మూకుమ్మడి రాజీనామాలు చేస్తాం.. | TDP Group Politics in Badvel Constituency | Sakshi
Sakshi News home page

బద్వేలు టీడీపీలో వర్గపోరు

Published Sat, Apr 21 2018 1:21 PM | Last Updated on Fri, Aug 10 2018 8:42 PM

TDP Group Politics in Badvel Constituency  - Sakshi

అనుచరులతో సమావేశమైన ఎమ్మెల్యే జయరాములు

సాక్షి, బద్వేలు: వైఎస్‌ఆర్‌ కడప జిల్లా బద్వేలు తెలుగుదేశం పార్టీలో వర్గపోరు తార స్థాయికి చేరింది. నియోజకవర్గంలో పార్టీ నాయకుల మధ్య ఉన్న గొడవలు మరోసారి రచ్చకెక్కాయి. గత కొంతకాలంగా మాజీ ఎమ్మెల్యే విజయమ్మకు, ఎమ్మెల్యే జయరాములు విభేదాలు నడుస్తున్నాయి. ఈ క్రమంలో విజయమ్మపై ఆయన మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు.  రూలింగ్‌ పార్టీ ఎమ్మెల్యే ఉండగా, రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థి గురించి ఎందుకు మాట్లాడుతున్నారన్నారు. జిల్లా స్థాయి నాయకులు సైతం కుల వివక్ష చూపుతూ ఎస్సీలను అణగదొక్కుతున్నారని మండిపడ్డారు.

పార్టీని నమ్మి టీడీపీ కండువా వేసుకుంటే, ఎస్సీ ఎమ్మెల్యే అని అగ్రవర్గాలవారు అణగదొక్కే యత్నం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. తనపై జరుగుతున్న అన్యాయాలపై అధిష్టానం వెంటనే స్పందించపోతే ఏ ప్రభుత్వ కార్యకలాపాలలో పాల్గొనని ఆయన హెచ్చరించారు. లేకుంటే నియోజకవర్గంలోని ఎంపీటీసీ, జడ్పీటీసీ, సర్పంచ్‌లతో కలిసి మూకుమ్మడి రాజీనామాలు చేస్తామని ఆయన వెల్లడించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement