బన్నీ జోడి మళ్లీ మారిపోయింది | anjali replaces anushka for special song with allu arjun | Sakshi
Sakshi News home page

బన్నీ జోడి మళ్లీ మారిపోయింది

Published Tue, Nov 3 2015 1:55 PM | Last Updated on Sun, Sep 3 2017 11:57 AM

బన్నీ జోడి మళ్లీ మారిపోయింది

బన్నీ జోడి మళ్లీ మారిపోయింది

సన్నాఫ్ సత్యామూర్తి సినిమా తరువాత కాస్త గ్యాప్ తీసుకున్న అల్లు అర్జున్ ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో 'సరైనోడు' పేరుతో  యాక్షన్ ఎంటర్టైనర్లో నటిస్తున్నాడు. బోయపాటి కూడా లాంగ్ గ్యాప్ తరువాత చేస్తున్న సినిమా కావటంతో ఈ సినిమా సక్సెస్ ఇద్దరి కెరీర్లో కీలకం కానుంది. అందుకే ప్రతీ విషయంలోనూ చాలా జాగ్రత్తగా ఒకటికి రెండు సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా సినిమాలో వచ్చే ఓ స్పెషల్ సాంగ్ కోసం భారీ వేట కొనసాగిస్తున్నారు ఈ స్టార్స్.

ముందుగా ఈ పాటను ఇలియానాతో చేయించాలని భావించారు. చాలా రోజులుగా టాలీవుడ్లో రీ ఎంట్రీ కోసం ఎదురుచూస్తున్న ఇలియానా బన్నీతో ఆడిపాడటానికి సై అంది. అయితే చివరి నిమిషంలో ఏం జరిగిందో ఏమోగాని ఇలియానాను పక్కన పెట్టేశారు. బన్నీతో ఉన్న స్నేహం కారణంగా ఈ సాంగ్ ఛాన్స్ నాదే అని భావించిన గోవా బ్యూటికి నిరాశే మిగిలింది.

ఇలియానా తరువాత ఈ సాంగ్ కోసం సక్సెస్ఫుల్ హీరోయిన్ అనుష్కను సంప్రదించారు. అనుష్క లీడ్రోల్లో నటించిన రుద్రమదేవి సినిమాలో అల్లు అర్జున్ స్పెషల్ క్యారెక్టర్ చేయటంతో అందుకు కృతజ్ఞతగా అనుష్క కూడా స్పెషల్ సాంగ్ చేస్తుందని భావించారు. అయితే తాజ సమాచారం ప్రకారం సీన్ నుంచి అనుష్క కూడా పక్కకు వెళ్లినట్టుగా తెలుస్తోంది. సైజ్ జీరో సినిమా కోసం భారీగా బరువు పెరిగిన అనుష్క, బాహుబలి 2 కోసం బరువు తగ్గే పనిలో బిజీగా ఉంది. దీంతో సరైనోడు సాంగ్కు డేట్స్ అడ్జస్ట్ చేయలేక ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంది.

ఫైనల్గా హోమ్లీ బ్యూటి అంజలిని ఈ సాంగ్ కోసం ఫైనల్ చేశారట. గతంలో సింగం 2 సినిమా కోసం ఐటమ్ సాంగ్లో ఆడిపాడిన అంజలి మరోసారి అదే పనికి రెడీ అవుతోంది. ఇటీవల రిలీజ్ అయిన శంకరాభరణం ట్రైలర్లో నెగెటివ్ లుక్లో అలరించిన అంజలి ఐటమ్ నంబర్తో కూడా ఆకట్టుకోవాలని చూస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement