
బైక్ అదుపు తప్పి ఒకరి దుర్మరణం
బుక్కరాయసముద్రం (శింగనమల) : బుక్కరాయసముద్రంలో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో స్థానిక గాంధీనగర్‌కు చెందిన శ్రీనివాసులు(45) అనే వ్యక్తి మరణించినట్లు పోలీసులు తెలిపారు. బైక్‌లో అనంతపురానికి బయలుదేరగా కేవీకే ఫ్యాక్టరీ సమీపానికి రాగానే అదుపు తప్పికింద పడటంతో తలకు బయలమైన గాయాలయ్యాయన్నారు. వెంటనే 108లో అనంతపురం పెద్దాస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందినట్లు వివరించారు. మృతునికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.