![Dominant war in tdp on badvel - Sakshi](/styles/webp/s3/article_images/2017/11/2/badvel-tdp.jpg.webp?itok=v5nlyMAB)
కొండూరులో జెండా ఆవిష్కరించిన ఎమ్మెల్యే,అనుచరులతో కలిసి జెండా ఆవిష్కరిస్తున్న మాజీ ఎమ్మెల్యే
అట్లూరు: అధికార తెలుగుదేశం పార్టీలో ఆధిపత్యపోరుకు అవధుల్లేకుండా పోతున్నా యి. దీంతో నాయకులకు కార్యకర్తలకు తలనొప్పిగా మారినట్లు సమాచారం. బద్వేలు ని యోజక వర్గం తెలుగుదేశం పార్టీలో ఎమ్మెల్యే తిరువీధి జయరాములు, మాజీ ఎమ్మెల్యే విజయమ్మల మధ్య ఆధిపత్య పోరు రోజు రోజుకు పెరిగిపోతుం ది. అందుకు అట్లూరు మండలంలోని కొండూరులో బుధవారం జరి గిన ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమమే నిదర్శనం.
గత నెల 20వ తేదీన కొండూరు పంచాయితీలోని గ్రామాలతో పాటు రెడ్డిపల్లిలో ఎమ్మెల్యే జయరాములు తన అనుచరులతో కలసి పార్టీ జెండా ఆవిష్కరించారు. మాజీ ఎమ్మెల్యే విజయమ్మ బుధవారం ముందుగా వేమలూరులో ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమం నిర్వహించి అనంతరం కొండూరులో పార్టీ జెండాను ఆవిష్కరించారు. నేతల వైఖరి తలనొప్పిగా మారినట్లు పార్టీ నాయకులు అభిప్రాయపడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment