banny
-
దేవరగట్టులో కంట్రోల్ రూం ఏర్పాటు
హొళగుంద: దేవరగట్టు కొండల్లో ఈ నెల 11న జరిగే దసరా బన్ని మహోత్సవాల సందర్భంగా కంట్రోల్ రూంను ఏర్పాటు చేసినట్లు ఎంపీడీఓ నాగేశ్వరరావు శనివారం విలేకరులకు తెలిపారు. మండలానికి నోడల్ ఆఫీసర్‌గా ఉన్న స్పెషల్ కలెక్టర్ సుబ్బారెడ్డి(98499 94521), ఆదోని ఆర్డీఓ ఓబులేసు(98499 04164), ఆదోని డీఎస్పీ కొల్లి శ్రీనివాసరావు(94407 95555), ఎండోమెంట్ అసిస్టెంట్ కమిషనర్(94910 00679), ఎక్సైజ్ శాఖాధికారులతో పాటు.. హొళగుంద, ఆలూరు, చిప్పగిరి, హాలహర్వి తహసీల్దార్లు, ఎంపీడీఓలు, ఆర్డబ్ల్యూఎస్, పీఆర్ అధికారులు మొత్తం దాదాపు 50 మంది సిబ్బంది ఈ కంట్రోల్ రూంలో అందుబాటలో ఉంటారన్నారు. భక్తులకు ఇబ్బంది కలిగినా, అసౌకర్యాలుంటే అధికారుల దృష్టికి తీసుకురావాలన్నారు. -
దేవరగట్టు బందోబస్తుకు సిద్ధంకండి
– పెరేడ్ పరిశీలనలో సిబ్బందికి ఎస్పీ ఆదేశం కర్నూలు: దేవరగట్టు బన్ని ఉత్సవంలో బందోబస్తుకు సిద్ధం కావాలని ఎస్పీ ఆకే రవికృష్ణ పోలీసు సిబ్బందికి సూచించారు. జిల్లా పోలీసు కార్యాలయంలో పెరేడ్ మైదానంలో సివిల్, ఏఆర్ పోలీసులు శుక్రవారం నిర్వహించిన పెరేడ్‌కు ఎస్పీ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బన్ని ఉత్సవాల్లో భక్తుల పట్ల మర్యాదగా మసలుకోవాలని సూచించారు. సాంకేతిక టెక్నాలజీతో సీసీ కెమెరాలను అమర్చుతున్నామని, ఉత్సవ కార్యక్రమం మొత్తం కెమెరాలతో నిఘా ఏర్పాటు చేశామన్నారు. డీజీపీ ప్రారంభించిన పోలీసు సేవాదళ్ సేవలను బన్ని ఉత్సవాల్లో వినియోగించుకుంటున్నట్లు వెల్లడించారు. చిన్నపిల్లలు, వికలాంగులు, వృద్ధుల పట్ల సేవాదళ్ సభ్యులు జాగ్రత్తలు తీసుకుంటూ ఏవైనా సమస్యలు ఉంటే కంట్రోల్ రూమ్‌కు తెలియజేయాలన్నారు. ఆకతాయిల పట్ల నిఘా ఉధృతం చేసి ముందస్తుగా బైండోవర్ కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. అతివేగం, నిర్లక్ష్యం, సెల్‌ఫోన్ డ్రైవింగ్ చేయడం చట్ట వ్యతిరేకమని డ్రైవర్లకు అవగాహన కల్పించాలన్నారు. అనాథ పిల్లలు ఎక్కడైనా కనిపిస్తే ఐసీడీఎస్‌కు అప్పగించాలని సూచించారు. ఏఆర్ అడిషనల్ ఎస్పీ వెంకటేష్, డీఎస్పీలు రమణమూర్తి, వెంకటాద్రి, సీఐ నాగరాజరావు, డేగల ప్రభాకర్‌రావు, మధుసూదన్‌రావు, ఆర్ఐలు రంగముని, జార్జి తదితరులు పాల్గొన్నారు. -
వారియర్ లుక్స్‌తో బన్నీ వీడియో..
వారియర్ లుక్స్‌తో బన్నీ అభిమానులకు కనువిందు చేస్తున్నాడు. పండుగ కానుకగా అల్లు అర్జున్ వారియర్ లుక్స్‌తో ఉన్న మేకింగ్ వీడియో గురువారం ఉదయం రిలీజైంది. తెలుగుజాతి వైభవానికి ప్రతీకగా నిలిచిన కాకతీయ చరిత్ర ఆధారంగా గుణశేఖర్ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రం 'రుద్రమదేవి'. దేశంలోనే తొలి హిస్టారికల్ స్టీరియో స్కోపిక్ త్రీడీగా తెరకెక్కుతోన్న ఈ చిత్రం చిత్రీకరణ పూర్తి చేసుకుంది ఈ సందర్భంగా గుణశేఖర్ చిత్ర విశేషాలు వివరించారు. అన్యాయాన్ని సహించని ధీరుడిగా, పేదల పక్షపాతిగా గోన గన్నారెడ్డి పాత్ర ఉంటుందన్నారు. కాకతీయ సామ్రాజ్య పరిరక్షణ కోసం సమర నినాదం చేసే ధీరోదాత్తుడి పాత్ర అల్లు అర్జు అందరినీ ఆకట్టుకుంటుదని గుణశేఖర్ తెలిపారు. హాలీవుడ్ సాంకేతిక నిపుణులతో రూపొందిన ఈ సినిమా ప్రేక్షకులకు అంతర్జాతీయ విజువల్ థ్రిల్‌కి గురిచేస్తుందన్నారు. అనుష్క టైటిల్ రోల్ చేసిన ఈ చిత్రంలో రానా, కృష్ణంరాజు, సుమన్, నిత్యామీనన్, కేథరిన్ ఇతర ముఖ్య భూమికలు పోషించారు. ఈ చిత్రం వేసవిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. -
వీరభద్రం దర్శకత్వంలో బన్నీ?
అల్లు అర్జున్ నటిస్తున్న ‘రేసుగుర్రం’ చిత్రం నిర్మాణ దశలో ఉంది. ఈ సినిమా తర్వాత ఆయన పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో నటిస్తారని, తమిళ దర్శకుడు రాజేష్ దర్శకత్వంలో నటిస్తారని రకరకాల వార్తలు సినీవర్గాల్లో వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వీరభద్రం దర్శకత్వంలో బన్నీ ఓ సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చార నే తాజా వార్త ఫిలింనగర్లో చర్చనీయాంశమైంది. అహనా పెళ్లంట, పూలరంగడు చిత్రాలతో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న వీరభద్రం చౌదరి... ప్రస్తుతం నాగార్జునతో ‘భాయ్’ చిత్రం చేస్తున్నారు. ఈ సినిమాతో హ్యాట్రిక్ కొట్టాలనే కసితో ఉన్నారాయన. ‘భాయ్’ తర్వాత బన్నీ-వీరభద్రంల సినిమా ఉంటుందని తెలుస్తోంది. ఓ అగ్ర నిర్మాత ఈ చిత్రాన్ని నిర్మించనున్నారని విశ్వసనీయ సమాచారం. సదరు నిర్మాత.. వీరభద్రానికి అడ్వాన్స్ కూడా అందజేసినట్లు తెలుస్తోంది. ప్రేక్షకుల నాడి తెలిసిన దర్శకుడు వీరభద్రం... బన్నీతో చేయబోయే సినిమా ఎలా ఉంటుందో తెలుసుకోవాలంటే... ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే...