
ఆంధ్రప్రదేశ్‌లో ప్రతి ఏటా దసరా పండుగ సందర్భంగా కర్నూలు జిల్లా దేవరగట్టులో బన్నీ ఉత్సవాలు గుర్తుకొస్తాయి

ఈ ఏడాది కూడా కర్రల సమరం జరిగింది.. పలు గ్రామాల ప్రజలు మాళ మల్లేశ్వరస్వామి ఉత్సవమూర్తులను దక్కించుకునేందుకు కర్రలతో తలపడ్డారు.

ఈ ఏడాది కూడా సంప్రదాయం ప్రకారం బన్నీ ఉత్సవాన్ని నిర్వహించారు. అయితే, ఆదివారం తెల్లవారుజామున జరిగిన కర్రల సమరంలో హింస చెలరేగింది.. కర్రలతో ఇరువర్గాల ప్రజలు కొట్టుకోవడంతో 70 మందికి గాయాలయ్యాయి





























