వైఎస్సార్ కడప: బద్వేల్ శాసన సభ్యులు డాక్టర్ వెంకట సుబ్బయ్య అంత్యక్రియలు ముగిశాయి. అధికార లాంఛనాలతో ఎమ్మెల్యే అంత్యక్రియలు జరిగాయి. ఆయన అంత్యక్రియల్లో పెద్ద ఎత్తున పాల్గొన్న వైఎస్ఆర్‌సీపీ శ్రేణులు పాల్గొన్నారు. ముందుగా ఎమ్మెల్యే నివాసం ఉంటున్న కో ఆపరేటివ్ కాలనీలోని వందన అపార్ట్‌మెంట్ నుంచి అంతిమయాత్ర మొదలైంది. ఈ అంతిమయాత్ర ఇందిరానగర్ సమీపంలోని నర్సింగ్ కాలేజీ పక్కనున్న ఎమ్మెల్యే వ్యవసాయ పొలం వరకు సాగింది. ఎమ్మెల్యే మృతికి సంతాపంగా పోలీసులు మూడు రౌండ్లు గాల్లోకి కాల్పులు నిర్వహించారు. ఎమ్యెల్యే అంత్యక్రియలకు డిప్యూటీ సీఎం అంజాద్ బాషా, ఎమ్మెల్యేలు రఘురామిరెడ్డి, సుధీర్ రెడ్డి, అన్నా రాంబాబు, మేయర్ సురేష్ బాబు, రాజంపేట పార్లమెంట్ అధ్యక్షుడు ఆకెపాటి అమర్నాథ్‌రెడ్డి, ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు, జిల్లా కలెక్టర్ హరికిరణ్, ఎస్పీ అన్బురాజన్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment