Badvel
-
మాట నిలబెట్టుకున్న YS జగన్.. తక్షణమే 10 లక్షల సాయం
-
బద్వేల్ బాధిత తల్లిదండ్రుల ప్రశ్నలకు టీడీపీ నేత పరారు..
-
LIVE : టీడీపీ అరాచకాలపై వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు
-
ఎందుకు చంద్రబాబు అంత భయం.. నేను వస్తే కానీ సాయం అందలేదు..
-
బద్వేల్: బాలిక కుటుంబానికి వైఎస్ జగన్ ఓదార్పు (ఫొటోలు)
-
బాబూ నీ పాలన ఇలానే ఉంటే ఇక తిరుగుబాటే
-
బద్వేల్ లో వైఎస్ జగన్ క్రేజ్ మాములుగా లేదు..
-
చంద్రబాబుకు ఇదే నా హెచ్చరిక: వైఎస్ జగన్
సాక్షి, వైఎస్సార్ జిల్లా: కూటమి పాలనలో మహిళకు రక్షణ లేదు.. ప్రజలకు భరోసా లేదంటూ వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మండిపడ్డారు. బద్వేల్లో యువకుడి దుర్మార్గానికి బాలిక బలికాగా, బాధిత కుటుంబాన్ని వైఎస్ జగన్ బుధవారం పరామర్శించారు. వారిని ఓదార్చి.. ధైర్యం చెప్పారు.అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ‘‘బద్వేలు ఘటన శనివారం జరిగితే ప్రభుత్వంలో ఎవ్వరూ స్పందించలేదు. కనీసం పట్టించుకోలేదు. ఇవాళ జగన్ ఇక్కడకు వస్తున్నాడని తెలిసిన తర్వాత మాత్రమే కాసేపటి కిందటే వీళ్లకు సహాయం అందింది. రాష్ట్రంలో దారుణమైన అఘాయిత్యాలు, అన్యాయాలు జరుగుతున్నాయి. మహిళలకు, ఆడపిల్లలకు రక్షణ లేని అధ్వాన్న పరిస్థితుల్లో చంద్రబాబు పాలన ఉంది.ఇదీ చదవండి: లోకేష్‌ను పప్పు అనడంలో తప్పే లేదు: వైఎస్ జగన్చంద్రబాబుకు ఒక్కటే చెబుతున్నాను. ఘటన జరిగిన వెంటనే ప్రజలకు భరోసా ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంటుంది. తమ పార్టీ వారు ఏం చేసినా చెల్లుబాటు అవుతుందనే మాట పక్కనపెట్టి ప్రజలకు తోడుగా ఉంటూ వారికి భరోసా ఇచ్చే కార్యక్రమాలు చేయమని చంద్రబాబుకు చెబుతున్నాను. బద్వేలు జడ్పీ స్కూల్లో టాపర్‌గా నిలబడిన పాప పరిస్థితి ఇంత దారుణంగా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఇలాంటి ఘటనలపై ఇప్పటికైనా మేల్కొనాలని, రాక్షస పాలనకు అంతం పలకాలని చంద్రబాబును హెచ్చరిస్తున్నాను. ఇదే మాదిరిగా చంద్రబాబు పాలన కొనసాగిస్తే ప్రజల్లో తీవ్రమైన తిరుగుబాటు రావడం ఖాయం’’ అని వైఎస్ జగన్ పేర్కొన్నారు. -
వైఎస్ జగన్ దెబ్బకు దిగి వచ్చిన చంద్రబాబు
సాక్షి, విజయవాడ: వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి దెబ్బకు ముఖమంత్రి చంద్రబాబు దిగి వచ్చారు. ఎట్టకేలకు బద్వేల్ ఇంటర్ విద్యార్థిని కుటుంబ సభ్యులతో సీఎం చంద్రబాబు ఫోన్లో మాట్లాడారు. బాధిత కుటుంబానికి ఆర్థిక సాయంతో పాటుగా ఆమె సోదరుడి చదువు బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని తెలిపారు.బద్వేల్లో యువకుడి దుర్మార్గానికి ఇంటర్ విద్యార్థిని బలైంది. ప్రేమ పేరుతో యువతిని మభ్యపెట్టి.. పెట్రోల్ పోసి నిప్పటించిన ఘటనలో బాధితురాలు మృతిచెందింది. ఈ నేపథ్యంలో బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు నేడు వైఎస్ జగన్ బద్వేల్ వెళ్తున్నారు. వైఎస్ పరామర్శ నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు దిగివచ్చారు. ఇప్పటి వరకు ఈ ఘటనపై స్పందించని చంద్రబాబులో ఎట్టకేలకు స్పందించారు. వైఎస్ జగన్ పరామర్శకు వెళ్తున్న నేపథ్యంలో బాధిత కుటుంబ సభ్యులకు చంద్రబాబు ఫోన్ చేశారు.తాజాగా బాధితురాలి తల్లితో చంద్రబాబు మాట్లాడారు. ఈ సందర్బంగా బాధిత కుటుంబానికి అండగా ఉంటామన్నారు. బాధిత కుటుంబానికి రూ.10 లక్షల ఆర్థికం సాయంతో పాటు.. బాలిక సోదరుడి చదువు బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందన్నారు. బాలిక తల్లికి ఉపాధి కల్పించే విధంగా తగు ఏర్పాట్లు చేయనున్నట్టు తెలిపారు. -
బద్వేల్ బాధిత కుటుంబానికి వైఎస్సార్సీపీ నేతల పరామర్శ
సాక్షి, వైఎస్సార్: ఏపీలో అసలు శాంతి భద్రతలు ఉన్నాయా? అని ప్రశ్నించారు వైఎస్సార్సీపీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి. మహిళల రక్షణ విషయంలో కూటమి ప్రభుత్వం పూర్తి నిర్లక్ష్యం వహిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అఘాయిత్యాల కారణంగా ఆడపిల్లలున్న ప్రతీ తల్లిదండ్రులు బాధపడుతున్నారని అన్నారు.బద్వేల్లో ప్రేమోన్మాది చేతిలో హత్యకు గురైన విద్యార్థిని కుటుంబ సభ్యులను కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, ఎమ్మెల్యే డాక్టర్ దాసరి సుధ, ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి సోమవారం ఉదయం పరామర్శించారు. ఈ క్రమంలో బాధిత కుటుంబానికి అండగా ఉంటామని నేతలు భరోసా ఇచ్చారు. ఈ సందర్బంగా ఎంపీ అనినాష్ రెడ్డి మాట్లాడుతూ.. ఈ ఘటన మాటల్లో చెప్పలేని అమానుషం. ఈ దారుణంపై ఆడ పిల్లలున్న ప్రతి తల్లిదండ్రులు బాధపడుతున్నారు. 2021లో ఇలాంటి ఘటన గుంటూరులో జరిగినప్పుడు కొద్ది రోజుల్లోనే కన్విక్ట్ చేశారు. ఈ నాలుగు మాసాల్లో ఇలాంటి 74 ఘటనలు జరిగితే ఈ ప్రభుత్వం ఏం చేస్తోంది?.ఏపీలో అసలు శాంతి భద్రతలు ఉన్నాయా?. రాష్ట్ర హోంమంత్రి అనిత అన్నీ చోట్ల సెక్యూరిటీ ఇవ్వలేం కదా అంటూ వెటకారంగా మాట్లాడుతున్నారు. ఈ విద్యార్థిని 10వ తరగతిలో స్కూల్ ఫస్ట్.. అలాంటి అమ్మాయి చనిపోవడం బాధాకరం. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం మొద్దు నిద్ర నుంచి మేల్కోవాలి. దిశా చట్టం, యాప్ అమలు చేసి ఉంటే పది నిమిషాల్లో పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లేవారు. ఈ ప్రభుత్వం దాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసింది. మహిళల రక్షణ విషయంలో ఈ ప్రభుత్వం పూర్తి నిర్లక్ష్యం వహించింది. సమాజం భయపడేలా కఠిన శిక్ష ఉండాలని ఆ తల్లి కోరుతోంది’ అని చెప్పారు. బద్వేల్ ఎమ్మెల్యే డాక్టర్ దాసరి సుధ మాట్లాడుతూ..‘మన రాష్ట్రంలో మహిళలపై ఇంత దారుణాలు జరుగుతుంటే మహిళా హోం మంత్రి ఏం చేస్తున్నారు?. దీంట్లో రాజకీయాలకు తావు లేదు.. గట్టి చర్యలు తీసుకోవాలి. నా బిడ్డ చనిపోయినట్లు మరొకరు చనిపోరని నమ్మకం ఏంటి అని ఆ తల్లి ప్రశ్నిస్తోంది. ఆమెకు ఈ ప్రభుత్వం ఏం సమాధానం చెబుతుంది?. బాధిత కుటుంబానికి న్యాయం జరిగే వరకూ పోరాటం చేస్తాం’ అని కామెంట్స్ చేశారు. -
రాష్ట్రంలో మహిళలకు రక్షణ కరువు
బద్వేలు అర్బన్: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర్నుంచి మహిళలు, విద్యార్థినులకు రక్షణ కరువైందని వైఎస్సార్ జిల్లా ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి, బద్వేలు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే డాక్టర్ సుధ విమర్శించారు. బద్వేలు సమీపంలో బాలిక దస్తగిరమ్మ ప్రేమోన్మాది చేతిలో హత్యకు గురికావడం అత్యంత బాధాకరమైన విషయమన్నారు. రాష్ట్రంలో మహిళలు, విద్యార్థినులపై జరుగుతున్న వరుస ఘటనలు చూస్తుంటే కూటమి ప్రభుత్వ పాలన ఏ విధంగా ఉందో అర్థమవుతుందన్నారు. ఆదివారం స్థానిక వైఎస్సార్సీపీ కార్యాలయంలో వారు మీడియాతో మాట్లాడారు. లిక్కర్, ఇసుక దందాలతో శాంతిభద్రతలు గాలికి..హిందూపురం నియోజకవర్గంలో అత్తాకోడళ్లపై జరిగిన గ్యాంగ్‌రేప్ ఘటన.. కర్నూలు జిల్లా అస్పరి మండలంలో అశ్విని అనే ఇంటర్ విద్యార్థిని హత్య ఘటన మరువక ముందే తాజాగా బద్వేలులో దస్తగిరమ్మ హత్య.. ఇలా వరుసగా దుర్ఘటనలు జరుగుతున్నా కూటమి ప్రభుత్వం తప్పులను సరిదిద్దుకునే ప్రయత్నం చేయకపోవడం బాధాకరమన్నారు. లిక్కర్, ఇసుక స్కాంలలో పాలకులు నిండా మునిగిపోయి మహిళల రక్షణ బాధ్యతలను పూర్తిగా విస్మరిస్తున్నారన్నారు. పోలీసు వ్యవస్థ కూడా అధికారంలో ఉన్న వారి అడుగులకు మడుగులొత్తుతూ ప్రతిపక్ష నేతలను తప్పుడు కేసులతో వేధించడమే పనిగా పెట్టుకున్నారని, శాంతిభద్రతలను పట్టించుకోవడం మానేశారని మండిపడ్డారు. ఇంతటి దారుణ పరిస్థితులు రాష్ట్రంలో మునుపెన్నడూ లేవన్నారు. వైఎస్సార్సీపీ హయాంలో మహిళల రక్షణకు పెద్దపీటఇక గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో బాలికలు, మహిళల భద్రతకు పెద్దపీట వేశారని, ఇందులో భాగంగానే విప్లవాత్మకంగా దిశ యాప్‌ను తీసుకొచ్చారన్నారు. మహిళల రక్షణ కోసం రాష్ట్రవ్యాప్తంగా 18 దిశ పోలీసుస్టేషన్లు ఏర్పాటుచేయడంతో పాటు ప్రత్యేకంగా 13 పోక్సో కోర్టులు, 12 మహిళా కోర్టులు ఏర్పాటుచేసి ప్రత్యేకంగా పబ్లిక్ ప్రాసిక్యూటర్లను ఏర్పాటుచేశారని వారు గుర్తుచేశారు. అంతేకాక.. పెట్రోలింగ్ వ్యవస్థను పటిష్టపరిచామన్నారు. అయితే, రాజకీయ కక్షతో చంద్రబాబు దిశ వ్యవస్థను నిర్వీర్యం చేశారని ఆరోపించారు. -
కడప ఎంపీ అవినాష్ రెడ్డి ఎన్నికల ప్రచారం
-
బద్వేలులో YSRCP నేతల బైక్ ర్యాలీ
-
షర్మిల వ్యాఖ్యలపై దాసరి సుధా ఫైర్
-
బద్వేల్: చంద్రబాబు వెన్నుపోటు రాజకీయం బట్టబయలు
సాక్షి, ఢిల్లీ: బద్వేల్లో చంద్రబాబు వెన్నుపోటు రాజకీయం బట్టబయలైంది. బద్వేలు టికెట్‌ను బీజేపీకి బలవంతంగా అంటగట్టిన బాబు.. అక్కడ తన పార్టీ నాయకుడు రోషన్నను పంపేందుకు గేమ్ ప్లాన్‌కు తెరతీశారు. నెలరోజులు బీజేపీ కండువా వేసుకుందామని క్యాడర్‌కు బద్వేల్ టీడీపీ నేతలు నచ్చ చెబుతున్నారు. ఎన్నికల తర్వాత మళ్లీ టీడీపీ జెండానే పట్టుకోవాలని బద్వేల్ నేతలు అంటున్నారు. గత ఉప ఎన్నికల్లో బీజేపీ తరఫున పోటీ చేసిన యువ మోర్చా జాతీయ కార్యదర్శి రాష్ట్ర కార్యదర్శి సురేష్ 20 వేల ఓట్లు తెచ్చుకున్నారు. ఒరిజినల్ బీజేపీ నాయకులకు అన్యాయం చేస్తున్నారని పురందేశ్వరిపై సీనియర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సీఎం రమేష్ ద్వారా టీడీపీ అభ్యర్థులను బీజేపీలోకి పంపి చంద్రబాబు రాజకీయం నడుపుతున్నారు. సీఎం రమేష్ చెప్పినట్లుగా హై కమాండ్‌కి పురందేశ్వరి పేర్లు పంపుతున్నట్లు సమాచారం. ఇదీ చదవండి: నారా భువనేశ్వరికి ఎన్నికల సంఘం నోటీసులు -
బద్వేల్.. ఓ బలిపీఠం.. వాడుకొని వదిలేస్తున్న చంద్రబాబు
సాక్షి ప్రతినిధి, కడప: వైఎస్సార్ జిల్లా బద్వేల్ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థులకు బలిపీఠంగా మారింది. ఉన్నత ఉద్యోగాలు వదులుకొని రాజకీయాల్లోకి వచ్చిన వారంతా క్రమేపీ తెరమరుగయ్యారు. అటు ఉద్యోగానికి దూరమై, ఇటు స్థానిక నాయకత్వాన్ని మెప్పించలేక రాజకీయాల్లో ఇమడలేకపోతున్నారు. ఆయా అభ్యర్థుల పట్ల అధినేత చంద్రబాబు సైతం ఆదరణ చూపకపోగా..వారిని కరివేపాకు చందంగా అవసరానికి వాడుకొని వదిలేశారు. ఇప్పటివరకు ముగ్గురికి ప్రత్యక్షంగా ఎదురైన అనుభవమే ఇందుకు నిదర్శనం. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి బద్వేల్ నియోజకవర్గంలో దివంగత నేత బిజివేముల వీరారెడ్డిదే ఆధిపత్యం. ఆయన మరణానంతరం 2001 ఉప ఎన్నికల్లో వీరారెడ్డి కుమార్తె కొనిరెడ్డి విజయమ్మ గెలుపొందారు. 2004 ఎన్నికల్లో ప్రస్తుత ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి అరంగేట్రంతోనే విజయం సాధించారు. అప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీదే హవా సాగింది. అనంతరం వైఎస్సార్సీపీ ఆవిర్భావమయ్యాక..మరో పార్టీకి అవకాశం లేకుండా పోయింది. 2009లో బద్వేల్ ఎస్సీ రిజర్వుడు స్థానమైంది. ఈ క్రమంలో టీడీపీ నుంచి ఒకసారి పోటీ చేసిన అభ్యర్థికి మరోమారు అవకాశం లేకుండా స్థానిక నాయకత్వం మోకాలడ్డుతోంది. అమృత్‌కుమార్ నుంచి డాక్టర్ రాజశేఖర్ వరకూ.. అధ్యాపకునిగా స్థిరపడిన లక్కినేని అమృత్‌కుమార్ (చెన్నయ్య) 2009లో టీడీపీ అభ్యర్థిగా బరిలో నిలవగా..ఆ ఎన్నికల్లో ఓటమి చెందారు. 2014 ఎన్నికల నాటికి లక్కినేని పార్టీలో కనుమరుగయ్యారు. ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకు మేనేజర్‌గా ఉద్యోగం చేస్తున్న ఎన్డీ విజయజ్యోతి 2014 టీడీపీ అభ్యర్థిగా తెరపైకి వచ్చారు. 2019 ఎన్నికల నాటికి విజయజ్యోతిని కూడా తెరమరుగు చేశారు. అప్పట్లో ప్రభుత్వ డాక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న ఓబులాపురం రాజశేఖర్‌కు అవకాశం కల్పించారు. 2024 ఎన్నికల నాటికి డాక్టర్ రాజశేఖర్ రాజకీయ ప్రస్థానమూ ప్రశ్నార్థకంగా మారింది. తాజాగా నీటిపారుదల శాఖలో డీఈగా పనిచేస్తున్న బొజ్జా రోశన్నను తెరపైకి తీసుకువచ్చారు. బొజ్జాతో ఉద్యోగానికి రాజీనామా చేయించి టీడీపీ అభ్యర్థిగా శ్రేణులకు పరిచయం చేస్తున్నారు. ఇలా తెలుగుదేశం పార్టీ ఒక్కొక్కరిని అవసరానికి వాడుకొని వదిలేస్తుండటం రివాజుగా మారిపోయింది. బాబుది సైతం అదే ధోరణి. ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గం కావడంతో మాజీ ఎమ్మెల్యే విజయమ్మ కుటుంబానిదే టీడీపీలో ఆధిపత్యం. పార్టీలో క్రియాశీలకంగా పనిచేసినా విజయమ్మ మెప్పు లేకపోతే, ఆయా అభ్యర్థుల రాజకీయ ప్రస్థానం ప్రశ్నార్థకమే అన్నట్లు తలపిస్తోంది. లక్కినేని చెన్నయ్యతో మొదలు డాక్టర్ రాజశేఖర్ వరకూ చోటుచేసుకున్న పరిస్థితే ఇందుకు ఉదాహరణ. ఉన్నత ఉద్యోగాలను పణంగా పెట్టి రాజకీయాల్లోకి వచ్చిన టీడీపీ అభ్యర్థుల పట్ల చంద్రబాబు కూడా అలాంటి ధోరణినే అవలంబిస్తున్నారు. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేగా ఎన్నికై 2021లో చంద్రబాబును నమ్మి పార్టీ తీర్థం పుచ్చుకున్న అప్పటి ఎమ్మెల్యే తిరువీధి జయరాములు కూడా తర్వాత రాజకీయంగా కనుమరుగయ్యారు. మొత్తంగా పరిశీలిస్తే బద్వేల్ టీడీపీ అభ్యర్థుల పాలిట బలిపీఠంగా మారందని రాజకీయ పరిశీలకులు వెల్లడిస్తున్నారు. -
‘ఎస్సీ, ఎస్టీ, బీసీల కోసం పనిచేసేది సీఎం జగన్ ఒక్కడే’
సాక్షి, బద్వేల్: ఎస్సీ,ఎస్టీ, మైనారిటీ, బీసీల కోసం పని చేసే ముఖ్యమంత్రి దేశంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి ఒక్కడేనని ఏపీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి అన్నారు. వైఎస్ఆర్ జిల్లా బద్వేల్లో సోమవారం జరిగిన వైఎస్ఆర్సీపీ సామాజిక సాధికర బస్సుయాత్రలో నారాయణస్వామి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను సీఎం జగన్ కోసం పనిచేసే కూలీ అని అన్నారు. ‘టీడీపీ పెట్టినపుడు ఎన్టీఆర్‌కు చంద్రబాబు వ్యతిరేకంగా పోటీ చేశారు. ఓడిపోవడంతో లక్ష్మీ పార్వతి కాళ్ళు పట్టుకొని టీడీపీలో చేరారు. దేశంలో ఎంఎల్ఏలను కొనే సంప్రదాయానికి తెరలేపిందే చంద్రబాబే. ఎన్టీఆర్‌ను సీఎం సీట్లో నుంచి దించి ఆయన మరణానికి బాబు కారణం అయ్యాడు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రక్తం టీడీపీ రక్తమే. రేవంత్‌రెడ్డి ఏ పార్టీలో ఉన్నా చంద్రబాబు కోసం ఆలోచిస్తాడు. బాబు తన కోవర్టులు సీఎం రమేష్‌ను బీజేపీకి, రేవంత్‌రెడ్డిని కాంగ్రెస్ పంపాడు. పవన్ కళ్యాణ్ ప్యాకేజి కోసం పార్టీ పెట్టాడు. ఆయన కేవలం జగన్‌పై విమర్శల కోసమే పని చేస్తాడు’ అని నారాయణస్వామి విమర్శించారు. ఇదీచదవండి..పతనావస్థ దిశగా ప్యాకేజీ స్టార్ పరుగులు -
మాకు ఉద్యోగాలొచ్చాయ్...ఏపీకి తరలివస్తున్న ప్రముఖ కంపెనీలు
-
సీమ సిగలో ‘సెంచురీ’
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం పారిశ్రామికాభివృద్ధికి తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలనిస్తున్నాయి. ఇప్పటికే ఎన్నో పేరున్న కంపెనీలు రాష్ట్రంలో తమ యూనిట్లను ఏర్పాటు చేసి ఉత్పత్తిని ప్రారంభించాయి. ఈ కోవలో రాయలసీమ యువత, రైతులకు ప్రయోజనం చేకూరే మరో భారీ ప్రాజెక్టు అందుబాటులోకి వచ్చింది. ప్లే ఉడ్ ప్యానల్స్ తయారీలో అగ్రగామి సంస్థగా పేరున్న సెంచురీ ప్యానల్స్ వాణిజ్యపరంగా ఉత్పత్తి ప్రారంభించడానికి సిద్ధమైంది. వైఎస్సార్ జిల్లా బద్వేల్ వద్ద గోపవరం పారిశ్రామిక పార్కులో రూ.1,000 కోట్ల పెట్టుబడితో 100 ఎకరాల్లో ఏర్పాటు చేసిన సెంచురీ ప్యానల్స్‌ను శనివారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రారంభించనున్నారు. ఈ యూనిట్ ద్వారా 2,266 మందికి ప్రత్యక్ష ఉపాధి లభించనుంది. అలాగే అంతకు రెట్టింపు సంఖ్యలో పరోక్ష ఉపాధి కల్పిస్తోంది. సెంచురీ ప్యానల్స్‌కు డిసెంబర్ 23, 2021న సీఎం వైఎస్ జగన్ భూమి పూజ చేశారు. వెనుకబడిన ప్రాంతంలో ఒక భారీ పరిశ్రమ ఏర్పాటు అవుతుండటంతో రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల మౌలిక వసతులను కల్పించింది. అంతేకాకుండా అనుమతులను వేగంగా మంజూరు చేసింది. దీంతో రెండేళ్లలోనే సెంచురీ ప్యానెల్స్ ఉత్పత్తిని ప్రారంభించడానికి సిద్ధమైంది. కలప ఆధారిత పరిశ్రమలను ప్రోత్సహించడానికి మొత్తం 490 ఎకరాల్లో గోపవరం వద్ద ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పన సంస్థ (ఏపీఐఐసీ) పారిశ్రామిక పార్కును అభివృద్ధి చేసింది. ఇందులో యాంకర్ యూనిట్‌గా సెంచురీ ప్యానల్స్‌కు 100 ఎకరాలను 33 ఏళ్ల లీజుకు కేటాయించారు. రైతులకు ప్రయోజనం సెంచురీ ప్యానల్స్‌లో హై ప్రెజర్ లామినేట్స్ (హెచ్పీఎల్) మీడియం డెన్సిటీ ఫైబర్ బోర్డ్స్ (ఎండీఎఫ్) తయారవుతాయి. రోజుకు 950 టన్నుల సామర్థ్యం గల ఎండీఎఫ్‌లను తయారు చేస్తారు. ఇందుకోసం భారీ సంఖ్యలో కలప అవసరమవుతుంది. ఈ నేపథ్యంలో 150 కి.మీ పరిధిలోని వైఎస్సార్, అన్నమయ్య, నంద్యాల, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, ప్రకాశం జిల్లాల రైతుల నుంచి యూకలిప్టస్ను సేకరించనుంది. ఇందుకోసం సుమారు 80,000 ఎకరాల్లో యూకలిç³్టస్ పెంపకాన్ని ప్రోత్సహిస్తున్నట్లు సెంచురీ ప్యానల్స్ జనరల్ మేనేజర్ రమేష్ కుమార్ రెడ్డి ‘సాక్షి’కి తెలిపారు. ప్రభుత్వం నిర్దేశించిన కనీస మద్దతు ధరకు తక్కువ కాకుండా యూకలిప్టస్ను కొనుగోలు చేస్తామన్నారు. దీనివల్ల సుమారు 25,000 రైతు కుటుంబాలకు ఆర్థిక ప్రయోజనం దక్కుతుందని చెప్పారు. ఇప్పటికే రైతులకు 50 లక్షల విత్తన మొక్కలను సబ్సిడీ ధరలకు అందించినట్లు వెల్లడించారు. అంతేకాకుండా ఉద్యోగ నియామకాల్లో 80 శాతం మంది స్థానిక యువతనే తీసుకుంటున్నామన్నారు. తొలుత గోపవరం, బద్వేలు మండలాలకు ప్రాధాన్యత ఇస్తున్నామని, ఆ తర్వాత వైఎస్సార్ జిల్లాతోపాటు రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకు ప్రాధాన్యత ఉంటుందన్నారు. అలాగే ఈ యూనిట్‌కు అవసరమైన ముడి సరుకును అందించే రీసిన్ తయారీ యూనిట్‌ను నాయుడుపేట వద్ద రూ.50 కోట్లతో ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఇ ఫిబ్రవరి నాటికి అందుబాటులోకి వస్తుందన్నారు. ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ బాగా వెనుకబడిన ప్రాంతమైన బద్వేల్లో యూనిట్ ఏర్పాటుకు సెంచురీ ప్యానల్స్ ముందుకు రావడంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. బ్రహ్మంసాగర్ రిజర్వాయర్ నుంచి 0.07 టీఎంసీల నీటిని కేటాయించడంతోపాటు 132 కేవీ విద్యుత్ సరఫరా, రహదారులు నిర్మాణం వంటి మౌలిక వసతులను కల్పించాం. పరిశ్రమలకు ఇచ్చే రాయితీ, సబ్సిడీపై విద్యుత్ ఇచ్చాం. – ఎన్.యువరాజ్, కార్యదర్శి, పరిశ్రమలు, మౌలిక వసతుల శాఖ సొంతూరులోనే ఉపాధి లభించింది.. 2018లో ఎలక్ట్రికల్ డిప్లొమా పూర్తి చేశాను. అప్పటి నుంచి ఉపాధి కోసం బయటి నగరాలకు వెళ్లలేక ఊర్లోనే ఉంటూ కూలి పనులు చేసుకుంటున్నా. ఇప్పుడు గోపవరంలో సెంచురీ ప్యానల్స్ ఏర్పాటుతో నాలాంటి ఎంతోమందికి స్థానికంగానే ఉపాధి లభించింది. సొంత ఊరిలో ఉద్యోగం చేస్తానని కలలో కూడా ఊహించలేదు. సీఎం వైఎస్ జగన్ వల్లే నాకు ఉద్యోగం వచ్చింది. – కాళ్ల రాజేష్, బుచ్చనపల్లె, గోపవరం మండలం, వైఎస్సార్ జిల్లా ఇక ఉద్యోగం రాదనుకున్నా.. ఐటీఐ ఎలక్ట్రికల్ పూర్తి చేసి ఉద్యోగం కోసం ఐదేళ్లపాటు ఎదురుచూశాను. ఇక ఉద్యోగం రాదనుకున్నా. సెంచురీ ప్యానెల్స్ ఏర్పాటుతో స్థానికులకే 75 శాతం ఉద్యోగాలు ఇవ్వడంతో నన్ను ఉద్యోగం వెతుక్కుంటూ వచ్చింది. దీంతో మా కుటుంబం ఆనందానికి అవధులు లేవు.– గుడి మెగురయ్య, కలసపాడు, వైఎస్సార్ జిల్లా నిరుద్యోగులకు ఉద్యోగాలు.. రైతులకు మేలు.. సెంచురీ ప్యానెల్స్‌కు అవసరమయ్యే రా మెటీరియల్ కోసం జామాయిల్ చెట్లు సాగు చేసుకునేందుకు పరిశ్రమ వారు రైతులను ప్రోత్సహిస్తున్నారు. ఎలాంటి రవాణా ఖర్చు లేకుండా మొక్కలను సబ్సిడీ ద్వారా నేరుగా రైతు పొలాల వద్దకే తెచ్చిస్తామన్నారు. దళారీ వ్యవస్థ లేకుండా కనీస మద్దతు ధరకు వారే కొనుగోలు చేస్తామన్నారు. జామాయిల్ సాగుపై ఇప్పటికే రైతులకు అవగాహన కల్పించారు. – రూకల దేవదాసు, గోపవరం ప్రాజెక్టు కాలనీ, గోపవరం మండలం, వైఎస్సార్ జిల్లా -
బద్వేలులో చంద్రబాబుకు నిరసన సెగ
-
చంద్రబాబుకు నిరసన సెగ.. నల్ల జెండాలతో గోబ్యాక్ అంటూ..
సాక్షి, వైఎస్సార్ జిల్లా: టీడీపీ అధినేత చంద్రబాబుకు బద్వేలులో నిరసన సెగ తగిలింది. నల్ల బ్యాడ్జీలు, నల్ల జెండాలతో చంద్రబాబు కాన్వాయ్ వెళ్లే మార్గంలో గోబ్యాక్ అంటూ నిరసనలు తెలిపారు. వివరాల ప్రకారం.. బద్వేలు పర్యటన వేళ చంద్రబాబుకు నిరసన సెగ ఎదురైంది. ఎమ్మెల్యే దాసరి సుధా ఆధ్వర్యంలో దళిత నేతలు నిరసనకు దిగారు. దళితులను అవమానించిన చంద్రబాబు, నారా లోకేష్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ సందర్బంగా నల్ల బ్యాడ్జీలు, నల్ల జెండాలతో కాన్వాయ్ వెళ్లే మార్గంలో నిరసనలు చెప్పారు. చంద్రబాబు గోబ్యాక్ అంటూ నల్ల జెండాలతో దళిత నేతలు నిరసనలు తెలిపారు. క్షమాపణ చెప్పిన తర్వాతే చంద్రబాబు బద్వేల్ రావాలని డిమాండ్ చేశారు. ఇది కూడా చదవండి: అమ్మ ఒడి పథకం చాలా మంచిది: టీడీపీ ఎమ్మెల్యే ప్రశంసలు -
ప్రియుడితో కలిసి రెండేళ్ల కొడుకును చంపిన తల్లి
-
బద్వేలులో దారుణం.. ప్రియుడితో కలిసి సహజీవనం చేస్తూ..
సాక్షి, వైఎస్సార్ కడప: ఓ మహిళ తన ప్రియుడితో కలిసి కన్న కొడుకునే హత్యచేసిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. విశ్వసనీయ సమాచారం మేరకు అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంకు చెందిన మారుతినాయక్ లారీడ్రైవర్‌గా పనిచేస్తుంటాడు. ఇతను 14 ఏళ్ల క్రితం బెంగుళూరుకు చెందిన కవితను ప్రేమవివాహం చేసుకున్నాడు. వీరికి ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. వీరు కొన్నేళ్లుగా ప్రొద్దుటూరులో నివాసం ఉంటూ ఇటీవలే ఖాజీపేటలోని చెమ్మళ్ళపల్లెకు వచ్చి స్థిరపడ్డారు. లారీడ్రైవర్‌గా పనిచేసే మారుతినాయక్‌కు అదే వృత్తిలో ఉండే వినోద్ అనే యువకుడు పరిచమయ్యాడు. తరుచూ మారుతినాయక్ ఇంటికి వస్తూపోతూ ఉండే వినోద్ కవితతో వివాహేతర సంబంధం ఏర్పరచుకున్నాడు. ఈ క్రమంలో మూడు నెలల క్రితం వినోద్, కవితలు ఇద్దరు పిల్లలను తీసుకుని ఇంటి నుంచి పరారయ్యారు. కొద్దిరోజుల పాటు అక్కడక్కడ తిరుగుతూ మూడు నెలల క్రితం బద్వేలులోని రూపరాంపేటలో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని సహజీవనం చేస్తుండేవారు. అప్పట్లో మారుతినాయక్ తన భార్య, ఇద్దరు పిల్లలు కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు కూడా చేసినట్లు తెలిసింది. చదవండి: (కొంతకాలంగా పెళ్లి సంబంధాలు.. ఇంట్లో ఎవరికీ చెప్పకుండా..) ఈ క్రమంలో కవిత, వినోద్‌లు బద్వేలులో ఉన్నట్లు తెలిసి మారుతినాయక్ తన సోదరితో వచ్చి కవితను ప్రశ్నించాడు. ఈ సమయంలో అక్కడే ఉన్న వినోద్ పరారయ్యాడు. కుమార్తె ఒక్కతే ఉంది, కుమారుడు ఎక్కడ అని ప్రశ్నించగా పొంతనలేని సమాధానాలు చెప్పడంతో మారుతినాయక్ బద్వేలు అర్బన్ పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు అర్బన్ పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు. అయితే 15 రోజుల కిందట రాత్రివేళల్లో బాలుడు ఎక్కువగా ఏడుస్తుండటంతో వినోద్ తీవ్రంగా కొట్టడంతో మృతిచెందినట్లు సమాచారం. దీంతో ఇరువురు కలిసి అద్దెకు ఉంటున్న ఇంటి ఆవరణలోని ఖాళీస్థలంలో గుట్టుచప్పుడు కాకుండా మృతదేహాన్ని పూడ్చివేసినట్లు తెలిసింది. ఈ విషయంపై అర్బన్ సీఐ వెంకటేశ్వర్లును వివరణ కోరగా ప్రస్తుతానికి బాలుడు తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేశామని, పూర్తిస్థాయిలో విచారించి తదుపరి విచారణ ప్రారంభిస్తామని తెలిపారు. -
పద్దతి మార్చుకోమన్నందుకు కత్తితో దాడి
బద్వేలు అర్బన్ : అల్లరి చిల్లరిగా తిరుగుతూ వీధి ప్రజలను ఇబ్బందులు పెట్టే బదులు పద్దతి మార్చుకుని సక్రమంగా జీవించాలని ఓ వ్యక్తి చెప్పిన మాటలను అవమానంగా భావించిన యువకుడు తండ్రి, కొడుకులపై కత్తితో దాడి చేశాడు. బుధవారం బద్వేలు పట్టణంలో చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించి పోలీసుల కథనం ప్రకారం వివరాలు.. పట్టణంలోని ఆరోగ్యపురంలో నివసించే శేషాద్రిరెడ్డి ఓ ప్రైవేటు పాఠశాలలో ఉపాధ్యాయునిగా పనిచేస్తుండేవాడు. ఈయనకు భార్య, కుమారుడు ఉన్నారు. అదే కాలనీలో ఉండే నరసాపురం పోలేరు వంటమాస్టర్‌గా పనిచేస్తూ వచ్చిన డబ్బుతో జల్సాలు చేసుకుంటూ జులాయిగా తిరిగేవాడు. ఇదే సమయంలో వీధిప్రజలతో గొడవ పడుతుండేవాడు. ఇదే విషయంపై గతంలో శేషాద్రిరెడ్డి కూడా పోలేరును మందలించాడు. దీనిని అవమానంగా భావించిన పోలేరు గతంలో జరిగిన సంఘటనలను దృష్టిలో ఉంచుకుని బుధవారం ఉదయం ఇంటిలో ఉన్న శేషాద్రిరెడ్డిపై కత్తితో దాడి చేశాడు. ఆ సమయంలో అక్కడే ఉండి అడ్డుకోబోయిన శేషాద్రిరెడ్డి కుమారుడు పవన్కార్తీక్రెడ్డిపై కూడా దాడి చేశాడు. ఈ సమయంలో శేషాద్రిరెడ్డి భార్య పార్వతి గట్టిగా కేకలు వేయడంతో పోలేరు పరారయ్యాడు. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో హుటాహుటిన వారు అక్కడికి చేరుకుని గాయపడిన తండ్రి, కొడుకులను స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స చేసిన అనంతరం మెరుగైన వైద్యం కోసం కడప రిమ్స్‌కు తరలించారు. పార్వతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు అర్బన్ పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడు అరెస్టు పోలేరు ముఖానికి ముసుగు ధరించి ఉండటంతో దాడి చేసింది ఎవరనేది తొలుత అంతుపట్టలేదు. అంతేకాకుండా ముసుగు దొంగలు ఓ వ్యక్తిపై కత్తితో దాడి చేశారని పట్టణంలో, సామాజిక మాధ్యమాల్లో ప్రచారం ఊపందుకుంది. దీంతో అప్రమత్తమైన పోలీసులు బృందాలుగా విడిపోయి నిందితుడి కోసం గాలించారు. ఈ సమయంలో పోలీసుస్టేషన్‌కు కూతవేటు దూరంలో నిందితుడిని అర్బన్ పోలీసులు అదుపులోకి తీసుకుని కోర్టు ఎదుట హాజరుపరిచారు. తర్వాత విషయం తెలుసుకున్న పట్టణ ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. -
నకిలీ పట్టాలు, భూ ఆక్రమణలపై ప్రభుత్వం కొరడా
సాక్షి ప్రతినిధి, కడప : భూ దందాలతోపాటు పలు అక్రమాలపై వైఎస్ జగన్ ప్రభుత్వం కన్నెర్ర చేసింది. నకిలీ పట్టాలు, భూ ఆక్రమణలతో కొందరు అక్రమార్కులు బద్వేలు ప్రాంతంలో అలజడులు సృష్టిస్తున్నారన్న ఆరోపణలు వచ్చాయి. ఈ విషయాలు ప్రభుత్వం దృష్టికి చేరడంతో పేదలను ఇబ్బందులకు గురి చేస్తున్న వారెవరినీ వదిలి పెట్టవద్దంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి జిల్లా కలెక్టర్ విజయరామరాజు, ఎస్పీ కేకేఎన్ అన్బురాజన్‌లను ఆదేశించారు. తన, పర తారమత్యం లేకుండా అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం తేల్చి చెప్పారు. సీఎంఓ నుంచి ఆదేశాలు అందుకున్న బద్వేలు ఆర్డీఓ ఆకుల వెంకట రమణ స్పందించారు. లోతైన విచారణకు దిగారు. బాధితులు తన వద్దకు రావాలంటూ ప్రకటించారు. దీంతో కొందరు బాధితులు తమ స్థలాలు, భూములను ఆక్రమించిన వారి వివరాలను ఆర్డీఓ, కలెక్టర్లకు అందజేశారు. వీటిపై ఆర్డీఓ లోతైన విచారణ చేపట్టారు. నకిలీ సీళ్లు, బోగస్ సంతకాలతో కొందరు నకిలీ పట్టాలు సృష్టించి పేదల స్థలాలు, భూములను ఆక్రమిస్తున్న విషయం ఆయన దృష్టికి వచ్చింది. అటువంటి వారి జాబితాను సిద్ధ చేసుకున్న ఆర్డీఓ బద్వేలు ప్రాంతంలో పోలీసులతో కలిసి దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో పలు నకిలీ పట్టాలు, సీళ్లు, ఇతర సామగ్రి దొరికింది. దీంతో ప్రాథమికంగా 18 మందిపై కేసులు నమోదు చేశారు. సీపీఐ, టీడీపీ, ప్రజా సంఘాలు, అధికార పార్టీకి చెందిన కొందరు కార్యకర్తలు సైతం ఈ వ్యవహారంలో ఉన్నట్లు బట్టబయలైంది. బుధవారం నాటికి వీరిలో 8 మందిని అరెస్టు చేశారు. మిగిలిన వారు పరారీలో ఉన్నారు. విచారణ కొనసాగుతోంది. ఇంకొందరిపైన కేసులు నమోదు చేయనున్నట్లు తెలుస్తోంది. బద్వేలుతోపాటు పోరుమామిళ్ల, కాశినాయన, కలసపాడు, గోపవరం, అట్లూరు ప్రాంతాల్లోనూ ఈ తరహా అక్రమాలపై ఆర్డీఓ లోతైన విచారణ చేపట్టారు. ఆర్మీ వారి పేర్లతో బోగస్ ఐడీలు కొందరు ఆర్మీలో ఉన్న వారి పేర్లతో బోగస్ ఐడీలు సృష్టించి కొత్త తరహా అక్రమాలకు తెరలేపారు. ఆక్రమించిన స్థలాలు, భూములు పది సంవత్సరాల క్రితమే సైనికుల పేరున పట్టాలు చేయించుకున్నట్లు రికార్డులు మార్చి ఎన్ఓసీల ద్వారా వాటిని వెంచర్లు వేసి కొందరు అమ్మకాలకు పెట్టగా, మరికొందరు వందలాది ఎకరాల భూములను సైనికుల పేరున మార్చి వేరొకరికి కోట్లాది రూపాయలకు అమ్మకానికి పెట్టినట్లు తెలుస్తోంది. పోరుమామిళ్ల, కలసపాడు, కాశినాయన ప్రాంతాలతోపాటు బద్వేలు, గోవపరంలోనూ ఈ తరహా అక్రమాలు జరిగినట్లు ఆర్డీఓ, కలెక్టర్ల దృష్టికి వచ్చింది. దీనిపై విచారణ చేపట్టారు. వీటితోపాటు వందలాది ఎకరాల ప్రభుత్వ భూములను కబ్జా చేసిన వారి వివరాలను వెలికి తీస్తున్నారు. ఆయా ప్రాంతాల్లో గత ప్రభుత్వంలోనే పెద్ద ఎత్తున భూ ఆక్రమణలు జరిగినట్లు విచారణలో బయటపడుతోంది. డీకేటీల అమ్మకాలు సహించం డీకేటీ స్థలాలు, భూముల కొనుగోళ్లు, అమ్మకాలను ఎట్టి పరిస్థితుల్లో సహించబోమని జిల్లా కలెక్టర్ విజయరామరాజు, బద్వేలు ఆర్డీఓ ఆకుల వెంకట రమణలు ఇప్పటికే ప్రకటించారు. ల్యాండ్ కన్వర్షన్ లేకుండా ప్లాట్ల అమ్మకాలకు సిద్ధం చేసిన పలు వెంచర్లను ఇప్పటికే నిలిపివేశారు. వ్యవసాయానికి ఇచ్చిన భూమిని ఎట్టి పరిస్థితుల్లో ప్లాట్ల అమ్మకాలకు అనుమతించేది లేదని తేల్చి చెప్పారు. అలా చేయాలనుకుంటే ల్యాండ్ కన్వర్షన్ (భూ బదలాయింపు) తప్పనిసరి అని స్పష్టం చేశారు. బాధితులు, ప్రజల హర్షం భూ ఆక్రమణలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఏకంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి జిల్లా అధికారులను ఆదేశించడం, అందుకు కారకులైన వారిపై కేసులు నమోదు చేసి అరెస్టులు చేయడంపై బాధితులు, జిల్లా ప్రజలు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. జగన్ ప్రభుత్వం తన, పర అన్న బే«ధం లేకుండా నిస్పాక్షికంగా వ్యవహరించడాన్ని అన్ని వర్గాల ప్రజలు స్వాగతిస్తున్నారు. అక్రమాల్లో ఇంటి దొంగలు బద్వేలుతోపాటు మరికొన్ని ప్రాంతాల్లో జరిగిన భూ దందాల్లో ఇంటి దొంగల పాత్ర కీలకంగా ఉన్నట్లు ఉన్నతాధికారుల విచారణలో తేలింది. బద్వేలు అక్రమాల్లో కీలకపాత్ర పోషించిన ఇద్దరు వీఆర్వోలపై ఇప్పటికే కేసులు నమోదు చేశారు. వీరు కాకుండా ముగ్గురు తహసీల్దార్లు, ఇద్దరు జూనియర్ అసిస్టెంట్లు, ఇద్దరు ఆర్ఐలు, ఓ ఆర్డీఓ స్థాయి అదికారి సైతం గతంలో జరిగిన భూ ఆక్రమణలు, నకిలీ పట్టాల వ్యవహారంలో కీలకపాత్ర పోషించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే వీరి జాబితాను జిల్లా అధికారులు సిద్ధం చేశారు. త్వరలోనే వీరిపై కేసులు నమోదు చేయబోతున్నారు. పేదలకు అన్యాయం జరగనివ్వం బద్వేలు నియోజకవర్గంలో అర్హులైన పేదలకు అన్యాయం జరగనివ్వం. కొందరు అక్రమార్కులు నకిలీ సీళ్లు, ఫోర్జరీ సంతకాలతో నకిలీ పట్టాలు సృష్టించి పేదల స్థలాలు, భూములను దౌర్జన్యకరంగా ఆక్రమించారు. ఇలాంటి చర్యలు ప్రభుత్వానికి చెడ్డ పేరు తెస్తాయి. ప్రభుత్వ ఆదేశాలతో నియోజకవర్గంలో అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు చర్యలు చేపట్టాం. ఇప్పటికే చాలామందిపై కేసులు పెట్టి అరెస్టులు చేశాం. మరికొంతమందిపైన కేసులు పెట్టబోతున్నాం. నియోజకవర్గంలో ఏ ఒక్కరికీ అన్యాయం జరిగినా నా దృష్టికి తీసుకు రండి...కచ్చితంగా వారికి న్యాయం జరిగేలా చూస్తా. – ఆకుల వెంకట రమణ, ఆర్డీఓ, బద్వేలు