venkata subbaiah
-
ఎన్ఈపీ అమలులో అగ్రస్థానంలో ఏపీ
విశాఖ విద్య: జాతీయ విద్యా విధానం(ఎన్ఈపీ) అమలులో ఆంధ్రప్రదేశ్.. దేశంలోనే అగ్రస్థానంలో ఉందని కేంద్రీయ గిరిజన విశ్వ విద్యాలయం వైస్ చాన్సలర్ టీవీ కట్టిమని అన్నారు. విశాఖపట్నంలో బుధవారం డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీ(శ్రీకాకుళం) వీసీ నిమ్మ వెంకటరావు, జేఎన్టీయూ(విజయనగరం) వీసీ బి.వెంకట సుబ్బయ్య, ఆంధ్ర యూనివర్సిటీ రిజిస్ట్రార్ వి.కృష్ణమోహన్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం ఎనర్జీ డైరెక్టర్ శాలివాహన్, ఐఐఎం ప్రతినిధి ఆచార్య షమీమ్ జావేద్‌తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. జాతీయ స్థాయిలో పాలసీలు తీసుకువచ్చేది కేంద్ర ప్రభుత్వమే అయినప్పటికీ.. భవిష్యత్ తరాలను దృష్టిలో పెట్టుకొని వాటిని విజయవంతంగా అమలు చేసేది రాష్ట్ర ప్రభుత్వాలే అని చెప్పారు. వైఎస్ జగన్ ప్రభుత్వం ఆ దిశగా ముందుకు అడుగులు వేస్తోందన్నారు.జాతీయ విద్యా విధానం వల్ల విద్యార్థులు తమ అభిరుచి మేరకు కోర్సులను ఎంపిక చేసుకునే స్వేచ్ఛ లభించిందన్నారు. యువతలో దాగి ఉన్న నైపుణ్యాలను వెలికి తీసేలా చదువులు సాగుతున్నాయని వివరించారు. పరిశ్రమల్లో 75 శాతం ఉద్యోగాలు స్థానిక యువతకు కేటాయించడం, విద్యాలయాలను పరిశ్రమలకు అనుసంధానం చేయడం వంటి చర్యలు విద్యార్థులకు భరోసాగా నిలుస్తున్నాయని చెప్పారు. ఉన్నత విద్యకు పాఠశాల స్థాయిలోనే పటిష్ట పునాది వేసేలా రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో సంస్కరణలు తీసుకువచ్చిందన్నారు. ఉద్యోగ అవకాశాలు లక్ష్యంగా బోధన సాగుతోందన్నారు. గిరిజన యూనివర్సిటీకి రాష్ట్ర ప్రభుత్వం 561 ఎకరాల భూమి కేటాయించిందని.. మాస్టర్ ప్లాన్‌కు అనుగుణంగా నిర్మాణాలు పూర్తి చేసిన అనంతరం నూతన క్యాంపస్‌కు వెళ్తామని వీసీ కట్టిమని తెలిపారు. అనంతరం జాతీయ విద్యావిధానం ప్రయోజనాలపై గిరిజన వర్సిటీ రూపొందించిన పుస్తకాన్ని ఆవిష్కరించారు. -
ముగిసిన ఎమ్మెల్యే వెంకట సుబ్బయ్య అంత్యక్రియలు
వైఎస్సార్ కడప: బద్వేల్ శాసన సభ్యులు డాక్టర్ వెంకట సుబ్బయ్య అంత్యక్రియలు ముగిశాయి. అధికార లాంఛనాలతో ఎమ్మెల్యే అంత్యక్రియలు జరిగాయి. ఆయన అంత్యక్రియల్లో పెద్ద ఎత్తున పాల్గొన్న వైఎస్ఆర్సీపీ శ్రేణులు పాల్గొన్నారు. ముందుగా ఎమ్మెల్యే నివాసం ఉంటున్న కో ఆపరేటివ్ కాలనీలోని వందన అపార్ట్మెంట్ నుంచి అంతిమయాత్ర మొదలైంది. ఈ అంతిమయాత్ర ఇందిరానగర్ సమీపంలోని నర్సింగ్ కాలేజీ పక్కనున్న ఎమ్మెల్యే వ్యవసాయ పొలం వరకు సాగింది. ఎమ్మెల్యే మృతికి సంతాపంగా పోలీసులు మూడు రౌండ్లు గాల్లోకి కాల్పులు నిర్వహించారు. ఎమ్యెల్యే అంత్యక్రియలకు డిప్యూటీ సీఎం అంజాద్ బాషా, ఎమ్మెల్యేలు రఘురామిరెడ్డి, సుధీర్ రెడ్డి, అన్నా రాంబాబు, మేయర్ సురేష్ బాబు, రాజంపేట పార్లమెంట్ అధ్యక్షుడు ఆకెపాటి అమర్నాథ్రెడ్డి, ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు, జిల్లా కలెక్టర్ హరికిరణ్, ఎస్పీ అన్బురాజన్ పాల్గొన్నారు. చదవండి: విశాఖ మహిళా కార్పొరేటర్ కారుపై దాడి -
బద్వేలు ఎమ్మెల్యే కన్నుమూత
సాక్షి, అమరావతి/సాక్షి, కడప/నెల్లూరు(సెంట్రల్): వైఎస్సార్ జిల్లా బద్వేలు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే డాక్టర్ వెంకటసుబ్బయ్య ఆదివారం మృతిచెందారు. ఊపిరితిత్తుల కేన్సర్‌తో బాధపడుతున్న ఆయనకు శనివారం ఆరోగ్యం విషమించడంతో కడప నాగరాజుపేటలోని అరుణాచల ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం 6.46 గంటలకు తుదిశ్వాస విడిచారు. ఎమ్మెల్యే మరణ వార్త తెలుసుకున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హుటాహుటిన తాడేపల్లి నుంచి కడప నగరం కోఆపరేటివ్ కాలనీలోని వెంకటసుబ్బయ్య నివాసానికి చేరుకున్నారు. అక్కడ ఆయన భౌతికకాయానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వెంకటసుబ్బయ్య సతీమణి డాక్టర్ సుధ, వారి పిల్లలు హేమంత, తనయ్లను ఓదార్చారు. అన్ని విధాలా అండగా ఉంటామని వారికి ధైర్యం చెప్పారు. సీఎం జగన్‌తో పాటు ఎమ్మెల్యే భౌతికకాయానికి డిప్యూటీ సీఎం అంజద్‌బాషా, జిల్లా ఇన్చార్జి మంత్రి ఆదిమూలపు సురేష్, కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, ఎమ్మెల్సీలు డీసీ గోవిందరెడ్డి, సి.రామచంద్రయ్య, జకియాఖానమ్, ఎమ్మెల్యేలు మేడా మల్లికార్జునరెడ్డి, రఘురామిరెడ్డి, రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి, డాక్టర్ సుధీర్‌రెడ్డి, కడప నగర మేయర్ సురేష్‌బాబు, మాజీ ఎమ్మెల్యేలు ఆకేపాటి అమర్నాథరెడ్డి, కమలమ్మ తదితరులు నివాళులర్పించారు. అలాగే ఎమ్మెల్యే మృతికి వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు(ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి, ఏపీ శాసనసభ హక్కుల కమిటీ చైర్మన్, సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. ఎమ్మెల్యే వెంకటసుబ్బయ్య కుటుంబ సభ్యులను పరామర్శిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఎమ్మెల్యే ప్రస్థానం.. బద్వేల్ మున్సిపాలిటీ పరిధి మడకలవారిపల్లెలో రైతు కుటుంబానికి చెందిన వెంకటసుబ్బయ్య, వెంకటసుబ్బమ్మ దంపతులకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు. వారిలో పెద్ద కుమారుడు డాక్టర్ వెంకటసుబ్బయ్య. 1960లో జన్మించిన ఆయన కర్నూలు మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ చదివారు. తిరుపతి శ్రీవేంకటేశ్వర మెడికల్ కళాశాలలో ఎంఎస్ పూర్తి చేశారు. కామినేని, అపోలో హాస్పిటళ్లలో కొంతకాలం వైద్య సేవలందించారు. కడపలో స్థిర నివాసం ఏర్పర్చుకుని ఎముకలు, కీళ్ల వ్యాధుల వైద్య నిపుణుడిగా ప్రజలకు విశేష సేవలందించారు. వెంకటసుబ్బయ్య సేవలను గుర్తించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ.. 2016లో ఆయన్ను బద్వేల్ నియోజకవర్గ కోఆర్డినేటర్‌గా నియమించింది. 2019లో బద్వేల్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ఆయన ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ సంతాపం బద్వేలు ఎమ్మెల్యే డాక్టర్ జి.వెంకటసుబ్బయ్య మృతికి గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ విచారం వ్యక్తం చేశారు. వైద్యుడిగా, ఎమ్మెల్యేగా ఆయన ప్రజలకు ఎంతో సేవ చేశారని ఆదివారం విడుదల చేసిన ప్రకటనలో కొనియాడారు. ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. సీఎం వైఎస్ జగన్ దిగ్భ్రాంతి వైఎస్సార్సీపీకి చెందిన బద్వేల్ ఎమ్మెల్యే డాక్టర్ జి.వెంకటసుబ్బయ్య మృతి పట్ల ఆ పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఓ ప్రకటనలో దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్టు పేర్కొన్నారు. -
వెంకట సుబ్బయ్య భౌతికకాయానికి సీఎం జగన్ నివాళి
-
వెంకట సుబ్బయ్య పార్థివదేహానికి సీఎం జగన్ నివాళి
సాక్షి, వైఎస్సార్ జిల్లా: అనారోగ్యంతో మృతి చెందిన బద్వేలు ఎమ్మెల్యే వెంకట సుబ్బయ్య పార్థివదేహానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నివాళులర్పించారు. ఆదివారం సాయంత్రం కడపలో ఎమ్మెల్యే వెంకట సుబ్బయ్య నివాసానికి చేరుకున్న సీఎం.. ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి.. తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే డాక్టర్ వెంకట సుబ్బయ్య గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆయన కడపలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పోందుతూ ఆదివారం ఉదయం కన్నుమూశారు. ఎమ్మెల్యే వెంకట సుబ్యయ్యకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. సోమవారం ఉదయం కడపలో ప్రభుత్వ లాంఛనాలతో వెంకట సుబ్బయ్య అంత్యక్రియలు జరపనున్నారు. చదవండి: వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే కన్నుమూత మహిళలే టార్గెట్: పరిచయాలు పెంచుకుని.. -
వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే కన్నుమూత
-
వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే కన్నుమూత
సాక్షి, వైఎస్సార్‌కడప: వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే డాక్టర్ వెంకట సుబ్బయ్య మృతి చెందారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన కడపలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పోందుతూ ఆదివారం ఉదయం కన్నుమూశారు. ఎమ్మెల్యే వెంకట సుబ్యయ్యకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. వెంకట సుబ్బయ్య మృతి పట్ల వైఎస్సార్సీపీ నేతలు, అభిమానులు సంతాపం తెలిపారు. ప్రజల సందర్శనార్థం వెంకట సుబ్బయ్య పార్థివదేహాన్ని బద్వేల్ మార్కెట్ యార్డ్‌లో ఉంచారు. ఆదివారం సాయంత్రం కడపలోని ఆయన నివాసానికి వెంకట సుబ్బయ్య పార్థివ దేహాన్ని తరలించనున్నారు. సోమవారం ఉదయం కడపలో ప్రభుత్వ లాంఛనాలతో వెంటక సుబ్బయ్య అంత్యక్రియలు జరపనున్నారు. 1960లో జన్మించిన వెంకట సుబ్బయ్య ఆర్థోపెడిక్ సర్జన్‌గా ప్రజలకు సేవలందించారు. 2016లో ఆయన బద్వేల్ వైఎస్సార్సీపీ కో-ఆర్డినేటర్‌గా పనిచేశారు. 2019లో తొలిసారిగా డాక్టర్ వెంకట సుబ్బయ్య ఎమ్మెల్యేగా గెలుపొందారు. టీడీపీ అభ్యర్థి డాక్టర్ ఓబులాపురం రాజశేఖర్‌పై 44 వేల పైచిలుకు ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. కడపకు సీఎం జగన్: మధ్యాహ్నం 3గంటలకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి కడప వెళ్లనున్నారు. ఆదివారం మృతి చెందిన బద్వేల్ ఎమ్మెల్యే వెంకట సుబ్బయ్య కుటుంబాన్ని సీఎం జగన్ పరామర్శించనున్నారు. కడప ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా ఎమ్మెల్యే వెంకట సుబ్బయ్య కుటుంబం వద్దకు వెళుతారు. పరామర్శ అనంతరం తిరిగి తాడేపల్లి చేరుకోనున్నారు. ప్రముఖుల సంతాపం: ►వైద్యుడిగా, ఎమ్మెల్యేగా వెంకట సుబ్బయ్య సేవలు చిరస్మరణీయమని ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్‌రెడ్డి గుర్తు చేసుకున్నారు. ఎమ్మెల్యే కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో డాక్టర్ వెంకట సుబ్బయ్య కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గం నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున ఎమ్మెల్యేగా గెలుపొందారు. ►ఎమ్మెల్యే డాక్టర్ వెంకటసుబ్బయ్య మృతిపై రాష్ట్ర విద్యాశాఖ మంత్రి, కడప ఇంచార్జ్ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. వెంకట సుబ్బయ్య మృతి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి తీరనిలోటు అని తెలిపారు. వెంకట సుబ్బయ్య కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. వైఎస్సార్సీపీ వెంకట సుబ్బయ్య కుటుంబానికి అండగా ఉంటుందని మంత్రి చెప్పారు. ►ఎమ్మెల్యే వెంకట సుబ్బయ్య మృతి అత్యంత బాధాకరమని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. 2014లో వైఎస్సార్సీపీ ద్వారానే వెంకట సుబ్బయ్య రాజకీయ రంగప్రవేశం చేశారని గుర్తు చేసుకున్నారు. పార్టీలో చాలా క్రియాశీలకంగా ఉండేవారు అని చెప్పారు. 2019 ఎన్నికల్లో తొలిసారి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొందారని పేర్కొన్నారు. వెంకట సుబ్బయ్య ఆత్మకు శాంతి కలగేలా భగవంతున్ని ప్రార్థిస్తున్నాని ఆళ్ల నాని పేర్కొన్నారు. వెంకట సుబ్బయ్య కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. -
మంచి కథను గుర్తించనీయని ఉద్దేశ భ్రమ
అనుశీలనం, నవలాశిల్పం, కథాశిల్పం, విమర్శాశిల్పం లాంటి పుస్తకాలతో తెలుగు సాహిత్య విమర్శకు, ముఖ్యంగా కథాసాహిత్యానికి మంచి భూమికను ఏర్పరిచారు వల్లంపాటి వెంకటసుబ్బయ్య. 1995లో వచ్చిన ఆయన కథాశిల్పంకు 1999లో కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు లభించింది. ఆ పుస్తకంలో మంచి కథను అంచనా గట్టడానికి భావజాలం అడ్డుకాకూడదనీ, ఉద్దేశం మంచిదైనంత మాత్రాన రచన మంచిదైపోదనీ ఇలా వ్యాఖ్యానించారు: తటస్థ చరిత్రలాగే తటస్థ సాహిత్యం కూడా ఉండదు. చరిత్రను చదవటానికి ముందుగా చరిత్రకారుణ్ణి చదవాలని ఇ.హెచ్.కార్ సూచించాడు. అలాగే సాహిత్యం చదవటానికి ముందు దాన్ని సృష్టించిన సాహిత్యకారుణ్ణి చదవటం మంచిది. సాహిత్యం నుంచి భావజాలాన్నీ– మరీ ముఖ్యంగా రచయిత భావజాలాన్నీ– దూరం చేసి పరిశీలించటం మంచిపద్ధతి కాదు. కానీ రచయిత భావజాలానికీ, ఉద్దేశానికీ అతి ప్రాముఖ్యత ఇచ్చి, రచన విలువను నిర్ణయించటం కూడా తప్పు పద్ధతే. అంటే ‘‘రచయిత ఈ ఉద్దేశంతో రాశాడు, ఉద్దేశం గొప్పది, కాబట్టి రచన గూడా గొప్పది,’’ అన్న సమీకరణం పొరపాటు. దీన్ని నవ విమర్శకులు ‘‘ఉద్దేశ భ్రమ’’ (ఇంటెన్షనల్ ఫాలసీ) అన్నారు. రచయిత ఉద్దేశం ఎంత గొప్పదైనా కావచ్చు. అది రచనలో కళాత్మకంగా వ్యక్తం కానంతవరకూ దానికి విలువ లేదు. కథావస్తువు గమ్యమే ఉద్దేశం. ఉద్దేశాన్ని కళగా మార్చే పరుసవేది శిల్పం లేదా రూపం. ఈనాడు తెలుగు సాహిత్య విమర్శలో ‘‘ఉద్దేశ భ్రమ’’ చాలా ప్రముఖంగా కనిపిస్తుంది. అందుచేత విమర్శకుడు ఆ భ్రమలో పడకుండా ఉండాలంటే కథాక్రమం, కథాంశం, ఉద్దేశం కళగా మారే క్రమాన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మీకు తెలుసా? ‘కవిత్వం ఒక స్వప్నక్రియ. కవిత్వం ఒక రహస్య క్రీడ. అంతా ఒక ‘చిత్కళ’. నేను వ్రాసిన పద్యాలన్నీ చిత్తుప్రతులే. ఎప్పుడో రాసిన పద్యాన్ని గూర్చి ఇప్పటికీ ఆలోచిస్తూవుంటాను. అవసరమైతే మార్పులు కూడా’ అన్న కవి అజంతా అసలు పేరు పెనుమర్తి విశ్వనాథ శాస్త్రి. తన జీవితకాలంలో సుమారు 40 కవితలు మాత్రమే రాసిన ఆయన కవితాసంపుటి ‘స్వప్నలిపి’. దీనికి 1997లో కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు లభించింది. వల్లంపాటి వెంకటసుబ్బయ్య -
ఘనంగా జగన్ జన్మదిన వేడుకలు
- పలుచోట్ల సేవా కార్యక్రమాలు బద్వేలు అర్బన్: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి జన్మదిన వేడుకలను బుధవారం పట్టణంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలుచోట్ల సేవా కార్యక్రమాలు చేపట్టారు. స్థానిక సుమిత్రానగర్‌లోని షాలోమ్ అనాథ శరణాలయంలో వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ వెంకటసుబ్బయ్య ఆధ్వర్యంలో అనాథ పిల్లల నడుమ కేక్ కట్‌చేసి వారికి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్మోహన్రెడ్డి ప్రతిపక్ష హోదాలో ఉన్నప్పటికీ నిరంతరం ప్రజా సమస్యలపై పోరాటాలు చేస్తూ జనహృదయ నేతగా నిలిచారన్నారు. ఇది సహించలేని టీడీపీ నేతలు ఆయనపై తప్పుడు ఆరోపణలు చేస్తూ కుటిల రాజకీయాలు చేస్తుందన్నారు. ఎవరెన్ని ఆరోపణలు చేసినా ప్రజల మనసుల్లో ఆయన స్థానం అలాగే కొనసాగుతుందన్నారు. అలాగే 2019లో జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి కావడం ఖాయం అన్నారు. అలాగే స్థానిక మైదుకూరురోడ్డులోని దివ్యజ్యోతి వృద్ధాశ్రమంలో కలసపాడు మాజీ జెడ్పీటీసీ సభ్యులు భూపాల్‌రెడ్డి ఆధ్వర్యంలో వృద్ధులకు చీరలు పంపిణీ చేసే కార్యక్రమంలో వెంకటసుబ్బయ్య పాల్గొన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ మున్సిపాలిటీ ఫ్లోర్ లీడర్ సింగసాని గురుమోహన్, బ్రాహ్మణపల్లె సింగిల్‌విండో ప్రెసిడెంట్ సుందర రామిరెడ్డి, పార్టీ జిల్లా సంయుక్త కార్యదర్శులు అందూరి రామకృష్ణారెడ్డి, సింగసాని శివయ్య, కొండుశేఖర్‌రెడ్డి, కౌన్సిలర్ గోపాలస్వామి, చిన్నకేశంపల్లె సింగిల్‌విండో అ«ధ్యక్షుడు చిన్నపోలిరెడ్డి, సర్పంచ్ జయసుబ్బారెడ్డి, మున్సిపాలిటీ కన్వీనర్ కరిముల్లా, గోపవరం మండల అ«ధ్యక్షురాలు సరస్వతమ్మ, నాయకులు పుత్తా శ్రీరాములు, రాజగోపాల్‌రెడ్డి, చెన్నక్రిష్ణారెడ్డి, యద్దారెడ్డి, బాలాజీ శ్రీను,కేశవరెడ్డి, మాధవరెడ్డి, వెంకటరత్నం, రఘురామిరెడ్డి, మల్లికార్జున రెడ్డి, మాధవరెడ్డి, సాంబశివారెడ్డి, శేఖర్‌రెడ్డి, ఎస్ఎం. షరీఫ్, సుబ్బరాయుడు యాదవ్, బిజ్జం రమణ, ఆకుల శివ, నాగేశ్వరరావు, కుప్పాల రమణ, మురళి, సిద్దయ్య, శ్రీను, తదితరులు పాల్గొన్నారు. -
దేవాదాయశాఖ ఈఓల బదిలీ
కడప కల్చరల్ : జిల్లాలోని పలువురు దేవాదాయ, ధర్మాదాయశాఖ ఈఓలను బదిలీ చేశామని అసిస్టెంట్ కమిషనర్ వెంకట సుబ్బయ్య తెలిపారు. తన కార్యాలయంలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. జె.రవిశేఖర్‌రెడ్డిని మైదుకూరుకు గ్రేడ్–2 నుంచి గ్రేడ్–1 ఈఓగా బదిలీ చేశామన్నారు. కర్నూలుజిల్లా నుంచి మన జిల్లాకు కేటాయించిన ముగ్గురు ఈఓలలో మహేశ్వర్‌రెడ్డిని గ్రేడ్–3 నుంచి గ్రేడ్–2కు బదిలీ చేశామన్నారు. వేంపల్లె ఎద్దుల కొండ ఈఓ ఎస్ఏ ప్రతాప్‌ను గ్రేడ్–2 నుంచి అక్కడే గ్రేడ్–1గా నియమించామన్నారు. ప్రొద్దుటూరుకు చెందిన బి.చంద్రశేఖర్‌రెడ్డి అక్కడే ముక్తిరామేశ్వరం, వెంకట సుబ్బయ్య సత్రం ఈఓగా నియమించామన్నారు. జి.వెంకట సుబ్బయ్యను సీకే దిన్నె గంగమ్మ ఆలయ ఈఓగా నియమించామన్నారు. టి.మద్దిలేటిని ఎర్రగుంట్ల మండలం హనుమనగుత్తి శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయం, హనుమంతేశ్వర ఆలయాలకు ఈఓగా నియమించామన్నారు. అనంతపురం నుంచి వచ్చిన ఇద్దరు ఈఓలలో బీఆర్ వెంకటేశ్వరరావును ప్రొద్దుటూరు గ్రూప్ ఆఫ్ టెంపుల్స్‌కు ఈఓగా నియమించామని వెల్లడించారు. -
తిరుపతిలో తాగుబోతుల వీరంగం
తిరుపతి: తిరుపతిలో గురువారం అర్థరాత్రి తాగుబోతులు వీరంగం సృష్టించారు. తాగి వాహనం నడుపుతున్న వారు... బైక్‌పై వెళ్తున్న టీటీడీ ఎస్పీఎఫ్ కానిస్టేబుల్ వెంకటసుబ్బయ్య దంపతులను ఢీకొట్టారు. ఈ ఘటనలో వారు కింద పడటంలో... వారికి తీవ్ర గాయాలయ్యాయి. అనంతరం తాగుబోతులు కారులో పరారైయ్యారు. స్థానికులు వెంటనే స్పందించి.... వారిని తిరుపతిలోని రుయా ఆసుపత్రికి తరలించారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
రైలు ప్రమాద ఘటనలో ఇద్దరి అరెస్ట్
-
రైలు ప్రమాద ఘటనలో ఇద్దరి అరెస్ట్
గుంతకల్లు రూరల్ (అనంతపురం జిల్లా): పెనుకొండ సమీపంలోని మడకశిర రైల్వే గేటు వద్ద సోమవారం తెల్లవారుజామున జరిగిన నాందేడ్ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాదానికి సంబంధించిన కేసులో రైల్వే పోలీసులు బుధవారం ఇద్దరిని అరెస్టు చేశారు. రైల్వే ఎస్పీ సుబ్బారావు తెలిపిన వివరాల మేరకు.. తాడిపత్రికి చెందిన లారీ యజమాని వెంకట సుబ్బయ్య తనకున్న రెండు లారీల్లో గ్రానైట్ రాళ్లను లోడ్ చేసి పంపాడు. లోడ్ తో వస్తున్న మొదటి లారీ సోమవారం ఉదయం నాందేడ్ ఎక్స్‌ప్రెస్‌ను ఢీ కొట్టింది. వెనక నుంచి వస్తూ ఘటనను కళ్లారా చూసిన మరో లారీ డ్రైవర్ దూదేకుల బాషా పోలీసులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా అక్కడి నుంచి వెళ్లిపోయాడు. దీంతో విచారణ చేపట్టిన పోలీసులు ప్రమాదానికి కారణమైన లారీ యజమాని వెంకటసుబ్బయ్యతో పాటు, ప్రమాదాన్ని చూసి కూడా చెప్పకుండా వెళ్లిపోయిన దూదేకుల బాషాను అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరిచారు. నిందితులకు కోర్టు 14 రోజుల పాటు రిమాండ్ విధించగా వారికి స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించి గుత్తి సబ్ జైలుకు తరలించారు. -
ఆటో బోల్తా..ఒకరు మృతి
గుంటూరు : కూలీలతో వెళ్తున్న ఆటో ఆదివారం తెల్లవారుజామున 7 గంటలకు అదుపు తప్పి బోల్తాపడింది. ఈ సంఘటన వినుకొండ మండలం వెంకుపాలెంలో చోటుచేసుకుంది. ఈ ఘటనలో వెల్లటూరుకు చెందిన అద్దాలపూడి వెంకటసుబ్బయ్య(60) అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా మరో ఆరుగురికి తీవ్రగాయాలయ్యాయి. కూలీలంతా వినుకొండ పట్టణానికి చెందినవారే. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం వినుకొండ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. (వినుకొండ) -
వివాహిత ఆత్మహత్య?
అద్దంకి : ఓ వివాహిత అనుమానాస్పద స్థితిలో భావిలో శవమై తేలింది. భర్తే చంపాడని మృతురాలి తల్లిదండ్రులు, బంధువులు ఆరోపిస్తున్నారు. ఈ సంఘటన పట్టణంలోని గుంజివారిపాలెంలో గురువారం వెలుగు చూసింది. వివరాలు.. పంగులూరు మండలం కొప్పరపాడు గ్రామానికి చెందిన వెంకట సుబ్బయ్య, లక్ష్మిల కుమార్తె రేణుక(24)కు పట్టణంలోని గుంజివారిపాలేనికి చెందిన మక్కెళ్ల పిచ్చియ్యతో నాలుగేళ్ల క్రితం వివాహమైంది. రేణుక చిన్నప్పటి నుంచి రాజుపాలెం శాంతినగర్‌లో అమ్మమ్మ ధనమ్మ వద్ద పెరిగింది. పిచ్చియ్య వరంగల్ ప్రాంతంలో బేల్దారి పనులు చేసుకుని జీవనం సాగిస్తుంటాడు. ఈ నేపథ్యంలో అతడు అనారోగ్యానికి గురయ్యాడు. రెండు నెలల క్రితం భార్య తన అమ్మమ్మ వద్దకు వచ్చి అక్కడే ఉంటోంది. దంపతుల మధ్య ఇటీవల తరచూ గొడవలు జరుగుతున్నాయి. గతంలో ఓ సారి రేణుక ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు ఆమె బంధువులు తెలిపారు. ఈ నేపథ్యంలో మూడు రోజుల క్రితం భర్తను చూసేందుకు రేణుక అద్దంకిలోని గుంజివారిపాలేనికి వచ్చింది. ఏమైందో ఏమో తెలియదుగానీ ఆమె తన భర్త ఇంటికి సమీపంలోని బావిలో శవమై తేలింది. స్థానికులు రేణుక మృతదేహాన్ని గమనించి ఆమె బంధువులకు సమాచారం అందించారు. వారు వచ్చి తమ బిడ్డను ఆమె భర్తే చంపి బావిలో పడేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నాడని ఆరోపిస్తున్నారు. ఇంటిపై చీర, దుప్పటి ఉండటం.. వాటికి కొద్ది దూరంలో రక్తపు మరకలు, బావి గిలకకూ రక్తం అంటి ఉండటంతో ఆమెది హత్యేనని బంధువులు చెబుతున్నారు. రేణుకను హత్య చేసి మృతదేహాన్ని బావిలో పడేసి ఉంటాడని స్థానికులు అనుమానిస్తున్నారు. మృతురాలి బంధువులు.. స్థానికులతో కలిసి భర్త పిచ్చియ్యపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్కడ పరిస్థితులు ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు అత డిని స్టేషన్‌కు తీసుకెళ్లారు. రేణుక ఎలా చనిపోయిందో పోస్టుమార్టం నివేదికలో వెల్లడవుతుందని ఎస్సై సీహెచ్ వెంకటేశ్వర్లు తెలిపారు. కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన చెప్పారు. -
వారే ధర్మకర్తలుగా అర్హులు
* దేవాలయాల్లో ట్రస్టీల నియామకంపై హైకోర్టు కీలక తీర్పు * 1987 చట్టం వచ్చే నాటికి గుర్తింపు పొందిన వారే అర్హులని స్పష్టీకరణ సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ హిందూ ధార్మిక సంస్థలు, ధర్మాదాయ చట్టం-1987 అమల్లోకి వచ్చే నాటికి.. వంశపారంపర్య ధర్మకర్తలుగా, వారి కుటుంబ సభ్యులుగా గుర్తింపు పొందిన వారు మాత్రమే ధార్మిక సంసుథలు, దేవాలయాల ట్రస్టు బోర్డుల్లో ధర్మకర్తలుగా నియమితులయ్యేందుకు అర్హులని హైకోర్టు స్పష్టం చేసింది. 1966లో ఉన్న ఆంధ్రప్రదేశ్ హిందూ ధార్మిక సంస్థలు, ధర్మాదాయ చట్టం కింద వంశపారంపర్య ధర్మకర్తలుగా, వారి కుటుంబ సభ్యులుగా గుర్తింపు పొందని వ్యక్తి తనను ట్రస్టీగా గుర్తించాలని 1987 చట్టం కింద సమర్థాధికారి (కాంపిటెంట్ అథారిటీ)ని ఆశ్రయించజాలడని తేల్చి చెప్పింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ సి.వి.నాగార్జునరెడ్డి నేతృత్వంలోని హైకోర్టు ధర్మాసనం ఇటీవల తీర్పు ఇచ్చింది. అలాగే.. 1987 చట్టం కింద ఓ వ్యక్తి ఒకసారి వంశపారంపర్య ధర్మకర్తగా గుర్తింపు పొందితే, అతని తర్వాత అతని కుటుంబ సభ్యులు తిరిగి గుర్తింపు కోసం సమర్థాధికారిని ఆశ్రయించాల్సిన అవసరం లేదని కూడా ధర్మాసనం పేర్కొంది. 