badvel mla
-
సీఎం జగన్‌ను కలిసిన బద్వేలు ఎమ్మెల్యే సుధ
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను బద్వేలు ఎమ్మెల్యే డాక్టర్ దాసరి సుధ బుధవారం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా బద్వేలు ఉప ఎన్నికలో ఘన విజయం సాధించిన సుధతో పాటు ఎంపీ అవినాష్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి, వైఎస్సార్సీపీ నేతలను సీఎం అభినందించారు. అనంతరం డాక్టర్ సుధ మీడియాతో మాట్లాడారు. ఎమ్మెల్యే పదవిని ఒక బాధ్యతగా భావించి.. ప్రజా శ్రేయస్సు కోసం అహర్నిశలు శ్రమిస్తానని చెప్పారు. సీఎం జగన్ తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయనన్నారు. బద్వేలు చరిత్రలో ఇప్పటివరకు ఎవరికీ రాని గొప్ప మెజార్టీని అందించిన ప్రజలకు రుణ పడి ఉంటానన్నారు. సీఎం వైఎస్ జగన్ గతంలో బద్వేలు అభివృద్ధికి నిధులు ప్రకటించారని, ఎన్నికల కోడ్ వల్ల ఆ పనులు పూర్తి కాలేదన్నారు. వాటిని త్వరితగతిన పూర్తి చేస్తానని చెప్పారు. తన విజయానికి కారకులైన ఎంపీ అవినాష్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డితో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నాయకులు, కార్యకర్తలు ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. -
ముగిసిన ఎమ్మెల్యే వెంకట సుబ్బయ్య అంత్యక్రియలు
వైఎస్సార్ కడప: బద్వేల్ శాసన సభ్యులు డాక్టర్ వెంకట సుబ్బయ్య అంత్యక్రియలు ముగిశాయి. అధికార లాంఛనాలతో ఎమ్మెల్యే అంత్యక్రియలు జరిగాయి. ఆయన అంత్యక్రియల్లో పెద్ద ఎత్తున పాల్గొన్న వైఎస్ఆర్సీపీ శ్రేణులు పాల్గొన్నారు. ముందుగా ఎమ్మెల్యే నివాసం ఉంటున్న కో ఆపరేటివ్ కాలనీలోని వందన అపార్ట్మెంట్ నుంచి అంతిమయాత్ర మొదలైంది. ఈ అంతిమయాత్ర ఇందిరానగర్ సమీపంలోని నర్సింగ్ కాలేజీ పక్కనున్న ఎమ్మెల్యే వ్యవసాయ పొలం వరకు సాగింది. ఎమ్మెల్యే మృతికి సంతాపంగా పోలీసులు మూడు రౌండ్లు గాల్లోకి కాల్పులు నిర్వహించారు. ఎమ్యెల్యే అంత్యక్రియలకు డిప్యూటీ సీఎం అంజాద్ బాషా, ఎమ్మెల్యేలు రఘురామిరెడ్డి, సుధీర్ రెడ్డి, అన్నా రాంబాబు, మేయర్ సురేష్ బాబు, రాజంపేట పార్లమెంట్ అధ్యక్షుడు ఆకెపాటి అమర్నాథ్రెడ్డి, ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు, జిల్లా కలెక్టర్ హరికిరణ్, ఎస్పీ అన్బురాజన్ పాల్గొన్నారు. చదవండి: విశాఖ మహిళా కార్పొరేటర్ కారుపై దాడి -
వెంకట సుబ్బయ్య పార్థివదేహానికి సీఎం జగన్ నివాళి
సాక్షి, వైఎస్సార్ జిల్లా: అనారోగ్యంతో మృతి చెందిన బద్వేలు ఎమ్మెల్యే వెంకట సుబ్బయ్య పార్థివదేహానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నివాళులర్పించారు. ఆదివారం సాయంత్రం కడపలో ఎమ్మెల్యే వెంకట సుబ్బయ్య నివాసానికి చేరుకున్న సీఎం.. ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి.. తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే డాక్టర్ వెంకట సుబ్బయ్య గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆయన కడపలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పోందుతూ ఆదివారం ఉదయం కన్నుమూశారు. ఎమ్మెల్యే వెంకట సుబ్యయ్యకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. సోమవారం ఉదయం కడపలో ప్రభుత్వ లాంఛనాలతో వెంకట సుబ్బయ్య అంత్యక్రియలు జరపనున్నారు. చదవండి: వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే కన్నుమూత మహిళలే టార్గెట్: పరిచయాలు పెంచుకుని.. -
వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే కన్నుమూత
-
వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే కన్నుమూత
సాక్షి, వైఎస్సార్‌కడప: వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే డాక్టర్ వెంకట సుబ్బయ్య మృతి చెందారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన కడపలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పోందుతూ ఆదివారం ఉదయం కన్నుమూశారు. ఎమ్మెల్యే వెంకట సుబ్యయ్యకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. వెంకట సుబ్బయ్య మృతి పట్ల వైఎస్సార్సీపీ నేతలు, అభిమానులు సంతాపం తెలిపారు. ప్రజల సందర్శనార్థం వెంకట సుబ్బయ్య పార్థివదేహాన్ని బద్వేల్ మార్కెట్ యార్డ్‌లో ఉంచారు. ఆదివారం సాయంత్రం కడపలోని ఆయన నివాసానికి వెంకట సుబ్బయ్య పార్థివ దేహాన్ని తరలించనున్నారు. సోమవారం ఉదయం కడపలో ప్రభుత్వ లాంఛనాలతో వెంటక సుబ్బయ్య అంత్యక్రియలు జరపనున్నారు. 1960లో జన్మించిన వెంకట సుబ్బయ్య ఆర్థోపెడిక్ సర్జన్‌గా ప్రజలకు సేవలందించారు. 2016లో ఆయన బద్వేల్ వైఎస్సార్సీపీ కో-ఆర్డినేటర్‌గా పనిచేశారు. 2019లో తొలిసారిగా డాక్టర్ వెంకట సుబ్బయ్య ఎమ్మెల్యేగా గెలుపొందారు. టీడీపీ అభ్యర్థి డాక్టర్ ఓబులాపురం రాజశేఖర్‌పై 44 వేల పైచిలుకు ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. కడపకు సీఎం జగన్: మధ్యాహ్నం 3గంటలకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి కడప వెళ్లనున్నారు. ఆదివారం మృతి చెందిన బద్వేల్ ఎమ్మెల్యే వెంకట సుబ్బయ్య కుటుంబాన్ని సీఎం జగన్ పరామర్శించనున్నారు. కడప ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా ఎమ్మెల్యే వెంకట సుబ్బయ్య కుటుంబం వద్దకు వెళుతారు. పరామర్శ అనంతరం తిరిగి తాడేపల్లి చేరుకోనున్నారు. ప్రముఖుల సంతాపం: ►వైద్యుడిగా, ఎమ్మెల్యేగా వెంకట సుబ్బయ్య సేవలు చిరస్మరణీయమని ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్‌రెడ్డి గుర్తు చేసుకున్నారు. ఎమ్మెల్యే కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో డాక్టర్ వెంకట సుబ్బయ్య కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గం నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున ఎమ్మెల్యేగా గెలుపొందారు. ►ఎమ్మెల్యే డాక్టర్ వెంకటసుబ్బయ్య మృతిపై రాష్ట్ర విద్యాశాఖ మంత్రి, కడప ఇంచార్జ్ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. వెంకట సుబ్బయ్య మృతి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి తీరనిలోటు అని తెలిపారు. వెంకట సుబ్బయ్య కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. వైఎస్సార్సీపీ వెంకట సుబ్బయ్య కుటుంబానికి అండగా ఉంటుందని మంత్రి చెప్పారు. ►ఎమ్మెల్యే వెంకట సుబ్బయ్య మృతి అత్యంత బాధాకరమని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. 2014లో వైఎస్సార్సీపీ ద్వారానే వెంకట సుబ్బయ్య రాజకీయ రంగప్రవేశం చేశారని గుర్తు చేసుకున్నారు. పార్టీలో చాలా క్రియాశీలకంగా ఉండేవారు అని చెప్పారు. 2019 ఎన్నికల్లో తొలిసారి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొందారని పేర్కొన్నారు. వెంకట సుబ్బయ్య ఆత్మకు శాంతి కలగేలా భగవంతున్ని ప్రార్థిస్తున్నాని ఆళ్ల నాని పేర్కొన్నారు. వెంకట సుబ్బయ్య కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. -
అభివృద్ధి పేరుతో ప్రజలకు వెన్నుపోటు పొడిచారు
-
ఎమ్మెల్యే జేబు కట్ చేసిన దొంగల అరెస్టు
తిరుపతి క్రైం: బద్వేల్ ఎమ్మెల్యే జేబు కట్ చేసిన దొంగలను మంగళవారం క్రైం పోలీసులు అరెస్టు చేసినట్టు క్రైం ఏఏస్పీ సుబ్బారెడ్డి తెలిపారు. ఆయన కథనం మేరకు.. మే 27 నుంచి 29వతేదీ వరకు నిర్వహించిన మహానాడులో బద్వేల్ ఎమ్మెల్యే జయరాములు, గుంటూరుకు చెందిన పూనం శ్రీనివాసరెడ్డి పర్సులను గుర్తు తెలియని వ్యక్తులు చోరీ చేశారు. అందులో రూ.95 వేలు ఉన్నట్టు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. డీఎస్పీ కొండారెడ్డి, సీసీఎస్ స్పెషల్ పార్టీ పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ప్రకాశం జిల్లా విజిలిపేట చీరాలకు చెందిన గరికప్రసాద్ (38), గుంటూరు జిల్లా తాడేపల్లి కొత్తూరుకు చెందిన సముద్రాల కృష్ణారావును కరకంబాడి రోడ్డులోని లెప్రసీ ఆస్పత్రి వద్ద మంగళవారం మధ్యాహ్నం 12.30 గంటల ప్రాంతంలో అరెస్టు చేశారు. విచారణలో వారు మహానాడులో కార్యకర్తల్లా తిరుగుతూ పిట్పాకెట్ చేసినట్టు అంగీకరించినట్టు ఏఎస్పీ సుబ్బారెడ్డి తెలిపారు. వారి నుంచి రూ.95 వేల నగదును స్వాధీనం చేసుకున్నామన్నారు. నిందితులు పాతనేరస్తులని పేర్కొన్నారు. వీరిని పట్టుకోవడంలో కృషి చేసిన ఎస్ఐలు ప్రభాకర్‌రెడ్డి, ఆశీర్వాదం, రామ్మూర్తి, సిబ్బంది సుధాకర్, మునిరాజ, కత్తుల గోపికృష్ణ, బారుషా, మురళికి ఏఎస్పీ రివార్డులు అందజేశారు. -
వీఐపీ రిపోర్టర్ : ఎమ్మెల్యే జయరాములు