
సాక్షి, వైఎస్సార్ జిల్లా: టీడీపీ అధినేత చంద్రబాబుకు బద్వేలులో నిరసన సెగ తగిలింది. నల్ల బ్యాడ్జీలు, నల్ల జెండాలతో చంద్రబాబు కాన్వాయ్ వెళ్లే మార్గంలో గోబ్యాక్ అంటూ నిరసనలు తెలిపారు.
వివరాల ప్రకారం.. బద్వేలు పర్యటన వేళ చంద్రబాబుకు నిరసన సెగ ఎదురైంది. ఎమ్మెల్యే దాసరి సుధా ఆధ్వర్యంలో దళిత నేతలు నిరసనకు దిగారు. దళితులను అవమానించిన చంద్రబాబు, నారా లోకేష్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ సందర్బంగా నల్ల బ్యాడ్జీలు, నల్ల జెండాలతో కాన్వాయ్ వెళ్లే మార్గంలో నిరసనలు చెప్పారు. చంద్రబాబు గోబ్యాక్ అంటూ నల్ల జెండాలతో దళిత నేతలు నిరసనలు తెలిపారు. క్షమాపణ చెప్పిన తర్వాతే చంద్రబాబు బద్వేల్ రావాలని డిమాండ్ చేశారు.
ఇది కూడా చదవండి: అమ్మ ఒడి పథకం చాలా మంచిది: టీడీపీ ఎమ్మెల్యే ప్రశంసలు
Comments
Please login to add a commentAdd a comment