
సీఎం జగన్‌కు పుష్పగుచ్ఛం అందిస్తున్న ఎమ్మెల్యే సుధ. చిత్రంలో ఎంపీ అవినాష్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను బద్వేలు ఎమ్మెల్యే డాక్టర్ దాసరి సుధ బుధవారం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా బద్వేలు ఉప ఎన్నికలో ఘన విజయం సాధించిన సుధతో పాటు ఎంపీ అవినాష్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి, వైఎస్సార్‌సీపీ నేతలను సీఎం అభినందించారు. అనంతరం డాక్టర్ సుధ మీడియాతో మాట్లాడారు. ఎమ్మెల్యే పదవిని ఒక బాధ్యతగా భావించి.. ప్రజా శ్రేయస్సు కోసం అహర్నిశలు శ్రమిస్తానని చెప్పారు. సీఎం జగన్ తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయనన్నారు.
బద్వేలు చరిత్రలో ఇప్పటివరకు ఎవరికీ రాని గొప్ప మెజార్టీని అందించిన ప్రజలకు రుణ పడి ఉంటానన్నారు. సీఎం వైఎస్ జగన్ గతంలో బద్వేలు అభివృద్ధికి నిధులు ప్రకటించారని, ఎన్నికల కోడ్ వల్ల ఆ పనులు పూర్తి కాలేదన్నారు. వాటిని త్వరితగతిన పూర్తి చేస్తానని చెప్పారు. తన విజయానికి కారకులైన ఎంపీ అవినాష్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డితో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నాయకులు, కార్యకర్తలు ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment