దేవరగట్టులో కంట్రోల్ రూం ఏర్పాటు
Published Sat, Oct 8 2016 11:49 PM | Last Updated on Mon, Sep 4 2017 4:40 PM
హొళగుంద: దేవరగట్టు కొండల్లో ఈ నెల 11న జరిగే దసరా బన్ని మహోత్సవాల సందర్భంగా కంట్రోల్ రూంను ఏర్పాటు చేసినట్లు ఎంపీడీఓ నాగేశ్వరరావు శనివారం విలేకరులకు తెలిపారు. మండలానికి నోడల్ ఆఫీసర్‌గా ఉన్న స్పెషల్ కలెక్టర్ సుబ్బారెడ్డి(98499 94521), ఆదోని ఆర్డీఓ ఓబులేసు(98499 04164), ఆదోని డీఎస్పీ కొల్లి శ్రీనివాసరావు(94407 95555), ఎండోమెంట్ అసిస్టెంట్ కమిషనర్(94910 00679), ఎక్సైజ్ శాఖాధికారులతో పాటు.. హొళగుంద, ఆలూరు, చిప్పగిరి, హాలహర్వి తహసీల్దార్లు, ఎంపీడీఓలు, ఆర్‌డబ్ల్యూఎస్, పీఆర్ అధికారులు మొత్తం దాదాపు 50 మంది సిబ్బంది ఈ కంట్రోల్ రూంలో అందుబాటలో ఉంటారన్నారు. భక్తులకు ఇబ్బంది కలిగినా, అసౌకర్యాలుంటే అధికారుల దృష్టికి తీసుకురావాలన్నారు.
Advertisement
Advertisement