1987 చట్టం వచ్చిన తరువాత ఏర్పాటైన హిందూ ధార్మిక సంస్థలు, దేవాలయాల విషయంలో మాత్రం ఓ వ్యక్తి తనను వ్యవస్థాపకునిగా లేదా వ్యవస్థాపకుని కుటుంబ సభ్యునిగా గుర్తించాలని సమర్థాధికారిని ఆశ్రయించవచ్చునని తేల్చి చెప్పింది. ఇందుకు సంబంధించిన వ్యవహారాలను మాత్రమే ట్రిబ్యునల్ విచారించాలని స్పష్టంచేసింది. గుంటూరు జిల్లా పామిడిపాడు అగ్రహారం గ్రామంలోని శ్రీ వల్లభరాయేశ్వర స్వామి దేవస్థానాన్ని తమ పూర్వీకులు తమ సొంత భూమిలో నిర్మించారని, అందువల్ల ఆ దేవస్థానం వ్యవస్థాపకుల కుటుంబ సభ్యునిగా తనను గుర్తించాలని కోరుతూ బెల్లంకొండ వెంకట సుబ్రహ్మణ్యశర్మ దేవాదాయ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించారు. ట్రిబ్యునల్ అందుకు సమ్మతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులను సవాలు చేస్తూ ఆలయ మేనేజింగ్ ట్రస్టీగా వ్యవహరించిన జలసూత్రం వెంకట సుబ్బయ్య హైకోర్టును ఆశ్రయించగా ట్రిబ్యునల్ ఉత్తర్వులను తప్పుపడుతూ తాజా తీర్పు వెలువరించింది. -
వడదెబ్బకు ఐదుగురి మృతి
అనుమసముద్రంపేట, న్యూస్‌లైన్ : మండలంలోని పెద్దఅబ్బీపురం గ్రా మానికి చెందిన ఆలూరు లక్ష్మీనరస మ్మ (70) వడదెబ్బకు గురై బుధవారం రాత్రి మృతి చెందింది. మృతురాలి కు మారుడు వెంకట సుబ్బయ్య కథనం మేరకు... బుధవారం తీవ్ర అస్వస్థతకు గురైన ఆమెకు స్థానికంగా వైద్యం సేవలందించారు. అర్ధరాత్రి దాటిన తరువాత మరోసారి తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో వైద్యశాలకు తరలించేం దుకు ప్రయత్నిస్తుండగా ప్రాణాలొదిలింది. జలదంకి: జలదంకిలో వడదెబ్బకు గురై అరవ సుబ్బారెడ్డి (80) గురువారం మృతి చెందాడు. సుబ్బారెడ్డిది చేజర్ల కాగా ఇటీవల జలదంకిలోని కుమార్తె ఇంటికి వచ్చాడు. స్థానిక పద్మావతి కల్యాణ మండపంలోని వివాహానికి వెళ్లి మధ్యాహ్నం భోజనం చేసి తిరిగి ఇంటికి వస్తుండగా మార్గమధ్యంలో వడదెబ్బకు గురై సొమ్మసిల్లి పడిపోయి అక్కడికక్కడే మృతి చెందాడు. గమనించిన గ్రామస్తులు మృతదేహాన్ని అతని కుమార్తె ఇంటికి తరలించారు. అనంతరం సుబ్బారెడ్డి మృతదేహాన్ని స్వగ్రామమైన చేజర్లకు తీసుకెళ్లారు. ఇందుకూరుపేట: గంగపట్నం గ్రామానికి చెందిన సోప్రాల రమణమ్మ(72) వడదెబ్బకు గురై బుధవారం రాత్రి మృతి చెందింది. అధిక ఉష్ణోగ్రతలతో వడగాలులకు తట్టుకోలేక ఆమె తీవ్ర అస్వస్థతకు గురైంది. ఇది గమనించిన కుమారుడు బాబు వైద్య సేవలందించారు. అయినా ఫలితం లేక రమణమ్మ మృతి చెందింది. యాచకుడి మృతి పొదలకూరు : వేసవి తాపానికి తట్టుకోలేక వడదెబ్బకు గురై గుర్తు తెలియని యాచకుడు(45) గురువారం పొదలకూరులో మృతి చెందాడు. స్థానిక రామనగర్గేటు సెంటరులో భిక్షాటన చేసే వ్యక్తి అక్కడే బస్‌షెల్టర్‌లో తలదాచుకుంటాడు. ఈ క్రమంలో వేసవితాపానికి తాళలేక తుదిశ్వాస విడిచాడు. మృతుడి వివరాలు తెలియరాలేదు. ఎస్సై ఎం అంజిరెడ్డి సంఘటనా స్థలానికి వెళ్లి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. వేటకెళ్లొచ్చి... చిల్లకూరు: మండలంలోని గుమ్మళ్లదిబ్బలో గురువారం సాయంత్రం స్థా నికుడు పోలంగారి శ్రీరాములు(47) వడదెబ్బకు గురై మృతిచెందాడు. చేపల వేటకు వెళ్లొచ్చిన శ్రీరాములు ఎండతీవ్రతకు అస్వస్థతకు గురయ్యాడు. బంధువులు ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు.