సాక్షి, విజయవాడ: వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి దెబ్బకు ముఖమంత్రి చంద్రబాబు దిగి వచ్చారు. ఎట్టకేలకు బద్వేల్ ఇంటర్ విద్యార్థిని కుటుంబ సభ్యులతో సీఎం చంద్రబాబు ఫోన్‌లో మాట్లాడారు. బాధిత కుటుంబానికి ఆర్థిక సాయంతో పాటుగా ఆమె సోదరుడి చదువు బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని తెలిపారు.
బద్వేల్‌లో యువకుడి దుర్మార్గానికి ఇంటర్ విద్యార్థిని బలైంది. ప్రేమ పేరుతో యువతిని మభ్యపెట్టి.. పెట్రోల్ పోసి నిప్పటించిన ఘటనలో బాధితురాలు మృతిచెందింది. ఈ నేపథ్యంలో బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు నేడు వైఎస్ జగన్ బద్వేల్ వెళ్తున్నారు. వైఎస్ పరామర్శ నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు దిగివచ్చారు. ఇప్పటి వరకు ఈ ఘటనపై స్పందించని చంద్రబాబులో ఎట్టకేలకు స్పందించారు. వైఎస్ జగన్ పరామర్శకు వెళ్తున్న నేపథ్యంలో బాధిత కుటుంబ సభ్యులకు చంద్రబాబు ఫోన్ చేశారు.
తాజాగా బాధితురాలి తల్లితో చంద్రబాబు మాట్లాడారు. ఈ సందర్బంగా బాధిత కుటుంబానికి అండగా ఉంటామన్నారు. బాధిత కుటుంబానికి రూ.10 లక్షల ఆర్థికం సాయంతో పాటు.. బాలిక సోదరుడి చదువు బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందన్నారు. బాలిక తల్లికి ఉపాధి కల్పించే విధంగా తగు ఏర్పాట్లు చేయనున్నట్టు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment