దేవరగట్టులో కర్రల సమరం : 30 మందికి గాయాలు
కర్నూలు : కర్నూలు జిల్లా దేవరగట్టులో దసరా ఉత్సవాల్లో భాగంగా జరిగిన కర్రల సమరం రక్తసిక్తంగా మారింది. ఈ సమరంలో 30 మందికిపైగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించింది క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అయితే వారిలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు.
దీంతో వారిని మెరుగైన వైద్య చికిత్స కోసం కర్నూలు నగరంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గురువారం దేవరగట్టులో జరిగిన కర్రల సమరంలో 10 గ్రామాలకు చెందిన వేలాది మంది ప్రజలు పాల్గొన్నారు.