Devaragattu
-
కర్నూలు జిల్లా : అర్ధరాత్రి రణరంగం.. దేవరగట్టు బన్నీ ఉత్సవం (ఫొటోలు)
-
దేవరగట్టు కర్రల సమరంలో విషాదం
-
దేవరగట్టు బన్నీ ఉత్సవాల్లో పగిలిన తలలు
-
దేవరగట్టు బన్నీ ఉత్సవం.. ఈసారైనా ప్రశాంతంగా జరుగుతుందా..!?
సాక్షి, కర్నూలు: దేవరగట్టులో ప్రతీ ఏడాది దసరా పండుగ రోజున బన్నీ ఉత్సవం కర్రల యుద్ధంగా జరుగుతుంది. అర్ధరాత్రి వేళ మాలమల్లేశ్వర స్వామిని దక్కించుకోవడంలో అక్కడి స్థానిక ప్రజలు బన్నీ ఉత్సవాన్ని ఏర్పాటు చేస్తున్నారు. సాంప్రదాయం, ఆచారం పేరిట ఈ భక్తి పోరాటం కొనసాగుతుంది. ఈ ఉత్సవంతో అక్కడి వాతావరణం ప్రతీసారి ఓ వైపు కోలాహలంగానూ, మరోవైపు నెత్తురుమయంగానూ వేడుక జరుగుతుంది. ఈ వేడుక ప్రశాంతంగా నిర్వహించేందుకు పోలీస్ శాఖ భారీ బందోబస్తును ఏర్పాటు చేసింది. అక్కడి ఆచార సాంప్రదాయం ఇలా.. ఈ బన్నీ ఉత్సవ యుద్దానికి పూర్వ చరిత్ర ఉంది. మాలమల్లేశ్వర విగ్రహం కోసం దేవరగట్టుతో పాటు చుట్టుపక్కల గ్రామాలవారు కర్రలతో కొట్టుకోవడం ఆనవాయితీగా వస్తుంది. దసరా రోజున అర్ధరాత్రి వేళా స్వామి విగ్రహాన్ని తీసుకెళ్తే అంతా మంచి జరుగుతుందని అక్కడి ప్రజల నమ్మకంతో.. ఉత్సవం యుద్ధానికి సిద్ధమవుతున్నారు అక్కడి ప్రజలు. ప్రతీ ఏడాది జరుగుతున్న ఈ సమరంలో అనేక మందికి గాయాలయ్యి, తలలు పగిలి ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు ఇదివరకూ అనేకసార్లు జరుగుతూ వస్తుంది. అయినా ఈ ఉత్సవం ఇలా జరగడంలోనే బాగుందంటున్నారు అక్కడి స్థానికలు. మా ఆచార సాంప్రదాయాన్ని ఇలాగే కొనసాగిస్తాం.. మాళమల్లేశ్వర స్వామిని దక్కించుకోవడంలో వెనుకడుగు వేసేది లేదంటున్నారు స్థానిక భక్తులు. పూర్తి బందోబస్తు.. ప్రతి ఏటా ఇలాగే జరుగుతున్న బన్నీ ఉత్సవాలలో ప్రశాంతత నెలకొల్పడానికి పోలీసు, పై అధికారశాఖ సిద్ధంగా ఉందా? అనే విషయాలపై పోలీసుశాఖ అవుననే అంటుంది. దేవరగట్టులో రక్తపాతం జరగకుండా ముందస్తు భద్రతా చర్యలు చేపట్టారు. ఎలాంటి ప్రమాదం జరగకుండా ఈసారి బందోబస్తు ముమ్మరం చేశామన్నారు. ఆచారం పేరిట కొనసాగుతూ వస్తున్న ఈ అపశ్రుతి పోరాటాన్ని నిలపనున్నారు. భక్తులు నాటుసారా సేవించకుండా కట్టడి చేయనున్నారు. ఇనుప చువ్వల కట్టెలు వాడకుండా చర్యలు తీసుకుంటూ అవగాహన సదస్సు నిర్వహించారు. ప్రశాంతమైన వేడుక జరిగేలా ఉత్సవ కమిటీతో మాట్లాడారు. ఈ ఏడాది కఠినమైన రక్షణ చర్యలు తప్పవంటున్నారు. ఈ ఉత్సవంలో వేల సంఖ్యల్లో భక్తులు పాల్గొననున్నారు. ప్రమాదమైన ఈ సంప్రదదాయ ఆచారాన్ని ఎలాగైనా ఆపాలని తీవ్ర ప్రయత్నానికి పూనుకుంటున్నారు అక్కడి పొలిసు అధికారులు. -
దేవరగట్టులో బన్నీ ఉత్సవాలు
-
దేవరగట్టు: భారీ వర్షంలో బన్నీ ఉత్సవం.. 50 మందికిపైగా గాయాలు!
సాక్షి, కర్నూలు: జిల్లాలోని హొళగుంద మండలం దేవరగట్టులో పోలీసుల భద్రత నడుమ బన్నీ ఉత్సవం జరిగింది. భారీ వర్షం పడుతున్నా లెక్క చేయకుండా పది గ్రామాల ప్రజలు పాల్గొన్నారు. కాస్త ఆలస్యంగా ప్రారంభమైనప్పటికీ.. సుమారు రెండు లక్షల మంది జనం బన్నీ తిలకించేందుకు వచ్చినట్లు తెలుస్తోంది. ఇక ఆనవాయితీగా ఉత్సవ విగ్రహం కోసం కర్రలతో సమరానికి దిగారు. ఈసారి బన్నీ ఉత్సవంలో 50 మందికిపైగా (సుమారు 80 మందికి) గాయాలు కాగా, ఆస్పత్రికి తరలించారు. జోరుగా వాన పడుతున్నా లెక్క చేయకుండా వర్షంలోనే బన్నీ ఉత్సవాన్ని తిలకించారు జనాలు. మార్గంలో భారీగా వాహనాలు నిలిచిపోవడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దేవరగట్టులో 800 అడుగుల ఎత్తైన కొండపై మాళ మల్లేశ్వరస్వామి ఆలయం ఉంది. దసరా రోజున ప్రతి ఏటా శ్రీమాళ మల్లేశ్వర స్వామికి నిర్వహించే వేడుకలలో భాగంగా ఈ కర్రల సమరం నిర్వహిస్తున్నారు. ఉత్సవ వివరాలు ► 5న బుధవారం రాత్రి స్వామి వారి కల్యాణోత్సవం ► బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత జైత్రయాత్ర మొదలు ► 6వ తేదీ ఉదయం నెరణికి గ్రామ ఆలయ పూజారి భవిష్యవాణి వినిపిస్తారు ► 7వ తేదీ నెరణికి గ్రామ పురోహితులు స్వామి వారికి అర్చనలు చేస్తారు. అనంతరం రథోత్సవం జరుగుతుంది. ► 8న గొరవయ్యల ఆటలు, గొలుసు తెంపుట, దేవదాసీల క్రీడోత్సవం, సాయంత్రం వసంతోత్సవం, కంకణ విసర్జన ఉంటాయి. ► 9న మాళమల్లేశ్వర స్వామి విగ్రహాలు నెరణికి గ్రామానికి చేరడంతో ఉత్సవాలు ముగుస్తాయి. ఇదీ చదవండి: దేవరగట్టుకు భక్తులు కర్రలతో ఎందుకొస్తారంటే...! -
కర్నూలు జిల్లా దేవరగట్టులో బన్నీ ఉత్సవం
-
దేవరగట్టు.. భక్తులు కర్రలతో ఎందుకొస్తారంటే...!
హొళగుంద: రాష్ట్రంలోనే ప్రత్యేకతను చాటుకుంటున్న దసరా బన్ని ఉత్సవానికి దేవరగట్టు సిద్ధమైంది. విజయదశమి పండుగను పురస్కరించుకుని బుధవారం అర్ధరాత్రి మాత మాళమ్మకు, మల్లేశ్వరునికి కల్యాణం నిర్వహించనున్నారు. అనంతరం జైత్రయాత్ర కొనసాగనుంది. భక్తులు డిర్ర్..ర్ర్... గోపరక్... బహుపరాక్ అంటూ కర్రల సమరం నిర్వహించనున్నారు. వేడుకలను తిలకించేందుకు రాష్ట్ర నలుమూలల నుంచే కాకుండా పొరుగున ఉన్న కర్ణాటక, తెలంగాణ రా ష్ట్రాల నుంచి భారీగా భక్తులు తరలిరానున్నారు. ఉత్సవం జరుగుతుందిలా.. దేవరగట్టు పరిసర గ్రామాలు నెరణికి, నెరణికి తండా, కొత్తపేట గ్రామస్తులు చెరువుకట్ట (డొళ్లిన బండే)వద్దకు చేరి వర్గ వైషమ్యాలు, కక్షలు, కార్పణ్యాలు లేకుండా కలిసికట్టుగా ఉత్సవాన్ని జరుపుకుందామని పాలబాస తీసుకుంటారు. కల్యాణోత్సవానికి వస్తున్నట్లు సూచనగా గ్రామపెద్దలు పోలీసులకు బండారాన్ని ఇస్తారు. అనంతరం బాణసంచా పేల్చి కర్రలు, అగ్గి కాగడాలు చేతపట్టుకొని మేళతాళాలతో కాడప్ప మఠానికి చేరుకుంటారు. అక్కడున్న మల్లేశ్వరుని ఉత్సవ విగ్రహాన్ని కొండపైకి తీసుకెళ్తారు. ఆలయంలో మాతమాళమ్మ, మల్లేశ్వరునికి కల్యాణోత్సవం జరిపిస్తారు. అనంతరం జెత్రయాత్ర కొనసాగుతుంది. మొగలాయిలో భక్తుల చేతుల్లో ఉన్న కర్రలు తగిలి, పైకి విసిరిన అగ్గి కాగడాలు మీద పడి చాలా మంది గాయపడ్తారు. గాయపడినవారికి స్వామివారికి చల్లే పసుపు (బండారం) అంటిస్తారు. అనంతరం జైత్రయాత్ర ముల్లబండ, పాదాలగట్టు, రక్షపడికి చేరుకుంటుంది. రక్త సంతర్పణ ఉత్సవ విగ్రహాలు రక్షపడికి చేరుకున్నాక.. అక్కడున్న రెండు రాతి గుండ్లకు కంచాభీరా వంశానికి చెందిన గొరువయ్య ఐదు చుక్కల రక్తాన్ని సమర్పిస్తాడు. కాలిపిక్కలో దబ్బణంతో ఒకవైపు నుంచి మరోవైపు లాగడంతో వచ్చే రక్తాన్ని రాతి గుండులకు విసురుతారు. ఉదయంలోపు అక్కడ రక్తపు మరకలు ఉండవని రాక్షసులు సేవిస్తారని భక్తుల నమ్మకం. భవిష్యవాణి శమీ వృక్షం నుంచి విగ్రహాలు బసవన్న గుడికి చేరుకోవడంతో పూజారి, ఆలయ ప్రధాన అర్చకుడు గిరిస్వామి భక్తులకు భవిష్యవాణి వినిపిస్తారు. ఆ సమయంలో అందరు ఒక్కసారిగా మొగలాయిని(కర్రలతో కొట్టుకోవడం) నిలిపి వేసి నిశ్శబ్దాన్ని పాటిస్తారు. రాబోయే కాలంలో వాణిజ్య పంటల ధరలు, ప్రకృతి వైపరీత్యాలు, రాజకీయ స్థితులు తదితర పరిస్థితులను పూజారి వివరిస్తారు. అనంతరం పూజారి బహుపరాక్... గోపరాక్ అనగానే విగ్రహాలు సింహాసన కట్ట వైపు ఊరేగింపుగా బయలుదేరుతాయి. ఆ సమయంలో భక్తుల మధ్య జరిగే ఊరేగింపు మరింత భయంకరంగా ఉంటుంది. అప్పుడే చాలామంది భక్తులు గాయాలపాలవుతారు. విగ్రహాలు సింహాసన కట్టకు చేరుకోవడంతో జైత్రయాత్ర ముగుస్తుంది. భారీగా పోలీస్ బందోబస్తు బన్ని ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించేందుకు భారీ బందోబస్తు ఏర్పాటు చేయనున్నారు. ఆదోని, నంద్యాల, కర్నూలు, డోన్ తదితర ప్రాంతాలకు చెందిన డీఎస్పీలు, సీఐలు, ఎస్ఐలతో కలిసి 800 మంది సివిల్ పోలీసులు, ప్రత్యేక బలగాలు, మహిళా పోలీసులు బందోబస్తు నిర్వహించనున్నారు. అలాగే 200 మంది స్పెషల్ పార్టీ పోలీసులతో నిఘా ఏర్పాటు చేయనున్నారు. అల్లర్లకు పాల్పడే వారిని గుర్తించడానికి 120కు పైగా సీసీ, 4 డ్రోన్ కెమెరాలు వినియోగించనున్నారు. పోలీస్ కంట్రోల్ రూం ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షంచనున్నారు. ఉత్సవ వివరాలు ► ఈ నెల 5వ తేదీ బుధవారం రాత్రి స్వామి వారి కల్యాణోత్సవం ► బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత జైత్రయాత్ర మొదలు ► 6వ తేదీ ఉదయం నెరణికి గ్రామ ఆలయ పూజారి భవిష్యవాణి వినిపిస్తారు ► 7వ తేదీ నెరణికి గ్రామ పురోహితులు స్వామి వారికి అర్చనలు చేస్తారు. అనంతరం రథోత్సవం జరుగుతుంది. ► 8న గొరవయ్యల ఆటలు, గొలుసు తెంపుట, దేవదాసీల క్రీడోత్సవం, సాయంత్రం వసంతోత్సవం, కంకణ విసర్జన ఉంటాయి. ► 9న మాళమల్లేశ్వర స్వామి విగ్రహాలు నెరణికి గ్రామానికి చేరడంతో ఉత్సవాలు ముగుస్తాయి. భక్తులు కర్రలతో ఎందుకొస్తారంటే... పురాతన కాలంలో విష పురుగులు, జంతువుల బారి నుంచి రక్షణ పొందేందుకు దివిటీలు, కట్టెలతో భక్తులు కొండపైకి వెళ్లేవారు. మంచి జరుగుతుందనే ఉద్దేశంతో భక్తులు తమ చేతిలో ఉన్న కర్రలతో దేవుడి విగ్రహాలను తాకేందుకు పోటీ పడతారు. ఈ సమయంలో కర్రలు తగులుకుని శబ్దం వస్తుంది. నాటుసారా, మద్యం సేవించిన వారు చేతిలోని కర్రలు స్వాధీనంలో లేకుండా మరొకరికి తగిలి గాయాలవుతాయి. గతంలో కొందరు ఉద్దేశపూర్వకంగా గుంపులో కొట్టుకునేందుకు ప్రయత్నించే వారు. ఇది రక్తపాతానికి కారణమయ్యేది. అధికారులు, ప్రజాప్రతినిధులు అవగాహన కల్పించడంతో ప్రజల్లో చైతన్యం వచ్చింది. సంప్రదాయం ప్రకారం ఉత్సవం జరుపుకుంటున్నారు. 144 సెక్షన్ అమలు దేవరగట్టుతో పాటు పరిసర గ్రామాల్లో ఈ నెల 9వ తేదీ వరకు 144 సెక్షన్ అమలులో ఉంటుంది. పోలీసు నిబంధనలను పాటిస్తూ పండుగను జరుపుకోవాలి. శాంతిభద్రతలకు విఘాతం కలగకూడదనే ఉద్దేశంతో ఇప్పటికే 200 మందిపై బైండోవర్ కేసులు నమోదు చేశాం. – అబ్దుల్‌జహీర్, ఎస్ఐ, హొళగుంద -
దేవరగట్టులో కర్రల సమరం
-
కర్నూలు: దేవరగట్టు బన్ని ఉత్సవం రద్దు
-
దేవర గట్టు టెన్షన్
-
వివాదంలో బన్నీ ఫైట్
-
జపాన్‌లో దేవరగట్టు
ఆచారం కర్నూలు జిల్లా దేవరగట్టు మాల మల్లేశ్వరస్వామి జాతరలో మూల విరాట్టును దక్కించుకోవడానికి కట్టెలతో కొట్టుకునే ఆచారం ఉందని మనకు తెలుసు. ఐదారు గ్రామాల ప్రజలు అర్ధరాత్రి కట్టెలు కాగడాలు చేతపట్టి బీభత్సంగా పరస్పరం దాడి చేసుకోవడం గురించి విన్నాం. ప్రాణాల మీదకు తెచ్చుకున్నవారు కూడా ఉన్నారు. జపాన్‌లో కూడా సరిగ్గా ఇలాంటి ఉత్సవమే ఒకటి ఉంది. దీని పేరు ‘హడాకా మట్సురీ’. లేదా ‘బరిబిత్తల ఉత్సవం’ అని కూడా అంటారు. జపాన్‌లోని ఒకాయమా నగరంలోని ఒక గుడిలో ఈ ఉత్సవం ప్రతి ఏటా ఫిబ్రవరి నెలలో జరుగుతుంది. దాదాపు పదివేల మంది మగవాళ్లు ఈ ఉత్సవానికి హాజరవుతారు. మగపిల్లలు కూడా పాల్గొనవచ్చు. గుడిలోకి చేరిన వారందరూ బట్టలు విప్పేసి కేవలం గోచిపాతలు మాత్రమే కట్టుకుంటారు. ఫిబ్రవరి వారికి చలి సమయం. అలాంటి గడ్డ కట్టించే చలిలో కూడా ఒంటి మీద లేశమాత్రపు దుస్తులతో ఉత్సవానికి సిద్ధమవుతారు. అందరూ గుడిలోకి చేరాక ప్రధాన పూజారి వస్తాడు. తన చేతిలోని కొన్ని ‘అదృష్ట పుల్లల’ను వారికి చూపిస్తాడు. లైట్లు ఆఫ్ అవుతాయి. చీకట్లో పూజారి ఆ పుల్లలను గుంపులో విసురుతాడు. వెంటనే లైట్లు ఆన్ అవుతాయి. ఇక మగ వాళ్లందరూ ఆ పుల్లల కోసం ఒకరితో ఒకరు బాహాబాహీగా తలపడతారు. వాటిని దక్కించుకున్నవారికి అదృష్టం వరిస్తుందనీ మరుసటి సంవత్సరం పండగ వరకు సంతోషంగా గడిచిపోతుందని నమ్మకం. ఈ ఉత్సవం జపాన్‌లో 500 ఏళ్లుగా జరుగుతుంది. అయితే దేవరగట్టులో లాగా మరీ రక్తపాతం వచ్చేలా ఇక్కడ కొట్టుకోరు. బాహాబాహీకి దిగినా గాయాలు, ఎముకలు విరగ్గొట్టుకోవడాలు ఇప్పటి దాకా జరగలేదు. సరదా, పట్టుదల మాత్రం తప్పనిసరిగా ఉంటాయి. ఈ సంవత్సరం ఈ ఉత్సవం ఇటీవల జరిగింది. అందరూ ఉత్సాహంగా పాల్గొన్నారు. కొందరికి మాత్రమే అదృష్టపుల్లలు దొరికినా ఇలా ఉత్సవాన్ని దర్శించే అదృష్టం మాత్రం మనందరికీ దక్కింది. -
దేవరగట్టు దసరా సంబరం
-
అంబరాన్నింటిన సంబరం
- దేవగరట్టులో ఉత్కంఠగా సాగిన గొలుసు తెంపు కార్యక్రమం - గొరువయ్యల ఢమురుక శబ్దంతో హోరెత్తిన క్షేత్రం - ఆకట్టుకున్న దేవదాసీల క్రీడోత్సవం - భారీగా తరలివచ్చిన భక్తులు - నేటితో ముగియనున్న ఉత్సవాలు హొళగుంద/ఆలూరు రూరల్: దేవరగట్టు దసరా ఉత్సవాల సంబరం అంబరాన్నింటింది. ఉత్సవంలో భాగంగా శుక్రవారం గొరువయ్యల నృత్యాలు, దేవదాసీల క్రీడోత్సవాలను చూసేందుకు తరలివచ్చిన భక్తులతో క్షేత్రం పరిసరాలు కిటకిటలాడాయి. హాలహర్వి మండలం బల్లూరుకు చెందిన గొరువయ్య గాదిలింగప్ప ఒకే దెబ్బకు ఇనుప గొలుసును తెంపేసాడు. దాదాపు 20 కేజీలు గొలుసును ఒకే దెబ్బకు తెంపండంతో భక్తులు గొరువయ్యను అభినందించారు. అంతకు ముందు గొరువయ్యలు చేసిన ఢమురుకల శబ్దంతో దేవరగట్టు హోరెతింది. సింహాసన కట్టమీద అదిష్టించిన శ్రీమాళమల్లేశ్వరస్వామి ఉత్సవ విగ్రహాల ఎదుట ఈ కార్యక్రమాలు కొనసాగాయి. క్షేత్ర పరిసరాల గ్రామాల నుంచే కాకుండా, కర్ణాటక రాష్ట్రం నుంచి భారీ సంఖ్యలో తరలి వచ్చిన గొరవయ్యలు తమ సంప్రదాయ నృత్యాలను ప్రదర్శించారు. పిల్లనిగ్రోవి ఊదుతూ, త్రిశూలం చేతబట్టి, ఢమురకులను ఆడిస్తూ లయబద్దంగా నృత్యం చేశారు. సాయంత్రం వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన దేవదాసిల క్రీడోత్సవం, వసంతోత్సవం, కంకణ విసర్జన కార్యక్రమాలతో విగ్రహాల ఊరేగింపుతో కొండ పైనున్న ఆలయానికి చేరుకున్నాయి. శనివారం సాయంత్రం విగ్రహాలు నెరణికి గ్రామానికి చేరడంతో ఉత్సవాలు ముగుస్తాయి. ఉత్సవంలో ఎఽలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ఆలూరు సీఐ శంకరయ్య, ఎస్ఐలు మారుతి, మస్తాన్‌వలి, వెంకటరమణ, కృష్ణమూర్తి బందోబస్తు నిర్వహించారు. -
'దేవరగట్టు చరిత్ర' పుస్తకం ఆవిష్కరణ
హొళగుంద: దేవరగట్టు చరిత్ర అనే పుస్తకాన్ని జిల్లా కలెక్టర్ విజయమోహన్, ఎస్పీ ఆకే రవికృష్ణ, ఆలయ కమిటీ చైర్మన్ కుమార్‌గౌడ్, టీడీపీ ఆలూరు ఇన్చార్జ్ వీరభద్రగౌడ్‌లు ఆవిష్కరించారు. ఆలయ పూజారి రెండోకుమారుడు మనోహర్‌స్వామి 130 పేజీల నిడవి గల ఈ పుస్తకాన్ని రచించారు. దేవరగట్టుకు సంబంధించి సమగ్ర చరిత్ర, స్థల విశేషం తదితర వివరాలతో కూడిన అంశాలను ఈ పుస్తకంలో ఉన్నాయి.కార్యక్రమంలో స్పెషల కలెక్టర్ సుబ్బారెడ్డి, ఆదోని ఆడ్డీఓ ఓబులేసు, డీఎస్పీ కొల్లి శ్రీనివాసులు, ఎస్సీ, ఎస్టీ సెల్ డీఎస్పీ మురళీధర్ తదితరుల పాల్గొన్నారు. -
కొనసాగిన కర్రల సమరం
-
బన్నీ ఉత్సవంలో చిందిన రక్తం
-
బన్నీ ఉత్సవంలో చిందిన రక్తం
-
రక్తమోడిన దేవరగట్టు
- కొనసాగిన కర్రల సమరం - ఒకరి పరిస్థితి ఆందోళనకరం - 30 మందికి పగిలిన తలలు - ఆరుగురికి కాలిన గాయాలు - ఫలించని అధికారుల వ్యూహం - వైభవంగా మాళమల్వేశ్వరుల కల్యాణం హొళగుంద/ఆలూరు/ఆలూరు రూరల్: దేవరగట్టులో కర్రల సమరాన్ని ఆపేందుకు జిల్లా అధికార యంత్రాంగం ముమ్మర ప్రయత్నాలు చేపట్టినా ఫలితం లేకపోయింది. దసరా సందర్భంగా మంగళవారం అర్ధరాత్రి హొళగుంద మండలంలోని దేవరగట్టు..కర్రల సమరంతో రక్తమోడింది. బన్ని ఉత్సవంలో 30 మంది భక్తులకు తలలు పగిలాయి. ఆరుగురికి కాలిన గాయాలయ్యాయి. గాయపడిన వారిలో ఆలూరు మండలం తుంబళబీడు గ్రామానికి చెందిన మఠం చిన్న తిక్కయ్య అనే భక్తుని పరిస్థితి విషమంగా ఉంది. ఆటవిక సంస్కృతికి స్వస్తి చెప్పాలని 15 రోజులుగా పోలీస్, రెవెన్యూ అధికారులు ప్రచారాన్ని నిర్వహించారు. దాదాపు 600 కర్రలను స్వాధీనం చేసుకున్నారు. సమరాన్ని అడ్డుకునేందుకు జిల్లా పోలీస్ యంత్రాంగం 1000 మంది సిబ్బందిని రంగంలోకి దించింది. అయినా వేల సంఖ్యలో కదన రంగానికి కట్టెలతో భక్తులు తరలివచ్చారు. దీంతో పోలీసులు ప్రేక్షకపాత్ర వహించాల్సి వచ్చింది. సమరం సాగిందిలా.. పోలీస్ వ్యూహ రచనలను తిప్పికొట్టేందుకు నెరణికి, నెరణికి తండా, కొత్తపేట గ్రామస్తులు బన్ని ఉత్సవాన్ని గతేడాది కంటే 20 నిమిషాల ముందే ముందే ప్రారంభించారు. అర్ధరాత్రి 11:55 గంటల సమయంలో కలిసిగట్టుగా ఉత్సవాన్ని నిర్వహించుకుందామని పాలబాస చేశారు. అనంతరం గట్టుపైకి వస్తున్నట్లుగా పెద్ద ఎత్తున బాణసంచా పేలుస్తూ, డప్పుల శబ్దంతో ఒక్కసారిగా వేలసంఖ్యలో కట్టెలను పట్టుకుని దైవసన్నిధికి చేరుకున్నారు. శ్రీ మాళమల్లేశ్వరస్వామి కల్యాణాన్ని వైభవంగా నిర్వహించారు. దేవుని విగ్రహాలను పల్లకిలో ఉంచి..కొండ దిగే సమయంలో జైత్రయాత్ర ప్రారంభమైంది. కాగడాలను చేతబట్టి, ఇనుప రింగులు తొడిగిన కర్రలను గాలిలోకి తిప్పుతూ భక్తులు నృత్యం చేస్తూ ముందుకు సాగారు. అప్పటికే మొగలాయి ఆడుతున్న అరికెర, సుళావాయి, బిలేహాల్, నిట్రవట్టి, సమ్మతగేరి, అరికెరతండా, లింగంపల్లి తదితర గ్రామాల భక్తులు ఉత్సవమూర్తుల ఊరేగింపులో కలిశారు. విగ్రహాలను మల్లప్ప గుడిలోనే సింహాసనం కట్టమీద అధిష్టించే సమయంలో కర్రలు ఆకాశంలోకి ఒక్కసారిగా లేచాయి. జైత్రయాత్రలో విగ్రహాలకు రక్షణగా నిలిచిన నెరణికి, నెరణికి తండా, కొత్తపేట మూడు గ్రామాల భక్తులు దిక్కులు కిక్కటిల్లేలా 'డ్రూర్ గొబారక్...బహూపరాక్' అంటూ నినాదాలు చేశారు. ఆ నినాదాలతో ఆ ప్రాంతం యుద్ధభూమిగా మారింది. ఏఎస్ఐకి గాయాలు.. గాయాలైన భక్తులు పసుపు(బండారం) అంటించుకుని పగిలిన తలలతోనే కర్రల సమరంలో పాల్గొన్నారు. ఈ సమరంలో అరికెర, కొత్తపేట, ఆలూరు, పెద్దహోతూరు, తుంబళబీడు గ్రామాలకు చెందిన రంగయ్య, ఈరప్ప, మఠం చిన్నతిక్కయ్యతో పాటు మరో 27 మందికి తలలు పగిలాయి. జయరాముడు, శివతో పాటు మరో నలుగురి భక్తులకు కాలిన గాయాలయ్యాయి. ఉత్సవానికి బందోబస్తుగా వచ్చిన తియోఫిలాస్ అనే ఏఎస్ఐ (ఏఆర్) మీదకు భక్తులు ఒక్కసారిగా దూసుకొచ్చారు. ఆయన భయాందోళనకు గురై కిందికి పడిపోయాడు. గాయపడిన ఏఎస్ఐని పోలీస్‌సిబ్బంది తాత్కాలికంగా ఏర్పాటు చేసిన 20 పడకల ఆస్పత్రిలో చేర్చారు. బన్ని ఉత్సవంలో గాయపడిన భక్తులను, ఉత్సవాలకు వచ్చి వివిధ కారణాలచేత అస్వస్థతకు గురైన సిబ్బందిని జిల్లా కలెక్టర్ విజయ్‌మోహన్, జిల్లా ఎస్పీ ఆకె రవికృష్ణ పరామర్శించారు. తాత్కాలికంగా ఏర్పాటు చేసిన 20 పడకల ఆస్పత్రిలో వైద్యసేవలను డీఎంఅండ్‌హెచ్‌ఓ స్వరాజ్యలక్ష్మి, డిప్యూటీ డీఎంఅండ్‌హెచ్‌ఓ శ్రీదేవిని వారు ప్రత్యేకంగా అడిగి తెలుసుకున్నారు. రక్త సంతర్పణ కర్రల సమరం పాదాల గట్టు, ముండ్లబండ మీదుగా ఆలయానికి సుమారు 4 కి.మీ. దూరంలోనే దట్టమైన అడవిలో ఉన్న రాక్షసపడి( పెద్ద గుండ్లు) వద్దకు చేరుకుంది. భయంకరమైన వాతావరణంలో కంచాభీర వంశానికి చెందిన భక్తుడు తమ ఎడమకాలు తొడలో దబ్బణం గుచ్చుకుని అక్కడి నుంచి వచ్చిన రక్తాన్ని మని, మళ్లాసురులుగా పిలిచే రాతి గుండ్లకు సమర్పించాడు. అక్కడి నుంచి శమీ వృక్షం మీదకు చేరుకున్న మాళమల్లేశ్వరుల విగ్రహ మూర్తులకు పూజలనంతరం ఎదురుబసవన్న గుడి వద్దకు తీసుకొచ్చారు. భవిష్యవాణి ఎదురుబసవన్న గుడి దగ్గర ఆలయ ప్రధాన అర్చకులగా వ్యవహరించే కుటుంబంలో ఒకరైన గిరిస్వామి గుడి పైకెక్కి భవిష్యవాణిని వినిపించారు. ఈ ఏడాది వివిధ పంటలకు గిట్టుబాటు ధరలో హెచ్చు తగ్గులో ఉంటుందన్నారు. పత్తి క్వింటం ధర రూ.4 వేలు పైగా, జొన్న రూ.1600కు పైగా ధర పలుకుతుందని ఆయన చెప్పారు. వర్షాలు ఎక్కువగా ఒకే వైపు కురుస్తాయని చెప్పారు. నిత్యావసర సరుకుల ధరలు, పంటల దిగుబడుల ధరలు కూడా పెరుగుతాయని ఆయన జోస్యం చెప్పారు. తగ్గిన భక్తుల రద్దీ సమరాన్ని తిలకించేందుకు కర్ణాటక, మహారాష్ట్ర నుంచి వేల సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. గతేడాది కన్నా ఈ యేడాది ఉత్సవాన్ని తిలకించేందుకు వచ్చిన భక్తుల సంఖ్య స్వల్పంగా తగ్గింది. బన్ని ఉత్సవంలో పాల్గొనే దాదాపు 15 గ్రామాల్లో మొహర్రం జరుగుతండడమే ఇందుకు కారణం. స్వామిని దర్శించుకున్న కలెక్టర్, ఎస్పీ కుటుంబ సభ్యులు మాళమల్లేశ్వరస్వామి బన్ని ఉత్సవాలకు కలెక్టర్ సీహెచ్ విజయ్‌మోహన్ దంపతులు, జిల్లా ఎస్పీ ఆకె రవికృష్ణ దంపతులు హాజరయ్యారు. స్వామి వారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. అక్కడే ఉండి బన్ని ఉత్సవాన్ని తిలకించారు. – నేడు రథోత్సవం మాళమల్లేశ్వరస్వామి రథోత్సవాన్ని గురువారం వైభవంగా నిర్వహించనున్నారు. రథోత్సవంలో భాగంగా ఉదయం నెరణికి గ్రామ భక్తుల ఆధ్వర్యంలో పురోహితులు స్వామివారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు. డ్రోన్ పర్యవేక్షణ.. బన్ని ఉత్సవంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా డ్రోన్ ద్వారా పోలీస్ ఉన్నతాధికారులు ప్రత్యేకంగా పర్యవేక్షించారు. దానికితోడు మాళమల్లేశ్వరస్వామి సన్నిధానంలో ప్రత్యేక పోలీస్ కంట్రోల్ రూంను ఏర్పాటు చేశారు. బన్ని ఉత్సవం జరిగే ప్రదేశంలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. సాక్షి దినపత్రికలో ప్రచురితమైన 'బన్ని ఉత్సవం.. సమస్యల సమరం' అనే కథనానికి జిల్లా అధికారులు స్పందించి ఈ మేరకు చర్యలు తీసుకున్నారు. గాయపడిన భక్తుల కోసం ఇరవై పడకల ఆస్పత్రిని అనుకూలమైన ప్రదేశానికి మార్చారు. ఎక్సైజ్ పోలీసులు వెయ్యిమంది దాక గస్తీ నిర్వహిస్తూ నాటుసారా విక్రయాలను పూర్తిగా అరికట్టారు. -
దేవరగట్టు..ఆచారానిదే పైమెట్టు
-
దేవరగట్టు..ఆచారానిదే పైమెట్టు
- నేడు జైత్రయాత్ర - అర్ధరాత్రి సంప్రదాయ సమరం - పోలీసుల భారీబందోబస్తు హొళగుంద/ఆలూరు రూరల్: కర్రల సమరానికి దేవరగట్టు సిద్ధమైంది. విజయదశమి పర్వదినాన ప్రతి ఏటా ఇక్కడ బన్ని ఉత్సవం జరుగుతుంది. జైత్రయాత్ర పేరుతో కర్రలతో ఒకరిపై ఒకరు దాడులు చేసుకుంటారు. పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించినా ఇక్కడ సంప్రదయానిదే పైమెట్టు అవుతోంది. దేవరగట్టులోని మాళమల్లేశ్వర స్వామి కల్యాణమహోత్సవం మంగళవారం అత్యంత వైభవంగా జరగనుంది. తర్వాత నెరణికి, నెరణికితండా, కొత్తపేట గ్రామాల భక్తులు కొండపై ఉన్న ఉత్సవ విగ్రహాలను పల్లకిలో కొండ కిందకు తీసుకొస్తారు. ఆ సమయంలో వేలాదిమంది భక్తులు జైత్రయాత్ర నిర్వహిస్తారు. జైత్రయాత్ర నిర్వహించే సమయంలో దేవుని పల్లకి ముందుకు తీసుకెళ్లే పేరుతో భక్తులు కర్రలతో సమరం చేస్తారు. అలా ఆ యాత్ర దేవరగట్టు అటవీప్రాంతంలో ఉన్న ముండ్లబండ వద్దకు వెళ్తుంది. అక్కడి నుంచి మాళమల్లేశ్వరస్వామి తిరుగాడిన పాదాలగట్టు ప్రాంతానికి చేరుకుంటుంది. ఆ ప్రాంతం నుంచి రక్షపడి(రాక్షసగుండ్లు) వద్దకు వెళ్లి అక్కడ గొరవయ్య తనతొడ రక్తాన్ని ఆ గుండ్లకు రాస్తారు. ఆ తర్వాత అక్కడి నుంచి పాదయాత్రగా భక్తులు శమీవృక్షం కిందకు చేరుకుంటారు. అక్కడ కర్రలను, పల్లకిని కిందకు దించి పూజలు నిర్వహిస్తారు. అలా కొనసాగిన జైత్రయాత్ర శనివారం తెల్లవారుజామున దేవరగట్టు కొండకింద ఉన్న ఎదురుబసవన్న గుడిపైకి ఎక్కి పూజారి గిరిస్వామి భవిష్యవాణి వినిపిస్తారు. సమాధానం లేని ప్రశ్నలు ఉత్సవ విగ్రహాలను తీసుకెళ్లే పేరుతో నెరణికి, నెరణికితండా, కొత్తపేట గ్రామాల ప్రజలు డుర్రు... డుర్రు.. గోబారక్ బహూపరాక్ అంటూ ముందుకొస్తారు. ఆ సమయంలో మరికొన్ని గ్రామాల ప్రజలు మధ్యలోకి వెళ్తారు. ఉత్సవ విగ్రహాలను ముందుకు తీసుకెళ్లేందుకు మాత్రమే తాము రక్షణగా కర్రలను ఉపయోగిస్తున్నామని వారు పేర్కొంటున్నారు. ఉత్సవ విగ్రహాలను మూడు గ్రామాలు మినహా ఏ గ్రామాల ప్రజలు వాటిని ఎత్తుకెళ్లరని వారే పేర్కొంటున్నారు. అయితే మరి ఎందుకు కర్రల సమరం జరుగుతుందో భక్తుల తలలు ఎందుకు పగులుతాయో అనే ప్రశ్నలకు గత కొన్నేళ్లుగా సమాధానాలే లేవు. క్రూర మృగాల దాడి చేస్తాయనే.. దేవరగట్టు మాళమల్లేశ్వరస్వామి వెలసిన కొండప్రాంతం దాదాపు 40 కి.మీ. వరకు విస్తరించిన దట్టమైన అడవిలో ఉంది. అడవిలో క్రూరమృగాల దాడి నుంచి తమను తాము కాపాడుకునేందు పూర్వం భక్తులు పెద్దపెద్ద బరిసెలు, రింగులు తొడిగిన కర్రలను తీసుకెళ్లే వారు. కాలక్రమేణా ఆ సంప్రదాయం ఇప్పటికీ కూడా వస్తుందని భక్తులు అంటున్నారు. ప్రస్తుతం మారుణాయుధాలను వదిలి బన్ని ఉత్సవంలో కర్రలను ధరించి ఉత్సవ విగ్రహాల జైత్రయాత్ర ముందుకు సాగేలా చూస్తున్నామని భక్తులు చెబుతున్నారు. ఇవీ దుర్ఘటనలు.. మాళమల్లేశ్వరస్వామి బన్ని ఉత్సవాల్లో ప్రతి ఏటా పలువురు గాయపడుతున్నారు. ఉత్సవాలను తిలకించేందుకు వచ్చి వివిధ కారణాల ఐదు సంవత్సరాల్లో ఇద్దరు మరణించారు. రెండేళ్ల క్రితం భక్తుల తొక్కిసలాటలో నెరణికి గ్రామానికి చెందిన ఒక బాలుడు మృతిచెందాడు. గాయపడిన వారు: 2010–11లో130 మంది, 2011–12లో 121 మంది, 2012–13లో 140 మంది, 2013–14లో 119 మంది, 2014–15లో కేవలం 103 మంది, 2015–16లో 57 మంది భక్తులు గాయపడ్డారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూస్తాం: కొల్లి శ్రీనివాసరావు, ఆదోని డీయస్పీ బన్ని ఉత్సవాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూస్తాం. గతేడాదితో పోలిస్తే ఈ యేడాది పోలీస్ బందోబస్తు కూడా పెరిగింది. గత రెండేళ్లుగా ఉత్సవాల్లో రింగులు తొడిగిన కర్రలను ఉపయోగించకుండా, మద్యానికి దూరంగా ఉండాలని అవగాహన సదస్సులు కూడా నిర్వహించాం. ఈ యేడాది ఉత్సవాల్లో అల్లరిమూకలను గుర్తించేందుకు ప్రత్యేకంగా డ్రోన్ కెమెరాలను ఏర్పాటు చేశాం. ఉత్సవాలు జరిగే ప్రదేశంలో 30 సీసీ కెమెరాలను కూడా అమర్చాం. సంప్రదాయం పేరుతో ఘర్షణకు దిగే వారిని కఠినంగా శిక్షిస్తాం. ఏర్పాట్లు పూర్తి– ఓబులేస్, ఆదోని ఆర్డీఓ బన్ని ఉత్సవాలకు వచ్చే భక్తులకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. తాగునీటి సమస్య లేకుండా చర్యలు తీసుకుంటున్నాం. ఉత్సవం జరిగే ప్రదేశంలో విద్యుత్ కోతలు లేకుండా ప్రత్యేక జనరేటర్లను కూడా ఏర్పాటు చేసి ఉత్సవం జరిగే చోట ఉత్సవాలను తిలకించే భక్తులపై అగ్గి దివిటీలను, కర్రలతో దాడులు చేయకుండా ఉండేలా కూడా తగు జాగ్రత్తలు తీసుకుంటున్నాం. కరెంట్ కోతలు లేకుండా కూడా ట్రాన్స్‌కో అధికారులను ఆదేశించాం. సంప్రదాయ సమరమే– మల్లికార్జున, నెరణికి గ్రామసర్పంచు బన్ని ఉత్సవం కేవలం సంప్రదాయ సమరమే. కొన్నేళ్లుగా నెరణికి, నెరణికితండా, కొత్తపేట గ్రామ భక్తులు అత్యంత భక్తిశ్రద్ధల నడుమ ఉత్సవాలను జరుపుకుంటారు. కల్యాణోత్సవం తర్వాత దేవుళ్లను ఊరేగింపుగా మూడు గ్రామాల ప్రజలు ఊరేగింపుగా తీసుకెళ్లే టప్పుడు ఇతర గ్రామాల ప్రజలు జైత్రయాత్రలో పాల్గొంటారు. అప్పుడు ఉత్సవ విగ్రహాలను ముందుకు తీసుకెళ్లేందుకు దేవుళ్లకు రక్షణగా వచ్చే భక్తులు కర్రలను గాలిలో తిప్పుతారు. ఆ సమయంలో భక్తులు ప్రమాదవశాత్తు గాయపడతారు. -
దేవరగట్టుపై డ్రోన్లతో నిఘా
-
దేవరగట్టుపై డ్రోన్లతో నిఘా
కర్నూలు జిల్లా హొళగుంద మండలం దేవరగట్టుపై ఈనెల 11న జరిగే ‘బన్ని’ ఉత్సవానికి అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఏటా జరిగే ఈ ఉత్సవంలో భాగంగా మాలమల్లేశ్వరస్వామి ఉత్సవమూర్తులను గ ట్టుపైకి చేర్చే క్రమంలో గ్రామస్తులు కర్రలతో కొట్టుకోవటం ఆనవాయితీగా వస్తోంది. ఈ ఘర్షణలో పలువురు గాయపడుతుంటారు. ఒక్కోసారి ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నారు. దీనిని ఆపాలని అధికార యంత్రాంగం ప్రయత్నించినా సఫలం కాలేకపోయింది. ఈ నేపథ్యంలోనే ఉన్నతాధికారులు పలు చర్యలు ప్రకటించారు. రేపు సాయంత్రం నుంచి ప్రారంభమయ్యే కార్యక్రమంలో భక్తులు తెచ్చే కర్రలకు ఇనుపచువ్వలు బిగించకుండా చూస్తున్నారు. అంతేకాదు, డ్రోన్లు, సీసీ కెమెరాలను వినియోగించి ఎప్పటికప్పుడు పరిస్థితిని అంచనావేసి, అవసరమైతే పోలీసులు రంగప్రవేశం చేసి ఘర్షణ పరిస్థితులను నివారించనున్నారు. ఉత్సవం జరిగే చుట్టుపక్కల ప్రాంతాల్లో మద్యపానం విక్రయాలను నిషేధించారు. గాయపడిన వారికి వెంటనే చికిత్స అందించేందుకు వైద్య శిబిరాలను ఏర్పాటు చేశారు. దాదాపు 1300 మంది పోలీసులను ఇక్కడ మోహరించనున్నారు. -
బన్ని ఉత్సవాల్లో అప్రమత్తంగా ఉండాలి
అధికారులతో సమీక్షాసమావేశంలో ఆదోని ఆర్డీవో, డీఎస్పీ హోళగుంద : దేవరగట్టు బన్ని ఉత్సవాల్లో విధులు నిర్వహించే అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఆదోని ఆర్డీ ఓబులేశు, డీఎస్పీ కొల్లి శ్రీనివాసులు సూచించారు. ఆదివారం దేవరగట్టులో వివిధ శాఖల అధికారులతో వారు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈనెల 11న జరిగే బన్ని ఉత్సవాలకు జిల్లా కలెక్టర్ సీహెచ్ విజయమోహన్, డీఐజీ రమణకుమార్, ఎస్పీ ఆకే రవికృష్ణ హాజరవుతారన్నారు. ఉత్సవాలకు వచ్చే భక్తులకు సేవలందించడానికి కమాండ్ కంట్రోల్ రూం ఏర్పాటు చేశామన్నారు. వాహనాల పార్కింగ్ తాగునీరు, విద్యుత్ తదితర సౌకర్యాలు ఏర్పాటు చేయాలని డీఎల్పీఓ ఎలిసాకు ఆర్డీఓ సూచించారు. ఉత్సవాల విజయవంతానికి ఉపాధి మేటీలను వలంటీర్లుగా నియమించాలన్నారు. నాటుసారా విక్రయం జరగకుండా ఎక్సైజ్ అధికారులు ముందస్తుగా తనిఖీలు చేపట్టాలని సూచించారు. హెల్త్ క్యాంప్‌లో అన్నిరకాల మందులు సిద్ధంగా పెట్టుకోవాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఎక్సైజ్ ఏఎస్పీ ఫియాజుద్ధీన్, తహసీల్దార్ సతీష్, ఎంపీడీఓ నాగేశ్వరరావు, సీఐ శంకరయ్య, ఎస్ఐలు మారుతి, ధనుంజయ, కృష్ణమూర్తి, వలి తదితరులు పాల్గొన్నారు. -
దేవరగట్టులో కంట్రోల్ రూం ఏర్పాటు
హొళగుంద: దేవరగట్టు కొండల్లో ఈ నెల 11న జరిగే దసరా బన్ని మహోత్సవాల సందర్భంగా కంట్రోల్ రూంను ఏర్పాటు చేసినట్లు ఎంపీడీఓ నాగేశ్వరరావు శనివారం విలేకరులకు తెలిపారు. మండలానికి నోడల్ ఆఫీసర్‌గా ఉన్న స్పెషల్ కలెక్టర్ సుబ్బారెడ్డి(98499 94521), ఆదోని ఆర్డీఓ ఓబులేసు(98499 04164), ఆదోని డీఎస్పీ కొల్లి శ్రీనివాసరావు(94407 95555), ఎండోమెంట్ అసిస్టెంట్ కమిషనర్(94910 00679), ఎక్సైజ్ శాఖాధికారులతో పాటు.. హొళగుంద, ఆలూరు, చిప్పగిరి, హాలహర్వి తహసీల్దార్లు, ఎంపీడీఓలు, ఆర్డబ్ల్యూఎస్, పీఆర్ అధికారులు మొత్తం దాదాపు 50 మంది సిబ్బంది ఈ కంట్రోల్ రూంలో అందుబాటలో ఉంటారన్నారు. భక్తులకు ఇబ్బంది కలిగినా, అసౌకర్యాలుంటే అధికారుల దృష్టికి తీసుకురావాలన్నారు. -
దేవరగట్టు బందోబస్తుకు సిద్ధంకండి
– పెరేడ్ పరిశీలనలో సిబ్బందికి ఎస్పీ ఆదేశం కర్నూలు: దేవరగట్టు బన్ని ఉత్సవంలో బందోబస్తుకు సిద్ధం కావాలని ఎస్పీ ఆకే రవికృష్ణ పోలీసు సిబ్బందికి సూచించారు. జిల్లా పోలీసు కార్యాలయంలో పెరేడ్ మైదానంలో సివిల్, ఏఆర్ పోలీసులు శుక్రవారం నిర్వహించిన పెరేడ్‌కు ఎస్పీ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బన్ని ఉత్సవాల్లో భక్తుల పట్ల మర్యాదగా మసలుకోవాలని సూచించారు. సాంకేతిక టెక్నాలజీతో సీసీ కెమెరాలను అమర్చుతున్నామని, ఉత్సవ కార్యక్రమం మొత్తం కెమెరాలతో నిఘా ఏర్పాటు చేశామన్నారు. డీజీపీ ప్రారంభించిన పోలీసు సేవాదళ్ సేవలను బన్ని ఉత్సవాల్లో వినియోగించుకుంటున్నట్లు వెల్లడించారు. చిన్నపిల్లలు, వికలాంగులు, వృద్ధుల పట్ల సేవాదళ్ సభ్యులు జాగ్రత్తలు తీసుకుంటూ ఏవైనా సమస్యలు ఉంటే కంట్రోల్ రూమ్‌కు తెలియజేయాలన్నారు. ఆకతాయిల పట్ల నిఘా ఉధృతం చేసి ముందస్తుగా బైండోవర్ కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. అతివేగం, నిర్లక్ష్యం, సెల్‌ఫోన్ డ్రైవింగ్ చేయడం చట్ట వ్యతిరేకమని డ్రైవర్లకు అవగాహన కల్పించాలన్నారు. అనాథ పిల్లలు ఎక్కడైనా కనిపిస్తే ఐసీడీఎస్‌కు అప్పగించాలని సూచించారు. ఏఆర్ అడిషనల్ ఎస్పీ వెంకటేష్, డీఎస్పీలు రమణమూర్తి, వెంకటాద్రి, సీఐ నాగరాజరావు, డేగల ప్రభాకర్‌రావు, మధుసూదన్‌రావు, ఆర్ఐలు రంగముని, జార్జి తదితరులు పాల్గొన్నారు. -
కర్రల సమరానికి స్వస్తి పలుకుదాం
– లోకాయుక్త ఆదేశాలను అమలు చేద్దాం – సమస్యాత్మక ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు – కలెక్టర్ విజయమోహన్ కర్నూలు(అగ్రికల్చర్): విజయదశిమి రోజున దేవరగట్టు మాలమల్లేశ్వర స్వామి సన్నిధిలో జరిగే బన్నీ ఉత్సవంలో కర్రల సమరానికి స్వస్తి పలుకుదామని జిల్లా కలెక్టర్ సీహెచ్ విజయమోహన్ అన్నారు. సోమవారం ఉదయం కలెక్టరేట్ కార్యాలయంలో బన్నీ ఉత్సవాలపై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని బన్నీ ఉత్సవాల్లో ఎలాంటి హింసాత్మక సంఘటనలు లేకుండా ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు చుట్టు పక్కల గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. క్షేత్రంలో సమస్యాత్మకంగా గుర్తించిన 100 ప్రదేశాల్లో అక్టోబరు 1వ తేదీ నుంచి సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని తెలిపారు. బన్నీ ఉత్సవాలు ప్రశాంతంగా జరుపాలని లోకాయుక్త ఆదేశాలు ఉన్నాయని, ఈ మేరకు భక్తులు సంప్రదాయం ప్రకారం వేడుకలు నిర్వహించాలన్నారు. కర్రల సమరానికి స్వస్తి పలికే విధంగా కళజాత బృందాల ద్వారా అవగాహన కార్యక్రమాలు చేపట్టాలన్నారు. హాలహర్వి, హŸళగొంద మండలాల్లోని నెరణికి, నెరణికి తండా, అరికెర, అరికెర తండా, తదితర 13 గ్రామాల్లో ప్రజల్లో చైతన్యం తేవాలన్నారు. మాస్టర్ కంట్రోల్ రూము, లైటింగ్ తదితర ఏర్పాట్లను పకడ్బందీగా చేపట్టాలని ఆదోని ఆర్డీఓను ఆదేశించారు. అక్రమ మద్యం వ్యాపారాన్ని పూర్తిగా అరికట్టాలని, నాటుసారా బట్టీలను ధ్వంసం చేయాలని ఎకై ్సజ్ అధికారులను ఆదేశించారు. సారా, మద్యం రవాణను అరికట్టేందుకు చెక్‌పోస్టులు ఏర్పాటు చేయాలన్నారు. అన్ని రకాల పరికరాలతో వైద్యశిబిరాన్ని ఏర్పాటు చేయాలని డీఎంహెచ్ఓను ఆదేశించారు. దేవరగట్టు, నెరణికి తండా, కొత్తపేట గ్రామాల్లో 3.6 కిలో మీటర్ల దారిని సీసీ రోడ్డుగా అభివృద్ధి చేసే పనులను వచ్చే నెల5లోపు పూర్తి చేయాలన్నారు. జిల్లా ఎస్పీ ఆకె రవికృష్ణ మాట్లాడుతూ ఈ ఏడాది ప్రత్యేక సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి ప్రతి అంశాన్ని రికార్డు చేస్తామన్నారు. హింసాత్మక సంఘటనల్లో పాల్గొన్నట్లు నిర్ధారణ అయితే కఠిన చర్యలు తప్పవని వివరించారు. డ్రోన్ కెమెరాలతో ఉత్సవాన్ని చిత్రీకరిస్తున్నట్లు పేర్కొన్నారు. సమావేశంలో జేసీ హరికిరణ్, డీఆర్ఓ గంగాధర్‌గౌడు, దేవాదాయ శాఖ డీసీ గాయత్రీ, ఆదోని ఆర్డీఓ ఓబులేసు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
దేవరగట్టులో కర్రల సమరం : 30 మందికి గాయాలు
కర్నూలు : కర్నూలు జిల్లా దేవరగట్టులో దసరా ఉత్సవాల్లో భాగంగా జరిగిన కర్రల సమరం రక్తసిక్తంగా మారింది. ఈ సమరంలో 30 మందికిపైగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించింది క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అయితే వారిలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. దీంతో వారిని మెరుగైన వైద్య చికిత్స కోసం కర్నూలు నగరంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గురువారం దేవరగట్టులో జరిగిన కర్రల సమరంలో 10 గ్రామాలకు చెందిన వేలాది మంది ప్రజలు పాల్గొన్నారు. -
మరికాసేపట్లో బన్ని ఉత్సవం
కర్నూలు జిల్లా హోళగుంద మండలం దేవరగట్టు కర్రల సమరం ప్రారంభం కానుంది. ప్రతి ఏటా విజయ దశమి రాత్రి నిర్విహించే ఈ ఉత్సవాన్ని నిలువ రించేందుకు పోలీసులు భారీగా మోహరించారు. మరో వైపు మండలంలోని నెరణికి, నెరణికి తాండా, కొత్తపల్లి, సులువాయి, విరుపాపురం, అరికేర, కురుకుంద, ముద్దనగేరి, ఆలూరు గ్రామాల ప్రజలు దేవరగట్టు ఉత్సవాల్లో పాల్గొనేందుకు సిద్దమయ్యారు. దసరా రోజు రాత్రంతా మల్లేశ్వర స్వామి కళ్యాణోత్సవం, బన్ని ఉత్సవం, భవిష్యవాణి కార్యక్రమాన్ని నిర్వహించడం ఇక్కడ తరతరాల ఆచారం. కాగా.. మాలమల్లేశ్వర స్వామి విగ్రహాన్ని దక్కించుకునేందుకు ప్రజలు కర్రలతో కొట్టుకుంటారు. గత ఏడాది బన్ని ఉత్సవంలో నెరణికి గ్రామానికి చెందిన పదకొండేళ్ల బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. గతంలో పాతకక్షలతో ప్రత్యర్థులను మట్టుబెట్టేందుకు దేవరగట్టు బన్ని ఉత్సవాన్ని వేదికగా చేసుకునేవారు. పరిస్థితి గతంతో పోలిస్తే కొంత మెరుగైనా రక్త చరిత్ర మాత్రం పునరావృతమవుతూనే ఉంది. బన్ని ఉత్సవంలో హింసను నివారించేందుకు అధికార యంత్రాంగం శాశ్వత చర్యలు తీసుకోవడంలో విఫలమైందనే వాదనలు ఉన్నాయి. ఏటా ఉత్సవానికి పది రోజుల ముందు పోలీసులు, అధికారులు గ్రామ సమావేశాల పేరిట హడావుడి చేయడమే కాని.. ఉత్సవాన్ని నిలువ రించే కార్యక్రమం మాత్రం శూన్యం. బన్ని ఉత్సవం రోజున వెయ్యికి పైగా పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేసి... చెక్ పోస్టులు పెడతారు. ఉత్సవం ప్రారంభమయ్యే సమయానికి పోలీసులు మాయమవుతారు. ఇనుప రింగులు చుట్టిన కర్రలతో ప్రత్యక్షమై జనం బన్నీ ఉత్సవంలో పాల్గొంటారు. ఎప్పటిలాగే రక్తం చిందటం యథావిదిగా జరిగిపోతుంది. దేవరగట్టు బన్ని ఉత్సవాలపై నాలుగేళ్ల క్రితం మానవ హక్కుల కమిషన్ స్పందించింది. నివేదిక ఇవ్వాలనీ ఆదేశించింది. అయినా అమలు శూన్యం. -
కర్రల సమరానికి సిద్ధమవుతున్న దేవరగట్టు
-
దేవరగట్టు బన్ని ఉత్సవం రక్తసిక్తం
11 ఏళ్ల చిన్నారి మృతి.. నలుగురి పరిస్థితి విషమం దేవరగట్టు: కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గంలోని దేవరగట్టులో మాళమల్లేశ్వరస్వామి కల్యాణోత్సవం సందర్భంగా నిర్వహించిన బన్ని ఉత్సవం రక్తసిక్తమైంది. జైత్రయాత్ర పేరిట కొనసాగిన కర్రల సమరంలో ఇరువర్గాల భక్తులు రాళ్లు రువ్వుకోగా 65 మందికి పైగా గాయపడ్డారు. తొక్కిసలాటలో కర్ణాటక రాష్ట్రానికి చెందిన 11 ఏళ్ల చిన్నారి మృత్యువాత పడగా.. నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. హొళగుంద మండలం దేవరగట్టుపై కొలువైన మాళమ్మ మాత, మల్లేశ్వరస్వామి కల్యాణోత్సవం శుక్రవారం అర్ధరాత్రి తర్వాత అత్యంత వైభవంగా నిర్వహించారు. ఉత్సవంలో కీలకమైన జైత్రయాత్రకు ఎస్పీ ఆకె రవికృష్ణ నేతృత్వంలో 1,500 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కానీ, వివిధ గ్రామాల నుంచి వచ్చిన వేలాదిమంది భక్తులు మెగలాయి( కర్రలు, దివిటీలతో కొట్టుకునే ఆట)కు శ్రీకారం చుట్టారు. దీంతో ఆ ప్రాంతం రక్తసిక్తంగా మారింది. -
భక్తి పేరుతో రక్తం కళ్ల చూశారు...
కర్నూలు : కర్నూలు జిల్లా దేవరగట్టు కర్రల సమరం పదేళ్ల బాలుడిని బలి తీసుకుంది. ఈ ఏడాది పోలీసులు ఎన్ని చర్యలు తీసుకున్నా.. దేవరగట్టులో ఉద్రిక్తత ఆగలేదు. సమయానికి గ్రామస్థుల చేతుల్లోకి మాత్రం కర్రలు వచ్చేశాయి. దాంతో పాటే వారిలో ఊపు వచ్చింది. పూనకం వచ్చినట్లు ఊగిపోతూ.. కర్రలు పట్టుకుని కొందరు.. కాగడాలతో మరికొందరు పరుగులు పెట్టారు. అంతా గందరగోళం. ఏం జరుగుతుందో అయోమయం. కర్రలు దూసుకున్నారు.. తలలు పగిలాయి. ఈ ఘటనలో ఓ బాలుడు మృతి చెందగా, 60మందికిపైగా గాయపడ్డారు. అధికారులు మాత్రం నలభై మంది గాయపడినట్లు చెబుతున్నారు. కాగా బాలుడి కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేస్తామని పోలీసులు చెబుతున్నారు. మరోవైపు ఆ ప్రాంత ప్రజలు మాత్రం ఏం జరిగినా వందల ఏళ్ల నుంచి వచ్చే సాంప్రదాయాలు కొనసాగిస్తామని చెబుతున్నారు. -
రక్తచరిత్ర మరోసారి పునరావృతం
-
రక్తచరిత్ర మరోసారి పునరావృతం
కర్నూలు : కర్నూలు జిల్లా దేవరగట్టు కర్రల యుద్ధం రక్తసిక్తమైంది. ఊహించినట్టుగానే చాలా మంది గాయపడ్డారు. కొంతమంది తలలు పగిలాయి. ప్రసిద్ధ మాల మల్లేశ్వరస్వామి సమక్షాన ప్రజలు రెండు వర్గాలుగా విడిపోయి మూలవిరాట్‌ను దక్కించుకోవడానికి పోటీ పడ్డారు. మేమేంటే మేమంటూ ఒకరిపై మరొకరు కర్రలతో కలబడ్డారు. భారీగా పోలీసుల్ని మోహరించినా.. ప్రేక్షతపాత్రకే పరిమితం కావల్సి వచ్చింది. శనివారం తెల్లవారే వరకూ ఈ కర్రల యుద్ధం కొనసాగింది. పది గ్రామాల ప్రజలు బన్నీ ఉత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వామివారి మూలవిరాట్ కోసం ఇరువర్గాలు రాళ్లు రువ్వుకున్నారు. దాంతో పోలీసులు లాఠీఛార్జ్‌తో పాటు భాష్పవాయువు ఉపయోగించారు. కర్నూలు జిల్లా హొలగుంద మండలం దేవరగట్టు కొండల్లో వెలసిన మాలమల్లేశ్వర స్వామి వేడుకలు 'బన్సీ ఉత్సవాల' పేరుతో ఏటా విజయదశమిశి నాడు అంగరంగ వైభవంగా జరుగుతాయి. మాలమల్లేశ్వర స్వామి విగ్రహాన్ని సొంత చేసుకునేందుకు పది గ్రామాల ప్రజలు పోటీపడతారు. స్వామి ఎక్కడుంటే అక్కడ పాడిపంటలతో ప్రజలు సుఖసంతోషాలతో ఉంటారనే అక్కడి భక్తుల విశ్వాసం. అందుకే స్వామిని సొంతం చేసుకునేందుకు అర్థరాత్రి సమయంలో 10 గ్రామాల ప్రజలు ఒకరినొకరు కర్రలతో కొట్టుకుంటారు. -
దేవరగట్టులో కర్రల సమరానికి రె'ఢీ'
కర్నూలు జిల్లా దేవరగట్టులో కర్రల ఉత్సవానికి అంతా సిద్ధమైంది. దేవరగట్టులో కొలువై ఉన్న మాలమల్లేశ్వరుడి కళ్యాణోత్సవం అనంతరం గ్రామస్థులు అంతా ఒకచోటకు చేరుకుని కర్రలతో కొట్టుకుంటారు. ఈ సందర్భంగా ఎలాంటి ఉద్రిక్తతలు, అవాంఛనీయ పరిస్థితులు తలెత్తకుండా ఉండేందుకు పోలీసులు ముందు జాగ్రత్త చర్యగా ఆ ప్రాంతంలో 144 సెక్షన్ విధించారు. అయితే భక్తులు మాత్రం ఈ బన్నీ ఉత్సవాన్ని చాలా సంబరంగా చేసుకుంటామని, ఇది ఒక ఉత్సవం మాత్రమే తప్ప ఎలాంటి ఆవేశ కావేషాలకు ఇందులో తావిచ్చేది లేదని అంటున్నారు. ప్రతియేటా జరిగే ఈ ఉత్సవంలో తమకు ఎవరికీ ప్రమాదకరమైన గాయాలు మాత్రం కావట్లేదని వాదిస్తున్నారు. మరోవైపు పోలీసులు మాత్రం రక్తపాతం జరగడం సరికాదని, అందుకే తాము 144 సెక్షన్ విధించామని చెబుతున్నారు. -
ముగిసిన దేవరగట్టు ఉత్సవాలు.. నెరణికి చేరిన మాళమల్లేశ్వరుడు
దేవరగట్టు ఆలయంపై ఉన్న మాళ మల్లేశ్వరుని ఉత్సవ విగ్రహాలు నెరణికి చేరుకోవడంతో దసరా ఉత్సవాలు ముగిశాయి. ఈ నెల 9వ తేదీ నెరణికి గ్రామ పురోహితుల గణపతి పూజతో ప్రారంభమైన ఉత్సవాలు శుక్రవారం రాత్రి ముగింపు పూజలతో ముగిశాయి. ఇందులో భాగంగా నెరణికి గ్రామ పురోహితుల ఆధ్వర్యంలో కొండపై వెలసిన మాళ సహిత మల్లేశ్వరస్వామి మూలవిరాట్లు, ఉత్సవ విగ్రహాలను సాయంత్రం నెరణికి, నెరణికితండా, కొత్తపేట గ్రామాల భక్తులు ఊరేగింపుగా దేవరగట్టు ఆలయానికి తెచ్చారు. అక్కడి నుంచి పల్లకిలో నెరణికి గ్రామానికి తీసుకెళ్లేందుకు దేవరగట్టు నుంచి ప్రారంభమైన ఊరేగింపు కొత్తపేట మీదుగా నెరణికితండాకు సమీపంగా రాత్రి నెరణికి గ్రామానికి చేరుకుంది. ఈ సందర్భంగా గ్రామానికి చెందిన వందలాది యువకులు బన్ని ఉత్సవాన్ని తలపించేలా గాలిలో కర్రలు తిప్పుతూ నృత్యం చేశారు. అనంతరం ఉత్సవ విగ్రహాలు ఆంజనేయస్వామి ఆలయానికి చేరుకోగానే మూడు గ్రామాల ప్రజలు మరోసారి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారిని ఆలయానికి చేర్చి ఉత్సవానికి ముగింపుగా పూజలు నిర్వహించారు. ఆలూరు సీఐ వెంకటరామయ్య ఆధ్వర్యంలో హొళగుంద, ఆస్పరి, ఆలూరు, హాలహర్వి ఎస్ఐలు సిబ్బందితో బందోబస్తు నిర్వహించారు. కర్రల సమరం కానేకాదు.. దసరా మహోత్సవాల్లో భాగంగా ఈ నెల 14 వతేదీన జరిగిన బన్ని ఉత్సవాన్ని కర్రల సమరంగా పేర్కొనడాన్ని ఆలయ ప్రధాన పురోహితుడు సుబ్రహ్మణ్యంశాస్త్రి తప్పుపట్టారు. ముగింపు పూజల సందర్భంగా శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ వందల ఏళ్లుగా వస్తున్న ఆచారం మేరకే బన్ని ఉత్సవం నిర్వహిస్తున్నారు తప్పితే మరేమి కాదన్నారు. ఉత్సవాలు ప్రారంభం నుంచి ముగిసే వరకు నెరణికి, నెరణికితండా, కొత్తపేట గ్రామాల ప్రజలు భక్తిశ్రద్ధలతో ఉంటారన్నారు. ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించేందుకు సహకరించిన భక్తులు, పోలీసులు, ప్రభుత్వ ఉద్యోగులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. -
మాళమల్లేశ్వరస్వామి బన్ని ఉత్సవాల్లో దేవదాసీల క్రీడోత్సవం
దేవరగట్టు భక్తులతో పోటెత్తింది. గొరవయ్యల విన్యాసాలు, దేవదాసీల నృత్యాలు, ఉత్సవ విగ్రహాల ఊరేగింపు గురువారం ప్రత్యేకం. మాళమల్లేశ్వరస్వామి బన్ని ఉత్సవాల్లో భాగంగా గురువారం ఉదయం 8 గంటలకే గొరువయ్యలు పెద్ద ఎత్తున క్షేత్రానికి చేరుకున్నారు. కర్నూలు జిల్లా నుంచే గాక కర్ణాటక, మహారాష్ట్ర తదితర ప్రాంతాల నుంచి వచ్చిన వందలాది మంది గొరవయ్యలు తరలివచ్చారు. పిల్లనిగ్రోవి ఊదుతూ, త్రిశూలం చేతబట్టి, ఢమరుకం నాదంతో సంప్రదాయ నృత్యాలను ప్రదర్శించారు. చెర్నకోలలతో కొట్టుకుంటూ ఉద్వేగంగా వచనాలు చెబుతూ పూనకంతో ఊగిపోయారు. పిల్ల గొరువయ్యలు సైతం దైవవచనాలు వల్లివేస్తూ అందుకు తగ్గట్టు హావబావాలు ప్రదర్శిస్తూ నృత్యం చేసి భక్తులను ఆశ్చర్యపరిచారు. ఆలయం కింది భాగంలో ఉన్న మల్లప్ప గుడిలోని సింహాసనం కట్ట ఎదుట హాలహర్వి మండలం బల్లూరు గ్రామానికి చెందిన గాదిలింగ అనే గొరవయ్య స్తంభానికి కట్టిన 20 కేజీల బరువుతో పది అడుగుల పొడవు ఉన్న ఇనుప గొలుసును తెంపే ప్రయత్నం చేశాడు. అయితే ప్రతిసారి నాలుగు, ఐదు ప్రయత్నాల్లో తెగే గొలుసు సారి 80 ప్రయత్నంలో తెగింది. కొందరు భక్తులు గొరవయ్యకు ఆటంకం కలిగించడమే కారణమైంది. గొలుసు తెంపే కార్యక్రమాన్ని సేకరించేందుకు వెళ్లిన మీడియాపై మద్యం సేవించిన భక్తులు దాడి చేశారు. మీడియా సభ్యులు అక్కడి నుంచి పరుగులు తీశారు. బందోబస్తులో ఉన్న పోలీసులు కూడా వారిని అడ్డుకోలేక పోయారు. దీంతో దీంతో గొలుసు తెంపడానికి పూనుకున్న గొరవయ్య మనస్సు లగ్నం చేయక పోవడంతో 80 సార్లు ప్రయత్నించాల్సి వచ్చింది. తరలివచ్చిన దేవదాసీలు: సాయంత్రం మల్లప్పస్వామి గుడి ఆలయ ప్రాంగణం పలు ప్రాంతాల నుంచి వచ్చిన దేవదాసీలు తెల్లటి దుస్తులు ధరించి భక్తితో నృత్యాలు చేశారు. అనంతరం నెరణికి గ్రామ పురోహితుల ఆధ్వర్యంలో నెరణికి, నెరణికితండా, కొత్తపేట గ్రామాలకు చెందిన భక్తులు ఉత్సవ విగ్రహాలను కొండపై ఉన్న ఆలయానికి తీసుకెళ్లారు. ఆ సమయంలో ఆ విగ్రహాలను మోసేందుకు మూడు గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున పోటీ పడ్డారు. ఆలయానికి చేరుకున్న విగ్రహాలకు పురోహితులు వేద మంత్రోచ్ఛరణల మధ్య ప్రత్యేక పూజలు నిర్వహించారు. నేటితో ఉత్సవాలు ముగింపు : మాళమల్లేశ్వరస్వామి ఉత్సవాలు శుక్రవారం సాయంత్రంతో ముగియనున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా ఆలయ అర్చకులు, నెరణికిగ్రామ పురోహితుల మధ్య నెరణికి, నెరణికితండా, కొత్తపేట గ్రామాల ప్రజలు స్వామివారి ఉత్సవ విగ్రహాలను నెరణికి గ్రామానికి మేళతాళాలతో తీసుకెళ్తారు. ఇంతటితో ఉత్సవాలు ముగుస్తాయి. -
రక్తమోడిన దేవరగట్టు
దసరా సందర్భంగా కర్నూలు జిల్లా హొళగుంద మండలం దేవరగట్టులో సోమవారం అర్ధరాత్రి నిర్వహించిన బన్ని ఉత్సవాలు రక్తమోడాయి. వెయ్యిమంది పోలీసులు బందోబస్తు నిర్వహించినా కర్రల సమరం యథేచ్ఛగా నిర్వహించారు. బన్ని సమరంలో 34 మందికిపైగా భక్తులు గాయపడగా వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ సమరాన్ని అడ్డుకునేందుకు యత్నించిన పోలీసులపైనా కొందరు కర్రలు, రాళ్లతో దాడికి దిగారు. దీంతో 15 మంది పోలీసులు గాయపడ్డారు. జిల్లా ఎస్పీ అక్కడే మకాంవేసి బందోబస్తు నిర్వహించినా లాభం లేకపోయింది. దేవరగట్టుపై కొలువైన మాత మాళమ్మ, మల్లేశ్వరస్వామి కల్యాణోత్సవాన్ని సోమవారం అర్ధరాత్రి ఘనంగా నిర్వహించారు. మహారాష్ట్ర, కర్ణాటక నుంచి కూడా భక్తులు వచ్చారు. కల్యాణోత్సవం తర్వాత మాత, స్వామి వారి ఉత్సవ విగ్రహాలతో పల్లకోత్సవం గట్టు దిగువకు చేరింది. అంతలోనే వేలాదిమంది భక్తులు ఇనుప రింగులు తొడిగిన వెదురు కర్రలు, భగభగ మండే దివిటీలతో కేకలు వేస్తూ ఒక్కసారిగా ప్రత్యక్షమై పల్లకోత్సవం చుట్టూ చేరారు. తమ ఇలవేల్పుకు రక్షణ కల్పించే సంప్రదాయంలో భాగంగా కర్రలతో పరస్పరం కొట్టుకున్నారు. -
ముగిసిన దేవరగట్టు బన్నీ ఉత్సవం
దేవరగట్టు : తరతరాల రక్త చరిత్ర మరోసారి పునరావృతమైంది. మాల మల్లేశ్వర స్వామి కోసం జరిగిన కర్రల సమరంలో తలలు పగిలాయి. రక్తం చిమ్మింది. అర్ధరాత్రి ఒకటిన్నరకు కర్నూలు జిల్లా హోలగంద మండలంలోని దేవరగట్టులో బన్ని ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. మొదటగా మల్లమ్మ మల్లేశ్వరుడికి వివాహం జరిపించారు. అనంతరం ఉత్సవమూర్తుల ఊరేగింపు మొదలైంది. ఇది సుమారు అర్ధరాత్రి రెండున్నరకు.. అంతా చీకటి.. చేతుల్లో కాగడాలు.. ఇదే సమయంలో కర్రల సమరం జరిగింది. ఆ ఉత్సవ మూర్తుల విగ్రహాలను తమ గ్రామాని తీసుకెళ్లడానికి గ్రామస్థులు కర్రలతో ఒకరినొకరు కొట్టుకున్నారు. వందల మంది తలలు పగిలాయి. భక్తి పేరుతో జరిగిన సమరంలో 100 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. నిలువరించడానికి లాఠీచార్జ్ చేసిన పోలీసులపై గ్రామస్తులు రాళ్లు , కర్రలతో దాడి చేశారు. గ్రామస్తుల దాడిలో 12 మంది పోలీసులు కూడా గాయపడ్డారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. కాగా కొందరు అకతాయిలు.. కాగడాలను గాల్లోకి విసిరారు. దీంతో నిప్పు రవ్వలు మహిళలపై పడి తీవ్రగాయాలయ్యాయి. కొద్దిసేపు ఆ ప్రాంతంతో ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు లాఠీచార్జి చేసి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. గతం కంటే ఈ యేడాది తలలు పగిలిన వారి సంఖ్య చాలా తక్కువ ఉందని పోలీసులు చెప్పారు. కర్రల సమరం మొత్తాన్ని వీడియో తీసినట్లు.. కావాలని అల్లర్లకు పాల్పడినవారిపై చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. -
మళ్లీ రక్తం చిమ్మిన దేవరగట్టు