
కర్నూలు జిల్లా: టీడీపీ నేత శ్రీనివాసులు హత్య కేసులో దారుణ నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. శ్రీనివాసులను సొంత పార్టీ వారే దారుణం హత్య చేసినట్లు విచారణలో తేలింది. టీడీపీ పార్టీకి చెందిన నలుగురు వ్యక్తులతో పాటు, మరో ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయ బయటపడింది. టీడీపీలో శ్రీనువాసులకు లభిస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక హత్యకు పాల్పడినట్లు పోలీసుల విచారణలో తేలింది. అయితే ఈ హత్యను వైఎస్సార్‌సీపీకి అంటగట్టే ప్రయత్నం చేశారు మంత్రి నారా లోకేష్, హత్య వెలుగులోకి రాగానే వైఎస్సార్‌సీపీ చేసిందంటూ ఎల్లో మీడియా సైతం నానా హంగామా చేసింది.
శ్రీనివాసులను హత్య చేసిన వారు సొంత పార్టీ నాయకులే కావడంతో స్థానికంగా ఉన్న టీడీపీ నేతలు నోరు మెదపడం లేదు. ఈ సంఘటన ఆగస్టు 14 తేదీన చోటు చేసుకోగా, నేడో-రేపో నిందితులను మీడియా ముందు ప్రవేశ పెట్టే అవకాశాలు కనబడుతున్నాయి.
