ఓ వ్యక్తి దారుణహత్యకు గురైన సంఘటన జిల్లాలో ఆదివారం రాత్రి చోటుచేసుకుంది.
కర్నూలు: ఓ వ్యక్తి దారుణహత్యకు గురైన సంఘటన జిల్లాలో ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. గుర్తుతెలియని వ్యక్తులు నిద్రిస్తున్న వ్యక్తిని గొడ్డలితో అతి కిరాతకంగా నరికి చంపారు. ఈ సంఘటన కర్నూలు జిల్లా కోస్గి మండలం మొదుగుల దిబ్బలో జరిగింది. గ్రామానికి చెందిన అయ్యప్ప అనే వ్యక్తి పిండిమర(గిర్ని) నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఆదివారం రాత్రి పని ముగించుకొని అక్కడే పడుకున్న అయ్యప్ప సోమవారం ఉదయానికి శవమై కనిపించాడు. హత్యకు కారణాలేంటో తెలియరాలేదు. తమకు ఎవరితో గొడవలు లేవని కుటుంబ సభ్యులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
(కోస్గ్గి)