Devaragattu Bunny Fight
-
కర్నూలు జిల్లా : అర్ధరాత్రి రణరంగం.. దేవరగట్టు బన్నీ ఉత్సవం (ఫొటోలు)
-
దేవర గట్టు కర్రల సమరం.. పగిలిన తలలు
సాక్షి, కర్నూలు: దేవరగట్టు ఉత్సవాల్లో మరోసారి తలలు పగిలాయి. దసరా పర్వదినాన్ని పురస్కరించుకుని శనివారం అర్ధరాత్రి అర్ధరాత్రి 12 గంటలకు మాళమల్లేశ్వర స్వామి కల్యాణం నిర్వహించారు. అయితే ఉత్సవ మూర్తుల్ని దక్కించుకునేందుకు వందలాది భక్తులు పోటీ పడ్డారు. కర్రల సమయంలో 100మందికి పైగా గాయాలయ్యాయి. 100మంది వరకు తీవ్రంగా గాయపడ్డారు. ఐదుగురి పరిస్థితి విషమంగా మారింది. నిప్పు రవ్వలు పడి మరికొందరు గాయపడ్డారు. గాయపడ్డ భక్తుల్ని స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ‘బన్ని’ ఉత్సవం ప్రత్యేకత ఇదే..గట్టుపై కొలువైన మాత మాళమ్మ, మల్లేశ్వరుని కల్యాణోత్సవం అనంతరం ‘బన్ని’ ఉత్సవంగా జరిగే కార్యక్రమానికి ఎంతో ప్రత్యేకత ఉంది. దేవరగట్టు ఆలయ నిర్వాహణ బాధ్యత మోస్తున్న పరిసర గ్రామాలైన నెరణికి, నెరణికి తండా, కొత్తపేట గ్రామస్తులు భారీ సంఖ్యలో దేవరగట్టుకు చేరుకుంటారు. అక్కడ చెరువుకట్ట (డొళ్లిన బండే) వద్దకు చేరి కక్షలు, కార్పణ్యాలు లేకుండా కలిసికట్టుగా ఉత్సవాన్ని జరుపుకుందామని పాలబాస తీసుకుంటారు. అనంతరం గ్రామపెద్దలు పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్న కంట్రోల్ రూం వద్దకు వచ్చి కొండపై జరిగే కల్యాణోత్సవానికి వస్తున్నట్లు సూచనగా వారికి బండారాన్ని ఇచ్చి వెళ్తారు.అనంతరం బాణసంచా పేల్చి ఇనుప తొడుగులు తొడిగిన రింగు కర్రలు, అగ్గి కాగడాలు చేతపట్టి డోలు, మేళతాళాలతో కాడప్ప మఠంలో అప్పటికే అక్కడ ఉంచిన మల్లేశ్వరుని ఉత్సవ విగ్రహాన్ని కొండపైకి తీసుకెళ్తారు. ఆలయంలో ఉన్న మాళమ్మ ఉత్సవ విగ్రహంతో వేదపండితుల భక్తులు జయ జయ ధ్వానాల మధ్య అర్ధరాత్రి వేళ కల్యాణోత్సవం జరిపిస్తారు.అనంతరం ఉత్సవమూర్తులను తీసుకుని జైత్రయాత్రను సాగించడానికి కొండ దిగే వేళ కర్రలు గాలిలోకి లేస్తాయి. దివిటీలు భగ్గుమంటాయి. ఈ సమయంలో కర్రలు భక్తుల తలలకు తగిలి గాయపడతారు. నిట్రవట్టి, బిలేహాల్, విరుపాపురం, ఎల్లార్తి, సుళువాయి, అరికెర, అరికెరతాండా, కురుకుంద, లింగంపల్లి తదితర గ్రామాల భక్తులు కల్యాణోత్సవం అనంతరం జరిగే ఈ మొగలాయిలో పాల్గొంటారు. మొగలాయిలో భక్తులు చేతుల్లో ఉన్న కర్రలు తగిలి చాలా మంది గాయపడతారు.ఈ సమయంలోనే చాలా మందిపై దివిటీలు మీద పడటం, భక్తుల తోపులాటలో కిందపడటంతో తీవ్రంగా గాయపడి గతంలో కొందరు మృత్యవాత పడ్డారు. ఉత్సవాల్లో గాయపడిన భక్తులకు స్వామివారికి చల్లే పసుపు (బండారం) అంటిస్తారు. అనంతరం జైత్రయాత్ర స్వామి వారి ఊరేగింపుతో ముల్లబండ, పాదాలగట్టు, రక్షపడికి చేరుకుంటుంది. ఉత్సవ వివరాలు ఇలా..12న శనివారం రాత్రి మాంగల్యధారణ–కల్యాణోత్సవం (బన్ని), అనంతరం జైత్రయాత్ర మొదలై రక్షపడి (రక్త తర్పణం చేయుట) మీదుగా శమీ వృక్షం చేరుతుంది 13న ఉదయం నెరణికి గ్రామ ఆలయ పూజారి భవిష్యవాణి (కార్ణీకం) వినిపిస్తాడు 14న నెరణికి గ్రామ పురోహితుల చేత స్వామి వారికి పంచామృతం, రథోత్సవం15న గొరవయ్యల ఆటలు, గొలుసు తెంపుట, దేవదాసీల క్రీడోత్సవం, సాయంత్రం వసంతోత్సవం, కంకణ విసర్జన 16న మాళమల్లేశ్వర స్వామి విగ్రహాలు నెరణికి గ్రామానికి చేరడంతో ఉత్సవాలు ముగుస్తాయి -
కర్రల సమరం.. జన సంద్రంగా దేవరగట్టు
సాక్షి, కర్నూలు: దేవరగట్టు జనసంద్రంగా మారింది. బన్ని ఉత్సవాల్లో పాల్గొనేందుకు భక్తులు భారీగా వస్తున్నారు. అర్ధరాత్రి 12 గంటలకు మాళమల్లేశ్వర స్వామి కల్యాణం నిర్వహించనున్నారు. అనంతరం ఊరేగింపుతో బన్నీ ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. అర్ధరాత్రి ఉత్కంఠ భరితంగా కర్రల సమరం సాగనుంది. కర్ణాటక, తెలంగాణ నుంచి వేలాది మంది భక్తులు తరలివస్తున్నారు. బన్ని ఉత్సవానికి 800 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు.‘బన్ని’ ఉత్సవం ప్రత్యేకత ఇదే..గట్టుపై కొలువైన మాత మాళమ్మ, మల్లేశ్వరుని కల్యాణోత్సవం అనంతరం ‘బన్ని’ ఉత్సవంగా జరిగే కార్యక్రమానికి ఎంతో ప్రత్యేకత ఉంది. దేవరగట్టు ఆలయ నిర్వాహణ బాధ్యత మోస్తున్న పరిసర గ్రామాలైన నెరణికి, నెరణికి తండా, కొత్తపేట గ్రామస్తులు భారీ సంఖ్యలో దేవరగట్టుకు చేరుకుంటారు. అక్కడ చెరువుకట్ట (డొళ్లిన బండే) వద్దకు చేరి కక్షలు, కార్పణ్యాలు లేకుండా కలిసికట్టుగా ఉత్సవాన్ని జరుపుకుందామని పాలబాస తీసుకుంటారు. అనంతరం గ్రామపెద్దలు పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్న కంట్రోల్ రూం వద్దకు వచ్చి కొండపై జరిగే కల్యాణోత్సవానికి వస్తున్నట్లు సూచనగా వారికి బండారాన్ని ఇచ్చి వెళ్తారు.అనంతరం బాణసంచా పేల్చి ఇనుప తొడుగులు తొడిగిన రింగు కర్రలు, అగ్గి కాగడాలు చేతపట్టి డోలు, మేళతాళాలతో కాడప్ప మఠంలో అప్పటికే అక్కడ ఉంచిన మల్లేశ్వరుని ఉత్సవ విగ్రహాన్ని కొండపైకి తీసుకెళ్తారు. ఆలయంలో ఉన్న మాళమ్మ ఉత్సవ విగ్రహంతో వేదపండితుల భక్తులు జయ జయ ధ్వానాల మధ్య అర్ధరాత్రి వేళ కల్యాణోత్సవం జరిపిస్తారు.అనంతరం ఉత్సవమూర్తులను తీసుకుని జైత్రయాత్రను సాగించడానికి కొండ దిగే వేళ కర్రలు గాలిలోకి లేస్తాయి. దివిటీలు భగ్గుమంటాయి. ఈ సమయంలో కర్రలు భక్తుల తలలకు తగిలి గాయపడతారు. నిట్రవట్టి, బిలేహాల్, విరుపాపురం, ఎల్లార్తి, సుళువాయి, అరికెర, అరికెరతాండా, కురుకుంద, లింగంపల్లి తదితర గ్రామాల భక్తులు కల్యాణోత్సవం అనంతరం జరిగే ఈ మొగలాయిలో పాల్గొంటారు. మొగలాయిలో భక్తులు చేతుల్లో ఉన్న కర్రలు తగిలి చాలా మంది గాయపడతారు.ఈ సమయంలోనే చాలా మందిపై దివిటీలు మీద పడటం, భక్తుల తోపులాటలో కిందపడటంతో తీవ్రంగా గాయపడి గతంలో కొందరు మృత్యవాత పడ్డారు. ఉత్సవాల్లో గాయపడిన భక్తులకు స్వామివారికి చల్లే పసుపు (బండారం) అంటిస్తారు. అనంతరం జైత్రయాత్ర స్వామి వారి ఊరేగింపుతో ముల్లబండ, పాదాలగట్టు, రక్షపడికి చేరుకుంటుంది. ఉత్సవ వివరాలు ఇలా..12న శనివారం రాత్రి మాంగల్యధారణ–కల్యాణోత్సవం (బన్ని), అనంతరం జైత్రయాత్ర మొదలై రక్షపడి (రక్త తర్పణం చేయుట) మీదుగా శమీ వృక్షం చేరుతుంది 13న ఉదయం నెరణికి గ్రామ ఆలయ పూజారి భవిష్యవాణి (కార్ణీకం) వినిపిస్తాడు 14న నెరణికి గ్రామ పురోహితుల చేత స్వామి వారికి పంచామృతం, రథోత్సవం15న గొరవయ్యల ఆటలు, గొలుసు తెంపుట, దేవదాసీల క్రీడోత్సవం, సాయంత్రం వసంతోత్సవం, కంకణ విసర్జన 16న మాళమల్లేశ్వర స్వామి విగ్రహాలు నెరణికి గ్రామానికి చేరడంతో ఉత్సవాలు ముగుస్తాయి -
‘దేవరగట్టు’ రక్తసిక్తం
హొళగుంద/ఆలూరు రూరల్ (కర్నూలు): దేవరగట్టు రక్తసిక్తమయ్యింది. ఎప్పటిలానే సంప్రదాయం పైచేయి సాధించింది. కర్రలు కరాళనృత్యం చేయగా, 84 మందికి పైగా గాయపడ్డారు. బన్ని ఉత్సవాన్ని తిలకించేందుకు ఓ చెట్టుపైకి ఎక్కిన భక్తుల్లో కొమ్మ విరిగిపడడంతో ముగ్గురు మృత్యువాత పడ్డారు. మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత డోలు, మేళతాళాలతో ఇనుప తొడుగులు తొడిగిన కర్రలు, అగ్గి కాగడాలు, దివిటీలతో కొండ పైకి చేరిన నెరణికి, నెరణికి తండా, కొత్తపేట గ్రామస్తులు మాత మాళమ్మ, మల్లేశ్వరునికి నెరణికి పురోహితులు, ఆలయ పూజారులు అత్యంత వైభవంగా కల్యాణోత్సవం జరిపించారు. అనంతరం స్వామి, అమ్మవార్ల విగ్రహాలతో పాటు పల్లకీని మల్లప్ప గుడిలోని సింహాసన కట్ట మీద అధిష్టించారు. అక్కడి నుంచి మొదలైన జెత్రయాత్ర ఆద్యంతం ఒళ్లు జలదరించేలా ఉత్కంఠంగా సాగింది. చెట్టు కొమ్మ విరిగిపడి ముగ్గురు మృతి.. ఉత్సవాన్ని తిలకించేందుకు వచ్చిన భక్తులు సత్యనారాయణ కట్టపై ఉన్న రావి చెట్టుపై కూర్చున్న కొమ్మ విరిగి పడడంతో ముగ్గురు మృత్యువాత పడ్డారు. ఆస్పరికి చెందిన మాల గణేష్ (18), బళ్లారి పట్టణం మిల్లార్‌పేటకు చెంది ఓపీడీలో పనిచేస్తున్న ప్రకాష్(30), ఆలూరు మండలం మొలగవల్లి కొట్టాలకు చెందిన రామాంజనేయులు (45) ఈ ప్రమాదంలో మరణించారు. కర్రల సమరంలో 84 మందికి గాయాలు విజయదశమిని పురస్కరించుకుని మంగళవారం రాత్రి దేవరగట్టులో జరిగిన బన్ని మహోత్సవంలో ఆదినుంచి వస్తున్న సంప్రదాయమే గెలిచింది. విజయోత్సవంలో భాగంగా జరిగిన జైత్రయాత్రలో గట్టుపై రక్తం చిందింది. ఉత్సవంలో 84 మందికి గాయాలు కాగా అందులో 8 మందికి తీవ్ర గాయాలయ్యాయి. మంగళవారం అర్ధరాత్రి ప్రారంభమైన మాళ మల్లేశ్వరస్వామి జైత్రయాత్ర బుధవారం తెల్లవారుజాము వరకు జరిగింది. బన్ని ఉత్సవాన్ని తిలకించేందుకు కర్ణాటక, ఆంధ్రా, తెలంగాణ నుంచి దాదాపు 2 లక్షల మంది భక్తులు తరలి వచ్చారు. జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ నేతృత్వంలో అడిషనల్ ఎస్పీతో పాటు వెయ్యి మంది పోలీసులు బందోబస్తు నిర్వహించారు. దేవరగట్టులో గురువారం సాయంత్రం మాళ మల్లేశ్వరస్వామి రథోత్సవం నిర్వహించనున్నారు. 27న గొరవయ్యల ఆటలు, గొలుసు తెంపుట, దేవదాసీల క్రీడోత్సవం, సాయంత్రం వసంతోత్సవం, కంకణ విసర్జన, 28న మాళ మల్లేశ్వర స్వామి విగ్రహాలు నెరణికి గ్రామానికి చేరడంతో ఉత్సవాలు ముగుస్తాయని నిర్వాహకులు తెలిపారు. -
దేవరగట్టు బన్నీ ఉత్సవాల్లో ఉద్రిక్తత.. ఒకరు మృతి
సాక్షి, కర్నూలు జిల్లా: దేవరగట్టు బన్నీ ఉత్సవాల్లో ఒకరు మృతి చెందగా, 60 మందికిపైగా గాయపడ్డారు. కర్రల సమరాన్ని చూసేందుకు కొందరు స్థానికులు చెట్టు ఎక్కారు. ప్రమాదవశాత్తూ చెట్టు కొమ్మ విరిగిపడి గణేష్ అనే యువకుడు మృతిచెందాడు. గాయాలపాలైన వారికి ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. దేవరగట్టులో ప్రతీ ఏడాది దసరా పండుగ రోజున బన్నీ ఉత్సవం కర్రల యుద్ధంగా జరుగుతుంది. తరతరాలుగా వస్తున్న సంప్రదాయాన్ని పాటిస్తూ బన్ని ఉత్సవాన్ని మంగళవారం అర్ధరాత్రి కొనసాగించారు. ఈ నేపథ్యంలో దేవరగట్టులో మరోసారి సంప్రదాయమే గెలిచింది. ఆచారం పేరిట యథావిధి ఈ భక్తి పోరాటం కొనసాగింది. ఈ బన్నీ ఉత్సవ యుద్దానికి పూర్వ చరిత్ర ఉంది. మాలమల్లేశ్వర విగ్రహం కోసం దేవరగట్టుతో పాటు చుట్టుపక్కల గ్రామాలవారు కర్రలతో కొట్టుకోవడం ఆనవాయితీగా వస్తుంది. దసరా రోజున అర్ధరాత్రి వేళా స్వామి విగ్రహాన్ని తీసుకెళ్తే అంతా మంచి జరుగుతుందని అక్కడి ప్రజల నమ్మకంతో.. ఉత్సవంలో పాల్గొంటారు. ప్రతీ ఏడాది జరుగుతున్న ఈ సమరంలో అనేక మందికి గాయాలయ్యి, తలలు పగిలి ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు ఇదివరకూ అనేకసార్లు జరిగింది. మా ఆచార సాంప్రదాయాన్ని ఇలాగే కొనసాగిస్తాం.. మాళమల్లేశ్వర స్వామిని దక్కించుకోవడంలో వెనుకడుగు వేసేది లేదన్న భక్తులు.. ఈ కర్రల సమరంలో సుమారు 2 లక్షల మందికి పైగా పాల్గొన్నారు. -
దేవరగట్టు బన్నీ ఉత్సవం.. ఈసారైనా ప్రశాంతంగా జరుగుతుందా..!?
సాక్షి, కర్నూలు: దేవరగట్టులో ప్రతీ ఏడాది దసరా పండుగ రోజున బన్నీ ఉత్సవం కర్రల యుద్ధంగా జరుగుతుంది. అర్ధరాత్రి వేళ మాలమల్లేశ్వర స్వామిని దక్కించుకోవడంలో అక్కడి స్థానిక ప్రజలు బన్నీ ఉత్సవాన్ని ఏర్పాటు చేస్తున్నారు. సాంప్రదాయం, ఆచారం పేరిట ఈ భక్తి పోరాటం కొనసాగుతుంది. ఈ ఉత్సవంతో అక్కడి వాతావరణం ప్రతీసారి ఓ వైపు కోలాహలంగానూ, మరోవైపు నెత్తురుమయంగానూ వేడుక జరుగుతుంది. ఈ వేడుక ప్రశాంతంగా నిర్వహించేందుకు పోలీస్ శాఖ భారీ బందోబస్తును ఏర్పాటు చేసింది. అక్కడి ఆచార సాంప్రదాయం ఇలా.. ఈ బన్నీ ఉత్సవ యుద్దానికి పూర్వ చరిత్ర ఉంది. మాలమల్లేశ్వర విగ్రహం కోసం దేవరగట్టుతో పాటు చుట్టుపక్కల గ్రామాలవారు కర్రలతో కొట్టుకోవడం ఆనవాయితీగా వస్తుంది. దసరా రోజున అర్ధరాత్రి వేళా స్వామి విగ్రహాన్ని తీసుకెళ్తే అంతా మంచి జరుగుతుందని అక్కడి ప్రజల నమ్మకంతో.. ఉత్సవం యుద్ధానికి సిద్ధమవుతున్నారు అక్కడి ప్రజలు. ప్రతీ ఏడాది జరుగుతున్న ఈ సమరంలో అనేక మందికి గాయాలయ్యి, తలలు పగిలి ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు ఇదివరకూ అనేకసార్లు జరుగుతూ వస్తుంది. అయినా ఈ ఉత్సవం ఇలా జరగడంలోనే బాగుందంటున్నారు అక్కడి స్థానికలు. మా ఆచార సాంప్రదాయాన్ని ఇలాగే కొనసాగిస్తాం.. మాళమల్లేశ్వర స్వామిని దక్కించుకోవడంలో వెనుకడుగు వేసేది లేదంటున్నారు స్థానిక భక్తులు. పూర్తి బందోబస్తు.. ప్రతి ఏటా ఇలాగే జరుగుతున్న బన్నీ ఉత్సవాలలో ప్రశాంతత నెలకొల్పడానికి పోలీసు, పై అధికారశాఖ సిద్ధంగా ఉందా? అనే విషయాలపై పోలీసుశాఖ అవుననే అంటుంది. దేవరగట్టులో రక్తపాతం జరగకుండా ముందస్తు భద్రతా చర్యలు చేపట్టారు. ఎలాంటి ప్రమాదం జరగకుండా ఈసారి బందోబస్తు ముమ్మరం చేశామన్నారు. ఆచారం పేరిట కొనసాగుతూ వస్తున్న ఈ అపశ్రుతి పోరాటాన్ని నిలపనున్నారు. భక్తులు నాటుసారా సేవించకుండా కట్టడి చేయనున్నారు. ఇనుప చువ్వల కట్టెలు వాడకుండా చర్యలు తీసుకుంటూ అవగాహన సదస్సు నిర్వహించారు. ప్రశాంతమైన వేడుక జరిగేలా ఉత్సవ కమిటీతో మాట్లాడారు. ఈ ఏడాది కఠినమైన రక్షణ చర్యలు తప్పవంటున్నారు. ఈ ఉత్సవంలో వేల సంఖ్యల్లో భక్తులు పాల్గొననున్నారు. ప్రమాదమైన ఈ సంప్రదదాయ ఆచారాన్ని ఎలాగైనా ఆపాలని తీవ్ర ప్రయత్నానికి పూనుకుంటున్నారు అక్కడి పొలిసు అధికారులు. -
కర్నూలు జిల్లా దేవరగట్టులో బన్నీ ఉత్సవం (ఫొటోలు)
-
సమరానికి సిద్ధం ... కర్నూల్ జిల్లా దేవరగట్టులో బన్నీ ఉత్సవం
-
రక్తమోడిన దేవరగట్టు: పగిలిన తలలు.. చిందిన రక్తం
ఓ వైపు డిర్ర్.. డిర్ర్ శబ్దాలు ఆకాశాన్నంటుతుండగా.. మరో వైపు దివిటీలు వెలుగులు విరజిమ్ముతుండగా.. రింగులు తొడిగిన కర్రలు గాలిలో కరాళ నృత్యం చేశాయి. దేవరగట్టు మళ్లీ రక్తమోడింది. ఉత్కంఠ భరితంగా సాగిన జైత్రయాత్రలో భక్తులే పట్టు సాధించి సంప్రదాయాన్ని గెలిపించారు. ఈ ఏడాది బన్ని ఉత్సవానికి ముందే జరిగిన అరికెర భక్తుల మధ్య ఘర్షణ భయాందోళనకు గురి చేసింది. వేలాదిగా తరలివచ్చిన భక్తజనం మధ్య మాళమల్లేశ్వరుడి కల్యాణం, శమీ పూజ, కార్ణికం కార్యక్రమాలు వైభవంగా నిర్వహించారు. సాక్షి, హొళగుంద (కర్నూలు): విజయ దశమి పర్వదినాన దేవరగట్టులో నిర్వహించిన బన్ని ఉత్సవంలో సంప్రదాయమే గెలిచింది. కోవిడ్ నిబంధనలు, అధికారుల ఆదేశాలను విస్మరించిన భక్తులు అనాదిగా వస్తున్న ఆచారాన్ని కొనసాగించారు. మాళ మల్లేశ్వరుని జైత్రయాత్ర మొగలాయి యుద్ధాన్ని తలపించింది. రక్తపాతాన్ని తగ్గించేందుకు జిల్లా అధికార యంత్రాంగం చేసిన చర్యలు ఫలించలేదు. శుక్రవారం రాత్రి గట్టులో జరిగిన కర్రల సమరంలో దాదాపు 60 మందికి పైగా గాయాలయ్యాయి. ఉత్సవాలు నిర్వహించే నెరణికి, నెరణికి తండా, కొత్తపేట గ్రామస్తులతో పాటు దేవరగట్టు చుట్టు పక్కల గ్రామాలైన నిట్రవట్టి, బిలేహాల్, విరుపాపురం, ఎల్లార్తి, సుళువాయి, అరికెర, అరికెర తండా, కురుకుంద, లింగంపల్లితో పాటు దాదాపు 15 గ్రామాలకు చెందిన భక్తులు ఉత్సవంలో పాల్గొని మొగలాయి ఆడారు. కర్ణాటక, ఆంధ్ర, తెలంగాణ నుంచి వేలాదిగా భక్తులు తరలి వచ్చి ఉత్సవాన్ని తిలకించారు. కక్షలు, కార్పణ్యాలు లేకుండా ఉత్సవాన్ని ప్రశాంతంగా నిర్వహిస్తామని మూడు గ్రామాల పెద్దలు ఆదోని ఆర్డీఓ రామకృష్ణారెడ్డి, డీఎస్పీ వినోద్‌కుమార్ సమక్షంలో పాల బాస చేశారు. వారికి బండారం (పసుపు) ఇచ్చి స్వామి కల్యాణానికి అనుమతి తీసుకుని కొండపైకి చేరుకోవడంతో ఉత్సవం ప్రారంభమైంది. అరికెర భక్తుల ఘర్షణతో ఉద్రిక్తత ఈ ఏడాది మాళ మల్లేశ్వరుని కల్యాణోత్సవానికి ముందే ఆస్పరి మఠం పక్కనే అరికెరకు చెందిన కొంత మంది భక్తుల మధ్య జరిగిన ఘర్షణ ఉద్రిక్తతకు దారి తీసింది. అక్కడ ఉన్న వేలాది మంది భక్తులు భయాందోళనకు గురయ్యారు. కర్రలతో పరస్పరం దాడి చేసుకోవడంతో నలుగురు వ్యక్తుల తలలు పగిలి, చేతులు విరిగి అక్కడికక్కడే కుప్పకూలిపోయారు. మానవత్వం మరిచి రింగు కర్రలతో తలలపై బాదుతున్నా వారిని నిలవరించేందుకు ఎవరూ సాహసించ లేదు. ఆ దృశ్యం భక్తులను గగుర్పాటుకు గురి చేసింది. కొద్ది దూరంలో ఉన్న పోలీసులు అక్కడికి చేరుకుని క్షతగాత్రులను దగ్గరలోనే ఉన్న హెల్త్ క్యాంప్‌నకు తరలించారు. గాయపడిన పరమేష్ అనే వ్యక్తి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. పగిలిన తలలు.. చిందిన రక్తం కర్రల సమరంలో అరికెర, కొత్తపేట, ఆలూరు, కురుకుంద, సుళువాయి, తదితర గ్రామాలకు చెందిన 60 మందికి