ఆటో బోల్తా ఒకరి మృతి | one dies of auto rolls | Sakshi
Sakshi News home page

ఆటో బోల్తా ఒకరి మృతి

Published Tue, Jan 31 2017 10:53 PM | Last Updated on Sat, Mar 9 2019 4:28 PM

one dies of auto rolls

ఎన్‌పీ కుంట (కదిరి) : ఆటో బోల్తాపడిన ప్రమాదంలో ఓ ప్రయాణికుడు మృతి చెందాడు. పోలీసులు తెలిపిన మేరకు.. వైఎస్‌ఆర్‌ జిల్లా నక్కలదిన్నెపల్లికి చెందిన చంద్రాచారి (42) తన బంధువులతో కలిసి అనంతపురం జిల్లా ఎన్‌పీ కుంట మీదగా గాలివీడుకు ఆటోలో బయల్దేరాడు. జౌకల సమీపంలోని మిట్టపైకి రాగానే ఆటో అదుపుతప్పడంతో బోల్తా పడింది. ఆటోలో ప్రయాణిస్తున్న చంద్రాచారి తీవ్రంగా గాయపడ్డాడు. ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలో మృతి చెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఏఎస్‌ఐ దేవిశ్రీరమణ కేసు నమోదు చేసుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement