కూలీలతో వెళ్తున్న ఆటో ఆదివారం తెల్లవారుజామున 7 గంటలకు అదుపు తప్పి బోల్తాపడింది.
గుంటూరు : కూలీలతో వెళ్తున్న ఆటో ఆదివారం తెల్లవారుజామున 7 గంటలకు అదుపు తప్పి బోల్తాపడింది. ఈ సంఘటన వినుకొండ మండలం వెంకుపాలెంలో చోటుచేసుకుంది. ఈ ఘటనలో వెల్లటూరుకు చెందిన అద్దాలపూడి వెంకటసుబ్బయ్య(60) అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా మరో ఆరుగురికి తీవ్రగాయాలయ్యాయి. కూలీలంతా వినుకొండ పట్టణానికి చెందినవారే. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం వినుకొండ ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
(వినుకొండ)