పైగా భక్తులు గాయపడ్డారు. కొందరికి కర్రలు తగిలి తలలకు గాయాలు కాగా మరి కొందరికి దివిటీలు తాకి కాలిన గాయాలయ్యాయి. ఆలూరుకు చెందిన జనార్దన్, బిలేహాళ్కు చెందిన ఈరన్న, నెరణికి చెందిన మల్లన్నగౌడ్ చేతులు విరిగాయి. తొక్కిసలాటలో హాలహర్వి మండలానికి చెందిన ఓ యువకుడు గాయపడ్డాడు. దాదాపు 15 మంది వరకు తీవ్ర గాయాలు కావడంతో ప్రథమ చికిత్స చేసిన వైద్యులు మెరుగైన చికిత్స కోసం ఆదోని, ఆలూరు, కర్నూలుకు రెఫర్ చేశారు. ఆదోనికి చెందిన లక్ష్మీదేవి దివిటీ తగిలి గాయపడింది. ఆలూరుకు చెందిన వీరశేఖర్ పరిస్థితి విషమంగా ఉండటంతో బళ్లారికి తరలించారు. క్షతగాత్రులతో కిక్కిరిసిన వైద్య శిబిరం ఉత్సవంలో గాయపడిన భక్తుల్లో ఎక్కువ శాతం నాటుసారా, మద్యం సేవించిన వారే ఉన్నారు. కర్రల సమరంలో రక్తపాతాన్ని తగ్గించేందుకు పోలీసులు పెద్ద ఎత్తున బందోబస్తు చేపట్టారు. కోవిడ్ కారణంగా ఈ ఏడాది గట్టుకు భారీ వాహనాలకు అనుమతి లేదు. అయినా భక్తులు ఆటోలు, ద్విచక్ర వాహనాల్లో భారీ సంఖ్యలో దేవరగట్టుకు చేరుకున్నారు. దాదాపు 1,350 మందితో బందోబస్తు నిర్వహించారు. అల్లర్లకు పాల్పడే వారిని గుర్తించడానికి వందకు పైగా సీసీ కెమెరాలు, 4 డ్రోన్ కెమెరాలు, విడీయో కెమెరాలు వినియోగించారు. పోలీస్ కంట్రోల్ రూం ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించారు. ►శుక్రవారం ఉదయం 8.30 గంటలకు రాష్ట్ర కార్మిక శాఖా మంత్రి గుమ్మనూరు జయరాం పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి మాళమల్లేశ్వరస్వామిని దర్శించుకున్నారు. ►11.30 గంటల నుంచి భక్తులు కాలినడకన, బైక్‌లపై గట్టుకు చేరుకోవడం ప్రారంభమైంది. ► సాయంత్రం 4 గంటలకు భక్తుల రద్దీ కనిపించింది. ఆలయంలో స్వామి వారిని దర్శించుకునేందుకు బారులుదీరారు. ► 5.30కు బందోబస్తు నిమిత్తం కేటాయించిన ప్రాంతానికి పోలీసులు బయలుదేరారు. ► రాత్రి 7:35కు జైత్రయాత్రను తిలకించడానికి వీలుగా స్థల అన్వేషణలో భక్తులు నిమగ్నమయ్యారు. ► 10.45కు ఆస్పరి మఠం పక్కనే అరికెరకు చెందిన భక్తులు ఒకరిపై ఒకరు దాడి చేసుకోవడంతో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. ► 11.45కు నెరణికి, నెరణికి తండా, కొత్తపేట గ్రామస్తులు డొళ్లిన బండ వద్దకు చేరుకుని పాలబాస తీసుకున్నారు. ► అర్ధరాత్రి 12:35కు మాళమల్లేశ్వర స్వామి విగ్రహాలను మూడు గ్రామాల పెద్దలు కొండ పైకి చేర్చారు. ► శనివారం 1 గంటకు మాళ మల్లేశ్వరుని కల్యాణోత్సవాన్ని నెరణికి గ్రామానికి చెందిన పురోహితులు రవిశాస్త్రి, ఆలయ ప్రధాన పూజారులు ఘనంగా నిర్వహించారు. ► 1:30కు స్వామివారి పల్లకీ, విగ్రహాలు అశ్వత్థ సత్య నారాయణ కట్ట వద్దకు చేరడంతో కర్రలు, అగ్గి కాగడాలు ఒక్క సారిగా గాలిలో లే చాయి. డోళ్లు, తప్పెట్లు కొట్టు్టకుంటూ బసవన్న గుడి వైపు బయలుదేరి 2.50 గంటలకు ముళ్లబండకు చేరుకోవడంతో అక్కడ పూజలు చేశారు. ► 3.20 æగంటలకు విగ్రహాలు పాదాలగట్టుకు చేరుకోగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ► తెల్లవారు జామున 4 గంటలకు రక్షపడికి చేరుకోగా అక్కడ మణి, మల్లాసుర అనే రాక్షస గుండులకు కంచాబీర వంశానికి చెందిన గొరువయ్య బసవరాజు తన కాలి పిక్కలకు దప్పణంతో గుచ్చుకుని రక్త తర్పణం చేశారు. ► 4.30కు శమీవృక్షం వద్దకు విగ్రహాలు చేరుకోవడంతో అక్కడ పూజలు చేశారు. అనంతరం బసవన్న గుడి వైపు బయలుదేరాయి. ► శనివారం ఉదయం 6.10 గంటలకు పూజారి గిరిస్వామి గుడి పైకి ఎక్కి భవిష్యవాణి చెప్పారు. 2023 వరకు కరోనా, ఇతర ఆరోగ్య సమస్యలుంటాయని, ఈ ఏడాది ఉత్తర భాగంలో వర్షాలుంటాయనే అర్థంతో, నిత్యావసర ధరలు పెరిగి తగ్గుతాయని,పంటలకు గిట్టుబాటు ధరలు 3:6, 6:3 ప్రకారం పెరుగుతాయని కార్ణీకం (భవిష్యవాణి) వినిపించారు. ► 6.35 గంటలకు విగ్రహాలు సింహాసన కట్టకు చేరుకోగానే కర్రలు పట్టుకుని ఎగురుతున్న భక్తులు వెంటనే కిందకు దింపి మల్లేశ్వరస్వామికి జేజేలు పలికి ఇంటిదారి పట్టారు. -
దేవరగట్టులో చిందిన రక్తం
హొళగుంద/ఆలూరు రూరల్: దసరా సందర్భంగా బన్ని ఉత్సవంలో భాగంగా మాళ మల్లేశ్వరస్వామిని వశం చేసుకునేందుకు రక్తం చిందేలా జరిగే కర్రల సమరాన్ని ఆపాలని కొన్ని దశాబ్దాలుగా ప్రభుత్వాలు చేస్తున్న యత్నాలు విఫలమవుతూనే ఉన్నాయి. ఈ ఏడాది కూడా ఈ సమరాన్ని ఆపాలని జిల్లా పోలీసు, అధికార యంత్రాంగం విశ్వప్రయత్నం చేసినా ఫలితం లేకుండా పోయింది. అధికారుల ఆంక్షలను కాదని.. సంప్రదాయానిదే పైచేయిగా నిలిచింది. వివరాల్లోకి వెళితే.. కర్నూలు జిల్లా హొళగుంద మండలం దేవరగట్టు మాళ మల్లేశ్వరస్వామిని దక్కించుకునేందుకు పలు గ్రామాల ప్రజలు ఒకరితో ఒకరు పోటీపడుతూ కర్రల చివరన ఇనుప రింగులు తొడిగి .. బన్ని ఉత్సవం (కర్రల సమరం)లో పాల్గొనడం ఆనవాయితీగా వస్తోంది. ఈ ఏడాది కూడా శుక్రవారం అర్ధరాత్రి బన్ని ఉత్సవం ప్రారంభం కాగా.. శనివారం ఉదయం 6.30 గంటలకు విగ్రహాలు సింహాసన కట్టకు చేరుకోవడంతో జైత్రయాత్ర ముగిసింది. కాగా, ఉత్సవాలు నిర్వహించే నెరణికి, నెరణికి తండా, కొత్తపేట గ్రామస్తులతో పాటు దేవరగట్టు చుట్టు పక్కల గ్రామాలైన నిట్రవట్టి, బిలేహాల్, విరుపాపురం, ఎల్లార్తి, సుళువాయి, అరికెర, అరికెరతాండా, కురుకుంద, లింగంపల్లితో పాటు దాదాపు 15 గ్రామాలకు చెందిన భక్తులు ఉత్సవంలో పాల్గొని మొగలాయి ఆడారు. కల్యాణోత్సవం అనంతరం నిర్వహించిన జైత్రయాత్రలో కర్రలు, దివిటీలు తగిలి భక్తుల తలలకు గాయాలయ్యాయి. స్థానికంగా ఏర్పాటు చేసిన వైద్య శిబిరంలో ప్రాథమిక చికిత్స అందించి కర్నూలు, ఆదోని, బళ్లారి ఆస్పత్రులకు రెఫర్ చేశారు. దాదాపు 60 మంది భక్తులు గాయపడ్డారు. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. బన్ని ఉత్సవాన్ని తిలకించేందుకు కర్ణాటక, ఆంధ్రా, తెలంగాణ నుంచి వేల సంఖ్యలో భక్తులు తరలి వచ్చారు. -
కర్రల సమరంలో హింస.. 100మందికిపైగా గాయాలు
సాక్షి, కర్నూలు: దేవరగట్టు కర్రల సమరంలో హింస చెలరేగింది. దేవరగట్టు మాళమల్లేశ్వరస్వామి విగ్రహాల కోసం భక్తులు పెద్దఎత్తున పోటీ పడ్డారు. రింగులు తొడిగిన కర్రలతో భక్తులు కొట్టుకున్నారు. ఈ ఘటనలో 100 మందికిపైగా గాయాలు అయ్యాయి. 9 మంది పరిస్థితి విషయంగా ఉన్నట్లు తెలుస్తోంది. క్షతగాత్రులను ఆలూరు, ఆదోని, కర్నూలు ఆస్పత్రులకు తరలించారు. చదవండి: ఉద్యోగ సంఘాల విజ్ఞప్తి.. సానుకూలంగా స్పందించిన సీఎం జగన్ -
Devaragattu Bunny Festival: భక్తులు కర్రలతో ఎందుకొస్తారంటే..?
హొళగుంద: బన్ని(కర్రల సమరానికి) ఉత్సవానికి దేవరగట్టు సిద్ధమైంది. విజయదశమి పండుగను పురస్కరించుకుని శుక్రవారం అర్ధరాత్రి మాత మాళమ్మకు, మల్లేశ్వరునికి కల్యాణం నిర్వహించనున్నారు. అనంతరం జైత్రయాత్ర కొనసాగనుంది. భక్తులు డిర్ర్..ర్ర్...గోపరక్...బహుపరాక్ అంటూ కర్రల సమరం నిర్వహించనున్నారు. వేడుకలను తిలకించేందుకు రాష్ట్ర నలుమూలల నుంచే కాకుండా పొరుగున ఉన్న కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల నుంచి భారీగా భక్తులు తరలిరానున్నారు. కరోనా కారణంగా ఈ ఏడాది గట్టుకు వాహనాలను అనుమతించడం లేదు. ఉత్సవంలో అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా 1,350 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. చదవండి: దసరా పండుగ కళ వచ్చిందయ్యో అల్లర్లకు పాల్పడే వారిని గుర్తించడానికి వీలుగా 120కు పైగా సీసీ కెమెరాలు అమర్చారు. అలాగే నాలుగు డ్రోన్ కెమెరాలను వినియోగించనున్నారు. వేడుకల్లో గాయపడే భక్తులకు దేవరగట్టులోని ఓ భవనంలో హెల్త్ క్యాంపు ఏర్పాటు చేశారు. డీఎంఅండ్‌హెచ్‌ఓ ఆధ్వర్యంలో 10 మంది డాక్టర్లు, 100 మంది వైద్య సిబ్బంది సేవలు అందించనున్నారు. మంచాలు, మెడిసిన్స్, ఇతర అత్యవసర చికిత్సకు కావల్సిన మందులు, పరికరాలతో పాటు 108, 104 అంబులెన్స్‌లు అందుబాటులో ఉంచారు. ఉత్సవం జరుగుతుందిలా.. దేవరగట్టు పరిసర గ్రామాలు నెరణికి, నెరణికి తండా, కొత్తపేట గ్రామస్తులు చెరువుకట్ట (డొళ్లిన బండే)వద్దకు చేరి వర్గ వైషమ్యాలు, కక్షలు, కార్పణ్యాలు లేకుండా కలిసికట్టుగా ఉత్సవాన్ని జరుపుకుందామని పాలబాస తీసుకుంటారు. కల్యాణోత్సవానికి వస్తున్నట్లు సూచనగా గ్రామపెద్దలు పోలీసులకు బండారాన్ని ఇస్తారు. అనంతరం బాణసంచా పేల్చి కర్రలు, అగ్గి కాగడాలు చేతపట్టుకొని మేళతాళాలతో కాడప్ప మఠానికి చేరుకుంటారు. అక్కడున్న మల్లేశ్వరుని ఉత్సవ విగ్రహాన్ని కొండపైకి తీసుకెళ్తారు. ఆలయంలో మాత మాళమ్మ, మల్లేశ్వరునికి కల్యాణోత్సవం జరిపిస్తారు. అనంతరం జైత్రయాత్ర కొనసాగుతుంది. మొగలాయిలో భక్తుల చేతుల్లో ఉన్న కర్రలు తగిలి , పైకి విసిరిన అగ్గి కాగడాలు మీద పడి చాలా మంది గాయపడ్తారు. గాయపడినవారికి స్వామివారికి చల్లే పసుపు (బండారం) అంటిస్తారు. అనంతరం జైత్రయాత్ర ముల్లబండ, పాదాలగట్టు, రక్షపడికి చేరుకుంటుంది. చదవండి: ఆనందోత్సవాల ‘ఆసరా’ కొండపై ఆలయం రక్త సంతర్పణ.. ఉత్సవ విగ్రహాలు రక్షపడికి చేరుకున్నాక..అక్కడున్న రెండు రాతి గుండ్లకు కంచాభీరా వంశానికి చెందిన గొరువయ్య ఐదు చుక్కల రక్తాన్ని సమర్పిస్తాడు. బసవన్న గుడి వద్ద ప్రధాన అర్చకుడు గిరిస్వామి భక్తులకు భవిష్యవాణి వినిపిస్తారు. విగ్రహాలు సింహాసన కట్టకు చేరుకోవడంతో జైత్రయాత్ర ముగుస్తుంది. మంచి జరుగుతుందనే ఉద్దేశంతో.. పురాతన కాలంలో విష పురుగులు, జంతువుల బారి నుంచి రక్షణ పొందేందుకు దివిటీలు, కట్టెలతో భక్తులు కొండపైకి వెళ్లేవారు. మంచి జరుగుతుందనే ఉద్దేశంతో భక్తులు తమ చేతిలో ఉన్న కర్రలతో దేవుడి విగ్రహాలను తాకేందుకు పోటీ పడతారు. ఈ సమయంలో కర్రలు తగులుకుని శబ్దం వస్తుంది. నాటుసారా, మద్యం సేవించిన వారి చేతిలోని కర్రలు స్వాధీనంలో లేకుండా మరొకరికి తగిలి గాయాలవుతాయి. గతంలో కొందరు ఉద్దేశ పూర్వకంగా గుంపులో కొట్టుకునేందుకు ప్రయత్నించేవారు. ఇది రక్తపాతానికి కారణమయ్యేది. అధికారులు, ప్రజాప్రతినిధులు అవగాహన కల్పించడంతో ప్రజల్లో చైతన్యం వచ్చింది. సంప్రదాయం ప్రకారం ఉత్సవం జరుపుకుంటున్నారు. 144 సెక్షన్ అమలు వేడుకల్లో భాగంగా 19వ తేదీ వరకు దేవరగట్టుతో పాటు పరిసర గ్రామాల్లో 144 సెక్షన్ అమలులో ఉంటుంది. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ తక్కువ సంఖ్యలో భక్తులు హాజరుకావాలి. ఇప్పటికే 150 మందిపై పోలీసులు బైండోవర్, ఇతర కేసులు నమోదు చేశారు. – శేషఫణీంద్ర, తహసీల్దార్, హొళగుంద అన్ని ఏర్పాట్లు చేశాం బన్ని ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లు చేశాం. భక్తులకు భోజన సదుపాయం కల్పిస్తున్నాం. తాగునీటికి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకున్నాం. కొత్తపేట రోడ్డును బాగు చేయించాం. ఉత్సవాల్లో పాల్గొనే వారు తప్పనిసరిగా కోవిడ్ నిబంధనలు పాటించాలి. – గుమ్మనూరు శ్రీనివాసులు, దేవరగట్టు ఆలయ కమిటీ చైర్మన్ -
కర్రల సమరం: ‘గట్టు’ మీద ఒట్టు!
హొళగుంద: ప్రతి ఏటా దసరా పర్వదినం రోజు దేవరగట్టులో జరిగే కర్రల సమరానికి రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో పేరుంది. నలుమూలల నుంచి భక్తులు తరలివచ్చి ఉత్సవాన్ని తిలకిస్తారు. దేవరగట్టు సమీపంలోని మూడు గ్రామాల ప్రజలు ఉత్సవాల్లో కీలక భూమిక పోషిస్తారు. అనాదిగా వస్తున్న సంప్రదాయాన్ని పాటిస్తూ పాల్గొంటున్నారు. దేవరగట్టు మాళమల్లేశ్వరస్వామి దసరా బన్ని మహోత్సవాల్లో నెరణికి, నెరణికి తండా, కొత్తపేట గ్రామస్తులు ప్రత్యేకత చాటుతారు. ఉత్సవాలకు ముందు వచ్చే అమావాస్య నుంచి దీక్ష చేపట్టి కంకణాధారణ మొదలు బన్ని ఉత్సవాలు ముగిసేంత వరకు నిష్టతో ఉంటారు. కొండపై నుంచి విగ్రహాలు తిరిగి నెరణికి గ్రామానికి చేరే వరకు కట్టుబాట్లు పాటిస్తారు. 12 రోజుల పాటు కనీసం కాళ్లకు చెప్పులు వేసుకోకుండా మద్యం, మాంసం ముట్టకుండా.. బ్రహ్మచర్యం పాటిస్తూ దైవకార్యాన్ని విజయవంతంగా పూర్తి చేస్తారు. అందరూ విజయదశమి రోజు పండగ చేసుకుంటే ఈ మూడు గ్రామాల ప్రజలు మాత్రం బన్ని ఉత్సవం ముగిసి స్వామి విగ్రహాలు నెరణికి గ్రామానికి చేరే రోజు విజయానికి సూచికగా పండగ చేసుకుంటారు. ఆయా గ్రామాల ప్రజలు వైరాన్ని వీడి కులమతాలకు అతీతంగా ఉత్సవాల్లో పాల్గొంటుండటం విశేషం. బన్నిలో విగ్రహాలకు రక్షణగా నిలిచిన గ్రామస్తులు (ఫైల్) పాల బాస చేసి.. సమైక్యత చాటుతూ కర్రల సమరానికి ప్రారంభానికి ముందు ఈ మూడు గ్రామాల ప్రజల పాల బాస చేస్తారు. దేవుని కార్యం ముగిసే వరకు కట్టుబాట్లు పాటిస్తూ అన్నదమ్ముల్లా కలిసిమెలిసి ఉంటామని పాల మీద చేతులు ఉంచి ప్రమాణం చేస్తారు. చుట్టు పక్కల గ్రామాలకు చెందిన భక్తులు వేలాది సంఖ్యలో పాల్గొన్నా జైత్రయాత్రను విజయవంతంగా ముగించుకుని విగ్రహాలను నెరణికి గ్రామం చేరుస్తారు. కొన్ని తరాలుగా ఇలవేల్పుపై భక్తిభావాన్ని చాటుతున్నారు. దేవరగట్టు బన్ని ఉత్సవాలు సోమవారం నుంచి ప్రారంభమయ్యాయి. ఈనెల 19వ తేదీ వరకు జరిగే ఉత్సవాల్లో 15వ తేదీ విజయదశమి రోజు నిర్వహించే బన్ని ఉత్సవం కీలకం. నెరణికిలో ఉన్న మాళమల్లేశ్వర స్వామి ఉత్సవ మూర్తులను పల్లకీలో సోమవారం దేవరగట్టులో కొండపై ఉన్న ఆలయానికి చేర్చి కంకణధారణతో ఉత్సవాలను ప్రారంభిస్తారు. కర్రల సమరానికి ముందు కల్యాణోత్సవం వైభవంగా నిర్వహిస్తారు. సంప్రదాయ పండగ దేవరగట్టు బన్ని ఉత్సవంలో భక్తులు కర్రలతో కొట్టుకుంటారనేది అవాస్తవం. ఇది సంప్రదాయ పండగ. పూర్వం గట్టుపై జంతువుల నుంచి రక్షణగా కర్రలు, ఆయుధాలు, దివిటీలు తీసుకెళ్లే వారు. కాలక్రమేణా అవి దురుద్దేశాలకు వాడడంతో కర్రల సమరంగా ముద్ర పడింది. మద్యం సేవించిన వారు మాత్రమే గాయ పడతారు కాని ఇతరులకు ఏమి కాదు. – గిరిస్వామి, భవిష్యవాణి వినిపించే ఆలయ ప్రధాన అర్చకుడు, దేవరగట్టు విగ్రహాలకు రక్షణగా ఉంటాం వేలాది మంది పాల్గొనే వేడుకల్లో స్వామి, అమ్మవారి విగ్రహాలను కాపాడుకోవడమే మా మూడు గ్రామాల లక్ష్యం. కఠోర కట్టుబాట్లతో జైత్రయాత్రలో విగ్రహాలకు రక్షణ కవచంగా ఉండి కాపాడుకుంటూ వస్తున్నాం. ఉత్సవాల సమయంలో మద్యం, మాంసం ముట్టితే బన్ని ఉత్సవం జరిపే అర్హత కోల్పోతాం. మా వంశస్తులు గట్టులో ఉండే రాక్షస గుండ్లకు రక్తం సమర్పిస్తారు. – బసవరాజు, కంఛాబీరా వంశస్తుడు, నెరణికి కట్టుబాట్లు పాటిస్తారు దేవరగట్టు ఉత్సవాల్లో నెరణికి, నెరణికి తండా, కొత్తపేట గ్రామస్తులు నిష్టతో కట్టుబాట్లు పాటిస్తారు. బన్ని రోజు సాయంత్రం గట్టుకెళ్లే ముందు ప్రతి ఒక్కరూ స్నానమాచారించి గ్రామంలోని అన్ని ఆలయాల్లో కొబ్బరి కాయలు సమర్పిస్తారు. అనంతరం తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకుని కొండకు బయలుదేరుతారు. కర్రలతో విగ్రహాల మీదకు వచ్చే వారిని తరమడమే లక్ష్యంగా జైత్రయాత్రలో పాల్గొంటారు. – రవిశాస్త్రీ, మాళమల్లేశ్వరుని కల్యాణం నిర్వహణ పురోహితుడు, నెరణికి -
దేవరగట్టులో కర్రల సమరం
-
కర్నూలు: దేవరగట్టు బన్ని ఉత్సవం రద్దు
-
దేవరగట్టు : బన్నీ ఉత్సవం రక్తసిక్తం
-
బన్నీ ఉత్సవం రక్తసిక్తం.. నలుగురి పరిస్థితి విషమం
సాక్షి, కర్నూలు: దేవరగట్టులో బన్నీ ఉత్సవం ఈ సారి కూడా రక్తసిక్తంగా మారింది. మాలమల్లేశ్వరుల విగ్రహాలను దక్కించుకునేందుకు 11 గ్రామాలు ప్రజలు రెండు వర్గాలుగా విడిపోయి కర్రలతో కొట్టుకున్నారు. ఈ రణరంగంలో 60 మందికి పైగా గాయపడ్డారు. వీరిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు పరిస్థితి అదుపులోకి తీసుకొచ్చారు. గాయపడిని వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. కర్నూలు జిల్లా దేవరగట్టు కొండలో వెలసిన మాలమల్లేశ్వర స్వామి కల్యాణోత్సవం సందర్భంగా కర్రల యుద్ధానికి దిగడం అక్కడి ప్రజలకు ఆనవాయితీగా వస్తోంది. దీనిని బన్నీ ఉత్సవంగా పిలుస్తారు. దీనిలో భాగంగా ఏటా దసరా పర్వదిననం రోజు దేవరగట్టు పరిధిలోని 11 గ్రామాలు ప్రజలు ఉత్సవ విగ్రహాల కోసం చిన్నపాటి యుద్దమే చేస్తారు. కొంతమంది కర్రలు, మరికొందరు దీవిటీలు చేతపట్టి అర్దరాత్రి కొండల మధ్య నుంచి దేవేరుల విగ్రహాలతో కల్యాణోత్సవానికి బయల్దేరుతారు. ఈ సందర్భంగా విగ్రహాలను దక్కించుకునేందుకు గ్రామాల ప్రజలు పోటీ పడతారు. అయితే ఈ సంప్రదాయంపై పోలీసులు ఎన్ని అంక్షలు విధించినా ఆనవాయితీ పేరిట ఏటా ఈ రక్తపాతం జరుగుతూనే ఉంది. -
దేవర గట్టు టెన్షన్
-
భక్తులదే పట్ట
హొళగుంద/ఆలూరు: దసరా ఉత్సవాల్లో భాగంగా దేవరగట్టులో శుక్రవారం అర్ధరాత్రి దాటిన తరువాత కర్రల సమరం కొనసాగింది. సంప్రదాయ వేడుకలో పలువురు గాయపడ్డారు. ఆలూరు నియోజకవర్గం హొళగుంద మండలం దేవరగట్టు కొండల్లో కొలువుదీరిన శ్రీ మాళమల్లేశ్వర స్వామి కల్యాణోత్సవాన్ని శుక్రవారం అర్ధరాత్రి నిర్వహించారు. అనంతరం విహార యాత్ర (జైత్రయాత్ర)లో భాగంగా ఆలయ అర్చకులు కొండ మీద నుంచి ఉత్సవ మూర్తులను తీసుకు వస్తుండగా.. దేవతామూర్తులకు ఆటంకాలు కలగకుండా ముందు జాగ్రత్త చర్యగా నెరణికి ,కొత్తపేట, నెరణికి తండా గ్రామాలకు చెందిన భక్తులు డిర్ర్ర్...గో పరాక్ అంటూ కర్రలు చేత పట్టుకొని విసురుకుంటూ వచ్చారు. దీంతో పలువురు గాయపడ్డారు. కర్రల సమరాన్ని అడ్డుకునేందుకు జిల్లా పోలీసు, రెవెన్యూ అధికార యంత్రాంగం చేసిన చర్యలు ఫలించలేక పోయాయి. శ్రీ మాళ మల్లేశ్వర స్వాముల జైత్రయాత్రలో కర్రల మొగలాయి విజయవంతంగా సాగింది. శుక్రవారం అర్ధరాత్రి ప్రారంభమైన మాళ మల్లేశ్వరస్వామి జైత్రయాత్ర శనివారం తెల్లవారుజాము వరకు కొనసాగుతూ వచ్చింది. ఈ సమరాన్ని తిలకించేందుకు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ, తమిళనాడు, మహారాష్ట్రాల నుంచి వేల సంఖ్యలో భక్తులు తరలి వచ్చారు. గతేడాది ఉత్సవం రోజులు మొహర్రం ఉండడంతో భక్తుల సంఖ్య తగ్గగా ఈ ఏడాది భక్తుల సంఖ్య అన్యూహ్యంగా పెరిగింది. దేవరగట్టు పరిసరాల్లో ఉన్న దాదాపు 15 గ్రామాలకు చెందిన భక్తులు ఉత్సవంలో పాల్గొని మొగలాయి ఆడారు. కర్రల యుద్ధాన్ని సాధ్యమైనంత వరకు నివారించేందుకు పోలీసులు పెద్ద ఎత్తున హెల్మెట్లను ధరించి బందోబస్తు చేపట్టారు. జిల్లా ఎíస్పీ గోపీనాథ్ జెట్టి ఆధ్వర్యంలో మిలటరీ సిబ్బంది, ఆర్మీఫోర్స్, పారామిలటరీ సివిల్ పోలీసులు, హోంగార్డులు కలిసి 1,200 మంది బందోబస్తుతో పాటు డ్రోన్ కెమెరాల ద్వారా బందోబస్తు నిర్వహించారు. ఉత్సవంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భక్తుల వెంట ఉండి ప్రశాంతంగా నిర్వహించుకునేలా చర్యలు తీసుకున్నారు. అలాగే భక్తులకు అంతరాయం కలగకుండా ఈ సారి ట్రాఫిక్ నియంత్రణ ఏర్పాటు చేశారు. కొండపై వాహనాలకు ప్రత్యేకంగా పార్కింగ్ ఏర్పాటు చేశారు. పాల బాస, బండారంతో తొలి ఘట్టానికి అనుమతి శ్రీ మాళమల్లేశ్వరస్వామి జైత్రయాత్ర(ఊరేగింపు)కు కొద్ది సమయం ముందు మాళమ్మ, మల్లేశ్వరునికి కల్యాణోత్సవాన్ని నిర్వహించడానికి నెరణికి, నెరణికి తండా, కొత్తపేట గ్రామస్తులు.. పెద్దల అనుమతి తీసుకోవడం ఆనవాయితీగా వస్తుంది. ఉత్సవాలు నిర్వహించే నెరణికి, నెరణికి తండా, కొత్తపేట గ్రామస్తులు శుక్రవారం రాత్రి 10.45 గంట సమయంలో చెరువు కట్ట (డొళ్ళిన బండ)వద్దకు చేరి వ్యక్తిగత మనస్పర్థలను వీడి మూడు గ్రామస్తులు కలిసికట్టుగా జరుపుకుందామని పాలబాస తీసుకున్నారు. అందులో భాగంగా రాత్రి 11.50 గంటల సమయంలో కార్యక్రమానికి హాజరైన ఎస్పీ గోపీనాథ్ జెట్టికి బండారాన్ని(పసుపు) ఇచ్చి మాళ మల్లేశ్వరుని కల్యాణానికి అనుమతి కోరారు. ఇందుకు అధికారులు అనుమతి ఇవ్వడంతో మూడు గ్రామస్తులు మాళ మల్లేశ్వరునికి కల్యాణోత్సవాన్ని నిర్వహించడానికి సిద్ధమయ్యారు. అర్ధరాత్రి ‘గిరి’పై మోగిన కల్యాణ మేళాలు.. నెరణికి, నెరణికి తండా, కొత్తపేట గ్రామస్తులు ఇనుప తొడుగులు తొడిగి కర్రలు, పుంజీలు ,కాగడాలు చేతపట్టి డోలు, మేళతాళాలతో కాడసిద్దప్ప మఠంలో ఉంచిన మల్లేశ్వరుని విగ్రహంతో పాటు పల్లకీని కొండ(గిరి)పై ఆలయంలో ఉన్న మాళమ్మ విగ్రహం వద్దకు తీసుకెళ్లారు. గిరిపై స్వామివారి ఆలయంలో వేదపండితుల మంత్రోచ్చారణలు, భక్తులు జైజై ధ్వనుల మధ్య మాత మాళమ్మ, మల్లేశ్వరునికి అత్యంత వైభవంగా కల్యాణోత్సవం జరిపించారు. అనంతరం మాళమ్మ, మల్లేశ్వరుని విగ్రహాలతో పాటు పల్లకిని ఊరేగింపుగా తీసుకు వస్తుండగా అక్కడే ఉన్న కొందరు భక్తులు అటకాయించారు. అగ్గి కాగడాలు విసురుకున్నారు. కర్రల శబ్దాలతో, డిర్ర్ర్...గొపరాక్ అంటూ విగ్రహాలను మల్లప్ప గుడిలోని సింహాసనం కట్ట మీద అధిష్టింపజేశారు. అనంతరం అక్కడి నుంచి మొదలైన జెత్రయాత్ర ఉత్సవాన్ని చూస్తున్న భక్తుల ఒళ్లు జలదరించేలా ఉద్వేగంగా, ఉత్కంఠంగా ముందుకు సాగింది. జైత్రయాత్రలో చిందిన రక్తం జైత్రయాత్ర సత్య నారాయణ కట్ట, కాడసిద్ధప్ప మఠం పరిసరాల్లో కొద్ది సేపు అలజడి సృష్టించి ముందుకు కదలగా భక్తుల కర్రలు తగిలి ఎన్నో తలలు పగిలాయి. నిట్రవట్టి, బిలేహాల్, విరుపాపురం, ఎల్లార్తి, సుళువాయి, అరికెర, అరికెరతాండా, కురుకుంద, లింగంపల్లి తదితర గ్రామాల భక్తులు మొగలాయిల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా భక్తులు చేతుల్లో ఉన్న రింగు కర్రలు తగిలి చాలా మంది గాయపడ్డారు. తలలు పగిలాయి. పైకి విసిరిన అగ్గి కాగడాలు మీద పడి భక్తుల ఒళ్లు కాలిపోయాయి. ఉత్సవంలో గాయపడిన భక్తుల్లో ఎక్కువ శాతం నాటుసారా, మద్యం సేంచిన వారే ఉన్నారు. మద్యం మత్తులో రింగు కర్రలు తగిలి, అగ్గి కాగడాలు మీద పడి గాయాలకు గురయ్యారు. నాటుసారా అరికట్టేందుకు రెవెన్యూ, సివిల్, పోలీసులు నెలన్నర రోజులుకు ముందు అవగాహన సదస్సులు, నాటుసారా స్థావరాలపై దాడులు, రింగు కర్రల స్వాధీనం కోసం తనిఖీలు చేపట్టారు. ఆలూరు, హొళగుంద, హాలహర్వి మండలాల్లో నాటుసారా స్థావరాలపై దాడులు చేసి 10 వేల లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేశారు. అరెస్ట్‌లు, బైండోవర్, ఇతర కేసులు నమోదు చేశారు. అయినా ఉత్సవంలో మద్యం, రింగు కర్రలు ప్రత్యక్షమయ్యాయి. నడి అరణ్యంలో రక్తం చిందించిన కంఛాబీర వంశస్తుడు.. జైత్రయాత్ర దట్టమైన అడవిలో సుమారు 6 కి. మీ పరిధిలో ఉన్న ముళ్లబండ, పాదాల గట్టు మీదుగా రాక్షసపడి గుండ వద్దకు చేరుకుంది. భయంకరమైన వాతావరణంలో కంఛాబీర వంశానికి చెందిన బసవరాజు అనే భక్తుడు తన ఎడమ కాలు పిక్కల నుంచి డబ్బణంను గుచ్చుకుని వచ్చిన రక్తాని మణి, మల్లాశురులుగా పిలిచే రాక్షస గుండ్లకు సమర్పించాడు (విసరడం). అక్కడి నుంచి మాళ మల్లేశ్వరస్వామి ఉత్సవ విగ్రహాలను శమీవృక్ష వద్దకు తీసుకెళ్లారు. ఉత్సవంలో పాల్గొన్న భక్తులు కర్రలు, మిగిలిన ఆయుధాలను ఉంచి ఉత్సవ విగ్రహాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం శమీవృక్షం మీదుగా మాళ మల్లేశ్వర విగ్రహాలతో ఎదురు బసవన్న గుడి వైపుకు బయలుదేరాయి. అక్కడ ఆలయ ప్రధాన పూజారి గిరిస్వామి భవిష్యవాణి(కార్ణీకం) చెప్పిన తర్వాత జైత్రయాత్ర మల్లప్ప గుడిలోని సింహాసన కట్టకు చేరడంతో బన్ని ఉత్సవం ముగుస్తుందని ఆలయ నిర్వాహాకులు, భక్తులు తెలిపారు. -
కర్నూలు జిల్లా దేవరగట్టులో బన్నీ ఉత్సవం
-
బన్నీ ఉత్సవంలో విషాదం
-
బన్నీ ఉత్సవంలో విషాదం
కర్నూలు : దసరా సందర్భంగా కర్నూలు జిల్లాలోని దేవరగట్టులో శనివారం రాత్రి బన్నీ ఉత్సవం (కర్రల సమరం) జరిగింది. ఆలూరు సమీపంలోని దేవరగట్టు వద్ద జరిగిన ఈ సమరంలో సులువాయికి చెందిన ఈరన్న అనే వ్యక్తి మృతిచెందగా మరో 60 మంది గాయపడ్డారు. వారిలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను ఆదోని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మాళ మల్లేశ్వరస్వామి ఆలయంలో దేవతామూర్తులైన మాళమ్మ, మల్లేశ్వరులకు విజయదశమి పర్వదినాన రాత్రి 12 గంటలకు కల్యాణం జరిపిస్తారు. అనంతరం కొండ పరిసర ప్రాంతాల్లోని పాదాలగట్టు, రక్షపడ, శమీవృక్షం, ఎదురు బసవన్నగుడి ప్రాంతాల్లో దివిటీల వెలుతురులో విగ్రహాలను ఊరేగిస్తారు. ఈ ఉత్సవమూర్తులను దక్కించుకోవడానికి మూడు గ్రామాల ప్రజలు ఓ వర్గంగా ఐదు గ్రామాల ప్రజలు మరో వర్గంగా ఏర్పడి కర్రలతో తలపడ్డారు. ఉత్సవం సందర్భంగా రక్తపాతం జరగకుండా చూసేందుకు దాదాపు 1200 మంది పోలీసులతో భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. అయినప్పటికీ కాగడాలు అంటుకుని ఒకరు మృతిచెందగా కర్రల దాడిలో 60 మంది గాయాలపాలయ్యారు. -
దేవరగట్టులో కర్రల సమరం : 30 మందికి గాయాలు
కర్నూలు : కర్నూలు జిల్లా దేవరగట్టులో దసరా ఉత్సవాల్లో భాగంగా జరిగిన కర్రల సమరం రక్తసిక్తంగా మారింది. ఈ సమరంలో 30 మందికిపైగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించింది క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అయితే వారిలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. దీంతో వారిని మెరుగైన వైద్య చికిత్స కోసం కర్నూలు నగరంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గురువారం దేవరగట్టులో జరిగిన కర్రల సమరంలో 10 గ్రామాలకు చెందిన వేలాది మంది ప్రజలు పాల్గొన్నారు. -
ముగిసిన దేవరగట్టు బన్నీ ఉత్సవం
దేవరగట్టు : తరతరాల రక్త చరిత్ర మరోసారి పునరావృతమైంది. మాల మల్లేశ్వర స్వామి కోసం జరిగిన కర్రల సమరంలో తలలు పగిలాయి. రక్తం చిమ్మింది. అర్ధరాత్రి ఒకటిన్నరకు కర్నూలు జిల్లా హోలగంద మండలంలోని దేవరగట్టులో బన్ని ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. మొదటగా మల్లమ్మ మల్లేశ్వరుడికి వివాహం జరిపించారు. అనంతరం ఉత్సవమూర్తుల ఊరేగింపు మొదలైంది. ఇది సుమారు అర్ధరాత్రి రెండున్నరకు.. అంతా చీకటి.. చేతుల్లో కాగడాలు.. ఇదే సమయంలో కర్రల సమరం జరిగింది. ఆ ఉత్సవ మూర్తుల విగ్రహాలను తమ గ్రామాని తీసుకెళ్లడానికి గ్రామస్థులు కర్రలతో ఒకరినొకరు కొట్టుకున్నారు. వందల మంది తలలు పగిలాయి. భక్తి పేరుతో జరిగిన సమరంలో 100 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. నిలువరించడానికి లాఠీచార్జ్ చేసిన పోలీసులపై గ్రామస్తులు రాళ్లు , కర్రలతో దాడి చేశారు. గ్రామస్తుల దాడిలో 12 మంది పోలీసులు కూడా గాయపడ్డారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. కాగా కొందరు అకతాయిలు.. కాగడాలను గాల్లోకి విసిరారు. దీంతో నిప్పు రవ్వలు మహిళలపై పడి తీవ్రగాయాలయ్యాయి. కొద్దిసేపు ఆ ప్రాంతంతో ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు లాఠీచార్జి చేసి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. గతం కంటే ఈ యేడాది తలలు పగిలిన వారి సంఖ్య చాలా తక్కువ ఉందని పోలీసులు చెప్పారు. కర్రల సమరం మొత్తాన్ని వీడియో తీసినట్లు.. కావాలని అల్లర్లకు పాల్పడినవారిపై చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.