వారియర్ లుక్స్తో బన్నీ వీడియో.. | Rudhramadevi Making Video Journal - 3 - Allu Arjun As gona ganna Reddy | Sakshi
Sakshi News home page

వారియర్ లుక్స్తో బన్నీ వీడియో..

Published Thu, Jan 15 2015 1:39 PM | Last Updated on Sat, Sep 2 2017 7:46 PM

వారియర్ లుక్స్తో బన్నీ వీడియో..

వారియర్ లుక్స్తో బన్నీ వీడియో..

వారియర్ లుక్స్తో బన్నీ అభిమానులకు కనువిందు చేస్తున్నాడు. పండుగ కానుకగా అల్లు అర్జున్ వారియర్ లుక్స్‌తో ఉన్న మేకింగ్ వీడియో గురువారం ఉదయం రిలీజైంది. తెలుగుజాతి వైభవానికి ప్రతీకగా నిలిచిన కాకతీయ చరిత్ర ఆధారంగా గుణశేఖర్ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రం 'రుద్రమదేవి'.  దేశంలోనే తొలి హిస్టారికల్ స్టీరియో స్కోపిక్ త్రీడీగా తెరకెక్కుతోన్న ఈ చిత్రం చిత్రీకరణ పూర్తి చేసుకుంది

ఈ సందర్భంగా  గుణశేఖర్ చిత్ర విశేషాలు వివరించారు. అన్యాయాన్ని సహించని ధీరుడిగా, పేదల పక్షపాతిగా గోన గన్నారెడ్డి పాత్ర ఉంటుందన్నారు. కాకతీయ సామ్రాజ్య పరిరక్షణ కోసం సమర నినాదం చేసే ధీరోదాత్తుడి పాత్ర అల్లు అర్జు  అందరినీ ఆకట్టుకుంటుదని గుణశేఖర్ తెలిపారు. హాలీవుడ్ సాంకేతిక నిపుణులతో రూపొందిన ఈ సినిమా ప్రేక్షకులకు అంతర్జాతీయ విజువల్ థ్రిల్‌కి గురిచేస్తుందన్నారు. అనుష్క టైటిల్‌ రోల్ చేసిన ఈ చిత్రంలో రానా, కృష్ణంరాజు, సుమన్, నిత్యామీనన్, కేథరిన్ ఇతర ముఖ్య భూమికలు పోషించారు. ఈ చిత్రం వేసవిలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement