kurnool distirict
-
వీడియో: కాసేపట్లో పెళ్లి.. సినిమా రేంజ్లో పెళ్లి కూతురు జంప్
సాక్షి, కర్నూలు: కాసేపట్లో జరగబోయే వివాహ తంతుకు సినిమా రేంజ్ సీన్ తోడైంది. మరికొన్ని గంటల్లో పెళ్లి అనగా.. పెళ్లి కూతురు ప్రియుడితో కలిసి జంప్ అయింది. ఈ ఘటన కర్నూలు జిల్లాలో చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.వివరాల ప్రకారం.. కర్నూలు జిల్లా కృష్ణగిరి మండలం లక్కసాగరానికి చెందిన అబ్బాయితో.. అనంతపురానికి చెందిన వైష్ణవికి పెద్దలు పెళ్లి నిశ్చయించారు. పత్తికొండలోని గోపాల్ ప్లాజా కళ్యాణ మండపంలో పెళ్లికి భారీగా ఏర్పాట్లు చేశారు. వధువు, వరుడు.. వారి కుటుంబ సభ్యులు మండపానికి చేరుకున్నారు.. తెల్లవారితే పెళ్లి కాగా.. ఇంతలోనే ఊహించని పరిస్థితి ఎదురైంది.పెళ్లి ఇష్టం లేని పెళ్లికూతురు తన ప్రియుడికి ఫోన్ చేయడంతో అతను స్నేహితుడితో కలిసి మండపానికి వచ్చారు. ఈ క్రమంలో కల్యాణ మండపం నుంచి తెల్లవారుజామున ప్రియుడితో కలిసి బైక్‌పై పారిపోయారు. ఈ ఘటనతో పెళ్లి ఆగిపోయింది. కూతురు పెళ్లి నిలిచిపోవడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరు అయ్యారు. అయితే కల్యాణ మండపం నుంచి పెళ్లి కూతురు వెళ్లి పోతున్న దృశ్యాలు స్థానిక సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. దీంతో పోలీసులకు తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
కర్నూలు జిల్లా : అర్ధరాత్రి రణరంగం.. దేవరగట్టు బన్నీ ఉత్సవం (ఫొటోలు)
-
టీడీపీ నేత హత్యకేసు: వెలుగులోకి దారుణ నిజాలు
కర్నూలు జిల్లా: టీడీపీ నేత శ్రీనివాసులు హత్య కేసులో దారుణ నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. శ్రీనివాసులను సొంత పార్టీ వారే దారుణం హత్య చేసినట్లు విచారణలో తేలింది. టీడీపీ పార్టీకి చెందిన నలుగురు వ్యక్తులతో పాటు, మరో ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయ బయటపడింది. టీడీపీలో శ్రీనువాసులకు లభిస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక హత్యకు పాల్పడినట్లు పోలీసుల విచారణలో తేలింది. అయితే ఈ హత్యను వైఎస్సార్సీపీకి అంటగట్టే ప్రయత్నం చేశారు మంత్రి నారా లోకేష్, హత్య వెలుగులోకి రాగానే వైఎస్సార్సీపీ చేసిందంటూ ఎల్లో మీడియా సైతం నానా హంగామా చేసింది.శ్రీనివాసులను హత్య చేసిన వారు సొంత పార్టీ నాయకులే కావడంతో స్థానికంగా ఉన్న టీడీపీ నేతలు నోరు మెదపడం లేదు. ఈ సంఘటన ఆగస్టు 14 తేదీన చోటు చేసుకోగా, నేడో-రేపో నిందితులను మీడియా ముందు ప్రవేశ పెట్టే అవకాశాలు కనబడుతున్నాయి. -
బీజేపీ Vs టీడీపీ.. ఆదోనిలో రచ్చ రచ్చ
సాక్షి, కర్నూలు జిల్లా: ఆదోనిలో బీజేపీ ఎమ్మెల్యే, టీడీపీ మాజీ ఎమ్మెల్యే మధ్య విభేదాలు రచ్చకెక్కాయి. బీజేపీ ఎమ్మెల్యే పార్థసారథి, టీడీపీ మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు బహిరంగ విమర్శలకు దిగుతున్నారు. బీజేపీ ఎమ్మెల్యే పార్థసారధిపై మీనాక్షి నాయుడు తీవ్ర విమర్శలు గుప్పించారు.‘‘ఎన్నికల ముందు ఒక మాట ఎన్నికల తరువాత ఒకలా బీజెపి ఎమ్మెల్యే మాట్లాడుతున్నాడు. ఎమ్మెల్యే పార్థసారధి వైఖరి సరైంది కాదు. బీజేపీ ఎమ్మెల్యే పార్థసారథి కూటమి ఎమ్మెల్యే అని మరచి పోతున్నాడు. ఎమ్మెల్యే పార్థసారథి వాస్తవాలు చెప్పాలి. ఏది పడితే అది చెబితే ప్రజలు నమ్మే స్థితిలో లేరు. ప్రభుత్వ కార్యక్రమాలకు నన్ను పిలువకుండా దూరం పెట్టారు. టీడీపీ వారికి ఏ పనులు చేయడం లేదు. ఇలాగే కొనసాగితే మున్ముందు ఇబ్బందులు పడాల్సి వస్తుందంటూ బీజేపీ ఎమ్మెల్యేకి టీడీపీ మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు వార్నింగ్ ఇచ్చారు.టీడీపీ మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడికి ఎమ్మెల్యే పార్థసారధి తిరిగి కౌంటర్ ఇస్తూ.. తాను చెప్పిందే వినాలి అన్నట్లు మీనాక్షి నాయుడు వ్యవహరిస్తున్నారని.. బీజేపీలో, జనసేనలో ఏ వర్గాలు లేవు. కాని టీడీపీలో ఐదు వర్గాలు ఉన్నాయి. పది శాతం తన గురించి ఆలోచిస్తే 90 శాతం బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీల నాయకులు, కార్యకర్తల గురించే ఆలోచిస్తాను. సమస్య అంతా మీనాక్షినాయుడుతోనే’’ అంటూ వ్యాఖ్యానించారు. ‘‘కూటమి కార్యకర్తలు, నాయకులు నిరుత్సాహంగా ఉన్నారు. కార్యక్రమాలకు నేను పిలుస్తున్నా వాళ్లే రావడం లేదని పార్థసారధి అన్నారు. -
YSRCP కర్నూలు అభ్యర్థులు వీళ్లే!
కర్నూలు జిల్లాలో అన్ని నియోజకవర్గాల గెలుపే లక్ష్యంగా.. సామాజిక సమీకరణాలు.. సర్వేల ఆధారంగాసేకరించిన అభ్యర్థుల గెలుపోటములను ప్రామాణికంగా తీసుకుని అభ్యర్థుల్ని ఎంపిక చేసింది వైఎస్సార్సీపీ. -
సీఎం జగన్ కర్నూలు జిల్లా పర్యటన ఫొటోలు
-
కర్నూలులో సినీ నటి సంయుక్త మీనన్ సందడి (ఫొటోలు)
-
ముగిసిన సీఎం జగన్ ఉమ్మడి కర్నూలు పర్యటన
Updates.. ముగిసిన సీఎం జగన్ నంద్యాల పర్యటన బటన్ నొక్కి వైఎస్సార్ ఈబీసీ నిధుల్ని జమ చేసిన సీఎం జగన్ మొత్తం 4, 19, 583 మంది ఖాతాల్లో నేడు రూ. 629.37 కోట్ల రూపాయలు జమ చేసిన సీఎం జగన్ పవన్, బాబులపై పంచులు.. సీఎం జగన్ ఫుల్ స్పీచ్ కోసం క్లిక్ చేయండి ముగిసిన సీఎం జగన్ ప్రసంగం ఇదే బనగానపల్లెలో ఇళ్లు స్థలాలు ఇస్తే.. ఇదే జనార్థన్‌రెడ్డి కోర్టుకు పోయారు ఇంటి స్థలాలు ఇస్తే సీఎం జగన్‌కు, రామిరెడ్డికి మంచి పేరు వస్తుందనే ఇదంతా ప్రస్తుతం ఈ వ్యవహారంలో మన ప్రభుత్వం కోర్టుల్లో యుద్ధం చేయాల్సి వస్తోంది 3,200 కుటుంబాలకు త్వరలో శుభవార్త వింటామని కోరుకుంటున్నా మీ బిడ్డ మీకు ఎప్పుడూ మంచి చేసేందుకు అండగా ఉంటాడు ఓటు బటన్ నొక్కేప్పుడు పొరపాటు జరిగితే.. పేదల భవిష్యత్తు మారాలన్నా.. అవ్వాతాతల పెన్షన్ ఇంటికే చేరాలన్నా.. అక్కచెల్లెమ్మల పిల్ల చదువులు గొప్పగా సాగాలన్నా.. రైతన్నల ముఖంలో ఆనందం చూడాలన్నా.. వ్యవసాయం ఒక పద్ధతిగా జరగాలన్నా.. బటన్‌నొక్కడం నేరుగా ఖాతాల్లో డబ్బు పడాలన్నా.. ఒక వలంటీర్ వ్యవస్థ ఉండాలన్నా.. కేవలం ఒక్క మీ బిడ్డ పాలనలో జరుగుతాయని మరిచిపోవద్దు పొరపాటు జరిగితే.. అన్నింటికి తెరపడుతుంది గ్రామాల్లో లంచాలు వివక్ష వస్తాయి పేదల బతుకులు, చదువులు కూడా ఆవిరైపోతాయి.. అంధకారం అయిపోతాయి.. అన్యాయం అయిపోయే పరిస్థితి వస్తుందని గుర్తు ఎరగమని సెలవు తీసుకుంటున్నా.. రామిరెడ్డి గెలిస్తే.. జగనన్న ప్రభుత్వం వస్తుంది ఒక జగనన్న సీఎంగా ముఖ్యమంత్రిగా ఉంటే మంచి జరుగుతుందని గుర్తు పెట్టుకోండి ఇక్కడి టీడీపీ అభ్యర్థి ధనికుడు.. రామిరెడ్డికి అంతస్తోమత లేదు వాళ్లు డబ్బులు ఇస్తే తీసుకోండి.. కానీ, ఓటు బటన్ నొక్కేటప్పుడు రామిరెడ్డి అన్నకు ఓటేయండి రామిరెడ్డికి ఓటేస్తే.. జగనన్న ముఖ్యమంత్రి అవుతాడని గుర్తుపెట్టుకోండి కాబట్టి జగన్‌ను సీఎం చేయాలంటే రామిరెడ్డిని గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది చిన్నవిన్నపం చేసిన సీఎం జగన్ ఎన్నికల కోడ్ మరో మూడు నాలుగు రోజుల్లో రాబోతోంది బటన్ నొక్కే కార్యక్రమం పూర్తి చేసేశాం డబ్బు జమ కావడం కొంచెం ఆలస్యం కావొచ్చు వారం అటు ఇటుగా జరుగుతుంది ప్రతీ ఒక్కరికీ డబ్బులు చేరతాయి ఈ రెండువారాల పాటు ఓ ఈనాడు చదవొద్దు.. ఆంధ్రజ్యోతి చూడొద్దు.. టీవీ5 చూడొద్దు ఆటోమేటిక్‌గా డబ్బులు పడతాయి ఈ యుద్ధం చెడిపోయిన మీడియ వ్యవస్థతో కూడా మంచి జరిగినా కూడా కుళ్లిపోయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 తో కూడా యుద్ధం చేస్తున్నాం దేవుడి దయతో.. ప్రజలకు మరింత మంచి చేయాలని మనసారా ఆకాంక్షిస్తూ సెలవు తీసుకుంటున్నా మాయల మాంత్రికులపై ‘ఓటు’ అనే దివ్యాస్త్రం ప్రయోగించండి 2014లో మోసపూరిత హామీలు ఇచ్చారు మళ్లీ ఇప్పుడు పవన్, చంద్రబాబు, బీజేపీ కూటమిగా ఏర్పడ్డాయి మళ్లీ మోసం చేసందుకు ప్రతీ ఇంటికి కేజీ బంగారం, బెంజికార్ ఇస్తామంటారు రాబోయే రోజుల్లో మరిన్ని మోసాలతో ముందుకు వస్తారు ఈ యుద్ధంలో నాకు మోసం చేయడం చేతకాదు రాబోయే రోజుల్లో మోసాలు అబద్ధాలు మరిన్ని చెబుతారు వాళ్లకు గుణపాఠం చెప్పేందుకు ఓటు అనే దివ్యాస్త్రం ప్రయోగించండి చంద్రబాబు 2014లో ఎగనామం పెట్టాడు 2014లో ఇదే ముగ్గురు ఒక కూటమిగా మన ముందుకు వచ్చారు ఇదే పవన్, దత్తపుత్రుడు బీజేపీతో కలిసి ఇప్పుడు చెబుతున్నట్లే.. అప్పుడు మోసపూరిత హామీలు ఇచ్చారు వాగ్దానాలపై చంద్రబాబు సంతకం పెట్టి మరీ మోసం చేశారు చంద్రబాబు.. గత ఎన్నికల్లో ఒక్క మేనిఫెస్టో హామీ అయినా అమలు చేశారా? చంద్రబాబు, దత్తపుత్రుడ్ని పేర్లు చెబితే.. చంద్రబాబు పేరు చెబితే.. అక్కాచెల్లెమ్మలకు ఆయన చేసిన వంచన గుర్తొస్తుంది పొదుపు సంఘాల మహిళలకు చంద్రబాబు చేసిన దగా గుర్తొస్తుంది చంద్రబాబు పేరు చెబితే.. ఒక్క మంచి గుర్తుకు రాదు ఒక్క పథకం కూడా గుర్తుకు రాదు దత్తపుత్రుడి పేరు చెబితే.. అక్కాచెల్లెమ్మలకు వివాహ వ్యవస్థను భ్రష్టుపట్టించిన మోసగాడు గుర్తొస్తాడు ఐదేళ్లకొకసారి కార్లను మార్చేసినట్లు భార్యలను మార్చే ఓ మ్యారేజ్ స్టార్ గుర్తొస్తాడు ఒకరికి విశ్వసనీయత.. మరొకరికి విలువలు లేవు ఇలాంటి వీళ్లు మూడు పార్టీలుగా.. కూటమిగా మీ బిడ్డ మీదకు యుద్ధానికి వస్తున్నారు కాదు కాదు.. మీ బిడ్డ మీదకు కాదు.. పేదల వాడి భవిష్యత్తు మీదకు యుద్ధంగా వస్తున్నారు సీఎం జగన్ ప్రసంగం.. గత ప్రభుత్వానికి మన ప్రభుత్వాని తేడా గమనించండి గతంలో ఏ పథకం ఉందో తెలియదు.. ఏ పథకం ఇస్తారో తెలియదు మహిళల ఖాతాల్లో చంద్రబాబు ఒక్క రూపాయి కూడా వేయలేదు లబ్ధిదారులు ఏ పార్టీకి ఓటేశారో అని కూడా మేం చూడలేదు అర్హులైన అన్ని వర్గాల వారికి పథకాలు అందజేస్తున్నాం ఆర్థికంగా వెనుకబడిన ఓబీసీలను ఆదుకున్నాం సీఎం జగన్ ప్రసంగం.. పేదరికానికి కులం ఉండదు పేదవాళ్లను ఆదుకునే గుణం ప్రభుత్వానికి ఉండాలి పేదలను ఆదుకునేందుకు పాలకులకు గొప్ప మనసు ఉండాలి వైఎస్సార్ ఈబీసీ అనేది.. ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన కార్యక్రమం కాదు ఇది పేదరికం వల్ల ఎవరూ ఇబ్బంది పడకూడదనే మన ప్రభుత్వం ఈ పథకం తీసుకొచ్చింది వైఎస్సార్ ఈబీసీ పేద మహిళలకు ఎంతో మేలు జరిగింది 4, 19, 583 మంది అక్కచెల్లెమ్మల ఖాతాల్లోకి ఇవాళ రూ. 629.37 కోట్లు జమ చేస్తున్నాం మొత్తంగా మూడు దఫాల్లో.. 4 లక్షల 95 వేల మందికి మంచి జరిగింది రూ.1877 కోట్ల రూపాయలు వైఎస్సార్ ఈబీసీ పథకం ద్వారా మాత్రమే మంచి చేయగలిగాం కొత్తగా 65 వేల మంది ఈ సాయం అందుకుంటున్నారు మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు వైఎస్సార్ ఈబీసీ నేస్తం సీఎం జగన్ ప్రసంగం ప్రారంభం నంద్యాల జిల్లా బనగానపల్లెలో వైఎస్సార్ ఈబీసీ నేస్తం కార్యక్రమం పాల్గొని ప్రసంగిస్తున్న సీఎం వైఎస్ జగన్ లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ చేయనున్న సీఎం జగన్ కాసేపట్లో వైఎస్సార్ ఈబీసీ నేస్తం విడుదల వైఎస్సార్ ఈబీసీ నేస్తంపై స్పెషల్ ఈవీ ప్రదర్శన మొత్తం 4, 19, 583 మంది ఖాతాల్లో నేడు రూ. 629.37 కోట్ల రూపాయలు జమ చేయనున్న సీఎం జగన్ వైఎస్సార్ ఈబీసీ పథకం.. కార్యక్రమం ప్రారంభం బనగానపల్లె వేదిక వద్దకు సీఎం జగన్ సభావేదిక వద్ద ఈబీసీ నేస్తం ఫొటో గ్యాలరీని ప్రారంభించిన సీఎం జగన్ వైఎస్సార్ విగ్రహానికి పూలమాల.. జ్యోతిప్రజ్వలనతో కార్యక్రమం ప్రారంభం వేదికపైకి చేరుకున్న సీఎం జగన్, స్థానిక నేతలు, అధికారులు బనగానపల్లె చేరుకున్న సీఎం జగన్ నంద్యాల జిల్లా బనగానపల్లెలో వైఎస్సార్ ఈబీసీ నేస్తం పథకం నిధుల జమ కార్యక్రమం బటన్ నొక్కి నిధులు జమ చేయనున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అంతకు ముందు.. బహిరంగ సభలో లబ్ధిదారుల్ని ఉద్దేశించి ప్రసంగం లా వర్సిటీ శంకుస్థాపన కార్యక్రమంలో సీఎం జగన్ మాట్లాడుతూ.. అభివృద్ధి వీకేంద్రీకరణే వైఎస్సార్సీపీ ప్రభుత్వ ఉద్దేశం హైదరాబాద్ కు రాజధానిని తరలించే సమయంలోను హైకోర్టు ఏర్పాటు చెయ్యాలని తీర్మానించారు కర్నూలులో హైకోర్టు పెడతామని ఇది వరకే చెప్పాం శ్రీబాగ్ ఒప్పందం ప్రకారం అడుగులేస్తున్నాం శ్రీబాగ్ ఒడంబడికలో భాగంగా ఈ ప్రాంతానికి సరైన న్యాయం జరిగేందుకు నేషనల్ లా యూనివర్శిటి దోహదపడుతుంది కర్నూలులో ఎన్హెచ్ఆర్సీ, లోకాయుక్త, హైకోర్టు భవనాలు నిర్మిస్తాం నేషనల్ లా యూనివర్శిటి నిర్మాణానికి అడుగులు వేగంగా పడాలని కొరుతున్నా లా వర్సిటీ కోసం వెయ్యి కోట్లు కేటాయించాం ఈ యూనివర్శిటితో పాటు న్యాయపరమైన అంశాలకు సంబంధించిన ఎపి లీగల్ మొట్రాలజికల్ కమిషన్, లేబర్ కమిషన్, లేబర్ కమిషన్ , వ్యాట్ అప్పిలేట్ కమిషన్, వక్ఫ్ బోర్డు, మానవహక్కుల కమిషన్, ఏర్పాటు కానున్నాయని చెప్పడానికి సంతోషిస్తున్నా వీటి వల్ల ఈ ప్రాంతానికి మంచి జరగాలని కోరుతున్నా కర్నూల్లో.. లా యూనివర్సిటీ పనులు ప్రారంభం జగన్నాథగట్టులో లా యూనివర్సిటీ పనులకు శ్రీకారం చుట్టిన సీఎం జగన్ భూమి పూజతో భవన నిర్మాణ పనులను ప్రారంభించిన సీఎం జగన్ లా వర్సిటీ పైలాన్ ఆవిష్కరణ కల్లూరు మండలం లక్ష్మీపురం జగన్నాథగట్టుపై 150 ఎకరాల్లో రూ.1,011 కోట్ల రూపాయల వ్యయంతో నేషనల్ లా యూనివర్సిటీ నిర్మాణం.. మరికాసేపట్లో శంకుస్థాపన చేయనున్న సీఎం జగన్ కర్నూల్ చేరుకున్న సీఎం జగన్ ఓర్వకల్ ఎయిర్ పోర్టుకు చేరుకున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కర్నూలు శివారుల్లొని జగన్నాథగట్టుకు ప్రత్యేక హెలీకాఫ్టర్ లో పయనం మరికాసేపట్లో జాతీయ న్యాయ విశ్వ విద్యాలయానికి శంకుస్థాపన.. భూమి పూజ ►కర్నూలు, నంద్యాల, అనంతపురం జిల్లాల పర్యటనకు బయలుదేరిన సీఎం వైఎస్ జగన్ ►ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నేడు ఉమ్మడి కర్నూలు జిల్లాల్లో పర్యటించనున్నారు. కర్నూలులో జాతీయ న్యాయ విశ్వ విద్యాలయానికి శంకుస్థాపన చేస్తారు. రాష్ట్రంలో ఇది రెండో నేషనల్ లా యూనివర్సిటీ. అలాగే.. నంద్యాల జిల్లా బనగానపల్లెలో వైఎస్సార్ ఈబీసీ నేస్తం కార్యక్రమంలో పాల్గొని లబ్ధిదారులకు నగదును బటన్ నొక్కి వారి ఖాతాల్లో జమ చేయనున్నారు. పర్యటన సాగేది ఇలా.. ఈబీసీ నేస్తం పథకం నగదు జమ కార్యక్రమం ప్రారంభించి.. బహిరంగ సభలో ప్రసంగిస్తారు ప్రసంగం ముగిసిన తర్వాత లబ్ధిదారుల ఖాతాల్లోకి బటన్ నొక్కి నగదు జమ చేస్తారు కార్యక్రమం ముగిశాక మధ్యాహ్నాం 2.30గం ప్రాంతంలో.. ఓర్వకల్ ఎయిర్ పోర్టుకు చేరుకుని గన్నవరం బయలుదేరుతారు ఈ రెండు జిల్లాల పర్యటనలోనే.. స్థానిక ప్రజాప్రతినిధులతోనూ ఆయన కాసేపు చర్చలు జరుపుతారని తెలుస్తోంది. -
ఎన్నికలు సమీపిస్తున్న వేళ మళ్లీ తెరపైకి..!
కొందరు నాయకులు వర్షా కాలంలో వచ్చే కప్పల్లా ఉంటారు. వర్షం పడిన వెంటనే కుప్పలుగా కప్పలు వస్తారు. బెకబెకమంటారు. అలాగే ప్రతిపక్షంలోని కొందరు నేతలు ఎన్నికలు వస్తున్నాయనగానే మేము వచ్చేశాం అంటారు. మీటింగ్‌లతో హల్ హల్ చేస్తుంటారు. ఓడిపోగానే మాయమైపోయి...ఎన్నికలు రాగానే ప్రత్యక్షమయ్యే వీరిని చూసి ప్రజల్లో ఉండే నాయకులకు మండుకొస్తుంది. ఇప్పుడు కర్నూల్ జిల్లాలో ఓ టీడీపీ నేత అలాగే ప్రత్యక్షం కావడంతో అక్కడి పార్టీ నేతలు ఖంగు తిన్నారు. ఇన్నాళ్ళు ఏమయ్యారంటూ నిలదీస్తున్నారు. ఇంతకీ ఆ నేత ఎవరు? ఆ నియోజకవర్గం ఏది? కర్నూలు జిల్లాలో ఆదోని రాజకీయాలే వేరులే అన్నట్లుగా సాగుతున్నాయి. 2014, 2019 ఎన్నికలలో వరుసగా రెండుసార్లు ఈ నియోజక వర్గం నుంచి వైఎస్సార్ సీపీ తరఫున ఎల్లారెడ్డి సాయిప్రసాద్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలుపొందారు . అంతకు ముందు టీడీపీ నేత మీనాక్షి నాయుడు కూడా రెండు సార్లు ఆదోని ఎమ్మెల్యేగా పనిచేశారు. టీడీపీ తరపున బరిలోకి దిగిన మీనాక్షినాయుడిని మూడుసార్లు ఓడించారు సాయిప్రసాద్ రెడ్డి. 2019 ఎన్నికల్లో ఓటమి పాలైన తరువాత రాజకీయాల్లో మీనాక్షినాయుడి ఉనికి లేకుండా పోయింది. నియోజక వర్గంలో పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు . క్యాడర్ కూడా మిన్నుకుండిపోయారు . ఎవరి దారి వారిదన్నట్లుగా కార్యకర్తలు చెల్లా చెదురయ్యారు. కుల మత ప్రాంత రాజకీయాలకు అతీతంగా వైఎస్ జగన్ సంక్షేమ పథకాలను అందిస్తుండడంతో టీడీపీకి చెందిన చాలా మంది వైఎస్సార్సీపీలో చేరిపోయారు. దాంతో ఆదోని నియోజక వర్గంలో ఎల్లో పార్టీ జాడలు దాదాపు లేకుండా పోయాయి. ఎన్నికలలు సమీపిస్తున్న వేళ మళ్లీ తెరపైకి వచ్చాడు మీనాక్షి నాయుడు. ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ప్రెస్ మీట్లతో హడావుడి చేస్తున్నారు. ప్రజా సమస్యలు పట్టని నేతగా పేరు పొందిన ఆయన ...ఈ సారి టికెట్ కోసం హల్ చల్ చేయడంపై సొంతపార్టీ నేతలే కస్సుబస్సుమంటున్నారు . ఇన్నాళ్లు నియోజక వర్గంవైపు కన్నెత్తిచూడని మీనాక్షినాయుడు .. ఇప్పుడొచ్చి టికెట్ కోసం గంతులేయడమేంటని ఈసడించుకుంటున్నారు. రాబోయే ఎన్నికల్లో మీనాక్షికి టికెట్ ఇస్తే సహకరించేది లేదని,నేరుగా చంద్రబాబుకే తెగేసి చెబుతున్నారట. నారా లోకేష్ యువగళం పాదయాత్ర సందర్భంగా మీనాక్షినాయుడికి వ్యతిరేకంగా వ్యవహరించిన గుడిసెల కృష్ణమ్మ , మైనార్టీ నేత సౌదీ రవూఫ్ నారాలోకేష్ తో సపరేటుగా మంతనాలు చేస్తున్నట్టు సమాచారం. దాంతోటీడీపీ నేతలు రెండువర్గాలుగా చీలిపోయి తెరవెనుక పావులు కదుపుతున్నారు . మీనాక్షినాయుడికి చెక్ పెట్టడానికి బీసీ , మైనార్టీ నేతలు గట్టిగనే ఉన్నట్లు తెలుస్తుంది. ఇది ఇలా ఉంటే కమ్మ సామాజిక వర్గానికి చెందిన మీనాక్షి నాయుడికి టీడీపీ అధిష్టానం టికెట్ కేటాయిస్తుందా ? లేదా బిసిల వైపు చంద్రబాబు మెగ్గుచూపుతారా ?అన్న అంశం తేలాల్సి వుంది. -
కర్నూలులో ఏ కండువా? ఏ దారి?
నియోజకవర్గంలో తండ్రి కాషాయ కండువా కప్పుకుని తిరుగుతున్నాడు. కొడుకేమో పచ్చ కండువా వేసుకుని రాజకీయాలు చేస్తున్నాడు. దీంతో వారి కేడర్‌కు ఏ కండువా కప్పుకోవాలో అర్థం కాక అయోమయంలో ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో పచ్చ పార్టీ సీటు మైనారిటీకి ఇస్తారనే ప్రచారంతో కొడుకు పార్టీని పట్టించుకోవడంలేదట. దీంతో అక్కడి రాజకీయాలు మరింత గందరగోళంగా మారాయనే టాక్ నడుస్తోంది. ఇంతకీ ఆ తండ్రీ కొడుకులు ఎవరు? లీడర్లలో క్లారిటీ మిస్ అయిందా? గత ఎన్నికల్లో కర్నూల్ జిల్లాలో తెలుగుదేశం పార్టీ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. అప్పటివరకు పచ్చ పార్టీలో రాజ్యసభ సభ్యుడిగా ఉన్న టీజీ వెంకటేశ్... పార్టీ ఓటమితో చంద్రబాబు సలహామేరకు కాషాయ కండువా కప్పుకున్నారు. కాని ఆయన కుమారుడు భరత్ మాత్రం టీడీపీలోనే కొనసాగుతున్నాడు. కర్నూల్ నుంచి అసెంబ్లీకి పోటీ చేసిన వెంకటేశ్ కుమారుడు భరత్ ఎన్నికల్లో ఓటమి తర్వాత చతికిలపడ్డారు. రాజకీయాలకు విరామం ఇచ్చి వ్యాపారాల్లో మునిగిపోయారు. దీంతో వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తారా లేదా అనే సందేహంతో వారి కేడర్‌లో అయోమయం కొనసాగుతోంది. మరోవైపు తండ్రి ఒక పార్టీలో...కొడుకు మరో పార్టీలో ఉండటం కూడా కేడర్‌ను ఇబ్బందికి గురిచేస్తోంది. తాము ఏ రంగు కండువా కప్పుకోవాలో అర్థంకాక జుట్టు పీక్కుంటున్నారు. కంచుకోట అలా బద్దలయింది.! ఒకప్పుడు కర్నూల్ నియోజకవర్గంలో టీజీ వెంకటేశ్ వర్గం బలంగా ఉండేది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టీజీ కంచుకోటను బద్దలు చేసింది. టీజీ భరత్ దారుణంగా ఓడిపోయాడు. రాజ్యసభ సభ్యుడుగా కొనసాగుతున్న టీజీ వెంకటేశ్ తన వర్గాన్నంతా కొడుకుకు అప్పగించాడు. వారంతా గత ఎన్నికల్లో పచ్చ జెండాలు పట్టుకుని భరత్ కోసం పనిచేశారు. ఓడిపోయాక భరత్ కేడర్‌ను పట్టించుకోవడం మానేశాడు. పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండటంతో పాటుగా..కేడర్‌తో సంబంధం లేదన్నట్లుగా వ్యవహరించడంతో వారంతా చెల్లా చెదురవుతున్నారని తెలుస్తోంది. కేడర్ దూరం కావడం భవిష్యత్‌లో భరత్‌కే నష్టం అంటున్నారు. తండ్రీ, కొడుకులిద్దరూ కలిసి వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ విజయాన్ని ముందే ఖరారు చేశారనే టాక్ నడుస్తోంది. సైకిల్ కాదు కానీ..! కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గంలో ఎక్కువ శాతం మైనార్టీలు ఉన్నారు. మైనార్టీలే మెజారిటీగా ఉండటంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మైనారిటీ నేతను ఎన్నికల బరిలో దించి విజయాన్ని అందుకుంది. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో కూడా టీడీపీకి ఏమాత్రం అవకాశాలు లేవని అర్థమవుతోంది. తండ్రీ కొడుకులు వేర్వేరు రాజకీయాలు చేస్తుండటం... కేడర్‌ను దూరం చేసుకోవడంతో వచ్చే ఎన్నికల్లో ఓటమి కోసం టీడీపీ ఇన్చార్జ్ టీజీ భరత్ స్వయంగా బాటులు వేసుకుంటున్నట్లు ఆ పార్టీలోనే చర్చ జరుగుతోంది. వచ్చే ఎన్నికల్లో టిజి భరత్ కు టిక్కెట్ వచ్చేట్లు కనిపించడంలేదని కర్నూలు నియోజకవర్గంలో ప్రచారం జోరుగా సాగుతోంది. దీంతో టీడీపీ నేతలు ఒక్కొక్కరు టిజి భరత్ కు దూరం అవుతున్నారు. టీజీ కుటుంబాన్ని నమ్ముకుంటే నిండా మునగడం ఖాయమని కార్యకర్తలు, నాయకులు భావిస్తున్నారు. తండ్రీ, కొడుకులు చెరో పార్టీలో ఉంటూ... కేడర్‌ను దూరం చేసుకోవడంతో మొత్తంగా కర్నూల్ తెలుగుదేశం పార్టీ అచేతనంగా మారిపోయింది. -పొలిటికల్ ఎడిటర్, సాక్షి డిజిటల్ -
పునాదుల్లేని ఊరు.. ఎక్కడ ఉందో తెలుసా?
దేవనకొండ(కర్నూలు జిల్లా): పునాదులు లేకుండా ఇళ్లు నిర్మించడం సాధ్యమేనా? అవి నిలబడతాయా? ఈ ప్రశ్నలకు అవుననే సమాధానమిస్తున్నారు కరిడికొండ గ్రామస్తులు. ఈ ఊరిలో పునాదులు లేకుండా ఇళ్లు నిర్మించుకున్నారు. దశాబ్దాలుగా అవి చెక్కుచెదరకుండా ఉన్నాయి. గ్రామ సమీపంలోని బొమ్మదేవత ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. గతంలో ఏనుగుల సంచారం ఉన్న ఈ గ్రామంపై ప్రత్యేక కథనం.. చదవండి: కూలుతున్న టీడీపీ కంచుకోట.. కుప్పంలో వైఎస్సార్సీపీ రెపరెపలు మండల కేంద్రమైన దేవనకొండకు నాలుగు కిలోమీటర్ల దూరంలో కరిడికొండ గ్రామం ఉంది. కొండల మధ్య చదును ప్రాంతంలో 1952 వరకు పాత ఊరు ఉండేది. ప్రజలు పూరి గుడిసెలు వేసుకుని వ్యవసాయం చేస్తూ జీవనం సాగించేవారు. కొండల మధ్య కుంట ప్రాంతంలో ఊరు ఉండడంతో కన్నపుకుంటగా పిలిచేవారు. అయితే కుంటలో నీరు తాగేందుకు ఏనుగులు వచ్చేవి. దీంతో కాలక్రమేణా ఈ ఊరికి ‘కరి’డికొండ అనే పేరొచ్చిందని పెద్దలు పేర్కొంటున్నారు. గ్రామంలో ఆంజనేయస్వామి, చెన్నకేశవస్వామి ఆలయాలు ఉండేవి. చిన్నరాళ్లపై నిలబడిన పెద్దరాయిని గ్రామస్తులు బొమ్మ దేవతగా కొలుస్తున్నారు. ప్లేగు వ్యాధి రావడంతో పాత ఊరంతా ఖాళీ చేసి కొందరు పక్క గ్రామాలకు వెళ్లారు. గ్రామానికి చెందిన తిమ్మప్ప, రామప్ప అనే కుటుంబాలకు చెందిన వారు కొండపైకి వెళ్లి పునాదులు లేకుండా ఇళ్లు నిర్మించుకున్నారు. వారిని చూసి మిగతా వారు కూడా అక్కడే స్థావరాన్ని ఏర్పాటు చేసుకున్నారు. కొండలో బండలను తొలుస్తూ, రాళ్లు అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నారు. బొమ్మదేవత ఊరిని కాపాడుకుంటూ వస్తోందని గ్రామస్తుల నమ్మకం. శ్రావణమాసంలో ఆ దేవతకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. కనిపించని పూరి గుడిసె గ్రామంలో ప్రస్తుతం 2,450 మంది నివసిస్తున్నారు. 1,619 ఎకరాల్లో ఉల్లి, పత్తి, వేరుశనగ పంటలు పండిస్తున్నారు. పచ్చని పైర్లతో, చుట్టుతా చిన్న చిన్న కొండలతో ఆహ్లాదకరమైన వాతావరణం కనిపిస్తుంది. పునాదులు లేకుండా ఇల్లు నిర్మించుకోవడంతో రూ.3 లక్షల వరకు ఆదా అవుతోందని గ్రామస్తులు చెబుతున్నారు. గ్రామంలో ఎక్కడా పూరిగుడిసె లేదు. కొండపై తిమ్మప్పస్వామి దేవాలయం ఉంది. గ్రామ సమీపంలోని కొండల నుంచి రాళ్ల తొలచి, ఇళ్ల నిర్మాణాలకు తరలిస్తున్నారు. గ్రామంలో గతంలో 80 గృహాలు ఉండగా..ప్రస్తుతం వాటి సంఖ్య 210కి చేరుకుంది. ఎలాంటి ఇబ్బందులూ లేవు కరిడికొండలో పునాదులు లేకుండా ఇళ్లు నిర్మించుకున్నారు. ఇప్పటి వరకు ఎలాంటి ఇబ్బందులూ లేవు. కొండ ప్రాంతం కావడంతో ఇళ్లు కూలే అవకాశమే లేదు. నేరుగా నిర్మాణాలను చేపట్టవచ్చు. – అవినిధ్, హౌసింగ్ ఏఈ ఇల్లు కట్టుకోవడం చాలా సులభం కొన్నేళ్ల నుంచి మేం ఇక్కడే నివాసం ఉంటున్నాం. పునాది తీయకుండా ఇల్లు కట్టుకున్నాం. గ్రామంలో డ్రెయినేజీ సమస్య లేదు. మా ఊళ్లో ఇల్లు కట్టుకోవాలంటే చాలా సులభంగా. పక్కనే రాళ్లు కూడా దొరుకుతాయి. – పీరా, కరిడికొండ గ్రామస్తుడు అన్ని సౌకర్యాలు ఉన్నాయి మా గ్రామంలో అన్ని సౌకర్యాలు ఉన్నాయి. ప్రభుత్వం సీసీ రోడ్లు నిర్మించింది. గ్రామస్తులు సమీప కొండల్లో కారి్మకులుగా పనిచేస్తూ ఆదాయం పొందుతున్నారు. మా గ్రామం ఎత్తైన కొండపై ఉండడంతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. దేవనకొండ మండలంలోని చాలా గ్రామాల్లో గృహ నిర్మాణాలకు కరిడికొండ నుంచే రాళ్లు తరలిస్తున్నాం. – నాగేష్, కరిడికొండ గ్రామస్తుడు -
సొంతూరిపై మమకారంతో.. ఓ ‘సాఫ్ట్వేర్’ ఉద్యోగి విజయగాథ ఇదీ..
సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తూనే ఓ యువకుడు సాగు బాట పట్టాడు. వ్యవసాయంపై ఆసక్తితో సొంతూరిలోనే ఉద్యాన పంటలు పండిస్తున్నాడు. సేంద్రియ పద్ధతుల్లో దానిమ్మ, మామిడి తోటలు సాగు చేసి పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నాడు. దేవనకొండ మండలం తువ్వదొడ్డి గ్రామానికి చెందిన మధుకేశవరెడ్డి విజయగాథ ఇదీ. చదవండి: కిలో రూ.500.. అయినా తగ్గేదేలే! తుగ్గలి(కర్నూలు జిల్లా): ప్రకృతి వైపరీత్యాలు.. మార్కెట్ మాయాజాలం..రెక్కల కష్టానికి దొరకని ప్రతిఫలం.. వెరసి వ్యవసాయం వద్దనుకుంటున్న రోజుల్లో ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి సాగు బాట పట్టి పలువురికి ఆదర్శంగా నిలిచాడు. అమెరికాలో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నా ఏటా రెండు నెలలు గ్రామంలోనే ఉండి వ్యవసాయం చేస్తున్నాడు. దేవనకొండ మండలం తువ్వదొడ్డి గ్రామానికి చెందిన రేమట చిన్న తిమ్మారెడ్డి లక్ష్మిదేవమ్మల కుమారుడు మధుకేశవరెడ్డి హైదరాబాద్‌లో బీటెక్ పూర్తి చేశాడు. అమెరికాలోని మిన్నెసోటా స్టేట్‌లో ఎంఎస్(మాస్టర్ ఆఫ్‌సైన్స్) చేసి, ఎన్రిచ్ కన్సల్టింగ్ కంపెనీలో ఐటీ డైరెక్టర్‌గా పనిచేస్తున్నాడు. వ్యవసాయంపై ఇష్టం మధుకేశవరెడ్డి ఐదో తరగతి వరకు స్వగ్రామంలో, ఆ తరువాత కోడుమూరు మండలం లద్దగిరిలో చదివాడు. ఆ సమయంలో వ్యవసాయంపై ఇష్టం పెంచుకున్నాడు. చదువుకుంటూనే పొలానికి వెళ్లి వ్యవసాయ పద్ధతులను తెలుసుకునేవాడు. సాఫ్ట్వేర్ ఉద్యోగిగా ఫ్లోరిడాలో పనిచేస్తున్నాడు. టెక్సాస్ తదితర ప్రాంతాల్లో వ్యవసాయ విధానం ఎలా ఉందో అధ్యయనం చేశాడు. మామిడి తోట.. సొంతూరిపై మమకారంతో.. అమెరికా నుంచి ప్రతి సంవత్సరం స్వగ్రామానికి వచ్చేవాడు. ఇక్కడ ఉన్న పొలాలను పరిశీలించి పండ్లతోటల సాగు చేపట్టాలని నిర్ణయించుకున్నాడు. ఐదేళ్ల క్రితం సోదరులు మద్దిలేటి రెడ్డి, మహేశ్వరరెడ్డి సహకారంతో 40 ఎకరాల్లో దానిమ్మ, 25 ఎకరాల్లో మామిడి తోటల పెంపకం చేపట్టాడు. దానిమ్మ సాగుకు ఎకరాకు రూ.లక్ష చొప్పున పెట్టుబడి పెట్టాడు. శాస్త్రవేత్తల సలహాలు తీసుకుంటూ.. అమెరికాలో ఉంటూనే ఎప్పటికప్పుడు దానిమ్మ, మామిడి ఇతర పంటలపై శాస్త్రవేత్తల సలహాలు తీసుకుంటున్నాడు. అక్కడి నుంచే సోదరులకు ఆన్లైన్ వీడియో కాల్ చేసి సాగుకు అవసరమైన సూచనలిస్తూ వచ్చాడు. పది ఎకరాల మామిడి తోట నుంచి రూ.20 లక్షల ఆదాయం పొందాడు. అనుకూలిస్తే దానిమ్మ కూడా ఆశించిన దిగుబడులు రావచ్చని చెబుతున్నాడు. సేంద్రియ పద్ధతులతో.. సేంద్రియ పద్ధతుల్లో తోటలు సాగు చేస్తున్నారు. ఇందు కోసం 30కి పైగా ఆవులను పెంచుతున్నారు. రసాయన ఎరువులు పూర్తిగా తగ్గించి సేంద్రియ ఎరువు వాడుతున్నారు. ఊర్లో పలువురు రైతులకు మధుకేశవరెడ్డి ఆర్థిక సాయం కూడా చేస్తున్నాడు. కుటుంబ సభ్యులతో స్వగ్రామానికి వచ్చి ఏటా రెండు నెలలు పాటు ఇక్కడే ఉంటూ పండ్ల తోటల సాగులో నిమగ్నమై ఎంతో అనుభూతిని పొందుతున్నాడు. ఈయన ప్రోత్సాహంతో గ్రామంలో పలువురు పండ్ల తోటల సాగువైపు వెళుతున్నారు. హార్టికల్చర్ హబ్‌గా కర్నూలు మాది ఆది నుంచి వ్యవసాయ కుటుంబం. నాన్న ఉన్నన్నాళ్లు సేద్యం ఎంతో బాగా చేశాడు. చదువుకునే రోజుల్లో నేను కూడా సెలవుల్లో ఇంటికి వస్తే సేద్యం చేసేవాడిని. వర్షాధారమైన ఈ ప్రాంతంలో రైతులకు సేద్యం గిట్టుబాటు కావడం లేదు. దీంతో నేను పండ్ల తోటల సాగు చేసి రైతులను ఆ దిశగా ప్రోత్సహిస్తున్నా. భూమి అనుకూలించి, నీటి వసతి బాగా ఉంటే దానిమ్మ సాగులో మంచి లాభాలు ఆర్జించవచ్చు. అయితే శాస్త్రవేత్తల సలహాలు తీసుకొని పంటపై నిరంతరం అప్రమత్తంగా ఉండాలి. లేకపోతే నష్టపోవాల్సి వస్తోంది. పెట్టుబడులు పెట్టడం ముఖ్యం కాదు. నిరంతరం పర్యవేక్షణ, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, మార్కెటింగ్ చేసుకోవడం ముఖ్యం. మా తోటలు చూసి తెలంగాణకు చెందిన నా స్నేహితుడు కూడా ఉద్యాన పంటల సాగు చేపట్టాడు. రానున్న రోజుల్లో కర్నూలు జిల్లా హార్టికల్చర్ హబ్‌గా మారిపోయినా ఆశ్చర్య పోనక్కర్లేదు. నా విజయంలో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యుల సహకారం ఎంతో ఉంది. – రేమట మధుకేశవరెడ్డి, సాఫ్ట్వేర్ ఉద్యోగి, తువ్వదొడ్డి -
Akhanda 100 Days Function: కర్నూలులో అఖండ 100 రోజులు వేడుక (ఫొటోలు)
-
శ్రీశైలంలో డ్రోన్ కలకలం
శ్రీశైలం: గుర్తు తెలియని డ్రోన్ నాలుగు రోజులుగా శ్రీశైల మహాక్షేత్రంలో అత్యంత ఎత్తులో చక్కర్లు కొడుతూ ఫొటోలు, వీడియోలు తీసినట్టు తెలుస్తోంది. శుక్రవారం రాత్రి ఆలయ ప్రాంగణం, మల్లమ్మ గుడి వెనుకాల నుంచి తక్కువ ఎత్తులోకి రావడంతో గమనించిన భద్రతా సిబ్బంది ఆలయాధికారులకు సమాచారం ఇచ్చారు. వారు స్థానిక పోలీస్‌స్టేషన్‌లో విషయం తెలియజేశారు. దీంతో దేవస్థాన అధికారులతో పాటు పోలీసులు, అటవీశాఖ సిబ్బంది డ్రోన్‌ను గుర్తించారు. దానిని వెంబడించేందుకు దేవస్థానం డ్రోన్‌ను ఉపయోగించినా ఫలితం లేకపోయింది. ఈ విషయాన్ని గమనించి డ్రోన్‌ను నియంత్రిస్తున్న అపరిచిత వ్యక్తి సిగ్నల్స్‌ను ఆపివేశారు. అనంతరం అది కనిపించకుండాపోయింది. శ్రీశైల మహాక్షేత్రానికి ఉగ్రవాదుల ముప్పు ఉందని ఇంటెలిజెన్స్ వర్గాలు గతంలోనే హెచ్చరించాయి. అలాగే నిబంధనలకు విరుద్ధంగా తెలంగాణ పరిధిలోని రెండో పవర్‌హౌస్‌లో విద్యుదుత్పాదనను నిరంతరం కొనసాగిస్తుండడంతో తెలంగాణ ప్రభుత్వం భారీగా సెకండ్ పవర్‌హౌస్ వద్ద పోలీస్ బలగాలను మోహరించింది. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించిన టెక్నికల్ సిబ్బంది డ్రోన్‌ను వినియోగించి ఫొటోలు, వీడియోల ద్వారా సమాచారాన్ని సేకరిస్తున్నారన్న అనుమానాలూ లేకపోలేదు. ఘటనపై శ్రీశైలం సీఐ వెంకటరమణ మాట్లాడుతూ డ్రోన్ ఆచూకీ కనుగొనేందుకు ప్రయత్నిస్తున్నట్టు చెప్పారు. శ్రీశైలంలోని సత్రాలు, అతిథి గృహాల్లో తనిఖీలు చేపట్టామన్నారు. డ్యామ్ వద్ద 40 మందితో బందోబస్తును ఏర్పాటు చేసినట్టు వివరించారు. -
కులాంతర వివాహం చేసుకున్నాడని..
శ్రీశైలంప్రాజెక్ట్: కుమారుడు కులాంతర వివాహం చేసుకున్నాడని 15 సంవత్సరాలుగా బాంధవ్యాలను తెంపుకున్నాడు ఓ తండ్రి. చివరకు కుమారుడి మృతదేహాన్ని కూడా చూడడానికి తల్లిదండ్రులు నిరాకరించి ఇంటికి తాళం వేసి వెళ్లారు. వివరాలు.. సున్నిపెంటలో వ్యాపారం చేసుకుంటున్న మాలపాటి బసిరెడ్డికి నలుగురు సంతానం. రెండో కుమారుడైన రామకృష్ణారెడ్డి 15 ఏళ్ల క్రితం దళిత కులానికి చెందిన బెజవాడ వీరమ్మను ప్రేమ వివాహం చేసుకున్నాడు. అది సహించలేని తండ్రి కుమారునితో తెగదెంపులు చేసుకున్నాడు. కృష్ణారెడ్డి ప్రైవేట్ జీప్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. గత శుక్రవారం రాత్రి ప్రకాశం జిల్లా పుచ్చకాయల పల్లికి సమీపంలో జీపులో వెళ్తుండగా అదుపుతప్పి బోల్తా పడింది. చికిత్స నిమిత్తం మార్కాపురం ప్రభుత్వ ఆసుపత్రిలో చేరి్పంచగా కోలుకోలేక శుక్రవారం మధ్యాహ్నం మృతి చెందాడు. కుమారుడి మృతదేహాన్ని ఇంటికి తీసుకువస్తారని భావించిన తల్లిదండ్రులు శనివారం ఉదయం నుంచే ఇంటికి తాళాలు వేసి ఎటో వెళ్లిపోయారు. కృష్ణారెడ్డి మృతదేహాన్ని భార్య వీరమ్మ, కుమార్తెలు మానస, కవిత.. తన తాత బసిరెడ్డి ఇంటికి తీసుకురాగా తాళాలు వేసి ఉండడంతో ఇంటి ముందే కొద్ది సేపు మృతదేహాన్ని ఉంచి అంత్యక్రియలకు తరలించారు. ప్రైవేట్ జీప్ ఓనర్లు, డ్రైవర్ల అసోసియేషన్ ఆధ్వర్యంలో మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు. కృష్ణారెడ్డి కుటుంబానికి వారు రూ.15 వేల ఆరి్ధక సహాయాన్ని అందించారు. చదవండి: అర్ధరాత్రి కారు చీకటి.. ఆ ఫోన్ కాల్ కాపాడింది బాలిక కిడ్నాప్ కేసు: పెళ్లి చేసుకుంటానని నమ్మించి.. -
విషాదం: దోశ పిండి నీలాగే ఉందనడంతో
బేతంచెర్ల(కర్నూలు జిల్లా): పట్టణంలోని కోటపేట కాలనీలో ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. స్థానికంగా నివాసముంటున్న మాబాషా, షాకీరాబీ (26) దంపతులు అరటి పండ్ల వ్యాపారం చేస్తూ జీవనం కొనసాగిస్తున్నారు. వీరికి కుమారుడు, కుమార్తె సంతానం ఉన్నారు. ఆదివారం ఉదయం షాకీరాబీ దోశ పిండి గ్రైండ్ పట్టించుకొని వచ్చింది. ‘దోశ పిండి నీ లాగే’ ఉందని తోడి కోడలు షబానా అనడంతో మనస్తాపానికి గురైంది. అనంతరం టిఫిన్ చేసే విషయంలో భర్తతో వాగ్వాదం జరిగింది. కొద్దిసేపటికి ఇంట్లో ఎవరూ లేని సమయంలో షాకీరాబీ ఉరి వేసుకుంది. కొన ఊపిరితో ఉన్న ఆమెను కుటుంబీకులు ఆరోగ్య కేంద్రానికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతురాలి కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. (చదవండి: కార్పొరేటర్ హత్య కేసు: కృష్ణా జిల్లాలో చిన్నా?) నెత్తురోడిన రహదారి -
రసవత్తర పోరు: మామా అల్లుళ్ల సవాల్
కర్నూలు జిల్లా: పల్లె పోరు ఆసక్తికరంగా మారుతోంది. కొన్ని గ్రామాల్లో సొంత కుటుంబీకులే బరిలో నిలుస్తుండటంతో రసవత్తరంగా ఉంది. ఎం.అగ్రహారం గ్రామంలో సర్పంచ్ స్థానానికి మేనమామ (భార్య తండ్రి)తో అల్లుడు తలపడుతున్నాడు. బీసీ జనరల్‌కు రిజర్వేషన్ కావడంతో ఇరువర్గాలు ప్రతిష్టాత్మకంగా తీసుకుని మామాఅల్లుడు శివశంకర్, విజయుడిని బరిలో నిలిపాయి. వీరు సోమవారం నామినేషన్ దాఖలు చేశారు. (చదవండి: పోలింగ్ సమయంలో సెల్ఫీ దిగితే..) -
మహిళలే టార్గెట్: తేనె అమ్ముతున్నట్లు నటిస్తూ..
కొలిమిగుండ్ల (కర్నూలు జిల్లా): పూజల పేరుతో మాయమాటలు చెప్పి ఓ ఇంట్లో బంగారు వస్తువులు కాజేపే ప్రయత్నం బెడిసికొట్టింది. ఈ సంఘటన శుక్రవారం కొలిమిగుండ్ల లో చోటు చేసుకుంది. ఇద్దరు మహిళా దొంగల్లో ఒక రు ఊర్లో తేనె అమ్ముతున్నట్లు నటిస్తూ రెక్కీ నిర్వహించారు. ఇంట్లో ఒంటరిగా ఉన్న మహిళలను టార్గెట్ చేసుకున్నారు. ఈ కోవలోనే పెద్దమ్మ ఆలయం సమీ పంలోని వీధిలో నివాసముండే శ్రావణితో చిత్తూరు లక్ష్మి అనే దొంగ ఇంట్లోకి వెళ్లి పూజలు చేస్తే నీభర్త ఆరోగ్యం బాగుపడుతుంది. అంతా శుభం జరుగు తుందని పూజల పేరుతో మరొక మహిళ ఇంట్లోకి చేరింది. (చదవండి: కిడ్నాప్ డ్రామా: నివ్వెరపోయే విషయాలు) వారి మాటలు నమ్మి పూజకు పసుపు, కుంకుమ, నిమ్మకాయలు, బంగారు కూడా పెట్టాలని చెప్పడంతో నమ్మి అక్కడే ఉంచింది. ఆమె దృష్టి మరల్చి రోల్డ్‌గోల్డ్ వస్తువులను పెట్టి అసలు వస్తువులను బ్యాగులో వేసుకుంది. అక్కడి నుంచి బయట పడేందుకు కిలాడీ లేడి ఇంకో చోట పూజ చేయాలి త్వరగా వస్తానని ప్రధాన రహదారిపైకి చేరి కానిస్టేబుల్ సుబ్బరాయుడు మఫ్టీలో బైక్‌లో వెళ్తుండడంతో ఆపి ఎక్కింది. బాధితురాలు శ్రావణి పక్కింట్లో ఉండే మరో మహిళ బంగారు తీసుకెళుతోందని కేకలు వేయడంతో అనుమానం వచ్చిన కానిస్టేబుల్ బైక్‌ను వెనక్కి తిప్పి పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్తుండగా ఏటీఎం వద్దకు రాగానే కిందకు దూకే ప్రయత్నం చేసింది. అదుపులోకి తీసుకొని పోలీసులు విచారిస్తున్నారు.(చదవండి: టీడీపీలో రచ్చకెక్కిన విభేదాలు..) -
వామ్మో.. పాము!
కర్నూలు(హాస్పిటల్): వర్షాకాలం ప్రారంభమైంది. జిల్లాలో జోరుగా వానలు కురుస్తున్నాయి. ఇప్పటి వరకు భూమిలో ఉన్న వేడి ఆవిరి రూపంలో బయటకు వస్తోంది. ఈ క్రమంలో భూమి పొరల్లో ఉండే క్రిమికీటకాలు బయటకు వస్తాయి. తెలిసీతెలియక వాటిని తాకిన వారిని అవి కాటేస్తాయి. ప్రతి యేడాది జూన్ మొదటి వారం నుంచి క్రిమికీటకాలు కాటేయడం మనం చూస్తుంటాం. అయితే అన్ని కీటకాలకు విషం ఉండదు. కేవలం కొన్ని రకాల విషసర్పాలు, తేళ్లకు మాత్రమే తీవ్రమైన విషం ఉంటుంది. ఇవి కాటేసినప్పుడు కంగారుపడకుండా తగిన జాగ్రత్తలతో వైద్యం తీసుకుంటే సురక్షితంగా బయటపడవచ్చని చెబుతున్నారు వైద్యులు. గత ఐదేళ్ల కాలంలో జిల్లాలో వర్షాలు పెద్దగా కురియలేదు. కొన్ని సంవత్సరాలు తీవ్ర వర్షాభావం నెలకొంది. అయితే గత ఏడాది నుంచి వర్షాలు బాగా కురుస్తున్నాయి. ఈ యేడాది జూన్ ఒకటో తేదీ నుంచే వర్షాలు కురుస్తున్నాయి. తొలకరి వర్షాలకు భూమిలో దాగున్న విష సర్పాలు, తేళ్లు, కీటకాలు బయటకు వస్తున్నాయి. ఆదమరిచి ఉన్న వారిని ఇవి కాటేస్తున్నాయి. ఈ కారణంగా జిల్లాలో పాముకాట్లు, విష పురుగుల కాట్లకు గురై ఆసుపత్రులకు వస్తున్న వారి సంఖ్య పెరుగుతోంది. జిల్లాలో 87 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 18 కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, ఒక ఏరియా ఆసుపత్రి, ఒక జిల్లా ఆసుపత్రి, ఒక బోధనాసుపత్రి ఉన్నాయి. జిల్లా మొత్తంగా ఇప్పటి వరకు ఆయా ఆసుపత్రులకు నెలరోజుల నుంచి 60కి పైగా పాము, తేలు కాట్లు, ఇతర కీటకాల కాట్లతో చికిత్స కోసం వచ్చారు. ఇందులో కేవలం ముగ్గురు, నలుగురు మాత్రమే మరణించారు. వర్షాలు కరుస్తున్న కారణంగా ఇంటి పరిసరాల్లోని ఖాళీ స్థలాల్లో పొదలు పెరగడం వల్ల విషపురుగుల సంచారం అధికమైంది. ఒక్కోసారి అవి ఇళ్లల్లోకి రావడంతో పాము కాటు బాధితుల సంఖ్య పెరుగుతోంది. పాము కరవగానే ఏం చేయాలంటే.. ►పాము కరవగానే భయాందోళనకు గురిగాకుండా ధైర్యంగా ఉండాలి. బంధుమిత్రులు కూడా వారికి ధైర్యం చెప్పాలి. ►పక్కనున్న వారు ఆ పాము విషసర్పమో కాదో గుర్తించే ప్రయత్నం చేయాలి. దానివల్ల చికిత్స మరింత కచ్చితంగా అందజేయవచ్చు. ►నాటు వైద్యం, మంత్రతంత్రాల జోలికి వెళ్లకుండా సాధ్యమైనంత తొందరగా దగ్గరలోని ఆసుపత్రికి రోగిని నడిపించకుండా తీసుకెళ్లాలి. ►పాముకాటు వేయగానే కొందరు ఆ గాయాన్ని మరింతగా కోస్తే రక్తంతోపాటు విషం వచ్చేస్తుందని కత్తితో, బ్లేడుతో గాటు పెడతారు. అలా చేయవద్దు. ఒక్కోసారి పాముకాటు కన్నా ఈ గాయం ప్రమాదకరంగా మారవచ్చు. శాస్త్రీయమైన చికిత్స సాధ్యమైనంత త్వరగా అందించడమే ఉత్తమం. ►మరికొందరు పాము కరిచిన ప్రదేశంలో గాటుపెట్టి నోటితో విషం పీల్చేస్తామంటారు. పాముకాటు వేయగానే విషం రక్తంలో ద్వారా శరీరంలోని అన్ని భాగాలకు, గుండెకు చేరుకుంటుంది. కాబట్టి దీనివల్ల ప్రయోజనం ఉండదు. ఒక్కోసారి హాని కలగవచ్చు కూడా. అన్ని పాముల్లో విషముండదు ►పాముల్లో చాలా వాటికి విషం ఉండదు. త్రాచు, కట్ల పాముల వంటి 15 శాతంసర్పజాతులతోనే ప్రమాదం ఉంటుంది. ►అన్ని పాముకాట్లు ప్రమాదకరమైనవి కాకపోవచ్చు. సాధారణంగా 50 శాతం పాముకాట్లు విషంలేని, ప్రమాదంలేని మామూలు గాయాలే. వీటికి సాధారణ చికిత్స తీసుకుంటే చాలు. ►పాము కాటు వేయగానే చాలా మంది షాక్‌కు గురవుతారు. ఆ పాముకు విషం లేకపోయినా వారు షాక్‌కు గురికావడం వల్ల చనిపోయే ప్రమాదం ఉంది. ఇలాంటి వారికి ఇంట్లోని వారు, ఇరుగుపొరుగు వారు ధైర్యం చెప్పాలి. ఇటీవల పాము, తేలు కాట్ల వివరాలు ►పెద్దకడబూరు మండలం చిన్నతుంబళం గ్రామంలో గత సోమవారం రాత్రి పాముకాటుతో కురవ లింగన్న(65), అతని కుమార్తె చిన్న మహాదేవి(18) మృతి చెందారు. గుడిసెలో నిద్రిస్తుండగా వీరిని పాము కాటు వేసింది. ►కౌతాళం మండల పరిధిలోని హల్వి గ్రామంలో గత శనివారం పాము కాటుతో ప్రియ(3) అనే చిన్నారి మృతి చెందింది. ఇంటి ముందు నిద్రిస్తుండగా తెల్లవారుజామున పాము కాటు వేసింది. ►ఆస్పరికి చెందిన లక్ష్మీనారాయణ(20) గత నెల 15వ తేదిన కూలీ పనులకు వెళ్లగా తేలు కాటు వేసింది. ఆస్పరిలో ప్రథమ చికిత్స చేయించుకుని మెరుగైన వైద్యం కోసం ఆదోనిలోని ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ గత సోమవారం మృతి చెందాడు. ►పత్తికొండ మండల పరిధిలోని హోసూరు గ్రామానికి చెందిన సుభాష్‌చంద్ర(34) గతనెల 5వ తేదీన తన పొలం పనుల్లో నిమగ్నమై ఉండగా తేలు కాటు వేసింది. అతన్ని ఆసుపత్రికి తరలిస్తుండగానే విషప్రభావం అధికమై మృతి చెందాడు. విధిలేని పరిస్థితుల్లోనే కాటు పాము తన ఆత్మరక్షణ కోసం విధిలేని పరిస్థితుల్లో మాత్రమే ఎదుట ఉన్న వ్యక్తిని కాటు వేస్తుంది. పాము బారిన పడకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఒకవేళ పాము కరిస్తే తక్షణమే సమీప ఆసుపత్రికి వెళ్లి చికిత్స చేయించుకోవడం ఉత్తమం. అలాకాకుండా నాటు వైద్యం తీసుకుంటే చికిత్స ఆలస్యమై ప్రాణానికి ప్రమాదం ఏర్పడవచ్చు. పాములుండే ప్రదేశాలు.. ►ధాన్యపు గాదెలు, గడ్డివాములు ఉండే చోట ఎలుకలు తిరుగుతుంటాయి. తడిగా ఉండే చోట కప్పలు చేరతాయి. వాటిని తినేందుకు పాములు వస్తాయి. ►దుంగలు, కట్టెలు కదిలించినప్పుడు వాటి మధ్యలో పాములు, తేళ్లు ఉండే ప్రమాదం ఉంది. పిడకల మధ్య కూడా విష పురుగులు చేరతాయి. ►ముఖ్యంగా రాత్రిపూట పొలాల్లో మోటారు వేయడానికి, నీరు పెట్టడానికి వెళ్లేటప్పుడు విధిగా టార్చిలైట్ ఉపయోగించాలి. ఒక్కోసారి మోటార్òÙడ్లో, స్టార్టర్ దగ్గర గూడు లాంటి ప్రదేశాల్లో పాములు నక్కి ఉండొచ్చు. ►చేలగట్ల వెంబడి కర్ర చప్పుడు చేస్తూ నడవడం మంచిది. కిర్రుచెప్పులతో పాము కాటు ప్రమాదం తప్పుతుంది. విషసర్పం కాటు..లక్షణాలు ►కాటు సమయంలో బాధితుడి శరీరంలోకి ఎక్కిన విషం పరిణామం బట్టి కూడా ప్రమాదం స్థాయి ఉంటుంది. ►సాధారణ త్రాచు విష ప్రభావం కొంత వ్యవధి తీసుకుంటుంది. ►నల్లత్రాచు(కింగ్‌కోబ్రా) విషంప్రభావం చాలా త్వరగా కనిపించి ప్రాణాంతకంగా ఉంటుంది. ►కట్లపాము కాటు బాధ ఒకరకమైతే, రక్తపింజర విష లక్షణాలు మరో రకంగా ఉంటాయి. ►కాటు వేసిన ప్రదేశంలో పాము కోరల గాయం స్పష్టంగా కనిపించి, నొప్పి తీవ్రంగా ఉంటుంది. ►నొప్పి క్రమంగా పైకి వ్యాపిస్తూ తిమ్మిరిగా అనిపిస్తుంది. ►పాక్షిక పక్షవాతం కారణంగా నాలుక మందమైనట్లు, గొంతు కండరాలు బిగుసుకున్నట్లు గొంతులో ఏదీ దిగని పరిస్థితి తలెత్తవచ్చు, చొంగకారవచ్చు. ►కళ్లు మగతగా, శరీరం మత్తుగా ఉండి స్పృహ కోల్పోవచ్చు. ►బాధితునికి సాధ్యమైనంత త్వరగా చికిత్స అందించకపోతే పరిస్థితి విషమించవచ్చు. ►విషం విరుగుడు ఇంజక్షన్ రూపంలో త్వరగా పనిచేస్తుంది. ►బాధితునికి ఆందోళన, షాక్ కారణంగా తలెత్తే ఇతర సమస్యలు సమర్ధవంతంగా నివారింవచ్చు. ►సెలైన్ రూపంలో శక్తిని ఇస్తూ, చికిత్స మరింత మెరుగై అందించవచ్చు. ►పాముకాటు గాయానికి తగు చికిత్స చేయడం ద్వారా ఇతర ఇబ్బందులు లేకుండా చేయవచ్చు. ►చికిత్స ఆలస్యం వల్ల ఏదైనా ప్రమాదం జరిగితే మెడికో లీగల్ కేసుగా అధికారికంగా నమోదై ఆపద్బంధు పథకం కింద పరిహారం లభించవచ్చు. మందులున్నాయి వర్షాకాలంలో రైతులు పొలం పనుల్లో నిమగ్నమై ఉన్న సమయంలో వారు తరచూ పాము, తేలు కాటుకు గురవుతుంటారు. ఇలాంటి వారికి అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో యాంటి స్నేక్ వీనమ్(ఏఎస్వి) అందుబాటులో ఉంచాము. పాము, తేలు కాటు వేయగానే ఆలస్యం చేయకుండా వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స చేయించాలి. త్వరగా గుర్తించి సరైన చికిత్స అందిస్తే ప్రాణాపాయం నుంచి బయటపడవచ్చు. –డాక్టర్ వెంకటరమణ, అడిషనల్ డీఎంహెచ్‌వో, కర్నూలు -
‘ఆ డివిజన్లో అప్రమత్తంగా ఉండాలి’
సాక్షి, కర్నూలు: జిల్లాలో ఇప్పటివరకు 547 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కలెక్టర్ వీరపాండ్యన్ తెలిపారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కరోనా నుంచి కోలుకుని ఇప్పటివరకు 191 మంది డిశ్చార్జ్ అయ్యారని పేర్కొన్నారు. విశ్వభారతి కోవిడ్ ఆసుపత్రి నుంచి 80 ఏళ్ల వృద్ధుడు, ఒకటిన్నర ఏళ్ల చిన్నారిని ఆరోగ్యంగా డిశ్చార్జ్ చేశామని చెప్పారు. ఆదోనిలో వలసకు వెళ్ళిన వారిలో ఒక్కరికీ కరోనా వైరస్ సోకిందని.. ఆ డివిజన్ లో అప్రమత్తం ఉండాలని ప్రజలకు సూచించారు. అక్కడ కరోనా కేసులు పెరిగే అవకాశాలు ఉన్నాయని కలెక్టర్ తెలిపారు. (ఏపీలో కొత్తగా 54 కరోనా కేసులు..) బీహార్, జార్ఖండ్, మధ్యప్రదేశ్‌కు చెందినవారిని తరలించామని కలెక్టర్ పేర్కొన్నారు. మూడు రైళ్ల ద్వారా ఇతర రాష్ట్రాలకు చెందినవారిని తరలించామన్నారు. ఇతర రాష్ట్రాల నుంచి జిల్లాకు వచ్చేవారి కోసం ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని.. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వ్యక్తులు కరోనా పరీక్ష చేయించుకోవాలని, లేదంటే క్వారంటైన్లో ఉండాలని తెలిపారు. విశాఖ ఘటనను దృష్టిలో ఉంచుకుని 5 ఫ్యాక్టరీల్లో తనిఖీలు చేస్తున్నామని కలెక్టర్ వీరపాండ్యన్ పేర్కొన్నారు. (కరోనా ఖతం!) లాక్డౌన్ పటిష్టంగా అమలు: ఎస్పీ ఫక్కీరప్ప జిల్లాలో లాక్‌డౌన్‌ను పటిష్టంగా అమలు చేస్తున్నామని ఎస్పీ ఫక్కీరప్ప తెలిపారు. లాక్డౌన్ ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. అత్యవసర సేవల అనుమతి కోసం 9 వేల మంది దరఖాస్తు చేసుకున్నారని పేర్కొన్నారు. 419 దరఖాస్తులకు మాత్రమే అనుమతులు ఇస్తున్నామన్నారు. నిబంధనలు ఉల్లంఘించిన వారి 10,812 వాహనాలు సీజ్ చేశామని ఎస్పీ ఫక్కీరప్ప పేర్కొన్నారు. -
కర్నూలులో పెరుగుతున్న కరోనా కేసులు..
సాక్షి, కర్నూలు: జిల్లాలో అత్యధికంగా కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయని కలెక్టర్ వీరపాండియన్ తెలిపారు. మొత్తం 130 కరోనా కేసులు నమోదయినట్లు వెల్లడించారు. ఒకరు డిశ్చార్జ్ కాగా, నలుగురు మృతి చెందారని వెల్లడించారు. 10 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి శాంపిల్స్‌ను సేకరిస్తున్నామని పేర్కొన్నారు. 1425 శాంపిల్స్ రిపోర్టులు రావాల్సి ఉందన్నారు. జిల్లాలో కరోనా టెస్టింగ్ ల్యాబ్ ఈ రోజు నుంచే ప్రారంభమయిందని తెలిపారు. ఢిల్లీ జమాత్‌లో పాల్లొన్నవారిలోనే ఎక్కువగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయని పేర్కొన్నారు. కరోనా బారినపడి ఒక వైద్యుడు మృతి చెందారని.. ఆసుపత్రికి వెళ్లిన వారిపై దృష్టి పెట్టామన్నారు. వైద్యుడిని కలిసిన 213 మంది పైమరీ కాంటాక్ట్స్ ను గుర్తించామని.. అందులో 13 మందికి పాజిటివ్ వచ్చిందని తెలిపారు. సెకండరీ కాంటాక్ట్ అయిన 900 మందిని గుర్తించామని.. వారికి కూడా టెస్ట్‌లు నిర్వహిస్తామని కలెక్టర్ వీరపాండియన్ వెల్లడించారు. -
కర్నూలులో మరో కేంద్రీయ విశ్వవిద్యాలయం
-
కర్నూలు జిల్లా ఇన్చార్జ్ మంత్రిగా అనిల్‌కుమార్
సాక్షి, కర్నూలు(రాజ్‌విహార్): జిల్లా ఇన్చార్జ్ మంత్రిగా పి.అనిల్‌కుమార్ నియమితులయ్యారు. నెల్లూరు సిటీ ఎమ్మెల్యేగా గెలిచిన ఈయన ప్రస్తుతం రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రిగా పనిచేస్తున్నారు. మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ స్థానంలో జిల్లా ఇన్చార్జ్ మంత్రిగా నియమితులయ్యారు. బొత్సను జూన్ 21న జిల్లా ఇన్చార్జ్ మంత్రిగా నియమించగా.. ఇప్పటి వరకు ఆయన కొనసాగారు. ఇన్చార్జ్ మంత్రి హోదాలో స్వాతంత్య్ర దిన వేడుకలతో పాటు ఆగస్టు 28న జరిగిన జిల్లా సమీక్ష కమిటీ (డీఆర్సీ) సమావేశంలో పాల్గొన్నారు. సెప్టెంబరు 21న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డితో పాటు నంద్యాలలో పర్యటించి.. భారీ వర్షాలు, వరదల నష్టాన్ని పరిశీలించారు. బొత్సను ప్రస్తుతం అనంతపురం జిల్లా ఇన్చార్జ్ మంత్రిగా నియమించగా.. ఆయన స్థానాన్ని మంత్రి అనిల్‌కుమార్‌తో భర్తీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది. అనిల్‌కుమార్ జల వనరుల శాఖ మంత్రి కావడంతో జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టుల అభివృద్ధికి వీలు కలుగుతుందని ప్రజల్లో చర్చ సాగుతోంది. -
స్తంభించిన వైద్య సేవలు
సాక్షి, కర్నూలు : కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నేషనల్ మెడికల్ కమిషన్ బిల్లుకు వ్యతిరేకంగా కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో జూనియర్ డాక్టర్లు శుక్రవారం కొన్ని గంటల పాటు వైద్యసేవలు పూర్తిగా నిలిపివేశారు. ఆసుపత్రిలో రోగులకు ఓపీ టికెట్ కూడా ఇవ్వకుండా బంద్ చేయించారు. అనంతరం ఓపీ విభాగాల్లో వైద్యసేవలు అందిస్తున్న వైద్యులను బయటకు పంపించి తాళాలు వేశారు. ఓపీ విభాగాల నుంచి క్యాజువాలిటీకి చికిత్స కోసం వచ్చిన రోగులను సైతం సమ్మె తర్వాత రావాలంటూ తిప్పి పంపించారు. దీంతో పలువురు రోగులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ ఆందోళన ఎవరి కోసం, ఎందుకోసం చేస్తున్నారు’ అంటూ జూనియర్ డాక్టర్లను ప్రశ్నించారు. సుదూర ప్రాంతాల నుంచి చికిత్స కోసం వచ్చే తమకు వైద్యాన్ని నిరాకరించడం ఎంత వరకు న్యాయమని ప్రశ్నించారు. ‘మీ ఆందోళన కోసం రోగులను ఇబ్బంది పెట్టడం న్యాయం కాదు.. వైద్యం చేయాలి’ అని వేడుకున్నారు. కనీసం మాత్రలను అయినా ఇచ్చేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. ఈ తరుణంలో సమ్మెకు గల కారణాలను రోగులకు జూనియర్ డాక్టర్లు వివరించే ప్రయత్నం చేశారు. ‘మీ సమస్యలన్నీ మాకు అర్థం కావని, మాకు వైద్యం చేయాలి’ అని చేతులెత్తి రోగులు.. జూనియర్ డాక్టర్లను వేడుకున్నారు. ఇప్పటికిప్పుడు తామేమీ చేయలేమని సమ్మె అయిపోయాక రావాలంటూ వెనక్కి పంపించారు. కాగా ఓపీ కౌంటర్ వద్ద టికెట్లు ఇవ్వకపోవడంతో అక్కడ కూడా రోగులు తీవ్రంగా మండిపడ్డారు. అత్యవసర చికిత్సకోసం వెళ్లాలన్నా ఓపీ టికెట్ ఇవ్వాలని, అది కూడా ఇవ్వకుండా బంద్ చేస్తే ఎలాగంటూ మండిపడ్డారు. ఈ సందర్భంగా రోగులు, జూనియర్ డాక్టర్లకు మధ్య వాగ్వాదం జరిగింది. అనంతరం పలువురు జూనియర్ డాక్టర్లు వార్డులకు పెద్ద ఎత్తున నినాదాలు చేసుకుంటూ వెళ్లి విధుల్లో ఉన్న వైద్యులను కలిసి సమ్మెకు సహకరించాలని కోరారు. దీంతో పలువురు వైద్యులు వార్డుల నుంచి బయటకు వెళ్లారు. పలు విభాగాల్లో అడ్మిషన్లో ఉన్న రోగులను ఇంటికి పంపించారు. సమ్మె జరుగుతున్న కారణంగా పీజీ డాక్టర్లు విధులకు హాజరుకావడం లేదని, సమ్మె ముగిశాక రావాలంటూ డిశ్చార్జ్ చేశారు. ఇంటికి వెళ్లిన తర్వాత తమకు ఏదైనా అనారోగ్య సమస్య ఎదురైతే ఎలాగంటూ పలువురు రోగులు వైద్యులను ప్రశ్నించారు. కొండారెడ్డి బురుజు వద్ద రాస్తారోకో.. ఆసుపత్రిలో ఆందోళన చేసుకుంటూ అనంతరం వైద్య విద్యార్థులు ర్యాలీ ప్రారంభించారు. ర్యాలీ ఆసుపత్రి నుంచి మొదలై మెడికల్ కాలేజి, రాజ్‌విహార్, కిడ్స్‌వరల్డ్, పాత కంట్రోల్‌రూమ్ మీదుగా కొండారెడ్డి బురుజు వరకు చేరుకుంది.. అక్కడ వినూత్న తరహాలో రాస్తారోకో నిర్వహించారు. ఎన్ఎంసీ బిల్లుకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దీంతో గంటపాటు నగరంలో ట్రాఫిక్ స్తంభించిపోయింది. ప్రైవేటు ఆసుపత్రుల బంద్ పాక్షికం ప్రభుత్వ ఆసుపత్రిలో ఓపీ, ఐపీ సేవలను స్తంభింపజేసిన వైద్యులు ప్రైవేట్ ఆసుపత్రుల్లో మాత్రం సేవలు కొనసాగించడం విమర్శలకు తావిస్తోంది. ఆసుపత్రిలో పనిచేసే అధిక శాతం వైద్యులకు ప్రైవేట్ ఆసుపత్రులు, క్లినిక్‌లు ఉన్నాయి. ప్రభుత్వ ఆసుపత్రిలో విధులు బహిష్కరించిన అనంతరం పలువురు వైద్యులు నేరుగా వారి క్లినిక్‌లు, ప్రైవేటు ఆసుపత్రులకు పరుగులు తీశారు. అక్కడ చికిత్సకోసం వచ్చిన రోగులకు వైద్యం అందించారు. కాగా గురువారం ఉదయం 6 గంటల నుంచి శుక్రవారం ఉదయం 6 గంటల వరకు ప్రైవేట్ ఆసుపత్రుల బంద్‌కు ఐఎంఏ పిలుపునిచ్చిన విషయం విదితమే. వీరి పిలుపు మేరకు నగరంలోని పలు ప్రైవేట్ ఆసుపత్రులు మాత్రమే బంద్ చేశాయి. అధిక శాతం ఆసుపత్రులు, క్లినిక్‌లను వైద్యులు తెరిచే ఉంచారు. గర్భసంచిలో పుండు ఉంటే చికిత్స కోసం కడప నుంచి వారం క్రితం వచ్చి ఆసుపత్రిలో చేరింది. జూడాల సమ్మె కారణంగా ఆమెకు ఆపరేషన్ వాయిదా వేస్తూ వచ్చారు. ఎక్స్‌రే తీయించుకునేందుకు డబ్బులు చెల్లించాలని వస్తే ఓపీ కౌంటర్ మూసివేయడంతో ఆమె కన్నీటి పర్యంతమయ్యింది. ఇంకా ఎన్నాళ్లు ఆపరేషన్ కోసం వేచి ఉండాలని ఆవేదన వ్యక్తం చేసింది. - సూరమ్ లక్ష్మీదేవి. దొర్నిపాడు మండలం కొండాపురం గ్రామస్తుడు. కడుపులో గడ్డ ఉండటంతో చికిత్స కోసం వారం నుంచి ఆసుపత్రికి వచ్చి పోతున్నా చికిత్స చేసే నాథుడు లేడు. వ్యవసాయం చేసుకుని జీవించే తనకు ప్రైవేటు ఆసుపత్రిలో రూ.40వేలు పెట్టి ఆపరేషన్ చేయించుకునే స్థోమత లేదని, పెద్దాసుపత్రే తమకు దిక్కు అని, సమ్మె చేస్తే తనలాంటి వారి పరిస్థితి ఏమిటని ఆయన ప్రశ్నించాడు. - పీర్ మహమ్మద్. -
నిధుల కొరత లేదు: మంత్రి బుగ్గన
సాక్షి, కర్నూలు(అర్బన్): జిల్లాలో తాగునీటి ఎద్దడి నివారణకు నిధుల కొరత లేదని రాష్ట్ర ఆర్థిక, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి అన్నారు. నియోజకవర్గ స్థాయిలో ఎమ్మెల్యేలు తమ పరిధిలోని అధికారులతో సమీక్షించి.. నీటి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకునేందుకు వీలుగా ముఖ్యమంత్రి అభివృద్ధి నిధి కింద ప్రతి ఎమ్మెల్యేకు రూ.కోటి చొప్పున ఇస్తున్నామన్నారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు సైతం ఈ నిధులు ఇస్తున్నట్లు స్పష్టం చేశారు. జిల్లాలోని తాగునీటి సమస్య, వ్యవసాయ, అనుబంధ శాఖల కార్యక్రమాలపై శనివారం కలెక్టరేట్ సమావేశ భవనంలో మంత్రి వివిధ శాఖల అధికారులతో సుదీర్ఘంగా సమీక్షించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. సమీక్ష సమావేశాలకు కర్నూలు, నంద్యాల పార్లమెంట్ సభ్యులు డాక్టర్ సింగరి సంజీవకుమార్, పోచా బ్రహ్మానందరెడ్డి, శ్రీశైలం, కర్నూలు, నందికొట్కూరు, కోడుమూరు, పత్తికొండ, పాణ్యం ఎమ్మెల్యేలు శిల్పా చక్రపాణిరెడ్డి, హఫీజ్‌ఖాన్, ఆర్థర్, డాక్టర్ సుధాకర్, కంగాటి శ్రీదేవి, కాటసాని రాంభూపాల్‌రెడ్డి,జిల్లా కలెక్టర్ జి.వీరపాండియన్, జాయింట్ కలెక్టర్ రవి పట్టన్‌శెట్టి, ట్రైనీ కలెక్టర్ విధేఖరే, జేసీ–2 ఖాజామొహిద్దీన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి బుగ్గన మాట్లాడుతూ వర్షాలు ఆలస్యం కావడం వల్ల రాయలసీమ జిల్లాల్లో సహజంగానే నీటి సమస్య ఉత్పన్నమవుతుందని, దీని పరిష్కారానికి తొలి ప్రాధాన్యత ఇస్తు న్నామని తెలిపారు. గ్రామాల్లో తాగునీటి ఎద్దడి ఉన్న సమయాల్లో బోర్లను అద్దెకు తీసుకొని నీటిని సరఫరా చేయాలన్నారు. ట్యాంకర్ల ద్వారానూ సరఫరా చేయాలని, ట్రిప్పులను ఎప్పటికప్పుడు పరిశీలించాలని సూచించారు. చెడిపోయిన చేతిపంపులను వెంటనే మరమ్మతులు చేయించాలని ఆదేశించారు. అమృత్ పథకం పనులను స్థానిక ఎమ్మెల్యేలతో సమన్వయం చేసుకొని చేపట్టాలని ఇంజినీర్లను ఆదేశించారు. ప్రత్యామ్నాయ పంటల సాగుకు ప్రోత్సాహం జిల్లాలో ఇప్పుడిప్పుడే వర్షాలు పడుతున్నందున కొంత ఊరట లభిస్తోందని, ఆగస్టు 15 నాటికి పూర్తి స్థాయిలో వర్షాలు పడకపోతే ప్రత్యామ్నాయ పంటలపై రైతులకు అవగాహన కల్పించడంతో పాటు అవసరమైన విత్తనాలను సబ్సిడీపై పంపిణీ చేస్తామని మంత్రి బుగ్గన తెలిపారు. రైతులకు నాణ్యమైన ఎరువులు, విత్తనాలు, పురుగు మందులు ఇవ్వాలనే లక్ష్యంతో ప్రతి నియోజకవర్గంలో ప్రత్యేక ల్యాబ్‌లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. టీడీపీ ప్రభుత్వ నిర్వాకం వల్ల విత్తనాల సమస్య వచ్చిందని, దీన్ని అధిగమించేందుకు చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు. వైఎస్సార్ ఉచిత పంటల బీమాను రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కేవలం రూపాయి చెల్లించి బీమా చేసుకోవచ్చన్నారు. ఇందు కోసం రూ.1,000 కోట్లు బడ్జెట్ కేటాయించా మని తెలిపారు. దీన్ని రాష్ట్రంలోని 15 లక్షల మంది కౌలు రైతులకు కూడా అమలు చేస్తున్నామన్నారు. గోదాముల్లోని శనగలను బ్యాంకర్లు వేలం వేయకుండా ఆదేశాలిచ్చినట్లు తెలిపారు. గత ఏడాది ఖరీఫ్‌కు సంబంధించి రూ.551.57 కోట్లు, రబీకి సంబంధించి రూ.107.83 కోట్ల ఇన్పుట్ సబ్సిడీ విడుదల కావాల్సి ఉందని జేడీఏ ఠాగూర్ నాయక్ మంత్రి దృష్టికి తెచ్చారు. పంటలు ఎండిపోకుండా ప్రత్యా మ్నాయ సాగునీటి వనరులను గుర్తించాలని మంత్రి ఆదేశించారు. తాగునీరు, వ్యవసాయం.. కేవలం ఈ రెండు అంశాలపైనే రోజంతా ఫలవంతంగా చర్చించడం ఇదే మొదటిసారని మంత్రి గుర్తు చేశారు. గతంలో ఉద యం 11.30 గంటలకు సమీక్ష ప్రారంభించి..మధ్యాహ్నం 1.30 గంటలకు ముగించేవారన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ తాగునీటి ఎద్దడి నివారణకు ప్రతి ఎంపీడీఓకు రూ.లక్ష కేటా యించాలని ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈని ఆదేశించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు తమ ప్రాం తాల్లోని నీటి సమస్యలను మంత్రి, అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. సమావేశంలో పబ్లిక్ హెల్త్ ఎస్ఈ శ్రీనాథ్‌రెడ్డి, జిల్లా పరిషత్ సీఈఓ ఎం.విశ్వేశ్వరనాయుడు, జిల్లా పంచాయతీ అధికారి కేఎల్ ప్రభాకర్‌రావు, ఇరిగేషన్ ఎస్ఈ శ్రీరామచంద్రమూర్తి, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ జే హరిబాబు, కర్నూలు మున్సిపల్ కమిషనర్ రవీంద్రబాబు తదితరులు పాల్గొన్నారు. విపత్తులు ఎదుర్కోవడమే ముందున్న లక్ష్యం విపత్తులు, ఇతర అత్యవసర పరిస్థితులను ఎదుర్కోవడమే అగ్ని మాపక శాఖ ముఖ్య లక్ష్యమని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి అన్నారు. రూ.3.20 కోట్లతో కొత్తగా కొనుగోలు చేసిన 8 అగ్ని మాపక వాహనాలను శనివారం ఆయన కర్నూలు ఎస్టీబీసీ కళాశాల ఆవరణలో ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజల భద్రత, సంరక్షణకు అధిక ప్రాధాన్యత ఇస్తోందని ఆయన వెల్లడించారు. అందుకు తగ్గట్టుగా అగ్ని మాపక శాఖ అధికారులు పనిచేయాలని సూచించారు. విపత్తు సమయాల్లో వచ్చే ఫైర్ కాల్స్‌పై వెంటనే స్పందించాలన్నారు. జిల్లా వ్యాప్తంగా ఫైర్ స్టేషన్ భవనాల మరమ్మతు, కొత్త భవనాల నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తామన్నారు. అగ్ని మాపక శాఖలో ఖాళీగా ఉన్న పోస్టులను ప్రాధాన్యత క్రమంలో భర్తీ చేస్తామన్నారు. పొదుపు మహిళలకు వడ్డీ లేని రుణాల మంజూరుకు ప్రభుత్వం రూ.1,140 కోట్లు కేటాయించిందని వెల్లడించారు. ఎన్నికల నాటికి పొదుపు మహిళలకు ఉన్న రుణాల మొత్తాన్ని నాలుగేళ్లలో వారికే చెల్లించేందుకు కృతనిశ్చయంతో ఉన్నామన్నారు. నంద్యాల ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి మాట్లాడుతూ అగ్ని ప్రమాదాల నివారణకు ఇస్తున్న శిక్షణ అందరికీ ఉపయోగపడేలా ఉందన్నారు. అగ్నిమాపక శాఖ డైరెక్టర్ జనరల్ అనురాధ మాట్లాడుతూ విపత్తులు, అగ్ని, విద్యుత్, గ్యాస్, పెట్రోలియం వంటి ప్రమాదాలను ఎదుర్కొనేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. ఫైర్ కాల్ వచ్చిన మరుక్షణమే బయలుదేరి సంఘటనా స్థలానికి చేరుకునేలా ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. ప్రమాద ప్రాంతాల్లో మంటలు ఆర్పడంతోపాటు ఆస్తి నష్టాన్ని తగ్గించేందుకు కృషి చేయాలన్నారు. రెస్క్యూ, ప్రమాదాల్లో వాహనాల్లో చిక్కుకున్న ప్రజలను కాపాడేందుకు తమ వద్ద ప్రత్యేక పరికరాలు ఉన్నట్లు స్పష్టం చేశారు. కార్యక్రమంలో కర్నూలు ఎంపీ, కర్నూలు, కోడుమూరు, నందికొట్కూరు ఎమ్మెల్యేలు, కలెక్టర్‌తో పాటు మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి, డీఐజీ వెంకటరామిరెడ్డి, రీజినల్ ఫైర్ ఆఫీసర్ (సదరన్ రీజియన్) స్వామి, జిల్లా ఫైర్ ఆఫీసర్ వి.శ్రీనివాసరెడ్డి, ఏడీఎఫ్‌ఓ జయన్న, కర్నూలు స్టేషన్ ఫైర్ ఆఫీసర్ ప్రభాకర్, వైఎస్సార్సీపీ నాయకులు తోట వెంకట కృష్ణారెడ్డి, సీహెచ్ మద్దయ్య, ధనుంజయ ఆచారి పాల్గొన్నారు. అనంతరం ఫైర్ సిబ్బంది ప్రదర్శన ఇచ్చారు.