రమదేవిలో స్టైలిష్ స్టార్ !
ప్రముఖ దర్శకుడు గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ చిత్రం రుద్రమదేవి. ఆ చిత్రంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అతిథి పాత్ర చేయనున్నారా ?... అంటే అవుననే అంటున్నాయి ఫిలింనగర్ వర్గాలు. అలాగే సామాజిక వెబ్ సైట్లు, ట్విట్టర్లలో ఆ వార్త హాల్చల్ చేస్తుంది. రుద్రమదేవి చిత్రంలోని ప్రముఖ పాత్రలలోని ఓ పాత్రలో ఒదిగిపోయే నటుడి కోసం దర్శకుడు గుణశేఖర్ తీవ్రంగా అన్వేషిస్తున్నాడు. ఆ క్రమంలో కొందరు ప్రముఖ నటులను గుణశేఖర్ ఎంపిక చేశాడు కూడా. అయితే ఆ పాత్రను తాము చేయలేమంటూ ఎంపికైన వారు ఒకొక్కరుగా తప్పుకుంటున్నారు. దాంతో ఆ ప్రాతకు న్యాయం చేసే నటుడి ఎంపికను గుణశేఖర్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాడు. ఆ క్రమంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ను ఎంపిక చేసినట్లు సమాచారం. ఆ పాత్రలో అర్జున్ అయితే సరిగ్గా సరిపోతాడని గుణశేఖర్ భావించినట్లు సమాచారం. అందుకోసం సంబంధించిన చర్చలు తుది దశకు చేరుకున్నట్లు సమాచారం. రుద్రమదేవి చిత్రంలో అనుష్క ప్రధాన పాత్ర పోషిస్తుండగా, రానా దగ్గుబాటి, కృష్ణంరాజు, ప్రకాష్ రాజు, బాబా సెహగల్, ఆదిత్య మీనన్, నిత్య మీనన్, హాంసానందిని, క్యాథరిన్ థెరిసా, అదితి చెంగప్ప ప్రముఖ ప్రాతలు పోషిస్తున్న సంగతి తెలిసిందే. భారీ వ్యయంతో తెరకెక్కుతున్న ఈ చిత్రం వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది. -
హంసానందిని హార్స్ రైడింగ్
చెన్నై:హీరోయిన్ గానే కాకుండా విభిన్న పాత్రలు చేసి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి హంసానందిని ప్రస్తుతం హార్స్ రైడింగ్ చేస్తుందట.ఇదేదో ఆమె సరదాగా నేర్చుకుంటున్నది కాదు. గుణశేఖర్ దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న రుద్రమదేవి సినిమా గాను ఆమె గుర్రపు స్వారీలు చేస్తూ చక్కర్లు కొడుతుంది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా వెల్లడించింది. ఇప్పటివరకూ తాను చేసిన పాత్రలో ఒకవైపు అయితే..ఈ సినిమాలో చేస్తున్న సరికొత్త పాత్ర మాత్రం ఖచ్చితంగా తనకు మరింత గుర్తింపు తీసుకువస్తుందని చెబుతుంది. 'అరుంధతి' అనుష్క ప్రధాన పాత్రతో రుద్రమదేవి చిత్రం శరవేగంగా రూపుదిద్దుకుంటుంది. ఈ చిత్రంలో మదానికా రాణి పాత్రలో కనిపించబోతున్న హంసానందిని కత్తి పట్టి గుర్రం ఎక్కనుంది. ఈ క్రమంలోనే ఆమె కత్తి తిప్పడంతో పాటు గుర్రంపై స్వారీ చేస్తుంది. దీనికి గాను మూడు గంటలకు పైగా మేకప్ కోసం సమయం కేటాయించాల్సి వస్తుంది. ఈ తరహా పాత్రలో చేయాలంటే శారీరకంగా చాలా కష్టించకతప్పదని హంసా స్వీయ అనుభవం ద్వారా తెలుసుకుంది. ఇప్పటి వరకూ శారీరాకర్షణ కలిగిన పాత్రలు మాత్రమే చేసిన హంసాకు శరీరాన్ని మరింత కష్టపెట్టే ఈ చిత్రం మరింత పేరు ప్రఖ్యాతులను తీసుకొస్తుందని ఆశిద్ధాం. -
కనీ వినీ ఎరుగని రీతిలో...
కాకతీయ సామ్రాజ్య వైభవాన్ని పుస్తకాల్లో మాత్రమే చదువుకున్నాం. నాటి సామ్రాజ్య శోభ, సంస్కృతి, సంప్రదాయం, రాజనీతి, యుద్ధనీతి... ఇవన్నీ ఇప్పటిదాకా ఊహలకు మాత్రమే పరిమితం. వెండితెరపై దాన్ని కళ్లకు కట్టే ప్రయత్నం చేస్తున్నారు గుణశేఖర్. ‘రుద్రమదేవి’ చరిత్రకు తెరరూపాన్నిచ్చి, భావితరానికి గొప్ప మేలునే చేస్తున్నారాయన. అనుష్క రుద్రమదేవిగా నటిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం కీలక ఘట్టానికి చేరుకుంది. ప్రపంచ చరిత్రలో న భూతో న భవిష్యత్ అన్న చందాన కాకతీయ సామ్రాజ్యానికి రక్షణగా... రాతికోట, మట్టికోట, ముళ్ల కోట, కంకర కోట... ఇలా ఏడు రకాల కోట గోడల్ని శత్రుదుర్భేద్యంగా రాణీరుద్రమ నిర్మించినట్లు చరిత్ర. నాటి కట్టడాలను ప్రేక్షకుల కళ్లకు కట్టే ప్రయత్నంలో ఉన్నారు ఈ చిత్ర కళా దర్శకుడు తోట తరణి. గోపనపల్లిలో గత 40 రోజులుగా ఈ కోట గోడల నిర్మాణం జరుగుతోంది. దీని గురించి గుణశేఖర్ మాట్లాడుతూ -‘‘వేలాది మంది దేవగిరి సైన్యం ఈ కోట గోడల్ని ముట్టడించే ప్రయత్నం చేస్తే... ఆ ప్రయత్నాన్ని కాకతీయ సైన్యంతో రుద్రమ ఎలా ఎదుర్కొన్నారో ఈ సెట్లో చిత్రీకరించనున్నాం. కనీ వినీ ఎరుగని రీతిలో ఈ పోరాట సన్నివేశాలుంటాయి. ఈ నెల 29 నుంచి ఫిబ్రవరి 20 వరకూ ఈ సన్నివేశాల్ని చిత్రీకరిస్తాం. ఈ చిత్రాన్ని స్టీరియోస్కోపిక్ త్రీడీ టెక్నాలజీతో తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ టెక్నాలజీ కారణంగా ప్రేక్షకులు అప్పటి కాలానికి, ఆయా సంఘటనల్లోకి స్వయంగా వెళ్లిన అనుభూతికి లోనవుతారు. అనుష్క, రానాలతో పాటు కృష్ణంరాజు, సుమన్, ప్రకాష్‌రాజ్, ఆదిత్యమీనన్, విక్రమ్‌జీత్, నిత్యామీనన్, కేథరిన్, హంసానందిని, బాబా సెహగల్ తదితరులు ఈ పోరాట సన్నివేశాల్లో పాల్గొంటారు’’ అని తెలిపారు. ఈ చిత్రానికి మాటలు: పరుచూరి బ్రదర్స్, సంగీతం: ఇళయరాజా, కూర్పు: శ్రీకరప్రసాద్, నిర్మాత: కె.రామ్‌గోపాల్, సమర్పణ: రాగిణీ గుణ. -
అనుష్క జన్మదిన కానుకగా 'రుద్రమదేవి ఫస్ట్
ప్రముఖ టాలీవుడ్ నటి అనుష్క జన్మదిన కానుకగా ఆమె నటించిన తాజా చిత్రం రుద్రమదేవికి సంబంధించిన ఫస్ట్ లుక్‌ను విడుదల చేయనున్నట్లు ఆ చిత్ర నిర్మాణ బృందం బుధవారం చెన్నైలో వెల్లడించింది. ఆ చిత్రం ఫస్ట్ లుక్ విడుదలకు అంతకంటే మంచి సమయం లేదని అభిప్రాయపడింది. అనుష్క గురువారం జన్మదినం జరుపుకోనుంది. ఈ నేపథ్యంలో జన్మదిన కానుకగా అనుష్కకు రుద్రమదేవి ఫస్ట్‌లుక్‌ను బహుమతిగా అందజేయాలని తామంతా నిర్ణయం తీసుకున్నట్లు చెప్పింది. అనుష్కకు ఆ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ కానుకగా ఇవ్వడం ద్వారా ఆమె అభిమానులు సంతోషిస్తారని పేర్కొంది. ప్రముఖ దర్శకుడు గుణశేఖర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రంలో రానా దగ్గుపాటి, సుమన్, ప్రకాశ్ రాజ్, బాబాసెగల్, అదితి చెంగప్ప, నిత్యమీనన్, ఆదిత్య మీనన్ తదితరలు నటిస్తున్నారు. అయితే ఇప్పటికే అనుష్క నటించిన రుద్రమదేవి చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ విడుదల చేశారు. అవి సామాజిక అనుసంధాన వేదికలో దర్శనమిచ్చాయి. అయితే ఆ ఫోటోలు అనుష్క నటించిన రుద్రమదేవి చిత్రానికి సంబంధించినవి కావని ఆ చిత్ర దర్శకుడు గుణశేఖర్ ఖండించిన విషయం విదితమే.అనుష్క రుద్రమదేవి చిత్రంలో నటించేందుకు దాదాపు 15 కేజీలు బరువు తగ్గింది. అలాగే గుర్రపు స్వారీ, కత్తి యుద్దాలను కఠోర శ్రమకోర్చి నేర్చుకున్న సంగతి తెలిసిందే. -
ఆరు నెలల వరకు అగాల్సిందే: అనుష్క
మరో ఆరు నెలల వరకు కొత్త చిత్రాలలో నటించేందుకు ఒప్పుకునేది లేదని టాలీవుడ్ జేజమ్మ అనుష్క శెట్టి వెల్లడించింది. ప్రస్తుతం రుద్రమదేవి, బాహుబలి చిత్రాలతో మహాబిజీగా ఉన్నట్లు చెప్పింది. అదికాక ఆ రెండు చిత్రాలలో కొన్ని సన్నివేశాల కోసం గుర్రపు స్వారీ, కత్తి యుద్దాలు నేర్చుకోంటున్నట్లు వివరించింది. అంతేకాకుండా ఆ రెండు చిత్రాల షూటింగుల్లో పాల్గొనడంతో ఉన్న సమయం అంతా వాటిలో నటించడానికే సరిపోతుందని తెలిపింది. రుద్రమదేవి, బాహుబలి చిత్రాలు షూటింగ్ పూర్తి అయ్యేవరకు విరామం అనేది ఉండదని చెప్పింది. బహుశ ఆ చిత్రాలు వచ్చే ఏడాది మొదట్లో విడుదల కావచ్చని చెప్పింది. అప్పుడు కానీ తనకు కాస్త విరామం దొరుకుంది, ఆ సమయంలో కొత్త చిత్రాలలో నటించేందుకు ఆలోచిస్తానని అనుష్క తెలిపింది. అయితే ఈ ఏడాది మొదట్లోనే చిత్రీకరణ పూర్తి చేసుకున్న తమిళ చిత్రం ఇరందమ్ ఉలగమ్ విడుదల కోసం ఎదురుస్తున్నట్లు చెప్పింది. ప్రముఖ దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో బాహుబలి చిత్రం తెలుగు, తమిళంలో రూపుదిద్దుకుంటున్న సంగతి తెలిసిందే.