బ్రహ్మంసాగర్ రిజర్వాయర్‌కు ఈనెల 20వ తేదీలోగా నీరు చేరుతుందని జిల్లా కలెక్టర్ కేవీ సత్యనారాయణ పేర్కొన్నారు. గురువారం స్థానిక తహసీల్దారు కార్యాలయంలో ఆర్డీవో ప్రభాకర్ పిళై ్లతో కలిసి తహసీల్దార్లతో నిర్వహించిన సమీక్షా సమావేశం అనంతరం ఆయన విలేకర్లతో మాట్లాడారు.
బద్వేలు అర్బన్:
బ్రహ్మంసాగర్ రిజర్వాయర్‌కు ఈనెల 20వ తేదీలోగా నీరు చేరుతుందని జిల్లా కలెక్టర్ కేవీ సత్యనారాయణ పేర్కొన్నారు. గురువారం స్థానిక తహసీల్దారు కార్యాలయంలో ఆర్డీవో ప్రభాకర్ పిళై ్లతో కలిసి తహసీల్దార్లతో నిర్వహించిన సమీక్షా సమావేశం అనంతరం ఆయన విలేకర్లతో మాట్లాడారు. బ్రహ్మంసాగర్ రిజర్వాయర్‌కు సంబంధించి 98వ కిలోమీటర్ వద్ద 2 వేల క్యూసెక్కుల నీటి విడుదల జరగాల్సి ఉండగా 1600 క్యూసెక్కులు మాత్రమే విడుదల అవుతోందన్నారు. అయినప్పటికీ ఈనెల 20వ తేదీలోగా బ్రహ్మంసాగర్‌కు నీరు చేరుతుందని తద్వారా నియోజకవర్గంలోని రైతాంగానికి , ఆర్టీపీపీకి నీటి సమస్యలుండవని తెలిపారు. అలాగే పట్టణంలో ఉన్న ఆక్రమణ ల తొలగింపులో ఎలాంటి ఒత్తిళ్లకు తలొగ్గేది లేదని నిష్పక్షపాతంగా ఆక్రమణలను తొలగిస్తామని చెప్పారు. సీమాంక్ ఆసుపత్రి రహదారి విషయంపై విలేకర్లు అడుగగా ప్రస్తుతం ఆ విషయం శాసనమండలిలో ఉందని నిర్ణయం వెలువడిన తర్వాత దాని గురించి మాట్లాడతానని తెలిపారు. పట్టణానికి అర్బన్ హెల్త్ సెంటర్ ఏర్పాటు చేసే అవకాశం లేదని ప్రస్తుతం ఉన్న ప్రభుత్వ ఆసుపత్రిని మెరుగుపరుస్తామని తెలిపారు. అలాగే పట్టణంలో స్టేడియం , డంపింగ్‌యార్డుకు అబ్బూ సాహెబ్‌పేట సమీపంలో 11 ఎకరాల స్థలం కేటాయించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే జయరాములు, మాజీ ఎమ్మెల్యే విజయమ్మ, చైర్మన్ పార్థసారథి, ఎంపీపీ ప్రతాప్‌రెడ్డిలు సమస్యలపై కలెక్టర్‌తో చర్చించారు. వర్షం వచ్చిన ప్రతిసారి ఆర్టీసీ గ్యారేజీ జలమయమవుతుందని ఆర్టీసీ డీఎం రామసుబ్బయ్య కలెక్టర్ దష్టికి తీసుకుపోగా త్వరలోనే డిపోను పరిశీలిస్తానని తెలిపారు. కలెక్టర్ వెంట ఆర్డీవో ప్రభాకర్ పిళై ్ల , తహసీల్దార్లు మాధవకష్ణారెడ్డి, అనురాధ, తదితరులు పాల్గొన్నారు.