one dies
-
రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం
కోటబొమ్మాళి: మండలంలోని చిన్నబమ్మిడి–వాండ్రాడ గ్రామాల మధ్య జాతీయ రహదారిపై శనివారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. ఇందులో సంతబొమ్మాళి మండలం వడ్డివాడ గ్రామానికి చెందిన యువకుడు కొర్ను హేమారావు (23) మృతిచెందాడు. డిఫెన్సు పరీక్షలకు శిక్షణ తీసుకుంటున్నాడు. మోటారు సైకిల్‌పై టెక్కలి నుంచి నరసన్నపేట వైపు వెళుతున్న సమయంలో వెనుక నుంచి వచ్చిన లారీ ఢీ కొనడంతో అక్కడకక్కడే మృతిచెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టానికి పంపించారు. కోటబొమ్మాళి ఎస్ఐ ఎన్. లక్ష్మణ్ కేసు సమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. హేమారావు తండ్రి చిన్నారావు, తల్లి కృష్ణవేణి, సోదరి లక్ష్మి ఉన్నారు. -
కారు బోల్తా.. ఒకరి మృతి
ఉరవకొండ రూరల్: నిద్రమత్తులో డ్రైవింగ్ చేయడంతో కారు అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో ఒకరు దుర్మరణం చెందగా.. మరో ఇద్దరు గాయపడ్డారు. పోలీసులు తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి. కర్ణాటకలోని కొప్పల్ జిల్లాకు చెందిన వసంతప్ప (45), శశిధర్, డ్రైవర్ అప్పన్నలు వేరొక వాహనం రిపేరీ సామాన్లు కొనడానికి శనివారం తెల్లవారుజామున బళ్లారి నుంచి కారులో బయల్దేరారు. నిద్రమత్తులో ఉన్న డ్రైవర్ ఉరవకొండ మండలం బూదగవి వద్ద తూగడంతో కారు అదుపుతప్పి బోల్తాపడింది. వసంతప్ప అక్కడికక్కడే మృతిచెందాడు. శశిధర్, అప్పన్నలు గాయపడగా.. వీరిని ప్రభుత్వ అంబులెన్స్‌లో ఉరవకొండ ఆస్పత్రికి తీసుకెళ్లారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
అర్ధరాత్రి అరణ్యరోదన
- కుప్పకూలిన పాత మిద్దె – శిథిలాల కింద ఆటోడ్రైవర్ దుర్మరణం – గాయాలతో బయటపడిన తల్లి అనంతపురం సెంట్రల్: గురువారం అర్ధరాత్రి 12.30 గంటలు.. ఎడతెరపిలేని జోరువాన.. కుప్ప కూలిన పాత మిద్దె పైకప్పు.. కాపాడాలంటూ కుటుంబ సభ్యుల ఆర్తనాదాలు అరణ్యరోదనే అయ్యాయి. శిథిలాల కింద ఆటోడ్రైవర్ దురణం చెందాడు. తల్లి గాయాలతో బయటపడింది. వివరాలిలా ఉన్నాయి. గురువారం రాత్రి కురిసిన భారీ వర్షానికి నగరంలోని నాల్గవరోడ్డుకు చెందిన రమేష్‌బాబు(35) ఆటో డ్రైవర్. ఈయనకు తల్లి రామక్క, భార్య మీనాక్షి, కుమారులు మణికంఠ, బన్ని ఉన్నారు. సంపాదన అంతంతమాత్రంగానే ఉండటంతో కొత్త ఇల్లు కట్టుకోలేక, అద్దె ఇల్లు తీసుకోలేక పాత మిద్దెలో నివాసం ఉంటున్నారు. వర్షం వచ్చినప్పుడల్లా ఇల్లు కారుతుంటుంది. గురువారం రాత్రి వర్షం మొదలవడంతో భార్య, పిల్లలను దగ్గర్లోని బంధువుల ఇంటికి పంపించాడు. తల్లి రామక్కతో కలిసి రమేష్‌బాబు ఇంట్లోనే నిద్రపోయాడు. అర్ధరాత్రి 12.30 గంటల సమయంలో జోరువాన దెబ్బకు ఇంటి పైకప్పు కుప్పకూలింది. శిథిలాల కింద రమేష్ ఇరుక్కుపోయి ఊపిరాడక మృతి చెందాడు. రామక్క స్వల్పగాయాలతో బయటపడింది. పైకప్పు కూలే సమయంలో భారీ శబ్దం రావడంతో పొరుగున నివాసముంటున్న వారంతా ఉలిక్కి పడి లేచారు. ఏం జరిగిందని తెలుసుకోవడానికే సమయం పట్టింది. అంతలో భార్య, పిల్లలు అక్కడికి చేరుకున్నారు. శిథిలాల కింద భర్త, అత్త ఉన్నారని చెప్పడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే చేరుకున్న పోలీసులు శిథిలాల కింద ఉన్నవారిని బయటకు తీశారు. తీవ్రంగా గాయపడిన రమేష్‌బాబును హుటాహుటిన ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే రమేష్‌బాబు మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. రామక్క స్వల్ప గాయాలతో బయటపడింది. ముందుచూపుతో భార్య, పిల్లలను బంధువుల ఇంటికి పంపించకపోతే ప్రాణనష్టం ఎక్కువగా జరిగేదని స్థానికులు పేర్కొన్నారు. బాధిత కుటుంబానికి ఆర్థికసాయం: విషయం తెలుసుకున్న ప్రజాప్రతినిధులు శుక్రవారం ఉదయం ఘటనాస్థలాన్ని పరిశీలించారు. ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి రూ. 50 వేలు, వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ నగర అధ్యక్షులు రంగంపేట గోపాల్‌రెడ్డి, స్థానిక కార్పొరేటర్ హిమబిందు రూ. 5 వేల ఆర్థికసాయాన్ని అందించారు. బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. -
రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి
గోరంట్ల(సోమందేపల్లి): మండలంలోని పాలసముద్రం జాతీయ రహదారిపై కారుబోల్తాపడి గుంటూరు జిల్లాకు చెందిన రాధాకృష్ణరెడ్డి (36) అనే వ్యక్తి చనిపోగా మరో ముగ్గురు తీవ్రగాయాల పాలయ్యారు. గురువారం గుంటూరు నుంచి అనంతపురం మీదుగా బెంగళూరుకు వెళ్తుండగా కారు జాతీయ ర హదారిపై ప్రమాదానికి గురైంది. అందులో ప్రయాణిస్తున్న రాధాకృష్ణరెడ్డికి తీవ్రగాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. వెంకటరెడ్డి, రాజేశ్వరయ్యలతో పాటు డ్రైవర్ చైతన్యలు తీవ్రంగా గాయపడగా ప్రథమ చికిత్స కోసం వారిని హిందూపురం ఆస్పత్రికి తరలించారు. అనంతరం వారిని మెరుగైన చికిత్స కోసం బెంగళూరుకు తరలించినట్లు తెలిసింది. డ్రైవర్ అజాగ్రత్తవల్లే ప్రమాదం చోటు చేసుకుందని పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్ఐ బాలాజి తెలిపారు. -
రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి
హిందూపురం రూరల్: మండల పోలీస్ స్టేషన్ పరిధిలోని చౌళూరు గ్రామ సమీపంలోని మంగళవారం జరిగిన ప్రమాదంలో కర్ణాటకకు చెందిన ఓ వ్యక్తి మృతి చెందగా మరొకరు గాయపడ్డారు. రూరల్ ఎస్ఐ ఆంజనేయులు తెలిపిన వివరాల మేరకు కర్ణాటక రాష్ట్రం గౌరిబిదనూరు రూరల్ తాలూకాలోని నడువలహళ్లి చెందిన నరసిహమూర్తి(28), కుందేనహళ్లికి చెందిన రాజు (35) చౌళూరుకు ద్విచక్రవాహనంలో వచ్చారు. తిరుగు ప్రయాణంలో చౌళూరు గ్రామ సమీపంలో చెరువు కట్ట మీద ఆగి ఉన్న నీటి ట్యాంకర్‌ను ద్విచక్రవానం ఢీ కొంది ప్రమాదంలో నరసింహప్పకు తలకు తీవ్రంగా గాయాలు కాగా రాజుకి స్వల్పగాయాలయ్యయి. గ్రామస్తులు వారిని 108 సహాయంతో హిందూపురం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. నరసింహప్ప పరిస్థితి విషమంగా ఉండడంతో బెంగుళూరుకు ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమ«ధ్యలో మృతి చెందాడు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. -
అత్తారింటికెళ్తూ పరలోకాలకు..
రోడ్డు ప్రమాదంలో పత్తికొండవాసి దుర్మరణం గుత్తి (గుంతకల్లు) : అత్తారింటికి వెళుతున్న యువకుడిని రోడ్డు ప్రమాద రూపంలో మృత్యువు కబళించింది. గుత్తి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో పత్తికొండ వాసి దుర్మరణం చెందాడు. పోలీసులు, ప్రత్యక్ష సాక్షులు తెలిపిన మేరకు... కర్నూలు జిల్లా పత్తికొండ పట్టణంలోని చౌడేశ్వరి ఆలయం వద్ద నివాసముండే కారు డ్రైవర్ నేసే రాజు (35) సోమవారం తన అత్తగారి ఊరైన అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలం మర్తాడుకు ద్విచక్ర వాహనంలో బయలు దేరాడు. మార్గం మధ్యలోని గుత్తిలో నంబర్ వన్ హాస్టల్ వద్ద ఎదురుగా వెళుతున్న ఇన్నోవా కారు ఎదురుగా స్పీడు బ్రేకర్ ఉండటంతో డ్రైవర్ సడెన్ బ్రేక్ వేశాడు. కారు ఉన్నపళంగా ఆగడంతో ఆ వెనకే వేగంగా వస్తున్న రాజు అదుపు తప్పి కారును ఢీకొన్నాడు. కారు పైనుంచి రోడ్డుపైకి ఎగిసిపడినపుడు తలకు బలమైన గాయం కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. సంఘటనా స్థలాన్ని హెడ్ కానిస్టేబుల్ విజయుడు, కుమార్‌లు పరిశీలించారు. సీఐ ప్రభాకర్ గౌడ్ కేసు నమోదు చేసుకున్నారు. మృతినికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. రాజు మరణ వార్త విన్న వెంటనే కుటుంబ సభ్యులందరూ గుత్తి ఆస్పత్రికి వచ్చి మృతదేహంపై పడి బోరున విలపించారు. ఇక మాకు దిక్కెవరయ్యా అంటూ దిక్కులు పిక్కటిల్లేలా రోదించారు. -
బైక్ అదుపు తప్పి ఒకరి దుర్మరణం
బుక్కరాయసముద్రం (శింగనమల) : బుక్కరాయసముద్రంలో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో స్థానిక గాంధీనగర్‌కు చెందిన శ్రీనివాసులు(45) అనే వ్యక్తి మరణించినట్లు పోలీసులు తెలిపారు. బైక్‌లో అనంతపురానికి బయలుదేరగా కేవీకే ఫ్యాక్టరీ సమీపానికి రాగానే అదుపు తప్పికింద పడటంతో తలకు బయలమైన గాయాలయ్యాయన్నారు. వెంటనే 108లో అనంతపురం పెద్దాస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందినట్లు వివరించారు. మృతునికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. -
ఆటో బోల్తా.. ఒకరి మృతి
గోరంట్ల (సోమందేపల్లి) : గోరంట్ల మండలం మల్లాపల్లి సమీపంలోని లేపాక్షి గ్రీన్ సిటీ వద్ద మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో గుమ్మయ్యగారిపల్లికి చెందిన నరసింహప్ప(52) అనే వ్యక్తి మృతి చెందారు. ఆటో డ్రైవర్ ఫకృద్దీన్, ప్రయాణికులు ఉబేద్, ఫయాజ్, బాబుసాబ్ గాయపడ్డారు. గోరంట్ల నుంచి ప్రయాణికులతో హిందూపురం వైపు బయలుదేరిన ఆటో మార్గమధ్యంలో గ్రీన్‌సిటీ వద్దకు చేరుకోగానే అదుపు తప్పి బోల్తాపడటంతో ఈ ఘటన జరిగింది. ఆటోలో ప్రయాణిస్తున్న నరసింహప్పకు తీవ్ర గాయాలు కాగా, చికిత్స నిమిత్తం హిందూపురం ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మరణించినట్లు ఎస్ఐ వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామన్నారు. -
వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఒకరి దుర్మరణం
పెద్దవడుగూరు(గుత్తి రూరల్) : జిల్లాలో వేర్వేరు ప్రాంతాల్లో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ఒకరు మరణించగా, మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసుల కథనం ప్రకారం... గుత్తి శివార్లలోని గేట్స్ ఇంజినీరింగ్ కళాశాల వద్ద 44వ నంబర్ జాతీయ రహదారిలో జరిగిన ప్రమాదంలో గుర్తు తెలియని ఓ వ్యక్తి(45) అక్కడికక్కడే మరణించాడు. అనంతపురం వైపు నుంచి గుత్తి వైపునకు కాలినడకన వెళ్తుండగా గుర్తు తెలియని వాహనం వెనుక వైపు నుంచి బలంగా ఢీకొట్టడంతో అతను అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. స్థానికుల సమాచారంతో మృతదేహాన్ని గుత్తి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. లేపాక్షి మండలంలో... లేపాక్షి : మండలంలోని శిరివరం చెరువు కట్ట కింద శనివారం మధ్యాహ్నం జరిగిన ప్రమాదంలో ముగ్గురు తీవ్రంగా గాయపడగా, మరో ముగ్గురు స్వల్పంగా గాయపడ్డారు. కర్ణాటకకు చెందిన లగేజీ ఆటో శిరివరం నుంచి మానేపల్లికి బయలుదేరింది. హిందూపురం నుంచి శిరివరానికి వస్తున్న ఆటో పరస్పరం ఢీకొనడంతో శిరివరానికి చెందిన మూర్తి(36), ఆటో డ్రైవర్ రమేశ్(42), ఆర్టీసీ డ్రైవర్ రామప్ప(52) తీవ్రంగా గాయపడ్డారు. వారితో పాటు మరో ముగ్గురు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. వెంటనే వారందరినీ 108లో హిందూపురం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కర్ణాటక ఆటో డ్రైవర్ అతిగా మద్యం తాగి నిర్లక్ష్యంగా నడపడం వల్లే ప్రమాదానికి కారణంగా స్థానికులు ఆరోపించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. అనంతరం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కోలుకుంటున్న క్షతగాత్రులు కదిరి టౌన్ : తనకల్లు మండలం చీకటిమానిపల్లె సమీపంలో శనివారం తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ క్షతగాత్రులు కదిరి ప్రభుత్వాస్పత్రిలో కోలుకుంటున్నారు. ప్రమాదంలో చిత్తూరు జిల్లా పీటీఎం మండలం శ్రీణఙవాసరాయునిపల్లెకు చెందిన ముగ్గురు మరణించగా, మరో పది మంది గాయపడిన సంగతి తెలిసిందే. గాయపడిన వారిని కదిరి ప్రభుత్వాస్పత్రిలో చేర్చారు. వారంతా ఇక్కడే చికిత్స పొందుతున్నారు. శంకరప్ప అనే వ్యక్తిని మెరుగైన వైద్యం కోసం తిరుపతికి తరలించారు. -
పేకాటస్థావరంపై దాడి..ఒకరి మృతి
హైదరాబాద్‌సిటీ: పోలీసుల నుంచి తప్పించుకోబోయి ఇద్దరు పేకాటరాయుళ్లు భవనంపై నుంచి దూకారు. ఈ ఘటనలో ఒకరు మృతిచెందగా, మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. కేపీహెచ్‌బీ పోలీస్‌స్టేషన్ పరిధిలో గురువారం వేకువజామున చోటుచేసుకున్న ఈ సంఘటన ఆలస్యంగా సాయంత్రం వెలుగులోకి వచ్చింది. వివరాలు..గురువారం వేకువజామున ఒంటి గంట సమయంలో ఓ ఇంటి రెండో అంతస్తులో శబ్దం రావడంతో పాటు లైట్లు ఆన్ చేసి ఉండటంతో పోలీసులకు అనుమానం వచ్చి తలుపుతట్టారు. దీంతో కంగారు పడిపోయిన ఇద్దరు పేకాట రాయుళ్లు తప్పించుకోబోయి వెనకవైపు బాల్కనీలోకి వెళ్లారు. మరో బాల్కనీలోకి వెళ్లడానికి ప్రయత్నిస్తూ కిందపడిపోయారు. ఇద్దరిని పోలీసులు దగ్గరలోని అనుపమా ఆసుపత్రికి తరలించగా.. చికిత్సపొందుతూ శ్రీనివాస్(36) అనే వ్యక్తి మృతిచెందారు. ఇద్దరిదీ పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం మండలం మామిడిపల్లి గ్రామం. స్థానికంగా ఉంటూ పండ్ల వ్యాపారం చేసుకుంటున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
రోడ్డు ప్రమాదంలో భర్త మృతి.. భార్యకు గాయాలు
జగిత్యాల: బైక్‌పై వెళుతున్న భార్యాభర్తలను ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. జగిత్యాల మండలంలో జరిగిన ఈ ప్రమాదంలో మాల్యాల మండలం నూకపల్లికి చెందిన దంపతులకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే భర్త మృతిచెందాడు. భార్య ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. బైక్‌పై ధర్మపురికి వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
బైక్‌ను ఢీకొన్న లారీ: ఒకరి మృతి
సూర్యాపేట: ఎదురెదురుగా వస్తున్న రెండు వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్న ఘటనలో ఓ వ్యక్తి మృతిచెందగా.. మరో యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన సూర్యాపేట జిల్లా కేంద్రంలోని గాంధీనగర్‌లో గురువారం ఉదయం చోటుచేసుకుంది. వేగంగా వెళ్తున్న లారీ ఎదురుగా వస్తున్న బైక్‌ను ఢీకొట్టడంతో.. ద్విచక్రవాహనం నడుపుతున్న వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందగా.. వెనక కూర్చున్న వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. ఇది గుర్తించిన స్థానికులు క్షతగాత్రుడిని ఆస్పత్రికి తరలించి పోలీసులకు సమాచారం అందించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
ఆటో బోల్తా ఒకరి మృతి
ఎన్పీ కుంట (కదిరి) : ఆటో బోల్తాపడిన ప్రమాదంలో ఓ ప్రయాణికుడు మృతి చెందాడు. పోలీసులు తెలిపిన మేరకు.. వైఎస్ఆర్ జిల్లా నక్కలదిన్నెపల్లికి చెందిన చంద్రాచారి (42) తన బంధువులతో కలిసి అనంతపురం జిల్లా ఎన్పీ కుంట మీదగా గాలివీడుకు ఆటోలో బయల్దేరాడు. జౌకల సమీపంలోని మిట్టపైకి రాగానే ఆటో అదుపుతప్పడంతో బోల్తా పడింది. ఆటోలో ప్రయాణిస్తున్న చంద్రాచారి తీవ్రంగా గాయపడ్డాడు. ప్రైవేట్ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలో మృతి చెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఏఎస్ఐ దేవిశ్రీరమణ కేసు నమోదు చేసుకున్నారు. -
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
కొమరోలు(ప్రకాశం జిల్లా): ప్రకాశం జిల్లా కొమరోలు మండలం దద్దవాడ సమీపంలో గడ్డి లోడుతో వెళుతున్న ట్రాక్టర్‌ను గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో ట్రాక్టర్ డ్రైవర్ అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ సంఘటన సోమవారం ఉదయం జరిగింది. మృతుడు మార్కాపురం మండలం పోతలపాడు గ్రామానికి చెందిన రమణారెడ్డి(50)గా గుర్తించారు. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. మృతునికి భార్య, నలుగురు పిల్లలు ఉన్నారు. -
ప్రాణం తీసిన ఓవర్టేక్
ఆటో బోల్తా.. ఒకరి మృతి మరో ఏడుగురికి గాయాలు బత్తలపల్లి : ఓవర్టేక్ చేయబోయిన ఆటో బోల్తాపడటంతో ఒకరు మృతి చెందారు. మరో ఏడుగురు గాయపడ్డారు. ప్రత్యక్ష సాక్షులు తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. ముదిగుబ్బ మండలం చిన్నకోట్లకు చెందిన ఎనిమిది మంది దేవాలయం వద్దకు సిమెంట్ రేకులు తీసుకురావడానికి ఆటోలో అనంతపురం బయల్దేరారు. బత్తలపల్లి దాటి కొంత దూరం వెళ్లగానే ముందు వెళుతున్న వాహనాన్ని ఓవర్టేక్ చేయబోతుండగా ఎదురుగా మరో వాహనం రావడంతో దాన్ని తప్పించేక్రమంలో ఆటో అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో అందరూ గాయపడ్డారు. వెంటనే అదే ఆటోను పైకిలేపి అనంతపురం ఆస్పత్రికి వెళుతుండగా మార్గంమధ్యలోనే సూర్యనారాయణరెడ్డి (53) మృతి చెందాడు. మరో ఆరుగురు నారాయణప్ప, ఉదయ్‌కుమార్‌రెడ్డి, చంద్ర, గిట్టా నారాయణ, నాగభూషణ, క్రిష్టలు గాయపడ్డారు. సూర్యనారాయణరెడ్డికి భార్య సుధామణి, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఆటో డ్రైవర్ బ్రహ్మా సురక్షితంగా బయటపడ్డారు. ట్రాక్టర్, లారీ ఢీ.. ముగ్గురికి గాయాలు తాడిపత్రి రూరల్ : తాడిపత్రి మండలం వెంకటరెడ్డిపల్లి సమీపంలో లారీ ఓవర్టేక్ చేయబోయి ఢీకొట్టడంతో గ్రాసం లోడుతో వెళుతున్న ట్రాక్టర్ అదుపు తప్పి కిందపడింది. ఈ ప్రమాదంలో మడ్డిపల్లికి చెందిన వెంకటేశ్వరరెడ్డి (51), వెంకటరామిరెడ్డి (58), వెంకటటేశ్వరెడ్డి (53)లు గాయపడ్డారు. కర్నూలు జిల్లా అవుకు నుంచి గ్రాసం తీసుకుని స్వగ్రామానికి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. రూరల్ పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకుని, క్షతగాత్రులను తాడిపత్రి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. -
కారును ఢీకొన్న లారీ: ఒకరి మృతి
-
కారును ఢీకొన్న లారీ: ఒకరి మృతి
హైదరాబాద్: నగరంలోని ఉప్పల్-నాగోల్ మార్గంలో హెచ్‌పీ పెట్రోల్ పంపు వద్ద శనివారం అర్ధరాత్రి జరిగిన ప్రమాదంలో ఓ వ్యక్తి మృతిచెందాడు. నాగర్‌కర్నూల్‌కు చెందిన నలుగురు వ్యక్తులు కారు సర్వీసింగ్ కోసం శనివారం ఉప్పల్ వచ్చారు. సర్వీసింగ్ పూర్తయ్యాక తిరిగి వెళ్తుండగా ఉప్పల్ మెట్రో వద్ద వీరి కారును వెనుకనుంచి లారీ ఢీకొంది. ఐదుగురు తీవ్రంగా గాయపడగా ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. వీరిని గాంధీ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలో నాగరాజ్ అనే వ్యక్తి మృతిచెందాడు. కారు డ్రైవర్ రాములు(50), వంశీ(23)ల పరిస్థితి విషమంగా ఉంది. అతి వేగంగా వచ్చిన లారీ తమ వెనుక నుంచి ఢీకొందని రాములు, వంశీ తెలిపారు. లారీ డ్రైవర్ పరారు కాగా కారులోని ఓ యువకుడు కనిపించడంలేదు. ఉప్పల్ పోలీసులు లారీ డ్రైవర్ కోసం గాలిస్తున్నారు. -
పింఛను కోసం క్యూలో నిలబడి గుండెపోటుతో..
-
పింఛను కోసం క్యూలో నిలబడి గుండెపోటుతో..
మాచర్ల(గుంటూరు జిల్లా): మాచర్ల ఎస్బీఐ క్యూ వద్ద విషాదం చోటుచేసుకుంది. డబ్బుల కోసం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వద్ద క్యూలో నిలబడిన మౌలాలీ అనే వృద్ధుడు అకస్మాత్తుగా సొమ్మసిల్లి కిందపడిపోయాడు. తీవ్రమైన గుండెపోటు రావడంతో ఆసుపత్రికి తరలిస్తుండగా మృతిచెందాడు. పింఛను డబ్బుల కోసం రెండు రోజులుగా ఏటీఎంల చుట్టూ మౌలాలీ తిరుగుతున్నట్లు తెలిసింది. -
కూలిన పెంకుటిల్లు..ఒకరి మృతి
-
కూలిన పెంకుటిల్లు..ఒకరి మృతి
కనిగిరి(ప్రకాశం జిల్లా): కనిగిరి మండలకేంద్రంలోని ఎనిమిదవ వార్డులో ఓ పెంకుటిల్లు బుధవారం ఉదయం 6:30 గంటల సమయంలో అకస్మాత్తుగా కుప్పకూలింది. ఈ ఘటనలో ఖైరూన్ బీ(60) అనే వృద్ధురాలు మృతిచెందగా.. ఆమె మనవరాలు హసీనాకు తీవ్రగాయాలయ్యాయి. హసీనాను స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మంగళవారం కురిసిన భారీ వర్షానికి బాగా నాని కూలి ఉంటుందని భావిస్తున్నారు. -
వీధి వ్యాపారుల ఘర్షణ: ఒకరి మృతి
విశాఖపట్నం(పెందుర్తి): విశాఖ జిల్లా పెందుర్తిలో తాగిన మైకంలో ఇద్దరు వీధి వ్యాపారులు పరస్పరం దాడి చేసుకున్నారు. మజీద్ అనే వ్యాపారి దిలీప్ ధర్మదాస్‌ను కర్రతో కొట్టడంతో అతను అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడు దిలీప్ స్వస్థలం ఉత్తరప్రదేశ్. కాగా, మధ్యప్రదేశ్‌కు చెందిన వాడైన నిందితుడు మజీద్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. -
రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి
కోదాడ(సూర్యాపేట): సూర్యాపేట జిల్లా కోదాడ సమీపంలో జాతీయరహదారిపై గురువారం వేకువజామున జరిగిన ప్రమాదంలో ఒకరు చనిపోయారు. విజయవాడ నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న కారు కోదాడ బైపాస్ రోడ్డులో ఆగి ఉన్న లారీని వెనుక నుంచి ఢీకొట్టింది. దీంతో కారులో ఉన్న ఒకరు అక్కడికక్కడే చనిపోగా మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను వెంటనే విజయవాడకు తరలించారు. బాధితుల వివరాలు తెలియాల్సి ఉంది. -
చేతబడి నెపంతో దాడి..ఒకరి మృతి
అరవపల్లి(సూర్యాపేట జిల్లా): చేతబడి చేస్తున్నాడనే నెపంతో గ్రామస్తులు ఓ కుటుంబంపై దాడికి దిగారు. ఈ సంఘటన అరవపల్లి మండలం తుంగగూడెంలో మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. వివరాలు..గ్రామానికి చెందిన చిలుకూరి సోమయ్య(54) అనే వ్యక్తిపై గ్రామస్తులు దాడి చేశారు. దాడిని అడ్డుకోబోయిన సోమయ్య భారతమ్మ, కుమారుడు రమేశ్‌లకు తీవ్రగాయాలయ్యాయి. తీవ్రంగా గాయపడిన సోమయ్యను చికిత్స నిమిత్తం హైదరాబాద్ తరలించగా..చికిత్సపొందుతూ బుధవారం తెల్లవారుజామున మృతిచెందాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నలుగురు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
కళ్లెదుటే.. కన్నుమూశాడు!
- ద్విచక్ర వాహనం అదుపుతప్పి వ్యక్తి మృతి - మరొకరికి తీవ్ర గాయాలు పెద్దపప్పూరు : వేగంగా బైక్‌పై వెళుతున్న ఇద్దరు వ్యక్తులు అదుపుతప్పి గోతిలోకి ఎగిసిపడ్డారు. మొనలు తేలిన భారీ బండరాళ్లపై పడటంతో వారిద్దరికీ బలమైన గాయాలు తగిలాయి. ఈ ప్రమాదంలో అచేతనంగా కూర్చుండిపోయిన ఓ వ్యక్తిని చూసిన స్థానికులు నీళ్లు తాపారు. కాసేపు బండరాయికి ఆనుకుని సేద తీరుతున్నట్లు కనిపించిన ఆ వ్యక్తి అందరూ చూస్తుండగానే నిమిషాల వ్యవధిలో ప్రాణం వదిలాడు. కళ్లముందే ప్రాణాలు పోతున్నా..‘అయ్యో’ అనడం తప్ప..అక్కడున్నవారు ఏమీ చేయలేకపోయారు. మండల పరిధిలోని ముచ్చుకోట అటవీ ప్రాంతంలోని కనుమ వద్ద ద్విక్ర వాహనం అదుపుతప్పి వ్యక్తి మృతి చెందిన ఘటన మంగళవారం చోటుచేసుకుంది. ఎస్ఐ శ్రీహర్ష తెలిపిన వివరాల మేరకు కడప జిల్లా ఆర్ఎస్ కొండాపురం మండలం ఓబన్నపేట ఎల్లయ్య (50), కొర్రపాడుకు చెందిన రామాంజి వ్యక్తిగత పని నిమిత్తం అనంతపురానికి ద్విచక్ర వాహనంపై వెళ్తున్నారు. మండలంలోని ముచ్చుకోట అటవీ ప్రాంతంలో కనుమ వద్దకు రాగానే బైకు అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఎల్లయ్య అక్కడికక్కడే మృతి చెందగా, రామాంజి తీవ్ర గాయాలపాలయ్యాడు. గాయపడిన రామాంజిని 108 వాహనంలో అనంతపురం ఆస్పత్రికి తరలించారు. ఎల్లయ్య మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తాడిపత్రి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఎస్ఐ శ్రీహర్ష ఘటనాస్థలిని పరిశీలించి, కేసు నమోదు చేసుకున్నారు. -
రోడ్డు ప్రమాదంలో యువకుడు దుర్మరణం
అనంతపురం సెంట్రల్ : స్థానిక బళ్లారి బైపాస్‌రోడ్డులో మంగళవారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో సందీప్(25) మృతి చెందాడు. పోలీసులు తెలిపిన మేరకు.. నగరంలో స్టాలిన్ నగర్లో నివాసముంటున్న శ్రీనివాసులు కుమారుడు సందీప్ బీటెక్ వరకూ చదువుకున్నాడు. గొల్లపల్లి సమీపంలోని ఓ కన్స్ట్రక్షన్ కంపెనీలో పనిచేస్తున్నాడు. మంగళవారం రాత్రి ద్విచక్రవాహనంలో ఇంటికి వెళుతుండగా అదుపుతప్పి కిందపడ్డాడు. తీవ్రగాయాలు కావడంతో అతడిని స్థానికులు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉందని తెలపడంతో అక్కడి నుంచి కుటుంబ సభ్యులు కర్నూలుకు తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. -
బొలెరో వాహనం బోల్తా..యువకుడి మృతి
కళ్యాణదుర్గం రూరల్ : పట్టణ సమీపంలోని బైపాస్‌రోడ్డులో బొలెరో వాహనం బోల్తా పడి అజయ్‌కుమార్(20) అనే యువకుడు మంగళవారం మృతి చెందాడు. వివరాల్లోకెళ్తే.. పట్టణానికి చెందిన బోర్లు రామన్న కుమారుడు హర్షవర్ధన్, అజయ్‌కుమార్‌తో పాటు మరో నలుగురు కంబదూరు బైపాసు రోడ్డు నుంచి మల్లాపురం గ్రామం వైపు వెళ్తుండగా బొలెరో వాహనం టైర్లు పగలడంతో అదుపుతప్పి బోల్తా పడింది. దీంతో అందులో ఉన్న అజయ్‌కుమార్ అక్కడికక్కడే మృతి చెందగా హర్షవర్ధన్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ఇది గమనించిన స్థానికులు క్షతగాత్రులను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ శంకర్‌రెడ్డి తెలిపారు. -
అన్నదమ్ముల మధ్య ఘర్షణ..ఒకరి మృతి
తాడిపత్రి(అనంతపురం జిల్లా): తాడిపత్రి పట్టణంలో ఇద్దరు అన్నదమ్ముల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ తగాదాలో తమ్ముడి నెత్తిపై అన్న బండరాయితో మోదడంతో తీవ్రగాయాలయ్యాయి. ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతిచెందాడు. వివరాలు..పట్టణంలో ఉన్న రాజా లాడ్జి యజమాని రాజారెడ్డి, శేఖర్‌రెడ్డిలు అన్నదమ్ములు. వీరి మధ్య కొంతకాలంగా ఆస్తి తగాదాలు నడుస్తున్నాయి. గతంలో వీరి మధ్య ఒకరిపై ఒకరు దాడులు కూడా చేసుకున్నారు. ఆదివారం కోపోద్రిక్తుడైన అన్న శేఖర్‌రెడ్డి తమ్ముడిని బండరాయితో మోది చంపాడు. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు శేఖర్‌రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఆటోను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు..ఒకరి మృతి
రాయచోటి(వైఎస్సార్ జిల్లా): రాయచోటి మండలం శిబ్యాల సమీపంలో ఆటోను ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఖాదర్‌సాబ్(70) అనే వృద్ధుడు మృతిచెందగా..పది మందికి తీవ్రగాయాలయ్యాయి. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం రాయచోటి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. బాధితులంతా సుండుపల్లి మండలం బేస్తపల్లికి చెందినవారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఆర్టీసీ బస్సు ఢీకొని వ్యక్తి మృతి
డిచ్పల్లి(నిజామాబాద్): రోడ్డు దాటుతుండగా ఆర్టీసీ బస్సు ఢీకొని ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ సంఘటన నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండలం బి.ధర్మారం గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ఏసోబు(55) రోడ్డు దాటుతున్న సమయంలో వేగంగా వెళ్తున్న ఆర్టీసీ బస్సు అయనను ఢీకొట్టింది. దీంతో అతను అక్కడికక్కడే మృతిచెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
చెట్టును ఢీకొని కారు బోల్తా
ఒకరు మృతి, మరొకరికి తీవ్ర గాయాలు మంచాల: వేగంగా వస్తూ.. అదుపుతప్పి కారు చెట్టును ఢీకొని బోల్తా పడడంతో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా.. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన గురువారం అర్ధరాత్రి మండలంలోని ఆగాపల్లి సమీపంలో చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి.. నల్గొండ జిల్లా మర్రిగూడ మండలం రాజు పేట్ తండాకు చెందిన కొర్ర శ్రీను (32), నాంపల్లి మండలం ముర్షపల్లి తండాకు చెందిన బిచ్చు నాయక్ కలిసి గురువారం రాత్రి దేవరకొండ నుంచి (ఏపీ 24 ఏవై 1244) కారులో హైదరాబాద్‌కు బయలుదేరారు. అయితే నాగార్జున సాగర్ రహదారి మండలంలోని ఆగాపల్లి గ్రామం దాటగానే జాలి గుట్ట సమీపంలోకి రాగానే వేగాన్ని నియంత్రించలేక అదుపు తప్పి రోడ్డుపక్కనే గల చెట్టుకు ఢీకొంది. ప్రమాదంలో శ్రీను అక్కడికక్కడే మృతి చెందాడు. బిచ్చా నాయక్ తీవ్ర గాయాలతో నగరంలోని అవేర్ వైద్యశాలలో చికిత్స పొందుతున్నాడు. -
శుభలేఖలు పంచేందుకు వెళ్తూ...
రేగిడి/సంతకవిటి: స్నేహితుడి ఇంట్లో వివాహం జరగనున్న నేపథ్యంలో పెండ్లి శుభలేఖలను పంచేందుకు వెళ్తూ గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృత్యువాత పడ్డాడు. మరో యువకుడు గాయాల పాలయ్యూడు. రేగిడి పోలీసులు తెలిపిన వివరాలు...సంతకవిటి మండలం పుల్లిట గ్రామానికి చెందిన బంకి మధుకుమార్ (18), మడ్డు శంకరరావు ద్విచక్ర వాహనంపై రాజాం నుంచి విజయనగరం జిల్లా గళావల్లి గ్రామంలో వివాహ ఆహ్వాన పత్రికలు పంచేందుకు వెళ్తున్నారు. కాగితాపల్లి గ్రామ సమీపంలో ఉన్న రహదారి మలుపు వద్ద వాహనం అదుపుతప్పి ఎదురుగా ఉన్న తాటిచెట్టును ఢీకొంది. ఈ ఘటనలో డ్రైవింగ్‌లో ఉన్న బంకి మదు అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. వెనుకను కూర్చున్న మడ్డు శంకరరావు జారి పడిపోవడంతో గాయూల పాలై ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. మధు రాజాంలోని ఒక మెడికల్ షాపులో పని చేస్తున్నాడని పోలీసులు తెలిపారు. సంఘటనా స్థలం వద్ద శవపంచనామా జరిపి రాజాం సామాజిక ఆసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని తరలించారు. ఈ ఘటనకు సంబంధించి హెచ్‌సీ కె.చిన్నారావు కేసు నమోదుచేసి దర్యాప్తు జరుపుతున్నారు. పుల్లిటలో విషాదం మధుకుమార్ మృతితో పుల్లిటలో విషాదం నెలకొంది. మధు ఇటీవలె రాజాంలోని ఓ మెడికల్ దుకాణంలో పనిలో చేరాడు. పేద కుటుంబానికి చెందిన మధు ఇంటర్మీడియెట్ వరకు చదివి తల్లిదండ్రులకు ఆర్థికంగా సాయపడేందుకు పనిలో చేరాడు. ఇంతలోనే మృత్యువు ప్రమాద రూపంలో రావడంతో తల్లిదండ్రులు శోభమ్మ, యోగీశ్వరరావు బోరుమన్నారు. -
ఆర్టీసీ బస్సు ఢీకొని విద్యార్థి మృతి
బాలానగర్ (హైదరాబాద్): ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో ఓ ఇంజనీరింగ్ విద్యార్థి మృతి చెందాడు. ఈ ఘటన గురువారం రాత్రి ఐడీపీఎల్ కాలనీలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు... జగద్గిరిగుట్టకు చెందిన కెవెన్‌కుమార్ (19) మల్లారెడ్డి ఇంజనీరింగ్ కళాశాలల్లో బిటెక్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. పనిమీద బాలానగర్ వచ్చి గుట్టకు తిరిగి వెళ్తుండగా ఐడీపీఎల్ కాలనీ యూటర్న్‌లో వెనుక నుంచి వచ్చిన ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో అక్కడిక్కడే మృతి చెందాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఔటర్‌పై ప్రమాదం: ఒకరు మృతి
హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం తుక్కుగూడ వద్ద ఔటర్ రింగ్ రోడ్డుపై శనివారం ఉదయం జరిగిన ప్రమాదంలో ఒకరు మృతిచెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. నల్లగొండ నుంచి మహబూబ్‌నగర్ వైపు వెళ్తున్న డీసీఎం ముందు ఐరన్ లోడుతో వెళ్తున్న లారీని ఢీకొట్టింది. ఈ ఘటనలో ఒకరు అక్కడికక్కడే మృతిచెందగా మరొకరు తీవ్ర గాయాలపాలయ్యారు. క్షతగాత్రుడిని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. అతడి పరిస్థితి విషమంగా ఉందని చెబుతున్నారు. -
ఆటో, బైక్ ఢీ : ఒకరి మృతి
కొమరోలు: ప్రకాశం జిల్లాలో ఆటో, మోటార్ సైకిల్‌ను ఢీకొట్టిన ప్రమాదంలో ఒకరు మృతిచెందారు. కొమరోలు మండలం ముక్తాపురం వద్ద బుధవారం మధ్యాహ్నం ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో మోటారు సైకిల్‌పై వెళ్తున్న వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది. -
శబరిమల వెళ్లొస్తుండగా.. రోడ్డు ప్రమాదం
బోడుప్పల్: కారు బోల్తా పడిన ఘటనలో ఒకరు మృతి చెందగా 9 మందికి గాయాలయ్యాయి. బోడుప్పల్ గ్రామానికి చెందిన 10 మంది అయ్యప్ప స్వాములు శబరిమలై వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. బాధితుల కుటుంబ సభ్యులు, ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం బోడుప్పల్‌కు చెందిన టీఆర్ఎస్నేత నత్తి మైసయ్య కుమారుడు నత్తి అజయ్ కుమార్ (22), మైసగల్ల బాలయ్య, కామగల్ల వెంకటేశ్, సందీప్, నర్సింహ్మ, బాబ, అనిల్‌తోపాటు మరో ఇద్దరు కలిసి అయ్యప్ప మాల వేసుకుని క్వాలిస్‌లో శబరి మలై వెళ్లారు. శబరిమలై నుంచి తిరిగి వస్తూ తిరుపతి వచ్చారు. వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకుని సోమవారం బోడుప్పల్‌కు తిరిగి వస్తున్నారు. కోడూరు వద్దకు రాగానే మలుపు వద్ద ఉన్న కంటైనర్‌ను క్వాలిస్ ఢీకొట్టింది. దీంతో కారు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో నత్తి అజయ్‌కుమార్ అక్కడక్కడే మృతి చెందాడు. మిగతా 9 మందికి గాయాలు కావడంతో స్థానిక ఆసుపత్రికి తరలించారు. -
ప్రాణం తీసిన పాటల సరదా..
-
బాణాసంచా పేలుడు ఒకరి మృతి
గుంటూరు జిల్లా: దీపావళి పండగ పురస్కరించుకుని అక్రమంగా బాణాసంచా తయారు చేస్తున్న ఓ ఇంట్లో భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఒకరు మరణించగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన గుంటూరు జిల్లా వేమూరు మండలం చావలి గ్రామంలో మంగళవారం చోటు చేసుకుంది. క్షతగాత్రులను తెనాలి ఆస్పత్రికి తరలించే క్రమంలో ఒకరు మరణించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి
కమలాపురం(కరీంనగర్): కమలాపురం మండలం శ్రీరాములపల్లి శివారులో గురువారం టాటా ఏస్ వాహనం, బైక్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో గూడూరు గ్రామానికి చెందిన కుమ్మరి శంకర్(35) అనే వ్యక్తి అక్కడికక్కడే మరణించాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. -
బస్సు ఢీకొని భార్య మృతి, భర్తకు గాయాలు
పంజగుట్ట: రోడ్డు ప్రమాదంలో భార్య మృతి చెందగా భర్త ఆస్పత్రి పాలయ్యాడు. ఈ ఘటన పంజగుట్ట పోలీస్‌స్టేషన్ పరిధిలో మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే .. లంగర్‌హౌస్‌లో నివసించే వెంకట్‌రెడ్డి, సుష్మ (25) భార్యాభర్తలు. ఇద్దరూ ద్విచక్రవాహనంపై ఎన్ఎఫ్సీఎల్ నుంచి పంజగుట్ట వైపు రాత్రి 8.00 గంటల ప్రాంతంలో వస్తుండగా అదే మార్గం గుండా వెళుతున్న కంటోన్మెంట్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు జూబ్లీ మెడికల్ హాల్ ఎదురుగా ఢీకొట్టింది. బస్సు వెనకటైరు సుష్మపై నుంచి వెళ్లడంతో ఆమె తల ఛిద్రమైపోయింది. వెంకట్‌రెడ్డికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు సుష్మ మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి, వెంకట్‌రెడ్డిని చికిత్స నిమిత్తం యశోదా ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బస్సు డ్రైవర్ బి. ఆంజనేయులు (34)ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి
ఎడ్లపాడు(గుంటూరు): రోడ్డుప్రమాదంలో ఒకరు మృతి చెందారు. ఈ సంఘటన గుంటూరు జిల్లా ఎడ్లపాడు మండలంలోని ఆయిల్ మిల్లు వద్ద మంగళవారం చోటుచేసుకుంది. గుంటూరు వైపు వెళ్తున్న గుర్తుతెలియని వాహనం, మారుతీ కారు ఢీన్నాయి. ఈ ఘటనలో మారుతీ కారులో ప్రయాణిస్తున్న గుంటూరు ఇన్సూరెన్స్ విభాగం ఏరియా మేనేజర్ డి. ఆనంద్(35) అక్కడికక్కడే మరణించగా..మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
పల్లిపురం(నెల్లూరు): విధులు ముగించుకొని ఇంటికి వస్తున్న సెక్యూరిటీ గార్డు రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. ఈ సంఘటన నెల్లూరు జిల్లా పల్లిపురం మడలం పెండేపల్లి సమీపంలోని 71వ నంబరు జాతీయ రహదారిపై సోమవారం రాత్రి జరిగింది. వివరాలు.. దొరవారిసత్రం మండలం కల్లూరు గ్రామానికి చెందిన రవి(40) నాయుడుపేట నుంచి శ్రీకాళహస్తికి బైక్‌పై వెళ్తుండగా.. గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. దీంతో రవి అక్కడికక్కడే మృతిచెందాడు. -
రెండు బైకులు ఢీకొని వ్యక్తి మృతి
దిలావర్పూర్(ఆదిలాబాద్): ఎదురెదురుగా వస్తున్న రెండు ద్విచక్రవాహనాలు ఒకదానితో ఒకటి ఢీకొన్న ఘటనలో ఒక వ్యక్తి మృతిచెందగా.. మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. ఈ సంఘటన అదిలాబాద్ జిల్లా దిలావర్పూర్ మండలం గుండంపల్లి క్రాస్ రోడ్డు వద్ద ఆదివారం రాత్రి జరిగింది. వివరాలు.. సిరిగాపూర్కు చెందిన కదం బాలాజి(40) బీడీ కార్మికుడిగా పనిచేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో నర్సాపూర్‌కు వెళ్లి తిరిగివస్తుండగా.. ఎదురుగా వస్తున్న ద్విచక్రవాహనం ఢీకొట్టింది. దీంతో బాలాజీ అక్కడికక్కడే మృతిచెందగా.. మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రుడిని నిర్మల్ ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
కారు, బొలెరో ఢీ... ఒకరు మృతి
పెద్ద ఊర: నల్లగొండ జిల్లా పెద్ద ఊర మండలం పోతునూరు స్టేజీ సమీపంలో ఆదివారం మధ్యాహ్నం కారు, బొలెరో వాహనాలు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, మరొకరికి తీవ్ర గాయాలు అయ్యాయి. గాయపడిన వ్యక్తిని చికిత్స కోసం సాగర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సిఉంది. -
వాహనం ఢీకొని ఒకరు మృతి
కొత్తకోట: మహబూబ్‌నగర్ జిల్లా కొత్తకోట వద్ద 44వ నంబర్ జాతీయ రహదారిపై ఆదివారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందగా, మరో మహిళకు తీవ్ర గాయాలు అయ్యాయి. హైదరాబాద్ వైపు నుంచి బైక్‌పై ఇద్దరు కర్నూలు వైపు వెళుతుండగా, ఓ గుర్తు తెలియని వాహనం కొత్తకోట బైపాస్ వద్ద ఢీకొంది. బైక్‌పై ఉన్న వ్యక్తి మృతి చెందగా, మహిళకు తీవ్ర గాయాలు అయ్యాయి. ఆమెను 108 వాహనంలో వనపర్తి ఏరియా ఆస్పత్రికి తరలించారు. వీరి వివరాలు తెలియాల్సి ఉంది. -
కారు బోల్తా.. హైదరాబాదీ మృతి
పామిడి (అనంతపురం): అనంతపురం జిల్లాలోని పామిడి-కల్లూరు మధ్య జాతీయ రహదారిపై మంగళవారం కారు బోల్తా పడింది. ఈ సంఘటనలో హైదరాబాద్‌కు చెందిన హరికుమార్(43) అనే వ్యక్తి మృతిచెందాడు. బాధిత కుటుంబ సభ్యుల కథనం మేరకు... భూభారత్ అనే ప్రైవేటు సంస్థలో హరికుమార్ పని చేస్తున్నాడు. విధి నిర్వహణలో భాగంగా సొంత కారులో స్నేహితుడు శ్రీధర్‌తో కలిసి మంగళవారం హైదరాబాద్ నుంచి కదిరిలో నిర్వహిస్తున్న రైతు క్షేత్ర అవగాహన సదస్సుకు వెళ్లారు. అక్కడ రైతులతో సమీక్ష అనంతరం హైదరాబాద్‌కు తిరుగు పయనమయ్యారు. పామిడి- కల్లూరు మధ్య గడ్డిమోపుతో వెళ్తున్న మోపెడ్‌ను తప్పించబోయిన కారు అదుపు తప్పి పల్టీలు కొట్టింది. ముందు సీట్లో బెల్టు లేకుండా ప్రయాణిస్తున్న హరికుమార్కు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే పామిడి ప్రభుత్వాసుపత్రికి తరలించగా అక్కడ మృతి చెందాడు. గార్లదిన్నె పోలీసులు కేసు నమోదు చేశారు. కారు నడుపుతున్న శ్రీధర్ సీట్ బెల్ట్ పెట్టుకోవడంతో సురక్షితంగా బయట పడ్డాడు. -
ఆర్టీసీ బస్సు, బైక్ ఢీ: ఒకరు మృతి
చిత్తూరు రూరల్: వేగంగా వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఎదురుగా వస్తున్న బైక్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్‌పై ప్రయాణిస్తున్న వ్యక్తి మృతిచెందాడు. ఈ సంఘటన చిత్తూరు రూరల్ మండలం కమ్మపల్లి గ్రామం వద్ద శనివారం జరిగింది. వివరాలు.. మండలంలోని గుత్తుకూరు గ్రామానికి చెందిన నారాయణస్వామి(32) బోరు బావులలో పైపులు దింపే పనిచేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో ఈ రోజు (శనివారం) చిత్తూరు వెళ్లి తిరిగి వస్తున్న సమయంలో ఎదురుగా వస్తున్న బస్సు ఢీకొట్టింది. దీంతో అతను అక్కడికక్కడే మృతిచెందాడు. అతివేగంగా నడిపి వ్యక్తి ప్రాణం పోవడానికి కారణమయ్యాడని ఆగ్రహించిని స్థానికులు, ఆర్టీసీ డ్రైవర్ పై దాడికి యత్నించి బస్సు అద్దాలు ధ్వంసం చేశారు. -
ఆటో, వ్యాను ఢీ: ఒకరి మృతి
టేకులపల్లి(ఖమ్మం): చనిపోయిన తమ కుటుంబ పెద్ద అస్తికలను గోదావరి నదిలో కలిపేందుకు వెళ్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు అసువులు బాశారు. వివరాలు.. ఖమ్మం టేకులపల్లి మండలం బేతంపూడి గ్రామానికి చెందిన కాకటి ఎల్లయ్య ఇటీవల చనిపోయాడు. ఆయన అస్తికలను గోదావరిలో కలిపేందుకు కుటుంబసభ్యులు 11 మంది సొంత ఆటోలో భద్రాచలం బయలుదేరారు. రాత్రి 9.30 గంటల సమయంలో వారి వాహనాన్ని మండలంలోని బొమ్మనపల్లి వద్ద ఇల్లెందు వైపు వేగంగా వస్తున్న డీసీఎం వ్యాన్ ఢీకొంది. ఈ ఘటనలో కాకటి సుశీల(40) అక్కడికక్కడే మృతి చెందగా మరో ముగ్గురికి తీవ్రంగాను, ఏడుగురికి స్వల్పంగా గాయాలయ్యాయి. క్షతగాత్రులను 108లో కొత్తగూడెం ఏరియా ఆస్పత్రికి తరలించారు. -
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
నాయుడుపేట(శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు): శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా నాయుడుపేట మండలం నాయుడుపేట-పూతలపట్టు జాతీయరహదారిపై సోమవారం ఉదయం 6 గంటల ప్రాంతంలో జరిగిన ప్రమాదంలో ఒక వ్యక్తి మృతి చెందాడు. స్థానిక అగ్రహారపేట నివాసి మైలారు శంకరయ్య(38) సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. ఆయన సోమవారం ఉదయం డ్యూటీ ముగించుకుని, ఇంటికి వెళ్లే క్రమంలో రోడ్డు దాటుతుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొట్టి వెళ్లిపోయింది. ఈ ఘటనలో శంకరయ్య అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యాడు. -
అన్నదమ్ముల మధ్య వివాదం: ఒకరి మృతి
చాగలమర్రు (కర్నూలు): భూ వివాదంలో అన్నదమ్ముల మధ్య ఘర్షణ జరిగింది. దీంతో ఒకరిపై మరొకరు దాడి చేసుకున్నారు. ఈ ఘటనలో తమ్ముడు దుర్మరణం చెందాడు. ఈ ఘటన కర్నూలు జిల్లా చాగలమర్రు మండలంలో బుధవారం సాయంత్రం చోటుచేసుకుంది. వివరాలు.. మండలంలోని కల్లగోంట్ల గ్రామానికి చెందిన సాల్మాన్, ఏసోబులు అన్నదమ్ములు. వీరి మధ్య భూమి విషయంలో గొడవ జరిగింది. దీంతో ఇరువురు ఘర్షణ పడ్డారు. ఏసోబు దాడి చేయడంతో సాల్మాన్ అక్కడికక్కడే మృతి చెందాడు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి
నెల్లిమర్ల: రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి దుర్మరణం చెందాడు. ఈ ఘటన విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలంలో సోమవారం రాత్రి చోటుచేసుకుంది. వివరాలు.. మండలంలోని సత్తెవాడ గ్రామ సమీపంలోని రెండు బైకులు ఒక దానిని మరొకటి ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో మీసాల సాయి (15) అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. అతణ్ని ఏరియా ఆస్పత్రికి తరలించారు. -
గుంటూరులో రోడ్డుప్రమాదం: ఒకరు మృతి
-
లారీ, బైక్ ఢీ: ఒకరి మృతి
వినుకొండ: గుంటూరు జిల్లా వినుకొండ మండల కేంద్రం సమీపంలో గురువారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. జిల్లాలోని శావల్యాపురం మండలం ముండ్రువారిపాలెం గ్రామానికి చెందిన కోటేశ్వరరావు (25) ఓ బాలికతో కలసి బైక్‌పై స్వగ్రామానికి వెళ్తే ఆగి ఉన్న లారీని ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో కోటేశ్వరరావు తీవ్ర గాయాలపాలై అక్కడికక్కడే మృతి చెందాడు. బైక్‌పై ఉన్న బాలికకు గాయాలు కావడంతో వినుకొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. -
ఆటో ఢీకొని ద్విచక్రవాహనదారుడు మృతి
అనంతపురం క్రైమ్: అనంతపురం బైపాస్ రోడ్డులో మంగళవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ద్విచక్రవాహనదారుడు మృతి చెందాడు. ఎదురెదురుగా వచ్చిన ఆటో, బైక్ ఢీకొనగా... బైక్‌పై ఉన్న ఓబులేసు (30) తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు అనంతపురం రూరల్ మండలం నాగిరెడ్డిపల్లి గ్రామవాసిగా గుర్తించారు. -
ఉత్తర్ ప్రదేశ్‌లో రైలు ప్రమాదం ఒకరు మృతి
కనౌజ్(యూపీ): అనంతపురం జిల్లాలో జరిగిన రైలు ప్రమాదం మరవక ముందే మరో ప్రమాదం చోటుచేసుకుంది. ఉత్తర్ ప్రదేశ్‌లోని కనౌజ్లో అదుపుతప్పి పట్టాలపై ఆగిఉన్న వాహనాన్ని రైలు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరో 22 మందికి గాయాలయ్యాయి. వీరిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. -
కారు, ఆటో ఢీ: ఒకరి మృతి
విశాఖపట్నం: రోడ్డు ప్రమాదంలో ఒకరు దుర్మరణం చెందారు. ఈ ఘటన విశాఖపట్టణం జిల్లా కసీంకోట మండలంలో గురువారం వేకువ జామున చోటుచేసుకుంది. మండల కేంద్రానికి చెందిన కురగాయల వ్యాపారులు ఆటోలో అమలాపురం మార్కెట్ వెళుతుండగా వెనకు నుంచి వచ్చిన కారు ఢీకొట్టింది. దీంతో ఆటో డ్రైవర్ గొల్లపల్లి ఈశ్వరరావు(38) అక్కడికక్కడే మృతి చెందాడు. కాగా, ఈ ప్రమాదంలో మరో నలుగురు గాయపడ్డారు. బాధితులు ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. -
వ్యాన్, బైక్ ఢీ: ఒకరి మృతి
లావేరు: శ్రీకాకుళం జిల్లా లావేరు సమీపంలో బుధవారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. జాతీయ రహదారిపై సరుకులతో వస్తున్న టాటా వ్యాన్ మండలంలోని తాళ్లవలస గ్రామం వద్ద మలుపు తిరుగుతుండగా విశాఖ నుంచి వేగంగా వస్తున్న బైక్ ఢీకొంది. ఈ ఘటనలో బైక్‌పై ఉన్న ఒక వ్యక్తి మృతి చెందగా, మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. ఆ మహిళను శ్రీకాకుళం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కాగా, బాధితుల వివరాలు తెలియరాలేదు. -
నాటు బాంబులతో చేపల వేట.. వ్యక్తి మృతి
నేరేడుచర్ల: నాటు బాంబులతో చేపల వేట ఓ వ్యక్తి ప్రాణాల మీదకు తెచ్చింది. నల్లగొండ జిల్లా నేరేడుచర్ల మండలం చిన్నపాడులో నాటు బాంబు పేలి ఓ వ్యక్తి మృతి చెందాడు. ఆదివారం సాయంత్రం ఈ ఘటన జరగ్గా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్థానికుల కథనం మేరకు.. గ్రామానికి పక్కనే ఉన్న మూసి నదిలో చేపలు పట్టే క్రమంలో రమావత్ రమేష్ చేతిలో ఉన్న నాటు బాంబు పేలింది. ఈ ఘటనలో అతడు నదిలోనే ప్రాణాలు కోల్పోయాడు. దీనిపై పోలీసులకు ఎలాంటి ఫిర్యాదు అందలేదు. -
ఇన్నోవా బోల్తా: ఒకరు మృతి
అనంతపురం: రోడ్డు ప్రమాదంలో ఒకరు దుర్మరణం చెందారు. ఈ ఘటన అనంతపురం జిల్లా బత్తులపల్లి మండలంలో సోమవారం ఉదయం చోటుచేసుకుంది. మండలంలోని జ్వాలాపురం సమీపంలోని జాతీయ రహదారిపై వేగంగా వెళుతున్న ఇన్నోవా వాహనం చెట్టును ఢీకొట్టింది. దీంతో వాహనంలో ఉన్న ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. మరో ఏడుగురికి గాయాలయ్యాయి. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. మృతుడు మదనపల్లి టీజీఎం కోర్టు సూపర్డెంట్ టి. రమేష్ బాబుగా పోలీసులు నిర్ధరించారు. అనంతపురంలోని ఓ గృహప్రవేశ కార్యక్రమానికి హాజరు అయ్యేందుకు వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. -
బైకు ప్రమాదంలో ఒకరి మృతి
చిలకూరు: శ్రీపొట్టి శ్రీరాములు జిల్లా చిలకూరు మండల కేంద్రంలో శుక్రవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ ద్విచక్ర వాహనదారుడు మృతి చెందాడు. మండలంలోని ఇసుకపల్లికి చెందిన వెంకటకృష్ణారెడ్డి బైక్‌పై వెళ్తుండగా బైక్ అదుపుతప్పి బోల్తా కొట్టింది. దీంతో బాధితుడికి తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. -
రెండు లారీలు ఢీ: ఒకరి మృతి
తిరుమలాయపాలెం: ఎదురెదురుగా వస్తున్న రెండు లారీలు ఢీకొనడంతో ఒకరు మృతి చెందారు. ఈ ప్రమాదం ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలంలో శుక్రవారం ఉదయం చోటు చేసుకుంది. వివరాలు.. మండలంలోని పిండిప్రోలు సమీపంలో గ్రానైట్ లోడుతో వెళ్తున్న లారీ కోళ్ల లోడుతో కృష్ణా జిల్లా నందిగామ వెళ్తున్న లారీని ఢీకొట్టింది. దీంతో కోళ్ల లోడ్ లారీ క్లీనర్ అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడిది కృష్ణా జిల్లా నందిగామగా పోలీసులు నిర్ధరించారు. గాయపడిన వారు ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.` -
ఒప్పందం బెడిసి కొట్టి.. ఒకరి బలి
శంషాబాద్: ఇచ్చిన మాట ప్రకారం డబ్బులివ్వాలని అడిగినందుకు ఓ వ్యక్తిని కొట్టి చంపారు. శంషాబాద్ డీసీపీ ఎ.ఆర్ శ్రీనివాస్ వెల్లడించిన వివరాల ప్రకారం.. బిహార్ రాష్ట్రానికి చెందిన దయాల్ సదా (54) సాతంరాయిలోని సంజీవరెడ్డి ఫాంహౌస్‌లో వాచ్‌మన్‌గా పనిచేస్తూ అక్కడే నివసిస్తున్నాడు. రెండు నెలల క్రితం సరూర్‌నగర్ మండలం మామిడిపల్లి గ్రామానికి చెందిన వై. సురేష్ (25) తో తనుండే ఫాంహౌస్‌లో గొర్రెలను మేపుకోవడానికి ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఒప్పందంలో భాగంగా నాలుగు గొర్రె పిల్లలను దయాల్‌కు ఇచ్చాడు. ఇది తెలిసిన తోట యజమాని హెచ్చరించటంతో సురేష్ గొర్రెలు మేపుకోవడానికి దయాల్ అభ్యంతరం తెలిపాడు. దీంతో సురేష్ తన గొర్రె పిల్లలను వెనక్కి తీసుకున్నాడు. కొన్ని రోజులు మేపుకున్నందుకు ఎంతో కొంత ఇవ్వాలని దయాల్ పట్టుబట్టడంతో రూ.5 వేలు ఇచ్చేందుకు సురేష్ అంగీకరించాడు. సురేష్ ఇచ్చిన గడువు దాటడంతో దయాల్ తరచూ ఫోన్ చేయసాగాడు. దీంతో కోపం పెంచుకున్న సురేష్ స్థానికంగా మరో ఫాంహౌస్‌లో పనిచేస్తున్న సంతోష్‌రెడ్డి (29), మహ్మద్ హాజీ (19) లతో కలసి జూలై 30న రాత్రి దయాల్‌ను కర్రతో బలంగా మోదారు. తీవ్రంగా గాయపడిన దయాల్ అక్కడికక్కడే మృతి చెందాడు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేసి తీసి ముగ్గురు నిందితులను అరెస్టు చేసి, సోమవారం రిమాండుకు తరలించారు. -
గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి
కర్నూలు: గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి చెందిన సంఘటన కొలిమగుండ్ల మండలం కనకాద్రిపల్లి వద్ద బుధవారం అర్ధరాత్రి సమయంలో చోటుచేసుకుంది. ఈ ఘటనలో టీవీఎస్ ఎక్సెల్‌పై ప్రయాణిస్తున్న బాబావలీ(38) అనే వ్యక్తి అక్కడిక్కడే మరణించాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అతను అనంతపురం జిల్లా యాడికి మండలానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం దగ్గర్లోని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి
ఖమ్మం: ఖమ్మం జిల్లా వైరా సమీపంలో చిన్నపాక వద్ద బుధవారం అర్థరాత్రి దాటిన తర్వాత జరిగిన రోడ్డుప్రమాదంలో ఒక వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. సూర్యాపేటకు చెందిన శ్రీనివాసరావు కుటుంబం కారులో పుష్కరాలకు వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ముందు వెళుతున్న కారును వేగంగా వస్తున్న లారీ ఢీకొనడంతో కారులో ప్రయాణిస్తున్న శ్రీనివాసరావు( 45) అక్కడికక్కడే మృతిచెందారు. ఆయన భార్య ఉపేంద్ర, కుమారుడు శ్రీకాంత్, మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం జరిగిన విషయాన్ని స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. వైరా పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి క్షతగాత్రులను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి చేర్చి కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
బస్సు, లారీ ఢీ: ఒకరు మృతి
ప్రకాశం: ప్రకాశం జిల్లా అద్దంకి మండలం సింగరకొండ సమీపంలో ప్రైవేటు ట్రావెల్స్ బస్సు, లారీ ఢీకొన్న ఘటనలో ఒకరు మృతి చెందగా మరో నలుగురికి గాయాలయ్యాయి. బస్సులో 24 మంది ప్రయాణికులు ఉండగా వారు అత్యవసర ద్వారాలు పగులగొట్టుకుని బయటపడ్డారు. అద్దంకి-నార్కట్‌పల్లి జాతీయ రహదారిపై మంగళవారం తెల్లవారుజామున 3.15 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. చైన్నైకు చెందిన ఎస్ఆర్ఎం ట్రావెల్స్ బస్సు స్లీపర్ కోచ్ హైదరాబాద్‌కు వెళుతోంది. అదే సమయంలో గుంటూరు జిల్లా దుర్గి మండలానికి చెందిన ఓ లారీ ఎదురుగా రాగా ఆ రెండూ సింగరకొండ వద్ద ఢీకొన్నాయి. ఈ ఘటనలో లారీ డ్రైవర్ రెండు వాహనాల మధ్య ఇరుక్కుపోయి ప్రాణాలు విడవగా, లారీ క్లీనర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. బస్సు డ్రైవర్ గోపాలంతో పాటు మరో ఇద్దరు ప్రయాణికులకు స్వల్ప గాయాలు అయ్యాయి. -
లారీ, కారు ఢీ: ఒకరి మృతి
అల్వాల్: వేగంగా వెళ్తున్న బొలేరో వాహనం రోడ్డుపై ఆగి ఉన్న లారీని ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఒక వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన గురువారం తెల్లవారుజామున నగరంలోని బొల్లారం కంటెయినర్ డంపింగ్ యార్డ్ వద్ద జరిగింది. వివరాలు.. కూకట్పల్లి యల్లమ్మబండకు చెందిన కొంతమంది భక్తులు యాదగిరిగుట్టకు వెళ్లి వస్తుండగా ఈ సంఘటన జరిగింది. ఈ ఘటనలో బాబు (19), అక్కడికక్కడే మృతి చెందగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని మెరుగైన వైద్యం కోసం తరలించారు. కాగా, ప్రస్తుతానికి వీరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ప్రమాదం జరిగిన సమయంలో కారులో 8మంది ఉండగా అందూ ఒకే కుటుంబానికి చెందిన వారిగా పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
బైక్‌ను ఢీకొన్న లారీ..యువకుడు మృతి
హైదరాబాద్ సిటీ: ఉప్పల్ నుంచి రామాంతపూర్ వైపు బైక్ మీద వెళ్తున్న యువకుడిని ఓ లారీ ఢీకొంది. ఈ ఘటనలో నల్గొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన సమీర్(22) అనేయువకుడు అక్కడిక్కడే మృతిచెందాడు. కొన్ని రోజుల్లో విదేశాలకు వెళ్లాల్సి ఉండగా ఇంతలోనే ఈ ఘోరం జరిగిందని బంధువలు శోకసంద్రం అయ్యారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు. -
పట్టపగలే కత్తులతో దాడి
చిత్తూరు: పట్టపగలే కత్తులతో దాడి చేశారు. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా.. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ప్రమాదం చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో గురువారం మధ్యాహ్నం జరిగింది. రోడ్డుపై నడిచి వెళ్తున్న వ్యక్తులపై ఎవరో దుండగులే కత్తులతో దాడి చేశారు. ఎవరో తెలీదు.. ఎందుకో తెలీదు.. దాడి మాత్రం చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి గాయపడ్డ వ్యక్తిని వైద్యం కోసం.. మృతదేహాన్ని పోస్టు మార్టం కోసం సమీపంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తలరించారు. -
ఆటో-బైక్ ఢీ: ఒకరి మృతి
మంచిర్యాల (ఆదిలాబాద్): ఎదురెదురుగా వస్తున్న ఆటో, బైకు ఢీకొన్నాయి. ఈ సంఘటన ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాల మండలం గుడిపేట వద్ద శుక్రవారం జరిగింది. ఈ ప్రమాదంలో బైక్ మీద ప్రయాణిస్తున్న దండేపల్లి మండలం గూడెం గ్రామానికి చెందిన శివకుమార్ (30) అనే వ్యక్తి అక్కడిక్కడే మృతిచెందాడు. ఆటోలోని మరో నలుగురు వ్యక్తులకు కూడా తీవ్రగాయాలయ్యాయి. బాధితులను చికిత్స నిమిత్తం స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
లారీ బోల్తా: ఒకరి మృతి
నెల్లూరు: వేగంగా వెళ్తున్న లారీ అదుపుతప్పి బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో లారీపై ఉన్న ఒక వ్యక్తి మృతిచెందగా.. మరో 12 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన నెల్లూరు జిల్లా వరికుంటపాడు మండలం జడదేవి గ్రామ సమీపంలో బుధవారం ఉదయం జరిగింది. బెంగళూరు నుంచి ప్రకాశం జిల్లా పామూరుకు వలస కూలీలతో వెళ్తున్న మినీ లారి జడదేవి సమీపంలోకి రాగనే అదుపుతప్పి బోల్తా కొట్టింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించి, కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది. -
చెట్టును ఢీకొన్న టాటాఎస్.. వ్యక్తి మృతి
అనంతపురం: వేగంగా వెళ్తున్న వాహనం అదుపుతప్పి చెట్టును ఢీకొన్న ప్రమాదంలో ఒక వ్యక్తి మృతిచెందగా.. మరో వ్యక్తికి తీవ్రగాయాలయ్యాయి. ఈ సంఘటన అనంతపురం జిల్లా మడకశిర మండలం తడకలపల్లి గ్రామం వద్ద సోమవారం తెల్లవారుజామున జరిగింది. కర్ణాటకలోని మధుగిరి తాలుక బేర్పూర్ గ్రామానికి చెందిన రాజన్న(42) టాటా ఎస్ నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో సోమవారం తెల్లవారుజామున జిల్లాలోని హిదూపురం నుంచి బేర్పూర్‌కు పశువుల లోడ్‌తో బయలుదేరాడు. వాహనం తడకలపల్లి సమీపానికి చేరుకోగానే అదుపుతప్పి రోడ్డుపక్కన ఉన్న చెట్టును ఢీకొట్టింది. ఈ ఘటనలో వాహనం నడుపుతున్న రాజన్న అక్కడికక్కడే మృతిచెందగా మరో వ్యక్తికి తీవ్రగాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రున్ని బెంగళూరు ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
సినిమాకెళ్లొస్తూ..అనంతలోకాలకు
విజయనగరం: సెకండ్ షో సినిమా చూసి వస్తున్న రెండు వాహనాలు ప్రమాదానికి గురైన ఘటనలో ఒక వ్యక్తి మరణించగా.. మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. ఈ సంఘటన విజయనగరం జిల్లా పుసపాటిరేగ మండలం కామవరం జంక్షన్ వద్ద శుక్రవారం అర్ధరాత్రి జరిగింది. చింతపల్లి గ్రామానికి చెందిన నలుగురు యువకులు విజయనగరం నుంచి సినిమా చూసి రెండు బైక్‌ల మీద వస్తుండగా.. కామవరం జంక్షన్‌లోని డివైడర్ వద్ద ఎదురుగా వస్తున్న ఆటోని ఢీకొన్నారు. దీంతో.. బైక్ నడుపుతున్న యువకుడు మృతిచెందగా.. మరో ముగ్గురు యువకులు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రున్ని ఆస్పత్రికి తరలించి.. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
చెట్టును ఢీకొన్న స్కార్పియో: ఒకరు మృతి
ఖమ్మం: వేగంగా వెళ్తున్న స్కార్పియో వాహనం అదుపుతప్పి చెట్టును ఢీకొట్టి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతిచెందగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన జిల్లాలోని చండ్రుగొండ మండలం మద్దుకూరు గ్రామ శివారులోని మూల మలుపు వద్ద బుధవారం ఉదయం జరిగింది. చీరాల నుంచి పాల్వంచ వెళ్తున్న స్కార్పియో గ్రామ శివారులోకి చేరుకొగానే అదుపుతప్పి రోడ్డుపక్కన ఉన్న చెట్టును ఢీకొట్టి బోల్తా పడింది. దీంతో వాహనం నడుపుతున్న రాజశేఖర్(28) అక్కడికక్కడే మృతిచెందగా.. స్కార్పియోలో ఉన్న మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రున్ని కొత్తగూడెం ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతునికి చెందిన పూర్తి వివరాలు ఇంకా తెలియరాలేదు. -
ఆర్టీసీ బస్సు, బైక్ ఢీ: ఒకరు మృతి
రంగారెడ్డి : ఆర్టీసీ బస్సు బైక్‌ను ఢీకొన్న సంఘటనలో ఒక వ్యక్తి మృతిచెందగా, మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా కీసర మండలం నాగారం గ్రామంలో బుధవారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. వివరాలు.. నల్లగొండ జిల్లా తుర్కపల్లి మండలం ధర్మారం గ్రామానికి చెందిన సురేష్(30), శంకర్లు లారీ డ్రైవర్లు. మధ్యాహ్నం 2 గంటల సమయంలో ద్విచక్రవాహనంపై వెళ్తుండగా నాగారం శివాలయం వద్ద వెనుక నుంచి అతివేగంగా వచ్చిన కుషాయిగూడ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ఢీకొంది. ఈ ఘటనలో సురేష్ అక్కడికక్కడే మృతి చెందగా శంకర్ తీవ్ర గాయాల పాలయ్యాడు. ప్రమాదానికి కారణమైన బస్సు డ్రైవర్ పరారీలో ఉన్నాడని పోలీసులు తెలిపారు. -
సైకిల్‌ను ఢీకొన్న లారీ: ఒకరి మృతి
రేణిగుంట (చిత్తూరు): చిత్తూరు జిల్లా రేణిగుంట మండలం వెదలచెరువు వద్ద లారీ, సైకిల్ ను ఢీకొట్టింది. ఈ ఘటనలో సైకిల్‌పై ప్రయాణిస్తున్న సురేంద్ర అనే యువకుడు అక్కడిక్కడే మరణించాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రేణిగుంట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
కాలిపోయిన భర్త.. బయటపడ్డ భార్య..
హైదరాబాద్: నిర్మాణంలో ఉన్న భవనం పక్కన గుడిసెలు వేసుకొని జీవనం సాగిస్తున్న పెదల గుడిసెల్లో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో గుడిసెలో నిద్రపోతున్న భర్త మంటల్లో కాలి బూడిదకాగా.. భార్యకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన నగరంలోని మెహదీపట్నం పరిధిలోని మల్లెపల్లిలో గురువారం తెల్లవారు జామున చోటుచేసుకుంది. గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న భవన సముదాయంలో కూలి పనులు చేయడానికి వచ్చిన కూలిలు అక్కడే గుడిసెలు వేసుకొని జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలో బుధవారం పనుల అనంతరం భార్యా భర్తలు గుడిసెలో నిద్రిస్తున్నారు. ఆ సమయంలో ప్రమాదవశాత్తూ మంటలు చెలరేగాయి. దీంతో మంటల్లో చిక్కుకున్న భర్త కాలి బూడిదయ్యాడు. భర్యకు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. బాధితురాలిని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
రోడ్డు ప్రమాదంలో వైఎస్సార్సీపీ కార్యకర్త మృతి
మైదుకూరు (వైఎస్సార్ జిల్లా): వైఎస్సార్ జిల్లా మైదుకూరు వద్ద శుక్రవారం ఉదయం జరిగిన ప్రమాదంలో ఒక వ్యక్తి మృతి చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. వివరాలు.. గోపవరం మండలం వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ రాధాకృష్ణారెడ్డి కె.రాధాకృష్ణారెడ్డి మైదుకూరులో జరిగే వివాహ వేడుకకు జీపులో వస్తుండగా జాండ్లవరం క్రాస్ రోడ్డు వద్ద ఎదురుగా వేగంగా వస్తున్న లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రాధాకృష్ణారెడ్డి అక్కడికక్కడే మృతిచెందగా.. జీపు డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డాడు. రాధాకృష్ణారెడ్డి స్వగ్రామం గోపవరం మండలం సండ్రుపల్లి గ్రామం. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. -
రోడ్డు ప్రమాదంలో గుర్తు తెలియని వ్యక్తి మృతి
రైల్వే కోడూరు: వైఎస్సార్ జిల్లా రైల్వే కోడూరు మండల కేంద్రంలో వాహనం ఢీకొనడంతో ఓ గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. సోమవారం ఉదయం ఈ ప్రమాదం జరిగింది. మృతుడి వయసు 40 సంవత్సరాలు ఉంటుందని పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. -
కారుపై కూలిన చెట్టు, ఒకరి మృతి
-
కారుపై కూలిన చెట్టు, ఒకరి మృతి
రంగారెడ్డి: రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం కేసారం వద్ద ఆదివారం ఉదయం 10 గంటల సమయంలో చెట్టుకూలి కారుపై పడిన ఘటనలో ఒకరు మృతి చెందగా నలుగురు గాయాలపాలయ్యారు. వికారాబాద్‌కు చెందిన కొందరు కారులో హైదరాబాద్ వైపు వెళ్తుండగా కేసారం సమీపంలో రోడ్డు పక్కన ఉన్న పెద్ద చెట్టు అకస్మాత్తుగా కూలి పడింది. కారు ముందుభాగంలో పడటంతో ముందు సీట్లో కూర్చున్న ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా వెనుక ఉన్న నలుగురు గాయాలపాలయ్యారు. స్థానికుల సమాచారంతో అక్కడికి చేరుకున్న పోలీసులు కారులో చిక్కుకున్న వారిని అతికష్టంపై బయటకు తీసి ఆస్పత్రికి తరలించారు. రోడ్డుపై చెట్టు పడటంతో ఆ మార్గంలో రాకపోకలు గంటపాటు ఆగిపోయాయి. పోలీసులు చెట్టును నరికించి, రాకపోకలను పునరుద్ధరించారు.