బద్వేలు వైఎస్సార్ సీపీ కో ఆర్డినేటర్‌గా జయరాములు | YSRCP co-ordinater as jayaramulu | Sakshi
Sakshi News home page

బద్వేలు వైఎస్సార్ సీపీ కో ఆర్డినేటర్‌గా జయరాములు

Published Mon, Feb 10 2014 2:10 AM | Last Updated on Fri, Aug 17 2018 8:19 PM

YSRCP co-ordinater as  jayaramulu

సాక్షి ప్రతినిధి, కడప :  బద్వేలు నియోజకవర్గం వైఎస్సార్ సీపీ కో ఆర్డినేటర్‌గా టి.జయరాములు నియమితులయ్యారు. ఈ మేరకు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. పులివెందుల మున్సిపల్ కమిషనర్‌గా పనిచేస్తున్న జయరాములు ఇటీవల ఉద్యోగానికి రాజీనామా చేశారు.
 
 అనంతరం వైఎస్సార్ సీపీలో చేరారు.  తనపై నమ్మకముంచి బాధ్యతలు అప్పగించిన రాష్ట్ర అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డికి, తన నియామకానికికృషి చేసిన  జిల్లా అధ్యక్షుడు సురేష్‌బాబు, బద్వేలు మాజీ ఎమ్మెల్యే డీసీ గోవిందరెడ్డితోపాటు సహకరించిన జిల్లా నాయకులందరికీ జయరాములు కృతజ్ఞతలు తెలిపారు. వారినమ్మకాన్ని వమ్ము చేయకుండా పార్టీ ఉన్నతికి శాయశక్తుల కృషి చేస్తానని పేర్కొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement