కడప కార్పొరేషన్: రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం బద్వేలు, కడప నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. రెండు నియోజకవర్గాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. రెండుచోట్లా బహిరంగ సభల్లో పాల్గొంటారు.
►9వ తేదీ ఉదయం 10.15 గంటలకు వైఎస్సార్ ఎస్టేట్‌లోని హెలీప్యాడ్ నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరి 10.40కి బద్వేల్‌లోని విద్యానగర్ హెలీప్యాడ్‌కు చేరుకుంటారు.
►11.10 గంటల నుంచి 12.45 వరకూ బహిరంగ సభ జరిగే మైదానంలో బద్వేల్ నియోజకవర్గానికి సంబంధించిన పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేసిన అనంతరం సభలో ప్రసంగిస్తారు.
►మధ్యాహ్నం 1.20 గంటలకు హెలీప్యాడ్ నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరి 1.45గంటలకు రిమ్స్ జనరల్ హాస్పిటల్‌లోని హెలీప్యాడ్‌కు చేరుకుంటారు.
►1.50కి అక్కడి నుంచి రోడ్డు మార్గాన బయలుదేరి 2.05 గంటలకు ఎర్రముక్కపల్లెలోని సీపీ బ్రౌన్ రీసెర్చ్ సెంటర్‌కు చేరుకుంటారు.
►2.10 నుంచి 2.20 గంటల వరకూ అక్కడ బ్రౌన్ విగ్రహాన్ని ఆవిష్కరించి, సీపీ బ్రౌన్ రీసెర్చ్ సెంటర్ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు.
►2.35 గంటలకు కలెక్టరేట్ సమీపంలోని మహావీర్ సర్కిల్‌కు చేరుకుంటారు.
►2.40 గంటల నుంచి 3.25 గంటల వరకూ శిలాఫలకాలను ఆవిష్కరించి పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవం చేస్తారు.
►3.45 గంటలకు వైఎస్ రాజారెడ్డి ఏసీఏ క్రికెట్ స్టేడియం చేరుకుంటారు.
►3.50 గంటల నుంచి 4.20 గంటల వరకూ అక్కడ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసి దివంగత వైఎస్ రాజారెడ్డి, వైఎస్ రాజశేఖర్‌రెడ్డిల విగ్రహాలను ఆవిష్కరిస్తారు.
►సాయంత్రం 4.25 గంటలకు వైఎస్ రాజారెడ్డి క్రికెట్ స్టేడియం నుంచి బయలుదేరి 4.35 గంటలకు రిమ్స్‌లోని హెలీప్యాడ్‌కు చేరుకుంటారు.
►5 గంటలకు కడప విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి 5.45 గంటలకు గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు.
► 6.10కి అమరావతిలోని నివాసానికి చేరుకుంటారు.
Comments
Please login to add a commentAdd a comment