Dasari Sudha
-
బద్వేల్ బాధిత కుటుంబానికి వైఎస్సార్సీపీ నేతల పరామర్శ
సాక్షి, వైఎస్సార్: ఏపీలో అసలు శాంతి భద్రతలు ఉన్నాయా? అని ప్రశ్నించారు వైఎస్సార్సీపీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి. మహిళల రక్షణ విషయంలో కూటమి ప్రభుత్వం పూర్తి నిర్లక్ష్యం వహిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అఘాయిత్యాల కారణంగా ఆడపిల్లలున్న ప్రతీ తల్లిదండ్రులు బాధపడుతున్నారని అన్నారు.బద్వేల్లో ప్రేమోన్మాది చేతిలో హత్యకు గురైన విద్యార్థిని కుటుంబ సభ్యులను కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, ఎమ్మెల్యే డాక్టర్ దాసరి సుధ, ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి సోమవారం ఉదయం పరామర్శించారు. ఈ క్రమంలో బాధిత కుటుంబానికి అండగా ఉంటామని నేతలు భరోసా ఇచ్చారు. ఈ సందర్బంగా ఎంపీ అనినాష్ రెడ్డి మాట్లాడుతూ.. ఈ ఘటన మాటల్లో చెప్పలేని అమానుషం. ఈ దారుణంపై ఆడ పిల్లలున్న ప్రతి తల్లిదండ్రులు బాధపడుతున్నారు. 2021లో ఇలాంటి ఘటన గుంటూరులో జరిగినప్పుడు కొద్ది రోజుల్లోనే కన్విక్ట్ చేశారు. ఈ నాలుగు మాసాల్లో ఇలాంటి 74 ఘటనలు జరిగితే ఈ ప్రభుత్వం ఏం చేస్తోంది?.ఏపీలో అసలు శాంతి భద్రతలు ఉన్నాయా?. రాష్ట్ర హోంమంత్రి అనిత అన్నీ చోట్ల సెక్యూరిటీ ఇవ్వలేం కదా అంటూ వెటకారంగా మాట్లాడుతున్నారు. ఈ విద్యార్థిని 10వ తరగతిలో స్కూల్ ఫస్ట్.. అలాంటి అమ్మాయి చనిపోవడం బాధాకరం. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం మొద్దు నిద్ర నుంచి మేల్కోవాలి. దిశా చట్టం, యాప్ అమలు చేసి ఉంటే పది నిమిషాల్లో పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లేవారు. ఈ ప్రభుత్వం దాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసింది. మహిళల రక్షణ విషయంలో ఈ ప్రభుత్వం పూర్తి నిర్లక్ష్యం వహించింది. సమాజం భయపడేలా కఠిన శిక్ష ఉండాలని ఆ తల్లి కోరుతోంది’ అని చెప్పారు. బద్వేల్ ఎమ్మెల్యే డాక్టర్ దాసరి సుధ మాట్లాడుతూ..‘మన రాష్ట్రంలో మహిళలపై ఇంత దారుణాలు జరుగుతుంటే మహిళా హోం మంత్రి ఏం చేస్తున్నారు?. దీంట్లో రాజకీయాలకు తావు లేదు.. గట్టి చర్యలు తీసుకోవాలి. నా బిడ్డ చనిపోయినట్లు మరొకరు చనిపోరని నమ్మకం ఏంటి అని ఆ తల్లి ప్రశ్నిస్తోంది. ఆమెకు ఈ ప్రభుత్వం ఏం సమాధానం చెబుతుంది?. బాధిత కుటుంబానికి న్యాయం జరిగే వరకూ పోరాటం చేస్తాం’ అని కామెంట్స్ చేశారు. -
షర్మిల వ్యాఖ్యలపై దాసరి సుధా ఫైర్
-
చంద్రబాబుకు నిరసన సెగ.. నల్ల జెండాలతో గోబ్యాక్ అంటూ..
సాక్షి, వైఎస్సార్ జిల్లా: టీడీపీ అధినేత చంద్రబాబుకు బద్వేలులో నిరసన సెగ తగిలింది. నల్ల బ్యాడ్జీలు, నల్ల జెండాలతో చంద్రబాబు కాన్వాయ్ వెళ్లే మార్గంలో గోబ్యాక్ అంటూ నిరసనలు తెలిపారు. వివరాల ప్రకారం.. బద్వేలు పర్యటన వేళ చంద్రబాబుకు నిరసన సెగ ఎదురైంది. ఎమ్మెల్యే దాసరి సుధా ఆధ్వర్యంలో దళిత నేతలు నిరసనకు దిగారు. దళితులను అవమానించిన చంద్రబాబు, నారా లోకేష్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ సందర్బంగా నల్ల బ్యాడ్జీలు, నల్ల జెండాలతో కాన్వాయ్ వెళ్లే మార్గంలో నిరసనలు చెప్పారు. చంద్రబాబు గోబ్యాక్ అంటూ నల్ల జెండాలతో దళిత నేతలు నిరసనలు తెలిపారు. క్షమాపణ చెప్పిన తర్వాతే చంద్రబాబు బద్వేల్ రావాలని డిమాండ్ చేశారు. ఇది కూడా చదవండి: అమ్మ ఒడి పథకం చాలా మంచిది: టీడీపీ ఎమ్మెల్యే ప్రశంసలు -
సీఎం జగన్ బర్త్‌డే: బద్వేలును రెవెన్యూ డివిజన్‌గా కేటాయిస్తూ జీవో విడుదల..
సాక్షి, వైఎస్సార్ కడప: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రెడ్డి పుట్టిన రోజు సందర్భంగా బద్వేలుకు సీఎం జగన్ కానుక అందించారు. బద్వేల్‌ను రెవెన్యూ డివిజన్‌గా కేటాయిస్తూ జీవో విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి, ఎమ్మెల్యే డాక్టర్ దాసరి సుధకు బద్వేలు నియోజకవర్గ ప్రజలు ధన్యవాదాలు తెలిపారు. కాగా ఈ ఏడాది జూలైలో బద్వేలు పర్యటనకు వచ్చిన సీఎం జగన్ బద్వేల్‌కు రెవెన్యూ డివిజన్ మంజూరు చేస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. ఇచ్చిన మాట ప్రకారం బద్వేలను రెవెన్యూ డివిజన్‌గా కేటాయిస్తూ మంగళవారం జీవో విడుదల చేశారు. -
సీఎం జగన్ వల్లే మహిళా సాధికారత
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో మహిళా సాధికారత సీఎం జగన్ వల్లే సాధ్యమవుతోందని పలువురు మహిళా ఎమ్మెల్యేలు తెలిపారు. ప్రతి అడుగులోనూ సీఎం వైఎస్ జగన్ మహిళలకు ఓ అన్నలా అండగా నిలబడుతున్నారని కొనియాడారు. గురువారం అసెంబ్లీలో ‘మహిళా సాధికారత’ అంశంపై జరిగిన చర్చలో మహిళా ఎమ్మెల్యేలు మాట్లాడారు. చంద్రబాబు మహిళలను నమ్మించి మోసం చేస్తే.. సీఎం జగన్ అడుగడుగునా అండగా నిలబడ్డారన్నారు. కరోనా పరిస్థితుల్లోనూ రాష్ట్రంలో ప్రతి ఇంటిలో పొయ్యి వెలిగిందంటే సీఎం వైఎస్ జగన్ చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలే కారణమని చెప్పారు. ఈ సందర్భంగా మహిళా ఎమ్మెల్యేలు ఏమన్నారంటే.. సామాజిక స్వాతంత్య్రం దిశగా.. మహిళల సంక్షేమం ద్వారానే సామాజిక స్వాతంత్య్రం సాధ్యమని సీఎం వైఎస్ జగన్ నమ్మారు. ఈ దిశగానే వివిధ సంక్షేమ పథకాలను, కార్యక్రమాలను అమలు చేస్తున్నారు. రాష్ట్రంలో మహిళలకు ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా అనేక అవకాశాలు కల్పిస్తున్న మనసున్న మహారాజు ఆయన. – వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఉషశ్రీ చరణ్ సొంతంగా మహిళల ఎదుగుదల కోసం.. మహిళలు సొంతంగా తమ కాళ్ల మీద తామే నిలబడి ఎదగాలని ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోంది. రాష్ట్రంలో ప్రతి మహిళ సీఎం జగన్ తమకు అన్నలా అండగా ఉన్నారన్న ధైర్యంతో ఉన్నారు. – వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే విడదల రజిని ఒకేసారి 30 లక్షల మంది మహిళలకు ఇళ్ల పట్టాలు రాష్ట్రంలో ఇళ్లు లేని పేద కుటుంబాల్లో 30 లక్షల మంది మహిళలకు వారి పేరుతోనే ఇళ్ల పట్టాలిచ్చిన ఘనత సీఎం జగన్ సొంతం. ఆయన మహిళల్లో కొత్త ఆత్మస్థైర్యాన్ని నింపారు. అనేక ఒడిదుడుకులు, కరోనా కష్టాల మధ్య కూడా అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నారు. – వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే, విశ్వాసరాయ కళావతి ఓ వెల్లువలా మహిళా సాధికారత గత రెండున్నరేళ్లుగా మహిళా సాధికారత కోసం ఓ వెల్లువలా, విప్లవంలా అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నారు. అందరికీ ఓ అన్నలా సీఎం వైఎస్ జగన్ నిలబడ్డారు. – వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే డాక్టర్ సుధ ప్రభుత్వం ఇంకా మంచి చేయాలి మహిళల అభివృద్ధికి టీడీపీ ఎంతో కృషి చేసింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం కూడా కొన్ని మంచి పనులు చేస్తోంది. అవి మహిళలకు అందుతున్నాయి. ఈ ప్రభుత్వం ఇంకా మంచి బాగా చేయాలి. మద్యపాన నిషేదాన్ని పూర్తిగా చేయాలి. – టీడీపీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ చంద్రబాబు మహిళలకు శఠగోపం పెట్టారు.. 2014 అసెంబ్లీ ఎన్నికలప్పుడు డ్వాక్రా రుణాలన్నీ మాఫీ చేస్తానని చెప్పి అధికారంలోకి వచ్చాక చంద్రబాబు మహిళలకు ఎలా శఠగోపం పెట్టాడో చూశాం. మహిళలకు ఆకాశమంత అండగా సీఎం వైఎస్ జగన్ ఉంటున్నారు. ఆయన చేపడుతున్న అభివృద్ధి పనులకు చంద్రబాబు ఆటంకాలు సృష్టించాలని చూస్తే అడ్రస్ లేకుండా పోవడం ఖాయం. – వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి బెల్టుషాపులను తొలగించారు.. వైఎస్ జగన్ ముఖ్యమంత్రి కాగానే 43 వేల బెల్ట్‌షాపులను తొలగించారు. అక్రమ మద్యం అమ్మకాలను నిర్మూలించడానికి సచివాలయాల్లో ప్రత్యేకంగా మహిళా సంరక్షణాధికారులను నియమించారు. –వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే కె.శ్రీదేవి మాటల్లో కాకుండా చేతల్లో చూపిన నాయకుడు.. మహిళల అభివృద్ధిని మాటల్లో కాకుండా చేతల్లో చూపిస్తున్న నాయకుడు.. వైఎస్ జగన్. తమకు దేవుడి ఇచ్చిన అన్న జగన్ అని ప్రతి మహిళ చెబుతోంది. కరోనా సంక్షోభ సమయంలో పేదల ఇళ్లల్లో పొయ్యి వెలిగిందంటే దానికి కారణం ఆయనే. – వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి ఇళ్లను టీడీపీ అడ్డుకుంది వైఎస్ జగన్ సీఎంగా బాధ్యతలు చేపట్టాక మద్యం అమ్మకాలు పూర్తిగా తగ్గిపోయాయి. పేదల ఇళ్ల పట్టాలు ఇచ్చి, ఇళ్లను నిర్మిస్తుంటే టీడీపీ అడ్డుకుంది. – వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి దివంగత మాజీ ఎమ్మెల్యేలకు అసెంబ్లీ సంతాపం సాక్షి, అమరావతి: ఇటీవల కాలంలో దివంగతులైన మాజీ శాసనసభ్యులకు ఏపీ అసెంబ్లీ సంతాపం తెలిపింది. ఈ మేరకు ప్రత్యేక సంతాప తీర్మానాన్ని ఆమోదించింది. గురువారం నుంచి ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాల్లో స్పీకర్ తమ్మినేని సీతారాం ఈ తీర్మానాన్ని చదివారు. మాజీ ఎమ్మెల్యేలు ఎం.అబ్దుల్ అజీజ్, ఎ.రామిరెడ్డి, పి.కృష్ణమూర్తి, పి.రంగనాయకులు, వంకా శ్రీనివాసరావు, డాక్టర్ టి.వెంకయ్య, డి.పేరయ్య, పిన్నెల్లి లక్ష్మారెడ్డి, ఎంవీ రమణారెడ్డి, డాక్టర్ ఎస్.పిచ్చిరెడ్డిల మృతికి శాసనసభ సంతాపం ప్రకటిస్తున్నట్లు స్పీకర్ పేర్కొన్నారు. అనంతరం కొద్దిసేపు శాసనసభ మౌనం పాటించి దివంగతులకు నివాళులర్పించింది. బద్వేలు ఎమ్మెల్యేగా దాసరి సుధ ప్రమాణ స్వీకారం సాక్షి, అమరావతి: ‘నాడు మెడిసన్ పరీక్షలు రాసేందుకు పరీక్ష హాల్లోకి వెళ్లే సమయంలో భయపడ్డాను.. మళ్లీ నేడు రాష్ట్ర అసెంబ్లీలోకి అడుగుపెడుతూ అదే విధంగా భయపడ్డాను. ఎమ్మెల్యే అవుతానని అసెంబ్లీకి వస్తానని నేను కలలో కూడా ఊహించలేదు..’ అంటూ కొత్తగా ఎన్నికైన వైఎస్సార్ జిల్లా బద్వేల్ ఎమ్మెల్యే డాక్టర్ దాసరి సుధ ఉద్వేగంతో చెప్పారు. కడప జిల్లా బద్వేలు అసెంబ్లీ స్థానానికి ఇటీవల జరిగిన ఉప ఎన్నికలో విజయం సాధించిన దాసరి సుధ గురువారం అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేశారు. అసెంబ్లీ ప్రారంభం కాగానే శాసన సభాపతి తమ్మినేని సీతారాం ఆమెతో ప్రమాణం చేయించారు. మహిళా సాధికారతపై చర్చలో పాల్గొన్న అనంతరం అసెంబ్లీ లాబీలో మీడియాతో మాట్లాడారు. ‘ప్రమాణ స్వీకారం చేసిన రోజే మాట్లాడే అవకాశం రావటం గొప్ప విషయం’ అని ఎమ్మెల్యే సుధ చెప్పారు. -
అసెంబ్లీలో దాసరి సుధ ప్రమాణ స్వీకారం
-
మహిళా సాధికారతపై స్వల్పకాలిక చర్చ
Live Updates Time: 04:15 Pm ► మహిళా సాధికారతపై స్వల్పకాలిక చర్చలో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మాట్లాడుతూ.. మాది అక్కాచెల్లెమ్మలకు మంచి చేసే ప్రభుత్వమని అన్నారు. అమ్మ ఒడి పథకం ద్వారా అండగా నిలుస్తున్నామని పేర్కొన్నారు. ► రాష్ట్రంలో 61 లక్షా 73 వేల పెన్షన్లు అందిస్తున్నాం. అందులో 36 లక్షల 70వేల మంది మహిళలకు పెన్షన్ ఇస్తున్నామన్నారు. త్వరలోనే ఈబీసీ నేస్తం అనే కొత పథకానికి శ్రీకారం చుడతామని, వచ్చే జనవరి 9 నుంచి ఈబీసీ నేస్తం అమలు చేయనున్నట్లు తెలిపారు. ►కేబినెట్లో మహిళా సాధికారతకు పెద్ద పీట వేయడంతో పాటు చరిత్రలో తొలిసారిగా ఎస్ఈసీగా మహిళను నియమించామన్నారు. మహిళలపై నేరం జరిగిన వెంటనే చర్యలు తీసుకుంటున్నామని, మహిళల భద్రతపై ఇతర రాష్ట్రాలకు ఏపీ ఆదర్శంగా నిలుస్తోందని తెలిపారు. Time: 03:05 Pm ► హోంమంత్రి మేకతోటి సుచరిత మాట్లాడతూ.. నామినేటెడ్ పదవుల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ చట్టాలను చేశామని అన్నారు. గుంటూరులో జరిగిన రమ్య హత్య కేసులో నిందితుడిని 24 గంటల్లో అరెస్టు చేసి ఆరు రోజుల్లో చార్జిషీట్ దాఖలు చేసినట్లు తెలిపారు. ఈ ప్రభుత్వంలో ఎఫ్ఐఆర్లు చాలా వేగంగా నమోదు చేస్తున్నామన్నారు. దిశ చట్టాన్ని కొంత మంది అవహేళన చేస్తూ చట్టానికి సంబంధించిన కాపీలను తగల పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. Time: 02:30 Pm ► మహిళా సాధికారతపై ఎమ్మెల్యే ఉష శ్రీ చరణ్ మాట్లాడుతూ.. అన్ని రంగాల్లో మహిళలు ముందుకు వచ్చేలా సీఎం జగన్ చర్యలు చేపట్టారని అన్నారు. Time: 02:15 PM ► ఏపీ శాసన మండలి సమావేశం రేపటికి వాయిదా పడింది. Time: 01: 55 PM ► మహిళా సాధికారతపై వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే విడదల రజని మాట్లాడుతూ.. సీఎం జగన్ మహిళా పక్షపాతి అని కొనియాడారు. దిశ యాప్ ద్వారా మహిళలకు భద్రత కల్పిస్తున్నారని ఆమె పేర్కొన్నారు. Time: 01:15 PM ► అమ్మ జన్మనిస్తే.. జగనన్న జీవితాన్నిచ్చాడని ఎమ్మెల్యే రోజా అన్నారు. మహిళల తలరాతను మార్చే పథకాలు అమలు చేస్తున్నారని పేర్కొన్నారు. ఇది మహిళా పక్షపాతి ప్రభుత్వమని ఎమ్మెల్యే రోజా తెలిపారు. Time: 12:57 PM ► మహిళా సాధికారతపై నగరి ఎమ్మెల్యే రోజా మాట్లాడుతూ.. గర్భంలో ఉన్న ఆడపిల్ల నుంచి వృద్ధాప్యంలో ఉన్న అవ్వ వరకు.. ప్రతి దశలో మహిళలకు వైఎస్ జగన్ ప్రభుత్వం అండగా ఉంటుందని ఎమ్మెల్యే రోజా అన్నారు. Time: 12:40 Pm ► వైఎస్ఆర్ కాపునేస్తం పథకం ద్వారా ఏటా రూ.75 వేలు, జగనన్న వసతి దీవెన ద్వారా రూ. 2 వేల కోట్ల సాయం లబ్దిదారులకు అందనుందని మంత్రి తానేటి వనిత తెలిపారు. Time: 12: 30 PM ► రుణమాఫీ పథకం వల్ల స్వయం సహాయక సంఘాలకు ఊతం లభిస్తుందని మంత్రి వనిత తెలిపారు. వైఎస్ఆర్ చేయూతతో మహిళల ఆర్థికాభ్యున్నతి సాధ్యమవుతుందని మంత్రి వనిత పేర్కొన్నారు. Time: 12:24 PM ► ఏపీ అసెంబ్లీ సమావేశాలు తిరిగి ప్రారంభమయ్యాయి. సమావేశాల్లో మహిళా సాధికారతపై స్వల్ప కాలిక చర్చ కొనసాగుతోంది. మంత్రి తానేటి వనిత మాట్లాడుతున్నారు. Time: 10:20 AM ► ఏపీ అసెంబ్లీలో రేపు(శుక్రవారం) బీసీ జనగణనపై తీర్మానం చేయనున్నారు. బీసీ జన గణన చేపట్టాలని కేంద్రాన్ని కోరుతూ తీర్మానం చేయనున్నారు. ఈ తీర్మానంను సీఎం వైఎస్ జగన్ ప్రవేశపెట్టనున్నారు. Time: 10: 10 AM ► ఈ నెల 26 వరకు ఏపీ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని బీఏసీ నిర్ణయం తీసుకుంది. Time: 09:50 AM ► అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం ఆధ్వర్యంలో బీఏసీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి సీఎం వైఎస్ జగన్, మంత్రులు బుగ్గన, అనిల్ కుమార్ యాదవ్, కన్నబాబు హాజరు కాగా టీడీపీ నుంచి అచ్చెన్నాయుడు హజరయ్యారు. Time: 09: 09 AM ► ఏపీలో పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలపై అత్యవసరంగా చర్చించాలన్న టీడీపీ వాయిదా తీర్మానాన్ని స్పీకర్ తమ్మినేని సీతారాం తిరస్కరించారు. ► ఇటీవల మరణించిన ఎంఎ అజీజ్, మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి, ముమ్మిడివరం మాజీ ఎమ్మెల్యే కృష్ణమూర్తి, మాజీ ఎమ్మెల్యే రంగనాయకులు, మాజీ ఎమ్మెల్యే టీ.వెంకయ్య, మాజీ ఎమ్మెల్యే వంకా శ్రీనివాసరావు మృతికి ఏపీ అసెంబ్లీ సంతాపం ప్రకటించింది. సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలు ప్రారంభమయ్యాయి. మొదటిగా బద్వేలు ఎమ్మెల్యేగా ఇటీవల గెలిచిన డాక్టర్ దాసరి సుధ ప్రమాణ స్వీకారం చేశారు. గురువారం 14 బిల్లులను అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు. దివంగతులైన 10 మంది మాజీ సభ్యులకు సభ నివాళి అర్పించనున్నారు. మహిళా సాధికారత మీద స్వల్పకాల చర్చ జరగనుంది. -
సీఎం జగన్‌ను కలిసిన బద్వేలు ఎమ్మెల్యే సుధ
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను బద్వేలు ఎమ్మెల్యే డాక్టర్ దాసరి సుధ బుధవారం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా బద్వేలు ఉప ఎన్నికలో ఘన విజయం సాధించిన సుధతో పాటు ఎంపీ అవినాష్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి, వైఎస్సార్సీపీ నేతలను సీఎం అభినందించారు. అనంతరం డాక్టర్ సుధ మీడియాతో మాట్లాడారు. ఎమ్మెల్యే పదవిని ఒక బాధ్యతగా భావించి.. ప్రజా శ్రేయస్సు కోసం అహర్నిశలు శ్రమిస్తానని చెప్పారు. సీఎం జగన్ తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయనన్నారు. బద్వేలు చరిత్రలో ఇప్పటివరకు ఎవరికీ రాని గొప్ప మెజార్టీని అందించిన ప్రజలకు రుణ పడి ఉంటానన్నారు. సీఎం వైఎస్ జగన్ గతంలో బద్వేలు అభివృద్ధికి నిధులు ప్రకటించారని, ఎన్నికల కోడ్ వల్ల ఆ పనులు పూర్తి కాలేదన్నారు. వాటిని త్వరితగతిన పూర్తి చేస్తానని చెప్పారు. తన విజయానికి కారకులైన ఎంపీ అవినాష్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డితో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నాయకులు, కార్యకర్తలు ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. -
సీఎం పాలన వల్లే బంపర్ మెజారిటీ
బద్వేలు: సీఎం వైఎస్ జగన్ హామీలను విశ్వసించి ఇక్కడి ప్రజలు అప్పట్లో తన భర్తకు 45 వేల ఓట్ల మెజారిటీ ఇచ్చారని.. ప్రస్తుత రెండున్నరేళ్ల పాలనలో సీఎం ఆ హామీలను అమలు చేయడం చూసి, ఇప్పుడు అంతకు రెట్టింపు మెజారిటీ ఇచ్చారని వైఎస్సార్ కడప జిల్లా బద్వేలు ఎమ్మెల్యేగా ఎన్నికైన డాక్టర్ దాసరి సుధ అన్నారు. వైఎస్సార్ కడప జిల్లా బద్వేలు అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికలో ఘనవిజయం సాధించిన అనంతరం ఆమె ‘సాక్షి’తో ముచ్చటించారు. ఆ వివరాలు.. సాక్షి: రాజకీయాల్లోకి వస్తానని ఊహించారా? సుధ: మాకు రాజకీయాలు కొత్త. గతంలో కూడా మా కుటుంబీకులెవరూ ఎన్నికల్లో పోటీచేయలేదు. నా భర్త 2019లో వైఎస్సార్సీపీ తరఫున బద్వేలు నుంచి పోటీచేసి ఎమ్మెల్యే అయ్యారు. ఆయన హఠాన్మరణంతో ఆయన సేవను కొనసాగించాలనే ఉద్దేశంతో రాజకీయాల్లోకి వచ్చా. సాక్షి: ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి.. పోరాడడానికి స్ఫూర్తి ఎవరు? సుధ: సీఎం వైఎస్ జగన్ మాటలే నాకు స్ఫూర్తి. భర్త మరణం తరువాత సీఎంగారు పరామర్శకు వచ్చారు. జరిగిన విషాదాన్ని త్వరగా మర్చిపోవాలంటే ప్రజాసేవ ఒకటే మార్గం.. ప్రజలకు మంచి చేస్తే కలిగే సంతృప్తి ముందు విషాదం పెద్ద విషయం కాదు, మీరు పోటీచేయండి.. తోడ్పాటు అందిస్తామని ఉత్సాహపరిచారు. దీంతో తక్కువ సమయంలోనే నిత్యం ప్రజల్లో ఉంటూ ఎన్నికలకు సిద్ధపడ్డా. సాక్షి: ఇంత మెజారిటీ వస్తుందని ఊహించారా? సుధ: తప్పకుండా వస్తుందని అనుకున్నాం. అనుకున్న దానికంటే 5 నుంచి 10 వేలు తక్కువే వచ్చాయి. వర్షాలు పడటంతో చాలామంది ఓటింగ్‌కు రాలేదు. బీజేపీకి 90% ప్రాంతాల్లో ఏజెంట్లు ఉండరనుకున్నాం. కానీ, టీడీపీతో కుమ్మక్కై ప్రలోభాలతో ఆ పార్టీ నేతలను ఏజెంట్లుగా కూర్చోబెట్టారు. బీజేపీకి ఓట్లు వేయాలని టీడీపీ ముఖ్య నేతలు చెప్పడంతోనే కొంత మెజారిటీ తగ్గింది. సాక్షి: బద్వేలుకు ఏం చేయాలనుకుంటున్నారు? సుధ: 4 నెలల కిందట సీఎం వైఎస్ జగన్ బద్వేలు అభివృద్ధికి రూ.700 కోట్లు పైగా నిధులు ప్రకటించారు. ఎన్నికల కోడ్‌తో ఈ పనులు పూర్తికాలేదు. ప్రస్తుతం త్వరితగతిన వీటన్నింటిని పూర్తిచేయడమే లక్ష్యం. బద్వేలు మున్సిపాలిటిలో రోడ్లు, డ్రైనేజీ పనుల పూర్తికి ప్రత్యేక కృషిచేస్తాం. సాక్షి: నియోజకవర్గ అభివృద్ధికి ప్రణాళిక ఉందా? సుధ: నియోజకవర్గంలో సాగునీటి వనరులు ఇప్పటికే వైఎస్ జగన్ ప్రత్యేక శ్రద్ధతో మెరుగయ్యాయి. రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కరికీ ఉపాధి దొరికేలా చూడాలనే ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నా. వ్యవసాయాధారిత పరిశ్రమలతో పాటు ఇతర ఉపాధి మార్గాలను అధ్యయనం చేస్తా. ముంపు వాసుల సమస్యలు పరిష్కరించాలి. సాక్షి: డాక్టర్‌గా వైద్య సేవలను ఎలా మెరుగుపరుస్తారు? సుధ: నా భర్త డాక్టర్ కావడంతో ప్రజల ఆరోగ్యంపై ఆయన ప్రత్యేక దృష్టి సారించేవారు. ప్రా«థమిక ఆరోగ్య కేంద్రాలతో పాటు సీహెచ్‌సీ, సీమాంక్ ఆసుపత్రుల్లో ఉత్తమ వైద్యం అందేలా చూస్తా. డయాలసిస్ రోగులు దూరంగా ఉన్న కడపకు వెళ్లి డయాలసిస్ చేసుకుంటున్నారు. డెల్ కంపెనీ సహకారంతో బద్వేల్‌లోనే డయాలసిస్ యూనిట్ ఏర్పాటుకు కృషిచేస్తా. ఇది నా భర్త మొదలు పెట్టారు. దీన్ని పూర్తిచేసేందుకు చర్యలు చేపడుతున్నా. సాక్షి: మహిళాభివృద్ధికి ఎలా కృషి చేస్తారు? సుధ: యువతకు వృత్తివిద్యా కోర్సులను నేర్పించి స్థానికంగా ఉపాధి లభించేలా చూడాల్సిన అవసరం ఉంది. ఇందుకోసం ప్రభుత్వం ఏర్పాటుచేస్తున్న స్కిల్ డెవలప్మెంట్ కళాశాలను ఉపయోగించుకునేలా చూస్తా. స్థానికంగానే ఉంటూ నిరంతరం యువత, మహిళలతో అనుబంధం పెంచుకుంటూ వారి ఉపాధి అవకాశాలు మెరుగుపరుస్తా. అందరికీ కృతజ్ఞతలు నా విజయానికి తోడ్పడిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు కృతజ్ఞతలు. నియోజకవర్గానికి చెందిన నేతలు, కార్యకర్తలు అందించిన సహకారం మరువలేనిది. వీరంతా నా విజయానికి ఎంతో కష్టపడ్డారు. నా కుటుంబ సభ్యులు సైతం కష్టకాలంలో అండగా నిలిచారు. వీరందరికీ నిత్యం అందుబాటులో ఉంటూ ప్రజాభివృద్ధికి తోడ్పాటు అందిస్తా. -
బద్వేలు బ్లాక్ బస్టర్
సాక్షి ప్రతినిధి, కడప: సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలు నిండు మనసుతో ఆశీర్వదిస్తున్నట్లు మరోసారి రుజువైంది. తాజాగా బద్వేలు ఉప ఎన్నికల ఫలితాలే ఇందుకు నిదర్శనంగా నిలిచాయి. బద్వేలు అసెంబ్లీ స్థానానికి గత నెల 30న పోలింగ్ జరగ్గా మంగళవారం నిర్వహించిన ఓట్ల లెక్కింపులో వైఎస్సార్ సీపీ అభ్యర్థి డాక్టర్ సుధకు రికార్డు స్థాయిలో 90,533 ఓట్ల మెజార్టీ లభించింది. డాక్టర్ సుధకు మొత్తం 1,12,211 ఓట్లు వచ్చాయి. ఈ ఎన్నికల్లో పోటీకి దిగిన బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థులకు డిపాజిట్లు కూడా దక్కలేదు. బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన పణతల సురేష్‌కు 21,678 ఓట్లు రాగా కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో నిలిచిన బద్వేలు మాజీ ఎమ్మెల్యే కమలమ్మకు 6,235 ఓట్లు వచ్చాయి. నోటాకు 3,650 ఓట్లు పడ్డాయి. మిగిలిన 12 మంది అభ్యర్థులకు 3,389 ఓట్లు వచ్చాయి. మూడు చెల్లని ఓట్లు పడ్డాయి. బద్వేలులో మొత్తం 2,15,240 మంది ఓటర్లకుగానూ 1,47,166 మంది ఓటుహక్కు వినియోగించుకున్నారు. పోస్టల్ బ్యాలెట్లతో ఆధిక్యం ఆరంభం మంగళవారం ఉదయం 8.00 గంటలకు బద్వేలులోని బాలయోగి బాలికల గురుకుల పాఠశాలలో ఓట్ల లెక్కింపు చేపట్టారు. తొలుత పోస్టల్ బ్యాలెట్లను లెక్కించగా వైఎస్సార్ సీపీ భారీ ఆధిక్యం సాధించింది. 183 పోస్టల్ బ్యాలెట్లలో 139 ఓట్లు అధికార వైఎస్సార్సీపీ అభ్యర్థికి లభించాయి. బీజేపీ అభ్యర్థికి 17, కాంగ్రెస్ అభ్యర్థికి 18 చొప్పున ఓట్లు వచ్చాయి. అనంతరం ఓట్ల లెక్కింపు చేపట్టగా 9.00 గంటల ప్రాంతంలో తొలి రౌండ్ ఫలితం వెలువడింది. మొదటి రౌండ్లో వైఎస్సార్ సీపీ అభ్యర్థి డాక్టర్ సుధకు 8,790 ఓట్ల ఆధిక్యత లభించింది. ఆ తర్వాత వరుసగా 13 రౌండ్లలోనూ భారీ మెజార్టీ వచ్చింది. తొలుత 12 రౌండ్లలో ఓట్ల లెక్కింపు చేపట్టాలని భావించినా ఒక ఈవీఎం మొరాయించడంతో దానికి సంబంధించి 13వ రౌండ్లో వీవీ ప్యాట్లను లెక్కించారు. దీంతో మొత్తం 13 రౌండ్లలో ఓట్ల లెక్కింపు జరిగింది. ఉదయం 11 గంటలకు ఓట్ల లెక్కింపు ముగిసింది. జిల్లా కలెక్టర్ విజయరామరాజు, బద్వేలు ఉప ఎన్నికల రిటర్నింగ్ అధికారి కేతన్‌గార్గ్‌తోపాటు ఎన్నికల అబ్జర్వర్ల సమక్షంలో భారీ బందోబస్తు మధ్య లెక్కింపు ప్రశాంతంగా పూర్తైంది. రెట్టింపు మెజార్టీతో విజయభేరి బద్వేలులో గత ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ తరపున గెలిచిన దివంగత డాక్టర్ వెంకట సుబ్బయ్యకు 44,734 ఓట్ల మెజార్టీ లభించింది. వెంకట సుబ్బయ్యకు 60.89 శాతం ఓట్లు రాగా టీడీపీ అభ్యర్థి ఓబులాపురం రాజశేఖర్‌కు 32.36 శాతం ఓట్లు వచ్చాయి. 1,56,819 (76 శాతం) ఓట్లు పోల్ అయ్యాయి. ఈ ఎన్నికల్లో 1,47,166 (68.39 శాతం) ఓట్లు మాత్రమే పోలయ్యాయి. గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి దాదాపు 8 శాతం తక్కువగా పోలింగ్ నమోదైనా వైఎస్సార్ సీపీకి గతంలో కంటే రెట్టింపు మెజార్టీ లభించడం గమనార్హం. ఆనందోత్సాహాల్లో వైఎస్సార్ సీపీ శ్రేణులు ఉప ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థి డాక్టర్ సుధ రికార్డు మెజార్టీతో విజయం సాధించడంతో బద్వేలు నియోజకవర్గంతోపాటు రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్ సీపీ శ్రేణులు పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకొన్నాయి. నియోజకవర్గ ప్రజలు ఇచ్చిన తీర్పు చరిత్రాత్మకమని కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, డిప్యూటీ సీఎం ఎస్బీ అంజద్‌బాషా, చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్‌రెడ్డి, ప్రభుత్వ విప్ కొరముట్ల శ్రీనివాసులు, జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హర్షం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం పట్ల ప్రజాదరణకు తాజా ఎన్నికల తీర్పు నిదర్శనమన్నారు. స్వచ్ఛమైన పాలనకు లభించిన విజయం ‘ఇంతటి భారీ విజయాన్ని అందించిన ప్రజలందరికీ కృతజ్ఞతలు. నాడు బద్వేలు ప్రజలు నా భర్త, దివంగత ఎమ్మెల్యే డాక్టర్ వెంకటసుబ్బయ్యకు 44వేల మెజారిటీ ఇస్తే నేడు సీఎం జగన్ నిష్పక్ష పాలన, సామాజిక న్యాయం, మాట మీద నిలబడే తత్వం చూసి నాకు 90 వేల పైచిలుకు మెజారిటీతో విజయం చేకూర్చారు. నిధులు కేటాయించిన పనులన్నింటిని త్వరితగతిన పూర్తి చేస్తాం. నాకు టిక్కెట్ ఇచ్చి పోటీ చేసేందుకు ప్రోత్సాహం అందించిన సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి కృతజ్ఞతలు. నా విజయానికి కృషి చేసిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, జిల్లా ఇన్చార్జి మంత్రి ఆదిమూలపు సురేష్, నియోజకవర్గ ఇన్చార్జి డీసీ గోవిందరెడ్డి, కడప మేయర్ సురేష్‌బాబుకు ప్రత్యేక ధన్యవాదాలు. నా విజయం కోసం అక్క చెల్లెమ్మలు, వైఎస్సార్సీపీ కార్యకర్తలు, నాయకులు కృషి చేశారు. నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేసి వారి రుణం తీర్చుకుంటా’ – డాక్టర్ దాసరి సుధ, బద్వేలు ఉప ఎన్నిక విజేత -
డాక్టర్ దాసరి సుధను అభినందించిన సీఎం జగన్
-
‘బద్వేలు తీర్పు సీఎం జగన్‌పై నమ్మకానికి నిదర్శనం’
తాడేపల్లి: బద్వేలు తీర్పు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిపై నమ్మకానికి నిదర్శనమని ప్రభుత్వవిప్ కోరుముట్ల శ్రీనివాస్ స్పష్టం చేశారు. వైఎస్ జగన్ అందిస్తున్న సంక్షేమం, అభివృద్ధికి ప్రజలకు అండగా నిలుస్తున్నాయని, మేనిఫెస్టోను అమలు చేసి సీఎం జగన్ తన క్రెడిబిలిటీ నిరూపించుకున్నారని ప్రశంసించారు. టీడీపీ కుట్రలు చేసి అలజడి సృష్టించాలనుకున్నా ఏమిచేయలేకపోయారని కోరుముట్ల శ్రీనివాస్ విమర్శించారు. బద్వేల్లో ప్రజలు.. రికార్డు స్థాయిలో దాసరి సుధకు 90 వేల మెజారిటీ ఇచ్చారని అన్నారు. ‘ప్రజలు నైతిక పాలనకు ప్రజలు దివేనలు అందించారు’ కర్నూలు: కరోనా విపత్తులోను.. సీఎం వైఎస్ జగన్ సంక్షేమ పథకాలను అందించారని ఎమ్మెల్యే హాఫిజ్ ఖాన్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతిపక్షాలు కావాలనే వైఎస్ జగన్ పాలనపై పనిగట్టుకుని బురద జల్లుతున్నాయన్నారు. రెండు సంవత్సరాలుగా ప్రతి పక్షనేతలు.. ప్రాంతాల మధ్య, కులాల మధ్య విద్వేషాలు సృష్టిస్తున్నారని పేర్కొన్నారు.బద్వేలు ఎన్నికల్లో టీడీపీ హైడ్రామాలు ఆడిందని ఎమ్మెల్యే హాఫిజ్ ఖాన్ విమర్శించారు. నైతికంగా సుపరిపాలన అందిస్తున్న.. వైఎస్ జగన్ పాలనకు ప్రజలు దివెనలు అందించారని ఎమ్మెల్యే హాఫిజ్ ఖాన్ తెలిపారు. -
డాక్టర్ దాసరి సుధను అభినందించిన సీఎం జగన్
అమరావతి: బద్వేలు అసెంబ్లీ ఉప ఎన్నికలో ఘన విజయం సాధించిన డాక్టర్ దాసరి సుధను సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అభినందించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. ‘‘బద్వేలు అసెంబ్లీ ఉపఎన్నికలో అఖండ విజయాన్ని అందించిన ప్రతి అక్కచెల్లెమ్మకు, అవ్వాతాతకు, ప్రతి ఆత్మీయ సోదరునికి పేరుపేరునా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. శాసనసభ్యురాలిగా గెలుపొందిన డా. సుధమ్మకు నా అభినందనలు’’ అన్నారు సీఎం జగన్. బద్వేలు అసెంబ్లీ ఉపఎన్నికలో అఖండ విజయాన్ని అందించిన ప్రతి అక్కచెల్లెమ్మకు, అవ్వాతాతకు, ప్రతి ఆత్మీయ సోదరునికి పేరుపేరునా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. శాసనసభ్యురాలిగా గెలుపొందిన డా. సుధమ్మకు నా అభినందనలు. 1/2 — YS Jagan Mohan Reddy (@ysjagan) November 2, 2021 ‘‘దేవుడి దయ, మీ అందరి చల్లని దీవెనల వల్లే ఇంతటి ఘన విజయం సాధ్యమైంది. ఈ గెలుపు ప్రజాప్రభుత్వానికి, సుపరిపాలనకు మీరిచ్చిన దీవెనలుగా భావిస్తూ.. మరింత మంచి చేసేందుకు కృషి చేస్తాను’’ అని సీఎం జగన్ తెలిపారు. (చదవండి: ‘బద్వేలు తీర్పు సీఎం జగన్‌పై నమ్మకానికి నిదర్శనం’) దేవుడి దయ, మీ అందరి చల్లని దీవెనల వల్లే ఇంతటి ఘన విజయం సాధ్యమైంది. ఈ గెలుపు ప్రజాప్రభుత్వానికి, సుపరిపాలనకు మీరిచ్చిన దీవెనలుగా భావిస్తూ.. మరింత మంచి చేసేందుకు కృషి చేస్తాను. 2/2 — YS Jagan Mohan Reddy (@ysjagan) November 2, 2021 బద్వేల్ ఉప ఎన్నికలో భారీ విజయం నేపథ్యంలో మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బాలినేని శ్రీనివాసరెడ్డి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంలో మంగళవారం సీఎం జగన్‌ని కలిశారు. అలానే చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి, విప్ కొరుముట్ల శ్రీనివాసులు కూడా సీఎం జగన్‌ని కలిశారు. చదవండి: ‘90 వేలకు పైగా మెజారిటీ ఇచ్చిన ప్రజలకు పాదాభివందనం’ చదవండి: అవార్డు గ్రహీత వీల్‌చైర్ ఫుట్‌స్టెప్స్‌ని సరి చేసిన సీఎం జగన్ -
ఇంతటి ఘన విజయాన్ని అందించిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు
-
పోలింగ్ ప్రశాంతంగా జరుగుతుంది: దాసరి సుధ
-
Badvel Bypoll: ముగిసిన ఉప ఎన్నిక పోలింగ్
బద్వేలు ఉపఎన్నికల్లో రాత్రి 7.00 గంటల వరకు 68.12 శాతం పోలింగ్ నమోదయ్యింది. Time: 7:00 PM: బద్వేల్ ఉప ఎన్నిక పోలింగ్ ముసిగింది. క్యూలైన్లో ఉన్న వారికి ఓటు వేసే అవకాశం కల్పించారు. సాయంత్ర ఐదు గంటల వరకు బద్వేల్లో 59.58 శాతం పోలింగ్ నమోదయ్యింది. 281 కేంద్రాల్లో పోలింగ్ కొనసాగింది. Time: 5:00 PM: బద్వేల్ ఉప ఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. సాయంత్రం 5 గంటల వరకు బద్వేల్లో 59.58 శాతం పోలింగ్ నమోదయ్యింది. రాత్రి 7 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. Time: 3:00 PM: బద్వేల్ ఉప ఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. మధ్యాహ్నం 3 గంటల వరకు బద్వేల్లో 44.82 శాతం పోలింగ్ నమోదయ్యింది. Time: 12:40 PM:బద్వేల్ ఉప ఎన్నికను వెబ్‌కాస్టింగ్ ద్వారా పర్యవేక్షిస్తున్నారు సీఈఓ విజాయనంద్. రాష్ట్ర ఎన్నికల ప్రధాన కార్యాలయం నుంచి విజయానంద్ పర్యవేక్షిస్తున్నారు. బద్వేల్ ఉప ఎన్నిక ప్రశాంతంగా జరుగుతుంది అన్నారు. ఇప్పటివరకు ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదని తెలిపారు. దొంగ ఓటర్లను తరలిస్తున్నారన్నది అబద్ధం అని విజయానంద్ తెలిపారు. Time: 1:14 PM: బద్వేల్ ఉప ఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. మధ్యాహ్నం ఒంటిగంట వరకు 35.47 శాతం పోలింగ్ నమోదైంది. ఉదయం 9 గంటల వరకు 10.49 శాతం పోలింగ్ నమోదు అవ్వగా, ఉదయం 11 గంటల వరకు 20.89 శాతం పోలింగ్ నమోదైంది. Time: 11:24 AM: బద్వేల్ ఉప ఎన్నికను వెబ్ కాస్టింగ్ ద్వారా రాష్ట్ర ఎన్నికల ప్రధాన కార్యాలయం నుంచి సీఈవో విజయానంద్ పర్యవేక్షిస్తున్నారు. Time: 11:24 AM: బద్వేల్లో ఉప ఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. దొంగ ఓటర్లను తరలిస్తున్నారంటూ కొన్ని ఛానల్లో అవాస్తవ కథనాలు ప్రచారం అవుతున్నాయి. కథనాలపై రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కె.విజయానంద్ స్పందించారు. దొంగ ఓటర్లను తరలిస్తున్నారన్నది అబద్ధమని తెలిపారు. ఇప్పటివరకు అలాంటి ఫిర్యాదులేమీ అందలేదన్నారు. ఎక్కడా పోలింగ్ ఆగలేదని విజయానంద్ స్పష్టం చేశారు. Time: 11:17 AM: ఉదయం 11 గంటల వరకు 20.89 శాతం పోలింగ్ నమోదైంది. Time: 9:32 AM: ఉదయం 9 గంటల వరకు 10.49 శాతం పోలింగ్ నమోదైంది. Time: 9:22 AM: బద్వేల్ ఉప ఎన్నిక పోలింగ్ కొనసాగుతోంది. రాత్రి 7 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. ఉదయం 8.30 గంటల వరకు 10 శాతం పోలింగ్ నమోదైంది. Time: 8:16 AM: బద్వేల్లో టీడీపీ కుట్ర రాజకీయాలకు పాల్పడుతోంది. ఎన్నికల్లో పోటీ చేయమంటూనే బీజేపీకి బహిరంగ మద్దతు ఇస్తోంది. బద్వేల్లో చాలాచోట్ల బీజేపీ ఏజెంట్లుగా టీడీపీ నేతలు మారారు. బీజేపీకి దగ్గరవడానికి బద్వేల్ ఎన్నికలను టీడీపీ వాడుకుంటోంది. బీజేపీకి టీడీపీ మద్దతివ్వడంపై టీడీపీ దళిత నేతల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. Time: 8:00 AM: ►బద్వేలు ఉప ఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా సాగుతోంది. ఓటు వేసేందుకు ఓటర్లు బారులు తీరారు. ►కరోనా పేషెంట్లకు సాయంత్రం 6 తర్వాత ఓటు వేసేందుకు అవకాశం ఇచ్చారు. ►బీసీ వెల్ఫేర్ కార్యాలయ పోలింగ్ స్టేషన్‌ను ఏఎస్పీ మహేష్‌కుమార్ పరిశీలించారు. Time: 7:56 AM: బద్వేలు ఉప ఎన్నిక పోలింగ్ కొనసాగుతోంది. ►ఉప ఎన్నిక నేపథ్యంలో కోవిడ్‌ను దృష్టిలో పెట్టుకుని అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. ►ప్రధానంగా రెండు డోసుల టీకా పూర్తయిన వారిని మాత్రమే పోలింగ్ సిబ్బందిగా విధులు నిర్వర్తించేందుకు చర్యలు చేపట్టారు. ►అంతేకాకుండా ఏజెంట్లు, సిబ్బంది కూడా కోవిడ్ నిబంధనలు పాటించేలా చర్యలు చేపట్టారు. Time: 7:00 AM: వైఎస్సార్ కడప జిల్లా బద్వేలు అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నిక పోలింగ్ ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. సాయంత్రం 7 గంటల వరకు జరగనుంది. మొత్తం పోలింగ్ ప్రక్రియను వీడియో రికార్డింగ్‌తోపాటు వెబ్‌క్యాస్టింగ్ కూడా చేస్తునట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కె. విజయానంద్ వెల్లడించారు. 2019లో 77.64 శాతం పోలింగ్ 2019 సార్వత్రిక ఎన్నికల్లో బద్వేలు అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి 77.64 శాతం పోలింగ్ నమోదైంది. అప్పట్లో 2,04,618 ఓట్లు ఉండగా 1,58,863 ఓట్లు పోలయ్యాయి. ఇందులో పురుషులు 77,466 మంది, 81,394 మంది మహిళలు, ముగ్గురు ట్రాన్స్జెండర్లు ఓటుహక్కును వినియోగించుకున్నారు. దీంతో 77.64 శాతం నమోదైంది. ప్రస్తుతం బద్వేలు నియోజకవర్గంలోని ఏడు మండలాల్లో 2,15,292 ఓట్లు ఉన్నాయి. అందులో పురుషులు 1,07,915 మంది, మహిళలు 1,07,355 మంది ఉన్నారు. ట్రాన్స్జెండర్లు 22 మంది ఉన్నారు. సమస్యాత్మక కేంద్రాలపై ప్రత్యేక దృష్టి బద్వేలు ఉప ఎన్నికకు సంబంధించి ఎన్నికల అధికారులతోపాటు జిల్లా ఎస్పీ కేకేఎన్ అన్బురాజన్ ఆధ్యర్యంలో మూడు వేల మంది పోలీసు సిబ్బందితో పటిష్ట బందో బస్తు ఏర్పాటు చేశారు. ముఖ్యంగా 221 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించి వాటిపై ప్రత్యేక దృష్టి సారించారు. ఆయా కేంద్రాల వద్ద పటిష్ట భద్రతా చర్యలు చేపట్టారు. అంతేకాకుండా లైవ్ వెబ్‌కాస్టింగ్, వీడియో కెమెరాల ద్వారా చిత్రీకరణ చేస్తున్నారు. ఇద్దరు అదనపు ఎస్పీలతోపాటు 15 మంది డీఎస్పీలు, 50 మంది సీఐలు, 160 మంది ఎస్ఐలు, 320 మంది హెడ్‌కానిస్టేబుల్, ఏఎస్ఐలు, 980 మంది పోలీసు కానిస్టేబుళ్లు, 300 మంది హోం గార్డులు, 15 ప్లాటూన్ల కేంద్ర బలగాలు (960 మంది), 72 రూట్ మొబైల్స్, 36 స్ట్రయికింగ్ ఫోర్స్, 11 స్పెషల్ స్ట్రయికింగ్ ఫోర్స్‌లతో స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు జరిగేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నారు. -
బద్వేలు ఉప ఎన్నికల్లో వార్ వన్‌సైడే: ఎమ్మెల్యే రోజా
బద్వేలు (వైఎస్సార్‌జిల్లా): బద్వేలు ఉప ఎన్నికల్లో ప్రజలు ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయడానికి ఆసక్తి చూపుతున్నారని ఎమ్మెల్యే రోజా అన్నారు. ఈ సందర్భంగా ఆమె ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ.. సంక్షేమ పథకాలతో వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ దూసుకుపోతుందని అన్నారు. బద్వేలు ఉప ఎన్నికల్లో వార్ వన్‌సైడే అని ఎమ్మెల్యే రోజా అన్నారు. గెలుపు కోసం కాదు.. భారీ మెజార్టీ కోసం తాము.. ప్రచారం చేస్తున్నామని అన్నారు. తమ అభ్యర్థి దాసరి సుధను భారీ మెజార్టీతో గెలిపించాలని రోజా కోరారు. కాగా, ధరల పెరుగుదలకు కారణమైన బీజేపీకి తగిన బుద్ధి చెప్పాలని అన్నారు. దొంగ నాటకాలాడిన ప్రజలను మోసం చేసిన పార్టీలకు బుద్ధి చెప్పాలని అన్నారు. వైఎస్సార్ సీపీని లక్ష ఓట్ల మెజార్టీతో గెలిపించాలని ఎమ్మెల్యే రోజా ప్రజలను కోరారు. చదవండి: చంద్రబాబు బూతు పంచాంగం డ్రామా ఫెయిల్: సజ్జల -
దాసరి సుధను భారీ మెజార్టీతో గెలిపించాలి
-
దాసరి సుధను భారీ మెజార్టీతో గెలిపించాలి: ఎమ్మెల్యే చెవిరెడ్డి
సాక్షి, వైఎస్సార్ కడప: బద్వేలు ఉపఎన్నికలో వైఎస్సార్సీపీ అభ్యర్థి దాసరి సుధను భారీ మెజారిటీతో గెలిపించాలని ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. వైఎస్సార్ జిల్లా నుంచి ఇద్దరు సీఎంలు అయ్యారు. వారు ప్రజల మన్ననలను పొందారని అన్నారు. చిత్తూరు జిల్లా నుంచి ఇద్దరు సీఎంలుగా పనిచేశారు.. ఒకరు మామను వెన్నుపోటు పొడిచి ముఖ్యమంత్రి అయితే, మరొక సీఎం(కిరణ్ కుమార్ రెడ్డి) రాష్ట్రానికి వెన్నుపోటు పొడిచారని విమర్శించారు. చదవండి: పట్టాభికి చంద్రబాబు నుంచి ప్రాణహాని -
నేడు గోపవరంలో వైఎస్ఆర్ సీపీ బహిరంగ సభ
-
బద్వేలులో బీజేపీకి డిపాజిట్ కూడా రాదు: మంత్రి వెల్లంపల్లి
-
బద్వేలులో బీజేపీకి డిపాజిట్ కూడా రాదు: మంత్రి వెల్లంపల్లి
సాక్షి, బద్వేలు(వైఎస్సార్ కడప): బద్వేలులో బీజేపీకి డిపాజిట్ కూడా రాదని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. బద్వేలు ఉపఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం వైఎస్సార్సీపీ అభ్యర్థి డాక్టర్ దాసరి సుధా తరపున ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భారతీయ జనతా పార్టీకి ప్రజలని ఓట్లు అడిగే అర్హత లేదని అన్నారు. తమ ప్రభుత్వం ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు అందించిందని అన్నారు. వైఎస్సార్సీపీ అభ్యర్థి దాసరి సుధని భారీ మెజార్టీతో గెలిపించాని ప్రజలను కోరారు. చదవండి: రాష్ట్రపతి పాలన పెట్టాలనడం సరికాదు -
Badvel Bypoll: బద్వేల్లో వైఎస్సార్సీపీ ఎన్నికల ప్రచారం
సాక్షి, వైఎస్సార్ జిల్లా: బద్వేలు అసెంబ్లీ ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రచారాన్ని ముమ్మరం చేసింది. అందులో భాగంగానే మహానందిపల్లి, పెండ్లిమర్రి, చెన్నారెడ్డి పల్లి, శంఖవర పంచాయతీల మీదుగా మంగళవారం రోడ్ షో ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమంలో శాసనసభ ఉపఎన్నికల అభ్యర్థి డాక్టర్ దాసరి సుధా, ఎన్నికల ఇన్చార్జి రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డితో పాటు మండల నాయకులు వైఎస్సార్ సీపీ కార్యకర్తలు పాల్గొన్నారు. -
‘టీడీపీ హయాంలో కనీసం తాగునీరు కూడా ఇవ్వలేదు’
సాక్షి, వైఎస్సార్ కడప: గత ప్రభుత్వం బద్వేల్ అభివృద్ధిని పట్టించుకోలేదని చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి అన్నారు. ఆయన బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ హయాంలో కనీసం తాగునీరు కూడా ఇవ్వలేదని మండిపడ్డారు. తాము బ్రహ్మంసాగర్ ద్వారా 7 మండలాలకు నీరు అందించామని తెలిపారు. బద్వేల్‌కు తాగు, సాగు నీటిని అందిస్తున్నామని శ్రీకాంత్‌రెడ్డి పేర్కొన్నారు. రూ.130 కోట్లతో బద్వేల్ మున్సిపాలిటీని అభివృద్ధి చేస్తామని చెప్పారు. వైఎస్సార్సీపీ అభ్యర్థి దాసరి సుధను భారీ మెజార్టీతో గెలిపించాలని అన్నారు. -
బద్వేలు ఉపఎన్నిక: మొత్తం 35 నామినేషన్లు దాఖలు
సాక్షి, బద్వేలు అర్బన్: బద్వేలు అసెంబ్లీ ఉప ఎన్నికకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ శుక్రవారంతో ముగిసింది. చివరి రోజు వివిధ పార్టీలకు చెందిన అభ్యర్థులతో పాటు, స్వతంత్ర అభ్యర్ధులు 20 మంది నామినేషన్లు దాఖలు చేశారు. దీంతో మొత్తం 35 నామినేషన్లు దాఖలయ్యాయని ఎన్నికల రిటర్నింగ్ అధికారి కేతన్‌గార్గ్ తెలిపారు. వీరిలో వైఎస్సార్సీపీ నుంచి డాక్టర్ సుధ,కాంగ్రెస్ నుంచి పి.ఎం.కమలమ్మ, జె.ప్రభాకర్ రావు, బీజేపీ నుంచి పనతలసురేష్, ఎం.శివకృష్ణ, అంబేద్కర్ నేషనల్ కాంగ్రెస్‌పార్టీ నుంచి ముత్యాలప్రసాద్‌రావు, హర్దమ్ మానవతవాది రాష్టీయదళ్‌పార్టీ నుంచి జి.విజయ కుమార్, సాంబశివరావు, నవరంగ్ కాంగ్రెస్‌పార్టీ నుంచి వెంకటేశ్వర్లు, జనసహాయకశక్తిపార్టీ నుంచి సగిలిసుదర్శనంలతో పాటు స్వతంత్ర అభ్యర్థులుగా విజయకాంత్ గోపాలకాంత్, సి.బ్రహ్మయ్య, తిరుపాలుజయరాజు, ఆర్.ఇమ్మానియేల్, కోటపాటి నరసింహులు, కె.చిన్నమునెయ్య, రవి నామినేషన్లు దాఖలు చేశారు. జిల్లాకు చేరుకున్న ఎన్నికల పరిశీలకులు కడప సిటీ : బద్వేలు ఉప ఎన్నిక నిర్వహణకు సంబంధించి ఇద్దరు ఎన్నికల పరిశీలకులు జిల్లాకు చేరుకున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ విజయరామరాజు తెలిపారు. ఇందులో ఎన్నిక వ్యయ పరిశీలకులుగా షీల్ ఆసిస్ (ఐఆర్ఎస్), పోలీసు పరిశీలకులుగా పి.విజయన్ (ఐపీఎస్) వ్యవహరిస్తారని వివరించారు. చదవండి: (క్యాంబెల్: ఇద్దరు సీఎంలు జన్మించిన ఆసుపత్రి) -
బద్వేలు ఉపఎన్నికపై వైఎస్సార్సీపీ విస్తృతస్థాయి సమావేశం
సాక్షి, వైఎస్సార్ జిల్లా: బద్వేలు ఉపఎన్నికపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, డిప్యూటీ సీఎం అంజాద్ భాషా, ఎంపీ అవినాష్ రెడ్డి, వైఎస్సార్సీపీ అభ్యర్థి దాసరి సుధ పాల్గొన్నారు. ఉపఎన్నికల ప్రచారం, ప్రణాళికలపై బూతుస్థాయి నేతలతో సమావేశంలో చర్చించనున్నారు. రాష్ట్రం మొత్తం బద్వేలు వైపు చూస్తోంది బద్వేలు ఎన్నికల్లో భారీ విజయం ఖాయమని ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి అన్నారు. శనివారం వైఎస్సార్ జిల్లాలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కులం, మతం పేరుతో బీజేపీ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అందిస్తున్న సంక్షేమం, అభివృద్ధి చూసి ఓర్వలేక అసత్య ఆరోపణలు చేస్తున్నారు. రాష్ట్రం మొత్తం బద్వేలు వైపు చూస్తోంది. నియోజకవర్గ పరిధిలోని అందరూ కలిసికట్టుగా కృషిచేసి భారీ మెజారిటీ అందించాలి. ఇప్పుడు వచ్చే మెజార్టీ రాబోయే ఎన్నికల్లో వచ్చే సీట్లను పెంచే స్థాయిలో ఉండాలి అని కాకాణి గోవర్ధన్ రెడ్డి అన్నారు. -
AP Special: బద్వేలు బరిలో మూడో డాక్టర్
వైఎస్సార్ జిల్లా: బద్వేలు శాసన సభ స్థానానికి జరగనున్న ఉపఎన్నికకు మరో వైద్యురాలు ఎమ్మెల్యేగా ఎన్నిక కావడం లాంఛనం కానుంది. గతంలో జరిగిన ఎన్నికలో ఇద్దరు వైద్యులు ఈ శాసనసభకు, ఎమ్మెల్యేగా ఎన్నికై ప్రజలకు సేవలందించారు. ఎంఎస్ జనరల్ సర్జన్ చదివిన డాక్టర్ శివరామక్రిష్ణయ్య రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. మొదటి పర్యాయం 1978లో జనతాపార్టీ తరపున 10,187 ఓట్లతో, రెండో పర్యాయం కాంగ్రెస్ తరపున 10,001 మెజారిటీతో గెలిచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2019లో డాక్టర్ వెంకట సుబ్బయ్య వైఎస్సార్సీపీ తరపున ఎమ్మెల్యేగా 44,7354 ఓట్ల మెజారిటీతో గెలుపోందారు. ఈయన ఎంబీబీఎస్,ఎంఎస్ ఆర్థోపెడిక్ చదివారు. ప్రస్తుతం ఉప ఎన్నికల బరిలో వైఎస్సార్సీపీ తరపున డాక్టర్ సుధా పోటీలో ఉన్నారు. ఈమె ఎంబీబీఎస్ చదివి గైనకాలజిస్ట్‌గా వైద్య సేవలందిస్తున్నారు. డాక్టర్ వెంకట సుబ్బయ్య, డాక్టర్ సుధ భార్యభర్తలు.. ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు. వెంకట సుబ్బయ్య అనారోగ్యంతో మృతి చెందారు. దీంతో ప్రస్తుత.. ఉప ఎన్నికలో ఆయన భార్య సుధా నామినేషన్ వేశారు. టీడీపీ, జనసేన పార్టీలు పోటీచేయమని ప్రకటించాయి. ఈ పరిణామాలతో ప్రస్తుతం సుధ ఎన్నిక కావడం లాంఛనమే కానుంది. చదవండి: Badvel bypoll: బద్వేలులో వైఎస్సార్సీపీ అభ్యర్థి నామినేషన్ -
బద్వేలులో వైఎస్సార్సీపీ అభ్యర్థి నామినేషన్
సాక్షి, బద్వేలు అర్బన్: వైఎస్సార్ జిల్లా బద్వేలు అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా డాక్టర్ సుధ సోమవారం నామినేషన్ దాఖలు చేశారు. స్థానిక నెల్లూరు రోడ్డులోని పార్టీ కార్యాలయం నుంచి నాలుగు రోడ్ల కూడలి వరకు వాహనాల్లో చేరుకుని అక్కడి నుంచి తహసీల్దారు కార్యాలయంలోని నియోజకవర్గ ఎన్నికల అధికారి కేతన్‌గార్గ్‌కు నామినేషన్ పత్రాలను అందజేశారు. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, పంచాయతీరాజ్‌శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఉప ముఖ్యమంత్రి అంజాద్‌బాషా, ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఆయా నియోజకవర్గ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి ఆమె వెంట ఉన్నారు. నామినేషన్ పత్రాలను సమర్పించిన అనంతరం ఉప ముఖ్యమంత్రి అంజాద్‌బాషా, ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ గోవిందరెడ్డి మాట్లాడుతూ రెండున్నరేళ్లలో అమలు చేసిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లి ఉప ఎన్నికలో భారీ మెజార్టీ సాధించేందుకు కృషిచేస్తామని తెలిపారు. అభ్యర్థి డాక్టర్ సుధ మాట్లాడుతూ జిల్లాలో అత్యంత వెనుకబడిన నియోజకవర్గాల్లో ఒకటైన బద్వేలు నియోజకవర్గాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేసేందుకు కృషిచేస్తానని చెప్పారు. ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీతో పాటు ఏడు మండలాల ముఖ్య నాయకులు పాల్గొన్నారు. చదవండి: బద్వేల్ ఉప ఎన్నికపై సీఎం జగన్ దిశానిర్దేశం చేశారు: సజ్జల -
టీడీపీ, బీజేపీ, జనసేన అజెండా అంతా ఒక్కటే
సాక్షి, వైఎస్సార్‌జిల్లా: బద్వేల్ ఉపఎన్నికపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సోమవారం విస్తృతస్థాయి సమావేశం నిర్వహించింది. నియోజకవర్గ పరిధిలోని బూత్ కన్వీనర్లతో పార్టీ అభ్యర్థి డాక్టర్ సుధ భేటీ అయ్యారు. కార్యక్రమానికి పార్టీ రాష్ట్ర కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి, మంత్రి ఆదిమూలపు సురేష్, వైఎస్ అవినాష్ రెడ్డి, పార్టీ అభ్యర్థి డాక్టర్ సుధ హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి ఆదిమూలం సురేష్ మాట్లాడుతూ.. బద్వేలు నియోజకవర్గం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి కంచుకోట. 2019 ఎన్నిక తరహాలోనే ఉపఎన్నికల్లో కూడా డాక్టర్ సుబ్బయ్య సతీమణి డాక్టర్ సుధకు మద్దతుగా నిలవాలి. టీడీపీ, బీజేపీ, జనసేన అజెండా అంతా ఒక్కటే. ప్రజాదరణ పొందుతున్న సీఎం జగన్మోహన్రెడ్డిపై బురదజల్లడమే. ఎన్నికలు కొత్త కాదు. పంచాయితీ, స్థానిక సంస్థల్లో విజయం సాధించాం. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు విస్తృతంగా అందుతున్నాయి. ప్రజల నుంచి ప్రభుత్వానికి మంచి ఆదరణ లభిస్తోంది. కులాలకు, మతాలకు, పార్టీలకు అతీతంగా అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలు అందిస్తున్నాం. దళితులకు అత్యంత ప్రాధాన్యత కల్పిస్తున్నాం' అని మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ.. సంక్షేమం, అభివృద్ధి దిశగా ప్రభుత్వం పనిచేస్తోందని అన్నారు. 90 శాతానికి పైగా హామీలు అమలు చేసిన ఘనట సీఎం జగన్‌ది అని అన్నారు. చదవండి: (దేవదాయ శాఖలో విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ) రూ.300 కోట్లతో అభివృద్ధి పనులు ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి మాట్లాడుతూ.. ఉపఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా డాక్టర్ సుధాను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఎంపిక చేశారు. ఎన్నికల ప్రచారంలో ప్రజల వద్దకు వెళ్లి ప్రభుత్వం చేసిన సంక్షేమం తెలియజేయాలి. గత ప్రభుత్వాలు బద్వేలు ప్రజలను పట్టించుకోలేదు. మన ప్రభుత్వం దాదాపు రూ.300 కోట్లతో సాగు, తాగు నీరు అందించి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తున్నాం. కుందూ నది నుంచి ఎత్తిపోతల ద్వారా బ్రహ్మం సాగర్‌కు నీటిని తరలించి కరవు పరిస్థితిలో కూడా బద్వేలు ప్రాంత రైతాంగానికి నీరు అందించబోతున్నాము. వ్యవసాయనికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా పనులు చేపట్టబోతున్నాం. బద్వేలు చెరువుకు నీరు అందించేందుకు ఎల్ఎస్పీ కాలువ విస్తరణ చేపడుతున్నాం. బద్వేలు మున్సిపాలిటీ అభివృద్ధి కోసం రూ.130 కోట్లతో పనులు చేస్తున్నాం. సుదీర్ఘ కాలం పెండింగ్‌లో ఉన్న బద్వేలు రెవెన్యూ డివిజన్‌ను ప్రభుత్వం మంజూరు చేసింది. పెద్దఎత్తున బద్వేలు నియోజకవర్గ అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోంది. బద్వేలు ప్రాంత నిరుద్యోగులకు ఉపాధి కల్పించాలని ఇండస్ట్రియల్ కారిడార్‌లో రూ.1,000 కోట్లతో సెంచురీ ప్లైవుడ్ పరిశ్రమ రాబోతోంది. పోలింగ్ శాతాన్ని పెంచేందుకు అందరూ కృషి చేసి డాక్టర్ సుధాను భారీ మెజారిటీతో గెలిపించాలి' అని ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి కోరారు. -
Badvel Bypoll: చరిత్రలో నిలిచేలా బద్వేలు మెజారిటీ
సాక్షి, బద్వేలు: బద్వేలు శాసనసభ ఎన్నికల్లో గతంలో ఎన్నడూ రానంత స్థాయిలో... చరిత్రలో నిలిచేలా వైఎస్సార్సీపీ అభ్యర్థి డాక్టర్ సుధ మెజారిటీ సాధించేలా నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి పేర్కొ న్నారు. శుక్రవారం పోరుమామిళ్లలోని పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి అధ్యక్షతన నాయకులతో సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథులుగా అవినాష్‌రెడ్డి, కడప మేయర్ సురేష్‌బాబు, అభ్యర్థి డాక్టర్ సుధ పాల్గొన్నారు. ఎంపీ అవినాష్‌రెడ్డి మాట్లాడుతూ ఓటింగ్ శాతం పెరిగేలా చూడాలన్నా రు. తిరుపతి ఎంపీ ఉప ఎన్నికలో ఓటింగ్ శాతం తగ్గడంతోనే మెజారిటీ తగ్గిందని, ఈ దఫా అటువంటి తప్పిదం జరగకుండా పని చేయాలన్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు సీఎం వైఎస్ జగన్‌పై నిత్యం బురద జల్లుతూ, ఎల్లో మీడియాతో తప్పుడు ప్రచారం చేస్తున్నా తిరుపతిలో 2.70 లక్షలకుపైగా మెజారిటీ వచ్చిందంటే ఇందుకు ప్రజలు ప్రభుత్వం వెంట ఉండటమే కారణమని చెప్పారు. ►సీఎం జగన్ బద్వేలు అభివృద్ధికి చాలా కృషి చేస్తున్నారని చెప్పారు. బ్రహ్మంసాగర్ ప్రాజెక్టులో నిరంతరం నీరు ఉండేలా తెలుగుగంగ కాలువను సున్నా నుంచి 18 కి.మీ. వరకు లైనింగ్ పనులు చేపట్టామని, దీంతో ఐదు వేల క్యూసెక్కులు ప్రవహించేలా అడ్డంకులు తొలగాయన్నారు. కుందూ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు త్వరగా పూర్తి చేస్తే సాగు,తాగు నీటికి ఇక్కట్లు తీరతాయని చెప్పారు. బద్వేలు పెద్ద చెరువు ఎప్పుడూ నీటితో నిండేలా ఎల్లెస్పీ ఎడమ కాలువ విస్తరణ పనులు చేపడుతున్నామని చెప్పారు. ►రెవెన్యూ డివిజన్ రాజంపేటలో ఉండటంతో నియోజకవర్గ ప్రజలు వెళ్లేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్న విషయాన్ని గమనించిన సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి బద్వేలులోనే డివిజన్ ఏర్పాటు చేసే గెజిట్ ఇచ్చారని, మరో నెల రోజుల్లో అన్ని అంశాలు పూర్తి చేసి ఇక్కడే డివిజన్ సిబ్బంది పని చేసేలా కార్యాలయం ప్రారంభిస్తామని వివరించారు. ►గోపవరం మండల పరిధిలో రూ.వెయ్యి కోట్లతో సెంచూరీ ఫ్లై పరిశ్రమ ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా పని చేసి గతంలో వచ్చిన 44వేల మెజారిటీ కంటే అధికంగా వచ్చేలా చూడాలని కోరారు. ►కార్యక్రమంలో మార్కెట్‌యార్డు కమిటీ వైఎస్ ఛైర్మన్ రమణారెడ్డి, బద్వేలు మున్సిపల్ ఛైర్మన్ వాకమళ్ల రాజగోపాల్‌రెడ్డి, అడా ఛైర్మన్ గురుమోహన్, నాయకులు నల్లేరు విశ్వనాథరెడ్డి, సత్యనారాయణరెడ్డి, అంకన గురివిరెడ్డి, చిత్తా విజయప్రతాప్‌రెడ్డి, సీ బాష, బోడపాడు రామసుబ్బారెడ్డి, అందూరు రామక్రిష్ణారెడ్డి, గోపాలస్వామి, సాయిక్రిష్ణ, ప్రభాకర్‌రెడ్డి, శారదమ్మ, తదితరులు పాల్గొన్నారు. చదవండి: (సీఎం జగన్ వైఎస్సార్ కడప జిల్లా పర్యటన వివరాలు..) ఎన్ని ఇబ్బందులున్నా హామీల అమలు.. ఎన్ని ఇబ్బందులున్నా సీఎం వైఎస్ జగన్ ఎన్నికల సమయంలో ఇచ్చిన నవరత్నాల హామీలను నెరవేరుస్తున్నారని, ఈ విషయాన్ని ఓటర్లకు తెలియజేయాలని మాజీ ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి అన్నారు. నాయకులు, కార్యకర్తలు గ్రామాల్లో ఇంటింటా తిరిగి ప్రభుత్వం ద్వారా వారికి జరిగిన మేలు, అందిన సంక్షేమ పథకాలను వివరించి వారితో పార్టీ అభ్యర్థి డాక్డర్ సుధకు ఓట్లు వేసేలా చూడాలన్నారు. అందరూ సహకారం అందించాలి.. బద్వేలు ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ సుధ మాట్లాడుతూ గతంలో తన భర్త డాక్టర్ వెంకటసుబ్బయ్య పోటీ చేసిన సమయంలో నాయకులు, కార్యకర్తలు కష్టించి పని చేశారని, అలాంటి సహకారం తనకు అందించాలని విన్నవించారు. టీడీపీని ఛీ కొట్టినా... 2019 ఎన్నికల్లో టీడీపీని ప్రజలు ఛీ కొట్టినా ఎల్లోమీడియా అండతో తప్పుడు ప్రచారం చేస్తూ పబ్బం గడుపుకుంటున్నారని కడప మేయర్ సురేష్‌బాబు పేర్కొన్నారు. సర్పంచ్ ఎన్నికల్లో 85 శాతం స్థానాలు సాధించినా... జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాల్లో 98 శాతం సాధించినా ... మున్సిపాలిటీ ఎన్నికల్లో 100 శాతం విజయాలు సాధించినా.. ప్రజలు ఎన్ని పర్యాయాలు వారికి బుద్ధి చెప్పినా వారి కుతంత్రాలు ఆగడం లేదన్నారు. బద్వేలు ఉప ఎన్నికల్లో అత్యధిక మెజారిటీ సాధించి టీడీపీ కుట్రలకు అడ్డు వేసి ప్రజా కోర్టులో శిక్షిద్దామన్నారు. గోపవరంలో నాయకులు, కార్యకర్తలతో మాట్లాడుతున్న చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి పథకాలపై ప్రజలను చైతన్యవంతులను చేయాలి: ఎమ్మెల్యే చెవిరెడ్డి గోపవరం : బద్వేలు ఉప ఎన్నికలో వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ సుధను మంచి మెజార్టీతో గెలిపించుకోవాలని మండల ఇన్చార్జి, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం పెద్దగోపవరంలోని వేణుగోపాలస్వామి ఆలయంలో పూజలు నిర్వహించారు. అనంతరం పార్టీ నాయకులు, కార్యకర్తలను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలన్నీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్లి వారిలో చైతన్యం తీసుకురావాలన్నారు. చదవండి: (‘క్లీన్ ఆంధ్రప్రదేశ్ –జగనన్న స్వచ్ఛ సంకల్పం’ ప్రారంభం) ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తూ ఓటింగ్ శాతం పెరిగేలా చూసుకోవాలన్నారు. పార్టీకి కష్టపడి పనిచేసిన నాయకులు, కార్యకర్తలకు గుర్తింపు ఉంటుందన్నారు. శనివారం నుండి గ్రామ పంచాయతీల వారీగా ప్రచారం కొనసాగిస్తామన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ గోపవరం మల్లికార్జునరెడ్డి, మాజీ ఎంపీపీ సరస్వతి, సర్పంచ్‌లు వెంకటలక్షుమ్మ, నాగేంద్ర, మల్లెం కొండేశ్వరస్వామి చైర్మన్ వెంకటేశ్వర్‌రెడ్డి, మాజీ ఎంపీపీ వెంకటేశ్వర్లు, నాయకులు వెంకటసుబ్బయ్య, శివారెడ్డి, హరికృష్ణారెడ్డి, సుందర్రామిరెడ్డి, కామిరెడ్డి సుధాకర్‌రెడ్డి, రవికుమార్‌రెడ్డి, వెంకట సుబ్బారెడ్డి, ఎస్సీ సెల్ కన్వీనర్ తిరుపాల్, మాజీ సర్పంచ్ వెంకటసుబ్బయ్య, హనుమంతు రమణ తదితరులు పాల్గొన్నారు. -
బద్వేలు ఉపఎన్నిక: అధికార పార్టీ టీమ్ సిద్ధం
సాక్షి, కడప: బద్వేలు నియోజకవర్గ ఉప ఎన్నికల పోరుకు అధికార పార్టీ సమాయత్తమైంది. ఈ మేరకు కార్యాచరణను వేగవంతం చేసింది. మంగళవారం కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేయగా, అక్టోబరు 1న శుక్రవారం ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది. అదేరోజు నుంచి నామినేషన్ల ప్రక్రియ మొదలు కానుంది. అక్టోబరు 30న పోలింగ్ జరగనుంది. దీంతో ఈ ఎన్నికల్లో విజయ ఢంకా మోగించేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు సమరోత్సాహంతో ఉన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గురువారం విజయవాడ తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో బద్వేలు వైఎస్సార్సీపీ అభ్యర్థి డాక్టర్ దాసరి సుధ, మాజీ ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డితోపాటు జిల్లాకు చెందిన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలతో సమావేశం నిర్వహించారు. ఉప ఎన్నికను ఎదుర్కొనే విషయంలో నేతలకు దిశా నిర్దేశం చేశారు. బద్వేలు ఉప ఎన్నికల ఇన్చార్జిగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని నియమించారు. ఈయనతోపాటు జిల్లా ఇన్చార్జి మంత్రి ఆదిమూలపు సురేష్, డిప్యూటీ సీఎం అంజద్‌బాషా, కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, రాజంపేట ఎంపీ మిథున్‌రెడ్డిలు కూడా ఇన్చార్జిలుగా వ్యవహరిస్తారు. బద్వేలు మాజీ ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి నేతలను సమన్వయం చేసుకుని ఎన్నికల వ్యవహారాన్ని పర్యవేక్షిస్తారు. ఇక ఉప ఎన్నిక నేపథ్యంలో పలువురు ఎమ్మెల్యేలను నియోజకవర్గంలోని మండలాలకు ఇన్చార్జిలుగా నియమించనున్నారు. బద్వేలు మున్సిపాలిటీతోపాటు మేజర్ పంచాయతీ అయిన పోరుమామిళ్లకు ఇద్దరేసి చొప్పున ఎమ్మెల్యేలను ఇన్చార్జిలుగా నియమించనున్నారు. బద్వేలు నియోజకవర్గంలో ఏడు మండలాలు ఉండగా మండలానికి ఒకరు చొప్పున ఇన్చార్జిలను నియమించాలని నిర్ణయించారు. జిల్లాలోని ఎమ్మెల్యేలతోపాటు ఇతర జిల్లాలకు చెందిన కొందరు ఎమ్మెల్యేలను మండలాలకు ఇన్చార్జిలుగా నియమించనున్నారు. శుక్రవారం నాటికి ఇన్చార్జిల జాబితా ఖరారు కానుంది. వీరు కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా పలువురు ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. ముఖ్యంగా మండల ఇన్చార్జిలు ఆయా మండలాల పరిధిలోని మండల, గ్రామస్థాయి నేతలతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారు. చదవండి: (బద్వేలు ఉపఎన్నిక: ప్రధాన పార్టీల అభ్యర్థులు వీరే...) తేలని బీజేపీ వ్యవహారం బద్వేలు ఉప ఎన్నికలో పోటీ చేసే విషయంలో బీజేపీ ఇంకా తుది నిర్ణయానికి రాలేదు. గురువారం బద్వేలులోని రాధాకృష్ణ కల్యాణ మండపంలో ఆ పార్టీ నేతలు సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు యల్లారెడ్డి, జిల్లా ఇన్చార్జి అంకాల్‌రెడ్డి, కిసాన్‌మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు శశిభూషణ్‌రెడ్డి, బీజేవైఎం జాతీయ కార్యదర్శి సురేష్‌తోపాటు స్థానిక నేతలు సమావేశంలో పాల్గొన్నారు. బద్వేలు ఉప ఎన్నికలో వ్యవహరించాల్సిన వ్యూహంపై చర్చించారు. ఈనెల 3వ తేదీన కడపలో ఆ పార్టీ రాష్ట్ర నేతలు సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో ఉప ఎన్నికల్లో పోటీ చేసే విషయంపై నిర్ణయం తీసుకోనున్నారు. బద్వేలు ఉప ఎన్నికలో జనసేన పార్టీ అభ్యర్థిని నిలిపే పక్షంలో జనసేనకే మద్దతు పలకాలని బీజేపీ నిర్ణయించినట్లు తెలుస్తోంది. చదవండి: (సంక్షేమాభివృద్ధే గెలుపునకు సోపానం) -
సంక్షేమాభివృద్ధే గెలుపునకు సోపానం
సాక్షి, అమరావతి: సీఎం వైఎస్ జగన్ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలే తన గెలుపును సునాయాసం చేస్తాయని వైఎస్సార్ జిల్లా బద్వేలు నియోజకవర్గం వైఎస్సార్సీపీ అభ్యర్థి డాక్టర్ దాసరి సుధ ధీమా వ్యక్తం చేశారు. నియోజకవర్గంలో తను ఎక్కడికి వెళ్లినా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని చెప్పారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో గురువారం ఆమె సీఎం జగన్‌తో సమావేశమైన అనంతరం మీడియా పాయింట్ వద్ద విలేకరులతో మాట్లాడారు. తన భర్త, ఎమ్మెల్యే వెంకటసుబ్బయ్య చనిపోయినప్పుడు పరామర్శ కోసం వచ్చిన సీఎం వైఎస్ జగన్.. తన కుటుంబ సభ్యులను ఓదార్చటమే కాకుండా, కుటుంబానికి అండగా ఉండి ఆదుకుంటానని చెప్పారన్నారు. ఆ సందర్భంలోనే.. డాక్టర్‌గా చాలా కాలంగా ప్రజా సేవ చేస్తున్నారు కాబట్టి, ఇష్టమైతే రాజకీయాల్లోకి వచ్చి ప్రజలకు మరింత దగ్గరగా సేవ చేయొచ్చని సూచించారన్నారు. అలా ప్రజల్లో ఉంటే భర్తలేరన్న బాధ నుంచి ఉపశమనం కలుగుతుందని తెలియజేశారని చెప్పారు. సీఎం జగన్ ఓదార్పు తమ కుటుంబ సభ్యులను ఎంతో ఆకట్టుకుందని తెలిపారు. ఆయన సారథ్యంలో బద్వేలు సమాగ్రాభివృద్ధి కోసం అహర్నిశలు పని చేస్తానని చెప్పారు. మాజీ ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి, ఎంపీపీలు, జెడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులు, సర్పంచులు, పార్టీ నేతలు, కార్యకర్తలందరి సంపూర్ణ సహకారం తనకు ఉందని తెలిపారు. వైఎస్ జగన్ పాలన కారణంగా బద్వేలు ప్రజలు ఈ ఉప ఎన్నికలో తనకు మంచి మెజార్టీ కట్టబెడతారని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. తాను ఎప్పటికీ జగన్ కుటుంబం వెంటే నడుస్తానని చెప్పారు. కాగా, అంతకు ముందు ఆమె.. తనను బద్వేలు వైఎస్సార్ సీపీ అభ్యర్థిగా ఎంపిక చేసినందుకు సీఎం జగన్‌కు పుష్పగుచ్ఛం అందజేసి కృతజ్ఞతలు తెలిపారు. గతంలో కంటే ఎక్కువ మెజార్టీ తథ్యం వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తల సమష్టి కృషితో బద్వేలులో గతంలో కంటే ఎక్కువ మెజార్టీ సాధిస్తామని మాజీ ఎమ్మెల్సీ దేవసాని చిన్న గోవిందరెడ్డి అన్నారు. ప్రజా ప్రతినిధుల సమక్షంలో డాక్టర్ దాసరి సుధను సీఎం జగన్ అభ్యర్థిగా ప్రకటించారన్నారు. ఎన్నికల వ్యూహంపై సీఎం తమకు దిశా నిర్దేశం చేశారని చెప్పారు. సుధ గెలుపు కోసం అందరం కలిసికట్టుగా కృషి చేస్తామని తెలిపారు. గత 4 ఎన్నికల్లో వైఎస్సార్ కుటుంబానికి బద్వేలు నియోజకవర్గం మద్దతుగా నిలిచిందని చెప్పారు. సీఎం జగన్‌పై, వైఎస్సార్సీపీ మీద ప్రజలకు కొండంత విశ్వాసం ఉందని, అందుకే భారీ మెజార్టీతో గెలుపు తథ్యం అన్న నమ్మకం తమకు ఉందని పేర్కొన్నారు. విలేకరుల సమావేశంలో ఆర్యవైశ్య వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ కుప్పం ప్రసాద్, పార్టీ నేతలు కరెంట్ రమణారెడ్డి, రొండా మాధవరెడ్డి పాల్గొన్నారు. -
సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయి
-
వారందరికీ నా కృతజ్ఞతలు: దాసరి సుధ
-
బద్వేలు ఎన్నిక మాకు నల్లేరు మీద నడక: డీసీ గోవిందరెడ్డి
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్ కుటుంబానికి మద్దతుగా బద్వేల్ నియోజకవర్గం నిలిచిందని మాజీ ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి తెలిపారు. డాక్టర్ వెంకటసుబ్బయ్య మరణంతో ఉప ఎన్నిక అనివార్యమైందని తెలిపారు. ఈ ఎన్నిక మాకు నల్లేరు మీద నడక అని ధీమా వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డితో సమావేశమైన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. చదవండి: నయా దొంగలు సెల్ టవరే లక్ష్యం.. అక్కడ ఏముంటుందని అనుకోవద్దు ‘దివంగత వెంకటసుబ్బయ్య సతీమణి డాక్టర్ సుధను సీఎం జగన్ అభ్యర్థిగా ప్రకటించారు. భారీ మెజారిటీతో డాక్టర్ సుధ గెలుస్తారు. దాని కోసం మేమంతా కృషి చేస్తాం. ప్రతిపక్ష పార్టీ పోటీ చేయకపోవడం ఆనవాయితీగా వస్తోంది. కానీ టీడీపీ ఆలోచన ఏవిధంగా ఉందో తెలియదు’ అని గోవిందరెడ్డి వెల్లడించారు. ‘ఆ రోజే ముఖ్యమంత్రి జగన్ రాజకీయాల్లోకి రావాలని నన్ను కోరారు. ఆయన నన్ను అభ్యర్థిగా ప్రకటించినందుకు ధన్యవాదాలు. సీఎం వైఎస్ జగన్ చేసిన అభివృద్ధి మమ్మల్ని భారీ మెజారిటీతో గెలిపిస్తుంది’ అని అభ్యర్థి దాసరి సుధ తెలిపారు. చదవండి: ‘పవన్ ఆ సమయంలో మందు కొట్టి పడుకున్నారా?’: పిఠాపురం ఎమ్మెల్యే -
బద్వేల్ ఉప ఎన్నికపై సీఎం జగన్ ప్రత్యేక సమావేశం
సాక్షి, తాడేపల్లి: బద్వేల్ ఉప ఎన్నికపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గురువారం ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. తాడేపల్లిలో క్యాంప్ కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో సీఎం మాట్లాడుతూ.. దివంగత వెంకటసుబ్బయ్యగారి భార్య దాసరి సుధ కూడా డాక్టరేనని, తమ పార్టీ తరఫు నుంచి ఆమెను అభ్యర్థిగా నిలబెడుతున్నామన్నారు. బద్వేల్ నియోజకవర్గ బాధ్యతలన్నీ సమావేశానికి వచ్చిన వారందరి మీద ఉన్నాయన్నారు. నామినేషన్ కార్యక్రమానికి అందరూ హాజరు కావాలని పేర్కొన్నారు. 2019లో దాదాపు 44వేలకుపైగా ఓట్ల మెజార్టీ వచ్చిందని సీఎం జగన్ గుర్తు చేశారు. గతంలో వెంకసుబ్బయ్యకు వచ్చిన మెజార్టీ కంటే ఎక్కువ మెజార్టీ డాక్టర్ సుధకి రావాలని తెలిపారు. ఎక్కడా అతి విశ్వాసం ఉండకూడదని, కష్టపడి ప్రజల ఆమోదాన్ని పొందాలని పేర్కొన్నారు. 2019లో 77శాతం ఓటింగ్ జరిగిందని, ఓటింగ్ శాతం పెరగాలని సూచించారు. అందరూ ఓట్లు వేసేలా ఓటర్లను ప్రోత్సహించాలని సీఎం జగన్ తెలిపారు. ప్రతి సామాజిక వర్గాన్ని కలుపుకుపోవాలని సీఎం జగన్ ఆదేశించారు. ప్రతి మండలం కూడా బాధ్యులకు అప్పగించాలని, గ్రామస్థాయి నాయకులతో కలిపి ప్రచారం నిర్వహించాలని తెలిపారు. బద్వేల్ ఉప ఎన్నికకు పార్టీ ఇంఛార్జిగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఒక్కో ఇంటికి కనీసం మూడు నాలుగు సార్లు వెళ్లి.. వారిని అభ్యర్థించాలని సీఎం జగన్ అన్నారు. ఓటర్లు పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటు వేసేలా వారిని చైతన్యపరచాలన్నారు. నెలరోజులపాటు నాయకులు తమ సమయాన్ని కేటాయించి ఎన్నికపై దృష్టిపెట్టాలని తెలిపారు. బద్వేల్ ఉప ఎన్నికకు పార్టీ ఇంఛార్జిగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఉంటారని స్పష్టం చేశారు. వచ్చే సోమవారం నుంచి పార్టీ తరఫున కార్యక్రమాలు మొదలుపెట్టాలని పేర్కొన్నారు. తమ ప్రభుత్వం వచ్చాక ప్రజలకు ఎలాంటి మేలు జరిగిందో తెలియజేయాలని మంత్రులు,ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు సీఎం నిర్దేశించారు. ఈ సమావేశానికి ఉపముఖ్యమంత్రి (మైనార్టీ వ్యవహారాలు) అంజాద్ బాషా, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు, పౌరసరఫరాలశాఖ మంత్రి కొడాలి వెంకటేశ్వరరావు (నాని), ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్‌రెడ్డి, ప్రభుత్వ ప్రజా వ్యవహారాల సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డితో పాటు పలువురు ప్రజా ప్రతినిధులు హాజరయ్యారు. చదవండి: బద్వేలు ఉపఎన్నిక: ప్రధాన పార్టీల అభ్యర్థులు వీరే... కాగా బద్వేలు ఉప ఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం మంగళవారం షెడ్యూల్ విడుదల చేసిన విషయం విదితమే. అక్టోబర్ 1 న ఈ మేరకు నోటిఫికేషన్ జారీ చేయనున్నట్లు ప్రకటించింది. అక్టోబర్ నెల 8 తేదీ నామినేషన్ల ప్రక్రియకు చివరి తేదీగా నిర్ణయించారు. 11న నామినేషన్ల పరిశీలన ఉండగా 13న ఉపసంహరణకు గడువు నిర్ణయించారు. అక్టోబర్ 30న పోలింగ్ నిర్వహిస్తారు. నవంబర్ 2న ఓట్ల లెక్కింపు ఉంటుంది. వైఎస్సార్సీపీ అభ్యర్థిగా దాసరి సుధ 2019 సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్ కాగ్రెస్ పార్టీ తరపున గెలుపొందిన బద్వేలు ఎమ్మెల్యే డాక్టర్ దాసరి వెంకటసుబ్బయ్య అనారోగ్యంతో ఈ ఏడాది మార్చి 28 న మృతి చెందడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. దీంతో దివంగత డాక్టర్ వెంకటసుబ్బయ్య సతీమణి డాక్టర్ దాసరి సుధను పార్టీ అధిష్టానం బద్వేలు నియోజకవర్గ వైఎస్సార్సీపీ అభ్యర్థిగా ఎంపిక చేసింది. -
బద్వేలు ఉపఎన్నిక: ప్రధాన పార్టీల అభ్యర్థులు వీరే...
బద్వేలు బరిలో నిలిచే ప్రధాన పార్టీల అభ్యర్థులను ఆయా పార్టీల అధిష్టానాలు ఎంపిక చేశాయి. వైఎస్సార్ కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీల మధ్య బరిలో నిలిచే అభ్యర్థుల వివరాలు ఇలా ఉన్నాయి. డాక్టర్ దాసరి సుధ (వైఎస్సార్సీపీ) పేరు : డాక్టర్ దాసరి సుధ పుట్టిన తేదీ : 09–02–1972 భర్త : దివంగత ఎమ్మెల్యే గుంతోటి వెంకటసుబ్బయ్య తల్లిదండ్రులు : డాక్టర్ డి.ఓబులయ్య, డి.విక్టోరియా విద్యార్హత : ఎంబీబీఎస్ డి.జి.ఓ. (కర్నూలు) పుట్టినిళ్లు: పెద్దుళ్లపల్లె, బి.కోడూరు మండలం మెట్టినిళ్లు : వల్లెరవారిపల్లె, గోపవరం మండలం సంతానంః కుమార్తె హేమంత ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్, కుమారుడు తనయ్ ఇంటర్మీడియట్ రాజకీయ ప్రవేశం: 2014 నుంచి తన భర్త అయిన దివంగత ఎమ్మెల్యే డాక్టర్ జి.వెంకటసుబ్బయ్యతో పాటు ఆమె కూడా వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీలో క్రియాశీలకంగా పనిచేస్తున్నారు. త్వరలో జరగనున్న ఉప ఎన్నికల్లో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా తొలిసారి అసెంబ్లీకి పోటీ చేస్తున్నారు. ఓబులాపురం రాజశేఖర్ (టీడీపీ) బద్వేలు టీడీపీ అభ్యర్థిగా డాక్టర్ ఓబులాపురం రాజశేఖర్‌ను ఆ పార్టీ అధిష్టానం ఎంపిక చేసింది. ఈ విషయాన్ని టీడీపీ కడప పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు లింగారెడ్డి ప్రకటించారు. కలసపాడు మండలం చెన్నారెడ్డిపల్లెకు చెందిన రాజశేఖర్ ఎంబీబీఎస్‌తోపాటు ఆర్థోపెడిక్‌లో ఎంఎస్ చేశారు. బద్వేలు నియోజకవర్గంలోని పలు మండలాల్లో ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించారు. 2019లో ఉద్యోగానికి రాజీనామా చేసి గత సార్వత్రిక ఎన్నికల్లో బద్వేలు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీచేసి వైఎస్సార్సీపీ అభ్యర్థి వెంకట సుబ్బయ్య చేతిలో ఓటమి పాలయ్యారు. ప్రస్తుతం వైఎస్సార్సీపీ అభ్యర్థి, దివంగత వెంకట సుబ్బయ్య సతీమణి డాక్టర్ దాసరి సుధపై రాజశేఖర్ టీడీపీ అభ్యర్థిగా పోటీ చేయనున్నారు. సాక్షి, కడప: బద్వేలు ఉప ఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం మంగళవారం షెడ్యూల్ విడుదల చేసింది. అక్టోబర్ 1 న ఈ మేరకు నోటిఫికేషన్ జారీ చేయనున్నట్లు ప్రకటించింది. అక్టోబర్ నెల 8 తేదీ నామినేషన్ల ప్రక్రియకు చివరి తేదీగా నిర్ణయించారు. 11న నామినేషన్ల పరిశీలన ఉండగా 13న ఉపసంహరణకు గడువు నిర్ణయించారు. అక్టోబర్ 30న పోలింగ్ నిర్వహిస్తారు. నవంబర్ 2న ఓట్ల లెక్కింపు ఉంటుంది. బద్వేలు ఎమ్మెల్యే డాక్టర్ దాసరి వెంకటసుబ్బయ్య అనారోగ్యంతో ఈ ఏడాది మార్చి 28 న మృతి చెందారు. దీంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. 2019 సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్ కాగ్రెస్ పార్టీ అభ్యర్థిగా డాక్టర్ వెంకటసుబ్బయ్య బద్వేలు ఎస్సీ రిజర్వుడు స్థానం నుంచి పోటీచేసి ప్రత్యర్థి టీడీపీ అభ్యర్థి ఓబుళాపురం రాజశేఖర్‌పై 44,834 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. డాక్టర్ వెంకటసుబ్బయ్యకు 95,482 ఓట్లు రాగా టీడీపీ అభ్యర్థికి 50,748 ఓట్లు వచ్చాయి. సౌమ్యుడు, మంచి డాక్టర్‌గా సేవలందించి డాక్టర్ వెంకటసుబ్బయ్య నియోజకవర్గ ప్రజల మన్ననలందుకున్నారు. వైఎస్సార్ సీపీ అభ్యర్థి ‘డాక్టర్’ సుధ విస్తృత ప్రచారం బద్వేలుకు ఉప ఎన్నిక అనివార్యం కావడంతో దివంగత డాక్టర్ వెంకటసుబ్బయ్య సతీమణి డాక్టర్ దాసరి సుధను పార్టీ అధిష్టానం బద్వేలు నియోజకవర్గ వైఎస్సార్సీపీ అభ్యర్థిగా ఎంపిక చేసింది. దీంతో ఆమె నియోజకవర్గ వ్యాప్తంగా విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. బద్వేలు మాజీ ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి నేతృత్వంలో పార్టీ శ్రేణులు సుధ తో కలిసి ఆగస్టు నెల 14 వ తేదీన కలసపాడు లో ఎన్నికల ప్రచారం మొదలు పెట్టారు. ఇప్పటికే నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో ఒక విడత ఎన్నికల ప్రచారం ముగించారు. సందిగ్ధంలో టీడీపీ బద్వేలు ఉప ఉన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల షెడ్యూల్ ప్రకటించింది. అయితే ఇప్పటివరకు టీడీపీ ఇక్కడ స్థబ్దుగానే ఉంది. ఈ నెలలో విజయవాడలో జరిగిన ఆ పార్టీ సమావేశంలో పార్టీ అధినేత చంద్రబాబు మాత్రం బద్వేలు ఉప ఎన్నికలో తాము పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఆ పార్టీ కడప పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు అభ్యర్థి పేరును వెల్లడించారు. ప్రచారం విషయంలో టీడీపీ పూర్తిగా వెనుకబడి ఉంది. బద్వేలు పరిధిలో 272 పోలింగ్ స్టేషన్లు... 2,12,739 మంది ఓటర్లు బద్వేలు నియోజకవర్గ పరిధిలోని బద్వేలు, గోపవరం, అట్లూరు, బి.కోడూరు, పోరుమామిళ్ల, కాశినాయన, కలసపాడు మండలాల పరిధిలో 272 పోలింగ్ స్టేషన్లు ఉండగా వాటి పరిధిలో జనవరి, 2011వ తేదీ నాటికి 2,12,739 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో పురుష ఓటర్లు 1,06,650 మందికాగా 1,06,069 మంది మహిళలు ఓటర్లుగా ఉన్నారు. తాజాగా కొత్త ఓటర్ల జాబితా వెలువడనుంది. ఆమేరకు ఉప ఎన్నిక జరగనుంది. ఎన్నికల ప్రక్రియ వేగవంతం బద్వేలు ఉప ఎన్నికకు షెడ్యూల్ విడుదల కావడంతో జిల్లా అధికార యంత్రాంగం ఎన్నికల ప్రక్రియను వేగవంతం చేసింది. మంగళవారం బద్వేలు నియోజకవర్గ పరిధిలోని అధికారులతో సమీక్షించారు. పటిష్టంగా ఎన్నికల కోడ్ అమలు: జేసీ గౌతమి కడప సిటీ: జిల్లాలోని బద్వేలు అసెంబ్లీ ఉప ఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూలు విడుదల చేసిన నేపథ్యంలో మంగళవారం నుంచి జిల్లా వ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిందని జాయింట్ కలెక్టర్ ఎం.గౌతమి(రెవెన్యూ) తెలిపారు. జిల్లాలో ఎన్నికల మోడల్ కోడ్ పటిష్టంగా అమలు చేయాలని మండల అధికారులను, మున్సిపల్ కమిషనర్లు, నియోజకవర్గ ప్రత్యేక అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టర్ వి.విజయరామరాజు ఆదేశాల మేరకు జేసీలు సాయికాంత్‌వర్మ, హెచ్ఎం ధ్యానచంద్ర లతో కలిసి మండల అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, నియోజకవర్గ, మండల ప్రత్యేక అధికారులు, సబ్ కలెక్టర్, ఆర్డీఓలు, జిల్లా నోడల్ అధికారులతో మంగళవారం ఆమె వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ అక్టోబర్ 1న నోటిఫికేషన్ విడుదల అనంతరం నామినేషన్ల స్వీకరణ, పోలింగ్, కౌంటింగ్ తదితర ప్రక్రియలు ముగిశాక నవంబర్ 5 వ తేదీ నాటికి ఎన్నికల కోడ్ ముగుస్తుందన్నారు. 2021 జనవరి 1 తేదీ నాటికి ప్రచురించిన ఎలెక్ట్రోరల్ ఓటర్ల జాబితాను పరిగణనలోకి తీసుకోవాలన్నారు. మోడల్ కోడ్ అమల్లోకి వచ్చినందు వల్ల ప్రభుత్వ కార్యాలయాల్లో ఉన్న ప్రజా ప్రతినిధుల ఫొటోలను తీసి భద్ర పరచాలని, బహిరంగ ప్రదేశాలలో విగ్రహాలకు ముసుగు వేయాలని, ప్లెక్సీలు, బ్యానర్లు తొలగించాలని ఆదేశించారు. అధికారులు ఎవరూ ప్రజా ప్రతినిధులను కలవరాదని సూచించారు. మోడల్ కోడ్ ఉన్నందున కొత్త పథకాల అమలు, ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయరాదన్నారు. ఇప్పటికే అమలులో ఉన్న పథకాలను కొనసాగించవచ్చని, కొత్త పథకాలు అమలు చేయరాదన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో డీఆర్ఓ మాలోల, సబ్ కలెక్టర్ కేతన్‌గార్గ్, ఆర్డీఓలు ధర్మచంద్రారెడ్డి, శ్రీనివాసులు,శిక్షణ కలెక్టర్ కార్తీక్ తదితరులు పాల్గొన్నారు వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతున్న జేసీ గౌతమి నియమావళి ఉల్లంఘిస్తే కఠిన చర్యలు: జిల్లా ఎస్పీ కేకేఎన్ అన్బురాజన్ కడప కోటిరెడ్డిసర్కిల్: బద్వేలు అసెంబ్లీ ఉప ఎన్నిక నేపథ్యంలో జిల్లాలో అమలులోకి వచ్చిన ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ కేకేఎన్ అన్బురాజన్ హెచ్చరించారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. జిల్లా వ్యాప్తంగా 23 చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి పకడ్బందీగా తనిఖీలు నిర్వహిస్తున్నామన్నారు. ఈ ప్రక్రియ నిరంతరాయంగా కొనసాగుతుందని పేర్కొన్నారు. పెద్ద మొత్తంలో నగదు, బంగారు, ఇతర విలువైన వస్తువులను తీసుకెళ్లేవారు వాటికి సంబంధించిన ఆధారాలు తప్పనిసరిగా కలిగి ఉండాలని సూచించారు. సరైన ఆధారాలు చూపకపోతే కేసు నమోదుతోపాటు వాటిని స్వాధీనం చేసుకుని తదుపరి చర్యల నిమిత్తం ఆదాయ పన్నుశాఖ, కమర్షియల్ ట్యాక్స్ అధికారులకు అప్పగిస్తామన్నారు. అలాగే అధిక మొత్తంలో మద్యం కలిగి ఉన్నా చర్యలు తప్పవన్నారు. ఉప ఎన్నికల్లో ఏమాత్రం చిన్న ఘటనకు కూడా తావు లేకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయనున్నామన్నారు. రాజకీయ పార్టీల నాయకులు, అభ్యర్థులు, వారి అనుచరులు ఎన్నికల నియమావళిని తప్పక పాటించాలన్నారు. -
బద్వేలు వైఎస్సార్సీపీ అభ్యర్థిగా దాసరి సుధ: సజ్జల
సాక్షి, తాడేపల్లి: బద్వేలు ఉపఎన్నికను సీరియస్‌గా తీసుకుంటామని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ఈ మేరకు మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బద్వేల్ ఉపఎన్నిక విషయంలో ఇప్పటికే వెంకట సుబ్బయ్య భార్య సుధ అభ్యర్థిగా ఉంటారని సీఎం చెప్పారు. చనిపోయిన వ్యక్తి కుటుంబం నుంచి టికెట్ ఇవ్వడం మా సంప్రదాయం. సానుభూతిగా మిగిలిన వారు పోటీ ఉండకపోవడం సాంప్రదాయం. ఒకవేళ పోటీ పెట్టినా ఎంత సీరియస్‌గా తీసుకోవాలో అలానే తీసుకుంటాం. నంద్యాల ఎన్నికకు ఈ ఎన్నికకు పోలిక లేదు. నంద్యాల ఉప ఎన్నికలో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు ఒక పెద్ద జనరల్ ఎన్నికలుగా తీసుకున్నారు. రూ.100 కోట్ల వరకు పంచారు. పథకాలు ఆగిపోతాయని భయపెడితే ఆ ఫలితాలు వచ్చాయి. అయితే ఈ ఎన్నికలు మా ప్రభుత్వం గత రెండేళ్లలో చేసింది చెప్పుకోవడానికి ఇదొక అవకాశం. ప్రజల అభిప్రాయం ఎలా ఉందో తెలుసుకోవడం మాకూ అవసరం. మెజారిటీ గతంలో వచ్చిన దానికంటే ఎక్కువ రావచ్చు అని సజ్జల అన్నారు. చదవండి: (క్లీన్ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమాన్ని ప్రారంభించనున్న సీఎం జగన్)