srinivasulu
-
తెల్ల బియ్యం తిన్నా... షుగర్ పెరగదు
సాక్షి, సాగుబడి డెస్క్: ప్రపంచవ్యాప్తంగా 54 కోట్ల మంది షుగర్ వ్యాధి (మధుమేహం) బాధితులుంటే.. అందులో 10.1 కోట్ల మంది భారతీయులే (2030 నాటికి ఈ సంఖ్య 15 కోట్లకు చేరనుంది). త్వరలోనే ఈ జాబితాలో చేరే వారు జనాభాలో మరో 15% ఉంటారు. గ్లైసెమిక్ ఇండెక్స్ (జీఐ) ఎక్కువగా ఉండే సాంబ మసూరి (జీఐ 72) వంటి పాలిష్ చేసిన తెల్ల బియ్యం తినటం మధుమేహానికి ప్రధాన కారణాల్లో మొదటిదని ఫిలిప్పీన్స్‌లోని అంతర్జాతీయ వరి పరిశోధనా సంస్థ (ఇరి) గుర్తించింది. ఏదైనా ఆహార పదార్ధాన్ని తిన్న తర్వాత అది ఎంత త్వరగా గ్లూకోజ్‌గా మారి రక్తంలో కలుస్తున్నదో సూచించేదే ‘గ్లైసెమిక్ ఇండెక్స్’. ఇది ఎంత ఎక్కువగా ఉంటే అంత హానికరమన్నమాట. హరిత విప్లవానికి ముందు ఐఆర్8 వంటి అధిక దిగుబడినిచ్చే ‘మిరకిల్ రైస్’ వంగడాన్ని ఇచ్చి మన దేశ ఆకలి తీర్చిన ‘ఇరి’.. ఇప్పుడు షుగర్ పెంచని, ప్రొటీన్ లోపాన్ని ఎదుర్కొనే మరో రెండు అద్భుత వంగడాలను అందుబాటులోకి తెస్తోంది. లో గ్లైసెమిక్ ఇండెక్స్ (55%) కలిగిన ‘ఐఆర్ఆర్ఐ147’ ఈ ఏడాది ఖరీఫ్‌లోనే మన దేశంలో అందుబాటులోకి రానుంది. అలాగే అల్ట్రాలో గ్లైసెమిక్ (45%) + హై ప్రొటీన్ (16%)ను అందించే మరో అద్భుత వంగడం ఇంకో ఏడాదిలో అందుబాటులోకి రానుందని ‘ఇరి’ ప్రధాన శాస్త్రవేత్త, కంజ్యూమర్–డ్రివెన్ గ్రెయిన్ క్వాలిటీ అండ్ న్యూట్రిషన్ యూనిట్ హెడ్ డా.నెసె శ్రీనివాసులు తెలిపారు. ఈ రెండో వంగడానికి డాక్టర్ శ్రీనివాసులు స్వయంగా రూపకల్పన చేశారు. భారత్ పర్యటనలో భాగంగా ఇటీవల హైదరాబాద్‌కు వచ్చి న ఆయన ‘సాక్షి’తో ముచ్చటించారు. వివరాలు ఆయన మాటల్లోనే.. తక్కువ జీఐ.. ‘ఐఆర్ఆర్ఐ147’ ‘ఐఆర్ఆర్ఐ 147’ రకం తెల్లగా పాలిష్ చేసిన బియ్యంలో గ్లైసెమిక్ ఇండెక్స్ (55%) తక్కువగా ఉంటుంది. 22.3 పీపీఎం జింక్ ఉంటుంది. ఉప్పదనాన్ని, తెగుళ్లను తట్టుకుంటుంది. భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలి (ఐసీఏఆర్)కి రెండేళ్ల క్రితం ‘ఇరి’ ఈ వంగడాన్ని అందించింది. ఒడిశా రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి ఐసీఏఆర్ ఈ వంగడాన్ని ప్రయోగాత్మకంగా క్షేత్రస్థాయిలో సాగు చేసింది. 7కు గాను 4 జోన్లలో మంచి ఫలితాలు వచ్చాయి. హెక్టారుకు 5– 9.5 టన్నుల దిగుబడి వ చ్చింది. ప్రస్తుతం ‘సీడ్ వితవుట్ బార్డర్స్–ఎల్లలు లేని విత్తనాలు’ కార్యక్రమంలో భాగంగా ఫాస్ట్ ట్రాక్‌లో విడుదల చేసే ప్రయత్నం జరుగుతోంది. ఇది ముతక రకం కావటంతో ఉప్మా రవ్వ, అటుకులు, తదితర అల్పాహార ఉత్పత్తులుగా ప్రాసెస్ చేసి విక్రయించే ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ఏడాది ఖరీఫ్ నాటికి మన దేశంలోని రైతులకు ఐసీఏఆర్ ద్వారా ఈ న్యూక్లియస్ సీడ్ పూర్తిస్థాయిలో అందుబాటులోకి రానుంది. అత్యల్ప జీఐ, రెట్టింపు ప్రొటీన్! షుగర్ రోగులు కూడా తినదగిన అతి తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్‌తో పాటు అధిక ప్రొటీన్‌ను కలిగి ఉండే అద్భుత వరి వంగడాన్ని ‘ఇరి’ భారతీయులకు అందిస్తోంది. దీనికి ఇంకా పేరు పెట్టలేదు. అత్యంత ప్రజాదరణ పొందిన సాంబ మసూరి మాదిరిగానే ఇది సన్న రకం, అధిక దిగుబడినిచ్చేది కూడా. సాధారణ సాంబ మసూరి జీఐ 72% కాగా, ప్రొటీన్ 8%, కుక్డ్ రెసిస్టెంట్ స్టార్చ్ 0.3% మాత్రమే. సాంబ మసూరితో కలిపి రూపొందిస్తున్న ఈ సరికొత్త రకం జీఐ కేవలం 45% మాత్రమే. ప్రొటీన్ మాత్రం రెట్టింపు. అంటే.. 16%. కుక్డ్ రెసిస్టెంట్ స్టార్చ్ కూడా 3.8% ఉంటుంది. అందువల్ల తిన్న తర్వాత 125 నిమిషాల వరకు నెమ్మదిగా జీర్ణమవుతూ గ్లూకోజ్‌ను తగుమాత్రంగా విడుదల చేస్తూ ఉంటుంది. షుగర్ వ్యాధిగ్రస్తులు, ప్రీ డయాబెటిక్ స్థితిలో ఉన్న వారు కూడా ఈ రకం తెల్ల బియ్యాన్ని ఇబ్బంది లేకుండా తినవచ్చు. వచ్చే ఏడాది దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఈ వంగడాన్ని ప్రయోగాత్మకంగా ఐసీఏఆర్ ఆధ్వర్యంలో సాగు చేస్తాం. ప్రజల దైనందిన ఆహారం ద్వారా డయాబెటిస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు, ప్రొటీన్ లోపాన్ని అరికట్టడానికి ఈ వంగడం ఉపకరిస్తుంది. ఎఫ్‌పీవోల ద్వారా సాగు.. మహిళా సంఘాల ద్వారా ప్రాసెసింగ్అత్యల్ప గ్లైసెమిక్ ఇండెక్స్‌తో పాటు రెట్టింపు ప్రొటీన్‌ను కలిగి ఉండే ఆరోగ్యదాయకమైన కొత్త రకం వరి బియ్యాన్ని, ఇతర ఉప ఉత్పత్తులను దేశంలోని సాధరణ ప్రజలకు సైతం అందుబాటులోకి తేవాలన్నదే ‘ఇరి’ లక్ష్యం. ఒకసారి అందుబాటులోకి వస్తే భారత్‌తో పాటు ఇతర దేశాల్లోనూ ఈ బియ్యానికి చాలా గిరాకీ ఉంటుంది. అందువల్ల ఈ వంగడంపై పెద్ద కంపెనీలు గుత్తాధిపత్యం పొందటానికి వీల్లేకుండా, ఈ బియ్యాన్ని, ఇతర ఉత్పత్తులను దేశ ప్రజలకు సరసమైన ధరకే అందుబాటులోకి తేవటానికికేంద్రం, ఒడిశా ప్రభుత్వాలతో కలసి పనిచేస్తున్నాం. ఇందులో భాగంగా ఒడిశాలో ఎంపిక చేసిన కొన్ని రైతు ఉత్పత్తిదారుల సంఘాల (ఎఫ్పీఓలు) రైతులతో సాగు చేయిస్తున్నాం. మిల్లింగ్, ప్రాసెసింగ్‌లో 30 మహిళా స్వయం సహాయక బృందాలకు శిక్షణ ఇచ్చారు. భువనేశ్వర్ దగ్గర్లో ప్రత్యేక ప్రాసెసింగ్ ఫ్యాక్టరీని ప్రభుత్వం భారీ పెట్టుబడితో నెలకొల్పుతోంది. ప్రత్యేక బ్రాండ్‌ను ప్రారంభించి ఆరోగ్యదాయకమైన ఈ బియ్యం, ఇతర ఉత్పత్తులను రిటైల్ మార్కెట్లోని పెద్ద కంపెనీల ద్వారా సరసమైన ధరలకే ప్రజలకు విక్రయించేందుకు గట్టిగా కృషి చేస్తున్నాం. -
జనసేన ఎమ్మెల్యే కొడుకు రౌడీయిజం సంచలన నిజాలు బయటపెట్టిన తిరుపతి కార్పొరేటర్లు
-
కమిషనర్ పులి శ్రీనివాసులు అక్రమాలకు పాల్పడ్డారు: మనోహర్ నాయుడు
-
జనసేన ఎమ్మెల్యే ఎక్కడ?
సాక్షి టాస్క్‌ఫోర్స్: ఎమ్మెల్యే ఎక్కడ? అని మంత్రి నాదేండ్ల జనసేనులను ఆరా తీశారు. తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో జనసేన పార్టీకి చెందిన ఏకై క ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు. అదే జనసేన పార్టీలో నంబర్ 2గా ఉన్న పౌరసరఫరాల మంత్రి, పీఏసీ చైర్మెన్ నాదేండ్ల మనోహర్ రెండు రోజుల పాటు తిరుపతి జిల్లాలో పర్యటించారు. తిరుపతి జనసేన ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు మంత్రి పర్యటనకు డుమ్మా కొట్టారు. సూపర్ సిక్స్ పథకాల్లోని దీపం–2 పథకం కార్యక్రమాన్ని శనివారం జిల్లా కేంద్రమైన తిరుపతిలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పౌరసరఫరాల శాఖా మంత్రి నాదేండ్ల మనోహర్ హాజరయ్యారు. ప్రభుత్వ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే హాజరు కావాల్సిఉంది. అయినా ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు హాజరు కాలేదు. అలాగే మంత్రి ఆదివారం ఉదయం శ్రీవారిని దర్శించుకున్నారు. ఆ సమయంలోనూ స్థానిక ఎమ్మెల్యే లేరు. మంత్రి తిరుగు ప్రయాణంలో రేణిగుంట విమానాశ్రయంలో నాదేండ్ల మనోహర్ జనసేన జిల్లా నాయకులతో సమావేశం అయ్యారు. జిల్లా నాయకులంతా హాజరైనా ఒక్కగానొక్క జనసేన ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు హాజరు కాకపోవడంతో మంత్రి నాదేండ్ల మనోహర్ ఆరా తీశారు. -
టీడీపీ నేతలే హంతకులు
-
బయటపడ్డ కూటమి సర్కారు నిజస్వరూపం
-
పత్తికొండ హత్య కేసులో టీడీపీ నేతే హంతకుడు
సాక్షి ప్రతినిధి కర్నూలు: పత్తికొండ నియోజకవర్గం హోసూర్‌లో ఇటీవల హత్యకు గురైన టీడీపీ నేత వాకిటి శ్రీనివాసులు కేసును పోలీసులు ఛేదించారు. శ్రీనివాసులును అదే గ్రామానికి చెందిన మరో టీడీపీ నేత గుడిసె నరసింహులు హత్య చేయించాడని తేల్చారు. పత్తికొండ టీడీపీలో ఆధిపత్య పోరులో భాగంగానే టీడీపీ నేతను, అదే పార్టీకి చెందిన మరో నేత హత్య చేయించినట్లు తేలింది. ఈ హత్య జరిగిన రోజు వాస్తవాలు తెలుసుకోకుండా వైఎస్సార్సీపీ హత్య చేయించిందనేలా పార్టీపె, మాజీ సీఎం వైఎస్ జగన్‌పైనా మంత్రి నారా లోకేశ్ ట్వీట్ చేశారు. ఇప్పుడు వాస్తవాలు బట్టబయలు కావడంతో లోకేశ్ నవ్వులు పాలుకావడంతో పాటు వైఎస్సార్సీపీపై ఆయన పచ్చి అబద్ధాలు మాట్లాడతారని.. వైఎస్సార్సీపీ, జగన్‌పై అదేపనిగా బురదజల్లుతున్నారని స్పష్టమైంది. అడ్డు తొలగించుకునేందుకే స్కెచ్.. హోసూర్‌లో వాకిటి శ్రీనివాసులు టీడీపీ నేత. గుడిసె నరసింహులు సీఆర్పీఎఫ్ హెడ్ కానిస్టేబుల్‌గా రిటైరైన తర్వాత టీడీపీలో చేరి నాయకునిగా ఎదిగేందుకు ప్రయత్నిస్తున్నారు. శ్రీనివాసులును పత్తికొండ సహకార సంఘం అధ్యక్షుడిగా ఎంపిక చేసేందుకు ఎమ్మెల్యే శ్యాంబాబు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో రాజకీయంగా తన భవిష్యత్తు ఏంటో చెప్పాలని శ్యాంబాబును నరసింహులు అడిగినట్లు తెలుస్తోంది. హోసూర్‌లోనే ఇద్దరూ ఉంటే భవిష్యత్‌లో గొడవలు ఉంటాయని, పత్తికొండలో కాపురం పెడితే అక్కడ ఓ వార్డు బాధ్యతలు అప్పగిస్తానని నరసింహులుకు శ్యాంబాబు చెప్పినట్లు తెలిసింది. దీంతో.. రాజకీయంగా శ్రీనివాసులు ఎదగడంతో పాటు తాను ఊరు వదిలే పరిస్థితి తలెత్తే ప్రమాదం ఉందని గ్రహించిన నరసింహులు.. ఈనెల 14న శ్రీనివాసులును హత్య చేయించారు. ఇక శ్రీనివాసులును వడ్డే కాశీనాథ్, ఎరుకల వంశీ అనే ఇద్దరు బాలనేరస్తులు హత్యచేసినట్లు పత్తికొండ డీఎస్పీ శ్రీనివాసాచారి వెల్లడించారు. వీరితో పాటు రామాంజనేయులు, హరికృష్ణ, వడ్డే నరసింహులును కూడా కేసులో చేర్చారు. ఇప్పుడేమంటావ్ లోకేశ్? హత్య జరిగిన ఉదయం ‘పచ్చ’ ఛానెళ్లు వైఎస్సార్సీపీ నేతలే టీడీపీ నేతను హత్యచేశారని ఊదరగొట్టాయి. వైఎస్సార్సీపీపై కావాలనే లోకేశ్ దుష్ప్రచారంతో ట్వీట్ కూడా చేసేశారు. ‘ఈ హత్యను తీవ్రంగా ఖండిస్తున్నా! ఎన్నికల్లో టీడీపీ తరఫున కీలకంగా పనిచేశాడనే కక్షతో కిరాతకంగా హతమార్చారు. ప్రజాక్షేత్రంలో తిరస్కారానికి గురైనప్పటికీ జగన్ అండ్ కో తమ పాత పంథా మార్చుకోకుండా దురాగతాలకు పాల్పడుతున్నారు’ అని పేర్కొన్నారు. ఈ ట్వీట్ చూసి హోంమంత్రి అనిత, మరో మంత్రి బీసీ జనార్థన్‌రెడ్డి కూడా వైఎస్సార్సీపీపై విమర్శలు చేశారు. ఈ హత్యకు రాజకీయరంగు పులిమి వైఎస్సార్సీపీపై మోపే ప్రయత్నం చేశారు. కానీ, పోలీసు విచారణలో వాస్తవాలు బయటపడడంతో ఈ హత్య విషయంలో వైఎస్సార్సీపీ, జగన్మోహన్రెడ్డిపై చేసిన ఆరోపణలకు మంత్రి లోకేశ్ ఇప్పుడు ఏం సమాధానం చెబుతారో!? -
కర్నూలు: టీడీపీ నేత హత్య కేసును ఛేదించిన పోలీసులు
సాక్షి, కర్నూలు జిల్లా: టీడీపీ నేత శ్రీనివాసులు హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఆధిపత్యం కోసం టీడీపీ నేతలే హత్య చేసినట్లు నిర్థారణ అయ్యింది. హత్యకు ఆధిపత్య పోరే కారణమని డీఎస్పీ శ్రీనివాసాచారి వెల్లడించారు.హత్య వెనకా రాజకీయ కోణం ఉంది. అందుకే అంత మొందించారు. టీడీపీకి చెందిన గుడిసె నరసింహులతో పాటు మరో ముగ్గురు హత్యకు కుట్ర పన్నారు. ఇద్దరు మైనర్లతో హత్య చేసేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారని డీఎస్పీ తెలిపారు. నలుగురు నిందితులను పత్తికొండ కోర్టులో రిమాండ్ చేసిన పోలీసులు.. మరో ఇద్దరిని జువైనల్ కోర్టుకు తరలించారు.శ్రీనివాసులను సొంత పార్టీ వారే దారుణంగా హత్య చేసినట్లు విచారణలో తేలింది. టీడీపీ పార్టీకి చెందిన నలుగురు వ్యక్తులతో పాటు, మరో ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయ బయటపడింది. అయితే ఈ హత్యను మంత్రి నారా లోకేష్.. వైఎస్సార్సీపీకి అంటగట్టే ప్రయత్నం చేశారు. హత్య వెలుగులోకి రాగానే వైఎస్సార్సీపీ చేసిందంటూ ఎల్లో మీడియా సైతం నానా హంగామా చేసింది.శ్రీనివాసులను హత్య చేసిన వారు సొంత పార్టీ నాయకులే కావడంతో స్థానికంగా ఉన్న టీడీపీ నేతలు నోరు మెదపడం లేదు. ఈ సంఘటన ఆగస్టు 14 తేదీన జరిగింది. -
టీడీపీ నేత హత్యకేసు: వెలుగులోకి దారుణ నిజాలు
కర్నూలు జిల్లా: టీడీపీ నేత శ్రీనివాసులు హత్య కేసులో దారుణ నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. శ్రీనివాసులను సొంత పార్టీ వారే దారుణం హత్య చేసినట్లు విచారణలో తేలింది. టీడీపీ పార్టీకి చెందిన నలుగురు వ్యక్తులతో పాటు, మరో ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయ బయటపడింది. టీడీపీలో శ్రీనువాసులకు లభిస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక హత్యకు పాల్పడినట్లు పోలీసుల విచారణలో తేలింది. అయితే ఈ హత్యను వైఎస్సార్సీపీకి అంటగట్టే ప్రయత్నం చేశారు మంత్రి నారా లోకేష్, హత్య వెలుగులోకి రాగానే వైఎస్సార్సీపీ చేసిందంటూ ఎల్లో మీడియా సైతం నానా హంగామా చేసింది.శ్రీనివాసులను హత్య చేసిన వారు సొంత పార్టీ నాయకులే కావడంతో స్థానికంగా ఉన్న టీడీపీ నేతలు నోరు మెదపడం లేదు. ఈ సంఘటన ఆగస్టు 14 తేదీన చోటు చేసుకోగా, నేడో-రేపో నిందితులను మీడియా ముందు ప్రవేశ పెట్టే అవకాశాలు కనబడుతున్నాయి. -
షాడో ఎమ్మెల్యేకి 15 బ్రేక్ దర్శన టికెట్లు!
తిరుమల: తిరుమలలో సంప్రదాయాలకు కూటమి ప్రభుత్వం తూట్లు పొడుస్తోంది. సామాన్య భక్తులకు ప్రాధాన్యత ఇస్తామంటూ ఆర్భాటంగా ప్రకటనలు గుప్పించి.. తీరా తమకు తోచిన వారికి అత్యధిక టికెట్లు కేటాయించేలా టీటీడీపై ఒత్తిడి తెస్తోంది. సాధారణంగా టీటీడీ నియమావళి ప్రకారం రాజ్యాంగబద్ధ హోదాలో ఉన్నవారు, ప్రజా ప్రతినిధులు, ఇతర ప్రముఖులు స్వయంగా దర్శనానికి వస్తే, వారితో పాటు వచ్చేవారికి కూడా ప్రొటోకాల్ వీఐపీ బ్రేక్ దర్శన టికెట్లు జారీ చేస్తారు. వారు స్వయంగా రాకుండా కుటుంబ సభ్యులు వస్తే రెఫరల్ ప్రొటోకాల్ బ్రేక్ దర్శనం కల్పిస్తారు. అయితే తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు దర్శనానికి స్వయంగా రాకపోయినప్పటికీ, ఆయన అన్న కుమారుడు శివకుమార్‌తో పాటు మరో 14 మందికి ప్రొటోకాల్ బ్రేక్ దర్శనాలు కేటాయించారన్న వార్త సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఎంత షాడో ఎమ్మెల్యే అయినా 14 బ్రేక్ దర్శనాలు ఎలా ఇస్తారనే విమర్శలు వినిపిస్తున్నాయి. దీనిపై టీటీడీ అధికారుల నుంచి ఎలాంటి స్పందన వస్తుందో వేచి చూడాలి. -
అంతరార్థం..
ఎవరైనా ఏదైనా ఒక పని చేస్తే దాన్ని చూసిన మనం అతడు అలా చేయటం మంచిదనో లేదా చెడ్డదనో వెంటనే తీర్పుచెబుతూ ఉంటాం. అలా చేయటం తగదని శ్రీ రామకృష్ణ పరమహంస రామాయణ, మహాభారతాల నుంచి కొన్ని ఉదాహరణలు చూపారు. రామరావణ యుద్ధంలో రావణ కుంభకర్ణాది యుద్ధ వీరులంతా చనిపోయారు. రావణుని తల్లి కైకశి ప్రాణభయంతో పారిపోసాగింది.లక్ష్మణుడు అలా పారిపోతున్న ఆ వృద్ధ స్త్రీని గమనించి శ్రీరామ చంద్రునితో, ‘అన్నయ్యా! ఏమిటీ వింత? అనేక మంది పుత్రులను, బంధువులను కోల్పోయి పుత్ర శోకాన్ని అనుభవిస్తూ ఇప్పుడు స్వీయ ప్రాణ రక్షణార్థం ఈ వృద్ధురాలు ఇలా ఎందుకు పారిపోతోంది?’ అని అడిగాడు. అందుకు రాముడు ‘ఆమెనే అడిగి కారణం కనుక్కొందాం’ అన్నాడు. ‘శ్రీరాముడు అభయమిచ్చాడని తెలిపి ఆమెను గౌరవంగా నా కడకు తోడ్కొని రండి అని కొందరిని ఆమె కడకు పంపాడు. వారు అలాగే చేశారు.‘నీవు ప్రాణ భీతితో అలా పారిపోతున్నావా? నిజం చెప్పు’ అన్నాడు శ్రీరామ చంద్రుడు ఆమెతో. అప్పుడామె, ‘ఓ రామా! నేను జీవించి ఉన్నందునే నీ ఈ లీలలను తిలకించ గల్గుతున్నాను. ఈ భూమ్మీద నీవు ఇంకా జరుపబోయే లీలలను కూడా చూడగోరి ఇంకా కొంత కాలం జీవించాలని అభిలషిస్తున్నాను’ అని చెప్పింది. దీంతో సత్యమేమిటో అందరికీ తెలిసి వచ్చింది.మహాభారత ఉదాహరణ చూద్దాం. భీష్ముడు అంపశయ్యపై ఉన్నాడు. శ్రీకృష్ణుడు, పంచ పాండవులు ఆయన చుట్టూ నిలబడి ఉన్నారు. మహావీరుడైన భీష్మాచార్యుల వారి కళ్ళ నుండి అశ్రువులు స్రవించటం వారు గమనించారు. అర్జునుడు శ్రీకృష్ణునితో, ‘సఖా! ఎంత విచిత్రంగా ఉంది. కురు పితామహులైన భీష్ములు మరణ సమయంలో మాయలో పడి దుఃఖిస్తున్నా రేమిటి?’ అన్నాడు. కృష్ణుడే భీష్ముడిని దాన్నిగూర్చి అడిగాడు.అప్పుడు భీష్ముడు, ‘ఓ కృష్ణా! మరణ భయంతో నేను దుఃఖించటం లేదని నీకు బాగా తెలుసు, స్వయంగా భగవంతుడే పాండవులకు సారథిగా ఉన్నప్పటికీ వారి కష్టాలకు అంతులేకుండా ఉందే! ఇలాంటి ఆలోచన వచ్చినప్పుడు భగవంతుడి లీలలను కించిత్తూ తెలుసుకోలేకుండా ఉన్నానే అని తలచుకొని దుఃఖిస్తున్నాను’ అన్నాడు (శ్రీ రామకృష్ణ కథామృతం–01). కాబట్టి దేన్ని చూసినా, విన్నా త్వరపడి విమర్శించ కూడదు. నిజం నిలకడ మీద తేలుతుంది. – రాచమడుగు శ్రీనివాసులు -
తెలుగు అధికారికి ఎస్బీఐ పగ్గాలు!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: బ్యాంకింగ్ రంగ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) నూతన చైర్మన్‌గా సీనియర్ మేనేజింగ్ డైరెక్టర్ చల్లా శ్రీనివాసులు శెట్టిని ఫైనాన్షియల్ సరీ్వసెస్ ఇన్స్టిట్యూషన్స్ బ్యూరో (ఎఫ్ఎస్ఐబీ) శనివారం ఎంపిక చేసింది. ప్రస్తుతం ఆయన ఎస్బీఐ మేనేజింగ్ డైరెక్టర్ హోదాలో అంతర్జాతీయ బ్యాంకింగ్, గ్లోబల్ మార్కెట్స్, టెక్నాలజీ విభాగాలను పర్యవేక్షిస్తున్నారు. ఆగస్టు 28న పదవీ విరమణ చేయనున్న దినేష్ కుమార్ ఖరా స్థానంలో బాధ్యతలు స్వీకరిస్తారు. శ్రీనివాసులు తెలుగువారు కావడం విశేషం. తెలంగాణలోని జోగులాంబ గద్వాల జిల్లా పెద్దపోతులపాడు ఆయన స్వస్థలం. ఎస్బీఐలో ప్రొబేషనరీ అధికారిగా 1988లో కెరీర్ ప్రారంభించారు. ప్రభుత్వ యాజమాన్యంలోని బ్యాంకులు, ఆర్థిక సంస్థల డైరెక్టర్లను ఎంపిక చేసే ఎఫ్ఎస్ఐబీ.. ఎస్బీఐ కొత్త చైర్మన్ కోసం జూన్ 29న ముగ్గురు అభ్యర్థులను ఇంటర్వ్యూ చేసి శ్రీనివాసులు పేరును ఖరారు చేసింది. ఎఫ్ఎస్ఐబీ సిఫార్సుపై ప్రధాని మోదీ నేతృత్వంలోని కేబినెట్ నియామకాల కమిటీ తుది నిర్ణయం తీసుకోనుంది. -
ఆధ్యాత్మిక శక్తితో...
ఇవ్వాళ ప్రభుత్వాలూ, సంఘసేవకులూ మహిళా సాధికారత గురించి ఎంతగానో మాట్లాడుతున్నారు. కానీ, దాదాపు 140 సంవత్సరాల క్రితమే శ్రీ రామకృష్ణ పరమహంస స్త్రీ జనోద్ధరణపై దృష్టి పెట్టారు. సాక్షాత్తూ భార్యలోనే కాళీ మాతను దర్శించగలిగిన పరమహంస స్త్రీ జనోద్ధరణకు తన శిష్యులను ప్రోత్సహించారు.ఒకరోజు గౌరీమా అనే భక్తురాలు పువ్వులు సేకరిస్తుండగా గురుదేవులు ఒక నీటికుండతో అక్కడకు వచ్చి ఒక చేత్తో చెట్టుకొమ్మను పట్టుకొని మరో చేత్తో చెట్టుకు నీరు పోస్తూ ‘గౌరీ, నేను నీరు పోస్తూ ఉంటే నువ్వు మట్టిని కలుపు’ అన్నాడు. అప్పుడామే ‘ఇక్కడ బంక మట్టి లేదు. ఎలా మట్టిని కలప గలన’ని పలికింది.ఆ మాట విని గురుదేవులు ‘నేను ఏ అర్థంలో చెప్పానూ, నువ్వు ఏ రకంగా అర్థం చేసుకొన్నావూ? ఈ దేశంలో స్త్రీల పరిస్థితి శోచనీయంగానూ, బాధాకరంగానూ ఉంది. వారికోసం నువ్వు పాటుపడాలి’ అన్నారు. అంటే... తాను దేశ స్త్రీల అభివృద్ధికి నడుం బిగించి కృషి ఆరంభిస్తే, గురుదేవులు అందుకు తగిన తోడ్పాటు అందిస్తారన్నమాట అనుకున్నారు గౌరీమా. అప్పుడామె ‘కొద్ది మంది బాలికలను నాకు ఇవ్వండి. వారిని హిమాలయాలకు తోడ్కొని వెళ్ళి వారిని సౌశీల్యవంతులుగా తీర్చి దిద్దుతాను’ అంది. గురుదేవులు తన తలను అడ్డంగా ఊపుతూ, ‘కాదు, కాదు, నువ్వు నగరంలోనే ఉంటూ పని చేయాలి. నువ్వు అనుష్ఠించిన ఆధ్యాత్మిక సాధనలు చాలు. ఆధ్యాత్మిక శక్తితో నువ్వు స్త్రీలను సేవించాలి’ అన్నారు.గురుదేవుల ఆదేశాన్ని శిరసావహించిన గౌరీమా కలకత్తాలో బాలికల నిమిత్తం ఒక పాఠశాలను స్థాపించి భారతీయ స్త్రీలను విద్యావంతులను గావించడంలోనూ, తద్వారా వారిని ఉద్ధరించడంలోనూ ఎంతో కృషి చేసింది. (పుటలు 248, 249 – శ్రీ రామకృష్ణ లీలామృతం). రామకృష్ణ పరమహంస ప్రియ శిష్యుడు స్వామి వివేకానందుడు కూడా మహిళా ఉద్ధరణకు ఎంతగానో కృషి చేయడం గమనార్హం. – రాచమడుగు శ్రీనివాసులు -
వైఎస్సార్సీపీ దళిత నేత ఇంటిపై దాడి
పెద్దపంజాణి (చిత్తూరు జిల్లా): చిత్తూరు జిల్లాలో వైఎస్సార్సీపీకి చెందిన ఓ దళిత నేత ఇంట్లోకి టీడీపీకి చెందిన వారిగా భావిస్తున్న ముగ్గురు వ్యక్తులు చొరబడి, ఆయన భార్య, కుమారుడిపై దాడి చేసి, విధ్వంసం సృష్టించారు. బాధితుని కథనం ప్రకారం.. దళితుడైన వైఎస్సార్సీపీ జిల్లా కార్యదర్శి, మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ ఎర్రబల్లి శ్రీనివాసులు పెద్దపంజాణి మండలం వీరప్పల్లి పంచాయతీ కెళవాతి సమీపంలోని తన పొలం వద్ద ఇల్లు కట్టుకుని నివాసం ఉంటున్నారు.వైఎస్సార్సీపీలో చురుకైన పాత్ర పోషిస్తున్నారు. సోమవారం రాత్రి 8.30 గంటల సమయంలో ముసుగులు ధరించి కారులో వచ్చిన ముగ్గురు వ్యక్తులు అతని ఇంట్లోకి చొరబడ్డారు. శ్రీనివాసులు కోసం ఆరాతీశారు. ఆయన ఇంట్లో లేకపోవడంతో అతని భార్య, కుమారుడి వద్ద ఉన్న సెల్ఫోన్లను తీసుకున్నారు. పెద్దగా కేకలు వేస్తూ వారిద్దరిపైనా దాడి చేసి, గాయపరిచారు. ఇంట్లోని ఫరి్నఛర్‌ను ధ్వంసం చేసి భయభ్రాంతులకు గురిచేశారు.గతంలో సీఎం చంద్రబాబు, స్థానిక ఎమ్మెల్యే అమరనాథరెడ్డికి వ్యతిరేకంగా శ్రీనివాసులు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టాడని, అతన్ని ఎట్టి పరిస్థితుల్లో విడిచిపెట్టబోమని, రాష్ట్రం విడిచి వెళ్లే వరకూ వదిలే ప్రసక్తే లేదని హెచ్చరించి వెళ్లిపోయారు. కుటుంబీకుల సమాచారంతో ఇంటికి చేరుకున్న శ్రీనివాసులు పెద్దపంజాణి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి, విచారణ చేపట్టారు. -
ఎన్ని శక్తులు ఏకమైనా గెలుపు వైఎస్సార్సీపీదే
సాక్షి, అమరావతి: ఎన్ని శక్తులు ఏకమైనా 2024 ఎన్నికల్లో విజయం వైఎస్సార్‌సీపీదేనని ప్రభుత్వ విప్ కొరముట్ల శ్రీనివాసులు అన్నారు. మళ్లీ ముఖ్యమంత్రిగా వైఎస్ జగనే ఉండాలని ప్రజలంతా కోరుకుంటున్నారని చెప్పారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం వద్ద గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘రాష్ట్రంలోని అన్ని వర్గాలూ వైఎస్ జగన్ వెంటే ఉన్నారు. ‘సిద్ధం’ సభలకు పోటెత్తుతున్న జనాన్ని చూస్తే.. సీఎం జగన్‌పై ప్రజలకు ఏస్థాయిలో అభిమానముందో అర్థం చేసుకోవచ్చు. అందుకే వచ్చే ఎన్నికల్లో టీడీపీ ఓటమి ఖాయమని చంద్రబాబు భార్య నారా భువనేశ్వరి పరోక్షంగా చెప్పేశారు. చంద్రబాబు కుప్పంలో ఘోరంగా ఓడిపోవడం ఖాయమని తెలిసే.. బాబుకు ఇక విశ్రాంతి అవసరమంటూ భువనేశ్వరి అన్నారు. నారా కుటుంబం ఓటమిని ముందే అంగీకరించింది. కుప్పంలో సైతం ఓడిపోతానని తెలిసే.. అక్కడి నుంచి పారిపోయేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. మరోవైపు ఒంటరిగా సీఎం జగన్‌ను ఎదుర్కోలేక టీడీపీ, బీజేపీతో కలిసి వస్తున్నామని పవన్‌కళ్యాణ్ అంటున్నారు. ఒంటరిగా పోటీ చేసే దమ్ము లేనప్పుడు.. రాజకీయాలు ఎందుకు? అసలు ఏం చూసి ప్రజలు చంద్రబాబుకు, బీజేపీకి, పవన్‌కు ఓటు వేయాలి? 2014లో 650 హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత అమలుచేయకుండా చంద్రబాబు కూటమి ప్రజల్ని మోసం చేస్తే.. సీఎం జగన్ మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చి ప్రజల గుండెల్లో స్థానం సంపాదించారు. వైఎస్ జగన్ పాలనలో కులమతాలు, పార్టీలకు అతీతంగా అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలు అందుతున్నాయి. ప్రతి గ్రామానికి, ప్రతి ఇంటికీ సీఎం జగన్ మంచి చేశారు. అందుకే వచ్చే ఎన్నికల్లో 175కు 175 అసెంబ్లీ స్థానాలు.. 25కు 25 లోక్‌సభ స్థానాలు గెలవడమే వైఎస్సార్సీపీ టార్గెట్. దేవుడి దయ, ప్రజలందరి దీవెనలతో మళ్లీ రాష్ట్రంలో వైఎస్ జగన్ ప్రభుత్వం ఏర్పడుతుంది’ అని కొరముట్ల శ్రీనివాసులు అన్నారు. -
మాజీ ఎమ్మెల్సీ కారు ఢీకొని ఒకరు మృతి
శాంతిపురం(చిత్తూరు): మాజీ ఎమ్మెల్సీ, టీడీపీ నాయకుడు గౌనివారి శ్రీనివాసులు కారు ఢీకొని కర్ణాటకకు చెందిన ఓ వ్యక్తి మృతి చెందగా మరో మహిళ మృత్యువుతో పోరాడుతోంది. స్థానికులు, పోలీసుల కథనం మేరకు.. కర్ణాటకలోని బంగారుపేట సమీపంలో ఉన్న ఐతెనహళ్లికి చెందిన దంపతులు మునెప్ప (60), లక్ష్మమ్మ శనివారం మోపెడ్‌పై గుండిశెట్టిపల్లికి బయలుదేరారు. గమ్యస్థానానికి అర కిలోమీటరు దూరంలో ఉండగా శనివారం రాత్రి పలమనేరు జాతీయ రహదారిపై వెనుక నుంచి వచ్చిన ఇన్నోవా కారు వీరి టీవీఎస్ సూపర్ ఎక్సెల్‌ను ఢీకొట్టింది. దీంతో రోడ్డుపై పడ్డ మునెప్పకు తల, కాళ్లకు, లక్ష్మమ్మ తలకు తీవ్ర గాయాలయ్యాయి. 108 వాహనంలో వీరిని కుప్పం ప్రాంతీయ వైద్యశాలకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మునెప్ప మృతి చెందాడు. తీవ్రంగా గాయపడిన లక్ష్మమ్మ పరిస్థితి విషమంగా ఉండడంతో పీఈఎస్ ఆస్పత్రికి తరలించారు. ప్రమాద సమయంలో మాజీ ఎమ్మెల్సీ శ్రీనివాసులు స్వయంగా కారు నడుపుతున్నట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. అయితే రాత్రి 9.30 గంటల వరకు ఘటనపై ఎలాంటి కేసు నమోదు కాలేదు. ఈ విషయమై రాళ్లబూదుగూరు ఎస్ఐ మునిస్వామిని వివరణ కోరగా..ఘటనపై తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని చెప్పడం గమనార్హం. ఒక ప్రాణం పోయినా, మరొకరు ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నా.. ప్రమాదానికి కారణం ఎవరనే విషయంలో స్పష్టత ఉన్నా పోలీసులు వ్యవహరించిన తీరు పలు అనుమానాలకు తావిస్తోంది. -
ఘనంగా చిత్తూరు ఎమ్మెల్యే జన్మదిన వేడుకలు
చిత్తూరు రూరల్/చిత్తూరు అగ్రికల్చర్/గుడిపాల: చిత్తూరు, గుడిపాల మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో ఆదివారం ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు జన్మదిన వేడుకలను మండల ప్రజాప్రతినిధులతోపాటు వెఎస్సార్సీపీ శ్రేణులు ఘనంగా నిర్వహించాయి. వైఎస్సార్సీపీ నాయకులు, అధికారులు ఎమ్మెల్యేను ఆయన నివాసం వద్ద కలిసి దుశ్శాలువాలు కప్పి, పుష్పగుచ్ఛాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. గుడిపాలలో అన్నదానం చేశారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ సభ్యుడు ఎం.ఎస్ బాబునాయుడు, వైస్ ఎంపీపీలు జయరాం, రంజనీ, గుడిపాల ఎంపీపీ ప్రసాద్‌రెడ్డి, నాయకులు త్యాగరాజులు, సంపత్, బాబు, దిలీప్, కుమార్, ధర్మారెడ్డి, ఎంపీటీసీ, సర్పంచులు ప్రతిమారెడ్డి, భాస్కర్‌రెడ్డి, భాస్కర్, శ్రీధర్‌రెడ్డి, రజనీకాంత్, వెంకటేష్‌రెడ్డి, కలై అరసి, రవీంద్రారెడ్డి, శ్రీరాములురెడ్డి, జనార్ధన్, ప్రసాద్‌రెడ్డి, చిట్టిబాబు, డానియల్, విక్టర్, సాయిప్రతాప్, శింభు, సాయి, గోపి, క్రిష్ణారెడ్డి, కార్యకర్తలు పాల్గొన్నారు. -
చార్జర్ వైర్‌తో చంపేశారు...
గుణదల (విజయవాడ తూర్పు): ఏపీలో సంచలనం రేకెత్తించిన యువ వ్యాపారవేత్త కరణం రాహుల్ హత్య కేసు మిస్టరీ వీడింది. సెల్‌ఫోన్ చార్జర్ వైర్ మేడకు బిగించి, దిండుతో ఊపిరాడకుండా చేసి రాహుల్‌ను చంపేశారని విజయవాడ నగర పోలీస్ కమిషనర్ బత్తిన శ్రీనివాసులు తెలిపారు. కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేసి కీలక ఆధారాలు సేకరించి, పలువురు నిందితులను శుక్రవారం అరెస్టు చేశారు. కేసుకు సంబంధించిన పలు కీలక విషయాలను కమిషనర్ శుక్రవారం మీడియాకు వివరించారు. ఆర్థిక లావాదేవీలే ముఖ్య కారణం.. కోరాడ విజయ్‌కుమార్, ఆయన స్నేహితురాలు గాయత్రి గత కొన్నేళ్లుగా కోరాడ చిట్‌ఫండ్ కంపెనీ నడుపు తున్నారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్‌కుమార్ స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసి ఓడిపోయారు. ఎన్నికల్లో భారీగా ఖర్చు చేసి నష్టపోయిన ఆయనపై అప్పులవాళ్లు తమ డబ్బు ఇవ్వాలని తీవ్ర ఒత్తిడి చేయసాగారు. మరోవైపు చిట్‌ఫండ్ కంపెనీ డబ్బు సైతం ఎన్నికల్లో వినియోగించడంతో.. అక్కడా ఒత్తిళ్లు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో రాహుల్, విజయ్‌కుమార్ భాగస్వామ్యంలో నిర్వహిస్తున్న జిక్సిన్ సిలెండర్స్ కంపెనీలోని తన వాటా తీసుకుని డబ్బు ఇవ్వాల్సిందిగా విజయ్‌కుమార్ రాహుల్‌ను కోరాడు. అయితే ఈ విషయంలో స్పందించకపోవడంతో రాహుల్‌పై ఆగ్రహంతో ఉన్నాడు. ఇదిలా ఉండగా విజయ్‌కుమార్ స్నేహితురాలు గాయత్రికి రాహుల్ రూ.6 కోట్లు ఇవ్వాల్సి ఉంది. ఆమెకు సైతం ఆ డబ్బు తిరిగి ఇవ్వకపోవడంతో తీవ్ర అసంతృప్తితో ఉంది. అలాగే జిక్సిన్ సిలెండర్స్ కంపెనీలో పనిచేస్తున్న సీతయ్యకు లాజిస్టిక్స్ బిజినెస్‌లో కాంట్రాక్ట్ ఇస్తానని హామీ ఇచ్చి నేరవేర్చపోవడంతో రాహుల్‌పై కక్ష పెంచుకున్నాడు. ఈ పరిస్థితులే రాహుల్ హత్యకు దారితీశాయి. నిందితుల అరెస్టు.. మృతుని తండ్రి కరణం రాఘవరావు మాచవరం పోలీస్‌స్టేషన్‌లో ఇచ్చిన పిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. దర్యాప్తు ప్రారంభించిన పది రోజుల వ్యవధిలోనే కీలక ఆధారాలు సేకరించి, పరారీలో ఉన్న నిందితుల్లో ఆరుగురిని శుక్రవారం అరెస్టు చేశారు. -
ఏపీలోకి రావాలంటే తప్పనిసరిగా ఈ-పాస్ ఉండాలి
సాక్షి, విజయవాడ: కోవిడ్ సమస్యలన్నీ ఒక్కొక్కటి పరిష్కరిస్తున్నామని సీపీ శ్రీనివాసులు తెలిపారు. ఆయన బుధవారం మీడియాతో మాట్లాడుతూ, ఏపీలోకి రావాలంటే తప్పనిసరిగా ఈ-పాస్ ఉండాలని సీపీ స్పష్టం చేశారు. వచ్చే అంబులెన్స్‌లను పరిశీలించి అనుమతి ఇస్తున్నామన్నారు. మద్యం అక్రమ తరలింపులపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. ‘‘కోవిడ్ సెకండ్ వేవ్‌లో దేశవ్యాప్తంగా ఆక్సిజన్ సమస్యలు ఉన్నాయి. జీజీహెచ్‌లో అక్సిజన్ అయిపోయే ప్రమాదాన్ని అందరి సహకారంతో అరికట్టాం. పోలీసు శాఖలో 97 శాతం వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తైంది. బ్లాక్మార్కెట్లో ఇంజక్షన్లు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటున్నాం. బ్లాక్మార్కెట్లో ఇంజక్షన్లను అమ్మే 12 గ్యాంగ్‌లను పట్టుకున్నాం. విజయవాడ పరిధిలో నిబంధనలు ఉల్లంఘించిన వాహనదారుపై కేసులు నమోదు చేశాం. కరోనా కట్టడికి పెద్ద ఎత్తున ర్యాలీలు, అవగాహన కల్పించామని’’ సీపీ శ్రీనివాసులు పేర్కొన్నారు. చదవండి: తండ్రి పేరుతో సుక్కు ఆక్సిజన్ ప్లాంట్, ప్రారంభించిన మంత్రి ‘మితిమీరిన స్టెరాయిడ్స్ వాడకమే బ్లాక్ ఫంగస్‌కు కారణం’ -
అమ్మా ఎంతపనిచేశావమ్మా..?
చిన్నపాటి మనస్పర్థలకే కుంగిపోయావు.. మా నాన్నను వదిలి ఒంటరిగా జీవించాలనుకున్నావు.. అది సాధ్యం కాదని తెలిసి నీ తల్లిదండ్రుల చెంతకు చేరావు.. వారితోనూ సఖ్యతగా ఉండలేక విసిగిపోయావు .. గొడవలకు దిగి మరింత మానసిక వేదనకు లోనయ్యావు.. కడుపుచించుకు పుట్టిన బిడ్డల్ని పోషించలేనని భావించావు.. ఒంటరిగా సమాజంలో బతకడం కష్టమని కుమిలిపోయావు.. ఇక చావే శరణ్యమని వ్యవసాయబావిని ఎంచుకున్నావు.. ఆ బావిలోనే మమ్మల్ని ముంచేసి.. నువ్వూ కడతేరిపోయావు.. అమ్మా ఎంతపనిచేశావమ్మా..? అన్నట్టు అభంశుభం తెలియని పసిపిల్లలు నీటిలో తేలియాడుతూ కనిపించడం చూపరులను కలచివేసింది. చిత్తూరులో ఐదు రోజుల క్రితం అదృశ్యమైన తల్లీబిడ్డలు శుక్రవారం వ్యవసాయ బావిలో శవాలుగా తేలడం స్థానికంగా విషాదం అలముకుంది. చిత్తూరు అర్బన్: చిత్తూరు నగరంలోని ఓబనపల్లెకు చెందిన మునిరత్నం, పట్టమ్మ కుమార్తె ధనలక్ష్మి (28)కి పదేళ్ల క్రితం తమిళనాడులోని వేలూరుకు చెందిన ముత్తుతో వివాహమైంది. వీళ్లకు ఝాన్సి (8), ఉదయ్ పిల్లలు ఉన్నారు. ముత్తు తాపీమేస్త్రీగా, ధనలక్ష్మి హైరోడ్డులోని ఓ హోటల్లో కూలీగా పనిచేసేవారు. కొంతకాలం వీళ్ల కాపురం సజావుగా సాగింది. తర్వాత చిన్నపాటి గొడవలు రావడంతో రెండేళ్ల క్రితం దంపతులు విడిపోయారు. ముత్తు తన సొంతూరికి వెళ్లిపోగా, ధనలక్ష్మి ఓబనపల్లెలో తల్లిదండ్రుల వద్ద ఉంటోంది. కుమార్తెను ప్రభుత్వ పాఠశాలలో మూడో తరగతి, కుమారుడిని ఒకటో తరగతి చదివిస్తోంది. ఈ నేపథ్యంలో రెండు నెలలుగా ధనలక్ష్మి ఒంటరితనాన్ని భరించలే పోయింది. తల్లిదండ్రులతో సైతం పలుమార్లు మనస్పర్థలు రావడంతో మరింత కుంగిపోయింది. చదవండి: (విషాదం: గుండెపోటుతో జగదీష్.. మనోవేదనతో శిరీష..) ఈనెల 4వ తేదీ సాయంత్రం పిల్లలతో సహా ధనలక్ష్మి కనిపించకుండాపోయింది. భర్త వద్దకు వెళ్లి ఉంటుందని కుటుంబ సభ్యులు భావించారు. ఆపై రెండు రోజుల పాటు అన్నిచోట్లా విచారించారు. కానీ ఆచూకీ తెలియకపోవడంతో ఈనెల 6వ తేదీన టూటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదుచేసిన పోలీసులు సీసీ కెమెరాలు, తెలిసిన వాళ్ల చిరునామాల్లో వెతకడం ప్రారంభించారు. ధనలక్ష్మి తన సెల్‌ఫోన్ కూడా ఇంట్లోనే వదలివెళ్లిపోవడంతో కేసు కొలిక్కిరాలేదు. శుక్రవారం ఉదయం ఓబనపల్లె వద్ద ఉన్న వ్యవసాయ బావిలో ఇద్దరు పిల్లల మృతదేహాలు తేలాయి. గుర్తించిన స్థానికులు, పోలీసులకు సమాచారం అందజేశారు. బాధితుల్ని ఓదారుస్తున్న ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు టూటౌన్ సీఐ యుగంధర్, ఎస్ఐ మల్లికార్జునతో పాటు అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను వెలికితీశారు. ధనలక్ష్మి పిల్లలుగా గుర్తించారు. కొంతసేపటి వరకు ధనలక్ష్మి కోసం బావిలో వెతికినా ఆచూకీ లభించలేదు. అగ్నిమాపక సిబ్బంది గాలింపు తీవ్రం చేయడంతో ఆమె మృతదేహం కూడా లభ్యమైంది. పిల్లల్ని ముందుగా బావిలో తోసి, ఆపై తనూ బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం చిత్తూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న చిత్తూరు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు మృతురాలి కుటుంబాన్ని పరామర్శించారు. -
ఎమ్మెల్యే గారు మీ శ్రేయోభిలాషిగా చెప్తున్నా..
సాక్షి, చిత్తూరు: ‘‘హలో.. నేను ఏసీబీ డీఎస్పీ హరికృష్ణ మాట్లాడుతున్నా.. చిత్తూరులోని ప్రముఖ రాజకీయ నాయకుల ఇళ్లలో సోదాలు జరుపుతున్నాం. మీ శ్రేయోభిలాషి కావడంతో ముందుగానే చెబుతున్నా. కాస్త జాగ్రత్తగా ఉండండి. చిన్న మాట, నేండ్రగుంట వద్ద మన టీమ్ (ఏసీబీ బృందం) భోజనాలు చేస్తోంది. ఓ రూ.8 వేలు పంపితే బాగుణ్ణు.’’ అంటూ చిత్తూరు ఎమ్మెల్యే శ్రీనివాసులుకు ఫోన్ చేసి, మస్కాకొట్టబోయిన వ్యక్తి కటకటాలపాలయ్యాడు. ఎమ్మెల్యే పీఏ ఇచ్చిన ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు గంగవరానికి చెందిన ఉప్పత్తి హరికృష్ణ (35)ను గురువారం అరెస్టు చేశారు. చిత్తూరు ఇన్చార్జ్ డీఎస్పీ తిప్పేస్వామి, టూటౌన్ సీఐ యుగంధర్, తాలూక సీఐ విక్రమ్ ఇతని నేరచరిత్రను మీడియాకు వివరించారు. చిత్తూరు జిల్లా గంగవరం మండలం మదనపల్లెవారి ఇండ్లు సమీపంలోని సాయిగార్డెన్ సిటీకి చెందిన ఉప్పత్తి హరికృష్ణ.. ఇంటర్ వరకు చదువుకున్నాడు. కాస్త ఏమరుపాటుగా ఉన్నవాళ్లను మోసం చేయడంలో దిట్ట. ఓ సెల్‌ఫోన్ కంపెనీకు చెందిన టవర్ లొకేషన్లలో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ పలువురు నిరుద్యోగులకు వలవేశాడు. నిరుద్యోగ అభ్యర్థులను తాను ముందుగా ఎంచుకున్న ప్రదేశాలకు పిలవడం, ఇంటర్వ్యూలు చేసేలా ఓ వాతావరణం సృష్టించేవాడు. ‘ఇంటర్వ్యూకు గడ్డం గీసుకోకుండా వస్తే ఎలాగయ్యా..? అదిగో అక్కడున్న షాపులో షేవ్ చేసుకుని, స్నానంచేసి రా’ అంటూ నిరుద్యోగులను పంపడం, వాళ్ల మొబైల్లో ఉన్న పేటీఎం, ఫోన్ పే కోడ్లు తెలుసుకుని తన బ్రాంచ్ ఆఫీసు నుంచి డబ్బులు వస్తాయని నిరుద్యోగుల నంబర్ల నుంచి పలువురు ప్రముఖులకు ఫోన్లు చేసేవాడు. (బ్యాంకు రుణం ఎగ్గొట్టి సొంత ఖాతాలకు) ఇలా అనంతపురం జిల్లాలోని పెనుగొండ, ధర్మవరం తదితర ప్రాంతాల్లో తహసీల్దార్లు, పోలీసు అధికారులు, పలువురు రాజకీయ ప్రముఖులకు ఫోన్లు చేశాడు. ఏసీబీ డీఎస్పీగా పరిచయం చేసుకుని.. రూ.2 వేల నుంచి రూ.10 వేల వరకు ఫోన్‌పే, పేటీఎంలలో డబ్బులు వేయించుకునేవాడు. ఈనెల 4వ తేదీ చిత్తూరు ఎమ్మెల్యే శ్రీనివాసులుకు ఫోన్‌చేసి రూ.8వేలు అడగడంతో ఆయన పీఏ స్పందించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు వలపన్ని తొలుత రూ.200 ఫోన్‌పేలో పంపించి, సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా హరికృష్ణను అరెస్టు చేశారు. (క్రికెట్ బెట్టింగ్ ముఠా అరెస్ట్.. భారీగా నగదు స్వాధీనం) పోలీసుల విచారణలో నిందితుడిపై తిరుపతి, పుంగనూరు, బైరెడ్డిపల్లె, మదనపల్లె, తంబళ్లపల్లె, బంగారుపాళ్యం పోలీస్స్టేషన్లలో కేసులున్నాయి. ఈ కేసులకు సంబంధించి ఇతను జైలుకు కూడా వెళ్లొచ్చినట్లు గుర్తించారు. చిత్తూరులోని వన్‌టౌన్, టూటౌన్, తాలూక పోలీస్ స్టేషన్ల పరిధిలో వారంలో ముగ్గురిని మోసం చేసినట్లు విచారణలో తేలింది. చిత్తూరులో నమోదైన మూడు కేసుల్లో నిందితుడ్ని అరెస్టు చేస్తున్నట్లు, ఇతనిపై రౌడీషీట్ కూడా తెరుస్తున్నట్లు డీఎస్పీ పేర్కొన్నారు. ఇతడ్ని పట్టుకోవడానికి శ్రమించిన ఎస్ఐలు విక్రమ్, నాగసౌజన్య, సిబ్బంది రాజ్‌కుమార్, సుధాకర్‌ను డీఎస్పీ అభినందించారు. -
కదులుతున్న అక్రమాల డొంక..
సాక్షి కడప: తీగలాగితే డొంక కదిలినట్లుగా ఆప్కోలో జరిగిన అక్రమాలు ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి. బినామీ సొసైటీలను అడ్డుపెట్టుకుని ఆప్కో మాజీ చైర్మన్ శ్రీనివాసులు చేసిన అవినీతిని సీఐడీ అధికారులు ప్రాథమిక విచారణలో గుర్తించారు. ఇప్పటికే గుజ్జుల శ్రీను ఇంటిలో సోదాలు జరిపి 9కిలోలకు పైగా బంగారం, 16కేజీల వెండి, రూ.కోటి 10లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. ఆదివారం ప్రొద్దుటూరు, ఖాజీపేట, కడప, ఎర్రగుంట్లలో దాడులు చేశారు. రికార్డులు కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. 70శాతం బోగస్ సొసైటీలే.. సీఐడీ అధికారులు జిల్లాలోని 126 చేనేత సొసైటీలను గుర్తించారు. 2015 నుంచి 2018 వరకూ అధిక లావాదేవీలు జరిగిన వాటిని ప్రత్యేకంగా గుర్తించారు. ఆ సోసైటీల సభ్యుల జాబితాను తీసుకున్నారు. గ్రామాలకు వెళ్లారు. సొసైటీల్లో నిజంగా సభ్యులు ఉన్నారా కాగితాలకే పరిమితమయ్యారా అనే విషయాలపై ఆరా తీశారు.దాదాపు 70శాతం బోగస్ సొసైటీలను గుర్తించారు. ఇందులో అధిక భాగం ఆప్కో మాజీ చైర్మన్ బినామీలున్నట్లు గుర్తించింది. సొసైటీల ఆర్థిక లావాదేవీలపై సీఐడీ ప్రత్యేక నిఘా ఉంచింది. బోగస్ సోసైటీలుగా ఉండి ఆర్థిక లావాదేవీలు ఎలా జరిపారనే దానిపై విచారణ చేస్తున్నారు. అందులో కీలక పాత్ర ఎవరిది.. సహకరించినవారెవరు.. అధికారులు పాత్రపై ఆరా తీస్తున్నారు. ఇప్పటికే కడప కేంద్ర కార్యాలయంలోని రికార్డులను పూర్తిగా స్వాధీనం చేసుకున్నారు. పవర్లూమ్ నుంచి రూ. కోట్లు స్వాహా పవర్లూమ్ నుంచి మీటరు రూ. 30 నుంచి రూ 35కే లభిస్తుంది. సిరిసిల్లా, సూరత్, ఈరోడ్, ప్రొద్దుటూరులోని పవర్లూమ్పై నేసిన క్లాత్‌ను ఆప్కో మాజీ చైర్మన్ పెద్ద ఎత్తున కొనుగోలు చేసి చేనేతలు నేసినట్లు రికార్డులు తయారు చేయించారని సీఐడీ అధికారులు గుర్తించారు. ఇలా చేయడం వల్ల మీటరుకు రూ.100 నుంచి రూ.110 మిగులు తుంది. ఇలా కోటి మీటర్లు ఆప్కోకు అమ్మితే రూ.110 కోట్లు మిగిలుతుంది. ఇలా వచ్చిన డబ్బు అంతా స్వాహా అయినట్లు సీఐడీ అధికారులు గుర్తించారు. ఇలా ఎన్ని సంవత్సరాల నుంచి జరుగుతోందనే దానిపై ఆరాతీస్తున్నారు. ♦పవర్లూమ్ నుంచి తెచ్చిన క్లాత్‌ను నేరుగా ఆప్కో షోరూమ్ గోడౌన్‌కు తరలించడం ద్వారా ట్రాన్స్‌పోర్టు పేరుతో రూ. కోట్లు స్వాహా అయినట్లు సీఐడీ అధికారులు గుర్తించారు. ♦ఆర్థికంగా నష్టపోయిన సొసైటీలకు ఎన్సీడీసీ పేరుతో నిధులు ఇచ్చి ఆదుకుంటారు. ప్రభుత్వం నుంచి 30శాతం సబ్సిడీ వస్తుంది. రుణాలకు ప్రభుత్వం భరోసాగా ఉంటుంది.బోగస్ సోసైటీలు నిధులు తీసుకుని సబ్సిడీలు పొంది ప్రభుత్వానికి కుచ్చుటోపీ పెట్టిన విషయంపై విచారణ చేస్తున్నారు. ♦విద్యార్థులకు దుస్తులు కుట్టించే విషయంలోనూ అవినీతి జరిగిందని సీఐడీ అధికారులు గుర్తించారు.చేనేత కార్మికులు నేసిన క్లాత్‌ను దుస్తులు కుట్టడానికి ఇవాల్సి ఉంటుంది. కానీ అప్పటి ఆప్కో చైర్మన్ ఆధ్వర్యంలో పవర్లూమ్ మగ్గంపై నేసిన క్లాత్‌ను తెప్పించి సరఫరా చేసినట్లు గుర్తించారు. విద్యార్థుల యూనిఫాం కుట్టినందుకు ప్రభుత్వం జతకు రూ 50 అందిస్తోంది. అయితే హైదరాబాద్‌లోని కొన్ని ప్రైవేటు కంపెనీల ద్వారా రూ 30కు కుట్టించి మిగతా సొమ్ము స్వాహా చేశారు. సుమారు రూ. వందల కోట్లు స్వాహా జరిగినట్లు ప్రాథమిక విచారణలో గుర్తించారు. ♦చేనేత సంఘాల అభివృద్ధికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆర్ఆర్ఆర్, కార్పస్ ఫండ్‌ను ఇస్తాయి. ఇలా వచ్చిన ఫండ్ ఆప్కో మాజీ చైర్మన్ ద్వారా బినామీ సొసైటీలకు అందినట్లు గుర్తించారు. ఆప్కోలో జరిగిన అవినీతిపై పూర్తి స్థాయిలో విచారణ జరిగితే వాస్తవాలు వెలుగు చూసే అవకాశం ఉంది. ఆప్కో మాజీ చైర్మన్ గోడౌన్‌పై దాడులు ఖాజీపేట: ఆప్కో మాజీ చైర్మన్ గుజ్జల శ్రీనివాసులు గోడౌన్‌పై సీఐడీ అధికారులు ఆదివారం దాడులు నిర్వహించారు. రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. గోడోన్‌లో ఉన్న క్లాత్‌ను పరిశీలించారు. వాటిని సీజ్ చేశారు. -
గుజ్జల శ్రీనివాసులు ఇంట్లో సీఐడీ సోదాలు
సాక్షి, వైఎస్సార్ కడప: ఆప్కో(ఆంధ్రప్రదేశ్ చేనేత ప్రాథమిక సహకార సంఘం) మాజీ చైర్మన్ గుజ్జల శ్రీనివాసులు ఇంట్లో సీబీసీఐడీ అధికారులు రెండో రోజు సోదాలు నిర్వహించారు. ఇంటితో పాటు ఆయన సొసైటీకి సంబంధించిన గోడౌన్లపై ఏకకాలంలో అధికారులు తనిఖీలు చేపట్టారు. రెండు రోజుల క్రితం ఆయన ఇంట్లో జరిగిన దాడుల్లో పెద్ద మొత్తంలో నగదు, బంగారం, వెండితో పాటు పలు కీలక డ్యాక్యుమెంట్లను సీఐడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కాగా ఇప్పటికే ప్రొద్దుటూరులో చేనేత సొసైటీలో జరిగిన అక్రమాల పరంపరలో సొసైటీల అకౌంటెంట్లు శ్రీరాములు, కొండయ్య ఇళ్లపై సీఐడీ అధికారుల దాడులు చేసిన విషయం తెలిసిందే. -
ఆప్కో మాజీ చైర్మన్ ఇంటిలో రూ. కోట్లలో అవినీతి సొమ్ము
ఖాజీపేట: ఆప్కో మాజీ చైర్మన్, టీడీపీ నేత గుజ్జల శ్రీనివాసులు అలియాస్ శ్రీను స్వగృహంలో భారీగా అవినీతి సొమ్ము బయటపడింది. వైఎస్సార్ జిల్లా ఖాజీపేటలోని ఆయన ఇంట్లో ఏకంగా.. 9 కేజీల 900 గ్రాముల బంగారం, 16 కేజీల 300 గ్రాముల వెండి, రూ. 91,67,000 నగదును సీఐడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వీటితో పాటు రూ.10 లక్షల పాత వెయ్యి రూపాయిల నోట్లను, హైదరాబాద్‌లోని ఇంటిలో మరో రూ. 10 లక్షలను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. ఆప్కోలో అక్రమాలపై పూర్తి సమాచారం అందుకున్న అధికారులు కోర్టు అనుమతితో శుక్రవారం శ్రీనివాసులు ఇంటిలోనూ, ఇదే సమయంలో ఢాంఖాన్ పల్లె సొసైటీ కార్యాలయం, సొసైటీలో పనిచేస్తూ ఆర్థిక లావాదేవీలు జరిపే మరో కీలక వ్యక్తి ఇంటిలో సోదాలు జరిపారు. ఖాజీపేటలోని ఆయన ఇంటిలో సుమారు 25 మంది తనిఖీ చేయగా.. ఏకకాలంలో ప్రొద్దుటూరులోని అకౌంటెంట్లు కొండయ్య, శ్రీరాములు, కడపలోని పలు ఇళ్లలో సీఐడీ సోదాలు కొనసాగాయి. ఆప్కోలో అవినీతి బాగోతం ► గత ఎనిమిదేళ్లుగా ఆప్కోలో జరిగిన అవినీతి సీఐడీ అధికారుల సోదాలతో బయటకు వస్తోంది. ► పలు బోగస్ సొసైటీల జాబితాను అధికారులు గుర్తించారు. సొసైటీలో నిజంగా సభ్యులు ఉన్నారా? లేదా? అనే విషయంపైనా దృష్టి సారించారు. ► వైఎస్సార్ జిల్లా ఖాజీపేట మండలంలోని గ్రామాల్లో, ప్రొద్దుటూరు, జమ్మలమడుగు, కమలాపురం ప్రాంతాల్లో సీఐడీ అధికారులు విచారణ జరుపగా.. సభ్యులు పేపర్లలోనే ఉన్నారు కానీ వాస్తవంగా లేరని సీఐడీ గుర్తించినట్లు తెలుస్తోంది. ► బోగస్ సొసైటీలుగా గుర్తించిన వాటి లావాదేవీలు ఎలా జరిగాయి? నిజంగా వీరు మగ్గం నేసి సొసైటీకి అమ్మారా? లేక పవర్లూమ్ నుంచి తీసుకుని వచ్చి అమ్మకాలు జరిపారా అనే దానిపై ఆరాతీస్తున్నారు. ► బోగస్ సొసైటీలకు, ఆప్కో మాజీ అధ్యక్షునికి ఉన్న లింకులపై విచారణ జరుపుతున్నారు. ► శ్రీనివాసులు బంధువులను ప్రశ్నించిన అధికారులు.. నేతన్న నేస్తం పథకం ద్వారా మీకు లబ్ధి ఎలా చేకూరింది? తెల్లకార్డులు ఎలా వచ్చాయని ప్రశ్నించారు. ► సొసైటీ కార్యాలయంలోని కంప్యూటర్లు, రికార్డులను తమ వెంట తీసుకెళ్లారు. తనిఖీలో బయటపడిన విషయాలను కోర్టుకు సమర్పిస్తామని వెల్లడించారు. -
ఆప్కో మాజీ చైర్మన్ ఇంట్లో సీఐడీ సోదాలు
-
ఆప్కో మాజీ చైర్మన్ ఇంట్లో సీఐడీ సోదాలు
సాక్షి, కడప : ఆప్కో(ఆంధ్రప్రదేశ్ చేనేత ప్రాథమిక సహకార సంఘం) మాజీ చైర్మన్ గుజ్జల శ్రీనివాసులు ఇంట్లో సీఐడీ అధికారులు సోదాలు నిర్వహించారు. శుక్రవారం కడప జిల్లాలోని ఖాజీపేటలో ఆయన నివాసంలో, కార్యాలయంలో ఏకకాలంలో సోదాలు జరుపుతున్నారు. గతంలో ఆప్కోలో జరిగిన అక్రమాలపై విచారణ జరుపుతున్నారు. కాగా ఇప్పటికే ప్రొద్దుటూరులో చేనేత సొసైటీలో జరిగిన అక్రమాల పరంపరలో సొసైటీల అకౌంటెంట్లు శ్రీరాములు, కొండయ్య ఇళ్లపై సీఐడీ అధికారుల దాడులు చేశారు. ఈ క్రమంలో అధికారులు వారి దగ్గర నుంచి పెద్ద మొత్తంలో నగదు, బంగారు, డాక్యుమెంట్లు, రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. (చేటు తెచ్చిన సివిల్ పంచాయితీ) -
జేసీ పవన్‌ను ముందుగానే హెచ్చరించాం
సాక్షి, తాడిపత్రి: శాంతి భద్రతల విషయంలో కఠినంగా వ్యవహరిస్తామని డీఎస్పీ ఆర్ల శ్రీనివాసులు అన్నారు. పట్టణంలో 30 యాక్ట్ అమలులో ఉందని, ఎలాంటి సభలు, సమావేశాలు, ర్యాలీలు నిర్వహించరాదన్నారు. శనివారం పట్టణంలోని ప్రధాన రహదారుల్లో పోలీసుల వాహన శ్రేణి కవాతుతో పాటు, ఏరియా డామినేషన్ పెట్రోలింగ్‌ను నిర్వహించారు. ఈ వాహన శ్రేణి స్థానిక గాంధీ సర్కిల్ వద్దకు చేరుకున్న అనంతరం డీఎస్పీ మీడియాతో మాట్లాడారు. పట్టణంలో 144 సెక్షన్ అమలులో ఉందని, అత్యవసర పరిస్థితుల్లో తప్పా చుట్టుపక్కల గ్రామాల ప్రజలు పట్టణంలోకి రాకూడదన్నారు. (మళ్లీ జైలుకు జేసీ..) ప్రస్తుతం ఉన్న పరిస్థితులు అదుపులోకి వచ్చేంత వరకూ ప్రజలు ఇళ్లకే పరిమితం కావాలన్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. జేసీ పవన్‌కు ముందుగానే తాము హెచ్చరికలు జారీ చేసినా వాటిని పెడచెవిన పెట్టిన కారణంగానే కడపలో నిబంధనలు ఉల్లంఘించిన కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఆర్ఎస్.కొండాపురం మండలం తాళ్లపొద్దుటూరు పోలీస్‌స్టేషన్ పరిధిలో కూడా జేసీ ప్రభాకర్‌రెడ్డి, అస్మిత్‌రెడ్డి, జేసీ పవన్‌రెడ్డిలపై కేసులు కూడా నమోదయ్యాయన్నారు. తాడిపత్రి పోలీస్స్టేషన్ల పరిధిలో కూడా పలు కేసులు నమోదు చేశామన్నారు. -
బెజవాడ సీపీగా శ్రీనివాసులు బాధ్యతలు
సాక్షి, విజయవాడ: విజయవాడ పోలీస్ కమిషనరేట్‌లో అదనపు సీపీగా పని చేస్తున్న బత్తిన శ్రీనివాసులు పూర్తిస్థాయిలో విజయవాడ సిటీ పోలీస్ కమిషనర్‌గా సోమవారం బాధ్యతలు స్వీకరించారు. సీపీ బాధ్యతల నుంచి ద్వారకా తిరుమలరావు రిలీవ్ అయ్యారు. కొత్తగా బాధ్యతలు చేపట్టిన శ్రీనివాసులు మీడియా సమావేశంలో మాట్లాడుతూ సీపీగా పనిచేసిన అనుభవం, నగరం గురించి అవగాహన ఉందని తెలిపారు. మరోసారి సీపీగా అవకాశం ఇచ్చిన ప్రభుత్వానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ప్రజలకు సత్వర న్యాయం జరిగేలా చర్యలు చేపడతానని పేర్కొన్నారు. స్పెషల్ బ్రాంచ్ని బలోపేతం చేసి నేరాలకు అడ్డుకట్ట వేస్తామని తెలిపారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠినచర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మాదక ద్రవ్యాల రవాణాపై ఉక్కుపాదం మోపుతామన్నారు. ఆన్లైన్ మోసాలపై సైబర్ సెల్ ప్రత్యేక దృష్టి పెడుతుందన్నారు. కాగా గతంలో బత్తిన శ్రీనివాసులు 2013 మే నుంచి 2014 ఆగస్టు వరకు బెజవాడ సీపీగా పనిచేశారు. (గ్యాంగ్ వార్ కేసులో పురోగతి) నేరాలను నియంత్రించాం: ద్వారకా తిరుమలరావు విజయవాడలో 23 నెలలుగా సీపీగా పనిచేశానని మాజీ సీపీ ద్వారకా తిరుమలరావు అన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో సమర్థవంతంగా పనిచేశామన్నారు. కరోనా వైరస్ నియంత్రణకు నగరంలో పటిష్ఠమైన చర్యలు తీసుకున్నామన్నారు. ప్రజా సమస్యలు పరిష్కారానికి కృషి చేయడంతో పాటు నేరాలను నియంత్రణ చేయగలిగామన్నారు. ప్రజా సంబంధాలను మెరుగుపరుచుకున్నామని వెల్లడించారు. సీపీగా విజయవాడలో పనిచేయడం మంచి అనుభవం, జ్ఞాపకాలను ఇచ్చిందన్నారు. కొత్తగా నియమితులైన శ్రీనివాసులకు ఆయన ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. (బెజవాడ గ్యాంగ్‌వార్ : పండు అరెస్ట్) -
టీడీపీకి అవకాశం ఇచ్చినా వినియోగించుకోలేదు
సాక్షి, అమరావతి: ప్రతిపక్ష పార్టీకి సమాన హక్కులు, అవకాశాలు ఇచ్చినా సద్వినియోగం చేసుకోలేదని మంత్రి అవంతి శ్రీనివాస్ ఆరోపించారు. మంగళవారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద విలేకరులతో మాట్లాడుతూ.. ఈ అసెంబ్లీ సమావేశాల్లో చారిత్రాత్మక బిల్లులు ఆమోదం పొందాయని తెలిపారు. అన్ని వర్గాలకు మంచి జరగాలని కీలక బిల్లులు ఆమోదించామన్నారు. రాబోయే రోజుల్లో అవినీతి రహిత పాలన ఉంటుందని తెలిపారు. ప్రతిపక్ష టీడీపీ వైఖరి సమంజసంగా లేదన్నారు. టీడీపీకి అవకాశం ఇచ్చినా సద్వినియోగం చేసుకోలేదని ఆరోపించారు. 19 కీలక బిల్లులను ఈ సమావేశాల్లో ఆమోదించామని ప్రభుత్వ విప్ శ్రీనివాసులు అన్నారు. గతంలో ప్రతిపక్షం గొంతు నొక్కారు.. కానీ తాము ప్రతిపక్షానికి సమాన అవకాశం ఇచ్చామని తెలిపారు. సమావేశాలు పూర్తయ్యేంతవరకూ ప్రతిరోజు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్ని బిల్లులపై పూర్తి స్థాయిలో కసరత్తు చేశారని తెలిపారు. -
శ్రీశైలం పీఆర్వో పై హత్యాయత్నం
-
పరిమళించిన సంస్కారం
ఒంటరిగా జీవన పోరాటం చేస్తున్న ఆ యువతిని ఆదుకోడానికి ఆపన్న హస్తాలు ముందుకు వస్తున్నాయి. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా గూడూరుకు చెందిన రెహానాకు ఆర్థిక సాయం అందించేందుకు ముందుకు వచ్చారు సాక్షి పాఠకులు కనుమూరు హరిచంద్రారెడ్డి. ఆయన తన చారిటబుల్ ట్రస్ట్ ద్వారా రూ.లక్ష అందజేసి, స్నేహితుల ద్వారా మరో రూ.లక్ష ఆర్థిక సాయం అందించారు. మంచంలో ఉన్న భర్తకు తల్లిగా సపర్యలు చేస్తూ, కాలం చేసిన మామకు.. తనే కొడుకై తల కొరివి పెట్టి అంతిమ సంస్కారం నిర్వహించింది రెహానా. ప్రేమించిన వ్యక్తి కోసం తల్లిదండ్రులను, బంధువులను వదిలేసి వచ్చి మతాంతర వివాహం చేసుకున్న యువతి ఆమె. భర్త అనారోగ్యంతో శల్య స్థితిలో మంచంలో ఉన్నాడు. మామ మరణించడంతో అంతిమ సంస్కారాలు నిర్వహించడానికి అయిన వారెవరూ ముందుకు రాలేదు. దీంతో రెహానానే హిందూ సంప్రదాయం ప్రకారం శ్మశానం వరకూ వెళ్లి అక్కడ, ఆ ధర్మం ప్రకారమే అంత్యక్రియలు నిర్వహించింది. దీనిపై సాక్షి ‘ఫ్యామిలీ’ అక్టోబర్ 24న ‘అంతిమ సంస్కారం’ శీర్షికన కథనాన్ని ప్రచురించింది. ఆ కథనాన్ని చూసి పాఠకులు కొందరు స్పందించారు. వారిలో ఒకరు గూడూరు తూర్పువీధి ప్రాంతానికి చెందిన కనుమూరు హరిచంద్రారెడ్డి. ‘‘ఈ కథనం నా మనసును కదలించింది’’ అంటూ రెహానా సంస్కారాన్ని ఆయన అభినందించారు. ఆమె భర్త శ్రీనివాసులు అనారోగ్యంతో మంచంలోనే ఉన్నాడని చెప్పడంతో అతనికి అవసరమైన సహాయం చేస్తామనీ, రెహానాను తమ ట్రస్ట్ ద్వారా మరింత ఆదుకునే ప్రయత్నం చేస్తామని ఆయన తెలిపారు. శ్రీనివాసులు స్నేహితుడైన శ్రీనాథ్ కూడా స్పందించి ‘హెల్ప్ టు శ్రీను’ అనే వాట్సాప్ గ్రూప్‌ను క్రియేట్ చేసి, అందులో అతని స్నేహితుల నంబర్లను అనుసంధానం చేశారు. దీంతో అతని మిత్రులైన ఎస్వీ సుధాకర్ రూ.20 వేలు, ఉమాశంకర్‌రాజు, బిల్డర్ చంద్రతో పాటు మరికొందరు కలిసి రూ.1,05,000 శ్రీనివాసులు అకౌంట్లో జమ చేశారు. – సాక్షి ప్రతినిధి, గూడూరు -
త్వరలో లీరాగ్లుటైడ్ జనరిక్ వెర్షన్
సాక్షి. హైదరాబాద్: టైప్2 మధుమేహాన్ని నియంత్రించే లీరాగ్లుటైడ్ ఔషధంపై క్లినికల్ ట్రయల్స్ నిర్వహించేందుకు హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న సజ్జల బయోల్యాబ్స్ సంసిద్ధత వ్యక్తంచేసింది. ఈ ఔషధంపై నొవో నార్డిస్క్‌కు ఉన్న పేటెంట్ గడువు గతేడాది సెప్టెంబరుతో ముగిసింది. దీంతో దీని జనరిక్ వెర్షన్‌ను మార్కెట్లోకి తెచ్చేందుకు దేశంలో తామే మొదట ప్రయోగ పరీక్షలు ఆరంభించనున్నట్లు సజ్జల బయోల్యాబ్స్ డైరెక్టర్లు ఎస్.భార్గవ, డాక్టర్ ఎరువ శ్రీనివాసులు ఒక ప్రకటనలో తెలియజేశారు. ‘‘విక్టోజా బ్రాండ్‌తో నోవో నార్డిస్క్‌కు పేటెంట్ ఉంది. ఈ పేటెంట్ గడువు ముగిసింది కనక లీరాగ్లుటైడ్ను మార్కెట్లోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నాం. దీనికి సంబంధించి మాకు ప్రొవిజినల్ ప్రాసెస్ పేటెంట్ దక్కింది’’ అని వారు చెప్పారు. హైదరాబాద్ కేంద్రంగా తమ సంస్థను 2015లో సజ్జల రామకృష్ణారెడ్డి ప్రారంభించారని తెలిపారు. తమ సంస్థ ఇప్పటికే ఇనాక్సాపారిన్ సోడియం, లాస్పరాగైనేజ్ తదితర మందులతో గత మార్చి చివరికి రూ.15 కోట్ల టర్నోవర్ సాధించిందని, వచ్చే మార్చికి రూ.30 కోట్ల రెవెన్యూ దిశగా ముందుకెళుతున్నామని చెప్పారు. డిసెంబరు 31లోగా లీరాగ్లుటైడ్ జనరిక్ వెర్షన్‌ను మార్కెట్లోకి తెస్తామన్నారు. -
శ్రీనివాసులు దొరికాడు
సాక్షి, హైదరాబాద్ : వ్యవస్థీకృతంగా వ్యభిచార దందా నిర్వహిస్తూ, పీడీ యాక్ట్ ప్రయోగం తర్వాత అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన శ్రీనివాసులును ఈస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. బైరామల్‌గూడకు చెందిన శ్రీనివాసులు అనేకమంది మహిళలు, యువతుల్ని వ్యభిచార దందాలోకి దింపాడు. ఈ రకంగా సంపాదించిన సొమ్ముతోనే బైరామల్‌గూడలో 200 గజాల స్థలంలో మూడు పోర్షన్స్తో కూడిన ఇల్లు సైతం కట్టినట్లు పోలీసులు పేర్కొంటున్నారు. ఏళ్ళుగా వ్యభిచార దందా నిర్వహిస్తున్న ఇతగాడిపై మలక్‌పేట, బంజారాహిల్స్, సైదాబాద్, మీర్‌పేట, సరూర్‌నగర్, వనస్థలిపురం ఠాణాల్లో పదికి పైగా కేసులు నమోదయ్యాయి. శ్రీనివాసులు నేరచరిత్రను పరిగణలోకి తీసుకున్న నగర పోలీసు కమిషనర్ అంజినీ కుమార్ ఐదు నెలల క్రితం పీడీ యాక్ట్ ప్రయోగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. నోటీసులు తీసుకోకుండా తప్పించుకుని తిరుగుతున్న ఇతగాడి కోసం ఈస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసుల ముమ్మరంగా గాలించారు. ఈ నేపథ్యంలో కేపీహెచ్‌బీ ప్రాంతంలో తల దాచుకున్నట్లు సమాచారం అందడంతో అదుపులోకి తీసుకుని సైదాబాద్ పోలీసులకు అప్పగించారు. వీరు అతడిపై పీడీ యాక్ట్ ప్రయోగిస్తూ చంచల్‌గూడ జైలుకు తరలించారు. -
సీపీఎస్ రద్దుకు ఉద్యమిద్దాం
కర్నూలు(అగ్రికల్చర్): కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం (సీపీఎస్) రద్దుకు ప్రభుత్వాలపై ఉద్యమిద్దామని ఏపీ జేఏసీ అమరావతి జిల్లా శాఖ అధ్యక్ష, కార్యదర్శులు శ్రీనివాసులు, నాగరమణయ్య ఉద్యోగులకు పిలుపు నిచ్చారు. సీపీఎస్ రద్దు డిమాండ్‌తో ఈ నెల 14న నగరంలో భారీ ర్యాలీ నిర్వహిస్తున్నామని..ఇందులో అన్ని శాఖల ఉద్యోగులు పాల్గొనాలని కోరారు. మంగళవారం కలెక్టరేట్లోని పొదుపు భవన్లో ఏపీసీపీఎస్ఈఏ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో సీపీఎస్‌పై దండయాత్ర వాల్‌పోస్టర్‌ను జిల్లా నాయకులు విడుదల చేశారు. ఏపీసీపీఎస్ఈఏ రాష్ట్ర సహ అధ్యక్షుడు రామనరసింహ మాట్లాడుతూ... సీపీఎస్ రద్దుకు ప్రభుత్వంపై అన్ని వైపుల నుంచి ఒత్తిడి పెంచాలన్నారు. ఇప్పటి వరకు వివిధ రూపాల్లో ఆందోళనలు చేస్తున్నా ప్రభుత్వంలో చలనం లేదని, ప్రభుత్వ ఉద్యోగులు మేల్కొని పోరాటం ఉద్ధృతం చేయలన్నారు. కార్యక్రమంలో ఏపీసీపీఎస్ఈఏ జిల్లా నేతలు శ్రీనివాసరెడ్డి, మద్దయ్య, వెంకటరమణ, ఏపీ జేఏసీ అమరావతి జిల్లా నేతలు గంగా, నాగేశ్వరి, నాగమణి, సీపీఎస్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రాంభూపాల్, శివారెడ్డి, రాజశేఖర్ పాల్గొన్నారు. -
ప్రత్యేక హోదా ఐదు కోట్ల ప్రజల ఆకాంక్ష
-
ఒక్కసారి నా భర్తను చూపండి సార్ !
ధర్మవరం అర్బన్ : ‘నా భర్తను ఒక్క సారి చూపించండి సార్. నా భర్తను మూడురోజుల క్రితం పోలీసులు తీసుకెళ్లారు. ఇంత వరకు ఎక్కడున్నాడో తెలియలేదు. నా భర్తకు గుండెజబ్బు ఉంది. రోజూ 5 మాత్రలు మింగాలి. నాకు ఐదుగురు పిల్లలు. తండ్రిని చూడాలని పిల్లలు ఏడుస్తూనే ఉన్నారు. ధర్మవరం, కొత్తచెరువు, బుక్కపట్నం, పుట్టపర్తి ఇలా అన్ని పోలీస్స్టేషన్లకు తిరుగుతున్నా నా భర్త ఏ స్టేషన్లో ఉన్నాడో పోలీసులు చెప్పలేదంటూ పట్టణంలోని బోయవీధికి చెందిన వైఎస్సార్సీపీ నాయకుడు వడ్డె శ్రీనివాసులు భార్య వేదవతి కన్నీటి పర్యంతమైంది. తీవ్ర మనస్థాపంతో అనారోగ్యానికి గురైన వేదవతి శనివారం రాత్రి ధర్మవరం ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఈ సందర్భంగా ఆమె విలేకరులతో తన గోడును వెళ్లబోసుకుంది. తన భర్త , వైఎస్సార్సీపీ నాయకుడు వడ్డె శ్రీనివాసులును మూడురోజుల క్రితం పోలీసులు తీసుకెళ్లారు. బాంబుదాడి కేసులో ప్రధాన నిందితుడైన ఉపేంద్రను ఎవరో వెంబడించారని పోలీసులు తన భర్తను తీసుకెళ్లారు. తన భర్తతో ఒక్కసారి మాట్లాడించాలని పోలీసుల కాళ్లు పట్టుకుంటే చివరికి శనివారం సాయంత్రం ఫోన్లో మాట్లాడించారని చెప్పింది. ఫోన్లో తన భర్త చాలా బాధగా మాట్లాడారని ఆవేదన వ్యక్తం చేసింది. పోలీసులు తన భర్తను చిత్రహింసలు పెడుతున్నారని, ఏ స్టేషన్లో పెట్టారో చెప్పకుండా పోలీసులు నరకయాతన పెడుతున్నారని వాపోయింది. తన భర్తకు ఏమైనా జరిగితే పిలలతో పాటు తాను కూడా అనాథలమవుతామని పేర్కొన్నారు. -
ప్రతీకారంతోనే శ్రీనివాసులుపై హత్యాయత్నం
కర్నూలు : కల్లూరుకు చెందిన దూపం జగదీష్ హత్యకు ప్రతీకారంగానే బుడగజంగాల శ్రీనివాసులు అలియాస్ ఎవోన్ శ్రీనుపై హత్యాయత్నం జరిగినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఈమేరకు గురువారం నిందితులు ప్యాపిలి మండలం మాన్‌దొడ్డి గ్రామానికి చెందిన దూపం రామకృష్ణ, దూపం రాముడు, దూపం జనార్ధన్, దూపం వేణుగోపాల్‌ను గుత్తి పెట్రోల్ బంకు వద్ద పోలీసులు అరెస్ట్ చేశారు. ఈసందర్భంగా నేరానికి ఉపయోగించిన ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. సాయంత్రం తన కార్యాలయంలో కర్నూలు డీఎస్పీ ఖాదర్ బాషా నాలుగో పట్టణ సీఐ నాగరాజరావుతో కలసి వివరాలు వెల్లడించారు. శ్రీనివాసులు వెంకటరమణ కాలనీలోని ఈసీ ఎన్‌క్లేవ్‌లో నివాసముండేవాడు. ఇతడికి భార్య గిరిజ, ఇద్దరు కుమారులున్నారు. గతంలో ఎవోన్ పేరుతో మినరల్ వాటర్ వ్యాపారం చేసేవాడు. కల్లూరుకు చెందిన దూపం రాముడు కుమారుడు జగదీష్ 2007లో హత్యకు గురయ్యాడు. ఇందులో శ్రీనివాసులు నిందితుడు. అయితే కోర్టులో హత్య కేసు వీగిపోయింది. దీంతో జగదీష్ బంధువులు శ్రీనివాసులుపై పగ పెంచుకున్నారు. ఈ క్రమంలో గత నెల 26న కల్లూరులోని రామాలయం వద్ద ప్రేమపెళ్లి విషయమై పంచాయితీ చేస్తుండగా నిందితులు ముఖానికి ముసుగులు ధరించి శ్రీనివాసులుపై మూకుమ్మడిగా దాడిచేసి పారిపోయారు. తీవ్రంగా గాయపడిన శ్రీనివాసులును ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం ఆయనను హైదరాబాద్‌కు తరలించారు. బాధితుడి తమ్ముడు శ్రీరాములు ఫిర్యాదు మేరకు నాలుగో పట్టణ పోలీసులు నిందితులను అరెస్టు చేసినట్లు డీఎస్పీ వెల్లడించారు. -
కరెంట్ స్తంభాన్ని బైక్ ఢీకొని పెయింటర్..
తాడిపత్రి రూరల్ : తాడిపత్రి పట్టణంలోని పుట్లూరు రోడ్డులో ఆదివారం ద్విచక్రవాహనం కరెంటు స్తంభాన్ని ఢీకొంది. ఈ ప్రమాదంలో పట్టణంలోని అంబేద్కర్‌నగర్‌కు చెందిన పెయింటర్ శ్రీనివాసులు(35) మృతి చెందగా అనంతపురానికి చెందిన మురళి(25) తీవ్రంగా గాయపడ్డాడు. రూరల్ పోలీసులు సంఘటన స్థలం చేరుకుని, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. గాయపడిన మురళిని అనంతపురం ఆస్పత్రికి పంపించారు. మృతుని తండ్రి నాగన్న ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. మృతునికి భార్య ఉంది. పిల్లలు లేరు. -
గిరిజనుడిపై పోలీసుల దాష్టీకం
- తన కళ్లెదుటే బూట్ కాళ్లతో తొక్కిపెట్టి.. - కొట్టారని బాధితుడి భార్య ఆరోపణ గూడూరు: కట్టుకథ చెప్పి ఇంటి నుంచి తీసుకొచ్చి ఓ గిరిజనుడిని పోలీసులు చితకబాది మంచానపడేలా చేసిన సంఘటన గూడూరు రూరల్ పరిధిలోని నెల్లటూరు గిరిజనకాలనీలో చోటుచేసుకుంది. బాధితుల వివరాల మేరకు గూడూరు రూరల్ మండలం నెల్లటూరు గిరిజనకాలనీకి చెందిన నిడిగంటి శ్రీనివాసులు, అతని భార్య శ్యామలలను సోమవారం రాత్రి గూడూరు రూరల్ పోలీసులు ఓ కట్టుకథ చెప్పి రూరల్ పోలీస్‌స్టేషన్‌కు తీసుకొచ్చారు. ఇంతకీ పోలీసులు చెప్పిన కట్టు కథేంటంటే శ్రీనివాసులు భార్య శ్యామల చిన్నాన నాగార్జున ఎవరిదో ఉంగరం దొంగిలించాడని, దాన్ని తీసుకొచ్చి వారి చేతికిచ్చాడంటూ క«థ అల్లారు. ఆ కథ చెప్పి గిరిజన దంపతులను రాత్రి 9 గంటల ప్రాంతంలో రూరల్ పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చారు. తీరా స్టేషన్‌కు తీసుకొచ్చాక శ్రీనివాసులు భార్య శ్యామలది చిల్లకూరు కావడంతో ఆమె తండ్రి అయిన గడ్డం లక్ష్మయ్య ఏదో కేసులో నిందితుడని, అతనెక్కడున్నాడంటూ శ్యామలను గదమాయించారు. శ్రీనివాసులును కింద పడుకోబెట్టి కానిస్టేబుళ్లు బూటు కాళ్లతో తొక్కిపెట్టగా ఎస్సై అతి దారుణంగా తన కళ్లెదుటే లాఠీతో కాళ్లు పగిలేలా చితకబాదారని శ్యామల కంటతడిపెట్టింది. తన తండ్రి కేసులో ఉంటే పోలీసులు చిల్లకూరుకు వెళ్లి వాళ్లను విచారించాలే గానీ, ఎలాంటి సంబంధం లేని తన భర్తను కిరాతకంగా కొట్టి హింసించడం ఏంటని ఆవేదన వ్యక్తం చేస్తోంది. ఆ దెబ్బలకు తన భర్త కనీసం నడిచే స్థితిలో కూడా లేడని ఆమె రోధించింది. తన భర్త కూలిపనులకెళ్తేనే తాము బతకాలని, ఏ పాపం తెలీని తన భర్తను అన్యాయంగా చితకబాదారని కన్నీరుమున్నీరయింది. ఈ విషయం తమ గ్రామపెద్ద భాస్కర్‌రెడ్డికి చెప్పానని, ఆయన చెప్పినా కూడా వినకుండా మీ మామ ఎక్కుడున్నాడురా.. నీకు తెలుసంటూ మళ్లీ కొడుతూనే ఉన్నారని శ్యామల ఆవేదన వ్యక్తం చేసింది. తమను అర్ధరాత్రి 2 గంటలకు ఇంటికి పంపారని వాపోయింది. ఈ విషయంపై రూరల్ ఎస్సై బాబీని వివరణ కోరగా ఓ కేసులో నిందితుడైన శ్రీనివాసులు మామ ఆచూకీ కోసం అతన్ని తీసుకొచ్చామని, అతన్ని చూపించడంతో తిరిగి పంపేశామని తెలిపారు. -
ఎస్ఎస్ఏ ఎఫ్‌ఏఓగా శ్రీనివాసులు
అనంతపురం ఎడ్యుకేషన్ : ఎట్టకేలకు సర్వశిక్ష అభియాన్ కార్యాలయంలో ఎఫ్ఏఓ పోస్టును భర్తీ చేశారు. కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు ఫిబ్రవరి నుంచి జీతాలు రావడం లేదని, రూ.6.06కోట్ల బడ్జెట్ మంజూరైనా ఎఫ్ఏసీ పోస్టు ఖాళీగా ఉండటంతో వాటిని డ్రా చేయలేని పరిస్థితి నెలకొందంటూ ‘సాక్షి’లో శుక్రవారం ‘నిధులున్నా..నిష్ప్రయోజనం’ శీర్షికతో కథనం వెలువడిన సంగతి తెలిసిందే. ఇందుకు అధికారులు స్పందించి ఎస్ఎస్ఏ ఎస్పీడీ అధికారుల దృష్టికి సమస్య తీసుకెళ్లారు. ఎస్పీడీ శ్రీనివాస్ స్పందించి ఎఫ్ఏఓ బాధ్యతలను ప్రస్తుతం సూపరింటెండెంట్‌గా పని చేస్తున్న శ్రీనివాసులుకు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. సాయంత్రం పీఓ సుబ్రమణ్యం నియామక ఉత్తర్వులను శ్రీనివాసులకు అందజేశారు. ఆయన బాధ్యతలూ తీçసుకున్నారు. వెంటనే జీతాలకు సంబంధించిన ఫైలును క్లియర్ చేశారు. అందరీ ఉద్యోగులకు రెన్నెళ్ల జీతాలు జమ చేస్తున్నట్లు ఎఫ్ఏఓ తెలిపారు. అలాగే రెగ్యులర్ ఉద్యోగులకు పెండింగ్ ఉన్న జూన్ జీతం వారి ఖాతాల్లో జమ చేసినట్లు తెలిపారు. -
బైక్ అదుపు తప్పి ఒకరి దుర్మరణం
బుక్కరాయసముద్రం (శింగనమల) : బుక్కరాయసముద్రంలో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో స్థానిక గాంధీనగర్‌కు చెందిన శ్రీనివాసులు(45) అనే వ్యక్తి మరణించినట్లు పోలీసులు తెలిపారు. బైక్‌లో అనంతపురానికి బయలుదేరగా కేవీకే ఫ్యాక్టరీ సమీపానికి రాగానే అదుపు తప్పికింద పడటంతో తలకు బయలమైన గాయాలయ్యాయన్నారు. వెంటనే 108లో అనంతపురం పెద్దాస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందినట్లు వివరించారు. మృతునికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. -
వడదెబ్బకు మరో ఇద్దరి బలి
గుత్తి : జిల్లాలో వడదెబ్బ మృతుల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. శనివారం కూడా మరో ఇద్దరు వడదెబ్బకు గురై ప్రాణాలు కోల్పోయారు. గుత్తి ఎస్సీ కాలనీకి చెందిన మాతాంగి రామకృష్ణ(28) పనుల మీద ఎండలో గుత్తి, గుత్తి ఆర్ఎస్లో కలియతిరిగాడు. దీంతో వడదెబ్బకు గురై, సొమ్మసిల్లి కింద పడిపోయారని కుటుంబ సభ్యులు తెలిపారు. వెంటనే స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందారని విలపించారు. మృతునికి భార్య, కుమార్తె ఉన్నారు. తురకపల్లికి చెందిన పెయింటర్ శ్రీనివాసులు(45) సైతం వడదెబ్బకు గురై శనివారం మృతి చెందారని కుటుంబ సభ్యులు తెలిపారు. పని ముగించుకుని ఇంటికెళ్తుండగా.. గుత్తి ఆర్టీసీ బస్టాండ్ వద్ద కుప్పకూలిపోయారన్నారు. ఆస్పత్రికి తరలిస్తుండగానే మరణించినట్లు స్థానికులు వివరించారు. మృతునికి భార్య, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. -
ఆడ బిడ్డలు పుట్టారని..
∙రెండో పెళ్లి చేసుకున్న భర్త ∙నిలదీసిన భార్యపై దాడి మదనపల్లె క్రైం : ఇద్దరూ ఆడపిల్లలు పుట్టారని, మగ బిడ్డ కావాలని భర్త రెండో పెళ్లి చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న మొదటి భార్య నిలదీయడంతో రాళ్లతో దాడి చేశాడు. ఈ సంఘటన ఆలస్యంగా ఆదివారం వెలుగులోకి వచ్చింది. బాధితురాలి కథనం మేరకు... పీటీఎం మండలం చలిమామిడికి చెందిన నరసింహులు, ఉత్తమ్మ దంపతుల కుమార్తె లక్ష్మీనరసమ్మను 15 ఏళ్ల క్రితం అనంతపురం జిల్లా కదిరి పట్టణం బాలప్పగారి క్వార్టర్స్‌లో ఉంటు న్న సత్తెన్న, ఆదిలక్ష్మి దంపతుల కుమారుడు ఎస్.శ్రీనివాసులుకు ఇచ్చి వివాహం చేశారు. వీరికి ఇద్దరు కుమార్తెలు పుట్టారు. మగ బిడ్డ లేకపోవడంతో శ్రీనివాసులు రెండో పెళ్లి చేసుకోవాలని ఏడాదిగా భార్యను వేధిస్తున్నాడు. ఆమె బిడ్డల కోసం వేధింపులను భరిస్తూ వచ్చింది. నెలరోజుల క్రితం శ్రీనివా సులు అదే జిల్లా గాండ్లపెంట మండలం ఎర్రజేనుకు చెందిన లక్ష్మి అనే యువతిని రహస్యంగా రెండో పెళ్లి చేసుకున్నాడు. అప్పటి నుంచి భార్యాభర్తల మధ్య గొడవలు తారాస్థాయికి చేరాయి. నాలుగు రోజుల క్రితం భర్తను నిలదీయడంతో అతను ఆమెపై ఇటుక రాళ్లతో విచక్షణ రహితంగా దాడిచేసి హత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఇరుగుపొరుగు వారు గమనించి బాధితురాలిని పుట్టింటికి పం పించారు. తీవ్ర గాయాలతో అవస్థలు పడుతున్న బిడ్డను చూసి తల్లిదండ్రులు స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలిం చారు. అనంతరం వారు పీటీఎం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తులో ఉంది. -
మాటువేసి వేట కొడవళ్లతో దాడి
కంభం(ప్రకాశం): ప్రకాశం జిల్లా కంభం వాల్మీకి నగర్లో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. మాజీ కో ఆపరేటివ్ బ్యాంకు చైర్మన్, కాంట్రాక్టర్ కటకం శ్రీనివాసులును ఆయన ప్రత్యర్థులు వేట కొడవళ్లతో అతి కిరాతకంగా నరికి చంపారు. శుక్రవారం రాత్రి పూర్ణిమా రెస్టారెంట్లో స్నేహితులతో కలసి పార్టీ చేసుకొని ఆనందరావుతో కలిసి స్కూటీ మీద వెళ్తుండగా.. మార్గమధ్యలో మాటువేసిన కొందరు గుర్తుతెలియని దుండగులు కత్తులతో దాడి చేశారు. ఈ దాడిలో శ్రీనివాసులు అక్కడికక్కడే మృతిచెందగా.. ఆనందరావుకు తీవ్ర గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కేసు దర్యాప్తు చేస్తున్నారు. నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
ముద్దిరెడ్డిపల్లి వాసి అనుమానాస్పద మృతి
చిలమత్తూరు : కర్ణాటకలోని చిక్బళ్లాపురం సమీపంలోని నందికొండ దగ్గర అనంతపురం జిల్లా చిలమత్తూరు మండలం మరసలపల్లి పంచాయతీ ఎస్.ముద్దిరెడ్డిపల్లికి చెందిన శ్రీనివాసులు (35) అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన సంఘటన శుక్రవారం వెలుగులోకి వచ్చింది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు... ఎస్.ముద్దిరెడ్డిపల్లికి చెందిన వెంకట్రామప్ప, వెంకటలక్ష్మీ దంపతుల కుమారుడు శ్రీనివాసులుకు అదే గ్రామానికి చెందిన శంకరప్ప, లక్ష్మీదేవి దంపతుల కుమార్తె అశ్వినితో పదేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. పిల్లలను ఇంటివద్దే వదిలి గత శుక్రవారం శివరాత్రి పండుగ రోజు నందికొండకు పూజల నిమిత్తం శ్రీనివాసులు, అశ్విని వెళ్లారు. అయితే శనివారం అశ్విని మాత్రమే గ్రామానికి తిరిగి వచ్చింది. దీంతో శ్రీనివాసులు తల్లిదండ్రులు ఆమెను ప్రశ్నించగా.. బహిర్భూమి వెళ్తానని చెప్పి తిరిగి రాలేదని సమాధానం చెప్పింది. ఆరు రోజుల నుంచి బంధువులు, గ్రామస్తులు శ్రీనివాసులు కోసం గాలించారు. ఈ క్రమంలో నందికొండ పరిసర ప్రాంతంలో గుర్తు తెలియని మృతదేహాన్ని పర్యాటకులు గుర్తించి అక్కడి పోలీసులకు సమాచారం అందించారు. స్థానికులు, బంధువులు ఆ ప్రాంతంలోనే ఉండడంతో మృతదేహం శ్రీనివాసులుదేనని గుర్తించారు. నందిహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం శుక్రవారం ఆస్పత్రికి తరలించారు. శ్రీనివాసులు మృతికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. -
కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా శ్రీనివాసులు
అనంతపురం అర్బన్ : పట్టభద్రుల నియోజకవర్గం అనంతపురం, కర్నూలు, వైఎస్సార్ పశ్చిమ రాయలసీమ జిల్లాల ఎమ్మెల్సీ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ మసూలు శ్రీనివాసులును ఎంపిక చేసింది. ఈ సందర్భంగా గురువారం పార్టీ కార్యాలయంలో పీసీసీ అధికార ప్రతినిధి కేవీరమణ, ఎస్సీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు శంకర్‌తో కలిసి శ్రీనివాసులు విలేకరులతో మాట్లాడారు. పట్టభద్ర ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎన్నికల్లో పోటీ చేస్తున్నానన్నారు. కాంగ్రెస్‌పార్టీని బలోపేతం చేయడంతో పాటు, ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రజల్లోకి వెళ్లి రాష్ట్రంలో టీడీపీ, కేంద్రంలో బీజేపీ అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను వివరిస్తామన్నారు. కార్యక్రమంలో నాయకులు సత్యనారాయణ, కొండారెడ్డి, హరిరాయల్, తదితరులు పాల్గొన్నారు. -
వృత్తిపట్ల నిబద్ధతున్న వ్యక్తి.. జెస్సీ
ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ హైదరాబాద్: పనిలో నిబద్ధత, అంకిత భావం ఉన్న వ్యక్తి స్పోర్ట్స్ జర్నలిస్ట్ జె.శ్రీనివాసులు (జెస్సీ) అని ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ అన్నారు. ప్రెస్ అకాడమీ తరఫున లక్ష నగదు, ఐదేళ్ల పాటు నెలకు రూ.3 వేల పింఛన్ అతి త్వరలో కల్పిస్తామని, అంతే కాకుండా ప్రభుత్వ పరంగా కూడా ఆయన కుటుంబాన్ని ఆదుకుంటామని హామీ ఇచ్చా రు. ఆదివారం ప్రెస్‌క్లబ్ ఆఫ్ హైదరాబాద్ ఆధ్వర్యంలో ఇటీవల అకస్మాత్తుగా మృతి చెందిన సాక్షి స్పోర్ట్స్ జర్నలిస్టు జెస్సీకి ఆత్మీయ నివాళి కార్యక్రమం జరిగింది. జెస్సీ కుటుంబ సభ్యులు, స్నేహితులు, సీనియర్ పాత్రికేయులు పాల్గొని జెస్సీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అల్లం నారాయణ మాట్లాడుతూ.. జర్నలిజంలో జెస్సీ లాంటి వారు చాలా అరుదుగా ఉంటారని తాను అనుకున్నది కథనంలో చూపేవారని అన్నారు. జెస్సీ పేరుతో గేమ్ ఈవెంట్స్ నిర్వహించేందుకు కృషి చేద్దామన్నారు. స్పోర్ట్స్ అధారిటీ ఆఫ్ తెలంగాణ చైర్మన్ వెంకటేశ్వరరెడ్డి మాట్లాడుతూ.. ఆప్తుడిని కోల్పోయానని కన్నీటిపర్యంతమయ్యారు. ‘సాక్షి’ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ దిలీప్ రెడ్డి మాట్లాడుతూ.. జెస్సీ మ్యాన్ ఆఫ్ కమిట్మెంట్ అని కొనియాడారు. సాక్షి యాజమాన్యం, ఉద్యోగులు అందరూ ఆయన కుటుంబాన్ని ఆదుకోవడానికి చూస్తున్నామని అన్నారు. జెస్సీ స్నేహితుడు మైహోం ఇండస్ట్రీస్ సీనియర్ డిప్యూటీ జనరల్ మేనేజర్ ఆర్.వి.మహేశ్‌బాబు జెస్సీ కుటుంబానికి రూ.50 వేలు సాయం చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో ప్రెస్‌క్లబ్ అధ్యక్షుడు రాజమౌళి చారి, ప్రధాన కార్యదర్శి విజయ్‌కుమార్ రెడ్డి, జెస్సీ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. -
అయ్యప్ప మాలధారుడిపై దాడి
ధర్మవరం రూరల్ : గొట్లూరులో సోమవారం రాత్రి శ్రీనివాసులు అనే అయ్యప్ప మాలధారుడిపై అదే గ్రామానికి చెందిన జగన్మోహన్రెడ్డి మద్యం మత్తులో దాడి చేశాడు. మాలను కూడా తెంచేశాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ చేస్తున్నారు. -
ట్రాక్టర్ అపహరణ
బుక్కపట్నం : చింతలయ్యగారిపల్లి రైతు శ్రీనివాసులు తన ఇంటి వెనుక ఉంచిన ట్రాక్టర్‌ను శుక్రవారం రాత్రి పొద్దుపోయాక దుండగులు అపహరించారు. ట్రాలీని వదిలేసి ఇంజిన్‌ను తీసుకెళ్లారు. శనివారం వరకు ఎన్ని చోట్ల వెతికినా జాడ కనిపించక పోవడంతో బాధిత రైతు ఆదివారం పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. కేసు దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ యతీంద్ర విలేకరులకు తెలిపారు. -
నగరంలో భారీ చోరీ
అనంతపురం సెంట్రల్ : నగరంలోని ఆర్టీసీబస్టాండు సమీపంలో రాజహంస అపార్టుమెంట్ వెనుక భారీ చోరీ జరిగింది. తాళం వేసిన ఇంటికి కన్నం వేసి రూ. 16 తులాల బంగారు, రూ.1.50 లక్షల నగదు దోచుకెళ్ళారు. వివరాల్లోకి వెలితే... సహకారశాఖలో పనిచేస్తున్న శ్రీనివాసులు, భారతీ దంపతులు శ్రీనివాసనగర్‌లో నివాసముంటున్నారు. రెండురోజుల క్రితం మదనపల్లెలోని తన బంధువుల ఇంటికి వెళ్లారు. మంగళవారం సాయంత్రం ఊరి నుంచి తిరిగొచ్చారు. అప్పటికే ఇంటి తలుపులు పగలగొట్టి ఉండడంతో లోనికెళ్లి చూడగా బీరువా తలుపులు కూడాతెరిచి ఉన్నాయి. దొంగతనం జరిగిందని భావించిన బాధితులు వెంటనే త్రీటౌన్ పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు క్లూస్‌టీంను రప్పించి పరిశీలించారు. బీరువాలో దాచుకున్న 16 తులాల బంగారు నగలు, లక్షన్నర నగదును దోచుకెళ్లారని బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
తిరుపతి అర్బన్ తహశీల్దార్‌పై అట్రాసిటీ కేసు
తిరుపతి అర్బన్ తహశీల్దార్‌పై ఆదివారం ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. అలిపిరి ఎస్ఐ శ్రీనివాసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. తిరుపతి ఆటోనగర్‌లో నివాసం ఉంటున్న శ్రీరాములు ఈ సంవత్సరం మార్చి 18వ తేదీన అర్బన్ తహశీల్దార్ కార్యాలయం వద్ద ఎస్సీ, ఎస్టీలకు ఇళ్లు నిర్మించుకునేందుకు ప్రభుత్వ భూములను కేటాయించాలని ఆందోళన చేపట్టారు. ఈ సమయంలో అక్కడున్న అర్బన్ తహశీల్దార్ వెంకటేశ్వర్లు మరో 11మంది వీఆర్వోలు, ఆర్ఐలు చూస్తుండగా ఆందోళన చేస్తున్న తనను కులం పేరుతో దూషించారని శ్రీరాములు డీజీపీ జేవీ రాముడుకు ఫిర్యాదు చేశారు. డీజీపీ ఆదేశాల మేరకు అర్బన్ తహశీల్దార్‌పై ఆదివారం ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. అయితే ఈ సంఘటన జరిగింది ముత్యాలరెడ్డిపల్లె పోలీస్‌స్టేషన్ పరిధిలో కావడంతో ఈ కేసును ఎమ్మార్‌పల్లి స్టేషన్‌కు బదిలీ చేస్తామని ఎస్సై తెలిపారు. -
రోడ్డు ప్రమాదంలో వాకర్ మృతి
వేగంగా వెళ్తున్న టాటాఏస్ వాహనం వాకింగ్ చేస్తున్న వారి పైకి దూసుకెళ్లిన ఘటనలో ఓ వ్యక్తి మృతిచెందగా.. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన చిత్తూరు జిల్లా మదనపల్లి బసినకొండ బైపాస్ వద్ద బుధవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. స్థానికంగా నివాసముంటున్న శ్రీనివాసులు(40) సిగ్మాల్ కంపెనీలో రిప్రెజెంటేటివ్‌గా పని చేస్తున్నాడు. బుధవారం ఉదయం భార్య గైరమ్మ(35) బంధువుల అబ్బాయి ఉదయ్(12)తో కలిసి బైపాస్‌రోడ్డు పై వాకింగ్‌కు వెళ్లారు. వేగంగా వస్తున్న టాటాఏస్ వాహనం వాకింగ్ చేస్తున్న వారిని ఢీకొట్టింది. దీంతో శ్రీనివాసులు అక్కడికక్కడే మృతిచెందగా.. మిగతా ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఇది గుర్తించిన స్థానికులు క్షతగాత్రులను తిరుపతి రూయా ఆస్పత్రికి తరలించి పోలీసులకు సమాచారం అందించారు. -
పోలీసుల కళ్లుగప్పి..ఖైదీ పరారు
సోదరుని అంత్యక్రియల్లో హాజరయ్యేందుకు వచ్చిన ఓ ఖైదీ పోలీసుల కళ్లుగప్పి పరారయ్యాడు. ప్రకాశం జిల్లా మార్కాపురం అమ్మవారిపల్లెలో మంగళవారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన కురుకుండి శ్రీనివాసులు హత్యకేసులో నెల్లూరు జైలులో జీవిత ఖై దు అనుభవిస్తున్నాడు. అయితే, అతని సోదరుడు చిన్నవెంకటేశ్వర్లు సోమవారం చనిపోయాడు. మంగళవారం జరిగే అంత్యక్రియల్లో పాల్గొనేందుకు పెరోల్‌పై అతడిని పోలీసులు అమ్మవారిపల్లెకు తీసుకువచ్చారు. ఈ క్రమంలోనే పోలీసులు ఏమరుపాటులో ఉండటాన్ని అవకాశంగా తీసుకున్న శ్రీనివాసులు పరారయ్యాడు. అతని కోసం పోలీసులు బృందాలుగా విడిపోయి గాలింపు చేపట్టారు. -
పోలీస్ ఎస్కార్ట్ నుంచి రిమాండ్ ఖైదీ పరార్
రాజమండ్రి : పోలీసు ఎస్కార్ట్ నుంచి శ్రీనివాసులు అనే రిమాండ్ ఖైదీ తప్పించుకుని పరారయ్యాడు. ఈ సంఘటన రాజమండ్రిలో షెల్టన్ హోటల్ సమీపంలో మంగళవారం అర్థరాత్రి చోటుచేసుకుంది. ఓ కేసు విషయమై శ్రీనివాసులును రాజమండ్రి నుంచి కడప జిల్లా కోర్టుకు తరలించారు. కోర్టులో హజరుపరిచి తిరిగి రాజమండ్రి తీసుకువస్తుండగా ఈ సంఘటన చోటు చేసుకుంది. మూత్ర విసర్జనకు వెళ్లి వస్తానని చెప్పిన శ్రీనివాసులు... పోలీసులు ఏమరుపాటుగా ఉన్న సమయంలో పలాయనం చిత్తగించాడు. తప్పించుకున్న ఖైదీ శ్రీనివాసులు కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. -
కల్తీ మద్యానికి ఎక్సైజ్ హెడ్‌కానిస్టేబుల్ బలి
సూళ్లూరుపేట : కల్తీ మద్యాన్ని అరికట్టేందుకు ఎక్సైజ్ అధికారులు ఎప్పటికప్పుడు దాడులు చేస్తూ ప్రజలను అప్రమత్తం చేస్తుండే విషయం మనకు తెలిసిందే. తాజాగా అదే కల్తీ మద్యానికి ఓ ఎక్సైజ్ హెడ్‌కానిస్టేబుల్ సహా ఇద్దరు మృతిచెందిన ఘటన నెల్లూరు జిల్లాలో మంగళవారం చోటుచేసుకుంది. సూళ్లూరుపేటలో ఎక్సైజ్ హెడ్‌కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న పంతంగి శ్రీనివాసులుతో పాటు మరో ఇద్దరు వ్యక్తులు సుధాకర్, రామ్మూర్తిలు రోజులాగే మంగళవారం సాయంత్రం మద్యం తాగారు. మత్తు ఎక్కువగా వచ్చేందుకు మద్యంలో రసాయనాలు కలుపుకుని తాగడం వారికి అలవాటు. మంగళవారం సాయంత్రం మద్యం సేవిస్తూ ఆ రసాయనాన్ని ఎక్కువగా కలుపుకుని తాగడంతో ఎక్సైజ్ హెడ్‌కానిస్టేబుల్ శ్రీనివాసులు అక్కడిక్కడే మృతిచెందాడు. అపస్మారక స్థితిలోకి వెళ్లిన సుధాకర్‌ను చెన్నై తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతిచెందాడు. మరో వ్యక్తి రామ్మూర్తి స్థానిక ఆస్పత్రిలో చికిత్సపొందుతున్నాడు. ఈ ఘటనతో స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి. -
నాటుసారా కేంద్రాలపై ఎక్సైజ్ దాడులు
ఆదిలాబాద్ జిల్లా బెజ్జూరు మండలంలోని పలు గ్రామాల్లో శుక్రవారం ఉదయం ఎక్సైజ్ అధికారులు సారా తయారీ స్థావరాలపై దాడులు నిర్వహించారు. ఎక్సైజ్ ఎస్పీ శ్రీనివాసులు, డీఎస్పీలు కరంచంద్ ఆద్వర్యంలో చెంచికపల్లి, ఎరంపల్లి, పరుగుపల్లి, లోడుపల్లె, కొండపల్లి, మర్తిడి గ్రామాల్లో దాడులు జరిగాయి. ఈ దాడుల్లో 6,800 లీటర్ల బెల్లం ఊట, 1,800 లీటర్ల గుడుంబా నిల్వలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఎవరినీ అరెస్టు చేయలేదు. కాగా.. స్వాధీనం చేసుకున్న బెల్లం ఊట, గుడుంబా నిల్వలను ధ్వంసం చేశారు. -
ఎంత కష్టమొచ్చిందమ్మా..
కుంటలో దూకి తల్లి, కుతురు ఆత్మహత్య బట్టలు ఉతికేందుకని కుమార్తెను కుంటకు తీసుకెళ్లిన తల్లి ఆలస్యంగా వెళ్లి చావు ముప్పు తప్పించుకున్న మరో కుమార్తె ఉలవదిన్నెలో విషాదఛాయలు కుటుంబానికి ఆధారమైన వ్యక్తి రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి, మతి స్థిమితం కోల్పోవడంతో ఆమె కుదేలైంది. భర్త, పిల్లల పోషణ కోసం కూలీగా మారింది. రెక్కలు ముక్కలు చేసుకుంటున్నా బతుకు బండి లాగడం కష్టమవుతుండడంతో జీవితంపై విరక్తి చెందింది. కుమార్తె సహా కుంటలో దూకి ఆత్మహత్య చేసుకుంది. అదృష్టవశాత్తు మరో కుమార్తె తృటిలో తప్పించుకుంది. పుంగనూరు: మండలం ఉలవలదిన్నెకు చెందిన శ్రీనివాసులు (40) కూలి పనులతో తన కుటుంబాన్ని పోషించేవాడు. కొన్నేళ్ల క్రితం ఉపాధి కోసం బెంగళూరుకు వెళ్లి రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి మతిస్థిమితం కోల్పోయాడు. ఇది అతని కుటుంబంపై తీవ్ర ప్రభావం చూపింది. అప్పటివరకు ఇంటికే పరిమితమైన అతడి భార్య జయమ్మ (35)పై కుటుంబపోషణ భారం పడింది. రెక్కలు ముక్కలు చేసుకుంటూ భర్త, తన ఇద్దరు కుమార్తెలు నిఖిత(14), పల్లవిని పోషిస్తోంది. నిఖిత పుంగనూరు మున్సిపల్ హైస్కూల్లో 8వ తరగతి, పల్లవి 6వ తరగతి చదువుతోంది. మతిస్థిమితం లేని శ్రీనివాసులు ఇంటిపట్టున ఉండేవాడు కాదు. సాయంత్రమైతే అతను ఎక్కడ ఉన్నాడో పలువురినీ వాకబు చేసి ఇంటికి తీసుకువచ్చే పరిస్థితి నడుమ జయమ్మ అష్టకష్టాలతో కుటుంబాన్ని నెట్టుకొస్తోంది. ఈ నేపథ్యంలో, గత గురువారం తిరుమలకు కుమార్తెలతో వెళ్లి వెంకన్నను దర్శించుకుని తిరిగి తన పుట్టినిల్లైన శ్రీరామపురానికి వెళ్లింది. మంగళవారం తన మేనమామ రమణను వెంట పెట్టుకుని ఉలవలదిన్నెకు చేరుకుంది. కుమార్తెలను స్కూలుకు వెళ్లవద్దని, కుంట వద్దకు వెళ్లి బట్టలు ఉతుక్కుందామని చెప్పింది. ఆ తర్వాత నిఖితను వెంటబెట్టుకుని గ్రామసమీపంలోని కుంటకు జయమ్మ వెళ్లింది. కొంత ఆలస్యంగా ఇంటి నుంచి కుంట వద్ద చేరుకున్న పల్లవికి బట్టలు గట్టు మీదే ఉండటం, దూరంగా కుంటలో తల్లి మునిగిపోతుండటం చూసి గట్టిగా కేకలు వేయడంతో కూతవేటు దూరంలోని గ్రామం నుంచి గ్రామస్తులు పరుగున అక్కడికి చేరుకున్నారు. సమాచారమివ్వడంతో ఎస్ఐ హరిప్రసాద్ హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. జయమ్మ, నిఖిత కోసం స్వయంగా కుంటలో గాలించినా ఫలితం లభించలేదు. చివరకు అగ్నిమాపకశాఖాధికారి షఫి వుల్లాహుసేన్ ఆధ్వర్యంలో అందరూ గాలించారు. సాయంత్రం తల్లీకుమార్తెల మృతదేహాలను వెలికితీశారు. ఈ సంఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. తల్లి, అక్క బలవనర్మరణంతో పల్లవి అనాథగా మిగిలింది. పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను తరలించారు. తన భార్య, కుమార్తె ఆత్మహత్యకు పాల్పడ్డారని శ్రీనివాసులుకు తెలియకపోవడం, అతని కోసం మళ్లీ వెదుకులాటకు పూనుకోవాల్సి రావడం అసలైన విషాదం! -
భార్య మృతిని తట్టుకోలేక భర్త ఆత్మహత్య
చెన్నూరు: విషజ్వరంతో భార్య మృతిచెందడంతో మనస్థాపం చెందిన భర్త రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాద సంఘటన ఆదిలాబాద్ జిల్లా చెన్నూరులో బుధవారం మధ్యాహ్నం జరిగింది. వివరాలు... చెన్నూరు పుప్పాల హనుమాన్ వీధికి చెందిన స్రవంతి, శ్రీనివాసులుకు ఏడాది క్రితం వివాహం అయింది. విషజ్వరంతో స్రవంతి రెండు రోజుల క్రితం మృతి చెందింది. భార్య ఎడబాటుతో మనస్థాపం చెందిన శ్రీనివాసులు బుధవారం మధ్యాహ్నం మంచిర్యాల వెళ్లి అక్కడ రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. రెండు రోజుల వ్యవధిలో దంపతులుద్దరూ మృతిచెందడంతో స్థానికంగా విషాదం అలముకుంది. -
‘ఓటుకు కోట్లు’లో శ్రీనివాసులునాయుడికి నోటీసులు
-
‘ఓటుకు కోట్లు’లో శ్రీనివాసులునాయుడికి నోటీసులు
⇒ నేడు విచారణకు హాజరవ్వాలని ఏసీబీ ఆదేశం ⇒ త్వరలో ఇద్దరు ముఖ్యుల అరెస్టుకు రంగం సిద్ధం హైదరాబాద్: ‘ఓటుకు కోట్లు’ కేసులో చిత్తూరు టీడీపీ ఎమ్మెల్యే డీకే సత్యప్రభ కుమారుడు డీకే శ్రీనివాసులు నాయుడు(మాజీ ఎంపీ ఆదికేశవులు నాయుడు కుమారుడు)కి ఏసీబీ సోమవారం నోటీసులు జారీ చేసింది. శ్రీనివాసులు నాయుడు ప్రస్తుతం కర్ణాటకలో ఓ బేవరేజస్ కంపెనీకి ఎండీగా వ్యవహరిస్తున్నారు. ఆయనతోపాటు ఆయన కార్యాలయ ఇన్చార్జి విష్ణు చైతన్యకూ తాఖీదులు ఇచ్చింది. బెంగళూరు వెళ్లిన ఏసీబీ ప్రత్యేక బృందం సీఆర్పీసీ సెక్షన్ 160 కింద ఈ నోటీసులు అందజేసింది. మంగళవారం ఉదయం 10.30 గంట లకు హైదరాబాద్‌లో ఉన్న ఏసీబీ ప్రధాన కార్యాలయంలో విచారణకు హాజరు కావాల్సిందిగా ఆదేశించింది. ఈయనకు బేవరేజస్‌తో పాటు పలు వ్యాపారాలు ఉన్నట్లు సమాచారం. ఏసీబీ నుంచి నోటీసులు అందుకున్న వారిలో జిమ్మీబాబు, నారా లోకేశ్ డ్రైవర్ కొండల్‌రెడ్డి అజ్ఞాతంలోకి వెళ్లిన విషయం విదితమే. త్వరలో మరిన్ని సంచలనాలు! ‘ఓటుకు కోట్లు’ కేసులో త్వరలో టీడీపీకి చెందిన ఇద్దరు ముఖ్య నేతలను అరెస్టు చేయవచ్చని ఏసీబీ వర్గాలు తెలిపాయి. తమ వద్ద ఉన్న ఆధారాల మేరకు వారిద్దరినీ త్వరలోనే అరెస్టు చేసి విచారించే అవకాశం ఉంది. వీరిని అరెస్టు చేసిన తర్వాత టీడీపీ, టీఆర్ఎస్, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కొందరికి విచారణ కోసం నోటీసులు జారీ చేయంది. ఎవరి ఖాతా నుంచి ఎవరి ఖాతాకు డబ్బులు మళ్లించారు, ఈ నిధులను ఎమ్మెల్యేలకు ఎవరు ముట్టజెప్పారు వంటి వివరాలను ఏసీబీ బయటపెట్టబోతోంది. -
కానిస్టేబుల్ అత్యాచారయత్నం
కీసర: మహిళపై ఓ కానిస్టేబుల్ అత్యాచారానికి యత్నించాడు. రంగారెడ్డి జిల్లా కీసర మండలం దమ్మాయిగూడకు చెందిన మహిళ(35) ఈసీఐఎల్‌లోని ఓ ఆస్పత్రిలో వర్కర్. గురువారంరాత్రి స్వగ్రామానికి వెళ్లేందుకు ఈసీఐఎల్ బస్‌స్టాప్ వద్ద ఆటో ఎక్కింది. అప్పటికే ఆటోలో ఉన్న కానిస్టేబుల్ శ్రీనివాసులు ఆమెను నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి బలవంతంగా మద్యం తాగించి అత్యాచారానికి యత్నించగా ప్రతిఘటించింది. బాధితురాలి కేకలకు సమీపంలోని రైతులు వచ్చి కానిస్టేబుల్‌ను చితకబాదారు. శ్రీనివాసులును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
ఇంజనీరింగ్ విద్యార్థి ఆత్మహత్య
అనంతపురం: అనంతపురం పట్టణంలో ఇంజనీరింగ్‌లో కొన్ని సబ్జెక్టుల్లో ఫెయిల్ అయ్యాడని మనస్తాపం చెందిన విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన అనంతపురంలో శనివారం జరిగింది. వివరాలు.. పట్టణంలోని అనంతలక్ష్మి ఇంజనీరింగ్ కాలేజీలో శ్రీనివాసులు (22) ఈసీఈ తృతీయ సంవత్సరం చదువుతున్నాడు. కాగా, ఇంజనీరింగ్‌లో కొన్ని సబ్జెక్టుల్లో తప్పడంతో మనస్తాపం చెందాడు. ఈ క్రమంలోనే శనివారం తోటి విద్యార్థులందరు కాలేజీకి వెళ్లిన అనంతరం హాస్టల్ గదిలో నైలాన్ తాడుతో ఫ్యాన్‌కు ఉరి వేసుకున్నాడు. కాలేజీ నుంచి తిరిగి వచ్చిన విద్యార్థులు తలుపు తీయకపోవడంతో బద్దలు కొట్టి లోపలికి వెళ్లి చూడగా ఉరికి వెళాడుతున్నాడు. అనంతరం స్నేహితులు ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. విషయం తెలిసిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్ట్‌మార్టంకు తరలించారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
డీఈవో బదిలీ
కొత్త డీఈవోగా శ్రీనివాసులురెడ్డి గుంటూరు ఎడ్యుకేషన్: జిల్లా విద్యాశాఖాధికారి దొంతు ఆంజనేయులు శ్రీ పొట్టి శ్రీరాము లు నెల్లూరు జిల్లా కు బదిలీ అయ్యా రు. ఆయన స్థానం లో తూర్పుగోదావరి జిల్లా విద్యాశాఖాధికారి కేవీ శ్రీనివాసులు రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి శని వారం ఉత్తర్వులు విడుదల చేశారు. రాష్ట్రంలోని పలు జిల్లాల డీఈవోల బదిలీల్లో భాగంగా దొంతు ఆంజనేయులుకు స్థాన చలనం కలిగింది. నెల్లూరులోని ఇనిస్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ సైంటిఫిక్ ఎడ్యుకేషన్ (ఐఏఎస్ఈ) సంస్థ ప్రొఫెసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తూ 2012 ఏప్రిల్ 9న గుంటూరు డీఈవోగా వచ్చిన ఆంజనేయులు తిరిగి అదే జిల్లాకు డీఈవోగా వెళుతున్నారు. -
అధికార లాంఛనాలతో అంత్యక్రియలు
ప్రొద్దుటూరు క్రైం: గణేష్ నిమజ్జనం విధుల కోసం హైదరాబాద్‌కు వెళ్లిన ఏపీఎస్పీ కానిస్టేబుల్ శ్రీనివాసులు (31) గుండె పోటుతో మృతి చెందాడు. కానిస్టేబుల్ అంత్యక్రియలు గురువారం ఆర్టీపీపీ రోడ్డులోని శ్మశాన వాటికలో అధికార లాంఛనాలతో నిర్వహించారు. బద్వేల్‌కు చెందిన శ్రీనివాసులు 2007లో ప్రొద్దుటూరుకు చెందిన ప్రమీలతో వివాహమైంది. వారికి దీపక్ అనే ఏడేళ్ల కుమారుడు ఉన్నాడు. శ్రీనివాసులు 2006లో ఏపీఎస్పీ కానిస్టేబుల్‌గా ఎంపికయ్యాడు. ప్రస్తుతం అతను ఏపీఎస్పీ 14 బెటాలియన్ అనంతపురంలో పని చేస్తున్నాడు. బంధువులందరూ ప్రొద్దుటూరులోని శ్రీనివాసనగర్‌లో ఉండటంతో అక్కడే ఉన్నారు. శ్రీనివాసులు విధుల్లో భాగంగా వినాయ క నిమజ్జనం బందోబస్తు కోసం వారం రోజుల కిందట హైదరాబాద్‌కు వెళ్లాడు. లక్డీకాపూల్‌లోని డీజీపీ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్నాడు. యూసఫ్‌గూడాలో నివసించే తన స్నేహితుడు రంజిత్‌కుమార్ వద్దకు ఈ 9న రాత్రి వెళ్లాడు. అక్కడ రంజిత్కుమార్తో మాట్లాడుతుండగా ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. దీంతో అతని తలకు తీవ్ర గాయమైంది. గాయ పడిన శ్రీనివాసులును వెంటనే చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. గుండె పోటుతో మృ తి చెంది ఉంటాడని వైద్యులు చెప్పారు. పోస్టుమార్టం అనంతరం శ్రీనివాసులు మృతదేహాన్ని బుధవారం రాత్రి ప్రొద్దుటూరుకు తీసుకొచ్చారు. మృతదేహం చూడగానే భార్య ప్రమీల బోరున విలపించింది. గురువారం ఉదయం శ్రీనివాసనగర్ నుంచి ఊరేగింపుగా తీసుకొచ్చి ఆర్టీపీపీ రోడ్డులోని శ్మశానవాటికలో అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. అసిస్టెంట్ కమాండెంట్ కేవశరెడ్డి, రిజర్వు ఇన్స్పెక్టర్ రామచంద్రారెడ్డి, త్రీ టౌన్ ఎస్ఐ మహేష్. బెటాలియన్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. -
అవార్డులు ఆయన సొంతం
మహానంది: విధి నిర్వహణ ఆయన ప్రాణం. పేదలకు న్యాయం చేయాలి...వారికి అండగా నిలవాలన్న తపనే ఆయనకు గుర్తింపు తెచ్చింది. కష్టపడితే సాధించలేనిది ఏది ఉండదని నిరూపించాడు. పోలీస్ కావాలనే లక్ష్యంతో శ్రమించి అనుకున్నది సాధించాడు. విధి నిర్వహణలో అంకితభావంతో పనిచేస్తే అవార్డులు వాటంతట అవే వస్తాయని నమ్మిన వ్యక్తి సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసులు. ఎక్కడ పనిచేసిన అక్కడి ప్రజల అభిమానాన్ని చూరగొన్నాడు. ఇప్పటి వరకు ఆయన 366 రివార్డులు, ప్రశంసా పత్రాలు అందుకున్నాడు. అంతేకాకుండా భారత ప్రభుత్వం అందించే ప్రతిష్టాత్మకమైన ఇండియన్ పోలీస్ మెడల్ అవార్డుకు ఎంపికైనట్లు 2013 గణతంత్ర వేడుకల్లో ఆయన పేరు ప్రకటించారు. ఈ అవార్డును శుక్రవారం కర్నూలులో జరుగుతున్న స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా సీఐ అందుకోనున్నారు. శ్రీనివాసులు విజయ గాధపై సాక్షి కథనం... మహానంది మండలం ఎం.తిమ్మాపురం గ్రామానికి చెందిన బి.వెంకటసుబ్బయ్య అలియాస్ మోజెస్, మద్దమ్మ దంపతుల కుమారుడు బుక్కా శ్రీనివాసులు. చిన్నప్పటి నుంచి కష్టపడి చదివేవాడు. పోలీస్ డిపార్ట్మెంట్లో చేరాలన్న సంకల్పంతో శ్రమించాడు. గ్రామంలోని జెడ్పీ స్కూల్లో 10 వరకు చదివాడు. కర్నూలులోని కోల్స్ మెమోరియల్ కళాశాలలో ఇంటర్, సిల్వర్‌జూబ్లీలో డిగ్రీ, ఎస్కే యూనివర్సిటీలో ఎంఏ పూర్తి చేశాడు. జులై 15, 1991లో పోలీస్ సబ్ఇన్స్పెక్టర్గా విధుల్లో చేరారు. ఎస్ఐగా అనంతపురం జిల్లా పెనుగొండ, ఎల్కే పల్లి, రామగిరి, కూడేరు, తాడిపత్రి, ధర్మవరం, తదితర ప్రాంతాల్లో పనిచేసి అన్ని వర్గాల ప్రజలు, అధికారుల ప్రశంసలు అందుకున్నారు. తిరుమల ట్రాఫిక్, నక్సల్స్ ప్రభావిత, సమస్యాత్మక ప్రాంతాల్లో విధులు నిర్వహించాడు. అనంతరం 2005 ఫిబ్రవరిలో సర్కిల్ ఇన్స్పెక్టర్గా పదోన్నతి పొందిన శ్రీనివాసులు ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్లో హైదరాబాద్ సెంట్రల్ జోన్ ఇన్స్పెక్టర్గా, 2005 నుంచి 2008 వరకు కల్యాణదుర్గం సర్కిల్లో, 2009-10లో చిత్తూరు డీటీసీ, ఆ తర్వాత ధర్మవరం, హిందూపురం, ప్రాంతాల్లో నాలుగేళ్ల పాటు పనిచేశారు. 2014 జనవరిలో హిందూపురం టౌన్ నుంచి కడప అర్బన్ సర్కిల్ ఇన్స్పెక్టర్గా బదిలీ అయ్యారు. ప్రస్తుతం ఆయన అక్కడే విధులు నిర్వహిస్తున్నారు. శుక్రవారం సీఎం చేతుల మీదుగా ఇండియన్ పోలీస్ మెడల్ అందుకోనుండటంతో శ్రీనివాసులు కుటుంబ సభ్యులు, మిత్రులు సంతోషం వ్యక్తం చేశారు. -
‘టోల్’ తీసుడే..!
తూప్రాన్, న్యూస్‌లైన్: 44వ జాతీయ రహదారిపై ప్రయాణమంటే ఇక ‘టోల్’వలుచుడే.. ఇప్పటికే వాహనదారులు టోల్గేట్ భారం పెరిగిపోయిందని గగ్గోలు పెడుతున్నా, మరోమారు ధరలు పెంచడంతో బెంబేలెత్తిపోతున్నారు. ప్రతి ఏటా ఏప్రిల్ నెల మొదటి వారం నుంచి నూతన ధరలు అమల్లోకి వస్తున్నాయి. మండలంలోని అల్లాపూర్ శివారులో టోల్గేట్ ఏర్పాటు చేసిన విషయం విదితమే. అయితే ఇప్పటికే అధిక ధరలు వసూలు చేస్తుండటంతో పలుమార్లు టోల్గేట్ వద్ద ధర్నాలు, రాస్తారోకోలు, విధ్వంసానికి సైతం పాల్పడిన ఘటనలున్నాయి. టోల్ రుసుం చెల్లించలేక కొందరు వాహనదారులు అల్లాపూర్, ఇమాంపూర్ మీదుగా రాకపోకలు సాగిస్తున్నారు. ఐతే ఇటీవల ఆ దారులగుండా వెళ్లకుండా అడ్డుకుంటున్నారు. పాలాట, శివ్వంపేట మండలం పోతారం గ్రామం మీదుగా రాకపోకలు సాగిస్తున్నారు. నిత్యం టోల్గేట్ మీదుగా 8 నుంచి 10 వేల వరకు వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయి. రోజువారీ టోల్గేట్ ఆదాయం రూ.10 లక్షల నుంచి రూ.12 లక్షల వరకు ఉంటుంది. టోల్గేట్ ట్యాక్స్ అమలులో వచ్చిన కొత్త విధానాల ప్రకారం 5 నుంచి 10 శాతం రేట్లు పెంచినట్లు నేషనల్ హైవే ఆథారిటీ ఆఫ్ ఇండియా ప్రాజెక్ట్ డెరైక్టర్ శ్రీనివాసులు ‘న్యూస్‌లైన్’తో తెలిపారు. పెరిగిన ధరలు ఇలా ఉన్నాయి.. ప్రస్తుతం కారు, జీపు, వ్యాన్ టోల్గేట్ నుంచి వెళితే రూ. 110 వసూలు చేస్తుండగా తాజాగా దాన్ని రూ.120 పెంచారు. ఒకసారి వెళ్లి మళ్లీ రావడానికి రూ.170 చెల్లించాల్సి ఉండగా, రూ.180కి పెంచారు. లైట్ గూడ్స్ వెహికిల్ వెళ్లడానికి రూ. 180 నుంచి రూ.195కి పెంచారు. వెళ్లి, మళ్లీ తిరిగి రావడానికి రూ. 270 ఉండగా రూ. 290 చేశారు. ట్రక్కు, బస్సులాంటివి వెళ్లడానికి రూ.380 నుంచి రూ.405, వెళ్లి, తిరిగిరావడానికి రూ.570 నుంచి రూ.610కు పెంచారు. కమర్షియల్ వాహనాలకు రూ.445 నుంచి తిరిగి రావడానికి రూ.665కు పెంచారు. ఎర్త్ మూవింగ్ ఎక్విప్మెంట్ లాంటి వాహనాలకు రూ. 595 నుంచి రూ.640కి, వెళ్లి, మళ్లీ తిరిగి రావడానికి రూ.890 నుంచి రూ.955కి పెంచారు. భారీ వాహనాలు వెళ్లడానికి రూ.725 నుంచి రూ.775కి, మళ్లీ తిరిగి రావడానికి రూ.1,085 నుంచి 1,165కి పెంచారు. -
ఇంటలిజెంట్ ఇడియట్స్ మూవీ స్టిల్స్ & పోస్టర్స్
-
ఫ్యాక్టరీ వల్లే దుర్వాసన
కర్నూలు(సిటీ), న్యూస్‌లైన్: ఆల్కాలీస్ ఫ్యాక్టరీ నుండి వచ్చే వ్యర్థాల వల్లే తుంగభద్ర నదీ తీరం వె ంట ఉన్న కాలనీల్లో దుర్వాసన వస్తోందని మానవహక్కుల వేదిక అధ్యక్షుడు శ్రీనివాసులు అన్నారు. మూ డు వారాలుగా సమస్య తీవ్రం కావడంతో సోమవారం వేదిక నాయకులు జమ్మిచెట్టు, సుబ్రహ్మణ్యం మఠం, చిత్తారి వీధి, ఖండేరి ప్రాంతాల్లో పర్యటించారు. నదిలో గుంతలు పడ్డ పలుచోట్ల దుర్వాసనను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నగరంలో మూడు వారాలుగా దుర్వాసనతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. ప్రజాసంఘాలు ఆందోళన కార్యక్రమాలు, ధర్నాలు చే స్తున్నా ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమన్నారు. గుంతల్లో పాచీ పేరుకుపోయి దుర్వాసన వస్తోందని చెబుతున్నా దాంట్లో వాస్తవం లేదన్నారు. ఆల్కాలీస్ ఫ్యాక్టరీ నుంచి వెలువడే కె మికల్ వ్యర్థ పదార్థాల వల్లే ఈ సమస్య వచ్చిందన్నారు. తుంగభద్రలో నీటి ప్రవాహం లేక భరించలేని దుర్వాసన వస్తోందన్నారు. వేదిక ఆధ్వర్యంలో కాలుష్య నియంత్రణ మండలి, ఆల్కాలీస్ ఫ్యాక్టరీ యజమానులను కలసి సమస్యను వివరిస్తామన్నారు. అధికార యంత్రాంగం ఇప్పటికైనా స్పందించి ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాల న్నారు. కార్యక్రమంలో మానవ హక్కు ల వేదిక జిల్లా కన్వీనర్ జయశ్రీ, సోష ల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా అధ్యక్షులు అబ్దుల్ వారిస్, దేవేంద్రబాబు తదితరులు పాల్గొన్నారు. -
మధ్యప్రదేశ్ వాసి హత్య
ఓర్వకల్లు, న్యూస్‌లైన్: బతుకుదెరువుకోసం వచ్చిన మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఓ వ్యక్తి సోమవారం హత్యకు గురయ్యాడు. ఈ ఘటన ఓర్వకల్లు సమీపంలో చోటు చేసుకుంది. పోలీసుల వివరాల మేరకు.. 45 రోజుల క్రితం కర్నూలు జిల్లాకు వచ్చిన మధ్యప్రదేశ్‌లో ని డ్యాతోల్ జిల్లా, బాషపాణ గ్రామానికి చెందిన జితేంద్ర(45) నెల రోజులుగా ఉలిందకొండ వద్ద జరుగుతున్న విద్యుత్ టవర్ల నిర్మాణ పనుల్లో పాల్గొంటున్నాడు. ఈ క్రమంలో ఎల్ఎంటీ కంపెనీ ఆధ్వర్యంలో జరుగుతున్న విద్యుత్ టవర్ల వద్ద కాపలా ఉండేందుకు కాం ట్రాక్టర్ శ్రీనివాసులు జితేంద్రను ఓర్వకల్లు వద్దకు తీసుకొచ్చాడు. అతనితో పాటు మరో ఐదుగురు అక్కడే పని చేస్తున్నారు. ఈ క్రమం లో రెండు రోజుల క్రితం వారి మధ్య చిన్నపాటి ఘర్షణ జరిగినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో ఆదివారం రాత్రి జితేంద్ర హత్యకు గురి కావడం అనుమానాలకు తావిస్తోంది. తాలుకా రూరల్ సీఐ శ్రీనివాసమూర్తి, ఉలిందకొండ ఎస్ఐ నరేంద్ర కుమార్‌రెడ్డి, క్లూజ్ టీమ్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వరరావు ఘటనాస్థలానికి వెళ్లి పరిశీలించారు. అక్కడే పని చేస్తున్న నలుగురిపై అనుమానంతో అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ సాగిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించినట్లు స్థానిక పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేశామన్నారు. -
'విభజనపై చర్చ వెనుక పెద్ద కుట్ర ఉంది'
-
'విభజనపై చర్చ వెనుక పెద్ద కుట్ర ఉంది'
అసెంబ్లీలో రాష్ట్ర విభజన బిల్లుపై ముందుగా ఓటింగ్ జరపాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు శ్రీనివాసులు, కాపు రామచంద్రారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేకుంటే సమైక్య తీర్మానం చేసేంత వరకు సభా కార్యక్రమాలను అడ్డుకుంటామని వారు స్పష్టం చేశారు. గురువారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ... తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని విమర్శించే అర్హత టీడీపీ నేతలకు లేదని వారు పేర్కొన్నారు. తమ నాయకుడిని విమర్శించడమే పనిగా పెట్టుకుని సభ సమయాన్ని వృధా చేస్తున్నారని ఆరోపించారు. అలా కాకుండా టీడీపీ నేతలు ప్రజా సమస్యలపై దృష్టి పెడితే మంచిదని హితవు పలికారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో చేసిన అవినీతిపై కేసులు నుంచి తప్పించుకోవడానికి కాంగ్రెస్‌తో కుమ్మక్కైందని చంద్రబాబు కాదా అని శ్రీనివాసులు, కాపు రామచంద్రారెడ్డి ప్రశ్నించారు. విభజనపై అసెంబ్లీలో చర్చ వెనుక పెద్ద కుట్ర ఉందని వారు అనుమానిస్తున్నట్లు చెప్పారు. ఆ కుట్రలో కాంగ్రెస్, టీడీపీలకు భాగస్వామ్యం ఉందని శ్రీనివాసులు, కాపు రామచంద్రారెడ్డి ఆరోపించారు. -
ఉక్కు మనిషిని ఆదర్శంగా తీసుకోవాలి
కర్నూలు(స్పోర్ట్స్), న్యూస్‌లైన్: దేశ స్వాతంత్య్ర పోరాటంలో బ్రిటీష్ ప్రభుత్వాన్ని గడగడలాడించిన సర్దార్ వల్లభాయ్ పటేల్‌ను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని పటేల్ విగ్రహ కమిటీ జిల్లా చైర్మన్ కె.వి.సుబ్బారెడ్డి అన్నారు. పటేల్ విగ్రహ నిర్మాణ యజ్ఞం కోసం నగరంలో ఆదివారం 2కే రన్‌ను నిర్వహించారు. పాతబస్టాండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద నుంచి బయలుదేరిన రన్ కోట్ల విజయభాస్కర్‌రెడ్డి సర్కిల్, కిడ్స్ పార్కు మీదుగా, జిల్లాపరిషత్ నుంచి రాజ్‌విహార్ సెంటర్‌కు చేరుకుంది. రాజ్‌విహార్ సెంటర్లోని స్వామి వివేకానంద విగ్రహానికి నాయకులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అక్కడ నుంచి శ్రీకృష్ణ దేవరాయ సర్కిల్, కలెక్టరేట్ ఎదుట ఉన్న గాంధీ విగ్రహం వరకు రన్ కొనసాగింది. గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం కేవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ ప్రపంచంలోనే 182 మీటర్లు ఎత్తై పటేల్ విగ్రహ ప్రతిష్టకు గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోడి శ్రీకారం చుట్టడం ఎంతో గర్వకారణమన్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ దేశానికి ఎనలేని సేవలను చేశారన్నారు. కార్యక్రమంలో కమిటీ సభ్యులు శ్రీనివాసులు, ఐ.వి.శేఖర్‌రెడ్డి, కపిలేశ్వరయ్య, కాళింగి నరసింహ వర్మ, జి.ఎస్.నాగరాజు, కో-ఆర్డినేటర్ సాయిశేఖర్‌రెడ్డి, దాదాపు 500 మంది విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. -
రైల్వేకోడూరులో శ్రీనివాసులు ఆధ్వర్యంలో రహదారుల దిగ్బంధం
-
విగ్రహ వివాదం
ఎచ్చెర్ల క్యాంపస్/శ్రీకాకుళం టౌన్, న్యూస్‌లైన్: ఎచ్చెర్ల మండలంలోని కుశాలపురం పంచాయతీ పరిధి సింహద్వారం సమీపంలో జాతీయ రహదారి డివైడర్‌పై బుధవారం రాత్రి టీడీపీ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి దివంగత కింజరాపు ఎర్రన్నాయుడి భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం వివాదానికి దారితీసింది. ఎలాంటి అనుమతులు లేకుండా విగ్రహం ఏర్పాటుచేయడంపై ఎన్‌హెచ్-16 సిబ్బంది పోలీసులు, జిల్లా అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు విగ్రహం ఏర్పాటుచేసే స్థలాన్ని శ్రీకాకుళం ఆర్డీవో జి.గణేష్ కుమార్, డీఎస్పీ శ్రీనివాస్‌లు గురువారం పరిశీలించారు. నోటీసు జారీ చేసి తొలగించే చర్యలు చేపట్టాలని ఎచ్చెర్ల తహశీల్దార్ బి.వెంకటరావును ఆదేశించారు. అనుమతి లేనిదే విగ్రహం ప్రభుత్వ స్థలంలో ఏర్పాటు చేయకూడదని, జాతీయ రహదారి మధ్యన విగ్రహం ఏర్పాటు చేయడం వల్ల రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. విగ్రహం తొలగించి ఎన్టీఆర్ ఎంహెచ్‌స్కూల్ వద్ద గల ఎన్టీఆర్ విగ్రహం పక్కన ఏర్పాటు చేసుకోవాలని సూచించినట్టు సమాచారం. అయితే, టీడీపీ జిల్లా అధ్యక్షుడు చౌదిరి నారాయణమూర్తి, నాయకులు బొచ్చ కోటిరెడ్డి, చౌదిరి అవినాష్, బెండు మల్లేష్లు తహశీల్దార్‌తో వాగ్వాదానికి దిగారు. అందరి విగ్రహాలు ప్రభుత్వ స్థలంలోనే ఉన్నాయని, ఈ విగ్రహం ఉంటే తప్పేమిటని అధికారులను నిలదీశారు. విగ్రహం తొలగించే చర్యలు చేపడితే ఆందోళన తప్పదని హెచ్చరించారు. కనీసం అనుమతులు లేకుండా విగ్రహం ఏర్పాటు చేయడం సరికాదని అధికారులు సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. టీడీపీ నాయకులు మాత్రం విగ్రం వేరేచోటుకి మార్చేందుకు అంగీకరించలేదు. నవంబర్ 2న విగ్రహాన్ని ఆవిష్కరించి తీరుతామని బాబ్జి, పీవీ రమణ, ముద్దాడ కృష్ణమూర్తినాయుడు తదితరులు స్పష్టంచేశారు. ఈ నేపధ్యంలో అధికారులు నిబంధనలు పాటిస్తారా? టీడీపీ నాయకులు అనుకున్నది సాధిస్తారా? అన్న ప్రశ్నలు అందరిలోనూ మెదలుతున్నాయి. ఎచ్చెర్ల పోలీసులకు ఫిర్యాదు అక్రమంగా విగ్రహం ఏర్పాటుచేశారంటూ ఆర్డీవో, తహశీల్దార్ ఆదేశాల మేరకు కుశాపురం పంచాయతీ గ్రామ కార్యదర్శి మనోరమ ఎచ్చెర్ల పోలీసులకు గురువారం ఫిర్యాదు చేశారు. గ్రామ పంచాయతీ నుంచి ఎటువంటి అనుమతులు తీసుకోలేదని ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ ఉదయ్‌కుమార్ చెప్పారు. ప్రత్యామ్నాయం చూసుకోవాలి శ్రీకాకుళం కలెక్టరేట్: ఎర్రన్నాయుడు విగ్రహం ఏర్పాటుకు ప్రత్యామ్నాయ స్థలం చూసుకోవాలని ఏజేసీ ఆర్.ఎస్ రాజ్‌కుమార్ టీడీపీ నాయకులకు సూచించారు. విగ్రహావిష్కకరణ నిలుపుదలపై టీడీపీ నాయకులు, అధికారులతో కలిసి తన ఛాంబర్లో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ ఎవరికైనా నిబంధనల మేరకు అనుమతులు ఇస్తామని స్పష్టం చేశారు. -
ప్రారంభమైన శ్రీనివాసుడి అశ్వయుజ మాస బ్రహ్మొత్సవాలు
-
మున్నయ్య కుటుంబానికి ఆర్థిక సాయం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుతూ ఆత్మహత్యకు పాల్పడిన వైఎస్ఆర్ జిల్లా ప్రొద్దుటూరులోని ఆర్టీసీ కార్మికుడు మున్నయ్య కుటుంబాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఆకేపాటి అమర్నాథరెడ్డి, శ్రీకాంత్ రెడ్డి,శ్రీనివాసులు శనివారం పరామర్శించారు. అనంతరం ఆ కుటుంబానికి వెన్నంటే ఉంటామని వారు భరోసా ఇచ్చారు. వైఎస్ఆర్ పార్టీ నేత రచమళ్ల ప్రసాద్‌రెడ్డి ఈ సందర్భంగా రూ. 2 లక్షల ఆర్థిక సాయాన్ని మున్నయ్య కుటుంబానికి అందజేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనపై కేంద్రం ప్రభుత్వం అనుకూలంగా నిర్ణయం తీసుకోవడంతో ఆర్టీసీ కార్మికుడు మున్నయ్య తీవ్ర కలత చెందాడు. ఆ క్రమంలో తన సహుద్యోగుల వద్ద ఆవేదన వ్యక్తం చేసేవాడు. ఆంధ్రప్రదేశ్ విభజన ఇక తప్పదనే అభిప్రాయం సర్వత్ర వస్తున్న నేపథ్యంలో మున్నయ్య ఆత్మహత్యకు పాల్పడ్డాడు. -
'చంద్రబాబు ఎవరి ఆత్మకోసం యాత్ర చేస్తున్నారు?'
-
వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు అమరణ దీక్షలు
-
కొనసాగుతున్న రైల్వేకోడూరు ఎమ్మెల్యే అమరణ దీక్ష
-
కాంగ్రెస్,టీడీపీలపై శ్రీనివాసులు,అమర్నాధరెడ్డి ఫైర్