jayaramulu
-
జయరాములు, ఆదిలకు మొండి చేయి
సాక్షి ప్రతినిధి కడప: అధికారపార్టీ ప్రోత్సాహంతో జిల్లాలో బద్వేల్, జమ్మలమడుగు ఎమ్మెల్యేలు జయరాములు, ఆదినారాయణరెడ్డిలు గతంలో పార్టీ ఫిరాయింపునకు పాల్పడ్డారు. ఫ్యాన్ గుర్తుపై గెలిచిన వారు టీడీపీ సైకిల్ ఎక్కారు. ఆపై వారిచేత ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్రెడ్డి వ్యక్తిత్వంపై విమర్శల దాడి చేయించారు. నిస్సిగ్గుగా ఫిరాయింపులకు పాల్పడి నైతికతను విస్మరించి ఆదరించిన పార్టీకి ద్రోహం తలపెట్టారు. యూజ్ అండ్ త్రో పాలసీ బాగా వంటబట్టిన టీడీపీ అధినేత ఇప్పుడు వారిని దూరం పెడుతున్నారు. దీంతో వారి పరిస్థితి రెంటికి చెడ్డ రేవడిలా ఉత్పన్నమైంది.ఇంటికూడు...దోవ కూడు లేకుండా పోతున్న పరిస్థితితలెత్తింది. పరిగణలోనే లేని జయరాములు.... బద్వేల్ ఎమ్మెల్యే జయరాములు పేరును పరిగణలోకి తీసుకోకుండానే టీడీడీ అధినేత అభ్యర్థిత్వాల ఎంపికకు కసరత్తు చేస్తున్నారు. 2014 ఎన్నికల్లో వైఎస్సార్సీపీ నుంచి విజయం సాధించినా 2019లో నాటికి ఆయన్ను డమ్మీగా మార్చేశారు. జయరాములు టీడీపీలో చేరాక బద్వేల్ ఇన్‌ఛార్జి మాజీ ఎమ్మెల్యే విజయమ్మతో సఖ్యత లోపించింది. తనతో తలపడి ఓటమిచెందిన ఎన్డీ విజయజ్యోతితో జట్టుకట్టారు. ఇరువురు కలిసికట్టుగా పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తూ వచ్చారు. విజయమ్మతో నిమిత్తం లేకుండా ఇరువురిలో ఒకరికి టికెట్ కేటాయించాలని వారు సంయుక్తంగా కోరారు. దాంతో మాజీ ఎమ్మెల్యే విజయమ్మ ఈ ఇద్దరిపై వ్యతిరేకత పెంచుకున్నారు. ఇరువుర్నీ సమానదూరంలో పెట్టినట్లు పరిశీలకులు భావిస్తున్నారు. తాజా ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిత్వం ఎంపిక జయరాములు పేరు కనీసం పరిగణలోకి తీసుకోలేదు. ఇప్పటి వరకూ విజయజ్యోతి, లాజరస్, డాక్టర్ రాజశేఖర్ పేర్లను పరిశీలించారు. విజయజ్యోతికి మాజీ ఎమ్మెల్యే విజయమ్మ ఆశీస్సులు లేవు. డాక్టర్ రాజశేఖర్, లాజరస్‌లను మాజీ ఎమ్మెల్యే ప్రతిపాదిస్తున్నట్లు సమాచారం. విజయజ్యోతికి విజయమ్మ ఆశీస్సులు లేకుండా టికెట్ ఇవ్వడం కష్టమని తేల్చి చెప్పినట్లు సమాచారం. గుడ్డిలో మెల్లలా మంత్రి ఆది.... ఫిరాయింపు ఎమ్మెల్యేలకు పార్టీ టికెట్లు కేటాయించేందుకు చంద్రబాబు నిరాకరించారు. మరో ఫిరాయింపు ఎమ్మెల్యే ప్రస్తుత మంత్రి ఆదినారాయణరెడ్డి జమ్మలమడుగు అభ్యర్థిత్వం ఆశించి భంగపడ్డారు. కడప పార్లమెంటు టీడీపీ అభ్యర్థిగా ఎంపిక చేశారు. 1989 నుంచి ఇప్పటివరకూ వరుసగా టీడీపీ ఓటమి చవిచూస్తోంది. కడప ఎంపీగా వైఎస్ కుటుంబ సభ్యులు క్రమం తప్పకుండా ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఓడిపోయే సీటును ఫిరాయింపు ఎమ్మెల్యేగా చరిత్రకెక్కిన ఆదినారాయణరెడ్డిని ఎంపిక చేశారు. ఒకవిధంగా చెప్పాలంటే మంత్రి ఆదిని రాజకీయంగా బలి చేయడమేనని విశ్లేషకులంటున్నారు. టీడీపీ ఎంపీ అభ్యర్థిత్వం దక్కిందనే చెప్పుకోవడం మినహా ఆదిలో నిస్సత్తువ ఆవహించిందని తెలిసింది. సొంత పార్టీలో కాలర్ ఎరగేసుకొని సహచర ఎమ్మెల్యేలు తిరిగి ఎన్నికల్లో పోటీ చేస్తుండగా, పార్టీ ఫిరాయింపునకు పాల్పడిన హీన చరిత్ర మూటగట్టుకున్న ఇద్దరూ ఇప్పుడు చంద్రబాబు వంచనతో రాజకీయంగా బలవుతున్న దుస్థితి నెలకొంది. -
ఎమ్మెల్యే ప్రోగ్రెస్ రిపోర్ట్ - జయరాములు
-
బద్వేలు టీడీపీలో బహిర్గతమైన వర్గపోరు
-
మూకుమ్మడి రాజీనామాలు చేస్తాం..
సాక్షి, బద్వేలు: వైఎస్ఆర్ కడప జిల్లా బద్వేలు తెలుగుదేశం పార్టీలో వర్గపోరు తార స్థాయికి చేరింది. నియోజకవర్గంలో పార్టీ నాయకుల మధ్య ఉన్న గొడవలు మరోసారి రచ్చకెక్కాయి. గత కొంతకాలంగా మాజీ ఎమ్మెల్యే విజయమ్మకు, ఎమ్మెల్యే జయరాములు విభేదాలు నడుస్తున్నాయి. ఈ క్రమంలో విజయమ్మపై ఆయన మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. రూలింగ్ పార్టీ ఎమ్మెల్యే ఉండగా, రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థి గురించి ఎందుకు మాట్లాడుతున్నారన్నారు. జిల్లా స్థాయి నాయకులు సైతం కుల వివక్ష చూపుతూ ఎస్సీలను అణగదొక్కుతున్నారని మండిపడ్డారు. పార్టీని నమ్మి టీడీపీ కండువా వేసుకుంటే, ఎస్సీ ఎమ్మెల్యే అని అగ్రవర్గాలవారు అణగదొక్కే యత్నం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. తనపై జరుగుతున్న అన్యాయాలపై అధిష్టానం వెంటనే స్పందించపోతే ఏ ప్రభుత్వ కార్యకలాపాలలో పాల్గొనని ఆయన హెచ్చరించారు. లేకుంటే నియోజకవర్గంలోని ఎంపీటీసీ, జడ్పీటీసీ, సర్పంచ్‌లతో కలిసి మూకుమ్మడి రాజీనామాలు చేస్తామని ఆయన వెల్లడించారు. -
నేను టీడీపీలో లేనా?
బద్వేలు నియోజకవర్గంలో వర్గపోరు తారాస్థాయికి చేరింది. ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే మధ్య పవర్ పాలిటిక్స్ నడుస్తోంది. పనుల పంచాయితీ ఎక్కువైంది. ‘నేను తెలుగుదేశం పార్టీలో లేనా? ఆ పార్టీ ఎమ్మెల్యేను కాదా..’ అంటూ బద్వేలు శాసనసభ్యుడు జయరాములు ఇటీవల విలేకరుల సమావేశంలో తీవ్ర ఆవేదన వెల్లగక్కడం ఇందుకు బలం చేకూరుస్తోంది. సాక్షి ప్రతినిధి, కడప : ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గమైన బద్వేలు నుంచి గత శాసనసభ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ గుర్తుపై జయరాములు పోటీ చేసి టీడీపీ అభ్యర్థి విజయజ్యోతిపై గెలుపొందారు. ఆ తర్వాత 2016 ఫిబ్రవరి 23న నియోజకవర్గ అభివృద్ధి కోసమంటూ టీడీపీ తీర్థం పుచ్చుకున్న సంగతి విదితమే. అయితే తొలుత జయరాములుకు మాజీ ఎమ్మెల్యే విజయమ్మ సంపూర్ణ మద్దతు పలికారు. కొన్నాళ్ల తర్వాత ఇద్దరి మధ్య ఎడం పెరిగింది. అది ఇప్పుడు వర్గపోరుకు దారితీసింది. నియోజకవర్గంపై పట్టు నీదా? నాదా? అనే స్థాయికి చేరడంతో బద్వేలు రాజకీయం రసకందాయంలో పడింది. పట్టు నిలుపుకొనేందుకు.. దివంగత మంత్రి వీరారెడ్డి కుమార్తె అయిన విజయమ్మ తండ్రి చనిపోవడంతో రాజకీయాల్లో వచ్చారు. అప్పటినుంచి నియోజకవర్గంలో తన హవా కొనసాగిస్తున్నారు. అనంతర కాలంలో ఆ నియోజకవర్గం ఎస్సీ రిజర్వుడు కావడంతో ఆమె బలపరిచిన అభ్యర్థికే పార్టీ టిక్కెట్ దక్కుతూ వచ్చింది. గత ఎన్నికల్లో ఆమె బలపరిచిన విజయజ్యోతికి టీడీపీ టిక్కెట్ ఇచ్చింది. వైఎస్సార్సీపీ తరఫున జయరాములు బరిలో నిలిచి గెలుపొందారు. ఆ తర్వాత ఆయన టీడీపీ తీర్థం పుచ్చుకోవడం, తనపట్టు పెంచుకోవడంలో భాగంగా విజయజ్యోతి వర్గంతో సత్సంబంధాలు నెరపడంతో అది విజయమ్మకు కోపం తెప్పించింది. తన నియోజకవర్గంలో ఇతరుల పెత్తనాన్ని సహించలేని మాజీ ఎమ్మెల్యే మంత్రులు ఆది, సోమిరెడ్డిల అండతో ఎమ్మెల్యే జయరాములు స్పీడ్‌కు బ్రేక్‌లు వేశారు. మొదటి నుంచి ఓ వర్గానికి అండగా ఉంటున్న మాజీ ఎమ్మెల్యే, తర్వాత నియోజకవర్గ అభివృద్ధి పనులన్నీ ఆ వర్గానికి చెందిన వారికే దక్కేలా పావులు కదిపి విజయం సాధించారు. విజిలెన్స్‌కు లేఖ రాయడంతో.. బద్వేలులో జరుగుతున్న నీరు–చెట్టు పనుల్లో అవకతవకలు జరిగాయని, అందులో అక్రమాలు వెలికితీయాలని కోరుతూ స్వయానా ఎమ్మెల్యే జయరాములు విజిలెన్స్ అధికారులకు లేఖ రాయడంతో ఇద్దరి మధ్య విబేధాలు బాగా ముదిరాయి. నీరు–చెట్టు పనుల్లో దాదాపు రూ.80 కోట్ల వరకు పనులను విజయమ్మ వర్గీయులు చేశారు. జ యరాములు వర్గీయులకు తక్కువగా పనులు దక్కాయి. పైగా జయరాములు వర్గీయులను ఆమె తనవైపు తిప్పుకోవడం, జిల్లా మంత్రి ఆమెకు అండగా నిలవడం.. అభివృద్ధి పనుల్లో అడ్డుతగులుతుండడం..నిధుల విషయంలో తనను టార్గెట్ చేయడంపై ఎమ్మెల్యే జీర్ణించుకోలేకపోతున్నారు. తాను దళిత ఎమ్మెల్యేను కావడం వల్లే అధికారపార్టీలో తనపై వివక్ష చూపుతున్నారని ఆయన తన సన్నిహితుల వద్ద వాపోయినట్లు వ్యక్తం చేసినట్లు తె లిసింది. ఇదే విషయాన్ని ఆయన స్వయంగా విలేకరుల సమావేశం పెట్టి మరీ ఆవేదన వ్యక్తం చేశారు. మాజీ ఎమ్మెల్యేపై ధ్వజమెత్తారు. సీఎం చంద్రబాబు వద్దే తాడోపేడో తెల్చుకోవడానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం. నియోజకవర్గ ఇన్చార్జి ఎవరు? ఎస్సీ రిజర్వుడు స్థానమే అయినా, నియోజకవర్గంలో బలమైన ఓ సామాజికవర్గం ఇక్కడ పెత్తనం చెలాయిస్తుంది. దీంతో ఎవరికి నియోజకవర్గ ఇన్చార్జి బాధ్యతలు అప్పగించాలన్న విషయంపై టీడీపీ అచితూచి వ్యవహరిస్తోంది. ఎవరికి ఇస్తే ఎవరికి కోపం వస్తుందోనని ఆ పార్టీ అధిష్టానం భావిస్తోంది. తనకు బలమైన వర్గం మద్దతు ఉంది కాబట్టి తానే నియోజకవర్గ ఇన్చార్జి అంటూ ఓవైపు విజయమ్మ అంటుండగా, లేదు, నేను పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయాను కాబట్టి రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల్లో ఉన్నట్లుగానే తానే ఇన్చార్జి అంటూ మరోవైపు విజయజ్యోతి స్పష్టం చేస్తోంది.ఇప్పుడు వీరిరువురుని కాదని, ఎమ్మెల్యేను కాబట్టి తనకే నియోజకవర్గ ఇన్చార్జి బాధ్యతలు అప్పగించారంటూ జయరాములు బాహాటంగానే చెప్పుకుంటున్నారు. ఇలా వర్గపోరుతో ఆ పార్టీ మూడు ముక్కలైనా.. అధిష్టానం మాత్రం ఇన్చార్జి విషయంలో ఎటువంటి స్పష్టత ఇవ్వకపోవడం గమనార్హం. నేతల మధ్య పోరుతో పార్టీ శ్రేణులు నిస్తేజంలో పడిపోయారు. -
ఒకే గ్రామంలో రెండు పచ్చజెండాలు
అట్లూరు: అధికార తెలుగుదేశం పార్టీలో ఆధిపత్యపోరుకు అవధుల్లేకుండా పోతున్నా యి. దీంతో నాయకులకు కార్యకర్తలకు తలనొప్పిగా మారినట్లు సమాచారం. బద్వేలు ని యోజక వర్గం తెలుగుదేశం పార్టీలో ఎమ్మెల్యే తిరువీధి జయరాములు, మాజీ ఎమ్మెల్యే విజయమ్మల మధ్య ఆధిపత్య పోరు రోజు రోజుకు పెరిగిపోతుం ది. అందుకు అట్లూరు మండలంలోని కొండూరులో బుధవారం జరి గిన ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమమే నిదర్శనం. గత నెల 20వ తేదీన కొండూరు పంచాయితీలోని గ్రామాలతో పాటు రెడ్డిపల్లిలో ఎమ్మెల్యే జయరాములు తన అనుచరులతో కలసి పార్టీ జెండా ఆవిష్కరించారు. మాజీ ఎమ్మెల్యే విజయమ్మ బుధవారం ముందుగా వేమలూరులో ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమం నిర్వహించి అనంతరం కొండూరులో పార్టీ జెండాను ఆవిష్కరించారు. నేతల వైఖరి తలనొప్పిగా మారినట్లు పార్టీ నాయకులు అభిప్రాయపడుతున్నారు. -
అభివృద్ధి పేరుతో ప్రజలకు వెన్నుపోటు పొడిచారు
-
ఎమ్మెల్యే జేబు కట్ చేసిన దొంగల అరెస్టు
తిరుపతి క్రైం: బద్వేల్ ఎమ్మెల్యే జేబు కట్ చేసిన దొంగలను మంగళవారం క్రైం పోలీసులు అరెస్టు చేసినట్టు క్రైం ఏఏస్పీ సుబ్బారెడ్డి తెలిపారు. ఆయన కథనం మేరకు.. మే 27 నుంచి 29వతేదీ వరకు నిర్వహించిన మహానాడులో బద్వేల్ ఎమ్మెల్యే జయరాములు, గుంటూరుకు చెందిన పూనం శ్రీనివాసరెడ్డి పర్సులను గుర్తు తెలియని వ్యక్తులు చోరీ చేశారు. అందులో రూ.95 వేలు ఉన్నట్టు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. డీఎస్పీ కొండారెడ్డి, సీసీఎస్ స్పెషల్ పార్టీ పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ప్రకాశం జిల్లా విజిలిపేట చీరాలకు చెందిన గరికప్రసాద్ (38), గుంటూరు జిల్లా తాడేపల్లి కొత్తూరుకు చెందిన సముద్రాల కృష్ణారావును కరకంబాడి రోడ్డులోని లెప్రసీ ఆస్పత్రి వద్ద మంగళవారం మధ్యాహ్నం 12.30 గంటల ప్రాంతంలో అరెస్టు చేశారు. విచారణలో వారు మహానాడులో కార్యకర్తల్లా తిరుగుతూ పిట్పాకెట్ చేసినట్టు అంగీకరించినట్టు ఏఎస్పీ సుబ్బారెడ్డి తెలిపారు. వారి నుంచి రూ.95 వేల నగదును స్వాధీనం చేసుకున్నామన్నారు. నిందితులు పాతనేరస్తులని పేర్కొన్నారు. వీరిని పట్టుకోవడంలో కృషి చేసిన ఎస్ఐలు ప్రభాకర్‌రెడ్డి, ఆశీర్వాదం, రామ్మూర్తి, సిబ్బంది సుధాకర్, మునిరాజ, కత్తుల గోపికృష్ణ, బారుషా, మురళికి ఏఎస్పీ రివార్డులు అందజేశారు. -
'టీడీపీలో ఎవరూ చేరరు'
పోరుమామిళ్ల: తెలుగుదేశం పార్టీలో ఉన్నవారు అంతర్గత కుమ్ములాటలతో సతమతమవుతున్నారని, ఆ పార్టీలోకి బయటి నుంచి వెళ్లి ఎవరు చేరతారని బద్వేలు వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే జయరాములు ప్రశ్నించారు. శుక్రవారం వైఎస్సార్ జిల్లా పోరుమామిళ్లలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ఎన్నికలకు ముందు టీడీపీ అధినేత చంద్రబాబు ప్రజలకిచ్చిన హామీలను ఏవీ నెరవేర్చలేదన్నారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి ప్రాభవం తగ్గుతోందన్నారు. అన్నివర్గాల ప్రజులు అసంతృప్తితో రగిలిపోతున్నారని జయరాములు చెప్పారు. మంత్రులే తీవ్ర అసంతృప్తితో ఉన్నారంటే ఆ పార్టీ పరిస్థితి ఏమిటో ఊహించుకోవచ్చన్నారు. తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ఉనికి కోల్పోతుండటంతో, దిక్కుతోచని పరిస్థితుల్లో ఆ పార్టీ నాయకులు ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలతో మైండ్ గేమ్ ఆడుతున్నారని చెప్పారు. టీడీపీ నుంచి 21 మంది ఎమ్మెల్యేలు బయటకు వస్తే రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం కూలిపోతుందన్నారు. తమ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విలువలకు కట్టుబడి ఫిరాయింపులను ప్రోత్సహించడం లేదని చెప్పారు. చంద్రబాబు హయాంలో రాష్ట్రం అభివృద్ధి చెందదని పేర్కొన్నారు. తన నియోజకవర్గంలో తమ పార్టీకి చెందిన ఓ సర్పంచ్ తండ్రిని టీడీపీ నేతలు బలవంతంగా తీసుకెళ్లి సర్పంచ్ టీడీపీలో చేరాడంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. సర్పంచ్ తండ్రి కూడా టీడీపీలో చేరలేదని స్పష్టం చేశారు. -
జగన్ దీక్షకు మద్దతుగా రిక్షా తొక్కిన ఎమ్మెల్యే
బద్వేలు అర్బన్ (వైఎస్సార్ జిల్లా) : వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే జయరాములు పార్టీ అధినేత జగన్ నిరవధిక నిరాహార దీక్షకు మద్దతుగా సోమవారం రిక్షా తొక్కారు. బద్వేలు పట్టణంలోని తహశీల్దార్ కార్యాలయం నుంచి సిద్ధవటం రోడ్డులోని వినాయకుడి గుడి వరకు రిక్షా తొక్కుకుంటూ వెళ్లారు. 101 కొబ్బరికాయలను రిక్షాలో తీసుకెళ్లి ఆలయం వద్ద కొట్టారు. జగన్ ఆరోగ్యంగా ఉండాలని పూజలు చేశారు. ఆయన వెంట మాజీ మునిసిపల్ చైర్మన్ మున్నెయ్య, మాజీ ఎంపీపీ వెంకటేశ్వర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
వీఐపీ రిపోర్టర్ : ఎమ్మెల్యే జయరాములు
-
హామీలు తుంగలో తొక్కిన సీఎం
పోరుమామిళ్ల: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కారని బద్వేలు ఎమ్మెల్యే జయరాములు ధ్వజమెత్తారు. శుక్రవారం వైఎస్ఆర్ సీపీ కేంద్రపాలక మండలి సభ్యుడు గోవిందరెడ్డి ఇంట్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో శాసనసభ సమావేశాలపైన ఆయన మాట్లాడారు. బడ్జెట్ సమావేశాల్లో వైఎస్ కుటుంబాన్ని విమర్శించేందుకే సగం సమయం వృథా చేశారన్నారు. బడ్జెట్ సామాన్యులకు మేలు చేసేదిగా లేదన్నారు. రైతురుణ మాఫీపై నేటికీ స్పష్టత లేదన్నారు. డ్వాక్రా రుణాలు, బంగారు తాకట్టు రుణాల్లో మెలిక పెడుతున్నారని మండిపడ్డారు. ఆయన ఇచ్చిన హామీలు నెరవేర్చలేన్నారు. రాష్ట్ర రాజధాని విషయంలో సభలో చర్చించి అందరి ఆమోదంతో ప్రకటించి ఉంటే బాగుండేదన్నారు. అది ప్రజల రాజధాని కాదని, రియల్ ఎస్టేట్ రాజధాని అని ఆగ్రహం వ్యక్తం చేశారు. శివరామకృష్ణన్ కమిటీ నిర్ణయాన్ని తీసుకోలేదన్నారు. ప్రజలకు మేలుచేసే అంశాలను సభలో చర్చించలేదని పేర్కొన్నారు. ప్రజల్లో ఆయనపై విశ్వాసం సన్నగిల్లుతోందన్నారు. సాఫ్ట్వేర్ పేరుతో 850 ఎకరాలు రహేజాకు కట్టబెట్టిన ఘనుడు చంద్రబాబు అన్నారు. సమస్యల పరిష్కారానికి పోరు సమస్యల పరిష్కారానికి నిత్యం పోరాడతామని ఎంపీపీ చిత్తా విజయప్రతాప్‌రెడ్డి అన్నారు. టీడీపీ నాయకులు దొరికినకాడికి దోచుకునేందుకు సిద్ధమయ్యారన్నారు. సమావేశంలో పార్టీ మండల కన్వీనర్ ఇమామ్‌హుసేన్, ఎస్సీ సెల్ జిల్లా కార్యదర్శి ముత్యాల ప్రసాద్, మండల నాయకులు రవిప్రకాష్‌రెడ్డి, రమణ పాల్గొన్నారు. -
బద్వేలు వైఎస్సార్ సీపీ కో ఆర్డినేటర్‌గా జయరాములు
సాక్షి ప్రతినిధి, కడప : బద్వేలు నియోజకవర్గం వైఎస్సార్ సీపీ కో ఆర్డినేటర్‌గా టి.జయరాములు నియమితులయ్యారు. ఈ మేరకు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. పులివెందుల మున్సిపల్ కమిషనర్‌గా పనిచేస్తున్న జయరాములు ఇటీవల ఉద్యోగానికి రాజీనామా చేశారు. అనంతరం వైఎస్సార్ సీపీలో చేరారు. తనపై నమ్మకముంచి బాధ్యతలు అప్పగించిన రాష్ట్ర అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డికి, తన నియామకానికికృషి చేసిన జిల్లా అధ్యక్షుడు సురేష్‌బాబు, బద్వేలు మాజీ ఎమ్మెల్యే డీసీ గోవిందరెడ్డితోపాటు సహకరించిన జిల్లా నాయకులందరికీ జయరాములు కృతజ్ఞతలు తెలిపారు. వారినమ్మకాన్ని వమ్ము చేయకుండా పార్టీ ఉన్నతికి శాయశక్తుల కృషి చేస్తానని పేర్కొన్నారు.